ఈ ఫిల్టర్‌తో విషం మాయం | Poison will remove with this filter | Sakshi
Sakshi News home page

ఈ ఫిల్టర్‌తో విషం మాయం

Published Sat, Mar 26 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

ఈ ఫిల్టర్‌తో విషం మాయం

ఈ ఫిల్టర్‌తో విషం మాయం

కోల్‌కతా: కోల్‌కతాలోని జాదవ్ పూర్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీర్లు నీటిలో విష రసాయనాలను తొలగించే సరికొత్త వాటర్ ఫిల్టర్‌ను తయారు చేశారు. జాదవ్ పూర్ వర్సిటీ సివిల్ ఇంజనీర్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అందించిన సాంకేతిక సహకారంతో ఫిల్టర్‌ను తయారు చేశారు. ఈ నీటి శుద్ధి యంత్రాన్ని 24 దక్షిణ పరగణ జిల్లాలోని బరూయ్‌పూర్ గ్రామ సమీపంలోని ఓ పాఠశాలలో విజయవంతంగా అమర్చారు.  ఇది రోజుకు 10 వేల లీటర్లను శుద్ధిచేస్తుంది.

‘జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు విషరసాయనాలతో కాలుష్య కాసారమైపోయాయి. ఈ వ్యర్థమైన నీటిని తాగునీటిగా మార్చేందుకుగాను ఈసీఏఆర్ (ఎలక్ట్రో కెమికల్ ఆర్సెనిక్ రెమిడియేషన్) సాంకేతికతను ఉపయోగిస్తున్నాము. కేవలం నీటిలోని విషరసాయనాలకే కాక ఇతర వ్యర్థాలను కూడా ఈ వాటర్ ఫిల్టర్ తొలగిస్తుంద’ని ఈ ప్రాజెక్టు సమన్వయకర్త జాయ్‌శ్రీ రాయ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement