కాలిఫోర్నియా వర్సిటీకి భారీ విరాళం
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి భారత సంతతికి చెందిన దంపతులు హర్‌కీరత్, దీపా ధిల్లాన్ లక్ష డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. యూనివర్సిటీలో సిక్కు, పంజాబీ సంస్కృతులను అధ్యయనం చేస్తున్న విద్యార్థుల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాలని యూనివర్సిటీని కోరారు.
సిక్కు, పంజాబీ సంస్కృతిపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అమెరికాలో సిక్కు సంస్కృతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నవారికి కూడా తాము ప్రోత్సాహకం కల్పిస్తామన్నారు. అంతేకాక హ్యుమానిటీస్, ఆర్ట్స్, సోషల్‌సైన్స్ తదితర అంశాల్లో రీసెర్చ్‌లు చేసిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు అవార్డులు కూడా ప్రకటిస్తామన్నారు.