life threat
-
సోషల్‌మీడియా కార్యకర్తలకు ప్రాణహాని..జనసేన శ్రేణుల దుశ్చర్య
సాక్షి,విజయవాడ : సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాణహాని తలపెట్టేలా కూటమి పార్టీల చర్యలున్నాయి. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రహస్య సమాచారం బయటికి పొక్కి సోషల్‌మీడియా కార్యకర్తల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని జనసేన సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేస్తోంది.కేవలం పోలీసులు వద్ద ఉండాల్సిన సమాచారాన్ని సోషల్‌మీడియాలో పెట్టి బహిరంగపరుస్తున్నారు.తాజాగా సోషల్‌మీడియా యాక్టివిస్టు అనిల్ నాయక్ లొకేషన్‌ను జనసేన కార్యకర్తలు సోషల్‌మీడియాలో పోస్టుచేశారు. లొకేషన్‌ను అక్షాంశాలు,రేఖంశాలతో సహా పోస్ట్ చేశారు.ఈ పోస్టులతో తనకు ప్రాణహాని కలిగేలా చేస్తున్నారని అనిల్‌నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టులు చట్ట వ్యతిరేకమని ఆయన ఆరోపించారు.Shocking breach! Sensitive data, meant only for police access, is now public. If this isn’t dealt with seriously, privacy in AP is doomed, paving the way for dangerous misuse. If a third party is involved, they need to be held accountable . pic.twitter.com/sbeUfL01hp— bagira (@bigcatt09) December 2, 2024 -
నర్గీస్‌ను చంపేందుకు కుట్ర
టెహ్రాన్: నోబెల్ గ్రహీత, మానవ హక్కుల కార్య కర్త నర్గీస్ మొహమ్మదీని చంపేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె కుటుంబం ఆరోపించింది. కేన్సర్ నిర్ధారణకు అవసరమైన కీలకమైన శస్త్రచికిత్సను నిరాకరించి, నెమ్మదిగా ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమవుతోందని తెలిపింది. ఆమె కుడి కాలు ఎముక గాయా న్ని వైద్యులు ఇటీవల గుర్తించారని, క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన బయాప్సీకోసం శస్త్రచికిత్సకు అవకాశం ఇవ్వకుండా ఆమె ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని కుటుంబం వెల్లడించింది. చికిత్సలో మరింత జాప్యం జరిగితే ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. సంవత్సరాల తరబడి జైలు జీవితం, సుదీర్ఘకాలం ఏకాంత నిర్బంధం ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, కేవలం ఆస్పత్రి సందర్శనలతో చేసే చిన్న చికిత్స ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయలేదని వారు తెలిపారు. కాగా, ఇటీవల ఎంఆర్ఐలో ఆర్థరైటిస్, డిస్క్ వ్యాధి ఉన్నట్లు బయటపడిందని, 2021లో గుండెపోటుకు గురైన తర్వాత ఆమె గుండె ధమనుల్లో ఒకదానికి యాంజియోగ్రఫీ చేయాలని వైద్యులు సూచించారని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖులు సైతం మొహమ్మదీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘నిర్బంధంలో ఉన్న మొహమ్మదీకి అవసరమైన వైద్య సంరక్షణను నిలిపివేస్తూ ఇరాన్ అధికారులు ఆమెను నెమ్మదిగా చంపుతున్నారు’అని హిల్లరీ క్లింటన్ గత శుక్రవారం తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొహమ్మదీ రెండు దశాబ్దాలుగా టెహ్రాన్ లోని ఎవిన్ జైలులో ఖైదీగా ఉన్నారు. ఇరాన్లో మానవ హక్కులకోసం, మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గీస్ 2011లో తొలిసారి అరెస్టయ్యారు. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్ పొందిన ఆమె.. 2015లో మళ్లీ జైలుకు వెళ్లారు. జైలులోనూ ఆమె పోరాటాన్ని ఆపలేదు. మహిళల హక్కులతో పాటు, మరణశిక్ష రద్దు, ఖైదీల హక్కుల కోసం కూడా పోరాడారు. జైలులో ఉన్నప్పటికీ మొహమ్మదీ మానవ హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఇందుకుగాను 2023 సంవత్సరంలో మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. -
వైఎస్ జగన్‌కు ప్రాణహాని ఉంది
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రాణహాని ఉందని రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్ఆర్సీ) అంగీకరించింది. ప్రాణహాని విషయంలో తాజా నివేదికను విశ్లేషించిన తరువాతే జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని సిఫారసు చేశామని ఆ కమిటీ హైకోర్టుకు వివరించింది. జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని, ఆయన ఇంకా బతికే ఉన్నారని, చచ్చే వరకు కొట్టాలంటూ నర్సీపట్నం ఎమ్మెల్యే, శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మరో టీడీపీ నేత మధ్య సాగిన సంభాషణ కూడా నిజమేనని అంగీకరించింది. ఇవి అయ్యన్నపాత్రుడు స్పీకర్ కాక ముందు మాట్లాడిన మాటలని తెలిపింది. ఆ వీడియోను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పింది. ఈ సంభాషణకు, వైఎస్ జగన్‌కు ప్రాణహాని ఉందనేందుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. వైఎస్ జగన్ సొంత వాహనమైన టయోటా ఫారŠుచ్యనర్కు బుల్లెట్ ప్రూఫ్ చేసుకునేందుకు అనుమతినిచ్చామని పేర్కొంది. ప్రాణహాని నేపథ్యంలో నాటి భద్రత పునరుద్ధరణకు జగన్ పిటిషన్తనను అంతమొందించడమే ప్రస్తుత కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ నేపథ్యంలో తనకున్న ప్రాణహానిని పరిగణనలోకి తీసుకోకుండా భద్రతను భారీగా కుదించేసిందంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది జూన్ 3 నాటికి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ఎస్ఆర్సీని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఎస్ఆర్సీ తరఫున ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) డీఐజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్పీ ఎస్.నచికేత్ విశ్వనాథ్ కౌంటర్ దాఖలు చేశా>రు. భద్రత విషయంలో జగన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి గురువారం మరోసారి విచారణ జరిపారు. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేసినట్లు హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి చెప్పగా.. కౌంటర్ బుధవారం సాయంత్రం అందజేశారని, తాము సమాధానం (రిప్లై) ఇస్తామని జగన్ తరఫు న్యాయవాది చింతల సుమన్ తెలిపారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. నిర్దిష్టంగా వాయిదా తేదీ ఇవ్వాలని సుమన్ కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 13కి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.ఎస్ఆర్సీ కౌంటర్లోని ముఖ్యాంశాలు‘జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎల్లో బుక్ ప్రకారం జెడ్ కేటగిరీ భద్రత ఉండేది. ముఖ్యమంత్రి అయిన తరువాత దానిని జెడ్ ప్లస్ కేటగిరీకి మార్చి 58 మందితో భద్రత కల్పించాం. ఈ ఏడాది జూలై 16న కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి హోదా ఆధారిత భద్రత కల్పించాలని, ఓడిపోయిన వారికి హోదా ఆధారిత భద్రతను తొలగించాలని సిఫారసు చేశాం. అలాగే జగన్మోహన్రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగించాలని కూడా సిఫారసు చేశాం. జగన్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన భద్రత బాధ్యతలను డీఎస్పీకి అప్పగించాం. జగన్ భద్రత విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం కల్పిస్తున్న భద్రత సరిపోదని చెప్పేందుకు జగన్ ఎలాంటి ఆధారాలను చూపలేదు. ప్రాణహాని ఉందనేందుకు జగన్ ఎలాంటి ఆధారాలు చూపలేదు. భద్రతను 59కి కుదించిన తరువాతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలి కాలంలో ఆయనకు ప్రాణహాని కలిగించే ఘటనలేవీ జరగలేదు. ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్ వినియోగం ఉన్న చోటే జామర్లను అనుమతిస్తాం. అలాంటి ప్రాంతాలకు జగన్ వెళితే అప్పుడు లభ్యతను బట్టి జామర్లు ఏర్పాటు చేస్తాం’ అని నచికేత్ విశ్వనాథ్ తన కౌంటర్లో పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జగన్ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. -
ముకేశ్ అంబానీకి బెదిరింపులు..
-
యోగిని, నన్ను చంపేస్తారట: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. చంపేస్తానంటూ కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెబుతున్నారాయన. ఫోన్లో చంపుతాం.. నరుకుతాం అని కొందరు భయపెడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాగే కాల్స్ వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ త్వరలో నా నియోజకవర్గానికి వస్తున్నారు. మా ఇద్దరినీ కలిపి చంపుతామని ఇప్పుడు భయపెడుతున్నారని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని అంటున్నారాయ. -
లోకేశ్‌తో నాకు ప్రాణహాని: పోసాని
సాక్షి, అమరావతి : టీడీపీ నేత నారా లోకేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగాభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర ఆరోపణ చేశారు. అందుకోసమే తనపై పరువునష్టం దావా వేశారని.. ఈ కేసులో మంగళగిరి కోర్టుకు వెళ్లివచ్చే సమయంలో తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే దానికి లోకేశే కారణమని ఇదే తన మరణ వాంగ్మూలంగా భావించాలన్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. పోసాని ఇంకా ఏమన్నారంటే.. గతంలో లోకేశ్ నన్ను పార్టీలోకి రావాలని కోరారు. నేను నిబద్ధత కలిగిన నాయకుల వెంటే ఉంటానంటూ తిరస్కరించా. పైగా వారి అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాను. అందుకే వాళ్లు నాపై కక్షగట్టారు. నేను ఎప్పుడో కంతేరులో లోకేశ్ భూములు కొన్నారని చెప్పానట. దానిని పట్టుకుని నాపై రూ.4 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. రెండేళ్లు జైలుశిక్ష కూడా వేయిస్తారట. కంతేరులో హెరిటేజ్ పేరిట భూములు కొన్నది వాస్తవం కాదా? లోకేశ్ భూములు దోచేశారు.. కబ్జా చేశారనలేదే నేను. కొన్నారనే చెప్పాను. మీ కుటుంబ సభ్యులు కొంటే నీకు సంబంధం లేదా? మీ తల్లి, భార్య పేరు మీద ఉన్న ఆస్తులు ఎవరికి లోకేశ్? పవన్ వ్యాఖ్యలు మర్చిపోయారా? అల్‌ఖైదా అంటే లాడెన్ గుర్తొచ్చినట్లు.. హెరిటేజ్ అంటేనే చంద్రబాబు గుర్తొస్తారు. నిత్యం బూతులతో జపంచేసే లోకేశ్‌పై తాను పరువు నష్టం కేసువేస్తే 20 ఏళ్లు జైలులో ఉండాల్సి ఉంటుంది. గతంలో దళితులు, సీఎం జగన్‌ను, పోలీసు అధికారులను దుర్భాషలాడిన లోకేశ్ వీడియోలను, విదేశీ మహిళలతో అర్ధనగ్నంగా దిగిన ఫొటోలను మీడియా ఎదుట పోసాని ప్రదర్శించారు. గతంలోనే లోకేశ్ బతుకును వపన్‌కళ్యాణ్ రోడ్డున పడేశారు. ప్రతి నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం చేశారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా? సమాజంలో బూతులు మాట్లాడేవాళ్ల కంటే బూతుపనులు చేసే లోకేశ్ లాంటి వ్యక్తులతోనే ఎక్కువ ప్రమాదం. చంద్రబాబుకు వ్యవస్థలను మేనేజ్ చేసే సత్తా ఉంది. అందుకే 16 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు. పుంగనూరులో పోలీసులపైనే దాడులు చేయించారు. నేనెంత బక్కవాడిని. లోకేశ్ ఏంచేసినా కాపాడటానికి చంద్రబాబు ఉన్నారు. లోకేశ్ కంటే నాకు విశ్వసనీయత ఎక్కువ ఉంది.. అంతేగాని, అమ్ముడుపోయే వాడిని కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవొచ్చు.. కమ్మ కులమే గెలవాలనుకోవడం దుర్మార్గం. ఎవరు గెలిచినా ప్రజలకు ఎంత మంచి చేస్తున్నారో చూడాలే తప్ప కులం దురాభిమానంలో పడకూడదు. రాజధానిలో ఐదు శాతం భూములు పేదలకు ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ చంద్రబాబు దానిని తుంగలో తొక్కారు. రాజధానిలో పేదలకు సెంటు భూమి ఇవ్వడంలో తప్పేంటని నేను ప్రశ్నిస్తే.. ఓ కమ్మ రైతు పెదకాకానిలో నాకున్న 16 ఎకరాలు ఇవ్వమంటూ బూతులు తిట్టాడు. అసలు నాకు అక్కడ భూమేలేదు. ఐదారు ఇళ్ల స్థలాలు, రెండు పెంకుటిళ్లు ఉన్నాయి. జగ్గయ్యపేట దగ్గర 30 ఏళ్ల కిందట కొన్న కొంత భూమి ఉంది. మా నాన్న డబ్బులేక ఆత్మహత్య చేసుకున్నారు. నేను సినిమాల్లోకి వెళ్లిన తర్వాతే సంపాదించుకున్నా. అయినా, ఏపీలోని నా ఆస్తి మొత్తం పేద ప్రజలకు ఇచ్చేస్తా.. రాజధాని రైతులకు మానవత్వం ఉంటే పేదలకు సెంటు భూమి ఇవ్వండి. కోర్టు కేసులను వెనక్కితీసుకోండి. రాజధాని భూముల్లో వ్యాపారం తప్ప త్యాగాల్లేవు. వైఎస్సార్ రూ.11వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తే అందులో మా కులం వాళ్లు కూడా లబ్ధిపొందారు.. ఇప్పుడు పేదలకు తమ భూములు ఇవ్వొద్దని వారు చెప్పడం సిగ్గుచేటు. -
ఎమ్మెల్యే మైనంపల్లి నుంచి ప్రాణహాని ఉంది
పంజగుట్ట: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఇటీవల అజ్ఞాతంలోకి వెళ్లి వార్తల్లో నిలిచిన రియల్టర్ ముక్కెర తిరుపతిరెడ్డి కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం చేయడంలేదన్నారు. అల్వాల్ హిల్స్, హైటెన్షన్ రోడ్డులో తనపేరుమీద, తన భార్య, భార్య సోదరి పేరుపై మొత్తం 3.31 ఎకరాల భూమి ఉందని, దీని పక్కనే మైనంపల్లికి చెందిన 1.9 ఎకరాల భూమి ఉందని, దీన్ని ఆధారంగా చేసుకుని తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. మైనంపల్లి అనుచరులు తనను చంపేందుకు యత్నిస్తున్నారని, అందుకే తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్, డీసీపీని కలిసి తనకు ప్రాణాపాయం ఉందని వివరించినట్లు తెలిపారు. సమావేశంలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి, బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్, బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వినర్ ఆర్.కె.శ్రీనివాస్, బీజేపీ మౌలాలి కార్పొరేటర్ సునీతా యాదవ్, బీజేపీ నాయకులు జి.కె.హనుమంతరావు, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. -
నన్ను చంపేస్తారు.. భద్రత కల్పించండి: ఇమ్రాన్ ఖాన్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ప్రాణ భయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భద్రత కల్పించాలంటూ ఆ దేశ చీఫ్ జస్టిస్ బుమర్ అట బండయల్కు ఓ లేఖ రాశారు. పలు కేసుల్లో విచారణ నిమిత్తం కోర్టులకు హాజరయ్యే అవకాశం ఉన్నందున తనకు భద్రత అవసరమంటూ అందులో విజ్ఞప్తి చేశారాయన. నా ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుంచి పరిస్థితి చాలా దారుణంగా మారింది. నాపై కేసులు నమోదు అవుతున్నాయి. చివరికి.. నన్ను చంపేయత్నం కూడా జరిగింది అని లేఖలో పేర్కొన్నారాయన. తాను దేశ మాజీ ప్రధాని అయినప్పటికీ తగిన భద్రత కల్పించడం లేదని ఇమ్రాన్ ఖాన్.. పాక్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో తనపై జరిగిన హత్యాయత్నంలో ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రమేయం ఉందని ఆరోపించారు. తనపై మరో హత్యాయత్నం జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఇవాళ్టి వరకు నాపై 74 కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లో అతి పెద్ద రాజకీయ పార్టీకి ఛైర్మన్ నేను. కాబట్టే, నేను ఎక్కడికి వెళ్లినా జనసందోహం ఎక్కువగానే ఉంటుంది. ఇదే అదనుగా నన్నే చంపేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇందుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు కూడా అందుతున్నాయి అని లేఖలో పేర్కొన్నారాయన. గతంలో లాహోర్ హైకోర్టుకు వెళ్లినప్పుడు భద్రతా వైఫల్యం తలెత్తిందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని, తన ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని అన్నారాయన. మరోవైపు తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఆదివారం లాహోర్‌లోని ఆయన ఇంటి వద్ద పెద్ద హైడ్రామానే నడిచింది. -
Karate Kalyani: కక్షకట్టి హతమార్చాలని చూస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: తన ప్రాణానికి ముప్పు ఉందని తనకు రక్షణ కల్పించాలంటూ సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిందని బయట పెడుతున్నందుకు తనపై కక్షకట్టి తనను హతమార్చాలని చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు. చదవండి: (మరోసారి వార్తల్లోకి నయనతార, విఘ్నేష్ శివన్) -
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్
సినిమా చూస్తే.. సింపుల్‌గా ప్రాణాలు పోతాయి అక్కడ ! నచ్చిన బట్టలు, హెయిర్ స్టైల్ చేసుకున్నా.. తీసి జైళ్లో పడేస్తారు. సరదాగా ఏదైనా పని చేస్తే.. బతుకంతా ఏ గనుల్లోనో, పల్లెటూరిలోనో వెట్టిచాకిరీకి అంకితం చేస్తారు. చివరికి సంబురాలు, ఏడుపులపై కూడా నిషేధాజ్ఞాలు. పాపం.. అక్కడి జనాలకు ఏం చేయాలన్నా ఆటంకాలే. అక్కడి చట్టాలు.. అవి తయారు చేసే నియంతాధ్యక్షుడు అలాంటోడు!. ప్రపంచమే ఆయన్ని చూసి ముక్కున వేలేసుకుంటుంది మరి. కిమ్ జోంగ్ ఉన్.. తమ దేశ అధ్యక్షుడి పేరు వింటే ఉత్తర కొరియా జనాలకు కంటి మీద కునుకు పట్టదు. ఏ పూట ప్రభుత్వం తరపునుంచి ఎలాంటి ప్రకటన వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు. అదే టైంలో సిసలైన ఆ నియంత కొత్త కొత్త నిర్ణయాలనూ ప్రపంచమూ ఆసక్తిగా గమనిస్తుంటుంది. కిమ్‌కు కోపం తెప్పించే పని ఎవరూ చేసినా వాళ్ల పని ఖతం. అలాంటిది ‘ఒక్కడు’ దాయాదిగడ్డపై కిమ్‌ను ఎగతాళి చేస్తూ పదేళ్లుగా కాలరేగరేసి మరీ బతికేస్తున్నాడు. కిమ్ మిన్ యోంగ్.. వయసు ముప్పై పదుల్లో ఉంటుంది! ఉండేది సియోల్(సౌత్ కొరియా) నగరంలో. బొద్దు రూపంతో నార్త్ కొరియా అధ్యక్షుడికి దూరం పోలికలే ఉంటాయనుకోండి. అయితే అనుకరణ మాత్రం అచ్చంగా ఉంటుంది. దీనికి తోడు కిమ్ హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్‌ను యాజ్ ఇట్ ఈజ్‌గా దించేస్తాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొరివితో తలగొరుకునే చేష్టలకు పాల్పడుతున్నాడతను. కిమ్ పదేళ్ల క్రితం అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ టైంలో కిమ్ మిన్ అమెరికా యూనివర్సిటీలకు వెళ్లే స్టూడెంట్స్‌కి కౌన్సిలింగ్ ఇచ్చి బతికేవాడు కిమ్ మిన్. కానీ, కిమ్‌లా ఉన్నాడంటూ.. ఇమిటేట్ చేస్తున్నాడంటూ కొందరు కాంప్లిమెంట్ ఇవ్వంతో.. అప్పటి నుంచి నియంత నేతను అనుకరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు మొదలుపెట్టాడు. అవి అలాంటి ఇలాంటి వీడియోలు కావు. కిమ్ పరువు తీసిపడేసేలా ఉంటాయి అతను ఎంచుకునే కాన్సెప్ట్‌లు. మొదట్లో హ్యూమర్‌గా జనాలు వాటిని ఎంజాయ్ చేశారు. ‘డ్రాగన్ కిమ్’ అంటూ అతగాడికి బిరుదు కూడా ఇచ్చేశారు. అయితే రాను రాను అవి మరీ ఘోరంగా ఉంటున్నాయి. దీంతో ఇప్పుడు బెదిరింపులు మొదలయ్యాయట. తాజాగా ఓ ఇంటర్నేషనల్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రాణ భయం గురించి చెప్పుకొచ్చాడు డ్రాగన్ కిమ్. ఆన్లైన్లో మిన్ యోంగ్‌కు బెదిరింపులు వస్తున్నాయట. if you mock our Dear Leader, you will be in trouble, like, big trouble!ఇది ఇప్పుడు ఇంటర్నెట్లతో మిన్ యోంగ్ వస్తున్న సందేశాలు. అంతేకాదు అతని చావు ఊహించని రీతిలో ఉంటుందని బెదిరిస్తున్నారట. దీంతో ప్రాణభయంతో అతగాడు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు పోలీసులు నగరం విడిచి వెళ్లకుంటే రక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం ఇతగాడి భద్రత అంశం హాట్ టాపిక్‌గా మారింది సౌత్ కొరియాలో. కొసమెరుపు.. 2019లో వియత్నాం వేదికగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌లు భేటీ అయ్యారు. ఆ సమయంలో డ్రాగన్ కిమ్ కూడా అక్కడే ఉన్నాడు. అంతేకాదు వెకిలి వేషాలు వేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఆరు రోజులు జైల్లో పెట్టారు. కిమ్ మిన్ మాత్రమే కాదు.. కిమ్ జోంగ్ ఉన్, ట్రంప్ పోలికలతో ఉన్న ఇద్దరు వ్యక్తులను సైతం వియత్నాం పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: నార్త్ కొరియా: లెదర్ జాకెట్లు బ్యాన్, కారణం తెలిస్తే తిట్టిపోస్తారు -
రెండేళ్లుగా ప్రేమ.. 9 రోజుల క్రితం పెళ్లి.. రక్షణ కల్పించండి
కామేపల్లి: ఓ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం కామేపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. పింజరమడుగు గ్రామానికి చెందిన కర్రి దేవా, తాళ్లగూడెంకు చెందిన బండారి కావ్యలు డిగ్రీ చదువుతున్నారు. వీరు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కావ్యకు తల్లిదండ్రులు వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తుండగా గత తొమ్మిది రోజుల కిందట ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుని..గురువారం కామేపల్లి ఠాణాకు వచ్చారు. 'మా కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉంది.. మమ్మల్ని కాపాడండి' అని ఫిర్యాదు చేశారు. కాగా ఎస్సై జి.స్రవంతి ప్రేమజంటకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మేజర్లు కావడం, విడిపోడానికి ఇష్టపడకపోవడంతో కావ్యను అబ్బాయి దేవా కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామపెద్దలు వీరిద్దరికీ తాళ్లగూడెం ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేశారు. -
ప్రాణహాని.. షీలాపై తండ్రి సంచలన ఆరోపణ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు షీలా రషీద్‌పై ఆమె తండ్రి అబ్దుల్ సోరా సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కశ్మీర్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి పెద్ద ఎత్తను నగదు జమచేస్తోందని పేర్కొన్నారు. తన కూతురుకు చెందిన ఎన్జీవోపై వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ డీజీసీ దిబాగ్ సింగ్‌కు సోమవారం రాత్రి మూడు పేజీల లేఖను రాశారు. ఆ లేఖలో పలు సంచలన ఆరోపణలు చేశారు. ‘నా కూతురు షీలా, భార్య, చిన్న కూతురు నుంచి నాకు ప్రాణహాని, మా ఇంటి సెక్యూరిటీతో కలిసి నన్ను హతమార్చేందుకు కుట్రపన్నుతున్నారు. సంఘ విద్రోహ శక్తులతో కలిసి షీలా దేశ వ్యతిరేక కుట్రలకు పాల్పడుతోంది. ఆమెకు పెద్ద ఎత్తున డబ్బు కూడా అందుతోంది. ఓ మాజీ ఎమ్మెల్యే, వ్యాపారవేత్త నుంచి ఇటీవల మూడు కోట్ల రూపాయాలు అందాయి. ఆమె నిర్వహిస్తున్న ఎన్జీవో ఎన్నో అక్రమాలకు పాల్పడుతోంది. దీనిపై వెంటనే దర్యాప్తు జరిపించాలి. నన్ను ఇంట్లో బంధించిన గృహహింసకు పాల్పడుతున్నారు. వారి నుంచి నాకు రక్షణ కల్పించండి’ అంటూ డీజీపీకి రాసిన లేఖలో షీలా తండ్రి సోరా పేర్కొన్నారు. సోరా లేఖను స్వీకరించిన పోలీసులు.. దీనిపై త్వరలోనే విచారణ చేపట్టనున్నారు. కాగా జేఎన్‌యూలో విద్యార్థి నేతగా వెలుగులోకి వచ్చిన షీలా.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కశ్మీర్ విభజనకు వ్యతిరేకంగా గళం విప్పి.. నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. గతంలో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. మరోవైపు తండ్రి చేసిన ఆరోపణలను షీలా తీవ్రంగా ఖండించారు. తాము సోరాను ఎంతో బాగా చూసుకుంటామని, ఇలాంటి ఆరోపణలు చేస్తారని అస్సలు ఊహించలేదని తెలిపారు. దీనిపై చట్టపరమైన పోరాటం చేస్తానని పేర్కొన్నారు. -
హత్యా బెదిరింపులు: సీఎంకు ఎమ్మెల్యే ఫిర్యాదు
లక్నో: గ్యాంగ్స్టర్లకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్‌లో ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ కరువైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పాలనా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. వారిలో మాత్రం ఏమాత్రం మార్పు రావడంలేదు. గ్యాంగ్‌స్టర్ వికాశ్ దుబే ఎన్కౌంటర్ ఉదంతం మరువకముందే మరో క్రిమినల్ ఏకంగా ఓ ఎమ్మెల్యేపై హత్యా బెదిరింపులకు దిగాడు. యూపీలోని భాగ్‌పట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యోగేష్ దామాకు గ్యాంగ్‌స్టర్ సునిల్ రాతి నుంచి హత్యా బెదిరింపులు ఎదురైయ్యాయి. దీంతో భయాందోళనకు గురైన ఎమ్మెల్యే మంగళవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డీజీపీ హితేష్ చంద్ర అవస్థీలకు ఫిర్యారు చేశారు. గ్యాంగ్‌స్టర్ నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. (22 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్, కానీ..) అనంతరం మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. సునిల్‌కు సంబంధించిన అక్రమ మైనింగ్‌ను తాను అడ్డుకున్నాని, దానికి ప్రతీకారంగానే తనపై బెదిరింపులకు దిగాడని తెలిపారు. దీనిపై సీఎం యోగి సానుకూలంగా స్పందించి భరోసా ఇచ్చారని చెప్పారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న నేరగాళ్ల పనిపడుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో పేరుమోసిన నేరగాళ్లలో ఒకడైన సునిల్ రాతి 2018లో జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అతనిపై మరొకొన్ని కేసులు కూడా నమోదై ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆయనకు భద్రతను పెంచారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని స్థానిక ఎస్పీ తెలిపారు. -
భద్రత కల్పించాలని కోరిన మేరుగ నాగర్జున
సాక్షి, అమరావతి: వేమూరు నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలు, బెదిరింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ నాగార్జున తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిని నాగార్జున.. వేమూరు నియోజకవర్గంలో పోలింగ్ రోజున టీడీపీ నేతలు సాగించిన దాడులపై ఫిర్యాదు చేశారు. వేమూరు నియోజకవర్గంలోని బూతుమల్లి గ్రామంలో తనపై జరగిన దాడి, కార్ల ధ్వంసంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ద్వివేదిని కోరారు. ఈ భేటీ అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ ముఖ్యనేతలకు ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 2+2 భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని ద్వివేదిని కోరినట్టు వెల్లడించారు. రావికంపాడు గ్రామంలో మంత్రి నక్కా ఆనందబాబు, పోలీసులు కలిసి మహిళలపై దాడి చేసి గాయపరిచారని ఆయన తెలిపారు. వైఎస్సార్సీసీ కార్యకర్త ప్రేమచంద్‌ను విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారని పేర్కొన్నారు. కొల్లూరు గ్రామానికి చెందిన ఎస్టీ మహిళ చర్లంచర్ల కనకదుర్గ ఇంటిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన మురళీకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భట్టిప్రోలు మండలం పెసర్లంక గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సురేశ్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. -
‘స్నైపర్ గన్ కాదు.. మొబైల్ లైటింగ్’
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ భద్రత విషయంలో ఉల్లంఘనలు జరిగాయంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. రాహుల్ గాంధీ భద్రత విషయంలో ఇప్పటికే దాదాపు ఏడు సార్లు ఉల్లంఘనలు జరిగాయని లేఖలో ఆరోపించారు. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. బుధవారం(నిన్న) రాహుల్ గాంధీ అమేథీలో తన నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ తలపై ఆకుపచ్చ రంగు లైట్ కనిపించింది. రెండు సార్లు ఈ లైట్ రాహుల్ గాంధీ తలపై కనిపించడం గమనార్హం. అయితే ఈ లేజర్ లైట్ స్నైపర్ గన్ నుంచి వెలువడిందని కాంగ్రెస్ నాయకులు లేఖలో అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక ఇందుకు సంబంధించిన వీడియోను పలువురు మాజీ భద్రతా అధికారులు పరిశీలించారని తెలిపారు. వారు కూడా ఈ లైటింగ్ అనేది స్నైపర్ గన్ లాంటి ప్రమాదకర ఆయుధం నుంచి వెలువడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ లేఖపై కాంగ్రెస్ నాయకులు అహ్మద్ పటేల్, రందీప్ సుర్జేవాలాతో పాటు జైరాం రమేష్ కూడా సంతకం చేశారు. దాంతోపాటు ఇందుకు సంబంధించిన వీడియో ఉన్న పెన్ డ్రైవ్‌ను కూడా కేంద్ర హోం శాఖకు పంపించారు. అంతేకాక రాహుల్ గాంధీకి పటిష్టమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్నైపర్ నుంచి కాదు.. మొబైల్ నుంచి అయితే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి లేఖ అందలేదని పేర్కొంది. ఈ ఘటనపై ఎస్పీజీ డైరెక్టర్‌తో మాట్లాడమని తెలిపింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆ లైట్ స్నిఫర గన్ నుంచి రాలేదని.. సెల్‌ఫోన్ నుంచి వచ్చిందని ఎస్పీజీ డైరెక్టర్ చెప్పినట్లు హోంశాఖ స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది. -
‘నిర్మల’కు ప్రాణ హాని?
సాక్షి, చెన్నై: ప్రొఫెసర్ నిర్మలా దేవికి జైలులో ప్రాణహాని ఉందని, ఆమె మరణంతో కేసును ముగించేందుకు వ్యూహరచన సాగిందని న్యాయవాది పసుం పొన్ పాండియన్ ఆరోపించారు. శనివారం రాత్రి నిర్మలా దేవి గుండెపోటు వచ్చినంత వేదనకు గురికావడంతో మదురై రాజాజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆదివారం మళ్లీ జైలుకు తరలించారు. నలుగురు విద్యార్థినులను మాయమాటలతో తప్పుడు మార్గంలో పయనింప చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయిన అరుప్పు కోట్టై ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారం గురించి తెలిసిందే. ఎవరి కోసమో ఆమె ఆ విద్యార్థుల్ని లొంగ దీసుకునే ప్రయత్నం చేసినట్టుగా ఆడియో స్పష్టంచేయడం దుమారం రేపింది. ఈ కేసులో నిర్మలా దేవితో పాటు మురుగన్, కరుప్పు స్వామిలను అరెస్టుచేశారు. వీరు పది నెలలుగా కటకటాలకే పరిమితమయ్యారు. కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకొచ్చే సమయంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ సీబీసీఐడీ వర్గాలు వీరిని హాజరుపరిచే వారు. వీరికి ఇంతవరకు బెయిల్ కూడా దక్కలేదు. ఈ పరిస్థితుల్లో గత వారం విచారణ సమయంలో సీబీసీఐడీ భద్రతా వలయాన్ని ఛేదిస్తూ నిర్మలాదేవి మీడియా వద్దకు పరుగులు తీశారు. తాను ఏ తప్పు చేయలేదని, బలవంతంగా ఇరికిస్తున్నారని, సంతకాలు బలవంతంగా పెట్టించుకున్నారని ఆరోపిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెను మాట్లాడనివ్వకుండా మహిళా భద్రతా సిబ్బంది బలవంతంగా జైలుకు తరలించారు. అదే సమయంలో నిర్మలా దేవిని కేసులో బలవంతంగా ఇరికించిచారని, ఎవర్నో రక్షించే ప్రయత్నంలో ఆమెను బలి పశువు చేశారని, త్వరలో ఆధారాలు బయటపెడుతానంటూ న్యాయవాది పసుం పొన్ పాండియన్ ఆ సమయంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నిర్మలా దేవి హఠాత్తుగా అనారోగ్యం బారిన పడడంతో అనుమానాలు బయలుదేరాయి. ఆసుపత్రికి తరలింపు కోర్టుకు వెళ్లొచ్చిన అనంతరం నిర్మలా దేవి అనారోగ్యం బారిన పడ్డట్టు సమాచారం. అయితే, ఆమెకు జైలు వర్గాలు ఎలాంటి చికిత్స అందించడం లేదన్న ఆరోపణలు కూడా బయలుదేరాయి. ఈ పరిస్థితుల్లో శనివారం రాత్రి గుండె పోటు వచ్చినంతగా వేదన, శ్వాస ఆడకపోవడంతో నిర్మలా దేవి అస్వస్థతకు గురైనట్టు సమాచారం. దీంతో ఆమెను రాత్రికి రాత్రే మదురై రాజాజీ ఆస్పతికి తరలించి చికిత్స అందించారు. ఈసీజీ, ఎకో వంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యులుఆమెకు కొన్ని రకాల మందుల్ని అందించారు. ఓపీ విభాగంలోనే చికిత్స అందించి ఆదివారం మధ్యాహ్నం మళ్లీ జైలుకు తరలించారు. అయితే, ఆమెకు ప్రాణ హాని ఉందని , జైలులోనే ఆమె మరణించే విధంగా వ్యూహరచన చేసినట్టు న్యాయవాది పసుం పొన్ పాండియన్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ఇప్పటికే పలుమార్లు కోర్టుకు వివరించి ఉన్నట్టు, అయితే, అందుకు తగ్గ వైద్య పరీక్షలు అందించడం లేదన్నారు. శని, ఆదివారం చోటు చేసుకున్న పరిస్థితిని బట్టి చూస్తే, ఆమె జైలులోనే మరణించే విధంగా ప్రయత్నాలు చేసి ఉన్నట్టుందని, ఈ కేసు వెనుక ఉన్న పెద్దల్ని రక్షించి, కేసును ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుందని ఆరోపించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిగణించి తక్షణం బెయిల్ మంజూరుతోపాటు ప్రైవేటు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో నిర్మలా దేవి జీవితం జైలులోనే ముగిసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని
ఎమ్మిగనూరు: ‘జీ+3 ఇళ్ల నిర్మాణంలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే బి.జయనాగేశ్వరరెడ్డి, కౌన్సిలర్ సుందర్ రాజుల నుంచి తన భర్త ప్రభాకర్, తనకు ప్రాణహాని ఉందని టీడీపీ 9వ వార్డు కౌన్సిలర్ చిన్నలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. కొంతకాలంగా అగంతకులు ఫోన్‌చేసి బెదిరిస్తూ, తన భర్తను చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని’ ఆందోళన వ్యక్తం చేశారు. చైర్పర్సన్ సాయసరస్వతి అధ్యక్షతన బుధవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే దళిత కౌన్సిలర్ చిన్నలక్ష్మి మాట్లాడుతూ దళిత వార్డుల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న అవినీతి, జీ+3 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలను తన భర్త ప్రభాకర్ సోషల్ మీడియా, మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారన్నారు. దీనిని జీర్ణించుకోలేక ఎమ్మెల్యే సహకారంతో కౌన్సిలర్ సుందర్రాజు తమను అంతం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. వారిద్దరి నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంది. తమకు ఏదైనా హాని జరిగితే అందుకు ఎమ్మెల్యేనే కారణమంటూ సమావేశం దృష్టికి తెచ్చింది. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ బుట్టారంగయ్య మాట్లాడుతూ జీ+3 ఇళ్ల మంజూరు పేరుతో అధికారపార్టీ కౌన్సిలర్లు, టీడీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సాక్షాత్తు ఆ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ చిన్నలక్ష్మి కూడా ప్రస్తావించిందన్నారు. ఎమ్మిగనూరు జీ+3 ఇళ్లు ఎన్ని మంజూరయ్యాయి, ఎంతమంది దగ్గర డిపాజిట్లు వసూలు చేశారో..మళ్లీ కొత్తగా జాబితాలు పట్టుకుని అక్రమ వసూళ్లు ఎందుకు చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అదేవిధంగా చంద్రన్న పెళ్లికానుకలు ఇప్పించాలంటే రూ.3వేలు, పొదుపు రుణాల మంజూరుకు ఒక్కో గ్రూపు నుంచి రూ.15వేలు చొప్పున కౌన్సిలర్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చివరకు స్త్రీనిధి నిధులను సైతం వారు మింగేస్తున్నారని చెప్పడంతో టీడీపీ కౌన్సిలర్లు సభలో గందరగోళం సృష్టించారు. అనంతరం 1వ వార్డు కౌన్సిలర్ నాగేశప్ప మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో మట్టిమిద్దెలుగా ఉన్నవాటిని ఆర్సీ బిల్డింగులుగా చూపుతూ అధిక పన్నులు వేశారన్నారు. బుట్టారంగయ్య మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెల్లకార్డున్న పేదలందరికీ రూ.200కే కుళాయి కనెక్షన్ ఇస్తే టీడీపీ ప్రభుత్వం నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కౌన్సిలర్ సుందర్రాజు మాట్లాడుతూ 9వ వార్డు కౌన్సిలర్ చిన్నలక్ష్మి భర్త ప్రభాకర్ నుంచే ఎమ్మెల్యేకు, తనకు ప్రాణహాని ఉందని చెప్పగానే సభలోని సభ్యులంతా నవ్వుకున్నారు. అనంతరం అజెండా అంశాలను చదవకుండానే ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో కమిషనర్ రఘునాథ్‌రెడ్డి, డీఈలు వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు షబ్బీర్, రిజ్వానబేగం, దివ్యకళ, శివశంకర్, సలాం, భాస్కర్‌రెడ్డి, విజయలక్ష్మి, వీజీ ఉష, ఈరమ్మ, లక్ష్మిదేవి, తదితరులు పాల్గొన్నారు. -
ఫిట్నెస్ ట్రైనర్‌గా వచ్చి వివాహేతర సంబంధం
సాక్షి, బంజారాహిల్స్: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తన భార్యతో పాటు ఆమె ప్రియుడి నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని టీమ్ వన్ ఇండియా కువైట్ అధినేత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఫిలింనగర్‌లోని అపర్ణ సినార్‌వ్యాలీకి చెందిన గోపిశెట్టి శ్రీధర్ కువైట్‌లో ‘టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవల ఆయన భార్య ఇంట్లోనే వ్యాయామం చేసుకునేందుకు బోయిని రాకేష్‌కుమార్‌యాదవ్ అనే వ్యక్తిని ఫిట్నెస్ ట్రైనర్‌గా నియమించుకుంది. రాకేష్ ప్రతిరోజూ ఉదయం రెండు గంటల పాటు వారి ఇంటికి వచ్చి వ్యాయామం చేయించేవాడు. ఇదే క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిని గుర్తించిన పనిమనుషులు, డ్రైవర్లు శ్రీధర్ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీధర్ వారికి వార్నింగ్ ఇచ్చినా తీరు మార్చుకోలేదు. గత రెండు నెలలుగా అతను కువైట్‌లో ఉండగా రాకేష్ పూర్తిగా ఆయన ఇంట్లోనే ఉంటూ భార్యతో గడుపుతున్నట్లు తెలుసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన శ్రీధర్ వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని బయటికి గెంటేశాడు. కాగా అప్పటికే వారిద్దరూ కలిసి సురాస్ అనే నిర్మాణ రంగ సంస్థను కూడా ప్రారంభించినట్లు ఆయన దృష్టికి వచ్చింది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన భార్యతో పాటు రాకేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీఆర్ఎస్ నుంచి నాకు ప్రాణహాని ఉంది
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తనకు భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అధికార టీఆర్ఎస్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. తనకు గతంలో ఉన్న 1+1 భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపే అవకాశముంది. నా భర్తకు ప్రాణహాని హైకోర్టును ఆశ్రయించిన న్యూడెమోక్రసీ నేత మధు భార్య పద్మ సాక్షి, హైదరాబాద్: పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న తన భర్త సీపీఐ–ఎంఎల్ (న్యూడెమోక్రసీ) ప్రాంతీయ కార్యదర్శి ఎ.నారాయణస్వామి అలియాస్ మధుకు ప్రాణహాని ఉందని, వెంటనే కోర్టులో హాజరుపరిచేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన భార్య పద్మ హైకోర్టును ఆశ్రయించారు. పద్మ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ విషయంపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. -
ప్రాణహాని ఉంది.. తుపాకీ కావాలి : ధోని భార్య
భారత్ క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి లైసెన్స్ రివ్వాలర్ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. అంతేకాక తనకు ప్రాణ హాని ఉందని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఎంఎస్ ధోని మ్యాచ్‌ల దృష్ట్యా బీజీగా ఉంటారనే విషయం విదితమే. ‘ధోని ఇంట్లో చాలా తక్కువ సమయం ఉంటారు. నేను నా కూతురితో కలిసి ఒంటరిగానే ఇంట్లో ఉంటాను. తరచూ ఏదో ఒక పని మీద బయట తిరుగుతుంటాను. ఆ సమయంలో ఒంటరిగానే వెళ్తాను. నా భద్రతా దృష్ట్యా త్వరగా లైసెన్స్డ్ పిస్టల్ లేదా 0.32 రివాల్వర్ ఇప్పించండి’ అని సాక్షి పేర్కొన్నారు. గతంలో కూడా ఎంఎస్ ధోని కూడా లైఎస్స్ తుపాకీ కోసం అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ధోనికి 9ఎమ్ఎమ్ గన్‌కు కూడా అనుమతి ఇచ్చారు. టీమిండియా జట్టు త్వరలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. యో యో టెస్టు పాసైన ఎంఎస్ ధోని ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్స్‌లో ఉన్నాడు. -
ఎండలో కారు పార్క్ చేస్తే ప్రాణాలకు ముప్పు
లాస్ ఎంజిలస్: కారును ఎండలో పార్క్ చేసిన గంటలో దాని లోపలి ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని, దీంతో కారు లోపల చిక్కుకున్న చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో–అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వేసవికాలంలో ఎకానమీ, మిడ్ సెడాన్, లగ్జరీ సెగ్మెంట్లకు చెందిన 6 కార్లను వీరు అధ్యయనం చేశారు. కారులో ఉష్ణోగ్రత మార్పు కారణంగా రెండేళ్ల చిన్నారులపై పడే ప్రభావాన్ని పరీక్షించారు. ఇందులో కారును ఎండలో పార్క్ చేసిన గంటలో స్టీరింగ్ వద్ద 52, సీట్ల దగ్గర 50 డిగ్రీలు, డాష్ బోర్డు వద్ద 69 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నీడలో నిలిపిన గంటలో కారు లోపల 37డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు గుర్తించారు. -
పవన్‌కు టీడీపీ ప్రభుత్వంతో ప్రాణహాని
సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్): సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు తెలుగుదేశం ప్రభుత్వంతో ప్రాణహాని ఉందని అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన ఎల్లో మీడియా అనుచరుల ద్వారా ఆయనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా టీడీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విజయవాడలోని అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను పవన్ వెల్లడిస్తే, సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ జీర్ణించుకోలేక వెకిలిచేష్టలు చేస్తున్నారని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలకు లోకేష్ ఇచ్చిన కోట్ల రూపాయిలను పంచారని ఆరోపించారు. పవన్‌కు అమరావతి రాష్ట్ర కాపునాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. -
నాకు ప్రాణహాని ఉంది... కాపాడండి: గద్దర్
సాక్షి, హైదరాబాద్: తనపై కాల్పులు జరిగి 20 ఏళ్లు గడుస్తున్నా, విచారణ ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని ప్రజా గాయకుడు గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సచివాలయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి ప్రాణాలకు హాని ఉందని గద్దర్ వాపోయారు. కాల్పుల ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్రపతి, ప్రధానికి గతంలోనే లేఖలు రాశానని గుర్తు చేశారు. దీనిపై రాష్ట్రపతి సైతం విచారణకు ఆదేశిస్తూ రాసిన లేఖ ప్రతులను మంత్రికి అందించారు. -
సీనియర్ న్యాయవాదికి చంపేస్తామని బెదిరింపులు
న్యూఢిల్లీ: ‘పద్మావత్’ సినిమా నిర్మాతల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేను చంపేస్తామని రాజ్‌పుత్ కర్నిసేన బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాము కర్ణిసేన ప్రతినిధులమని, ‘పద్మావత్’ సినిమాకు అనుకూలంగా వాదించినందుకు తీవ్ర పరిణామాలు తప్పవని సాల్వేను కొందరు ఫోన్ చేసి బెదిరించినట్టు సమాచారం. ‘ కర్ణిసేన నా కార్యాలయానికి ఫోన్ చేసి బెదరించింది. దమ్ముంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని సవాల్ విసిరింది’ అని సాల్వే మీడియాతో తెలిపారు. సాల్వేను చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించడంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వివాదాస్పదంగా మారిన ‘పద్మావత్’ సినిమా ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్నప్పటికీ.. కర్ణిసేన మాత్రం ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు ఏమాత్రం ఆపడం లేదు. సినిమా విడుదలైతే.. థియేటర్లు తగలబెడతామని, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది. ‘పద్మావత్’కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కర్ణిసేన తగ్గకపోవడంతో ఈ సినిమా విడుదల ఉత్కంఠ రేపుతోంది. -
స్వాతి నుంచి ప్రాణహాని ఉంది..!
నాగర్‌కర్నూల్ క్రైం: నాగర్‌కర్నూల్‌లో భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైన కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు బుధవారం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్‌ను కలిశారు. స్వాతి నుంచి వారి పిల్లలు వర్షిణి, దర్శిత్‌రెడ్డిలకు కూడా ప్రాణహాని ఉందన్నారు. సుధాకర్‌రెడ్డి హత్యతో తాము వీధినపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేశ్ వైద్య ఖర్చులు పెట్టించడంతో ఆర్థికంగా చితికిపోయామని తెలిపారు. నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.