University of California
-
పశుపక్ష్యాదులకూ లెక్కలు తెలుసు!
సంగీత జ్ఞానం అని ఒక మాట ఉంది. భక్తి లేకుండా సంగీత జ్ఞానం లేదు అంటాడు త్యాగరాజు. ఆ సంగతి పక్కన పెడితే స్వరజ్ఞానం, తాళజ్ఞానం అని సంగీతంలో రెండు భాగాలు. ఇక అక్షరజ్ఞానం అని మరొక మాట ఉంది. అంటే చదవడం, రాయడం రావడం అన్నమాట. మరి అంకెల మాట ఏమిటి? అందరికీ ఏదో ఒక రకంగా లెక్కపెట్టడం తెలిసే ఉంటుంది. చివరకు పిల్లలకు కూడా పంపకంలో తమకు అన్యాయం జరిగిన సంగతి అర్థం అవుతుంది. ఈ రకంగా మొత్తం మీద అందరికీ అంకెల గురించిన తెలివి ఉంటుంది. అది అనుకోకుండానే వస్తుంది. మనిషి మెదడుకు అంకెలు అర్థమవుతాయి, వాటి మధ్యన లంకె తెలుస్తుంది. అయితే ఈ జ్ఞానం ఉన్నది ఒక్క మనుషులకే కాదు అంటున్నారు. చీమల నుంచి మొదలు తేనెటీగల దాకా ఇంకా పైజాతి జంతువుల వరకు అన్నింటికీ అంకెల గురించి తెలుసు అంటున్నారు. కోతులు, సాలెపురుగులు కూడా కొన్ని అంకెలనైనా తెలుసుకుంటాయి అంటారు పరిశోధకులు. తేనెటీగలు బయలుదేరి తేనె సేకరణ కోసం తిరుగుతూ ఏ ప్రాంతంలో ఎక్కువ పువ్వులు ఉన్నదీ సులభంగా అర్థం చేసుకుంటాయి. కోతులకు ఏ చెట్టు మీద పండ్లు ఎక్కువ ఉన్నాయీ తెలుస్తుంది. ఎదుటి గుంపు గర్జనలను గుర్తించి క్రూర మృగాలు శత్రువుల సంఖ్యను తెలుసుకుంటాయి. జంతువులన్నీ ఆ రకంగా విషయాలు తెలుసుకుంటే గాని వాటి బతుకు సులభంగా సాగదు అంటారు ఆండ్రియాస్ నీడర్. ఆయన జర్మనీలోని ‘ట్యూబింజెన్’ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. సంఖ్యను గుర్తించే ఈ వెసులుబాటు జంతు జాతుల చరిత్రలో అత్యంత ప్రారంభ కాలంలోనే మొదలైంది అంటున్నారు పరిశోధకులు. అయితే మరి కొత్తగా ఈ సంగతిని గురించి ఎందుకు పట్టించుకోవాలి అన్నది ప్రశ్న. ఒక్కసారి చూచి గుర్తుంచుకోగలిగిన అంకెల విషయంలో మనుషులకు పరిమితులు ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. నాలుగు వరకు మాత్రమే సులభంగా గుర్తుంటాయి అంటున్నారు. ఒకచోట నాలుగు పుస్తకాలు ఉంటే సులభంగా గుర్తించగలుగుతాం. అంతకన్నా ఎక్కువగా ఉంటే లెక్కపెట్టవలసి వస్తుంది. ఏ విషయంలో అయినా ఇదే పరిమితి. ఇందులో కూడా రెండు అంచెలు ఉంటాయి. ముందు సంఖ్య నిర్ణయం అవుతుంది. ఆ తరువాత ఆ సంఖ్య సరైనదేనా అని లెక్క తేలుతుంది. క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పెట్రో పినైరో షాగాస్ ఈ విషయంలో ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. ఇక ఏ అంకె లేకుండా... అంటే సున్నా అన్న భావన ఉన్నచోట కూడా లెక్కింపు అవసరమే అంటున్నారు. అసలు అంకెలు అన్నింటిలోకి సున్నా అన్నది చాలా గొప్పది అంటారు నీడర్. చిన్న చిన్న అంకెలు నేర్చుకున్న తర్వాత కూడా సున్నా అనే భావన నేర్చుకోవడానికి చిన్నపిల్లలకు కొంతకాలం పడుతుంది అని పరిశోధకులు గమనించారు. ఏదో ఉంది అని చెప్పడం, వాటిని లెక్కించడం వింతగా తోచదు కానీ ఏమీ లేని చోట సున్నా అన్న భావన రావడం గొప్ప విషయం. నీడర్ బృందం వారు తమ పరిశోధన ద్వారా కోతులు, తేనెటీగలు, కాకులకు కూడా ‘0’ అన్న విషయం తెలుసునని కనుగొన్నారు. ఈ అంశం గురించి కొంత కాలం క్రితమే ‘క్వాంటా’ అనే పరిశోధన పత్రికలో వ్యాసాలు వచ్చాయి. చాలావరకు జంతువులు, లేదంటే జంతువులు అన్నింటికీ సంఖ్యాజ్ఞానం ఉంది అని సులభంగానే తెలుస్తుంది కానీ దానికి పరిమితి ఎక్కడ అన్న ప్రశ్న చిత్రమైనది. ఆస్ట్రేలియాలోని డికెన్స్ యూనివర్సిటీలో కృషి చేస్తున్న స్కార్లెట్ హోవర్డ్ ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. జంతువు అంకెల పరిమితి మనం ఇంతకుముందు అనుకున్న ప్రకారం కాక మరీ ఎక్కువగా ఉందని కనుగొన్నారు. సున్నా అంటే ఒకటి కన్నా తక్కువ అని తెలుసునట. వాటికి కూడికలు, గుణకారాలు కూడా తెలుసునట. నిజానికి మనిషి పరిణామం చాలా కాలం తర్వాత జరిగింది. మనిషికి కూడా ఈ లెక్కలన్నీ తెలిశాయి. ఇది మొత్తం ప్రాణి ప్రపంచంలోనే ఉన్న విషయం అని పరిశోధకులకు తెలిసింది. మనుషులు ఒకసారి చూచినా, విన్నా ఎనిమిది అంకెల వరకు సులభంగా గుర్తించగలుగుతారని కొంత కాలం క్రితమే తెలుసు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ నంబర్లు 10 అంకెలు ఉంటాయి. కనుక వాటిని ఒకసారి విని గుర్తుంచుకోవడం కష్టం అవుతున్నదట. కొంతకాలం క్రితం ఫోన్ నంబర్లలో 8 కన్నా తక్కువ అంకెలు ఉండేవి. అప్పట్లో సులభంగా గుర్తుండేవట!ఇటువంటి విషయాలను గురించి మనం సాధారణంగా ఆలోచించం. అది సైంటిస్టుల పని అనుకుంటాం. నిజానికి ఈ విషయాలు అందరికీ సంబంధించినవి మరి!కె.బి.గోపాలం వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
లాస్ ఏంజెలిస్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్‌తో లాస్ ఏంజెలిస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. ‘‘ జరిగింది చాలు శాంతించండి’’ అని వర్సిటీ చాన్స్‌లర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికావ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2,000 మందికిపైగా అరెస్ట్‌చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ‘అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించేస్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్‌లోని బ్రిస్టల్, లీడ్స్, మాంచెస్టర్, న్యూక్యాజిల్, షెఫీల్డ్ వర్సిటీల్లోనూ నిరసనకారుల శిబిరాలు వెలిశాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్లలో ఇప్పటికే నిరసనకారులు ఆందోళనలు మొదలెట్టారు. ఫ్రాన్స్, లెబనాన్, ఆ్రస్టేలియాలకూ నిరసనలు విస్తరించాయి. -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలో ఉద్రిక్తత
లాస్ఏంజెలిస్: పాలస్తీనా–ఇజ్రాయెల్ రగడ అమెరికాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. లాస్ ఏంజెలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో పాలస్తీనా, ఇజ్రాయెల్ అనుకూల వర్గాల విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బైడెన్ ప్రభుత్వ ఇజ్రాయెల్ అనుకూల విధానాలను నిరసిస్తూ పాలస్తీనా వర్గం వర్సిటీలో టెంట్లు వేసుకుని నిరసనలను సాగిస్తున్న విషయం తెలిసిందే. హెల్మెట్లు, మాస్కులు ధరించిన కొందరు కర్రలు చేతబట్టుకుని మంగళవారం అర్ధరాత్రి టెంట్లపైకి దాడికి దిగారు. బాణసంచా కూడా కాల్చినట్టు లాస్ఏంజెలెస్ టైమ్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఇరువర్గాల వారు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలతోపాటు అందిన వస్తువులను విసురుకున్నారు. వర్సిటీని పాలస్తీనా అనుకూల వర్గాలు ఆక్రమించుకుని తమను లోపలికి రానివ్వడం లేదన్న ఇజ్రాయెల్ అనుకూల విద్యార్థుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. హింసాత్మక ఘటనల కారణంగా వర్సిటీలో బుధవారం తరగతులు రద్దయ్యాయి. సోమవారం కొలంబియా వర్సిటీ కూడా ఈ ఘర్షణలకు వేదికవడం తెలిసిందే. హామిల్టన్ హాల్లో దాదాపు 20 గంటలపాటు తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. వర్సిటీతోపాటు సిటీ కాలేజీలో ఆందోళనలకు దిగిన దాదాపు 300 మందిని అరెస్టు చేశారు. నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలో టెంట్లు వేసి నిరసన సాగిస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు ఖాళీ చేయించారు. కొద్ది వారాలుగా అమెరికాలో పాలస్తీనా, ఇజ్రాయెల్ విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు వర్సిటీలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్ ఐలాండ్స్ క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థి వర్గంతో బ్రౌన్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే అక్టోబర్ నుంచి వర్సిటీలోకి ఇజ్రాయెల్ వ్యక్తుల పెట్టుబడులను స్వీకరించరాదనేది వారిలో ప్రధాన షరతు. ఆందోళనకారుల డిమాండ్‌కు ఇలా ఒక యూనివర్సిటీ తలొగ్గడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతున్నారు! -
‘శెభాష్ ప్రజ్ఞ’.. సీజేఐ సన్మానం
న్యూఢిల్లీ: కలలు కనడం సులువే. వాటిని నెరవేర్చుకోవడమే కష్టం. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో కలలు సాకారం చేసుకొనేవారు కొందరే ఉంటారు. అలాంటి కొందరిలో ఒకరే ప్రజ్ఞ. సుప్రీంకోర్టులో పని చేస్తున్న వంట మనిషి కుమార్తె ప్రజ్ఞ(25) అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. న్యాయశాస్త్రంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తోపాటు ఇతర న్యాయమూర్తులు బుధవారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆమె ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, దేశానికి సేవలందించాలని వారు ఆకాంక్షించారు. భారత రాజ్యాంగంపై రచించిన మూడు పుస్తకాలపై వారంతా సంతకాలు చేసి, ఆమెకు బహూకరించారు. స్వయంకృషి, పట్టుదలతో ప్రజ్ఞ ఈ స్థాయికి చేరుకున్నారని, భవిష్యత్తులో ఆమెకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. పిల్లలు వారి కలలు నెరవేర్చుకొనేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులపైనా ఉందని సూచించారు. సన్మాన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రజ్ఞ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. వారిని కూడా న్యాయమూర్తులు సన్మానించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌లో మాస్టర్స్ చదవడానికి ప్రజ్ఞకు అవకాశం దక్కింది. స్కాలర్షిప్ లభించింది. ఆమె తండ్రి అజయ్ సమాల్ సుప్రీంకోర్టు వంట మనిషి. న్యాయశాస్త్రంలో ఉన్నత చదవులు చదవడానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ తనకు స్ఫూర్తిగా నిలిచారని ప్రజ్ఞ చెప్పారు. ప్రజ్ఞ ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్‌లో రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు. -
హైహై నాయికా
నాయకత్వ లక్షణాల్లో ఎవరు గొప్ప.. మహిళలా.. పురుషులా? దీనిచుట్టూ జరిగిన అనేక పరిశోధనలు, అధ్యయనాల్లో బయటపడింది ఏమంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా మహిళల్లోనే మెరుగ్గా ఉంటాయట!. అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం ఒక మంచి నేతకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు నిజాయితీ, మేధాశక్తి, కరుణతోపాటు సృజనాత్మకత. ఈ లక్షణాలు ఎక్కువగా మహిళల్లోనే ఉంటాయని ఈ సంస్థ పరిశోధనాత్మక వ్యాసంలో పేర్కొంది. ఇతరులు చెప్పేది వినడం, తనతోపాటు అందరి అభివృద్ధికి సాయం చేయడం, ఎలాంటి పరిస్థితులనైనా సృజనాత్మకతతో ఎదుర్కోవడం వంటి నాయకత్వ లక్షణాలు మహిళల్లో అధికంగా ఉంటాయని అమెరికాకు చెందిన నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎలైస్ ఈగ్లొ వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో స్త్రీ, పురుషులు దాదాపు ఒకేవిధమైన నిర్ణయాలు తీసుకున్నా అధిక ఒత్తిడిలో పురుషులు ప్రమాదంతో కూడిన క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని, కానీ మహిళలు ఒత్తిడిలోనూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటారని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. అధిక ఒత్తిడికి లోనైనప్పుడు మనిషి లో కార్టిసొల్ అనే హార్మోన్ అధికంగా విడుదల అవుతుంది. ఈ కార్టిసొల్ హార్మోన్ విడుదలైనప్పుడు అది మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. కార్టిసొల్ స్థాయి పెరిగినా మహిళల మెదడు పురుషులకంటే సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైంది. మందకొడిగా నాయకత్వ హోదా.. ఒక మహిళ మంచి నాయకురాలిగా రాణించగలదని సామాజిక, శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలు చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు నాయకత్వ హోదాలోకి ఎదగడం అత్యంత మందకొడిగా సాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నాయకత్వ హోదా విషయంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం సాధించడానికి ఇంకో 130 ఏళ్లు పడుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. ♦ గతేడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లోనే మహిళలు దేశాధ్యక్ష లేదా ప్రభుత్వ అధినేత్రి హోదాలో ఉన్నారు. అందులో భారత్ సహా 13 దేశాల్లో అధినేత్రిలుగానూ మరో 15 దేశాల్లో ప్రభుత్వ అధినేత్రిలుగా ఉన్నారు. ♦అన్ని దేశాలు కలిపి మంత్రుల స్థానాల్లో 21 శాతమే మహిళలు ఉన్నారు. 14 దేశాల్లో మాత్రమే మంత్రివర్గాల్లో సగం లేదా ఆపైన అతివలు ఉన్నారు. ♦ ప్రస్తుతానికి అన్ని దేశాల పార్లమెంటుల్లో కలిపి 26 శాతం మహిళా అభ్యర్థులు సభ్యులుగా ఉన్నారు. 1995 నాటికి ఇది 11 శాతమే ఉండేది. వీటిలో ఐదు దేశాల్లో సగానికిపైగా మహిళా పార్లమెంటు సభ్యులు ఉన్నారు. రువాండాలో 61 శాతం, క్యూబాలో 53 శాతం, నికరగ్వాలో 51, మెక్సికోలో 50, యూఏఈలో 50 శాతం మంది మహిళలు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. ♦ మరో 27 దేశాల్లో మహిళా పార్లమెంటు సభ్యులు 40 శాతానికిపైగా ఉన్నారు. అందులో 15 యూరప్‌లో, 5 లాటిన్ అమెరికా దేశాల్లో, 5 ఆఫ్రికాలో, చెరొకటి ఆసియా, పసిఫిక్ దేశాల్లో ఉన్నాయి. ఇందులో అధిక దేశాల్లో మహిళల కోసం పార్లమెంటు స్థానాల్ని రిజర్వు చేయడం వల్ల సాధ్యమైంది. ♦ ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో పార్లమెంటులో 10 శాతం కన్నా తక్కువగా మహిళలు ఉన్నారు. అందులో మూడు దేశాల్లో ఒక్క మహిళ కూడా పార్లమెంటులో లేరు. అవి మైక్రోనేసియా, పపువా న్యూగినియా, వనౌతు దేశాలు. ♦136 దేశాల సమాచారం క్రోడీకరిస్తే స్థానిక సంస్థలకు ఎన్నికైన మహిళల సంఖ్య 30 లక్షలుగా (34 శాతం) ఉంది. ఈ విషయంలో ప్రపంచ సగటు కంటే భారత్‌లో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం మెరుగ్గా ఉంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కారణంగా మనదేశంలో మొత్తంగా మహిళా ప్రాతినిథ్యం 44 శాతానికి పెరిగింది. అదే ఫ్రాన్స్‌లో 40, బ్రిటన్‌లో 34, జర్మనీలో 27.5, చైనాలో 23, జపాన్‌లో 13 శాతంగా ఉంది. ♦ భారత్‌లో మొత్తం 2.5 లక్షల పంచాయతీలు ఉండగా మొత్తం 32 లక్షల మంది వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో 14.5 లక్షల మంది మహిళలే. అత్యధికంగా ఉత్తరాఖండ్‌లో మహిళా ప్రాతినిధ్యం 54.8 శాతం ఉండగా అత్యల్పంగా జమ్మూకశ్మీర్‌లో 32 శాతం ఉంది. ♦ మహిళలు నేతృత్వం వహిస్తున్న స్థానిక సంస్థల పనితీరు మెరుగ్గా ఉంటోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ♦ భారత్‌లో మంచినీటి ప్రాజెక్టులు విషయంలో పురుషులు నేతృత్వం వహిస్తున్న పంచాయతీలకన్నా మహిళా నాయకత్వంలోని పంచాయతీల్లోనే 62 శాతం అధికంగా ఉన్నాయని తేలింది. ♦ ప్రపంచవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మహిళా ప్రాతినిధ్యం 50 శాతం దాటిన దేశాలు రెండే ఉన్నాయి. మరో 20 దేశాల్లో 40 శాతంగా ఉంది. అధినాయికలు నామమాత్రమే.. ప్రపంచవ్యాప్తంగా 1960 నుంచి ఇప్పటివరకు 59 దేశాల్లో మహిళలు అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు. మొత్తంగా 77 మంది మహిళలు ఉన్నత స్థానాలకు ఎదిగారు. 1960లో సిరిమావో బండారునాయికే శ్రీలంక ప్రధానిగా ఎన్నికై ప్రపంచంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన తొలి మహిళా నేతగా ఖ్యాతిగాంచారు. ఈ ఏడాది ప్రారంభం నాటికి 15 దేశాలకు మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ఇటలీ, హొండురస్లో తొలిసారి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకున్నాయి. నిరంతరాయంగా అత్యధిక కాలం దేశాధినేతగా కొనసాగిన కీర్తి జర్మనీకి చెందిన ఎంజెలా మెర్కెల్‌కు దక్కింది. ఆమె జర్మనీ చాన్సలర్‌గా 16 ఏళ్ల 16 రోజులు ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన దామె యుజెనియా చార్లెస్ (14 ఏళ్ల 328 రోజులు), లైబిరియాకు చెందిన ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్ (12 ఏళ్ల 6 రోజులు) ఉన్నారు. మధ్యలో అంతరాయం వచ్చినా మొత్తంగా అత్యధికకాలం ప్రభుత్వాధినేత్రి హోదాలో ఉన్న ఘనత ఇందిరాగాందీకి కూడా దక్కుతుంది. ఆమె భారత్ ప్రధానిగా మొత్తం 16 ఏళ్ల 15 రోజులు పనిచేశారు. ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఏకంగా 19 ఏళ్లకుపైగా ప్రధాని పదవిని అలంకరించారు. - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
స్ఫూర్తి: ముంబై మురికివాడ నుంచి... యూఎస్ యూనివర్శిటీ వరకు!
దురదృష్టం ఒక ద్వారం మూసిపెడితే, కష్టపడేతత్వం పదిద్వారాలను తెరిచి ఉంచుతుంది... అంటారు. ముంబై పేవ్‌మెంట్స్‌పై పూలు అమ్మిన సరిత మాలికి ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి చేసే అవకాశం లభించింది. ఈ విజయానికి కారణం ఆమె ఇష్టపడే కష్టపడేతత్వం... సరిత మాలి తల్లిదండ్రులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మూరుమూల ప్రాంతం నుంచి పొట్ట చేతపట్టుకొని మహానగరం ముంబైకి వచ్చారు. అక్కడి ఘడ్కోపర్ మురికివాడలో పుట్టి పెరిగింది సరిత.స్థానిక మున్సిపల్ స్కూల్లో పదవతరగతి చదువుకుంది. ఆ తరువాత కాలేజి చదువు కొనసాగిస్తూనే ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. ట్యూషన్స్ చెప్పగా వచ్చిన డబ్బులను జాగ్రత్తగా దాచుకునేది. పై చదువులకు అవి ఎంతో కొంత సహాయపడ్డాయి. ఒకసారి సెలవులలో అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు, బంధువులలో ఒకరు దిల్లీలోని ‘జేఎన్‌యూ’ గురించి గొప్పగా చెప్పారు. ఆ సమయంలోనే అనుకుంది...ఆ యూనివర్శిటీలో ఎలాగైనా చేరాలని! ఆ ఉత్సాహంపై నీళ్లుపోసే మాటలు ఎదురయ్యాయి. ‘జేఎన్‌యూలో అడ్మిషన్ దొరకడం అంతేలికైన విషయం కాదు’ ‘తెలివైన విద్యార్థులు మాత్రమే అక్కడ చదువుకుంటారు’... మొదలైనవి. ఆ తెలివైన విద్యార్థి తాను ఎందుకు కాకూడదు? అని మనసులో గట్టిగా అనుకుంది సరిత. బీఏ మొదటి సంవత్సరం నుంచే ప్రవేశపరీక్షకు ప్రిపేర్ కావడం మొదలుపెట్టింది! ఆమె కష్టం వృథా పోలేదు. ప్రసిద్ధమైన యూనివర్శిటీలో ఎం.ఏ హిందీలో ఆమెకు సీటు వచ్చింది. ‘నేను మరిచిపోలేని రోజు, నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు అది. జేఎన్‌యూలో విస్తృతమైన∙ప్రపంచాన్ని చూశాను. ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను’ అంటుంది సరిత. యూనివర్శిటీలో తనతో ఒక్కొక్కరూ ఒక్కోరకంగా వ్యవహరించేవారు. పేదకుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యంగెస్ట్ రిసెర్చ్ స్కాలర్‌గా తనను స్ఫూర్తిగా తీసుకున్నవారు కొందరైతే,‘సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లకుండా ఈ సాహిత్యం, కవిత్వం వల్ల ఉపయోగం ఏమిటి?’ అని తక్కువ చేసి మాట్లాడిన వారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, తన మాటల్లో చెప్పాలంటే ‘జేఎన్‌యూ’ సరితకు మరోప్రపంచాన్ని చూపింది. జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేసిన సరితకు తాజాగా ‘యూనివర్శిటి ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి(హిందీ సాహిత్యం) చేసే అవకాశం లభించింది. ‘భక్తి ఉద్యమకాలంలో అట్టడుగు వర్గ మహిళల సాహిత్యం’ అనేది ఆమె పీహెచ్‌డి అంశం. ‘నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం. అయితే పేదరికం వల్ల ఎన్నోసార్లు చదువు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చినా నేను వెనక్కి తగ్గలేదు. ఏదో రకంగా కష్టపడి చదువుకున్నాను. నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల సహకారం మరవలేనిది. భవిష్యత్‌లో పేదపిల్లలకు నా వంతుగా సహాయపడాలనుకుంటున్నాను’ అంటుంది 28 సంవత్సరాల సరిత మాలి. -
గర్భిణులకు కోవిడ్ సోకితే, నెలలు నిండకముందే ప్రసవం
లాస్ ఏంజలస్: గర్భంతో ఉన్న తల్లికి కోవిడ్ సోకితే నెలలు పుట్టకముందే శిశువు జన్మించే అవకాశాలు ఎక్కువవుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిపుణులు నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. వీటిని లాన్సెట్ ఆరోగ్య విభాగంలో ప్రచురించారు. నెలలు నిండక ముందే జన్మించడం అరుదేమీ కాదని, అయితే ఆ సాధారణ పరిస్థితులు ఉన్న వారిలో పోలిస్తే కరోనా సోకిన వారిలో 60శాతం ఎక్కువ ముందస్తు ప్రసవాలు జరుగుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని పరిశోధనలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ దెబోరా కరాసెక్ తెలిపారు. కరోనా సోకిన గర్భవతుల్లో ముందస్తు ప్రసవాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అన్వేషిస్తూ తమ పరిశోధన సాగిందని వెల్లడించారు. 2020 జూలై నుంచి 2021 జనవరి వరకూ ఈ అధ్యయనం జరిగిందన్నారు. మొత్తం 2,40,157 ప్రసవాల్లో.. ముందస్తు ప్రసవాలు 9000 ఉన్నాయన్నారు. అందులో 3.7శాతం మంది కోవిడ్ సోకిన వారు ఉన్నారని తెలిపారు. కోవిడ్ సోకని వారికి 8.7శాతం ముందస్తు ప్రసవాలు జరగ్గా, కోవిడ్ సోకిన వారిలో 11.8 శాతం ముందస్తు ప్రసవాలు జరిగినట్లు గుర్తించామన్నారు. కోవిడ్ సోకి, ముందుస్తు ప్రసవం జరిగిన వారిలో ప్రభుత్వ బీమా ఉన్న వారు 40 శాతం మంది ఉన్నారన్నారు. హైపర్‌టెన్షన్, డయాబెటిస్, ఒబెసిటీ ఉన్నవారు 15.9 శాతం మంది ఉన్నట్లు తెలిపారు. అందులోనూ కోవిడ్ సోకి డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఉన్నవారిలో ఏకంగా 160 శాతం ముందస్తు ప్రసవ ముప్పు గుర్తించినట్లు వెల్లడించారు. అయితే ఈ అధ్యయనంలో కోవిడ్ సోకిన కాలం, దాని తీవ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. -
శారీరక శ్రమ లేని వారిపై కరోనా ప్రభావం ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ: శారీరక శ్రమ లేని వారిపై కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. నిశ్చల స్థితిలో రెండేళ్లుగా ఉన్న వారు కరోనాకు గురైతే బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అమెరికాలో కరోనా మహమ్మారి రాక ముందు రెండేళ్లుగా శారీరక శ్రమ (ఇన్ యాక్టివ్) లేని వారు ఎక్కువగా ఆసుపత్రి పాలయ్యారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకులు పేర్కొన్నారు. ఈ తరహా రోగులకు సాధారణంగా ఐసీయూ చికిత్స అందించాల్సి వచ్చిందని, అంతేకాకుండా శారీరక శ్రమ (యాక్టివ్) చేసిన వారికన్నా ఈ తరహా రోగులు ఎక్కువగా మృతి చెందారని పేర్కొన్నారు. ఈ అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ (బీజేఎస్ఎం) తాజా సంచికలో ప్రచురితమైంది. వృద్ధాప్యం, అవయవ మార్పిడి చరిత్ర ఉన్న వారి కన్నా గడిచిన రెండేళ్లుగా నిశ్చలంగా ఏ శారీరక శ్రమ లేని వారికే కరోనా అత్యంత ప్రమాదకారిగా తయారైందని పరిశోధకులు చెబుతున్నారు. వృద్ధాప్యం, చికిత్స పొందుతున్నవారు, డయాబెటిక్, ఒబెసిటీ, గుండెపోటు తదితర రోగాలతో బాధపడుతున్న వారు, పురుషులపై కరోనా ప్రభావం అధికంగా కనిపించినట్లు తెలిపారు. జాతి, వయసు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు ఇలా అనేక అంశాలు పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు. వారంలో 150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేసిన వారికన్నా రెండింతలు ఎక్కువగా శారీరక శ్రమ చేయని వారు ఆసుపత్రి పాలయ్యారని తెలిపింది. వీరిలో 73 శాతం ఐసీయూ అవసరం పడింది. మృతి చెందిన వారిలో 2.5 రెట్లు వీరే అధికం. శారీరక శ్రమ లేని రోగులు 20 శాతం అధికంగా ఆసుపత్రుల్లో చేరితే 10 శాతం ఎక్కువ మంది ఐసీయూలో చేరాల్సి వచ్చిందని, 32 శాతం అధికంగా మృతి చెందారని అధ్యయనంలో తేలింది. ఇది ఒక పరిశీలనాత్మక అధ్యయనంగా పరిశోధనలో పాలు పంచుకున్న కైజర్ పర్మనెంటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు పేర్కొన్నారు. అన్ని వయసుల వారు తప్పకుండా శారీరక శ్రమ చేయాలని కరోనా నియంత్రణ మార్గదర్శకాల్లో చేర్చాలని పరిశోధకులు సూచించారు. చదవండి: ‘కుంభమేళా’పై విమర్శల వెల్లువ -
కరోనా: బాక్టీరియాను చంపే మాస్క్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి మానవాళిని అతలాకుతలం చేసింది. వైరస్ ప్రభావం కోట్లాది ప్రజలపై పడింది. అంతేకాకుండా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. కరోనావ్యాక్సిన్ తయారికి మరింత సమయం పడుతుండటంతో ప్రజలు కరోనా నుంచి రక్షణ కోసం ముందు జాగ్రత్త చర్యలను పాటిస్తున్నారు. అందులో ముఖ్యమైనది మాస్క్. వైరస్ నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుండటంతో మాస్క్ వాడకంతో కరోనాను సంక్రమించకుండా చూడవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల మాస్కులు లభ్యమవుతున్నాయి. అయితే ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన కొత్త మాస్కు కరోనాని ఎదురిస్తుంది. పరిశోధకులు తయారుచేసిన ఈ మాస్కు ఒక గంట పాటు ఎండలో ఉపయోగిస్తే 99.99 శాతం బాక్టీరియాను చంపేస్తుందని చెబుతున్నారు. వీరు తయారు చేసిన మాస్కు తిరిగి వాడుకునేందుకు అనుకూలంగా ఉండేలా తయారుచేశారు. అయినప్పటికీ, మాస్కుపైన బాక్టిరీయా, వైరస్ ఉండే అవకాశం ఉన్నట్లు ఒక ప్రముఖ జర్నల్ చేసిన అధ్యయనంలో తెలిపింది. పరిశోధకులు తెలిపిన ప్రకారం ఈ మాస్కు 10 సార్లు ఉతికి ఎండలో ఉంచినప్పటికీ దాని సహజ స్వభావాన్ని కోల్పొలేదు. ఈ మాస్క్‌లో వివిధ రకాల క్లాత్ మెటీరియల్స్ వాడటం వల్ల దీని ఉపయోగించిన వారు వైరస్ లక్షణాలు ఉన్న వారు ..తుమ్మినా, దగ్గినా చాలా తక్కువ మొత్తంలో బ్యాక్టీరియాను బయటకు విడుదల చెయ్యదన్నారు. మాస్క్ ఎలా తయారుచేశారంటే.. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చెందిన పరిశోదన బృందం, డేవిస్ ఈ మాస్క్‌ను తయారిచేశారని, మాస్క్‌ని సూర్యరశ్మిలో ఉంచినప్పుడు మాస్క్‌లోని కాటన్ మేటిరియల్ రియాక్టివ్ ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని ఇందులోని సూక్ష్మకణాలను చంపుతుందన్నారు. మాస్క్‌లో 2-డైఇతైల్ అమైనో క్లోరైడ్ వాడారని అన్నారు. ఇది వైరస్‌ని ఎదుర్కొనే గుణం ఉంటుదన్నారు. ఈ మాస్క్‌ను వాడే వారు అందులోని సూక్క్ష్మకణాలను చంపే గుణం పోకుండా ఉండటం కోసం రోజు పది సార్లు నీటిలో తడిపి, ఎండకు ఉంచాలన్నారు. ఇలా 7 రోజుల పాటు చెయ్యాలని తెలిపారు. -
ఆరు అడుగుల దూరం సరిపోదు
కాలిఫోర్నియా: 'చికిత్స కన్నా నివారణ మేలు' అనే మాట కరోనాకు సరిగ్గా సరిపోతుంది. మందు లేని ఈ మాయదారి రోగానికి మనం పాటించే జాగ్రత్తలే రక్షగా నిలుస్తాయి. అత్యవసరం కానిదే బయటకు వెళ్లకపోవడం, ముఖ్యంగా మాస్కు ధరించడం, మరీ ముఖ్యంగా ఆరడగుల భౌతిక దూరం పాటించడం. అన్నీ సరే కానీ.. ఆరడుగుల దూరం కరోనాను నిలువరించలేదని బాంబు పేల్చారు సైంటిస్టులు. కొన్నిసార్లు కరోనా వైరస్ కణాలు సుమారు 20 అడుగుల దూరం వరకు ప్రయాణించవచ్చని హెచ్చరిస్తున్నారు. సాంత బర్బరాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. (లిఫ్టుల్లో ఎదురెదురుగా నిలబడొద్దు) వైరస్ వ్యాప్తిని నిర్దేశించే వాతావరణం! ఈ అధ్యయనం ప్రకారం.. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, కొన్నిసార్లు మనిషి సాధారణంగా మాట్లాడే సమయంలోనూ నోటి నుంచి దాదాపు 40 వేల బిందువులు సెకనుకు వంద మీటర్ల మేర వ్యాప్తి చెందుతాయి. ఈ బిందువులను అధ్యయనకారులు రెండు రకాలుగా విభజించారు. పెద్ద పరిమాణంలో ఉండే స్థూల కణాలు తక్కువ దూరం ప్రయాణించి అక్కడే స్థిరపడుతాయి. కానీ సూక్ష్మ కణాలు వైరస్‌ను ఎక్కువ దూరం మోసుకెళ్లే సామర్థ్యం ఉండటంతో పాటు కొన్ని గంటల పాటు గాలిలోనే ఉండగలవన్న విషయాన్ని వెల్లడించారు. వాతావరణంలోని మార్పులు వైరస్ వ్యాప్తిని మరింత ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొన్నారు. అమెరికాలోని సీడీసీ(సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సూచించిన ఆరు అడుగుల భౌతిక దూరం అన్ని వేళలా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. చల్లని వాతావరణంలో వైరస్ కణాలు ఆరు అడుగులే కాకుండా ఆరు మీటర్ల(19.7 అడుగులు) వరకు వ్యాపిస్తాయని తెలిపారు. (ఎందుకు.. ఏమిటి.. ఎలా? ) -
ఊబకాయానికి కొత్త చికిత్స...
ఊబకాయం సమస్యను అధిగమించేందుకు కాలిఫోర్నియా యూనివర్సిటీ (శాన్ఫ్రాన్సిస్కో) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. జన్యువుల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు ఉపయోగించే క్రిస్పర్ టెక్నాలజీ సాయంతో తాము కొన్ని జన్యువుల పనితీరును నియంత్రించగలిగామని, తద్వారా ఊబకాయానికి చెక్ పెట్టగలిగామని అంటున్నారు నవనీత్ అనే శాస్త్రవేత్త. అయితే ఈ క్రమంలో జన్యువుల్లో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోవని, ఆకలికి సంబంధించిన జన్యువులపై ప్రభావం చూపడం ద్వారా ఆహారం తీసుకోవడం తగ్గిపోతుందని నవనీత్ వివరించారు. మన జన్యుక్రమంలో ప్రతి జన్యువుకూ ఒక నకలు ఉంటుందని, ఈ రెండింటిలో ఒకదాంట్లో మార్పులు చోటు చేసుకుని, రెండోది మామూలుగా ఉన్నప్పుడు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశముందని వివరించారు. ఈ నేపథ్యంలో ఎలుకల్లో తాము ఆకలికి సంబంధించిన సిమ్1, ఎంసీఆర్4ఆర్ అనే రెండు ఆకలి జన్యువులపై క్రిస్పర్ టెక్నాలజీని ఉపయోగించామని, రెండు జన్యువుల స్థానంలో ఒకటే ఉండేలా చేసినప్పుడు వాటి శరీర బరువు నియంత్రణలోకి వచ్చేసిందని, తినడం తగ్గిపోవడాన్ని గమనించామని చెప్పారు. జన్యుపరమైన మార్పులేవీ చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఈ టెక్నిక్‌ను మనుషుల్లోనూ ప్రయోగించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. -
ఆటోమేషన్ భయమొద్దు
ఆస్ట్రేలియాలోని మేక్వయిర్ యూనివర్సిటీ ఇటీవల దీనిపై ఓ చర్చ నిర్వహించింది. ‘డెలాయిట్ ఆస్ట్రేలియా’ప్రతినిధి జులియట్ బుర్కే ఇందులో పాల్గొన్నారు. మానవ వనరులకు సాంకేతికత ప్రత్యామ్నాయం కాలేదని వివరించారు. సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాఫ్ట్ స్కిల్స్ ఉత్పాదకతను పెంచగలవని చెబుతున్న అధ్యయనాలను ఆమె ఉటంకించారు. బృందంలో భాగమై పనిచేయగలగడం, సహానుభూతి, సృజనాత్మకతతో వ్యవహరించడం, తన ఆలోచనలు, భావాలను బలంగా వ్యక్తం చేయగలగడం వంటి నైపుణ్యాలు ఈ కృత్రిమ మేధయుగంలో చాలా ముఖ్యం కానున్నాయని వివరించారు. కొత్త నైపుణ్యాలు అందించాలి: ఉద్యోగాల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులను తట్టుకుని నిలబడేందుకు చేపట్టాల్సిన చర్యలను మేక్వయిర్ యూనివర్సిటీలో గ్లోబల్ ఎంబీఏ ప్రోగ్రామ్ డైరెక్టర్ వైవన్ బ్రేయర్ వివరించారు. విద్యా విధానంలో కొత్త నైపుణ్యాలు అందించడం.. ఉద్యోగాలిచ్చిన పరిశ్రమలు ఇందుకు పూనుకోవాలని సూచించారు. ఉన్నత విద్యలో గత 20 ఏళ్లల్లో అంతగా మార్పులు రాకపోవడాన్ని ఈ సందర్భంగా యూనివర్సిటీ లెర్నింగ్ అండ్ టీచింగ్ విభాగం డీన్ లియోని టికిల్ వివరించారు. మనం మారాలి.. ‘టెక్నాలజీ అభివృద్ధిని మనం అడ్డుకోలేం. పని ప్రదేశాల్లోకి చొచ్చుకురాకుండా దాన్ని ఆపలేం. పని స్వభావం మారుతోంది. మారుతూనే ఉంటుంది. కాబట్టి కొనసాగుతున్న మార్పులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి’అని జీటీఎం అండ్ సేల్స్ డిజిటల్ మీడియా (దక్షిణాసియా) హెడ్ గౌరవ్ కన్వల్ చెబుతున్నారు. నవతరం నుంచి మధ్యవయస్కుల వరకు క్రమం తప్పకుండా తమ నైపుణ్యాలను సాన పెట్టుకోవాలని సూచించారు. సృజనాత్మక సామర్థ్యాలే రక్ష.. 2030నాటికి రోబోటిక్ ఆటోమేషన్ కారణంగా 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని ఏడాది కిందట 46 దేశాలపై మెకన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ జరిపిన అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం.. పేద దేశాల కంటే ధనిక దేశాల్లోనే ఆటోమేషన్ ఎక్కువ ప్రభావం చూపనుంది. భారత్‌లో కొత్త టెక్నాలజీల కారణంగా 9% ఉద్యోగాలకు ముప్పు ఉంది. 32 దేశాల్లో 46% ఉద్యోగాలపై యాంత్రీకరణ ప్రభావం చూపొచ్చని ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) ఈ ఏడాది జరిపిన అధ్యయనం చెబుతోంది. కృత్రిమ మేధ కలిగిన యంత్రాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) చెబుతోంది. సృజనాత్మక సామర్థ్యాలున్న వారే పైచేయి సాధిస్తారని స్థూల ఆర్థిక విధానాల విభాగాధినేత ఎక్కెహర్డ్ ఎమ్స్ట్ వివరించారు. కృత్రిమ మేధ ద్వారా ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల తయారీ రంగం అంతగా లాభాలు గడించబోదని అభిప్రాయపడ్డారు. నిర్మాణ, ఆరోగ్య, వ్యాపారరంగ ఉద్యోగాలపైనే ఎక్కువగా కృత్రిమ మేధ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఆ యంత్రాలతో కలసి పని చేసేందుకు ఉద్యోగులకు కొత్తరకం నైపుణ్యాలు అవసరం అవుతాయని ఎక్కెహర్డ్ చెబుతున్నారు. పెరుగుతున్న సాంకేతికత.. కార్మిక శక్తి, ఆదాయ వ్యత్యాసాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఏఐ, మెషీన్ లెర్నింగ్ ప్రభావంపై ఇప్పుడే అంచనా వేయడం కష్టమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ కెన్ గోల్డ్బెర్గ్ చెబుతున్నారు. ఏఐ వల్ల పోయే ఉద్యోగాల కంటే వచ్చేవే ఎక్కువని స్పష్టం చేస్తున్నారు. -
చిన్నారుల బుగ్గల్ని గిల్లడానికి కారణమిదే!
లాస్ఏంజెలిస్: పిల్లలను చూడగానే చాలామంది ముద్దుగా వాళ్ల బుగ్గలను గిల్లేస్తారు. కుక్కపిల్లలు కనిపిస్తే ఇంకొందరు తమ సంతోషాన్ని ఆపుకోలేరు. ఇలాంటి ప్రవర్తనకు మనుషుల మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ ప్రాంతంలో కలిగే స్పందనలే కారణమని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విషయమై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ కేథరిన్ మాట్లాడుతూ.. ‘ముద్దులొలికే చిన్నారులు, బుజ్జి కుక్కపిల్లలు వంటివారిని చూసినప్పుడు మెదడులో కలిగే ఎలక్ట్రికల్ స్పందనల నమోదుకు ఎలక్ట్రోఫిజియాలజీ అనే పద్ధతిని ఉపయోగించాం. పరిశోధనలో భాగంగా 18–40 సంవత్సరాల వయస్సు ఉన్న 54 మందికి తలలకు ఎలక్ట్రోడ్స్ అమర్చి వేర్వేరు చిత్రాలను చూపించాం. మిగతా చిత్రాలతో పోల్చుకుంటే ముద్దులొలికే చిన్నారులు, కుక్క పిల్లల చిత్రాలను చూసినప్పుడు వీరి మెదడులోని రివార్డ్ సిస్టమ్ ప్రాంతంలో ఉద్దీపనల తీవ్రత ఎక్కువగా ఉంది. దీనివల్లే చిన్నారులను చూసినప్పుడు వెంటనే వారి బుగ్గలను గిల్లాలని అనిపిస్తుంది’ అని వెల్లడించారు. ఈ పరిశోధన ‘ఫ్రాంటియర్స్ ఇన్ బిహేవియరల్ న్యూరోసైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైంది. -
ఎండలో కారు పార్క్ చేస్తే ప్రాణాలకు ముప్పు
లాస్ ఎంజిలస్: కారును ఎండలో పార్క్ చేసిన గంటలో దాని లోపలి ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని, దీంతో కారు లోపల చిక్కుకున్న చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో–అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వేసవికాలంలో ఎకానమీ, మిడ్ సెడాన్, లగ్జరీ సెగ్మెంట్లకు చెందిన 6 కార్లను వీరు అధ్యయనం చేశారు. కారులో ఉష్ణోగ్రత మార్పు కారణంగా రెండేళ్ల చిన్నారులపై పడే ప్రభావాన్ని పరీక్షించారు. ఇందులో కారును ఎండలో పార్క్ చేసిన గంటలో స్టీరింగ్ వద్ద 52, సీట్ల దగ్గర 50 డిగ్రీలు, డాష్ బోర్డు వద్ద 69 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నీడలో నిలిపిన గంటలో కారు లోపల 37డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు గుర్తించారు. -
కనిపించని బల్బులు వచ్చేస్తున్నాయి!
ఎల్ఈడీలు తెలుసుగా.. అతి తక్కువ కరెంటు ఖర్చుతో దీర్ఘకాలం పాటు బోలెడంత వెలుగునిచ్చే సరికొత్త బల్బులు. కాలిఫోర్నియా యూనివర్శిటీ (బెర్క్లీ) ఇంజినీర్లు తాజాగా ఇంకో కొత్త రకం ఎల్ఈడీలు తయారుచేశారు. కేవలం కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే ఈ కొత్త బల్బుల్ని ఆఫ్ చేసినప్పుడు పూర్తి పారదర్శకంగా ఉంటాయి. ఈ బల్బులో కేవలం మూడు పరమాణువుల మందంతో ఉండే అర్ధవాహకం (సెమీ కండక్టర్) పొర ఒకటి ఉంటుంది. అయితే ఏంటి అంటున్నారా? చాలా సింపుల్. ఈ సరికొత్త బల్బులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. టీవీలు, కంప్యూటర్లు, హోర్డింగులు వంటి అన్ని రకాల తెరలూ మాయమైపోతాయి. అదెలా అనొద్దు. ఆఫ్‌లో ఉన్నప్పుడు పారదర్శకంగా ఉంటాయని ముందే చెప్పుకున్నాం కదా.. అందుకన్నమాట! గాజు కిటికీలు, తలుపుల్లోపలే డిస్ప్లే తెరలను ఏర్పాటు చేసేందుకు ఈ కొత్త బల్బులు ఉపయోగపడతాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డెర్ హీన్ లీన్ తెలిపారు. బల్బులో వాడే మూడు పరమాణువుల మందమైన పొర నాలుగు రకాల పదార్థాలతో తయారు చేయవచ్చునని... ఒక్కోటి ఒక్కో ప్రాథమిక రంగును వెదజల్లుతుంది కాబట్టి... వీటిని నియంత్రించడం ద్వారా తెరపై మనకు నచ్చిన రంగును సృష్టించవచ్చునని వివరించారు. అతి పలుచగా ఉండే ఈ కొత్త బల్బులను మనిషి చర్మంపై పచ్చబొట్టు మాదిరిగా ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. అయితే ఈ స్థాయిలో వీటిని ఉపయోగించుకునేందుకు మరికొంత సమయం పట్టవచ్చునని లీన్ స్పష్టం చేశారు. -
నోరు జారిన రాహుల్ గాంధీ
బెర్కెలీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలిఫోర్నియాలో నోరు జారారు. 'ఇండియా ఎట్ 70: రిఫ్లెక్షన్స్ ఆన్ పాత్ ఫార్వాడ్' కార్యక్రమంలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ లోక్‌సభ సీట్ల సంఖ్యను తప్పుగా చెప్పారు. లోక్‌సభలో సీట్లు 545 అయితే 546 సీట్లని రాహుల్ పేర్కొన్నారు. దీంతో రాహుల్‌పై సోషల్‌మీడియాలో జోక్స్ పేలుతున్నాయి. అంత పెద్ద కార్యక్రమానికి వెళ్తూ ఏం మాట్లాడాలో.. సిద్ధం కాలేదా అంటూ ట్వీట్లు వెల్లువెత్తాయి. చిన్న తప్పులతో నెటిజన్లకు రాహుల్ దొరికిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. -
అమెరికాలో ఐటీ ఉద్యోగులకు షాక్!
అమెరికాలో ఐటీ ఉద్యోగులకు అనుకోని షాక్ తగిలింది. ఇంతకాలం తమ వద్ద పనిచేస్తున్న 49 మంది ఐటీ ఉద్యోగులను శాన్ఫ్రాన్సిస్కో నగరంలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇంటికి పంపేసింది. వాళ్లు చేసే పనిని భారతదేశంలోని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థకు ఔట్సోర్సింగ్ ఇచ్చింది. దీనివల్ల ఆ యూనివర్సిటీకి ఐదేళ్ల కాలంలో కలిపి మొత్తం రూ. 200 కోట్ల వరకు ఆదా అవుతుంది. వాస్తవానికి గత సంవత్సరం జూలై నెల నుంచి యూనివర్సిటీ ఈ దిశగా ఆలోచిస్తోంది. ఇన్నాళ్ల తర్వాత దాన్ని అమలుచేసింది. ఆరోగ్య రంగంతో పాటు రీసెర్చ్ ఆధారిత యూసీఎస్ఎఫ్ కార్యక్రమాన్ని నిర్వహించే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా.. ఆదాయాన్ని పెంచుకోలేక, ఖర్చులు తగ్గించుకోలేక ఇబ్బంది పడుతోంది. దాంతో ఇప్పుడు తమ ఐటీ పనిని ఔట్‌సోర్స్ చేయాలని నిర్ణయించుకుంది. వాస్తవానికి ఔట్సోర్సింగ్ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడుతున్న తరుణంలోనే ఇలాంటి నిర్ణయం రావడం గమనార్హం. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా తమ పనిని ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం ఇదే మొదటిసారని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. టెక్నాలజీ ఖర్చులు పెరుగుతున్నందువల్ల ఉద్యోగాలు తీసేయక తప్పలేదని, ఈ 49 మందిని తీసేయడమే కాక, ఇప్పటికే ఖాళీగా ఉన్న 48 పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయడం లేదా అసలు ఆ ఉద్యోగాల ఖాళీలనే తీసేయడం లాంటి చర్యలు చేపడతామన్నారు. అయితే.. ఇలా తమ ఉద్యోగాలు తీసేసి వాటిని ఔట్సోర్సింగ్ చేయడం మంచి పరిణామం కాదని ఉద్యోగం పోయిన ఒక ఐటీ ఇంజనీర్ వ్యాఖ్యానించారు. -
భవనాలను చల్లబరిచే సరికొత్త పదార్థం!
లాస్ ఏంజెలిస్: భవనాలను, కార్లను ఎండ వేడిమి నుంచి కాపాడే ఓ పదార్థాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది సన్నగా, తక్కువ బరువుతో మనకెలా కావాలో అలా ఉపయోగించుకునేలా ఉంటుంది. దీన్ని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ‘నియర్–పర్ఫెక్ట్ బ్రాడ్‌బ్యాండ్ అబ్సార్బర్’ అని పేరు పెట్టారు. ఇది ఎండ వేడిమిని ఏ కోణం నుంచి అయినా అడ్డుకోగలదు. ఎండ వేడిమిని పూర్తిగా అడ్డుకోగల పదార్థాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నా అవి ఎక్కువ బరువుతో ఉండి, వంచినప్పుడు విరిగిపోయే స్థితిలో ఉంటాయి. వాటిని లోహాలతో చేయడం వల్ల ఈ సమస్య ఎదురయింది. వీటి తయారీలో లోహాన్ని కాకుండా ఎలా కావాలంటే అలా మార్చుకోదగ్గ జింక్ ఆక్సైడ్‌ను వాడి సమస్యను అధిగమించవచ్చు. -
రణరంగంగా కాలిఫోర్నియా వర్సిటీ
-
రణరంగంగా కాలిఫోర్నియా వర్సిటీ
లాస్ఏంజెలిస్: బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. వర్సిటీలో ట్రంప్ మద్దతుదారుడు, వివాదాస్పద ఎడిటర్ మైలో ఇనాపొలస్ కార్యక్రమానికి నిరసనగా బుధవారం రాత్రి విద్యార్థులు పెద్దపెట్టున నినదించారు. క్యాంపస్ అద్దాల్ని పగులగొట్టి, ఫర్నిచర్‌ను తగలబెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో వారు బాష్పవాయువు ప్రయోగించారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మైలో కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆందోళనలపై ట్విటర్లో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ వాక్ స్వాతంత్య్రాన్ని అనుమతించకుండా హింసాత్మకంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి నిధులు ఇవ్వబోమని హెచ్చరించారు. -
అడవులు తగ్గుతున్న కొద్దీ పెరుగుతున్న దోమలు!
హెల్త్ ల్యాబ్ అడవుల్లో కనిపించాల్సిన జంతువులు ఇటీవల నగరాల్లో కనిపించడం అందరికీ తెలిసిందే. దీనికి కారణాలూ తెలుసు. తాము స్వేచ్ఛగా సంచరించాల్సిన అడవులు తగ్గుతున్న కొద్దీ అక్కడ నడయాడాల్సిన జంతువులు పట్టణాల్లోకి, నగరాల్లోకి వస్తున్నాయి. ఇటీవల ‘సన్ బేర్’గా వ్యవహించే కొన్ని ఎలుగుబంట్లను చూసి వాటిని ఏలియన్స్‌గా అనుమానించిన ఉదంతమూ తెలిసిందే. అయితే ఇది కేవలం అడవి జంతువులకు మాత్రమే వర్తించే విషయం కాదు. అడవులు తగ్గుతున్న కొద్దీ... అక్కడి వనాల్లో పెరగాల్సిన దోమలూ నగరాల్లోకి వచ్చేస్తున్నాయట. ఇటీవల అమెరికాలో జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికన్ గున్యా వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో దోమలు అకస్మాత్తుగా, విపరీతంగా పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు అక్కడి పరిశోధకులు. దాంతో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కొన్ని దోమ జాతులు నీళ్లలో పెరిగినట్లుగానే మరికొన్ని దోమలు అడవుల్లోని ఆకుపచ్చ వనాల్లో మాత్రమే తమ జీవనచక్రాన్ని కొనసాగించాలి. కానీ అవి అడవుల నరికివేత విపరీతంగా సాగుతున్న నేపథ్యంలో ఆ అడవి దోమలు నగరాలకు వలస వస్తున్నాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. ఈ పరిశోధక బందానికి నేతత్వం వహించిన మార్మ్ కిల్పాట్రిక్స్ తమ పరిశోధన వివరాలను వెల్లడిస్తూ గత ఐదు దశాబ్దాల్లో దోమల సంఖ్య పెరగాల్సిన దానికంటే పది రెట్లు అధికంగా పెరిగాయని పేర్కొంటున్నారు. -
ఫేస్‌బుక్‌తో దీర్ఘాయుష్షు
లాస్ఏంజెల్స్: ఫేస్బుక్ ద్వారా ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చని తాజా పరిశోధనలో తేలింది. అయితే అది నిజజీవితంలో సామాజిక బంధాలను మెరుగుపరిచినప్పుడు మాత్రమే సాధ్యమట. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డీగో పరిశోధకులు 1.2 కోట్ల మందిపై చేసిన ఈ పరిశోధన వివరాల ప్రకారం.. ఫేస్బుక్ వినియోగదారుల్లో అధిక శాతం సామాజిక జీవితాన్ని మెరుగుపరచుకుంటున్నారు. ఫేస్బుక్ ఖాతా ఉన్నవారు.. లేనివారి కంటే ఎక్కువ కాలం బతుకుతున్నారు. అంతేకాకుండా సగటున ఒక ఫేస్బుక్ వినియోగదారుడు చనిపోవడానికి మామూలు వ్యక్తి కంటే 12 శాతం తక్కువ అవకాశముంది. ఫేస్బుక్లో ఎక్కువ ఫ్రెండ్ రిక్వెస్టులు అంగీకరించే వ్యక్తులు ఎక్కువ కాలం నివసిస్తున్నట్లు వారు తెలిపారు. -
మనమూ ‘చిప్’మాన్ అవొచ్చు!
- ‘బ్రెయిన్ చిప్’కు అమెరికా న్యూరోసైంటిస్టు రూపకల్పన - చిప్‌తో దీర్ఘకాల జ్ఞాపకశక్తి కాలిఫోర్నియా: మనుషుల శరీరాల్లో చిప్‌లను అమర్చి వారితో అద్భుతాలు సృష్టించటాన్ని హాలీవుడ్ చిత్రాల్లో చూస్తుంటాం. దీన్ని నిజం చేసే దిశగా.. జ్ఞాపకాలను దీర్ఘకాలం పదిలంగా ఉంచే ‘బ్రెయిన్ చిప్’కు కాలిఫోర్నియా వర్సిటీ న్యూరోసైంటిస్టు థియోడర్ బర్జర్ రూపకల్పన చేశారు. దీన్ని కోతులు, ఎలుకలపై విజయవంతంగా పరీక్షించారు. మరికొన్ని పరీక్షలు చేసి.. మార్కెట్లోకి అందుబాటులోకి తేచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అల్జీమర్స్‌పై ప్రయోగంతో మొదలై.. మతిమరపు(అల్జీమర్స్) బాధితులను ఆదుకోవాలనే సంకల్పంతో 20 ఏళ్ల క్రితం బర్జర్ ప్రయోగం మొదలైంది. ఇందులో భాగంగానే మెదడు మార్పిడి చికిత్సపైనా వివిధ ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల నుంచి పుట్టిందే ‘బ్రెయిన్ చిప్’. మూర్ఛ వ్యాధిగ్రస్తులపై ఈ చిప్‌ను పరీక్షిస్తున్నారు. ప్రాథమికంగా మనుషులపైనా మంచి ఫలితాలొస్తున్నాయని బర్జర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు విలువ రూ 655 కోట్లు. ఈ చిప్‌లో ఉండే సాఫ్ట్వేర్.. స్వల్పకాల జ్ఞాపకాలను దీర్ఘకాల జ్ఞాపకాలుగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం మెదడు సంకేతాల ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ను యూనిక్కోడ్గా మారుస్తుంది. ఇదంతా సహజంగా దీర్ఘకాల జ్ఞాపకాలను గుర్తుంచుకునే పద్ధతిలోనే కొనసాగుతుంది. కావాల్సినపుడు క్షణాల్లోనే ఆ జ్ఞాపకాలను ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో తిరిగి మెదడుకు అందిస్తుంది. -
మగవాళ్లే సీరియల్ కిల్లర్లు ఎందుకవుతారు?
న్యూయార్క్: అటు సినిమాల్లో, ఇటు నిజ జీవితంలో సీరియల్ లేదా సైకో కిల్లర్ల గురించి కథలు, కథలుగా వింటుంటాం, చూస్తుంటాం. సమాజంలో ఎందుకు కొంత మంది సీరియల్ కిల్లర్స్‌గా మారుతున్నారు? భౌతికంగా వారి మెదళ్లలో వచ్చే మార్పులా, మానిసిక ఒత్తిళ్లా, ఏవీ కారణం? సీరియల్ కిల్లర్లకు ఇతర కిల్లర్లకు భౌతికంగా, మానసికంగా తేడాలు ఉంటాయా? సీరియల్ కిల్లర్ల అందరిలోనూ భౌతిక, మానసిక సమస్యలు ఒకేలాగా ఉంటాయా? ఆ సమస్యలు ఏమిటీ? మగవాళ్లే ఎందుకు ఎక్కువగా సీరియల్ కిల్లర్లుగా మారుతున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబట్టేందుకు కాలిఫోర్నియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జిమ్ ఫాలన్ 35 ఏళ్లపాటు పరిశోధనలు జరిపారు. దాదాపు 70 సీరియల్ కిల్లర్ల మెదళ్లపై పరిశోధనలు సాగించడంతోపాటు మానసికంగా వారిపై పరిసరాలు, సామాజిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా విశ్లేషించారు. ఆయనకు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికిపోయింది. ప్రధానంగా మెదడు దెబ్బతినడం వల్లనే సీరియల్ కిల్లర్లు తయారవుతారని, అందుకు మెదడులో ఏర్పడిన పలు లోపాలతోపాటు ఓ సామాజిక అంశం కూడా వారిని సీరియల్ కిల్లర్లుగా మారుస్తోందని ఆయన కనుగొన్నారు. మెదడులో లోపం లేదా దెబ్బతినడం అందరు సీరియల్ కిల్లర్ల మెదడులో ముందుభాగాన, కనుబొమ్మకు ఎగువ భాగాన ఉండే ‘ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్’ దెబ్బతిన్నట్లు తేలింది. సముచిత నిర్ణయాలు తీసుకునేందుకు ఈ భాగం ఉపయోగపడుతుందనే విషయం తెల్సిందే. అలాగే మనుషుల ఆలోచనల్లో ఆడిటింగ్ విధులను నిర్వహించే టెంపోరల్ కార్టెక్స్లో కూడా లోపం కనిపించింది. ఇది మెదడుకు వెనకభాగంలో దిగువన ఉంటుంది. సెరొటోనిన్ ఎక్కువగా ఉండడం శరీరంలో సెరొటోనిన్ అనే రసాయనం ఎక్కువగా ఉండడమే కాకుండా దానికి ఎంఏఓఏ అనే జన్యువు ఎక్కువగా ఎక్స్పోజ్ అవడం వల్ల సీరియల్ కిల్లర్లు హింసాత్మకంగా మారుతారు. కోపం, ఉద్రేకాలను నియంత్రించే ఈ జన్యువులో కలిగే మార్పుల వల్ల మనిషి ఉన్నట్లుండి కోపోద్రిక్తుడవుతారు. అందుకే ఈ జన్యువును హింసాత్మక జన్యువు అని కూడా అంటారు. పుట్టుకతో తల్లి నుంచి సంక్రమించే ఈ జన్యువు మగవాళ్లలోనే ఎక్కువగా ఉంటుంది. అందుకనే మగవాళ్లే ఎక్కువగా సీరియల్ లేదా సైకో కిల్లర్లుగా మారుతారు. ఆడవాళ్లకు ఇటు తల్లితోపాటు అటు తండ్రిలోని ఈ జన్యువు నుంచి మిశ్రమ జన్యువు సంక్రమిస్తుంది. అందుకనే వారు సీరియల్ కిల్లర్లుగా మారే అవకాశాలు ఎక్కువగా లేవు. సామాజిక కోణం పైన పేర్కొన్న సమస్యలున్న వారి ప్రవర్తన హింసాత్మకంగా ఉంటుందిగానీ హత్య చేయాలనే తలంపు ఉండదు. చిన్నతనంలో హింసాత్మక సంఘటనలను చూసినా, అలాంటి వాతావరణంలో పెరిగినా వారు సీరియల్ కిల్లర్లుగా మారుతారు. అందుకే యుద్ధాలు లేదా అంతర్యుద్ధాల మధ్య పెరిగే పిల్లలు ఎక్కువ మంది సీరియల్ కిల్లర్లుగా మారుతున్నారు. -
నెల వయసులోనే గుర్తించొచ్చు!
లాస్ ఏంజిలెస్: నెల వయసున్న పసికందుల జీర్ణాశయంలో సూక్ష్మజీవులు ఉంటే బాల్యంలో ఆస్తమా, ఇతర అలర్జీలకు గురయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువని అధ్యయనంలో తేలింది. అధ్యయనం ఫలితాలు కొత్త చికిత్స అభివృద్ధికి దోహదం చేస్తాయని అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సుసాన్ లించ్ తెలిపారు. ఆస్తమా వ్యాధి నిర్ధారణ పిల్లల్లో ఏడేళ్ల వయసులో జరుగుతుందని, దీనికి చికిత్సా విధానం లేకపోవడంతో మందులు తీసుకోవాల్సి ఉంటుందని ఒక నెల వయసున్న పసికందుల జీర్ణాశయంలో ఉండే సూక్ష్మజీవులు రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని, తదుపరి మూడేళ్ల వయసులో అలర్జీలకు, నాలుగేళ్ల వయసులో ఆస్తమాకు దారి తీస్తాయని పరిశోధకులు వెల్లడించారు. -
కాలిఫోర్నియా వర్సిటీకి భారీ విరాళం
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి భారత సంతతికి చెందిన దంపతులు హర్కీరత్, దీపా ధిల్లాన్ లక్ష డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. యూనివర్సిటీలో సిక్కు, పంజాబీ సంస్కృతులను అధ్యయనం చేస్తున్న విద్యార్థుల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాలని యూనివర్సిటీని కోరారు. సిక్కు, పంజాబీ సంస్కృతిపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అమెరికాలో సిక్కు సంస్కృతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నవారికి కూడా తాము ప్రోత్సాహకం కల్పిస్తామన్నారు. అంతేకాక హ్యుమానిటీస్, ఆర్ట్స్, సోషల్‌సైన్స్ తదితర అంశాల్లో రీసెర్చ్‌లు చేసిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు అవార్డులు కూడా ప్రకటిస్తామన్నారు. -
అంతరించనున్న అరటి
లాస్ ఏంజెలిస్: మరో ఐదు, పదేళ్లలో అరటి పంట అంతరించనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మూడు ఫంగస్ల వల్ల ఈ పంటకు పెను ముప్పు పొంచి ఉందని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ (యూసీ) పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కాస్తంత భరోసా ఇచ్చారు. మూడు ఫంగస్‌లలో రెండింటి వల్ల మాత్రం తీవ్ర ముప్పు వాటిల్లనుందని డేవిస్లోని యూసీకి చెందిన శాస్త్రవేత్త అయనీస్ స్ట్రెగి యోపోలోస్ చెప్పారు. తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ఫంగస్ వల్ల మరో ఐదు పదేళ్లలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరటి పంట తుడిచిపెట్టుకొని పోతుందన్నారు. -
పొద్దు తిరుగుడు గుట్టు దొరికింది!
న్యూఢిల్లీ: పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడివైపు తిరుగడంలోని(హీలియోట్రోపిజం) గుట్టును కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తల బృందం కనిపెట్టింది. పువ్వు కాడల్లోని మూలకణాల (స్టెమ్‌సెల్స్) ప్రత్యేక ఎదుగుదల విధానమే దీనికి కారణమని వారు చెప్పారు. ‘కాడల్లో పగటిపూట ఒకవైపు ఉన్న మూలకణాలు పెరగడంతో పువ్వు ఒకవైపు నుంచి మెల్లగా పైకి లేచి, అవతలివైపు వంగుతుంది. రాత్రిపూట మరోవైపున్న మూలకణాలు పెరగడంతో పువ్వు తిరిగి ఇటువైపునకు వంగుతుంది. పువ్వులు ఉష్ణోగ్రతను గ్రహించడం ద్వారా.. ఈ మార్పులు కచ్చితంగా తూర్పు, పడమరలవైపు ఉంటాయి’ అని తెలిపారు. ఉదయం సూర్యుడి లేత కిరణాలు సోకగానే.. ఉష్ణోగ్రత మార్పును పసిగట్టి, పువ్వు తల ఆవైపునకు ఉండేలా మూల కణాలు పెరుగుతాయన్నారు. సూర్యుడి నుంచి ఎక్కువ శక్తిని గ్రహించేందుకే ఈ ఏర్పాటని పేర్కొన్నారు. -
అలా చేస్తే బ్రెయిన్ పవర్ సూపర్!
న్యూయార్క్: సరైన వ్యాయామం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలే మెదడును చురుగ్గా ఉంచుతాయంటున్నారు పరిశోధకులు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ మార్క్ డీఎస్పోస్టియో పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. నిత్యం ఎరోబిక్స్, రీజనింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించే వారిలో మెదడు చురుగ్గా ఉంటుందని తేలింది. పరిశోధనల్లో భాగంగా 36 మంది 56-75 ఏళ్ల వయస్సున్న వారిని ఎంచుకున్నారు. శారీరక వ్యాయామం, రీజనింగ్ అలవాట్ల ప్రకారం వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. మెదడులో రక్తప్రసరణ ఆధారంగా వారి పనిని పర్యవేక్షించారు. శారీరక వ్యాయామం చేసే గ్రూపులో మెదడు రక్తప్రసరణ చురుగ్గా ఉండటాన్ని గమనించారు. రీజనింగ్ సమస్యలను పరిష్కరించే వారి మెదడులో రక్తప్రసరణ మరింత చురుగ్గా ఉండటాన్ని గమనించారు. వ్యాయామం చేసేవారితో పోల్చినపుడు రీజినింగ్ సభ్యుల్లో రక్తప్రసరణ వేగం 7.9 అధికంగా నమోదవడాన్ని గుర్తించారు. -
3 డాలర్లతో వెళ్లాడు..రూ.74 కోట్లు ఇచ్చాడు
వాషింగ్టన్: కేవలం మూడు డాలర్లు చేతిలో పెట్టుకుని 1959లో అమెరికా వెళ్లారు. నేడు అదే దేశంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి రూ.74 కోట్లు దానమిచ్చే స్థాయికి ఎదిగారు. ఆయనే భారతీయ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త మణిలాల్ భౌమిక్. పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో 1931లో జన్మించిన ఆయన చిన్నతనంలో ఒక గుడిసెలో తల్లిదండ్రులు, ఆరుగురు తోబుట్టువులతో నివసించేవారు. 16 ఏళ్ల వయసు దాకా కాళ్లకు చెప్పులు కూడా లేకుండా రోజూ 8 మైళ్లు పాఠశాలకు వెళ్లిరావడానికి నడవాల్సి వచ్చేది. అనంతరం ఉపకారవేతనాలతో చదువు కొనసాగించిన మణి 1958లో భౌతికశాస్త్రంలో కలకత్తా వర్సిటీ నుంచి మాస్టర్స్ పట్టా పొందారు. ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి ఫిజిక్స్‌లో తొలి డాక్టరేట్ పొందిన వ్యక్తీ మణినే. స్లోన్ ఫౌండేషన్ అందించిన ఉపకారవేతనంతో 1959లో ఆయనకు కాలిఫోర్నియా వర్సిటలోఅడుగుపెట్టే అవకాశం వచ్చింది. విమాన ప్రయాణానికి డబ్బు లేకపోవడంతో ఊర్లోవారంతా చందాలేసి ప్రయాణానికి సాయం చేశారు. -
కాలిఫోర్నియా యూనివర్సిటీకి భారతీయుడి భారీ విరాళం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన భౌతికశాస్త్రవేత్త మణి భూమిక్.. కాలిఫోర్నియా యూనివర్సిటీకి 11 మిలియన్ డాలర్లను(సుమారు రూ. 74 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ప్రకృతి సూత్రాల పరిశోధన కోసం కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికోసం భూమిక్ ఈ భారీ విరాళాన్ని అందజేశారు. యూనివర్సిటీ చరిత్రలో ఇదే అతిపెద్ద విరాళమని ఛాన్సలర్ గినే బ్లాక్ తెలిపారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పరిశోధన కేంద్రం ‘భూమిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ థిరీటికల్ ఫిజిక్స్’ను మణి భూమిక్ నిర్వహిస్తున్నారు. కంటికి వాడే లేజర్ చికిత్స అభివృద్ధి చేయడంలో భూమిక్‌ది కీలక పాత్ర. పశ్చిమబెంగాల్లోని ఓమారుమూల గ్రామంలో ఆయనకు ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. చిన్నప్పుడు పూరి గుడిసెలో పెరిగిన భూమిక్ నాలుగు మైళ్లు నడిచి స్కూల్‌కు వెళ్లేవాడు. 1958లో కోల్‌కతా యూనివర్సిటీలో పీజీ, ఖరగ్‌పూర్ నుంచి ఐఐటీ భౌతికశాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. 1959లో 3 డాలర్లతో అమెరికాకు వెళ్లిన భూమిక్ 1961లో జిరాక్స్ ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్‌లో లేజర్ సైంటిస్టుగా చేరాడు. 2011లో భారత ప్రభుత్వం మణి భూమిక్‌ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. -
కాలేయానికి వైరస్ సాయం
పాడైపోయిన కాలేయ కణజాలాన్ని మరమ్మతు చేసేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. జన్యుక్రమంలో మార్పులు చేయడం ద్వారా ఒక వైరస్.. లివర్ కణాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురాగలిగారు. మద్యం అతిగా తీసుకోవడం లేదా కొన్ని రకాల వ్యాధుల వల్ల కాలేయం హెపోసైట్స్ అనే కణాలు నాశనమవుతాయి. దీనివల్ల ఏర్పడే ఖాళీ ప్రాంతంలో మైఫైబ్రోబ్లాస్ట్లు చేరిపోయి కణజాలం మొత్తం పనికిరాకుండా పోతుంది. కాలేయం సకాలంలో మరిన్ని ఎక్కువ హైపోసైట్స్ను తయారు చేసుకోలేకపోవడంతో మరింతగా దెబ్బతింటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు జలుబుకు కారణమయ్యే అడెనో అసోసియేటెడ్ వైరస్‌కు జన్యుపరంగా కొన్ని మార్పులు చేసి ఎలుకలపై ప్రయోగం చేశారు. ఈ వైరస్లు మైఫైబ్రోబ్లాస్ట్లపై దాడి చేయడంతోపాటు పాడైపోయిన కణాలను హైపోసైట్స్గా మార్చగలిగాయి. మొత్తంగా ఆరోగ్యకరమైన హైపోసైట్స్ కణాలు పెరిగి.. కాలేయం పునరుద్ధరణ అవుతుంది. ఎలుకలపై జరిగిన ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో మరో ఐదేళ్లలోనే మనుషులకూ ఈ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశముందని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త విన్లెన్బ్రింగ్ చెబుతున్నారు. అడెనో అసోసియేటెడ్ వైరస్‌ను ఇప్పటికే పలు వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నందువల్ల కాలేయం మరమ్మతులోనూ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వాడే వీలుంటుందని పేర్కొంటున్నారు. -
అరబిక్ మాట్లాడినందుకు దించేశారు
లాస్ ఏంజెలిస్: ఓ ముస్లిం విద్యార్థి తన అంకుల్‌తో అరబిక్‌లో మాట్లాడినందుకు విమానంలో నుంచి దించేశారు. కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన మఖ్జూమి లాస్ఏంజిలిస్ నుంచి ఓక్లాండ్కు వెళ్లేందుకు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానమెక్కాడు. తర్వాత.. ముందురోజు ఐరాస కార్యదర్శి బాన్కీమూన్తో జరిగిన భేటీలో పాల్గొన్నట్లు, ఇస్లామిక్ స్టేట్ గురించి ప్రశ్న కూడా సంధించినట్లు చెప్పాడు. ఫోన్ సంభాషణ అనంతరం ముస్లిం సంప్రదాయం ప్రకారం అరబిక్ భాషలో ‘ఇన్షా అల్లా’ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇది విన్న తోటి ప్రయాణికురాలు భయంతో పరుగులు తీసింది. సిబ్బంది అతన్ని దించేశారు. -
ఈ ఫిల్టర్‌తో విషం మాయం
కోల్‌కతా: కోల్‌కతాలోని జాదవ్ పూర్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీర్లు నీటిలో విష రసాయనాలను తొలగించే సరికొత్త వాటర్ ఫిల్టర్‌ను తయారు చేశారు. జాదవ్ పూర్ వర్సిటీ సివిల్ ఇంజనీర్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అందించిన సాంకేతిక సహకారంతో ఫిల్టర్‌ను తయారు చేశారు. ఈ నీటి శుద్ధి యంత్రాన్ని 24 దక్షిణ పరగణ జిల్లాలోని బరూయ్‌పూర్ గ్రామ సమీపంలోని ఓ పాఠశాలలో విజయవంతంగా అమర్చారు. ఇది రోజుకు 10 వేల లీటర్లను శుద్ధిచేస్తుంది. ‘జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు విషరసాయనాలతో కాలుష్య కాసారమైపోయాయి. ఈ వ్యర్థమైన నీటిని తాగునీటిగా మార్చేందుకుగాను ఈసీఏఆర్ (ఎలక్ట్రో కెమికల్ ఆర్సెనిక్ రెమిడియేషన్) సాంకేతికతను ఉపయోగిస్తున్నాము. కేవలం నీటిలోని విషరసాయనాలకే కాక ఇతర వ్యర్థాలను కూడా ఈ వాటర్ ఫిల్టర్ తొలగిస్తుంద’ని ఈ ప్రాజెక్టు సమన్వయకర్త జాయ్‌శ్రీ రాయ్ చెప్పారు. -
చంద్రుడు ఇలా పుట్టాడట!
లాస్ఏంజెలిస్: భూమి, థియా అనే ఓ చిన్న గ్రహం పరస్పరం అభిముఖంగా ఢీకొనడం వల్లే చంద్రుడు ఏర్పడ్డాడని తాజా అధ్యయనం చెబుతోంది. భూమి ఏర్పడిన 10 కోట్ల ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాలు ఢీకొని ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే 430 ఏళ్ల కింద ఈ రెండు గ్రహాలు ఢీకొన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. థియాకు భూమి 45 డిగ్రీల కోణంలో పార్శ్వంగా ఢీకొని ఉంటుందని భావించారు. కానీ అవి రెండు ఎదురెదురుగా ఢీకొనడం వల్లే చంద్రుడు ఏర్పడ్డాడని కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు తేల్చారు. చంద్రుడిపై నుంచి తీసుకొచ్చిన ఏడు రాళ్లు, హవాయి, ఆరిజోనాల్లోని భూమి లోపలి పొరల్లో సేకరించిన అగ్నిపర్వత రాళ్లను పరిశీలించాక వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ రెండు రకాల రాళ్లలో ఉన్న ఆక్సిజన్ పరమాణువు నిర్మాణాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. భూమి పొరల్లోని రాళ్లు, చంద్రుడిపై రాళ్లలో సాధారణ ఆక్సిజన్, దాని ఐసోటోప్ల నిష్పత్తి ఒకే విధంగా ఉందని ప్రొఫెసర్ ఎడ్వర్డ్ యంగ్ తెలిపారు. -
పెంపకంతో కుక్కలకు హాని
ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారా? అయితే మీరు కుక్క జాతికి కాస్తో కూస్తో హాని తలపెట్టినట్లే. ఎందుకంటే పెంపుడు విధానం వల్ల కుక్కల్లో హానికరమైన జన్యువుల ఉత్పత్తి అవుతున్నాయట. తద్వారా ఆ జీవాల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందట! వివిధ దేశాల్లోని కుక్కజాతులపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం తేలిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు సోమవారం వెల్లడించారు. తోడేలు జాతికి చెందిన కుక్కలను 15 వేల ఏళ్ల కిందటే మానవులకు మచ్చికయ్యాయి. మొదట్లో వేటాడేందుకు, ఆ తర్వాత కాపలాకు, ఇప్పుడు పాషన్ గా కుక్కల్ని పెంచుకోవటం తెలిసిందే. గడిచిన కాలం నుంచి 19 తోడేలు జాతుల్లో చోటుచేసుకున్న మార్పులను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. 10 దేశాలకు చెందిన 25 అడవి కుక్కలు, 46 పెంపుడుకుక్కల (34 విభిన్న బ్రీడ్ లకు చెందినవి) పై పరిశోధనలు జరిపారు. సహజంగా పెరిగినవాటికంటే పెంపుడు కుక్కల్లో హానికరమైన జన్యుమార్పులు చోటుచేసుకోవటం గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన కిర్క్ లోముల్లర్ తెలిపారు. కొత్త బ్రీడ్ కోసం వివిధ జాతుల్ని బలవంతంగా సక్రమంలోకి దించేవిధానం కూడా కుక్కలకు చేటుచేస్తుందని పేర్కొన్నారు. -
స్మార్ట్ ఫోన్ యాప్స్‌తో జర జాగ్రత్త!
న్యూయార్క్: నిద్ర లేవడంతోనే స్మార్ట్ ఫోన్లో ఆప్డేట్స్ చూసుకోవడం.. ఫ్రెండ్స్ మెస్సేజ్‌లకు రిప్లై ఇవ్వటం.. యాప్స్ నుంచి ఆన్లైన్ షాపింగ్, మొదలైన పనులు చేస్తుంటాం. కానీ, మీరు వాడే యాప్స్ యూజర్స్ వ్యక్తిగత సమాచారాన్ని లాగేస్తున్నాయా లేదా అని ఎప్పుడూ ఆలోచించరు. తాజా నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని వాడే యాప్స్‌లో 9 శాతం యూజర్స్ వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటాయని తేలింది. కొన్ని యాప్స్ క్రియేటర్స్ తమ స్వలాభం కోసం యాడ్స్, ఏదైనా ఇతర పద్దతుల్లో ప్లే స్టోర్స్‌లో రిజిస్ట్రర్ అవుతారు. వినోదం, తమ అవసరాల కోసం కొన్ని కండీషన్లు ఉన్నప్పటికీ యూజర్స్ ఈ విషయాలేవీ పట్టించుకోకుండా యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని తెగ వాడేస్తుంటారని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మిచాలిస్ ఫలోటస్ వివరించారు. 13,500 రకాల ఆండ్రాయిడ్ ఫోన్ యాప్స్‌పై అధ్యయనం చేసి ఈ వివరాలు తెలిపారు. 2.5 లక్షల యూఆర్ఎల్స్ నుంచి ఈ యాప్స్ యాక్సెస్ చేసుకుంటున్నారని వీటీలో కొన్ని మాత్రమే సరైనవని ఆండ్రాయిడ్ యూఆర్ఎస్ రిస్క్ యాక్సెసర్ గ్రూప్ తమ అధ్యాయనంలో తేల్చింది. డిసెంబర్ 8న జరగనున్న ఐఈఈఈ గ్లోబ్కామ్ కాన్ఫరెన్స్‌లో తాము కనుగొన్న విషయాలను అక్కడ చర్చిస్తామని ప్రొఫెసర్ వివరించారు. పాపులర్ రేటింగ్ సిస్టమ్ 'వెబ్ ఆఫ్ ట్రస్ట్' యూజర్స్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే ముందు వాటికి కాస్త ప్రైవసీ కల్పించే యోచనలో ఉందని పేర్కొన్నారు. ఆప్లికేషన్లను వాడే ముందు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే వాటిని యాక్సెస్ చేయవద్దని స్మార్ట్ ఫోన్ యూజర్లకు సూచించారు. -
పరిపరి శోధన
నీతులు చెప్పేవారే... బయట ఎక్కువగా నీతులు చెప్పేవారు, బుద్ధిగా నీతిచంద్రికలను చదువుతూ కనిపించేవారు అవకాశం దొరికితే చేతివాటం ప్రదర్శిస్తారట! ‘ఇదేమీ ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు. నీతిబోధకులపై విషప్రచారం అంతకంటే కాదు. పచ్చినిజం’ అని అంటున్నారు కాలిఫోర్నియా వర్సిటీ తత్వశాస్త్ర ప్రొఫెసర్ ఎరిక్ ష్విజ్గెబెల్. లైబ్రరీల్లో ఎక్కువగా చేతివాటానికి గురయ్యే పుస్తకాలు నీతులకు సంబంధించినవేనని ఆయన తన అధ్యయనం సాక్షిగా చెబుతున్నారు. లైబ్రరీలను తరచు సందర్శించే వారిలో కొందరు అప్పుడప్పుడు చేతివాటానికి పాల్పడుతుండటం తెలిసిందే. ‘గ్రంథ’చోరుల చేతివాటానికి గురవుతున్న పుస్తకాలలో ఇతర విషయాలకు సంబంధించిన వాటితో పోలిస్తే, నీతులకు సంబంధించినవే 50 శాతం ఎక్కువగా ఉంటున్నట్లు తన అధ్యయనంలో తేలిందని ఈ ప్రొఫెసర్‌గారు వాపోతున్నారు. -
తియ్య టీ!
ఒత్తిడి నుంచి బయటపడడానికి ‘స్వీట్ టీ’ సేవనం మంచి మార్గం అంటుంది తాజా అధ్యయనం. ఒత్తిడికి గురవుతున్న సందర్భంలో విడుదలయ్యే కార్టిసోల్ హార్మోన్‌ను ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుందని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ‘‘స్వీట్ టీ వల్ల ఒత్తిడి నుంచి బయట పడొచ్చు అని చెప్పడానికి మా అధ్యయన ఫలితాలు తొలి ఆధారంగా నిలుస్తాయి’’ అంటున్నారు పరిశోధకులలో ఒకరైన డా.కెవిన్. -
అయ్యబాబోయ్... దెయ్యం!
శాస్త్రం లండన్‌కు చెందిన ఎలిజెబెత్‌కు నిద్రలో నుంచి హఠాత్తుగా మెలకువ వచ్చింది. తన గదిలో దెయ్యపు నీడ! గట్టిగా అరుద్దామంటే నోరు పెగలలేదు. బిగుసుకు పోయింది. వాషింగ్టన్కు చెందిన డేవిడ్ గాఢనిద్రలో ఉన్నాడు. తన ఛాతిపై ఎవరో కూర్చున్నారు. నిద్ర నుంచి లేవబోయి, అరవబోయాడు డేవిడ్. రెండూ సాధ్యం కాలేదు!! అక్కడెక్కడో లండన్, వాషింగ్టన్లో మాత్రమే కాదు... మనకు కూడా ఇలాంటి అనుభవాలు చాలాసార్లు ఎదురై ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది ప్రజలకు ఇలాంటి అనుభవాలు సుపరిచితం. దీన్ని శాస్త్రీయంగా ‘స్లీప్ పెరాలసిస్’ అంటారు. ‘స్లీప్ పెరాలసిస్’ అనేది నిద్రకు, మెలకువకు మధ్య, చేతనకు, అచేతనకు మధ్య ఉగిసలాడే ధోరణి. ఇటీవల యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు ‘స్లీప్ పెరాలసిస్’ గురించి అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన ఒక న్యూరల్ మ్యాప్‌ను రూపొందించారు. మెదడులోని నిర్దేశిత ప్రాంతంలో చోటు చేసుకునే ‘కల్లోలం’ దెయ్యాలు, రాక్షసులు నిద్రలో కనిపిస్తాయనేది శాస్త్రవేత్తల అంచనా. -
లాలనగా... పాలనగా..!
కొంతమంది తల్లితండ్రులు పిల్లలను బాల్యం నుంచి చాలా క్రమశిక్షణతో పెంచాలనుకుంటారు. వాళ్లు కదిలితే తప్పు, మెదిలితే తప్పు అన్నట్టుగా చూస్తుంటారు. వారు ఏ మాత్రం అల్లరి చేసినా, కాల్చేసేలా చూస్తారు. అవసరమైతే నాలుగు తగిలిస్తారు. అయితే చిన్నప్పటి నుంచి తలిదండ్రుల దండనతో పెరిగిన పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలలో లోపాలు చోటు చేసుకుంటాయని మానసిక శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు హెచ్చరిస్తున్నారు. బడిలో ఉపాధ్యాయుల కర్రపెత్తనం వచ్చిన పిల్లలు అమ్మానాన్నలను చూడగానే ఆనందంతో ఎగిరి గంతులు వేసేలా ఉండాలి కానీ, పెద్దపులిని చూసి భయపడినట్లు ఉండటం అటు పిల్లలకే కాదు, ఇటు పెద్దలకూ మంచిది కాదని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా వారు తలిదండ్రుల ప్రవర్తన- పిల్లల ఎదుగుదలపై చేసిన సర్వేలు వెల్లడిస్తున్నాయి. పిల్లలను ప్రేమగా చూస్తూ, వారిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే తల్లితండ్రులను చూసి ‘స్ట్రిక్ట్ పేరెంట్స్’ తప్పు పడుతుం టారు. పిల్లలకు చనువిస్తే చంకనెక్కి కూచుంటారని, చెప్పిన మాట వినరని అంటుంటారు. కానీ, వారి వాదన తప్పని విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. చైనాలోని ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థ హంగ్జువా ఏమి చెబుతోందంటే - తల్లితండ్రులు పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని కోరుకోవటంలో తప్పు లేదు, అయితే అది మోతాదు మించి, పిల్లల పాలిట క్రమ‘శిక్ష’ణలా పరిణమించకూదు. దాని మూలంగా వారి లేత మనస్సులు తీవ్రమైన ఒత్తిడి కి గురై, పక్కతడపటం, నత్తిగా, నంగి నంగిగా మాట్లాడటం, పక్కచూపులు చూడటం, బిక్కచచ్చిపోవటం వంటి ప్రవర్తనా లోపాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి తల్లితండ్రులు తమ పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి తప్పితే, కోపంతో దండించకూడదు. అల్లరి చేసినప్పుడు సున్నితంగా హెచ్చరించాలి. మారాం చేసినప్పుడు మెల్లగా బుజ్జగించాలి. దానివల్ల క్రమంగా పిల్లలే తమ తప్పును తెలుసుకుని దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అలా పెరిగిన పిల్లలు తాము పెద్దయ్యాక తోటివారితో కూడా ప్రేమగా మెలగుతారని సర్వేలు చెబుతున్నాయి. -
భూమి వే డెక్కితే పిడుగుల ముప్పు!
వాషింగ్టన్: గ్లోబల్ వార్మింగ్‌తో పిడుగులు పడే ప్రమాదమూ పెరుగుతోందట. అమెరికాలో ఈ శతాబ్దంలోనే గ్లోబల్ వార్మింగ్ వల్ల పిడుగులు 50 శాతం ఎక్కువయ్యాయట. పదకొండు రకాల వాతావరణ పరిస్థితుల్లో మేఘాల స్థితిపై అధ్యయనం చేసిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ పరిశోధకులు ఈ విషయం తేల్చారు. భూమి ఉష్ణోగ్రత పెరగడం వల్ల తుపానుల సందర్భంగా పిడుగులు పడే అవకాశాలూ ఎక్కువని వర్సిటీ శాస్త్రవేత్త డేవిడ్ రాంప్స్ వెల్లడించారు. వాతావరణంలోని ఉష్ణోగ్రత వల్ల మేఘాల్లో నీటి ఆవిరి కూడా పెరుగుతుందని, ఫలితంగా పిడుగులు పడే అవకాశమూ పెరుగుతుందని రాంప్స్ తెలిపారు. పిడుగుల వల్ల ఏటా మనుషులు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో పాటు గాయపడుతున్నారని, అడవుల్లో సగం కార్చిచ్చులకూ పిడుగులే కారణమన్నారు. -
ఐసీటీ బోధన పద్ధతులు అమలు చేయాలి
విజి మురళి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇప్పుడంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మయం. ఐటీ అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతోంది. ఐటీ ప్రమేయం లేని విభాగాన్ని ఊహించడం కష్టమే. అందుకే ప్రస్తుతం విద్యార్థి లోకంలో అత్యంత క్రేజీగా మారింది.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ కోర్సులు చదివినంతనే అద్భుతాలు సాధ్యం కావని.. కెరీర్లో రాణించాలంటే నేటి యువత మరెన్నో నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-డేవిస్.. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ విజి మురళి. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ నుంచి పీహెచ్డీ వరకు చదివిన మురళి.. కెరీర్లో అనూహ్యమైన మలుపుతో ఐటీ రంగంలో ప్రవేశించారు. ఇదే విభాగంలో ఉన్నతంగా ఎదుగుతూ ఐటీ వెటరన్‌గా పేరు సంపాదించుకున్న మురళి.. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-డేవిస్‌కు సీఐఓగా నియమితులైన నేపథ్యంలో ప్రత్యేక ఇంటర్వ్యూ.. పనితీరుకు గుర్తింపు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన యూసీ-డేవిస్‌కు సీఐఓగా ఎంపిక కావడం నా పనితీరుకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో ఐటీ విభాగంలో విధులు నిర్వర్తించాను. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో సీఐఓగా చేస్తున్న సమయంలోనే తాజా నియామకం ఖరారైంది. ఈ స్థాయికి ఎదగడం ఎంతో ఆనందంగా ఉంది. కెమిస్ట్రీ నుంచి కంప్యూటర్ సైన్స్ వైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ, ఆ తర్వాత అదే విభాగంలో 1981లో పీహెచ్డీ పూర్తి చేశాను. అదే సమయంలో వివాహం కావడంతో అమెరికా వచ్చాను. అప్పుడు.. కెమిస్ట్రీలో కొనసాగాలా? ఇతర రంగాలు ఎంచుకోవాలా? అని ఆలోచిస్తుండగా.. నాన్న ‘ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్’లో కాలు పెట్టావు. రానున్న రోజుల్లో కంప్యూటర్, ఐటీ రంగాలకు భవిష్యత్తు ఖాయం’ అని చెప్పి కంప్యూటర్ సైన్స్వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించారు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి త్రీ-డీ మూలకాల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత, పజిల్స్ రూపకల్పన వెనుక దాగున్న అంశాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. వీటన్నిటికీ కంప్యూటర్ సైన్స్, ఐటీ నైపుణ్యం ద్వారా అవకాశం లభిస్తుందని భావించాను. దాంతో లోవా స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనాలో ఎంఎస్ పూర్తి చేశాను. అదే యూనివర్సిటీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా కెరీర్ ప్రారంభించాను. టెక్నాలజీ-విద్యార్థి దృక్పథం టెక్నాలజీ.. అకడమిక్ అధ్యయనాలకు వేగవంతమైన చోదకంగా ఉంటుంది. అదే సమయంలో.. హార్డ్ వర్క్, ఆసక్తి కూడా చాలా అవసరం. ఏ డొమైన్ అయినా ఈ రెండూ ఉంటేనే సదరు సబ్జెక్ట్‌పై పట్టు లభిస్తుంది. ఆసక్తి ఉంటేనే కొత్త విషయాలు, అంశాలు తెలుసుకోవాలనే ఉత్సుకత మొదలవుతుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఫలితంగా విద్యార్థులకు అకడమిక్ అధ్యయనం ఎంతో సులభంగా మారింది. మేం చదువుకునే రోజుల్లో లాగరిథమ్ టేబుల్స్, స్లైడ్ రూలర్స్ వంటివి పెన్, పేపర్ లేనిదే సాధ్యమయ్యేవి కావు. కానీ ఇప్పుడు క్షణాల్లో వాటిని రూపొందించొచ్చు. టెక్నాలజీని వినియోగించుకునే దృక్పథంపైనే విద్యార్థి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. టెక్నాలజీ సహాయంతో క్షణాలు లేదా నిమిషాల్లో ఒక సమస్యను పూర్తి చేసేయొచ్చు. మిగతా సమయాన్ని కొత్త అంశాల అధ్యయనానికి కేటాయించుకోవచ్చు. ఇలా బ్రెయిన్ పవర్‌ను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో అర్థవంతమైన ఫలితాలు, అద్భుతాలు సాధించొచ్చు. ఐటీతోపాటు మరెన్నో స్కిల్స్ కెరీర్లో విజయం సాధించాలంటే .. కేవలం ఐటీ డొమైన్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. దీనికి అదనంగా ఎన్నో స్కిల్స్ అవసరం. ప్రాబ్లమ్ సాల్వింగ్, టీం వర్క్, టెక్నాలజీ అప్డేషన్, కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలు జత కలిస్తేనే ఐటీ కెరీర్లో ఉన్నతంగా రాణించగలరు. ఐసీటీ బోధనతో మన దేశంలో ప్రధాన సమస్య గ్రామీణ ప్రాంతాలకు సైతం విద్యావకాశాలు అందించడం. దీనికి ఐటీతో పరిష్కారం కనుగొనొచ్చు. వైర్లెస్ కమ్యూనికేషన్ పద్ధతుల్లో గ్రామీణ ప్రాంత పాఠశాలలకు బోధన సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. చదువుకు దూరమవుతున్న విద్యార్థినులను దృష్టిలో పెట్టుకుంటే.. ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) బోధన పద్ధతులు తప్పనిసరిగా అమలు చేయాలి. మరిన్ని ఆవిష్కరణలు ఒక్కసారి ‘వెబ్’ అనే యుగానికి ముందు.. ఇప్పుడు.. మన వ్యక్తిగత, సామాజిక జీవనశైలులను గమనించండి. ఎంతో తేడా కనిపిస్తోంది. ఔషధ ఉత్పత్తి, సైన్స్ ఆవిష్కరణలు, సామాజిక శాస్త్ర పరిశోధనల్లో సైతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రోబోటిక్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, బయలాజికల్ ఆర్గాన్స్; ప్రోస్థెటిక్స్ వంటివి కొన్ని ఉదాహరణలు. ఈ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సరైన దిశలో.. సమర్థంగా వినియోగిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేయొచ్చు. అమ్మాయిలు రాణించగలరు ముందుగా.. మహిళలు, పురుషులు అనే బేధభావాన్ని వీడాలి. పురుషులతో దీటుగా రాణించగలమనే ఆత్మవిశ్వాసంతో అమ్మాయిలు అడుగు ముందుకు వేయాలి. ఉన్నత స్థానాలకు చేరుకుని కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇక.. విద్యార్థులందరికీ నా సలహా.. అకడమిక్స్ ఎంపిక నుంచే జాగ్రత్తగా వ్యవహరించాలి. క్రేజ్ లేదా కెరీర్ ష్యూర్ అనే ఆలోచనలకంటే ఆసక్తికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగిన కోర్సుల్లో చేరాలి. ఒకసారి కోర్సులో చేరిన తర్వాత పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యమిస్తూ అధ్యయనం సాగించాలి. అప్పుడే.. ప్రతి ఒక్కరి లక్ష్యమైన జాబ్.. దానికి అవసరమైన స్కిల్స్ లభిస్తాయి!! -
దీర్ఘాయువుఎంత దూరం?
‘‘ఎలుకల్లో విజయవంతంగా వృద్ధాప్య తగ్గింపు’’ - జనవరి 28 2014, ‘సెల్’ జర్నల్ ‘‘ముదిమిలోనూ మెరుగైన ఆరోగ్యానికి కీలకం సంతులిత ఆహారం’’ - జూలై 25, 2014 ‘నేచర్’ ‘‘జీవనశైలి మార్పులతో నిండైన ఆరోగ్యం.. ఆయుష్షు!’’ - యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, సెప్టెంబరు 17, 2013 ఏడాది కాలంలో వచ్చిన వేర్వేరు పరిశోధనల ఫలితాలివి. అన్నీ... అవునా? నిజమేనా? అని ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అచ్చంగా ఇలాగే జరుగుతుందా? అందరూ నిండు నూరేళ్లు నిక్షేపంగా బతికేయవచ్చా? అని ప్రశ్నించుకుంటే మాత్రం భిన్నమైన జవాబులు వస్తాయి. అయితే... ఈ పరిశోధనలు చెప్పేది ఒక్కటే. జరామరణాలను జయించాలన్న మనిషి మేధోదాహం ఇప్పుడిప్పుడే తీరేది కాదు అని. కాకపోతే నెమ్మదిగానైనా మనం ఆ దిశగా ముందుకు వెళుతూండటం కూడా విస్పష్టమే...! అరవైల్లో ఇరవై లా ఉండాలని... 70, 80 ఏళ్ల వయస్సులోనూ జబ్బులేవీ లేని జీవితం కావాలని కోరుకోని వాళ్లెవరు చెప్పండి? అందరమూ అనుకుంటాం. కానీ ఆ అవకాశం కొంతమందికే దక్కుతుంది. దీనికి మనలో చాలామంది జన్యువుల అమరిక అని.. ఆహార, వ్యవహారాలని... శారీరక శ్రమ అని రకరకాల కారణాలు చెబుతుంటాం కూడా. కానీ సైన్స్ మాత్రం ఇవన్నీ అర్ధసత్యాలేనని... అన్నింటినీ కలిపిన జీవనశైలితోనే వయసును జయించే వరం అందరికీ లభిస్తుందని వేర్వేరు పరిశోధనల ద్వారా స్పష్టం చేస్తోంది. ఇంతకీ వయసై పోవడమంటే...? వృద్ధులకు నిర్వచనం స్పష్టంగా చెప్పడం కొంచెం కష్టమే. పుట్టుక తరువాత కాలంతోపాటు శరీరంలో వచ్చే మార్పులని వికీపీడియా చెబుతుంది. ఇది బహుముఖమైందని, భౌతిక, మానసిక, సామాజిక మార్పులూ కలిసి ఉంటుందనీ అంటుంది. జీవశాస్త్రం ప్రకారం చూస్తే మాత్రం వయసు మీరడం రెండు రకాలని, ఒకటి క్రమానుగతమైంది (పుట్టిన రోజులు), రెండోది కణ విభజనకు సంబంధించినది. దీర్ఘాయువు కావాలనుకునే వారికి కణ విభజన తాలూకూ వ్యవహారం కీలకమవుతుంది. పుట్టుక మొదలుకొని మరణం వరకూ ప్రతి క్షణం శరీరంలోని కణాలు విడిపోతూ ఉంటాయన్నది మనకు తెలిసిన విషయమే. ఈ కణాల్లోని క్రోమోజోమ్లలోనే మనిషి జన్యుక్రమం (డీఎన్ఏ పోగు) ఉంటుందన్నదీ చదువుకుని ఉంటాం. కాలం గడిచే కొద్దీ ఒక కణం రెండుగా రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా... ఇలా విడిపోయే వేగం తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలోనే క్రోమోజోమ్‌ల చివర రక్షణ కవచంగా ఉండే టెలిమోర్ అనే తోకలాంటి నిర్మాణం పొడవూ తగ్గిపోతుంది. యువకులుగా ఉన్నప్పుడు టెలిమెరేస్ అనే ఎంజైమ్ పుణ్యమా అని పొడవు తగ్గడం కొంచెం నెమ్మదిగా సాగితే... ఆ తరువాత ఇది క్రమేపీ రెండుగా విడదీయలేనంత స్థాయికి తగ్గిపోతోంది. ఈ దశలో కణం విడిపోవడం ఆగిపోతుంది. ఫలితంగా కేన్సర్ మొదలుకొని అనేక వృద్ధాప్య సంబంధిత రుగ్మతలు, సమస్యలు చుట్టుముడతాయి. ఇతర కారణాల తోడైతే... మనం ఎంత కాలం జీవించి ఉంటామన్నది టెలిమోర్ల పొడవు ఒక్కటే నిర్ణయించదు. ఆక్సిడేటివ్ రస్ట్రెస్, గ్లైటేషన్ (ప్రొటీన్లు, కొవ్వులతో చక్కెరలు ఏర్పరచుకునే రసాయనిక బంధం) వంటి ఇతర కారణాలు వృద్ధాప్య సమస్యలకు కారణాలవుతాయి. గ్లైటేషన్నే ఉదాహరణగా తీసుకుందాం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోనూ ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. శరీరంలో మరీ ముఖ్యంగా రక్తంలో జరిగే గ్లైటేషన్ కారణంగా కొన్ని వ్యర్థ పదార్థాలు ఏర్పడుతుంటాయి. వీటిని అడ్వాన్స్డ్ గ్లైటేషన్ ఎండ్ ప్రొడక్ట్ క్లుప్తంగా ఏజ్లని అంటారు. శరీరంలో ఈ ఏజ్ల మోతాదు ఎక్కువైన కొద్దీ మధుమేహం, ఆర్థెరోస్క్లిరోసిస్ (రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం) వంటి వ్యాధులు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధులతోపాటు కేన్సర్‌కు కూడా కొన్ని రకాల ఏజ్‌లు కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ధూమపానం వంటి అలవాట్లతో శరీరంలో ఏజ్ల మోతాదు పెరిగిపోతుందని ఇప్పటికే స్పష్టమైంది. పరిశోధనల సారం ఏమిటి? దీర్ఘాయువుకు జన్యువులే కీలకమని చాలాకాలంగా భావించినప్పటికీ ఇటీవలి కాలంలో ఈ దృక్పథంలో స్పష్టమైన మార్పు వచ్చింది. వృద్ధాప్యాన్ని జయించే లక్ష్యంతో యుగాలుగా ఎన్నో ప్రయోగాలు జరిగినప్పటికీ గత 30 ఏళ్లలోనే మనిషి ఎంతో కొంత ప్రగతి సాధించగలిగాడు. జన్యుక్రమాన్ని తెలుసుకుని 13 ఏళ్లు మాత్రమే అవుతూంటే... టెలిమోర్ల గురించి తెలిసిందే 2009లో. గత ఏడాది జరిగిన పరిశోధనలను తీసుకుంటే.... ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో తొలిసారి ముసలితనాన్ని వెనక్కు మళ్లించవచ్చునని తెలిసింది. వయసుతోపాటు మన శరీరాల్లో తగ్గిపోయే ఒక పదార్థాన్ని మళ్లీ చేర్చడం ద్వారా ఇది సాధ్యమని న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తేల్చారు. గత నెలలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ‘నేచర్’లో ప్రచురించిన వ్యాసం ప్రకారం... ముసలితనంలోనూ ఆరోగ్యంగా ఉండేందుకు సంతులిత ఆహారం, వ్యాయామం అత్యంత కీలకం. దీంతోపాటు కణాలపై వయసు చూపే దుష్ర్పభావాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యమే. ఇక గత ఏడాది కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనను చూద్దాం. దీని ప్రకారం... జీవనశైలిలో మార్పులతో టెలిమోర్ల పొడవును పెంచుకోవచ్చు. ఈ మార్పులు స్థూలంగా నాలుగు. మొదటిది... రోజూ వ్యాయామం చేయడం. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా లేదా ధ్యానం వంటి ప్రక్రియలను ఎంచుకోవడం రెండోది. ఇక మూడో మార్పు... ఎరుపు రంగు మాంసం ముట్టకుండా, మొక్కలు, చెట్ల నుంచి అందే ఆహారాన్ని తీసుకోవడం. చివరగా... అందరితో కలివిడిగా ఉండటం. ఈ మార్పులన్నీ చేపట్టిన వారి టెలిమోర్ పొడవు ఐదేళ్లలో పదిశాతం వరకూ పెరిగిందని, మామూలుగా ఉన్నవారిలో మాత్రం మూడు శాతం వరకూ తగ్గిందని ఈ పరిశోధన ద్వారా తెలిసింది. - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా చింతల్లేని వృద్ధాప్యానికి... అరవై ఏళ్ల వయస్సును ఇరవైకి మార్చడం ఇప్పటికైతే ఎవరికైనా అసాధ్యమే. కాకపోతే వయసు పెరిగినా యువకుల్లా కనిపించేందుకు... రోగాలు రాకుండా చూసుకునేందుకు... కంటి నిండా నిద్ర, ఒంటికి తగిన వ్యాయామం, మేలు చేసే ఆహారం అనే మూడు సూత్రాలు పాటిస్తే మంచిదన్నది పరిశోధనలు స్పష్టం చేస్తున్న విషయం. ఏది ఎంత మోతాదులో ఉండాలన్నది స్పష్టంగా చెప్పలేముకానీ... అన్నీ ఎంతో కొంత ఉండటం మంచిది. ఆహారం విషయంలో ఇది మరీ ముఖ్యం. ఎముకల దృఢత్వానికి కాల్షియం మంచిదని అందరూ చెబుతూంటారు. ఇది నిజం కూడా. అయితే 30 ఏళ్ల వయసు తరువాత శరీరం కాల్షియంను పీల్చుకునే మోతాదు తగ్గుతుంది. కాబట్టి యువకుడిగా ఉన్నప్పుడే వీలైనంత ఎక్కువ కాల్షియంను నిల్వ చేసుకోవడం మేలన్నది కొందరు శాస్త్రవేత్తల అంచనా. మహిళల్లో రుతుస్రావం నిలిచిపోయిన తరువాత కాల్షియం కోల్పోయే వేగం పెరుగుతుంది కాబట్టి చిన్న వయసులోనే కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వారికి ముఖ్యం. శరీర క్రియలకు మేలు చేసేవి, రోగాల నుంచి రక్షణ కల్పించే రసాయనాలు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చునని సైన్స్ చెబుతుంది. ఉదాహరణకు తృణధాన్యాలను తీసుకుందాం. మనం వాడే తెల్ల బియ్యంతో పోలిస్తే కొర్ర, జొన్న, రాగుల వంటి తృణధాన్యాల్లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని అప్పుడప్పుడైనా తీసుకోవడం మంచిది. ఇక ప్యాకెట్లలో లభించే, శుద్ధి చేసిన ఆహార పదార్థాలను తగ్గించాలి. రకరకాల పండ్లు, కాయగూరలు, ఆకుకూరల మోతాదును పెంచడం ద్వారా ముసలితనాన్ని దూరం చేయవచ్చు. అరవై ఏళ్లుపైబడ్డ వారు తమ ఆహారంలో ఎక్కువ పౌష్టికత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం శరీరాన్ని చురుకుగా చేయడంతోపాటు ఆయుష్షును కూడా పెంచుతుందన్నది మనకు తెలిసిన విషయమే. అలాగని మరీ రోజూ విపరీతంగా ఎక్సర్సైజ్లు చేయాల్సిన పనిలేదని... నడక, సైక్లింగ్, ఈత వంటివి కొద్దిమోతాదులో చేపట్టినా సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మోతాదు తక్కువగా ఉన్నప్పటికీ తగినన్ని ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉండేలా జాగ్రత్త పడటం ద్వారా రోగాల బారిన పడటాన్ని తగ్గించుకోవచ్చు. -
బ్యాక్టీరియా ఆదేశిస్తుంది... మనం పాటిస్తాం!
దేవుడు శాసిస్తాడు.. మనం పాటిస్తాం.. చాలామంది విశ్వాసం ఇది. అయితే.. తిండి విషయంలో మాత్రం మన కడుపులో ఉండే బ్యాక్టీరియానే మనకు దేవుడట. అది ఎలా ఆదేశిస్తే మనం అలాంటి ఆహారాన్నే ఎంచుకుంటామట! తమ పెరుగుదలకు ఏ ఆహారం అయితే బాగుంటుందో అలాంటి ఆహారాన్నే మనచేత తినిపించేందుకు పేగుల్లోని బ్యాక్టీరియా ప్రయత్నిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ఫ్రాన్సిస్కో శాస్త్రవేత్త కార్లో మాలే అంటున్నారు మరి. మనిషి పేగుల్లో లక్షలాది బ్యాక్టీరియాలు ఉంటాయని, వాటిలో ఎక్కువమొత్తంలో మేలు చేసేవేనన్న సంగతి తెలిసిందే. అయితే పేగుల్లోని బ్యాక్టీరియా తన ఇష్టాలకు అనుగుణంగా రసాయన అణువులను విడుదలచేస్తుందని, ఆ సంకేతాలు నాడీవ్యవస్థ ద్వారా మెదడుకు చేరి.. మనం ఆ ఆహారాన్నే ఎంచుకునేలా ప్రేరణ పొందుతామని కార్లో వెల్లడించారు. కానీ.. అంతిమంగా మనం తినే ఆహారాన్ని బట్టే పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపారు. మంచి బ్యాక్టీరియాను పేగుల్లోకి పంపితే.. స్థూలకాయం, అనారోగ్యపూరిత ఆహారపు అలవాట్లను సైతం అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. అన్నట్టూ.. రేపు మాంసం తినాలనో లేదా ఇంకేదైనా తినాలనో అని అనుకున్నప్పుడు పేగుల్లోని బ్యాక్టీరియా అందుకు ముందుగానే సిద్ధమైపోతుందట కూడా! -
వరదలను 11నెలలు ముందుగా గుర్తించొచ్చు !
న్యూయార్క్ : ప్రకృతిని అతలాకుతలం చేసే ప్రళయభీకర వరదలను 11 నెలలు ముందుగానే గుర్తించే విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. నదీ పరివాహకప్రాంతాల్లో గురుత్వాకర్షణ క్షేత్రాలను ప్రతినిమిషం గమనిస్తూ, వరదలు వచ్చే సమయాన్ని చాలా ముందుగా గుర్తించవచ్చునట. వర్షరుతువు నాటికి నదుల్లో. వాటి పరివాహక ప్రాంతాల్లో ఎంత నీరు నిల్వ ఉన్నదో, ఎంత నిల్వ ఉండగలతో లెక్కించి వరదల స్థితిగతులను తెలుసుకునే నవీనపద్ధతిని సైంటిస్టులు కనుగొన్నారు. ఉపగ్రహాల సాయంతో ఈ విధానం రూపొందించినట్టు కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన భూభౌతిక శాస్త్రవేత్తలు జె.టి .రీగర్, ఇర్విన్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో వర్ష నీటి స్థితిని పాత డేటా ప్రకారం లెక్కలు వేసి ప్రస్తుతం వచ్చే వరదలను అంచనా వేయవచ్చునన్నారు. తాము వేసిన లెక్కల ప్రకారం ఐదునెలలు ముందుగానే వరదల స్థితిని తెలుసుకోవచ్చునని, మరింత అధ్యయనం తర్వాత 11నెలల ముందుగానే తెలుసుకోవచ్చన్నారు. ఈ మేరకు ‘లైవ్‌సైన్స్’అనే మేగజైన్ తాజా సంచికలో పేర్కొన్నారు. ఈ కొత్త విధానంతో అనేక దేశాల్లో వరదలను ముందుగానే గుర్తించి ప్రమాదతీవ్రతను తగ్గించవచ్చునని మేగజైన్ వివరించింది. -
‘లా’ తో కార్పొరేట్ అవకాశాలు
గెస్ట్ కాలమ్ న్యాయశాస్త్రం అభ్యసిస్తే నల్లకోటు ధరించే న్యాయవాదిగా మాత్రమే ఉపాధి లభిస్తుంది అనేది గతం. నేటి కార్పొరేట్ ప్రపంచంలో న్యాయశాస్త్రం అభ్యసించిన వారికి బహుముఖ అవకాశాలు సొంతమవుతున్నాయి అంటున్నారు.. ప్రతిష్టాత్మక కాలిఫోర్నియా యూనివర్సిటీ- బర్క్లీ స్కూల్ ఆఫ్ లా కొత్త డీన్.. ఇండియన్ - అమెరికన్ న్యాయశాస్త్ర నిపుణులు సుజిత్ చౌదరి. కంపేరిటివ్ కాన్స్టిట్యూషన్ లా లో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ లా సిసిలియా గొయెట్జ్ ప్రొఫెసర్ ఆఫ్ లాగా విధులు నిర్వర్తిస్తున్నారు. జూలై 1 నుంచి కాలిఫోర్నియా యూనివర్సిటీ- బర్క్లీ స్కూల్ ఆఫ్ లా డీన్‌గా బాధ్యతలు చేపట్టనున్న సుజిత్ చౌదరితో ప్రత్యేక ఇంటర్వ్యూ... బర్క్లీ లా స్కూల్ డీన్‌గా ఎంపికవడంపై మీ అనుభూతి? బర్క్లీ లా స్కూల్ డీన్‌గా ఎంపికవడం జీవితకాల సాఫల్యంగా భావిస్తున్నాను. గతంలో ఎన్నో యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించినప్పటికీ.. కొత్త బాధ్యతలు గొప్ప ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బర్క్లీ లా స్కూల్లోని సాంస్కృతిక వైవిధ్యం, కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చే విధంగా అక్కడి ప్రొఫెసర్లు, విద్యార్థులు నిరంతరం చేపట్టే ప్రయోగాలు వంటి వాటిలో భాగస్వామిని కానుండటం చాలా సంతోషాన్ని ఇస్తోంది. న్యాయశాస్త్ర విభాగంలో గతంలో ఎన్నో విధులు విజయవంతంగా చేపట్టిన మీరు బర్క్లీ లా స్కూల్ డీన్‌గా ఎలాంటి ప్రణాళికలు అనుసరించనున్నారు? ఆధునిక యుగంలో ఎలాంటి లా స్కూల్ అయినా గొప్ప సంస్థగా అంతర్జాతీయ గుర్తింపు పొందాలంటే.. విద్యార్థులు, నిపుణుల దృష్టిలో మంచి పేరు గడించాలి. నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా నిలవాలి. అలాంటి గుర్తింపు లభించేలా అవసరమైన చర్యలు తీసుకుంటాను. ముఖ్యంగా పరిశోధన, ప్రయోగాత్మక విద్య, విధానాలపై నిపుణులను సమీకృతం చేసి ఒక బృందంగా ఏర్పరిచి మరింత నాణ్యమైన న్యాయ విద్యను అందించడమే నా ప్రధాన లక్ష్యాలు. ప్రస్తుత న్యాయ విద్య విధానంపై మీ అభిప్రాయం? ప్రస్తుతం న్యాయ విద్యకు ప్రాధాన్యం దినదిన ప్రవర్థమానం అవుతోంది. కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో న్యాయ విద్యలో సంస్కరణలు చేపట్టాలి. న్యాయ విద్యకు సంబంధించి చట్టాలు మారిన వెంటనే కరిక్యులంలో మార్పులు, చేర్పులు చేస్తున్నప్పటికీ.. విద్యార్థుల్లో ప్రయోగాత్మకత లోపిస్తోంది. కేస్ అనాలిసిస్, రియల్ టైం ఎక్స్పోజర్పై దృష్టి సారించాలి. విదేశాల్లో ‘లా’ విద్యపై భారతీయ విద్యార్థుల్లో ఆశించిన మేర అవగాహన ఉండట్లేదు. అదే విధంగా విదేశీ విద్య అనగానే.. ఎంఎస్, మేనేజ్మెంట్ వంటివే అనే కోణంలో ఆలోచిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇది కొంతమేర వాస్తవమే. విద్యార్థులకు విదేశాల్లో లా దిశగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దీన్ని గుర్తించాలి. ఆయా యూనివర్సిటీల వెబ్సైట్ల ద్వారా ఈ సమాచారం పొందొచ్చు. అమెరికాను పరిగణనలోకి తీసుకుంటే.. అన్ని యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు ఎంఎస్, మేనేజ్మెంట్ అనే కాకుండా.. అన్ని కోర్సుల్లోనూ అవకాశాలు కల్పిస్తున్నాయి. దాదాపు ప్రతి యూనివర్సిటీ కల్చరల్ డైవర్సిటీ, గ్లోబల్ ఆపర్చునిటీస్ పేరుతో విదేశీ విద్యార్థులకు కూడా పెద్దపీట వేస్తున్నాయి. అందుకే 2010- 2012 మధ్య కాలంలో అమెరికాలో విదేశీ విద్యార్థుల సంఖ్య ఆరు శాతం పెరిగింది. అందుబాటులోని అవకాశాల విషయంలో అవగాహన లేని కారణంగానే విదేశీ విద్య ద్వారా ‘లా’ కష్టం అనే అభిప్రాయం భారతీయ విద్యార్థుల్లో నెలకొంది. న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యకు గల అవకాశాలు? లా విద్యార్థులు చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుతో అకడెమిక్స్కు ఫుల్స్టాప్ పెడుతున్నారు. పీజీలో తమ స్పెషలైజేషన్‌కు అనుగుణంగా పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్ చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకుంటే కెరీర్ ఉన్నతంగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో పీజీ స్థాయిలో క్రేజీ స్పెషలైజేషన్స్? న్యాయవిద్యలో సంప్రదాయ ధోరణులతోపాటు ఆధునిక అంశాలు తోడవుతున్నాయి. కేవలం న్యాయవాదులుగా న్యాయస్థానాలకే పరిమితమయ్యే పరిస్థితుల నుంచి బహుళ అవకాశాల దిశగా విస్తరిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో బహుళ జాతి సంస్థల్లో, అంతర్జాతీయ కన్సల్టెన్సీల్లో స్థిరమైన వేతనంతో కూడిన ఉపాధి లభిస్తోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే.. కార్పొరేట్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ క్రేజీ స్పెషలైజేషన్స్‌గా పేర్కొనొచ్చు. అయితే స్పెషలైజేషన్‌ను ఎంచుకునే విషయంలో విద్యార్థులు తమ ఆసక్తి మేరకు అడుగులు వేయాలి. స్వయం ఉపాధి.. స్థిరమైన వేతనం.. మీ అభిప్రాయంలో కెరీర్ పరంగా ఏది మంచిది? న్యాయశాస్త్రానికి సంబంధించి నిర్దిష్టంగా ఒక మార్గమే విజయవంతమైన కెరీర్‌కు దోహదం చేస్తుందని చెప్పలేం. ఇది కూడా ఆయా విద్యార్థుల అభిరుచి మేరకు ఉంటుంది. వాక్పటిమ, కలివిడితనం ఉంటే న్యాయవాదిగా సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. అదే స్థిరమైన ఉపాధి, వేతనం కోరుకునే వారికి కూడా కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ‘లా’ ఔత్సాహిక విద్యార్థులకు మీరిచ్చే సలహా? కష్టించే తత్వం, సంప్రదింపులు జరిపే నేర్పు, సృజనాత్మక ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటివి ‘లా’లో చేరాలనుకునే విద్యార్థులకు ప్రధానంగా అవసరమైన లక్షణాలు. వీటిని సహజ ఆసక్తులుగా మలచుకుంటే.. ఈ రంగంలో బహుముఖ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. -
పెంకులకు పూత తో పొగమంచుకు చెక్...
వాయు కాలుష్యాన్ని నివారించేందుకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కొత్త ఐడియా కనుగొన్నారు. ఇళ్ల పైకప్పులపై ఓ పూత పూస్తే చాలు.. పొగమంచును చాలావర కూ తొలగించవచ్చని వారు చెబుతున్నారు. పైకప్పు పెంకులపై టిటానియం డయాక్సైడ్ మిశ్రమం పూతను పూస్తే గనక.. వాతావరణంలో పొగమంచు ఏర్పడేందుకు కారణమవుతున్న నైట్రోజన్ ఆక్సైడ్లను విచ్ఛిన్నం చేస్తుందని వారు అంటున్నారు. ఒక కారు సంవత్సరకాలంలో 17 వేల కి.మీ. దూరం నడిస్తే విడుదలయ్యే నైట్రోజన్ ఆక్సైడ్లను ఒక ఇంటి పైకప్పు పెంకులపై పూసే టిటానియం డయాక్సైడ్ మిశ్రమం 97 శాతం వరకూ తొలగిస్తుందట. సుమారు పది లక్షల పైకప్పులపై ఈ పూతను పూస్తే.. 21 టన్నుల నైట్రోజన్ ఆక్సైడ్‌ను గాలిలో నుంచి తొలగించవచ్చట. ఒక మామూలు ఇంటి పైకప్పుపై ఈ పూతను పూసేందుకు కేవలం 5 డాలర్ల ఖర్చే అవుతుందని, అందువల్ల ఇది ఆర్థికంగా కూడా పెద్దగా భారం కాబోదని పేర్కొంటున్నారు. -
ఉత్తర కాలిఫోర్నియా జడ్జిగా ఎన్నారై సునీల్
ప్రముఖ ఎన్నారై న్యాయవాది సునీల్ ఆర్ కులకర్ణి (41) ఉత్తర కాలిఫోర్నియా కోర్టుకు జడ్జిగా నియమితులయ్యారని భారతీయ సంతతి ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా వెస్ట్ పత్రిక శుక్రవారం ఇక్కడ వెల్లడించింది. ఆ పదవిని చేపట్టిన మొట్టమొదటి దక్షిణాసియా వాసిగా ఆయన చరిత్ర సృష్టించారని తెలిపింది.తనను ప్రధాన న్యాయమూర్తి పదవికి ఎంపిక చేసినట్లు గవర్నర్ కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్న తాను ఒక్కసారిగా ఆనందం కలిగిందని సునీల్ తెలిపారని పేర్కొంది. అమెరికాలో దక్షిణాసియా వాసులు చాలా మంది న్యాయవాద వృత్తిని ఎంచుకుని ఆ రంగంలో ముందుకు సాగుతున్నారని తెలిపారు. శ్రీకాంత్ శ్రీనివాసన్, పౌల్ సింగ్ అగర్వాల్, రూప ఎస్ గోస్వామి తదితర ఎన్నారైలు యూఎస్ న్యాయవ్యవస్థలో పలు కీలక స్థానాలను ఆధిరోహించిన సంగతిని సునీల్ ఆర్ కులకర్ణి ఈ సందర్భంగా గుర్తు చేశారు. లాస్ ఎంజిల్స్‌లో జన్మించిన కులకర్ణి కాలిఫోర్నియాలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారని చెప్పింది. యూసీ -బర్కిలీ నుంచి ఆయన బీఎస్ డిగ్రీ అందుకున్నారు. అలాగే యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా హస్టింగ్ కాలేజ్ నుంచి కులకర్ణి లా డిగ్రీ పట్టా పుచ్చుకున్నారని ఇండియా వెస్ట్ పత్రిక పేర్కొంది.