'లొంగిపోలేదు.. భారత్ కు వెళ్తా' | I never surrendered. I want to go back to India: Chhota Rajan | Sakshi
Sakshi News home page

'లొంగిపోలేదు.. భారత్ కు వెళ్తా'

Published Thu, Oct 29 2015 6:43 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

'లొంగిపోలేదు.. భారత్ కు వెళ్తా'

'లొంగిపోలేదు.. భారత్ కు వెళ్తా'

బాలి: తనకు ప్రాణాలకు ముప్పు ఉందని మాఫియా డాన్ ఛోటా రాజన్ పేర్కొన్నాడు. తనకు ప్రత్యేక భద్రత కల్పించాలని బాలి పోలీసులకు లిఖితపూర్వకంగా విన్నవించుకున్నాడు. జైలులో వైద్య సదుపాయాలు కూడా సరిగా లేవని తెలిపాడు. ప్రస్తుతం అతడు ఇండోనేసియాలోని బాలి పోలీసు స్టేషన్ లో ఉన్నాడు. అతడిని భారత్ కు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాను లొంగిపోలేదని, భారత్ కు తిరిగి వెళ్లాలనుకుంటున్నానని ఛోటా రాజన్ తెలిపాడు. తాను జింబాబ్వేకు పారిపోవాలనుకోలేదని స్పష్టం చేశాడు.

భారత్కు వెళ్లాలని లేదని, తనను విడుదల చేస్తే జింబాబ్వేకు పారిపోతానంటూ తమను వేడుకున్నాడని బాలి పోలీస్ కమిషనర్ రెయిన్హర్డ్ నయింగోలన్.. భారత్కు చెందిన ఓ జాతీయ టీవీ చానెల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా బాలి విమానాశ్రయంలో ఛోటా రాజన్ను ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement