లాస్ ఎంజిలస్: కారును ఎండలో పార్క్ చేసిన గంటలో దాని లోపలి ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని, దీంతో కారు లోపల చిక్కుకున్న చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో–అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వేసవికాలంలో ఎకానమీ, మిడ్ సెడాన్, లగ్జరీ సెగ్మెంట్లకు చెందిన 6 కార్లను వీరు అధ్యయనం చేశారు. కారులో ఉష్ణోగ్రత మార్పు కారణంగా రెండేళ్ల చిన్నారులపై పడే ప్రభావాన్ని పరీక్షించారు. ఇందులో కారును ఎండలో పార్క్ చేసిన గంటలో స్టీరింగ్ వద్ద 52, సీట్ల దగ్గర 50 డిగ్రీలు, డాష్ బోర్డు వద్ద 69 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నీడలో నిలిపిన గంటలో కారు లోపల 37డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment