Sikh
-
Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే..
హిందువులు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెలలో పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇదే మాసంలోని ఈరోజు (నవంబర్ 15)కు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజున దేవ్ దీపావళి, కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి మూడు పర్వదినాలు కలసి వచ్చాయి. అయితే కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారనే విషయానికి వస్తే..గురునానక్ జయంతి సిక్కులకు ఎంతో ముఖ్యమైన పండుగ. దీనిని సిక్కులు ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. దీనిని ‘గురుపర్వ’ లేదా ‘ప్రకాశ పర్వ’ అని కూడా అంటారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ ఈరోజునే జన్మించారు. ఆయన సిక్కుల మొదటి గురువు. గురునానక్ జయంతి సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. సిక్కులు గురునానక్ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ రోజున గురుద్వారాలలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు.ఈ సంవత్సరం సిక్కులు గురునానక్ దేవ్ 555వ జయంతిని జరుపుకుంటున్నారు. ఆయన 1469వ సంవత్సరంలో కార్తీక పూర్ణిమ రోజున జన్మించారని చెబుతుంటారు. అందుకే ప్రతీయేటా గురునానక్ జయంతిని కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. గురునానక్ జయంతికి రెండు రోజుల ముందు సిక్కులు ‘అఖండ పాత్’నిర్వహిస్తారు. గురుగ్రంథ సాహిబ్‌ను 48 గంటలపాటు నిరంతరం పఠిస్తారు.గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ రోజు ఉదయాన్నే నగర కీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్‌ను పల్లకిలో మోస్తూ, షాబాద్ కీర్తనను ఆలపిస్తూ నగరంలో ఊరేగింపు నిర్వహించారు. ఈరోజంతా గురుద్వారాలలో కీర్తనలు ఆలపించనున్నారు. గురునానక్ దేవ్ బోధనలపై సిక్కు మత పెద్దలు ఉపన్యసించనున్నారు.గురునానక్ జయంతి రోజున గురుద్వారాలలో ప్రత్యేక ‘లంగర్’(అన్నదానం) నిర్వహించనున్నారు. దీనిలో అన్ని మతాలవారు కలిసి భోజనం చేస్తారు. ఇది సమాజానికి సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సందేశాన్ని అందిస్తుంది. గురునానక్.. సమానత్వం, ప్రేమ, సేవ నిజాయితీలు అందరిలో ఉండాలనే సందేశాన్ని అందించారు. కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంలో మెలగాలని గురునానక్ తెలియజేశారు.ఇది కూడా చదవండి: Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు? -
సిక్కుల ఓట్ల కోసమే చిచ్చు!
ప్రజా వ్యతిరేకతను, సొంత పార్టీ లో తిరుగుబాటును అధిగమించి వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గడానికి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నారా? కెనడాలో గణనీయ సంఖ్యలో ఉన్న సిక్కు ఓటర్లను ప్రసన్నం చేసుకొని, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తహతహలాడుతున్నారా? కేవలం అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలతో భారత్– కెనడా సంబంధాలను బలి పెట్టడానికి సైతం వెనుకాడడం లేదా? రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అవుననే చెబుతున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్‌సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని జస్టిన్ ట్రూడో పదేపదే ఆరోపిస్తున్నారు.అంతేకాదు ఈ హత్యలో భారత హైకమిషనర్ సంజయ్ కమార్ వర్మను ట్రూడో ప్రభుత్వం అనుమానితుడిగా చేర్చింది. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. ట్రూడో పదవీ కాంక్ష వల్ల భారత్, కెనడా ప్రజలు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్‌లో కెనడా పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. మరో ఏడాది సమయమే మిగిలి ఉంది. మరోవైపు జస్టిన్ ట్రూడో పాలనల పై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. సొంత పార్టీ లో సైతం నిరసన గళాలు బలం పుంజుకుంటున్నాయి. ట్రూడో నాయకత్వాన్ని, పరిపాలనా సామర్థ్యాన్ని అధికార ‘లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా’ నాయకులు ప్రశి్నస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించడానికి నిజ్జర్ హత్యను ట్రూడో తెలివిగా తనకు అనుకూలంగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజ్జర్ వ్యవహారంలో భారత్‌ను ఇరుకునపెట్టడం ద్వారా సిక్కుల ఓట్లపై ఆయన వల విసురుతున్నట్లు ప్రచారం సాగుతోంది. 2021 నాటి గణాంకాల ప్రకారం కెనడాలో 7.70 లక్షల మంది సిక్కులున్నారు. అంటే జనాభాలో 2.1 శాతం మంది సిక్కులే. భారత్‌కు వెలుపల అత్యధిక సంఖ్యలో సిక్కులు ఉన్న దేశం కెనడా. ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండి రాజకీయ ప్రాబల్యం కలిగిన సిక్కులను మచ్చిక చేసుకోవడానికి కెనడా రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. భారత వ్యతిరేక ఖలిస్తానీ శక్తులను ప్రోత్సహిస్తుంటాయి.భారత్‌లో సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్న నినాదంతో పుట్టుకొచి్చన ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కెనడా అడ్డాగా మారిపోయింది. వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, సిక్స్ ఫర్ జస్టిస్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తదితర సంస్థలు కెనడా నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రాజకీయ పార్టీ లు వీటికి మద్దతిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. కనీసం 9 ఖలిస్తానీ టెర్రర్ గ్రూప్‌లకు కెనడాయే ప్రధాన స్థావరం. ఇవన్నీ భారత సార్వబౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై ప్రత్యక్ష యుద్ధమే చేస్తున్నాయి. తమ దేశంలో నేరాలకు పాల్పడిన ఖలిస్తాన్ ఉగ్రవాదులను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కెనడా లెక్కచేయడం లేదు. కనీసం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా తిరస్కరిస్తోంది. భారత వ్యతిరేక శక్తులకు కెనడా స్వర్గధామం అనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు ఖలిస్తానీలకు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’ పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తోంది. ట్రూడో పాలనలో కెనడా దేశం భారత్‌కు మరో పాకిస్తాన్‌గా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థి వీసాలపై పిడుగు! కెనడా–భారత్ మధ్య విభేదాలు ముదురుతుండడంతో ఇరు దేశాల ప్రజలు నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా వీసా సేవలు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కెనడాలో 1.78 లక్షల మంది ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు), 15.10 లక్షల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. 2.80 లక్షల మందికిపైగా భారత విద్యార్థులు ఉన్నారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో 41 శాతం మంది భారతీయులే.ఈ ఏడాది ప్రారంభంలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసాలను ప్రభుత్వం 3.60 లక్షలకే పరిమితం చేసింది. 2022 నాటితో పోలిస్తే విద్యార్థి వీసాల సంఖ్యను 35 శాతం తగ్గించింది. దీనివల్ల భారతీయ విద్యార్థులు నష్టపోయారు. ప్రస్తుతం భారత ప్రభుత్వంతో విభేదిస్తున్న నేపథ్యంలో విద్యార్థి వీసాలను మరింత తగ్గించే అవకాశం కనిపిస్తోంది. భారతీయ ఉద్యోగులను ఇప్పటికప్పుడు వెనక్కి పంపించే పరిస్థితి లేకున్నా, సమీప భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భగ్గుమన్న దౌత్య బంధం
న్యూఢిల్లీ: సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై భారత సర్కార్ తీవ్రంగా స్పందించింది. కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టివార్ట్ వీలర్సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వారిలో డెప్యూటీ హై కమిషనర్ ప్యాట్రిక్ హేబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, అయాన్ రోస్ డేవిడ్ ట్రైస్, ఆడమ్ జేమ్స్ చుప్కా, పౌలా ఓర్జులాలు ఉన్నారు. అక్టోబర్ 19వ తేదీన రాత్రి 11.59 గంటల్లోపు భారత్‌ను వీడాలని ఆదేశాలు జారీచేసింది. కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారత దౌత్యవేత్త, దౌత్యాధికారులు, సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తామని సోమవారం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు తన నిరసన తెలిపేందుకు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ రోస్ వీలర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చి ఆ శాఖ కార్యదర్శి(తూర్పు) జైదీప్ మజుందార్‌ను కలిశారు. అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త పేరును చేర్చడంపై ఆయన ఎదుట భారత్ తన నిరసనను వ్యక్తంచేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే దౌత్యాధికారులను రప్పించడంపై విదేశాంగశాఖ నిర్ణయం వెలువడింది. ‘‘ కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక ఘటనలు, ట్రూడో ప్రభుత్వ చర్యలు అక్కడి భారతీయ దౌత్యాధికారులను ప్రమాదంలోకి నెట్టేశాయి. ప్రస్తుత కెనడా ప్రభుత్వం వీళ్ల భద్రతకు భరోసా కలి్పస్తుందన్న నమ్మకం పోయింది. అందుకే వీళ్లందరినీ వెనక్కి రప్పించుకోవాలని భారత సర్కార్ నిర్ణయంచుకుంది. సిక్కు వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రూడో సర్కార్ దుందుడుకు చర్యలకు దీటుగా ప్రతిస్పందించే హక్కు భారత్‌కు ఉంది’’ అని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, కెనడా దౌత్యసంబంధాలు దారుణస్థాయికి క్షీణించడంతో కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయ లబి్ధపొందేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇలా తమ దౌత్యవేత్తలను అప్రతిష్టపాలు చేస్తోందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మీ ప్రభుత్వం నిందారోపణలు చేయడం మానుకోవాలని కెనడా దౌత్యవేత్త ఎదుట భారత్ తన నిరసన వ్యక్తంచేసింది. ‘‘ కెనడాలోని భారతీయ హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై ఇలా నిరాధారపూరితంగా వేధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదు’’ అని స్పష్టంచేసింది. ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఇవ్వలేదు ‘‘ 2023 సెపె్టంబర్లో ఈ ఉదంతంలో భారత ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు. కానీ ఆ మేరకు సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వానికి అందజేయలేదు. ట్రూడో కెనడా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో లబ్ది పొందేందుకే కేసు దర్యాప్తు సమగ్రంగా జరక్కముందే వాస్తవాలు లేకుండా భారత హైకమిషనర్ వర్మకు వ్యతిరేకంగా కెనడా వ్యవహరిస్తోందన్నది సుస్పష్టం. 2018లో భారతలో పర్యటించినప్పటి నుంచే ట్రూడో భారత్‌తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నారు. భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న, తీవ్రవాదులతో సత్సంబంధాలున్న వ్యక్తులకు ట్రూడో మంత్రివర్గంలో చోటుదక్కింది. 2020 డిసెంబర్లో భారత ఎన్నికల ప్రక్రియలోనూ ట్రూడో జోక్యం చేసుకునేందుకు యతి్నంచారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా ఒకే రాజకీయ పారీ్టపై ఆధారపడింది. ఆ పార్టీ కేవలం భారత్‌లో సిక్కు వేర్పాటువాదాన్ని ఎగదోయడమే పనిగా పెట్టుకుంది’’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.విశ్వసనీయ సమాచారం ఇచ్చాం: వీలర్ భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చాక కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత్ ఏవైతే ఆధారాలను అడిగిందో వాటిని కెనడా ప్రభుత్వం ఇచి్చంది. కెనడా సొంత గడ్డపై కెనడా పౌరుడి హత్యోదంతంలో భారత సర్కార్‌కు చెందిన ఏజెంట్ల పాత్రపై విశ్వసనీయ, ఖచి్చతమైన సమగ్ర ఆధారాలను భారత్‌కు కెనడా ప్రభుత్వం అందజేసింది. ఇక నిర్ణయం భారత్‌కే వదిలేస్తున్నాం. ఇరు దేశాల స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన తదుపరి చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో సహకరించేందకు కెనడా సిద్ధంగా ఉంది’’అని వీలర్ వ్యాఖ్యానించారు.ఏమిటీ నిజ్జర్ వివాదం? నిజ్జర్ కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గతంలోనే భారత్ కెనడా సర్కార్‌కు తెలియజేసినా ఎలాంటి స్పందనా రాలేదు. 2023 ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా సాహెబ్ పార్కింగ్ ప్రదేశంలో నిజ్జర్‌ను గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక భారత నిఘా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెపె్టంబర్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ స్పష్టంగా చెప్పింది. అయితే నిజ్జర్‌ను పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు చంపేసి ఆ నేరం భారత్‌పై మోపాలని కుట్ర జరిగిందని గతంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. నిజ్జర్ హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో అక్కడి పార్లమెంట్ దిగువసభలో కెనడా ఎంపీలు నిజ్జర్‌కు నివాళులర్పించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తికి ఏకంగా పార్లమెంటులో నివాళులరి్పంచడం దారుణం’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరీ నిజ్జర్? నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, ‘గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్’ అధిపతి అయిన నిజ్జర్ సిక్కు వేర్పాటువాదిగా పేరొందాడు. భారత్‌లోని జలంధర్ ప్రాంతంలోని బార్సింగ్పూర్లో జని్మంచాడు. 1997లో తప్పుడు పాస్ట్‌పోర్ట్‌లో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. అయితే అక్కడి నుంచే భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు. అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిఖ్స్ సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. పంజాబ్‌లో హత్యలకు కుట్రపన్నాడన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద భారత్ ఇతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ భారత్‌లోని ఇతని ఆస్తులను స్వా«దీనం చేసుకుంది. -
సిక్కుల విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్)ను టార్గెట్ చూస్తూ తనదైన రీతిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే డల్లాస్‌లో విమర్శలు గుప్పించిన రాహుల్. తాజాగా వర్జినాలోనూ అదే తరహాలో మాట్లాడారు. కొన్ని రాష్ట్రాలు, మతాలు, భాషలు, వర్గ ప్రజలను.. ఆర్ఎస్ఎస్ తక్కువ అన్న అభిప్రాయంతో చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు. అలాగే భారత్‌లో సిక్కు మతస్థుడు తలపాగాను పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారో లేదో, సిక్కులను గురుద్వారా వెళ్లనిస్తారో లేదో అంటూ వ్యాఖ్యానించారు. భారత్‌లో జరుగుతున్న పోరాటం ఇదే అని, రాజకీయ పోరాటం కాదు అని ఆయన తెలిపారు. అయితే యూఎస్‌లో రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ.. విదేశాల వేదికగా ప్రవాసుల భారతీయుల మధ్య దేశంపై ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ భారత్‌కు తిరిగి వచ్చి ఈ వ్యాఖ్యలు చేయగలరా? అంటూ ప్రశ్నించారు.‘రాహుల్ వ్యాఖ్యలు దుర్మార్గం. అతని ముందు ఉన్న వారు నా కమ్యూనిటీకి చెందినవారు. వారు యూఎస్‌లో జీవిస్తున్నారు. దేశంతో బలమైన సంబంధం లేదు. అలాంటి వారికి రాహుల్ తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారు. తన అమెరికా పర్యటనలో భారత న్యాయ వ్యవస్థపై, ఎన్నికల ఫలితాలపై, కాంగ్రెస్ ఖాతాల స్తంభణపై మాట్లాడుతున్నారు. కానీ గత దశాబ్ద కాలంలో భారత్‌లో జరిగిన అభివృద్ధి గురించి ప్రాస్తావించడం విస్మరించారు.నేను ఆరు దశాబ్దాలుగా ఓ సిక్కుగా టర్బన్ (తలపాగా) ధరిస్తున్నాను. కడెం కూడా వేసుకుంటున్నాను. దీన్ని ధరించడంలో ఎప్పుడూ సమస్య రాలేదు. అసలు రాహుల్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే సిక్కులు భయాందోళనతో జీవించారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత1984లో సిక్కులపై హత్యాకాండ జరిగింది. మూడు వేల మంది అమాయక ప్రజలను చంపారు. వారిని ఇళ్ల నుంచి బయటకు లాగి సజీవ దహనం చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ హయాంలో సిక్కు సమాజం చాలా సురక్షితంగా, గౌరవంగా జీవిస్తోందన్నారు. తమ ప్రభుత్వం సిక్కుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది’ అని తెలిపారు. -
దీపికా పదుకొణె మెడలో సిక్కు మహారాజుల నాటి నెక్లెస్..!
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రెగ్నెంట్‌తో ఉండి కూడా వరుస సినిమాల ప్రమోషన్లు, షూటింగ్‌లతో బిజీగా ఉండే నటి. బిలియన్ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలు విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ లగ్జరీయస్ వివాహానికి హజరైన నటి దీపికా పదుకొణె డిఫెరెంట్ లుక్‌తో మెస్మరైజ్ చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా రాజుల కాలం నాటి దుస్తులు, నగలతో దేవకన్యలా మెరిసింది. దీపీకా ఈ వివాహ వేడుకలో 20వ శతాబ్దం నాటి టోరానీ సింధీ చోగా సల్వార్ ధరించింది. ముఖ్యంగా ఆమె కంఠానికి ధరించిన చోకర్ నెక్లెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీపికా ధరించిన నగ సిక్కు సామ్రాజ్యం మొదటి పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ నాటి కాలంలోని నగ. చెప్పాలంటే ఆయన దీన్ని చేతి పట్టి లేదా మోచేతి ఆభరణంగా ధరించేవారు. సిక్కు కళాత్మకతకు ఈ నగ అద్భుతమైన ఉదాహరణ. ఆ నగలో ఆకట్టుకునే రీతీలో జెమ్సెట్తో ఉంది. మధ్యలో ఓవల్ షేప్‌లో 150 క్యారెట్ల బరువుతో ఒక జెమ్. దాని చుట్టూ రెండు వరుసల నీలమణి రాళ్లు ఉంటాయి.ఆ నగ బాజుబ్యాండ్ సిక్కు హస్తకళకు నిదర్శనం. మహారాజు రంజిత్ సింగ్‌కు ఆభరణాలు, విలువైన రాళ్ల అన్న మక్కువ. ఆయన ఖజానా(లాహోర్ తోషఖానా) కోహ్ ఇ నూర్ వజ్రాలకు నిలయంగా ఉంది. అయితే ఇప్పుడది బ్రిటిష్ కిరీటం అధీనంలో ఉంది. మహారాజా రంజిత్ సింగ్ ఆభరణాల సేకరణల ఎలా ఉండేదనేందుకు ఈ నగను రూపొందించిన విధానమే నిదర్శనం. కాగా, ఆంగ్లో-సిక్కు యుద్ధం తర్వాత అతని లాహోర్ తోషఖానా బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వచ్చింది. 19వ శతాబ్దంలో, రంజిత్ సింగ్, అతని వారసుడు షేర్ సింగ్ మరణానంతరం, అతని చిన్న కుమారుడు పదేళ్ల వయసులో దులీప్ సింగ్ వారసుడిగా ఎంపికయ్యాడు.పంజాబ్ విలీనమైన తర్వాత, అతని తల్లి మహారాణి జిందన్ కౌర్ అరెస్టయ్యి, నేపాల్‌కు బహిష్కరించబడింది. దీంతో అతను పంజాబ్‌పై ఈస్ట్ ఇండియా కంపెనీకి సంతకం చేయవలసి వచ్చింది. కోహ్-ఇ-నూర్ వజ్రాలే కాకుండా, సిక్కు రాజ్యం నుంచి కొల్లగొట్టబడిన ఇతర ఆభరణాలలో తైమూర్ రూబీ అని పిలువబడే 224 పెద్ద ముత్యాలతో కూడిన మరొక ప్రసిద్ధ హారము కూడా ఉంది. 1820 నుంచి 1830 మధ్య కాలంలో స్వర్ణకారుడు హఫీజ్ ముహమ్మద్ ముల్తానీ చేసిన మహారాజా రంజిత్ సింగ్ సింహాసనం లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది.(చదవండి: అన్నం లేదా రోటీ: బరువు తగ్గేందుకు ఏది మంచిది? నిపుణులు ఏమంటున్నారంటే..) -
పన్నూ హత్యకు కుట్ర: ‘భారత్ దర్యాప్తు వివరాలపై ఎదురు చూస్తున్నాం’
న్యూయార్క్: ఖలీస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్ పన్నూ హత్య కుట్రలో భారత్‌కు చెందిన వ్యక్తి ప్రమేయం ఉందని అమెరికా ఆరోపణలు చేసింది. గత ఏడాది ఇదే అంశంపై అమెరికా సమాచారాన్ని పంపించగా దానిపై భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని తెలిపింది. ఇటీవల అమెరికా సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సభ్యులు పన్నూ హత్యకుట్రలో భారత్ ప్రమేయంపై దౌత్యపరమైన స్పందన కోరాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు. సెనేట్ సభ్యులు రాసిన లేఖపై మీడియా అడిగిన ప్రశ్నకు బుధవారం విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు.‘ఎప్పటిలాగే ఆ సభ్యుల గురించి నేను ప్రైవేట్‌గా మాత్రమే స్పందిస్తాను. ప్రస్తుతం ఇక్కడ ఆ విషయంపై ఏం వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. పన్నూ హత్య కుట్ర ముందుగా మా దృష్టికి వచ్చినప్పుడు స్పష్టంగా భారత ప్రభుత్వానికి సమాచారం అందించాం. ఈ కేసులో భారత ప్రభుత్వం పూర్తి జవాబుదారితనంతో దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే ఈ కేసులో భారత్ ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది. భారత్ దర్యాప్తు తుది వివరాలను తెలుసుకోవడానికి ఎదురుచేస్తున్నాం’’ అని మిల్లర్ తెలిపారు.పన్నూ హత్యకు భారతీయ వ్యక్తి నిఖిల్ గుప్తా ( 52 ) మరో వ్యక్తితో కలసి కుట్ర చేశారనే ఆరోపణలపై చెక్ రిపబ్లిక్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆయన్ను విచారించేందుకు చెక్ రిపబ్లిక్ పోలీసులు.. అమెరికాకు అప్పగించగా కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. -
అమృత్‌పాల్ నిర్భందం ఏడాది పొడగింపు
చండీగఢ్: సిక్కు తీవ్రవాద ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ నిర్భందాన్ని ఏడాది పాటు పొడగిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఈనెల 3న ఉత్తర్వులు జారీచేసింది. అయితే బుధవారం వీటిని బహిరంగ పర్చారు. వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్, అతని తొమ్మిది మంది అనుచరులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయ్యి ప్రస్తుతం అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. జైలులో ఉంటూనే అమృత్‌పాల్ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి సమీప కాంగ్రెస్ ప్రత్యరి్థపై 1.97 లక్షల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించాడు. ఫలితాలు ఈనెల 4న వెలువడగా.. 3వ తేదీనే అమృత్‌పాల్ నిర్భందాన్ని ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
ఆధారాలు అందజేస్తే పరిశీలిస్తాం
న్యూఢిల్లీ: అమెరికాలోని సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రలో భారత ప్రమేయముందన్న అంశంపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ అంశంపై మోదీ మాట్లాడారు. ‘‘ పన్నూ హత్య కుట్రలో భారత్ ప్రమేయముందని ఎవరైనా బలమైన ఆధారాలు మా ప్రభుత్వానికి సమరి్పస్తే తప్పకుండా పరిశీలిస్తాం. మా భారతీయ పౌరుడు ఏదైనా మంచిపనో, చెడు పనో చేసి ఉంటే మాకు చెప్పండి. బలమైన ఆధారాలు అందజేయండి. మేం తప్పక పరిశీలిస్తాం. చట్టబద్ధపాలనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంబంధంలేని విషయాలతో అమెరికా–భారత్ దౌత్య సంబంధాలను కలపొద్దు. గత కొద్ది సంవత్సరాలుగా ఇరుదేశాల మైత్రి బంధం మరింత బలపడుతోంది. అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వమున్న పన్నూను హత్యచేసేందుకు భారతీయ అధికారితో కలిసి నిఖిల్ గుప్తా అనే భారతీయుడు కుట్ర పన్నాడని అమెరికా ఆరోపిస్తోంది. ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ పోలీసుల కస్టడీలో ఉన్న గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా ఒత్తిడిపెంచిన నేపథ్యంలో దీనిపై మోదీ మాట్లాడారు. ‘‘ అనవసర ఆరోపణల విషయం మాదాకా వచి్చంది. ఇప్పటికే ఈ ఆరోపణల్లో నిజానిజాల నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేశాం’’ అని మోదీ వెల్లడించారు. ‘‘ భావ ప్రకటనా స్వేచ్ఛ మాటున కొందరు విదేశాల్లో ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇంకోవైపు అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు సమున్నత స్థితికి చేరుకుంటున్నాయి. ఇలాంటి వేర్వేరు ఘటనలకు మధ్య సంబంధం అంటగట్టడం సరికాదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. -
అదే రోజున పార్లమెంట్‌పై దాడి..! భారత్‌కు పన్నూ బెదిరింపులు
ఢిల్లీ: సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్‌కు మరోసారి హెచ్చరికలు చేశాడు. డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగి 22 ఏళ్లు నిండడం గమనార్హం. అమెరికాలో భారత్ చేపట్టిన తన హత్య కుట్ర విఫలమైందని పేర్కొంటూ పన్నూ ఓ వీడియోను విడుదల చేశాడు. 'ఢిల్లీ బనేగా ఖలిస్తాన్' (ఢిల్లీ ఖలిస్తాన్‌గా మారుతుంది) అనే శీర్షికతో 2001 పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు పోస్టర్‌ను వీడియోలో పన్నూ ప్రదర్శించాడు. తనను చంపడానికి భారత ఏజెన్సీలు చేసిన కుట్ర విఫలమైందని పన్నూన్ పేర్కొన్నాడు. డిసెంబరు 13 లేదా అంతకంటే ముందు పార్లమెంటుపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తూ వీడియోను విడుదల చేశాడు. ఈనెల 2 నుంచి డిసెంబర్ 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పన్నూ బెదిరింపులకు పాల్పడటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భారత వ్యతిరేక విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన కే-2 (కశ్మీర్-ఖలిస్థాన్) విభాగం పన్నూకి ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. అమెరికన్-కెనడియన్ పౌరుడు, సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యకు కుట్ర జరిగిందని అమెరికా న్యాయ శాఖ ఇటీవల పేర్కొంది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా ఈ కుట్రకు బాధ్యుడంటూ కేసు నమోదు చేసినట్లు యుఎస్ అటార్నీ ఒక ప్రకటనలో తెలియజేసింది. నికిల్ గుప్తాతో భారతీయ ఏజెన్సీకి చెందిన ఉద్యోగితో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. పన్నూను హత్య చేయడానికి గుప్తాను కిరాయికి మాట్లాడుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు ఆరోపించాయి. ఇదీ చదవండి: పార్ట్ టైమ్ జాబ్ మోసాలు.. 100 వెబ్సైట్లపై కేంద్రం నిషేధం -
ఓ వృద్ధ మహిళ కోసం యూకేలో పోరాటం!
ఒక భారతీయ వృద్ధ మహిళ కోసం యూకేలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఆమెను బ్రిటన్‌లోను ఉంచాలని పట్టుబడుతూ వేలాది మంది పోరాడుతున్నారు. ఆనైలైన్‌లో సైతం ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు వెల్లవలా వచ్చింది. ఆమె బ్రిటన్‌లోనే ఉండేందుకు అన్ని విధాల అర్హురాలని అంటూ ఓ మద్దతుదారుడు ఆమె తరుఫున పోరాడుతున్నాడు. ఇంతకీ ఎవరీ మహిళ? ఎందుకంతా క్రేజ్ అంటే.. అసలేం జరిగిందంటే..78 ఏళ్ల గుర్మిత్ కౌర్ 2009లో యూకేకి వచ్చారు. అప్పటి నుంచి స్మెత్విక్లోనే ఆమె నివాసం ఉంటోంది. బ్రిటన్ ఆమెను బహిష్కరించడంతో వందలాది మంది బిట్రన్ సిక్కు కమ్యూనిటీలు ఆమె కోసం గట్టిగా పోరాడుతున్నారు. జూలై 2020 నుంచి ప్రారంభమైన ఈ పోరాటానికి ఆన్లైన్లో సుమారు 65 వేల మందిదాక ఆ వృద్ధ మహిళకే మద్దతు తెలపడం విశేషం. యూకే ఆ మహాళను బహిష్కరించడానికి కారణం.. గుర్మిత్ కౌర్ తొలిసారిగా 2009లో ఒక వివాహానికి హాజరయ్యేందుకు యూకే వెళ్లింది. మొదట్లో తన కొడుకుతో కలిసి ఉండేది. క్రమంగా ఆమె తన కొడుకు కుటుంబం నుంచి దూరమయ్యాక అపరిచిత వ్యక్తుల దయపై ఆధారపడి జీవించేది. ఆ తర్వాత స్థానిక సిక్కు కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ స్మెత్‌విక్‌లో పనిచేస్తూ అక్కడే ఆశ్రయం పొందింది. క్రమంగా ఆ స్వచ్ఛంద సంస్థ ఆమె నివాసంగా మారిపోయింది. ఆ మహిళకు ఎలాగో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ భారతలోని పంజాబ్‌లో కూడా కుటుంబం లేదని ఆ స్వచ్ఛంద సంస్థ ఆమెను దత్తత తీసుకుంది. దీంతో గుర్మిత్ కౌర్ తాను ఇక్కడే ఉండేలా యూకే హోం కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అందుకు యూకే హోం కార్యాలయం తిరస్కరించింది. ఆమెకు ఇక్కడ యూకేలో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ పంజాబ్‌లోనూ కుటుంబం లేదు కానీ అక్కడ ఆమె ఇల్లు ఉంది. అక్కడ స్థానికులతో ఆఎ ఇంకా టచ్‌లోనే ఉన్నారు కాబట్టి ఆమె మళ్లీ అక్కడే తన జీవితాన్ని మొదలు పెట్టగలదు కావున ఇక్కడే తన మిగతా జీవితం గడపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కనివినీ ఎరుగని రీతిలో గుర్మిత్ కౌర్‌ని ఇక్కడ ఉండేలా అనుమతివ్వాలంటూ పలువురు స్థానికులు పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు ఇస్తూ పోరాడారు. "ఆమె చాలా మంచి వ్యక్తిత్వం గలది. దయార్థహృదయం గలది ఇలా సడెన్‌గా ఆమెను ఇండియాకు పంపించేస్తే ఎలా బతుకుంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉండటంతో పంజాబ్‌లోని ఆమె ఇల్లు పాడుబడిపోయి ఉంటుంది. పైగా ఆమె వృద్ధరాలు ఈ వయసులో పనిచేయలేదు. వండుకుని తినడం కూడా కష్టం కాబట్టి ఆ స్వచ్ఛంద సంస్థలోనే ఆశ్రయం పొంది తన శేష జీవితాన్ని గడుపుతుందని ఇమ్మిగ్రేషన్ సలహాదారు సల్మాన్ మీర్జా పిటిషన్ వేసి ఆమె తరుఫున పోరాడుతున్నారు. ఆమెకు వీసా లభించేలా సాయం చేస్తున్న వారిలో అతను ఒకరు అంతేగాదు ఆమెకు అనూహ్యంగా ఆన్లైన్లో కూడా విశేషమైన మద్దతు లభించింది. వారంతా ఆమె బ్రిటన్‌లోనే ఉండేలా వీసా జారీ చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక సాధారణ వితంతు సిక్కు మహిళకు విశేషమైన ప్రజాధరణ లభించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారి తెగ వైరల్ అవుతోంది. అంతేగాదు వెస్ట్మిడ్లాండ్స్లోని కొందరూ మద్దతుదారులు ఆమె బహిష్కరణపై యూకే హోం కార్యాలయంపై గట్టిగా పోరాడుతున్నారు. (చదవండి: అమ్మ ఎక్కడైనా అమ్మే) -
తెలంగాణ సిక్కుల వెనక అసలు కథ రాఘవపట్నం రామసింహ కవి ఆత్మకథ
గురునానక్ (1469-1539) ప్రభోధనల ఆధారంగా ఏర్పడిందే సిక్కు మతం. గురునానక్ బోధనల్లో మతాల మధ్య పెద్ద తేడా కనిపించలేదు. హిందూ, ఇస్లాం రెండు మతాలను ఒక్క తాటి కిందికి తేవాలన్న ప్రయత్నంలో భాగంగా దేశ మంతా తిరిగి,మక్కా మదీనాల యాత్ర కూడా చేసి వచ్చి, ఆయనిచ్చిన గొప్ప సందేశం ఏంటంటే.. 'హిందువు లేడు, ముస్లిం లేడు, ఇద్దరూ ఒక్కటే!' 200 ఏళ్ల కిందే సిక్కులొచ్చారు హైదరాబాద్‌లోని సిక్కుల చరిత్ర దాదాపు 200 సంవత్సరాల నాటిది. మహారాజా రంజిత్ సింగ్ కాలంలో ఆనాటి హైదరాబాద్ 4వ నిజాం ( 1829-1857) తన ప్రధాని చందూలాల్ (పంజాబ్ ఖత్రీ) సలహాపై ఒక ఒప్పందం ప్రకారం 1832 లో లాహోరి ఫౌజ్‌లో భాగంగా వీరిని హైదరాబాద్ కు పిలిపించుకున్నాడు. వారు నిజాం ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసి పెట్టడంలో కూడా సేవలు అందించారు. ఆనాడు సిక్ రెజిమెంట్ క్యాంపు అత్తాపూర్ దగ్గరున్న బరంబలాలో ఉండేది. అక్కడే హైదరాబాద్ లోని మొట్ట మొదటి గురుద్వారా నిర్మింపబడింది. తెలంగాణ అంతటా ఎన్నో గుర్తులు అలా వచ్చిన సిక్కులు హైదరాబాద్ జంట నగరాల్లోనే కాకుండా తెలంగాణా అంతా విస్తరించారు, స్థానికులతో కలిసిపోయారు. మాతృ భాష పంజాబీని మరిచిపోకుండానే తెలుగు భాషా సంస్కృతులకు అలవాటు పడ్డారు. సికింద్రాబాద్ లో ఏకంగా ఒక సర్దార్జీల గ్రామమే ఉంది. ప్యారడైజ్‌కు మూడు కిలో మీటర్ల దూరంలోనున్న ఆనాటి 'సిక్కుల తోట'నే కంటోన్మెంట్ పరిధిలోనున్న నేటి 'సిక్ విలేజ్'. వ్యాపారాల్లో ఉద్ధండులు చాలా మంది సర్దార్జీ లు వివిధ వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ స్థిరపడి పోయారు. ఇక్కడో గురుద్వారా కూడా నిర్మించుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒకప్పటి 'గచ్చుబాయ్ తాండా' ఇప్పుడు' గురుగోవింద్ నగర్ 'గా మారిపోవడం విశేషం. సిక్ హెరిటేజ్ ఫౌండేషన్ వారు 'డెక్కన్ సిక్కుల సంస్కృతి'పై సాలర్ జంగ్ మ్యూజియం లోనున్న పెక్కు చారిత్రక వ్రాత ప్రతుల ఆధారంగా పరిశోధన చేయడం ముదావహం. సిక్కు జీవితంలోంచి వచ్చిన కథ ఇక తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన సిక్కు కుటుంబాల్లోంచి వచ్చిందే రాఘవపట్నం రామసింహ కవి ఆత్మకథ. పూర్వ కరీంనగర్ జిల్లాలోని రాఘవ పట్నం కు చెందిన బహు గ్రంథకర్త రామసింహ కవి( 1857 - 1963 ) సర్దార్జీయే. నిజాం కాలం నాటి ఈ కవి ఆత్మకథ వారి మునిమనవడైన సర్దార్ గురుదేవ్ సింగ్ గారి వద్ద లభించగా దాన్ని వేముల ప్రభాకర్ పరిష్కరించి, మిత్రుడు తాళ్లపల్లి మురళీధర్ గౌడ్ పర్యవేక్షణలో ప్రచురించగా తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘము వారి వేదికపై (తెలంగాణ సారస్వత పరిషత్ సమావేశ మందిరంలో) తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆయాచితం శ్రీధర్, ప్రముఖ కథకుడు శ్రీ కాలువ మల్లయ్య ఆవిష్కరించారు. -
సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? ఎందుకు ధరిస్తారు?
తలపాగా ధరించే సంప్రదాయం ఈ నాటిది కాదు. చాలా చోట్ల పెళ్లిళ్లలో తలపాగాలు ధరిస్తారు. చరిత్రలో తలపాగా ప్రస్తావన ఉంది. పూర్వం రాజులు, చక్రవర్తులు మాత్రమే తలపాగా ధరించేవారు. యోధులు తలపాగాను తమ శక్తికి చిహ్నంగా భావించేవారు. చాలా సినిమాల్లో ఓడిపోయినవారు లేదా బలహీనులు తమ తలపాగాను తీసి కాళ్ల దగ్గర పెట్టడాన్ని చూసేవుంటాం. తలపాగా చూసినప్పుడు మనకు చాలా విషయాలు గుర్తుకు వస్తాయి. సిక్కు మతానికి చెందినవారు తప్పని సరిగా తలపాగా ధరిస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే సిక్కుమతంలో తలపాగాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? ప్రభువుల హోదాకు చిహ్నం సిక్కులు తలపాగాను తమ గురువు ఇచ్చిన బహుమతిగా భావిస్తారు. 1699లో బైసాఖీ రోజున సిక్కుల పదవ గురువు గురు గురు గోవింద్ సింగ్ తన ఐదుగురు సన్నిహితులకు తలపాగాలను బహుమతిగా ఇచ్చారు. గురుగోవింద్ సింగ్ కాలంలో తలపాగాను గౌరవ సూచకంగా చూసేవారు. తలపాగా అనేది ప్రభువుల హోదాకు చిహ్నం. ఆ సమయంలో మొఘల్ నవాబులు, హిందూ రాజ్‌పుత్‌లు వారి ప్రత్యేక తలపాగాలతో గుర్తింపు పొందారు. హిందూ రాజ్‌పుత్‌ల తలపాగా భిన్నంగా ఉంటుంది. వారి తలపాగాలో ఆభరణాలు పొదిగేవారు. హిందూ రాజ్‌పుత్‌లు తలపాగాలు ధరించడంతోపాటు ఆయుధాలను కూడా ధరించేవారు. దీనితో పాటు గడ్డం, మీసాలు పెంచేవారు. గురు గోవింద్ సింగ్ అనుమతితో.. ఒకప్పుడు ప్రతి సిక్కు తలపాగా ధరించడం, కత్తిని ఉపయోగించడం, అతని పేరులో సింగ్ లేదా కౌర్ అని రాసేందుకు అనుమతిలేదు. అయితే గురు గోవింద్ సింగ్ సిక్కులందరికీ కత్తి పట్టుకోవడానికి, వారి పేర్లకు సింగ్, కౌర్ అని రాయడానికి, జుట్టును పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. ఫలితంగా సిక్కు సమాజంలో పెద్ద, చిన్న అనే అంతరం ముగిసింది. పంజాబీ సమాజంలో బలహీన వర్గాలను రక్షించే బాధ్యత ఖల్సా సిక్కుల చేతుల్లో ఉంది. సిక్కు యోధులను ఖల్సా అని అంటారు. వారు తలపాగా ధరిస్తారు. సిక్కు చివరి గురువు గురుగోవింద్ సింగ్ చివరి కోరిక మేరకు వారు తమ జుట్టును ఎప్పుడూ కత్తిరించుకోరు. తలపాగాను మార్చుకునే ఆచారం గురుగోవింద్ సింగ్ తన ఇద్దరు కుమారులైన అజిత్ సింగ్, జుజార్ సింగ్ తలలకు తలపాగాలు కట్టి, వారికి ఆయుధాలు ఇచ్చారని సిక్కు చరిత్ర చెబుతోంది. గురుగోవింద్ సింగ్ తన పిల్లలిద్దరినీ పెళ్లికొడుకుగా అలంకరించి యుద్ధభూమికి పంపారు. వీరిద్దరూ యుద్ధరంగంలో వీరమరణం పొందారు. తలపై తలపాగా ధరించడం సిక్కు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైనది. అది వారి సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదు. ఆత్మగౌరవం, ధైర్యం, ఆధ్యాత్మికతకు చిహ్నం. సిక్కు సంప్రదాయంలో స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయడాన్ని ఘనమైన కార్యంగా గుర్తిస్తారు. తలపాగా మార్చుకునే ఆచారం సిక్కు సంస్కృతిలో కనిపిస్తుంది. తలపాగాను అత్యంత సన్నిహిత మిత్రులు మార్చుకుంటారు. తలపాగా మార్చుకున్న వారు జీవితాంతం స్నేహ సంబంధాన్ని కొనసాగించాలి. తలపాగా బాధ్యతకు చిహ్నంగా కూడా సిక్కులు పరిగణిస్తారు. ఇది కూడా చదవండి: నరహంతకుడు జనరల్ డయ్యర్‌ను మహాత్మాగాంధీ ఎందుకు క్షమించారు? -
ఇంగ్లండ్‌లో సర్దార్జీల సేద్యం!
ఇంగ్లండ్.. వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతంలోని ఓ చారిత్రక పారిశ్రామిక పట్టణం స్మెదిక్. దశాబ్దాలుగా అక్కడ జీవిస్తున్న వందలాది పంజాబీ సిక్కు కుటుంబీకులు అర్బన్ ఫార్మర్స్‌గా మారారు. వ్యవసాయంతో, భూమితో వారికి అనువంశికంగా ఉన్న భావోద్వేగ, సాంస్కృతిక సంబంధాన్ని స్మెదిక్‌లోని తమ పెరటి తోటల ద్వారా పునరుజ్జీవింపజేసుకున్నారు. స్మెదిక్ పట్టణానికున్నట్టే సర్దార్జీల వలస గాథకూ సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ∙∙ 1779వ సంవత్సరంలో ప్రపంచంలోనే అతి పురాతన ఆవిరి యంత్రాన్ని స్మెదిక్‌లో నెలకొల్పటం పారిశ్రామిక చరిత్రలోనే ఒక మైలురాయి. అందుకే ఆ యంత్రానికి ‘స్మెదిక్ ఇంజిన్’గా పేరు. పారిశ్రామిక విప్లవానికి పునాదులు వేసిన ఈ పట్టణంలో 5 చదరపు మైళ్ల విస్తీర్ణంలో దాదాపు 90 స్టీల్ ఫౌండ్రీలు ఉండేవట. ఆ పరిశ్రమల చిమ్నీల నుంచి నిరంతరం వెలువడే దట్టమైన నల్లటి పొగ కమ్ముకొని ఉంటుంది కాబట్టి.. ఈ పట్టణానికి ‘బ్లాక్ కంట్రీ’ అని పేరొచ్చిందట. శ్వేత జాతీయులతో పాటు అనేక కామన్వెల్త్ దేశాల నుంచి వలస వచ్చిన విభిన్న జాతుల ప్రజలు ఈ శ్రమజీవుల పట్టణంలో జీవిస్తుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి వలస జీవులు స్మెదిక్‌లో జీవిక కోసం వచ్చి స్థిరపడటం ప్రారంభమైంది. వీరిలో పంజాబీల సంఖ్య ఎక్కువ. 1917లో తొలిగా 50కి పైగా సిక్కు కుటుంబాలు వచ్చి స్థిరపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత (1945 నుంచి) మరింత మంది సిక్కులు భారత దేశం నుంచి ఇక్కడకు చేరారు. 1961లో ఓ పాత చర్చ్‌ను కొనుగోలు చేసి గురుద్వారాగా మార్చుకున్నారు. స్మెదిక్ జనజీవనంతో సామాజికంగా, భావోద్వేగపరంగా సిక్కు సామాజిక వర్గం మమేకమయ్యే ప్రక్రియ అంతటితో పూర్తయ్యిందని చెప్పొచ్చు. ∙∙ పారిశ్రామిక కాలుష్యం వల్ల సహజ వనరులన్నీ కలుషితమైపోవటం వల్ల కాలక్రమంలో అక్కడి ప్రజల ఆయర్దాయం తగ్గిపోయింది. అటువంటి పరిస్థితుల నుంచి 11 లక్షల జనాభా కలిగిన ఈ పట్టణం ‘గార్డెన్ సిటీ’గా రూపాంతరం చెందుతోంది. ఏడెనిమిదేళ్ల క్రితం నుంచి పనిగట్టుకొని సుమారు 45 వేల కొత్త ఇళ్లను నిర్మించడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించే పని యుద్ధప్రాతిపదికన ప్రారంభమైంది. ఈ క్రమంలో సర్దార్జీల ఇంటిపంటల నైపుణ్యం గురించి స్థానిక పత్రికలు కథనాలు రాయటం ప్రారంభించాయి. పంజాబ్ నుంచి కుటుంబాలను వదిలి ఒంటరిగానో మిత్రులతోపాటో పారిశ్రామిక కార్మికులుగా వలస వచ్చిన తొలినాటి సర్దాజీలు.. అప్పట్లోనే తమ కోసం కూరగాయలు పండించుకోవటం ప్రారంభించారు. ఆ విధంగా వలస జీవులను ఇంటిపంటలు కనెక్ట్ చేస్తూ ఉత్తేజితపరుస్తూ వచ్చాయి. ‘వ్యవసాయంతో, భూమితో ఈ అనుబంధం మా సంస్కృతికి మూలం. ఏ సీజన్లో ఏమి తింటామో అవి పండించుకుంటాం’ అంటున్నారు స్మెదిక్ సర్దార్జీలు సంతోషంగా! (చదవండి: వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా?) -
గుర్బానీ ప్రసారాలు ఉచితం
చండీగఢ్: సిక్కులు పఠించే పవిత్ర శ్లోకం గుర్బానీ ఇకపై ఉచితంగా ప్రఖ్యాత స్వర్ణదేవాలయం నుంచి ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన బ్రిటిష్‌కాలంనాటి చట్టానికి చేసిన సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. మంగళవారం శాసనసభలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ప్రకటించారు. ఇన్నాళ్లూ గుర్బానీని రాష్ట్రంలో శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానెల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ) మండిపడింది. ‘ఆ చట్టాన్ని పార్లమెంట్ చేసింది. దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. సిక్కుల మత సంబంధ వ్యవహారాలకు ఆప్ ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘చట్ట పరిధిపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఇది రాష్ట్ర పరిధిలోనిది’ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ గుర్బానీ వినిపించేటపుడు అడ్వర్ట్టైజ్మెంట్లు ఉండకూడదనే ఉద్దేశంతో∙ప్రత్యక్షంగా ఉచితంగా ఆడియో, వీడియో ప్రసారాలు చేస్తున్నాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. పీటీసీ ప్రైవేట్ చానెల్‌కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. -
సిక్కు అల్లర్ల కేసులో టైట్లర్‌పై చార్జిషీటు
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జగదీశ్ టైట్లర్(78)పై సీబీఐ శనివారం ప్రత్యేక కోర్టులో చార్జిషీటు వేసింది. ఢిల్లీలోని పుల్ బంగాష్ గురుద్వారాకు నిప్పుపెట్టడంతోపాటు ముగ్గురు సిక్కులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు జగదీశ్ టైట్లరే కారణమని, అక్కడ చేరిన గుంపును రెచ్చగొట్టారని చార్జిషీటులో పేర్కొంది. ఈ నేరానికి గాను ఆయన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ అభియోగాలపై జూన్ 2న కోర్టు విచారణ చేపట్టనుందని సీబీఐ వర్గాలు తెలిపాయి. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంగరక్షకుల తుపాకీ గుళ్లకు బలైన అనంతరం ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో సిక్కులపై జరిగిన దాడుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. -
సిక్కు మత్త పెద్దలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం
-
అమృత్‌పాల్ @ ఆ ఏడుగురు...
దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేసే అమృత్‌పాల్ సింగ్ రాత్రికి రాత్రే సిక్కు మత ప్రబోధకుడిగా వేషం మార్చడం వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందన్న అనుమానాలున్నాయి. దేశంలో మత ఘర్షణలు రేపి, శాంతిభద్రతల్ని విచ్ఛిన్నం చేయడానికే ఐఎస్ఐ అమృత్‌పాల్‌ను దుబాయ్ నుంచి పంజాబ్‌కు పంపిందని పోలీసులు చెబుతున్నారు. భారత్‌కు వచ్చిన ఆరు నెలల్లో ఖలిస్తానీ ఉద్యమం పేరుతో అమృత్‌పాల్ సింగ్ వార్తల్లో నిలిచాడు. యువతపై మతం మత్తుమందు జల్లి వారి అండదండలతో దేశంలో అశాంతి రేపడానికి పన్నాగాలు పన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అమృత్‌పాల్ భారత్‌కు రావడానికి ముందు జార్జియాలో ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. పపల్‌ప్రీత్ సింగ్ అమృత్‌పాల్‌ను వెనుక నుంచి నడిపించేది ఇతనే. ఐఎస్ఐ ఆదేశాల మేరకే పపల్‌ప్రీత్ సింగ్ అమృత్‌సింగ్‌ను వెనుకుండి నడిపిస్తాడన్న వాదనలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పోలీసుల నుంచి పరారీ అవడానికి పపల్‌ప్రీత్ సింగ్ పూర్తిగా సహకరించాడు. వాహనాలు, వేషాలు మార్చడంలో సాయపడ్డాడు. అమృత్‌పాల్ బైక్‌పై వెళుతుండగా దానిని నడుపుతున్న వ్యక్తిని పపల్‌ప్రీత్‌గా పోలీసులు గుర్తించారు. ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న పపల్‌ప్రీత్ సింగ్ పంజాబ్‌లో ఉద్రిక్తతల్ని సృష్టించడానికి పన్నా గాలు రచించాడు. ఖలిస్తాన్ డిమాండ్‌తో అల్లకల్లోలం సృష్టించాలని భావించాడు. పపల్‌ప్రీత్ సింగ్ సూచనల మేరకే అమృత్‌పాల్ సింగ్ తనని తాను సిక్కు మతప్రబోధకుడిగా, ఒక సామాన్యుడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. భగవంత్ సింగ్ అమృత్‌పాల్ సింగ్‌కు కుడిభుజం. పంజాబ్‌లో అజ్నాలా పోలీసు స్టేషన్లో హింసాకాండకు భగవంత్ సింగ్ బాధ్యు డు. అమృత్‌పాల్ సింగ్‌కు మీడియా, సోషల్ మీడియా సమన్వయకర్తగా ఉన్నాడు. అమృత్‌సింగ్ పరారయ్యాక భగవంత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతను సోషల్ మీడియా లైవ్‌లో వచ్చి తమ అనుచరుల్ని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. దీంతో పోలీసులు అతని ఛానెల్స్ అన్నీ బ్లాక్ చేసి అదుపులోనికి తీసుకున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద విచారిస్తున్నారు. ప్రస్తుతం అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. గుర్మీత్ సింగ్ అమృత్‌పాల్ సింగ్ అనుచరుల్లో మొట్టమొదట పోలీసులకు చిక్కినవాడు గుర్మీత్ సింగ్ . పోలీసులు అమృత్‌సింగ్‌పై వేట తీవ్రతరం చేశారని తెలిసిన వెంటనే అమృత్సర్ నుంచి తప్పించుకోవడానికి స్థానికంగా గుర్మీత్ సింగ్ అన్ని ఏర్పాట్లు చేశాడు. అరెస్టయిన గుర్మీత్ కూడా దిబ్రూగఢ్ జైల్లోనే ఉన్నాడు దల్జీత్ సింగ్ కల్సి అమృత్‌సర్‌కు చెందిన దల్జీత్ సింగ్ కల్సి అమృత్‌పాల్‌కు ఫైనాన్షియర్. పాకిస్థాన్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐతో కల్సికి సంబంధాలున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఐఎస్ఐకి అమృత్‌పాల్‌కి మధ్య సంధానకర్తగా పని చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లవ్‌ప్రీత్ తుఫాన్ సింగ్ వారిస్ పంజాబ్ దే సంస్థలో కీలక సభ్యుడు. అత్యంత చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తాడు. అమృత్‌పాల్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన నేరానికి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. లవ్ప్రీత్ను బయటకి తీసుకురావడం కోసమే అమృత్‌పాల్ ఫిబ్రవరి 24న అజ్నాలా పోలీసు స్టేషన్లో విధ్వంసం సృష్టించాడు. హర్జీత్ సింగ్ అమృత్‌పాల్ సింగ్‌కు మామ. ఖలిస్తానీ ఉద్యమానికి గట్టి మద్దతుదారుడు. పోలీసుల కన్నుగప్పి హర్జీత్ సింగ్ కారులోనే తొలుత పారిపోయాడు. ఆ తర్వాత హర్జీత్ పోలీసులకు లొంగిపోయారు. ఒకప్పుడు హర్జీత్ సింగ్ దుబాయ్‌లో రవాణా వ్యాపారంలో చేసేవాడు. అక్కడే అమృత్‌పాల్ కూడా మామతో కలిసి పనిచేశాడు. అక్కడ్నుంచి కెనడాకి మకాం మార్చాడు. గత నెలలోనే హర్జీత్ భారత్‌కు తిరిగి వచ్చాడు. అమృత్‌పాల్ దుబాయ్ నుంచి పంజాబ్‌కు వచ్చి ఖలీస్తానీ నాయకుడి అవతారం ఎత్తడం వెనుక హర్జీత్ ప్రభావం అధికంగా ఉంది. కిరణ్‌దీప్ కౌర్ అమృత్‌పాల్ సింగ్ భార్య. బ్రిటన్‌కు చెందిన ఎన్నారై. రివర్స్ మైగ్రేషన్ పేరు చెప్పి ఇతర దేశాల్లో ఉన్న ఖలిస్తాన్ సానుభూతిపరుల్ని తిరిగి పంజాబ్ తీసుకురావడానికే ఈమెను అమృత్‌పాల్ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది.అమృత్‌పాల్‌కు వివిధ దేశాల నుంచి వచ్చే ఆర్థిక సాయానికి సంబంధించిన లెక్కలన్నీ ఆమెకే తెలుసు. ఎజెండా ఇదీ ... ► పంజాబ్ సమాజాన్ని మతం ఆధారంగా విడదీయడమే అమృత్‌పాల్ సింగ్ ప్రధాన ఎజెండా. ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి రాష్ట్రానికి వచ్చే నిరుపేదలైన కూలీలపై స్థానికుల్లో వ్యతిరేకత పెంచి అగ్గిరాజేయాలని చూసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ► విదేశీ సంస్థల నుంచి అందిన నిధులతో అక్రమంగా ఆయుధాలను కొనుగోలు చేసి పంజాబ్ యువతలో గన్ కల్చర్ పెంచడానికి కూడా ప్రణాళికలు రూపొందించాడు. ► పంజాబ్‌లో అనిశ్చితి రేపడానికి ఆనందపూర్ ఖల్సా ఫౌజ్ (ఏకేఎఫ్) పేరుతో ఒక ప్రైవేటు ఆర్మీని రూపొందించాడు. అందులో ఎక్కువ మంది నేరచరితులే. ఐఎస్ఐ ఆర్థిక సాయంతో అందరికీ ఆయుధాలు, వాహనాలు కొనుగోలు చేశాడు. ► డ్రగ్స్‌కు బానిసలైన వారిని, మాజీ సైనికాధికారులపై వలవేసి వారితో ఒక ఉగ్రవాద సంస్థ నెలకొల్పాలని ప్రయత్నించాడు. దుబాయ్ నుంచి వచ్చాక జల్లూపూర్ కెహ్రా గ్రామంలో డ్రగ్ డీ–ఎడిక్షన్ సెంటర్‌ని నెలకొల్పాడు. ► డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్‌కి తీసుకువచ్చిన వారు ఆరోగ్యం బాగయ్యాక వారిస్ పంజాబ్ దే సంస్థలో చేరి ఎలాంటి విధ్వంసం రేపడానికైనా సిద్ధంగా ఉండాలి. అలా చేయలేనివారిని శారీరకంగా హింసించేవారని పోలీసుల విచారణలో తేలింది. అమృత్‌పాల్‌పైనున్న కేసులు వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ మొత్తం ఆరు క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నాడు. వాటిలో పోలీసు అధికారులపై హత్యాయత్నం, దాడి కేసులున్నాయి. ఫిబ్రవరి 16 : అమృత్‌పాల్‌పై కిడ్నాప్, దాడి కేసు నమోదు ఫిబ్రవరి 22 : విద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటూ కేసు ఫిబ్రవరి 22 – యువతలో అసహనం నింపుతున్నాడని కేసు ఫిబ్రవరి 23 – అమృత్‌పాల్, అతని సాయుధ అనుచరులు పోలీసు అధికారులపై దాడులు, హత్యాయత్నం కేసులు మార్చి 18 : ఆయుధాల చట్టం కింద కేసు నమోదు మార్చి 19 : ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు జలంధర్‌లో కేసు -
ఖలిస్తాన్ 2.0
శనివారం నుంచి మూడు రోజులుగా నిరంతర గాలింపు. అయినా దొరకలేదు. ఇప్పటికి వందమందికిపైగా అతని సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పొద్దుగూకాక కూడా నిందితుడు పోలీసుల గస్తీ కళ్ళ నుంచి తప్పించుకొని, తిరుగుతూనే ఉన్నాడు. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ అధినేత అమృత్‌పాల్ సింగ్ పరారీ, అందుకు దారి తీసిన పరిస్థితులు చూస్తే, నలభై ఏళ్ళ నాటి తీవ్రవాద సంక్షుభిత పంజాబ్ పరిస్థితులు పునరావృతమవుతున్నాయన్న ఆందో ళన కలుగుతోంది. సిక్కులకు సార్వభౌమాధికార దేశం కావాలన్న ఖలిస్తానీ జెండాను భుజానికెత్తుకున్న యువనేత అమృత్‌పాల్ ముఠా బలప్రదర్శన చేసి,అమృత్‌సర్‌లో పోలీస్‌స్టేషన్‌పై ఫిబ్రవరి 23న దాడి చేసి నెలవుతున్నా, నిన్నటి దాకా కళ్ళు తెరవని ‘ఆప్’ సర్కార్ వైఫల్యం వెక్కిరిస్తోంది. గాలివార్తలు సుడిగాలిలా వైరల్ అవుతున్న వేళ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇంటర్నెట్ సేవల్ని మంగళవారం మధ్యాహ్నం దాకా పాలకులు నిలిపివేయాల్సి వచ్చిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. రూపం మార్చుకున్న సరికొత్త ఖలిస్తాన్ 2.0 విజృంభిస్తోందా? 1980–90ల్లోలా పంజాబ్ మళ్ళీ అగ్నిగుండం కానుందా? హత్యానేరం, పోలీసులపై దాడి సహా కనీసం 7 క్రిమినల్ నేరారోపణలున్న అమృత్‌పాల్ ఇప్పుడు పంజాబ్‌లో మళ్ళీ పుంజుకుంటున్న వేర్పాటువాదానికి కేంద్రబిందువయ్యాడు. మాదక ద్రవ్యాల అలవాటును మాన్పించడానికి పనిచేసే డీ–ఎడిక్షన్ కేంద్రాలనూ, అలాగే ఓ గురుద్వారానూ అమృత్‌పాల్ తన అడ్డాగా చేసుకున్నాడట. ఆ స్థావరాల్లో కత్తులు, తుపాకీలు, తూటాలు... పోగేసి, ఆత్మాహుతి దాడులకు యువతరాన్ని సిద్ధం చేస్తున్నాడని గూఢచారి వర్గాల సమాచారం. ఆయుధాలు – బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు దొరకడం, సాయుధ పోరాటం ఇష్టం లేదంటూనే ‘ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్’ (ఏకెఎఫ్) పేరును ప్రాచుర్యంలో పెట్టడం లాంటి అమృత్‌పాల్ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. బంధువుల సాయంతో 20 ఏళ్ళ వయసులో దుబాయ్ వెళ్ళి, భారీ వాహనాల డ్రైవర్‌గా పని చేసి, నిరుడు భారత్‌కు తిరిగొచ్చిన ఓ యువకుడు అనూహ్యంగా ఈ స్థాయికి చేరడం చిత్రమే. నిన్నటి దాకా ఆధునిక వేషభాషల్లో ఉన్న 30 ఏళ్ళ అమృత్‌పాల్ ఇవాళ సాంప్రదాయిక సిక్కు వస్త్రధారణలో, చేతిలో కృపాణంతో, ఖలిస్తానీ ఉద్యమానికి వేగుచుక్క కావడం సహజ పరిణామం అనుకోలేం. ఈ ఖలిస్తాన్ అనుకూల ఉద్యమం వెనుక పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందన్న అనుమానం బలపడుతున్నది అందుకే. అతనికి నిధులెక్కడివన్నదీ ఆరా తీయాల్సిందే! ఇక, పలాయితుడిపై జాతీయ భద్రతా చట్టం విధిస్తారన్న వార్త పరిస్థితి తీవ్రతకు ఉదాహరణ. 1980లు, 90లలో అకాలీలు తీవ్రవాద ఆరోపణలతో అరెస్టయిన తమ అనుయాయుల విడుదల కోసం వీధికెక్కినట్టే, ఈ 2023లో అమృత్‌పాల్, ఆయన తోటి ఖలిస్తానీ మద్దతుదారులు తమ సహచరుడి విడుదల కోసం గత నెలలో వీధికెక్కారు. ఏడేళ్ళ వయసు నుంచే సాంప్రదాయిక సిక్కు ధార్మిక శిక్షణ పొందిన ఒకప్పటి ఖలిస్తానీ నేత జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేకు భిన్నంగా,అలాంటి శిక్షణేమీ లేకుండా ఉన్నట్టుండి అలాగే వేషం కట్టి, మాట్లాడుతున్నాడు అమృత్‌పాల్. స్వీయ ప్రచారం మాటెలా ఉన్నా అతనిని ‘భింద్రన్‌వాలే 2.0’ అనలేం. సాయుధ అంగరక్షకుల నడుమ ఊరూరా తిరుగుతూ, రెచ్చగొడుతున్నాడు. 1984లో అమృత్సర్ స్వర్ణాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్‌లో భింద్రన్‌వాలేను హతమార్చిన తర్వాత నాటి ప్రధాని ఇందిర, పంజాబ్ సీఎం బియాంత్ సింగ్‌లకు పట్టిన గతి నేటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పంజాబ్ సీఎం మాన్లకు పడుతుందని తొడకొడుతున్నాడు. మానిన పాత గాయాల్ని మళ్ళీ కెలుకుతున్నాడు. భారత్ పట్ల ఖలిస్తానీల విద్వేషం బ్రిటన్, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాల్లో ఉన్నట్టుండి వెల్లువె త్తడం మరింత ఆందోళనకరం. బరి తెగించిన ఖలిస్తానీ దుండగులు లండన్ తదితర ప్రాంతాల్లో భారత రాయబార కార్యాలయాలపై దాడి చేయడం, జాతీయ జెండాను తొలగించడం దుస్సహం. రాయబార కార్యాలయానికి కాపుండాల్సిన ఆయా దేశాల ఉదాసీన వైఖరీ ముమ్మాటికీ తప్పే. అసలు మన బంగారం మంచిదైతేగా! పంజాబ్ సంపన్న రాష్ట్రమే కానీ, గత పదిహేనేళ్ళలో తీవ్రనిరుద్యోగంతో యువత తప్పుదోవ పడుతోంది. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా 2020 – 21లో పంజాబీ సోదరులు పోరాటం సాగిస్తున్నప్పుడు దాన్ని సుదీర్ఘంగా సాగదీసిన కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత సైతం అసంతృప్తి ప్రబలడానికి ఓ కారణం. హిందూ రాష్ట్రమనే భావనను పైకి తెస్తున్న పిడి వాదులూ, పరోక్షంగా ఖలిస్తానీల సిక్కురాజ్య వాదనకు ప్రేరేపకులే! నిరుద్యోగ యువత అసంతృప్తి, రైతుల ఆగ్రహం, ‘ఉఢ్తా పంజాబ్’గా మారిన రాష్ట్రంలో ఇట్టే దొరుకుతున్న మాదక ద్రవ్యాలు, పాక్ సరిహద్దుల నుంచి ఆయుధ ప్రవాహం, పాలకుల నిస్తేజం... అన్నీ కలసిన పంచకూట కషాయమే – పంజాబ్‌లో ప్రబలుతున్న దేశవ్యతిరేక కార్యకలాపాలు. జనబాహుళ్య అసంతృప్తిని తెలివిగా వాడుకుంటూ తన పునాదిని విస్తరించుకుంటున్న అమృత్ పాల్‌కు పాక్ అండతో సాగుతున్న విదేశీ ఖలిస్తానీ మద్దతుదారులు తోడవడం అగ్నికి ఆజ్యమే. తనను తాను అతిగా ఊహించుకుంటున్న ఈ వేర్పాటువాదిని ఆదిలోనే అడ్డుకోవాలి. మొగ్గలోనే తుంచకపోతే విభజనవాదం బ్రహ్మరాక్షసిగా మారి మింగేస్తుంది. కదం తొక్కాల్సిన పాలకులు కాలహరణం చేస్తే పంజాబ్‌లో మళ్ళీ పాత చీకటి రోజులు ముందుకొస్తాయి. పారా హుషార్! -
అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్
కాలిఫోర్నియా: భారత సంతతికి చెందిన మైకి హోతి అనే వ్యక్తి అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ‘లోది’ నగర మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర చరిత్రలోనే తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్ సృష్టించారు. మాజీ మేయర్ మార్క్ చాండ్లర్స్ పదవీ కాలం పూర్తవగా నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి. మేయర్ ఎన్నిక కోసం బుధవారం భేటీ అయ్యారు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు. బుధవారం జరిగిన సమావేశంలో.. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్వుమన్ లీసా క్రెయిగ్.. హోతి పేరును మేయర్‌గా ప్రతిపాదించారు. ఆయనను మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. మరోవైపు.. లీసా క్రెయిగ్‌ను ఉప మేయర్‌గా ఎన్నుకున్నారు. అంతకు ముందు మైకి హోతి.. 5వ జిల్లాకు కౌన్సిలర్‌గా, ఉప మేయర్‌గానూ సేవలందించారు. మేయర్‌గా ఎన్నికైన విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. ‘ లోది నగర 117వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉంది. ’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు మైకి హోతి. మైకి హోతి తల్లిదండ్రులు భారత్‌లోని పంజాబ్‌కు చెందిన వారు. ఆర్మ్‌స్ట్రాంగ్ రోడ్లో సిక్కు ఆలయాన్ని స్థాపించడంలో ఆయన కుటుంబం కీలక పాత్ర పోషించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. Honored to be sworn in as the 117th Mayor of the City of Lodi #lodica #209 pic.twitter.com/dgmrYyz5gk — Mikey Hothi (@mikey_hothi) December 23, 2022 ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్! -
మహోజ్వల భారతి: దేవుడు, దాసుడు
బందా సింగ్ బహదూర్ (1670–1716) సిక్కు సైన్యాధ్యక్షుడు. మహా యోధుడు. లక్ష్మణ్ దేవ్, బందా బహదూర్, లక్ష్మణ్ దాస్, మాధవ్ దాస్ అనే పేర్లతోనూ ఆయన ప్రఖ్యాతి చెందారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి ఆయన జన్మస్థలం. పదిహేనవ యేట ఇల్లు విడిచి సన్యసించి, ‘మాధవ్ దాస్’ అన్న దీక్షానామం స్వీకరించారు. గోదావరి తీరంలోని నాందేడ్ ప్రాంతంలో ఒక మఠాన్ని స్థాపించారు. 1708 సెప్టెంబరులో ఆయన ఆశ్రమాన్ని గురు గోవింద సింగ్ సందర్శించారు. అనంతరం ఆయనకు మాధవ్ దాస్ శిష్యుడయ్యారు. ఆ సందర్భంగా బందా సింగ్ బహదూర్ అన్న పేరును గురు గోబింద్ సింగ్ పెట్టారు. గురు గోబింద్ సింగ్ ఇచ్చిన దీవెనలు, అధికారంతో బందా సింగ్ బహదూర్ ఓ సైన్యాన్ని తయారుచేసి, మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. 1709 నవంబరులో మొఘల్ ప్రావిన్షియల్ రాజధాని సమానాను ముట్టడించి, విజయం సాధించి తన తొలి ప్రధాన విజయాన్ని నమోదు చేశారు. పంజాబ్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక జమీందారీ వ్యవస్థను రద్దుచేసి, సాగుచేసుకుంటున్న రైతులకే భూమిని పంచిపెట్టారు. 1716లో మొఘలులు ఆయన్ను బంధించి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. రేపు (జూన్ 9) ఆయన వర్ధంతి. (చదవండి: స్వతంత్ర భారతి: భారత రత్నాలు) -
పాక్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత
పెషావర్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆదివారం ఇద్దరు సిక్కులను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు. మృతులను సుగంధ ద్రవ్యాల దుకాణం నడుపుకునే సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్(38)గా గుర్తించారు. ఘటనకు బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. పెషావర్‌లో సుమారు 15 వేల మంది సిక్కు మతస్తులున్నారు. చదవండి: సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా -
శివసేన, సిక్కు వర్గాల మధ్య ఘర్షణలు.. రాళ్లు రువ్వి, కత్తులు దూసి
చండీగఢ్: పంజాబ్‌లోని పాటియాలాలోని కాళీమాత ఆలయం సమీపంలో శుక్రవారం శివసేన కార్యకర్తలు, సిక్కు వర్గాల మధ్య మధ్య ఘర్షణలు చోటుచేసుకుంది. ఒక గ్రూప్ వారు మరో గ్రూప్‌పై రాళ్లు రువ్వుకున్నారు. కత్తులు దూశారు. పంజాబ్ శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ సింగ్లా నాయకత్వంలో పాటియాలాలో ఆ పార్టీ కార్యకర్తలు ఖలిస్తానీ గ్రూపులకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఇరు వర్గాల వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఒకరితో ఒకరు ఘర్షణకు దిగారు. శివసేన కార్యకర్తలు ఖలిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేయగా.. వీరికి వ్యతిరేకంగా సిక్కు వర్గాలు కత్తులు చేతిలో పట్టుకొని వీధుల్లోకి వచ్చారు. దీంతో ఇరువర్గాలు రాళ్ల దాడులతో విరుచుకుపడ్డారు. కత్తులు దూయడంతో పాటియాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హరీశ్ సింగ్లా మాట్లాడుతూ, పంజాబ్‌లో ఖలిస్థానీ గ్రూపులు ఏర్పడటానికి శివసేన అవకాశం ఇవ్వబోదని చెప్పారు. చదవండి: వరుడి నిర్వాకం... ఊహించని షాక్ ఇచ్చిన వధువు #WATCH | Punjab: A clash broke out between two groups near Kali Devi Mandir in Patiala today. Police personnel deployed at the spot to maintain law and order situation. pic.twitter.com/yZv2vfAiT6 — ANI (@ANI) April 29, 2022 పాటియాలాలో పరిస్థితులు చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాగా ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. పాటియాలాలో ఘర్షణలు జరగడం చాలా దురదృష్టకరమని తాను డీజీపీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం పాటియాలాలో పరిస్థితులు పునరుద్ధరిరంచినట్లు పేర్కొన్నారు. పరిస్థితిని పరిశీలిస్తున్నామని, రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ఎవరినీ అనుమతించమని స్పష్టం చేశరు. పంజాబ్‌లో శాంతి, సామరస్యం కాపాడటం చాలా ముఖ్యమని భగవంత్ మాన్ అన్నారు. The incident of clashes in Patiala are deeply unfortunate. I spoke with the DGP, peace has been restored in the area. We are closely monitoring the situation and will not let anyone create disturbance in the State. Punjab’s peace and harmony is of utmost importance. — Bhagwant Mann (@BhagwantMann) April 29, 2022 పాటియాలా డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్నీ మాట్లాడుతూ, ప్రజలు శాంతియుతంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని కోరారు. పాటియాలతోపాటు పంజాబ్ ప్రజలంతా సోదరభావంతో మెలగాలని కోరారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నారు తెలిపారు. -
సిక్కు ప్రముఖులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం పలువురు సిక్కు మత ప్రముఖులతో తన నివాసంలో సమావేశమయ్యారు. సిక్కు మతస్తుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వారికి వివరించారు. పంజాబ్ అసెంబ్లీకి మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనుండగా జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, అకాలీదళ్ తిరుగుబాటు వర్గం నేత సుఖ్‌దేవ్ సింగ్ థిండ్సాలతో ఏర్పడిన తమ కూటమి బలమైందని చూపి, సిక్కు వర్గం ఓట్లు, వారి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ గ్రహీత బాబా బల్బీర్ సింగ్ సిచేవాల్, యమునానగర్‌కు చెందిన మహంత్ కరంజీత్ సింగ్, కర్నాల్‌కు చెందిన బాబా జోగా సింగ్, అమృత్‌సర్‌కు చెందిన సంత్ బాబా మెజోర్ సింగ్ సహా పలువురు సిక్కు ప్రముఖులు హాజరైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. దేశ సేవ,, రక్షణతోపాటు, సిక్కు సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడంలో సిక్కు నేతలు ముందున్నారని అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
వీర్‌బాల్ దివస్‌గా డిసెంబర్ 26
న్యూఢిల్లీ: సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు వీరమరణం పొందిన డిసెంబర్ 26వ తేదీన ఏటా ఇకపై వీర్‌బాల్ దివస్‌గా పాటించాలని ప్రధాని మోదీ కోరారు. గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఆదివారం ప్రధాని ఈ ప్రకటన చేశారు. న్యాయం కోసం నిలబడి మొఘల్ పాలకుల క్రౌర్యానికి బలైన గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులకు ఇదే అసలైన నివాళి అవుతుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘సాహిబ్జాదా జొరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతేహ్ సింగ్ మొఘల్ పాలకులు వారిని బంధించి గోడ కట్టడంతో వీరమరణం పొందారు. నమ్ముకున్న ధర్మానికి కట్టుబడి ప్రాణాలను సైతం వారు త్యజించారు’అని పేర్కొన్నారు. వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల కారణంగా బీజేపీపై ఆగ్రహంతో ఉన్న సిక్కు వర్గాన్ని మంచి చేసుకునే చర్యల్లో భాగంగానే తాజాగా ప్రధాని మోదీ ఈ ప్రకటన చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. -
ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!
British Sikh Woman Makes History With Solo Trip To South Pole: బ్రిటీష్‌లో జన్మించిన సిక్కు ఆర్మీ అధికారి ప్రీత్ చాందీ ఒంటరిగా దక్షిణ ధృవ సాహా యాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ మేరకు చాందీ సాహసయాత్ర గతేడాది నవంబర్‌లో ప్రారంభమైంది. పైగా ఆమె అంటార్కిటికా అంతర్గత అధికారుల సహాయ సహకారాలు తీసుకోకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. (చదవండి: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!) అయితే ఆమె జనవరి 3న 700 మైళ్ల దూరాన్ని 40 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్రీత్ చాందీ మాట్లాడుతూ..." భూమిపై అత్యంత, ఎత్తైన, శీతలమైన పొడి గాలులతో కూడిన ఖండం అంటార్కిటికా. అక్కడ ఎవరూ శాశ్వతంగా నివశించరు. నేను మొదట ప్లాన్ చేయడం ప్రారంభించినప్పుడు ఖండం గురించి నాకు పెద్దగా తెలియదు. అదే నన్ను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించింది. అంతేకాదు దక్షిణ ధృవ సాహసయాత్ర కోసం రెండున్నర సంవత్సరాలు నుంచి సిద్ధమయ్యాను. ఇందులో భాగంగా క్రేవాస్‌లో శిక్షణ తీసుకున్నా. చివరకు నేను మంచు కురుస్తున్న దక్షిణ ధృవానికి చేరుకున్నా" అని బావోధ్వేగంగా తెలిపింది. అంతేకాదు "పోలార్ ప్రీతీ" క్యాప్షన్‌ని జోడించి మరీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సాహాసయాత్రకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ మేరకు బ్రిటీష్ సైన్యం ప్రీత్ చాందీనిl అబినందించడమే కాక ధృఢమైన సంకల్పానికి స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రశంసించారు. (చదవండి: ఈ కేసును మేము వాదించం: న్యాయవాదులు) View this post on Instagram A post shared by Preet Chandi (@polarpreet)