
జిహాదీ జాన్ నాక్కావాలి..
నిత్యం మారణకాండతో భయోత్సాతానికి గురిచేసే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది జిహాదీ జాన్(మహ్మద్ ఎమ్వాజీ) తనకు ప్రాణాలతో కావాలని బ్రిటన్కు చెందిన డేవిడ్ హెయిన్స్ భార్య డ్రాగానా హెయిన్ కోరింది. డేవిడ్ హెయిన్స్ జిహాదీ జాన్ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అంతేకాదు ఆ హత్య చేసిన వీడియోను కూడా జిహాదీ జాన్ పంపించాడు. దీంతో ఆమె తీవ్ర బాధలో కూరుకుపోయింది. కొత్తగా జిహాదీ జాన్ అసలు పేరు తెలియడంతో అతడి వల్ల నష్టపోయిన పలుకుటుంబాలు ఇప్పుడు అతడి చావును కోరుకుంటున్నాయి. 'జిహాదీ జాన్ను ప్రాణాలతో పట్టుకోవాలి. అప్పుడు మాత్రమే అతడి వల్ల నష్టపోయిన కుటుంబాలకు మీరు మంచి చేసినవాళ్లవుతారు. ఎందుకంటే అతడు సైన్యం దాడుల్లో చనిపోతే గౌరవ మరణాన్ని పొందినట్లవుతాడు. అలా కాకుండా కటకటాల్లో పెట్టి మరణశిక్ష విధించాలి' అని ఆమె ఆవేధన వ్యక్తం చేశారు.