ఓ వృద్ధ మహిళ కోసం యూకేలో పోరాటం! | Why Sikhs In UK Town Are Fighting The Indian Womans Deportation, Know Who Is Gurmit Kaur - Sakshi
Sakshi News home page

ఎవరీ గుర్మిత్‌ కౌర్‌!..ఆమె గురించి యూకేలో ఎందుకు పోరాటం..?

Published Mon, Nov 27 2023 12:08 PM | Last Updated on Mon, Nov 27 2023 3:12 PM

Why Sikhs In UK Town Fight Indian Womans Deportation - Sakshi

ఒక భారతీయ వృద్ధ మహిళ కోసం యూకేలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఆమెను బ్రిటన్‌లోను ఉంచాలని పట్టుబడుతూ వేలాది మంది పోరాడుతున్నారు. ఆనైలైన్‌లో సైతం ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు వెల్లవలా వచ్చింది. ఆమె బ్రిటన్‌లోనే ఉండేందుకు అన్ని విధాల అర్హురాలని అంటూ ఓ మద్దతుదారుడు ఆమె తరుఫున పోరాడుతున్నాడు. ఇంతకీ ఎవరీ మహిళ? ఎందుకంతా క్రేజ్‌ అంటే..

అసలేం జరిగిందం‍టే..78 ఏళ్ల గుర్మిత్‌ కౌర్‌ 2009లో యూకేకి వచ్చారు. అప్పటి నుంచి స్మెత్‌విక్‌లోనే ఆమె నివాసం ఉంటోంది. బ్రిటన్‌ ఆమెను బహిష్కరించడంతో  వందలాది మంది బిట్రన్‌ సిక్కు కమ్యూనిటీలు ఆమె కోసం గట్టిగా పోరాడుతున్నారు. జూలై 2020 నుంచి ప్రారంభమైన ఈ పోరాటానికి ఆన్‌లైన్‌లో సుమారు 65 వేల మందిదాక ఆ వృద్ధ మహిళకే మద్దతు తెలపడం విశేషం. 

యూకే ఆ మహాళను బహిష్కరించడానికి కారణం..
గుర్మిత్‌ కౌర్‌ తొలిసారిగా 2009లో ఒక వివాహానికి హాజరయ్యేందుకు యూకే వెళ్లింది. మొదట్లో తన కొడుకుతో కలిసి ఉండేది. క్రమంగా ఆమె తన కొడుకు కుటుంబం నుంచి దూరమయ్యాక అపరిచిత వ్యక్తుల దయపై ఆధారపడి జీవించేది. ఆ తర్వాత స్థానిక సిక్కు కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ స్మెత్‌విక్‌లో పనిచేస్తూ అక్కడే ఆశ్రయం పొందింది. క్రమంగా ఆ స్వచ్ఛంద సంస్థ ఆమె నివాసంగా మారిపోయింది. ఆ మహిళకు ఎలాగో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ భారతలోని పంజాబ్‌లో కూడా కుటుంబం లేదని ఆ స్వచ్ఛంద సంస్థ ఆమెను దత్తత తీసుకుంది. దీంతో గుర్మిత్‌ కౌర్‌ తాను ఇక్కడే ఉండేలా యూకే హోం కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు.

అందుకు యూకే హోం కార్యాలయం తిరస్కరించింది. ఆమెకు ఇక్కడ యూకేలో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ పంజాబ్‌లోనూ కుటుంబం లేదు కానీ అక్కడ ఆమె ఇల్లు ఉంది. అక్కడ స్థానికులతో ఆఎ ఇంకా టచ్‌లోనే ఉన్నారు కాబట్టి ఆమె మళ్లీ అక్కడే తన జీవితాన్ని మొదలు పెట్టగలదు కావున ఇక్కడే తన మిగతా జీవితం గడపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కనివినీ ఎరుగని రీతిలో గుర్మిత్‌ కౌర్‌ని ఇక్కడ ఉండేలా అనుమతివ్వాలంటూ పలువురు స్థానికులు పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు ఇస్తూ పోరాడారు.

"ఆమె చాలా మంచి వ్యక్తిత్వం గలది. దయార్థహృదయం గలది ఇలా సడెన్‌గా ఆమెను ఇండియాకు పంపించేస్తే ఎలా బతుకుంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉండటంతో పంజాబ్‌లోని ఆమె ఇల్లు పాడుబడిపోయి ఉంటుంది. పైగా ఆమె వృద్ధరాలు ఈ వయసులో పనిచేయలేదు. వండుకుని తినడం కూడా కష్టం కాబట్టి ఆ స్వచ్ఛంద సంస్థలోనే ఆశ్రయం పొంది తన శేష జీవితాన్ని గడుపుతుందని ఇమ్మిగ్రేషన్ సలహాదారు సల్మాన్ మీర్జా పిటిషన్‌ వేసి ఆమె తరుఫున పోరాడుతున్నారు. ఆమెకు వీసా లభించేలా సాయం చేస్తు‍న్న వారిలో అతను ఒకరు

అంతేగాదు ఆమెకు అనూహ్యంగా ఆన్‌లైన్‌లో కూడా విశేషమైన మద్దతు లభించింది. వారంతా ఆమె బ్రిటన్‌లోనే ఉండేలా వీసా జారీ చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక సాధారణ వితంతు సిక్కు మహిళకు విశేషమైన ప్రజాధరణ లభించడంతో ఈ ఘటన సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారి తెగ వైరల్‌ అవుతోంది. అంతేగాదు వెస్ట్‌మిడ్‌లాండ్స్‌లోని కొందరూ మద్దతుదారులు ఆమె బహిష్కరణపై యూకే హోం కార్యాలయంపై గట్టిగా పోరాడుతున్నారు. 

(చదవండి: అమ్మ ఎక్కడైనా అమ్మే)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement