underworld don
-
ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లో మాఫియా డాన్ హత్యకు ప్లాన్!
క్రికెట్ స్టేడియంలో వేలాది మంది ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తుండగా ఒక మనిషిని చంపాలనుకోవడం సాధ్యమా? అదికూడా అంతర్జాతీయ స్థాయిలో పేరుమోసిన మాఫియా డాన్‌ను మట్టుబెట్టాలంటే మామూలు విషయమా? కానీ అలాంటి సాహసం చేసిందో మహిళ. ఆమె ఎవరు?, ఆమె చంపాలనుకున్న మాఫియా డాన్ ఎవరు?, అందుకు అతడిని చంపాలకుందనే వివరాలు తెలియాలంటే జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ పుస్తకం చదవాల్సిందే.ఇంతకీ ఈ పుసక్తంలో ఏముంది?అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) పేరు అందరూ వినేవుంటారు. భారతదేశ వ్యవస్థీకృత నేర చరిత్రలో అత్యంత క్రూరుడిగా అతడు గుర్తింపు పొందాడు. 1993 బాంబే వరుస పేలుళ్లకు (Mumbai Serial Blasts) ప్రధాన సూత్రధారిగా దావూద్‌పై ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో చేతులు కలిపి భారత వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో అతడు సాగించిన మారణహోమం ఎంతో మంది అమాయకులను బలిగొంది. అండర్‌వరల్డ్ కార్యకలాపాలు, మత్తుపదార్థాల రవాణా వంటి అరాచకాలతో చెలరేగిన అతడికి ఎంతో మంది శత్రువులయ్యారు. దావూద్ శత్రువుల్లో సప్నా దీదీ కూడా ఒకరు. అయితే ఈమె గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ (Mafia Queens of Mumbai) పుస్తకంలో సప్నా దీదీ గురించి రాశారు.ఎవరీ స్వప్నా దీదీ?ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన వచ్చిన దేవతగా సప్నా దీదీని జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ వర్ణించాడు. దావూద్ ఇబ్రహీం శత్రువైన ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సప్నా దీదీ గురించి రాశాడతను. ప్రతీకారం తీర్చుకోవడానికి నేరుగా ముంబై అండర్‌వరల్డ్ చీకటి ప్రపంచంలోకి మెరుపులా దూసుకొచ్చిన వీర వనితగా పేర్కొన్నాడు.సప్నా దీదీ (Sapna Didi) ముంబైలోని సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు అష్రాఫ్. చాలా చిన్న వయస్సులోనే గ్యాంగ్‌స్టర్ మెహమూద్ ఖాన్‌తో ఆమెకు పెళ్లి జరిగింది. తన భర్తకు అండర్ వరల్డ్‌తో ఉన్న లింకులు ఆమెకు తెలియవు. దుబాయ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన భర్తను ముంబై విమానాశ్రయంలో తన కళ్ల ముందే కాల్చి చంపడంతో ఆమె ప్రపంచం తలక్రిందులైంది. తన జీవితంలో ఎదురైన అతిపెద్ద షాక్ నుంచి బయటపడేందుకు సమాధానాల కోసం వెతుకుతుండగా ఆమెకు నిజం తెలిసింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆదేశాల మేరకే అతడి గ్యాంగ్ తన భర్తను పొట్టనపెట్టుకుందని తెలుసుకుంది. దావూద్ మాట విననందుకు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.డీ-కంపెనీ ఆగడాలకు చెక్ముంబైలో దావూద్ ఇబ్రహీంకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న హుస్సేన్ జైదీని అష్రాఫ్ కలిసింది. దావూద్‌ను అంతమొందిచాలన్న తన లక్ష్యం గురించి చెప్పి, సహాయం చేయాలని అతడిని అర్థించింది. కొద్దిరోజుల్లోనే తుపాకీ కాల్చడం నేర్చుకుని రంగంలోకి దిగింది. దావూద్ పతనమే ధ్యేయంగా కొన్ని నెలల పాటు హుస్సేన్ జైదీతో కలిసి పనిచేసింది. నేపాల్ ద్వారా భారత్‌లోకి డీ-కంపెనీ పంపుతున్న అక్రమ ఆయుధాలను అడ్డుకున్నారు. పలు రకాలుగా డీ-కంపెనీ ఆగడాలకు చెక్ పెట్టారు. గ్యాంగ్‌స్టర్‌గా మారిన తర్వాత తన పేరును స్వప్నా దీదీగా మార్చుకుంది. బురఖా తొలగించి జీన్స్, షర్ట్ ధరించింది. బైక్ నడపడం, సులువుగా గన్ హ్యాండిల్ చేయడం వంటివి సులువుగా చేసేది. ముంబై దావూద్ వ్యాపారాలకు దెబ్బకొడుతున్న వ్యక్తిగా స్వప్నా దీదీ మెల్లమెల్లగా గుర్తింపు పొందింది. దీంతో దావూద్ అనుచరుల్లో భయం మొదలైంది.దావూద్ హత్యకు ప్లాన్మరోవైపు హుస్సేన్ జైదీతో ఆమె సంబంధాలు క్షీణించినప్పటికీ దావూద్‌ను చంపాలన్న నిర్ణయాన్ని మాత్రం ఆమె మార్చుకోలేదు. 1990 ప్రారంభంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్‌లో దావూద్‌ను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. దావూద్ తరచుగా వీఐపీ ఎన్‌క్లోజర్ నుంచి క్రికెట్ మ్యాచ్‌లను చూసేవాడు. అతడు బహిరంగంగా కనిపించిన కొన్ని సందర్భాలలో ఇదీ ఒకటి. స్టేడియంలో ప్రేక్షకుల మధ్య దావూద్ హత్యకు ప్లాన్ చేసింది స్వప్న. తన అనుచరులను స్టేడియంలోకి పంపించి గొడుగులు, సీసాలు పగులగొట్టి దావూద్‌ను మట్టుబెట్టాలని అనుకుంది. ముందుగా దావూద్ అనుచరులపై దాడి చేసి గొడవ సృష్టించాలని, సందట్లో సడేమియాలా డాన్‌ను చంపాలని పథక రచన చేసింది.చదవండి: పదే పది నిమిషాలు.. "ఇదెక్కడి టార్చర్ భయ్యా..!"22 సార్లు కత్తితో పొడిచి హత్యదురదృష్టవశాత్తు ఆమె ప్లాన్ గురించి ముందే దావూద్ ఇబ్రహీంకు తెలిసిపోయింది. దీంతో దావూద్ తన అనుచరులతో ఆమెను దారుణంగా హత్య చేయించాడు. 1994లో ముంబైలోని తన నివాసంలో సప్నా దీదీని 22 సార్లు కత్తితో పొడిచి మర్డర్ చేశారు. దావూద్ ఇబ్రహీంకు భయపడి ఇరుగుపొరుగు వారెవరూ ఆమెను కాపాడటానికి ముందుకు రాలేదు. ఆస్పత్రికి తరలించే లోగా ఆమె ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఆమె పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పెద్ద మాఫియాడాన్‌కు వ్యతిరేకంగా తెగువ చూపిన సప్నా దీదీ ఫొటో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. -
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం
-
అండర్ వరల్డ్ డాన్ కన్నుమూత
బెంగళూరు : అండర్ వరల్డ్ డాన్ ముతప్ప రాయ్(68) శుక్రవారం కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ముతప్ప శుక్రవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ముతప్పరాయ్ విద్యావంతుడు, ఉన్నత కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ముతప్ప విజయ బ్యాంక్‌లో ఉద్యోగిగా వృత్తిని ప్రారంభించాడు. దాదాపు 30 ఏళ్లు బెంగుళూరు అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. (టిక్‌టాక్.. ఎంత పని చేసింది?) 1980 చివరలో బెంగళూరు అండర్ వరల్డ్‌తో రాయ్‌కి పరిచయం ఏర్పడింది. అనంతరం జయ కర్ణాటక అనే సంస్థను స్థాపించాడు. కొద్ది కాలానికి క్యాన్సర్ బారిన పడటంతో మాఫీయా నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం మైసూరు రోడ్డులోని బీదాదిలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఇక రాయ్ అంత్యక్రియలు అతని నివాస స్థలంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంత్యక్రియల్లో పాల్గొనడానికి ప్రజలు ఎవరినీ అనుమతించడం లేదు. (లాక్డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం ) -
మాఫియా డాన్ రవి పుజారీ అరెస్ట్
ముంబై: భారత అధికారులకు గత 15 ఏళ్లుగా దొరక్కుండా తిరుగుతున్న మాఫియా డాన్ రవి పుజారి ఎట్టకేలకు దొరికాడు. ఆఫ్రికా దేశమైన సెనెగల్ రాజధాని డకార్‌లో పోలీసులు పుజారీని జనవరి 22న అరెస్ట్ చేశారు. ఈ విషయమై ముంబై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుజారీ అనుచరులు విజయ్ రోడ్రిక్స్, ఆకాశ్ శెట్టిలను ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. వీరిని విచారించగా, పుజారీ సెనెగల్‌లో తలదాచుకుంటున్నట్లు తేలిందన్నారు. బిల్డర్లు, సినీ ప్రముఖులను డబ్బుల కోసం ఈ గ్యాంగ్ బెదిరిస్తుందన్నారు. పుజారీని భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కర్ణాటకకు చెందిన పుజారీపై డజనుకుపైగా హత్య, బెదిరింపుల కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తొలుత ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీంతో కలసి పనిచేసిన పుజారీ.. తర్వాత సొంతగ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నాడు. -
దేశంలో అల్లకల్లోలానికి దావూద్ ప్లాన్
న్యూఢిల్లీ: దేశంలో అరాచకం సృష్టించేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుట్రలు చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. దేశ వ్యాప్తంగా మత ఘర్షణలు పెంచడంతోపాటు ఆయా మతాలకు సంబంధించిన నాయకులను టార్గెట్ చేశాడని, వారిలో ముఖ్యంగా ఆరెస్సెస్ నాయకులు, చర్చిలు, చర్చిల ఫాథర్లు లక్ష్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ కంపెనీకి చెందిన పదిమందిపై శనివారం చార్జిషీట్ దాఖలు చేయనుంది. 2014లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో శాంతి అనేదే లేకుండా చేయాలని వారు కుట్ర పన్నినట్లు ఆ చార్జీషీట్లో పేర్కొంది. గత ఏడాది నవంబర్ 2న దావూద్ కంపెనీకి చెందిన షార్ప్ షూటర్స్ ఆరెస్సెస్ కు చెందిన శిరిష్ బెంగాలీ, ప్రగ్నీష్ మిస్త్రీలను గుజరాత్‌లోని భారుచ్‌లో చంపేసిన విషయం తెలిసిందే. అనంతరం వారిని అరెస్టు చేయగా 1993 ముంబయిలో వరుస బాంబు పేలుళ్లకు కారకుడైన యాకుబ్ మెమన్ను ఉరితీశారన్న కక్షతో వారిని చంపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ షురూ చేసిన ఎన్ఐఏ అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆ లీడర్ల హత్య మాత్రమే కాకుండా మొత్తం దేశంలోనే అల్లకల్లోలం సృష్టించేందుకు భారీ పథకం పన్నినట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది. -
దావూద్ చనిపోతే.. వారసుడెవడు?
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ప్రాణ గండం సమీపించిందనే కథనాల నేపథ్యంలో దావూద్ వారసుడు ఎవరన్నది కీలకంగా మారింది. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, ఆయనకు సోకిన గ్యాంగ్రీన్ చివరిదశలో ఉందని వైద్యులు తేల్చి చెప్పినట్లు తాజాగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనాలు నిజం కావని, దావూద్ బలంగానే ఉన్నాడని అతని రైట్ హ్యాండ్ ఛోటా షకిల్ చెప్తున్నప్పటికీ.. దావూద్ చనిపోతే అతని స్థానంలో మాఫియా నేరప్రపంచం పగ్గాలు ఎవరు చేపడతారు? ముంబై మాఫియాను ఎవరు నడిపిస్తారన్నది? చర్చనీయాంశంగా మారింది. ముంబై అండర్ వరల్డ్ కేసులు ఎన్నింటినో దర్యాప్తు చేసిన మాజీ పోలీసు అధికారి ఒకరు స్పందించారు. దావూద్ చనిపోతే.. అతని వీరవిధేయుడైన ఛోటా షకీల్ వారసుడిగా పగ్గాలు చేపట్టే అవకాశముందని వెల్లడించారు. 'దావూద్ స్థానంలో ఛోటా షకీలే పగ్గాలు చేపట్టే అవకాశముంది. షకీల్‌కు దూకుడు ఎక్కువ' అని ముంబై మాజీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ షంషేర్ ఖాన్ పఠాన్ తెలిపారు. అయితే, దావూద్ విషమపరిస్థితిలో ఉన్నాడని, రేపోమాపో అన్నట్టుగా అతని పరిస్థితి ఉందన్న కథనాలపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. మరోవైపు దావూద్ ఇబ్రహీం చాలా బలంగా ఉన్నాడని ఆయన కీలక అనుచరుడు చోటా షకీల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రాణ గండం సమీపించిందని మీడియాలో వచ్చిన కథనాలన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే అని అతను ఓ మీడియాకు తెలిపాడు. ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే దానిని మీడియా అనవసరంగా ప్రచారం చేస్తోందని, దావూద్‌కు ఎలాంటి ప్రాణముప్పు లేదని చెప్పుకొచ్చాడు. ఏదీఏమైనా -
'మా డాన్ చాలా ఫిట్‌గా ఉన్నారు'
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చాలా బలంగా ఉన్నారని ఆయన కీలక అనుచరుడు, సన్నిహితుడు చోటా షకీల్ చెప్పాడు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రాణ గండం సమీపించిందని మీడియాలో వచ్చిన కథనాలన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే అని ఓ మీడియాకు తెలిపాడు. ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే దానిని మీడియా అనవసరంగా ప్రచారం చేస్తోందని, దావూద్‌కు ఎలాంటి ప్రాణముప్పు లేదని చెప్పాడు. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, వైద్యులు కూడా గ్యాంగ్రీన్ చివరిదశలో ఉన్నట్లు తేల్చి చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరాచీలోని లియాఖత్ జాతీయ ఆస్పత్రిలో అతనికి సైనిక ఆస్పత్రి వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారని, సీఎన్ఎన్-న్యూస్ 18 తాజా కథనం ప్రకారం గ్యాంగ్రీన్ చివరి దశలో ఉందని, దావూద్ మరణించే అవకాశముందని వైద్యులు చెప్పినట్లు కథనాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలోనే దావూద్ ఆరోగ్యంపై చోటా షకీల్ స్పందించాడు. 'మా గ్యాంగ్ స్టర్ దావూద్ చాలా ఫిట్ గా ఉన్నారు. వ్యక్తిగత లాభంతో ఎవరో సృష్టించిన గందరగోళంతో ఈ వదంతులు వ్యాపిస్తున్నాయి. మీ వార్తా సంస్థల వద్ద ఉంది తప్పుడు సమాచారం. దావూద్ ఫిట్ గా ఉన్నారు' అని అతడు చెప్పాడు. -
వర్మ ఇంకో బుల్లెట్ వదిలాడు..
హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకో పుస్తకం రాస్తున్నాడట. కేవలం తన కామెంట్స్, సినిమాలతోనే కాకుండా ట్విట్స్తో కూడా సంచలనాలు క్రియేట్ చేసే వర్మ మరో బుక్ రిలీజ్ కు రెడీ అవుతున్నాడట. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా ట్విట్ చేశాడు. 'బుల్లెట్స్ అండ్ బూబ్స్' పేరుతో ఒక పుస్తక రచనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపాడు. ముంబై కి చెందిన మాఫియా డాన్ జీవితానికి సంబంధించి అంశాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నాడు. ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తాను కలిసినపుడు తనకెదురైన అనుభవాలు, డాన్ తనతో పంచుకున్న అభిప్రాయాలు ఇందులో వుంటాయని వర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇతర గ్యాంగ్ స్టర్లతో పోలిస్తే దావూద్ చాలా మిస్టీరియస్ గా ఎవరికీ అంతు చిక్కకుండా వుండడం తనకు నచ్చుతుందన్నాడు. ఈ 20 ఏళ్లలో అతనికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఇంతకాలంగా అండర్ వరల్డ్ మాఫియా సామ్రాజ్యాన్ని అతను ఎలా ఏలాడు ..తదితర అంశాలు ఇందులో ఉంటాయంటూ అభిమానులను ఊరిస్తున్నాడు. కాగా ఇప్పటికే కే 'నాఇష్టం', 'గన్స్ అండ్ థైస్' పేరుతో పుస్తకాలను విడుదల చేసిన వర్మ అనేక విమర్శల పాలయ్యాడు. మరి తనదైన శైలిలో చెలరేగి టైటిల్ పెట్టిన తాజా పుస్తకంపై ఎలాంటి విమర్శలు, వివాదాలు రగలనున్నాయో వేచి చూడాల్సిందే. My "Bullets and Boobs" book will have a chapter on my experience on when I met the greatest Gangster ever — Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2016 -
'జైల్లోనే ఛోటా రాజన్‌ను చంపేస్తాం'
మాఫియా డాన్ ఛోటా రాజన్‌ను తిహార్ జైల్లోనే హతమారుస్తామని మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజం ఛోటా షకీల్ హెచ్చరించాడు. శనివారం దావూద్ 60వ బర్త్ డే సందర్భంగా ఛోటా షకీల్ ఓ జాతీయ వెబ్‌సైట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దావూద్ బర్త్ డే వేడుకలు, డి గ్యాంగ్ వ్యవహారాలు, ఛోటా రాజన్‌తో విరోధం తదితర విషయాల గురించి మాట్లాడాడు. ఛోటా రాజన్ చచ్చిన పాముతో సమానమని ఛోటా షకీల్ అన్నాడు. 'రాజన్‌ను మేం ప్రత్యర్థిగా భావించడం లేదు. మాకు వ్యతిరేకంగా అతను నిలబడలేడు. ప్రస్తుతం అతడు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజన్‌ను తిహార్ జైల్లోనే చంపేస్తాం. అతణ్ని చంపేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నించాం. అయితే కొద్దిలో తప్పించుకున్నాడు. ఈ రోజు కాకపోతే రేపయినా రాజన్‌ను హతమారుస్తాం' అని ఛోటా షకీల్ చెప్పాడు. బాలిలో రాజన్‌ను అరెస్ట్ చేసిన ఇండోనేసియా పోలీసులు అతణ్ని భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లో రహస్య జీవితం గడుపుతున్న దావూద్ ఘనంగా బర్త్ డే వేడుకలు చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఛోటా షకీల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక డి గ్యాంగ్ నుంచి దావూద్ వైదొలిగి మరొకరికి బాధ్యతలు అప్పగించనున్నట్టు వచ్చిన వార్తలు కూడా వాస్తవం కాదని వెల్లడించాడు. 'దావూడ్ భాయ్ ఎప్పటికి రిటైర్ కాడు. ఎప్పటికి అతనే మాకు బాస్. అతడి స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఎవరికీ లేదు' అని ఛోటా షకీల్ చెప్పాడు. -
'బెంగళూరులో దావుద్ కుమారుడు'
బెంగళూరు: అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం అలియాస్ 'డి' బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖలతో ఓ రేంజ్లో పరిచయాలు ఉన్నాయి. ఆ విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఓ ప్రముఖ అందాల నటితో 'డి' ప్రేమాయణం సాగించి....ఆ తర్వాత వారిద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నారని మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత దావుద్ పాకిస్థాన్‌లో స్థిరపడ్డాడని.. సదరు హీరోయిన్ మాత్రం ముంబైలో లేదా దుబాయిలో ఉందని సమాచారం. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. దావుద్, బాలీవుడ్ హీరోయిన్ ప్రేమకు ప్రతిరూపంగా ఓ బాబు జన్మించాడు. అతడు మాత్రం అటు పాకిస్థాన్‌లోనో లేక దుబాయిలోనో కాకుండా భారత్‌లోనే పెరుగుతున్నాడు. అది కూడా భారత్ సిలికాన్ నగరమైన బెంగళూరులో నివసిస్తున్నాడు. సదరు బాలీవుడ్ హీరోయిన్ సోదరి ఇంటిలో పెరుగుతున్నాడు. ఈ విషయాలు చెప్పింది ఎవరో కాదు. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్, సీబీఐ డిప్యూటీ డైరెక్టర్‌గా గతంలో విధులు నిర్వహించిన ఐపీఎస్ మాజీ అధికారి నీరజ్ కుమార్ తెలిపారు. తాజాగా 'డయిల్ డి ఫర్ డాన్' పుస్తకాన్ని నీరజ్ రచించారు. ఈ పుస్తకం శనివారం (నవంబర్ 21వ తేదీన) విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో పుస్తకంలోని కొన్ని విషయాలను ఆయన వెల్లడించారు. దావుద్‌తో వివిధ సందర్భాలలో మూడు సార్లు మాట్లాడానని అది కూడా టెలిఫోన్లో మాత్రమే అని నీరజ్ తెలిపారు. 90వ దశకంలో దావుద్ బాలీవుడ్ చిత్రపరిశ్రమను తన కనుసైగలతో ఏలాడు. ఆ తర్వాత ప్రముఖ నటుడు రాజ్ కపూర్ నిర్మించిన చిత్రాలలోనే కాకుండా ఒకటి రెండు తెలుగు చిత్రాలలో నటించిన మందాకినిని దావుద్ విహహం చేసుకున్నాడని మీడియాలో వార్తలు గుప్పు మన్నాయి. అయితే సదరు హీరోయిన్ కుమారుడే బెంగళూరులో ఉన్నాడేమో... ఓ వేళ ఉంటే... అతడికి ఇప్పుడు ఎంత వయస్సు ఉంటుంది.... ఇప్పుడు ఏం చదువుతున్నాడు లేదా వ్యాపార రంగంలోకి వెళ్లాడా లేక తండ్రిలాగానే మాఫియా చక్రం తిప్పుతున్నాడా అనేది మాత్రం నీరజ్ స్పష్టం చేయలేదు. -
ఛోటా రాజన్‌కు 10 రోజుల సీబీఐ కస్టడీ
న్యూఢిల్లీ: నకిలీ పాస్‌పోర్టు కేసులో మాఫియా డాన్ ఛోటా రాజన్‌కు కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. భద్రతా కారణాల నేపథ్యంలో శనివారం సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే కోర్టు విచారణ జరిపింది. అనంతరం మేజిస్ట్రేట్ అతణ్ని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. నకిలీ పాస్పోర్టుతో దేశం విడిచిపారిపోయినందుకు రాజన్‌పై సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. ఇందులో ఒక కేసును అతడిని తీసుకురావడానికి మలేసియా వెళ్లే ముందు కిందటి నెల 31న నమోదు చేసింది. ఈ కేసులోనే కోర్టు అతడికి సీబీఐ కస్టడీ విధించింది. గతనెల 25న ఆస్ట్రేలియా నుంచి ఇండోనేసియాకు వచ్చిన రాజన్‌ను బాలిలో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం బాలి నుంచి సీబీఐ అధికారులు రాజన్(అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే)ను ఢిల్లీకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాజన్ నకిలీ పాస్‌పోర్టులో తండ్రి పేరుగా రాజన్ పేరే ఉంది. ఇండోనేసియా నుంచి ఢిల్లీకి రాజన్‌ను తరలించాక అతని నుంచి అధికారులు సేకరించిన వాటిలో ఈ పాస్‌పోర్టు ఉంది. -
'ఏమాత్రం డౌట్ వచ్చినా.. చంపించేవాడు'
ముంబై: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ స్వార్థపరుడు, పచ్చి అవకాశవాదని మాజీ అనుచరులు చెబుతున్నారు. ఛోటా రాజన్ తన గ్యాంగ్ సభ్యులను అనుమానించేవాడని, వారిపై ఏమాత్రం సందేహం వచ్చినా చంపాలని ఆదేశించేవాడని చెప్పారు. ఇండోనేసియా పోలీసులు ఛోటా రాజన్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో భారత్‌కు తీసుకురానున్నారు. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో కలసి పనిచేసిన ఛోటా రాజన్ 1990లో అతనితో విభేదాలు వచ్చి విడిపో్యాడు. ఆ తర్వాత సొంతంగా గ్యాంగ్ నడిపేవాడు. ఛోటా రాజన్ తన వద్ద పనిచేసిన ఓపీ సింగ్, మోహన్ కొటియన్, బాలా కొటియన్, భరత్ నేపాలి, శామ్యూల్ అలియాస్ శామ్‌ను చంపించినట్టు సమాచారం. ఓపీ సింగ్‌ను నాసిక్ జైల్లో చంపారు. తన స్థానంలో నాయకుడిగా ఎదిగేందుకు ఓపీ సింగ్ ప్రయత్నిస్తున్నాడనే అనుమానంతో ఛోటా రాజన్ అతన్ని హత్య చేయించాడు. జర్నలిస్ట్ జే డేను కూడా రాజన్ ఇలాగే చంపించినట్టు అండర్ వరల్డ్ కథనం. తనకు సంబంధించిన సమాచారాన్ని ఛోటా షకీల్‌కు చేరవేస్తున్నాడని అనుమానంతో డేను చంపించాడని తెలిపారు. 'రాజన్‌కు ఏ మాత్రం తెలివిలేదు. గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఎవరైనా ఇతరుల గురించి చెడుగా చెబితే అది నిజామా కాదా అని తెలుసుకునేవాడు కాదు. ఇప్పుడు రాజన్‌కు మిత్రుల కంటే శత్రువులే ఎక్కువయ్యారు' అని అండర్ వరల్డ్ వర్గాలు వెల్లడించాయి. రాజన్ శత్రువుల జాబితాలో ఛోటా షకీల్‌తో పాటు గ్యాంగ్స్టర్లు విజయ్ శెట్టి, రవి పూజారి, హేమంత్ పూజారి ఉన్నారు. -
త్వరలోనే భారత్‌కు చోటా రాజన్!
-
త్వరలోనే భారత్‌కు చోటా రాజన్!
ఆదివారం ఇండోనేషియాలో అన్సారీ పర్యటన అమల్లోకి రానున్న ఒప్పందాలు బాలి/న్యూఢిల్లీ: ఇండోనేషియాలో పట్టుబడ్డ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌ను భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత, పరస్పర న్యాయ సహకారం అంశాలపై ఒప్పందాలు జరిగాయని.. వీటి ఆధారంగా రాజన్‌ను భారత్ తరలించేందుకు మార్గం సుగమం అవుతుందని.. ఇండోనేసియాలోని భారత రాయబారి గుర్జిత్ సింగ్ తెలిపారు. నేరస్తుల అప్పగింతపై 2011లోనే ఒప్పందం కుదిరిందని.. అయితే ఆదివారం భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇండోనేసియా రానున్న సందర్భంగా.. అధికారికంగా నేరస్తుల అప్పగింత మొదలవుతుందని తెలిపారు. రాజన్‌ను వీలైనంత త్వరగా భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, హోంశాఖ, తమ శాఖ కలిసి పనిచేస్తున్నాయని విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. మరోవైపు.. ఇండోనేసియా పోలీసుల ఆధీనంలో ఉన్న రాజన్‌ను ఆయన న్యాయవాది ఫ్రాన్సికో ప్రస్సార్ కలిశారు. పోలీసులు శుక్రవారం రాజన్‌ను ఆరుగంటలు ప్రశ్నించారు. భారత్‌లో చేసిన వివిధ నేరాలపై విచారించారు. అతడు తమకు సహకరించాడని తెలిపారు. ఈ విచారణపై భారత దౌత్యకార్యాలయానికి నివేదిక సమర్పించారు. తనకు ప్రాణాపాయం ఉందని రాజన్ భావిస్తే.. తన న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయవచ్చని బాలి నగర పోలీసులు తెలిపారు. రెండ్రోజుల్లో భారత అధికారులు బాలికి వెళ్లి.. రాజన్‌ను తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. -
'లొంగిపోలేదు.. భారత్ కు వెళ్తా'
బాలి: తనకు ప్రాణాలకు ముప్పు ఉందని మాఫియా డాన్ ఛోటా రాజన్ పేర్కొన్నాడు. తనకు ప్రత్యేక భద్రత కల్పించాలని బాలి పోలీసులకు లిఖితపూర్వకంగా విన్నవించుకున్నాడు. జైలులో వైద్య సదుపాయాలు కూడా సరిగా లేవని తెలిపాడు. ప్రస్తుతం అతడు ఇండోనేసియాలోని బాలి పోలీసు స్టేషన్ లో ఉన్నాడు. అతడిని భారత్ కు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాను లొంగిపోలేదని, భారత్ కు తిరిగి వెళ్లాలనుకుంటున్నానని ఛోటా రాజన్ తెలిపాడు. తాను జింబాబ్వేకు పారిపోవాలనుకోలేదని స్పష్టం చేశాడు. భారత్‌కు వెళ్లాలని లేదని, తనను విడుదల చేస్తే జింబాబ్వేకు పారిపోతానంటూ తమను వేడుకున్నాడని బాలి పోలీస్ కమిషనర్ రెయిన్‌హర్డ్ నయింగోలన్.. భారత్‌కు చెందిన ఓ జాతీయ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా బాలి విమానాశ్రయంలో ఛోటా రాజన్‌ను ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్ట్
-
మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్ట్
బాలిలో అదుపులోకి తీసుకున్న ఇండోనేసియా పోలీసులు ► ఆస్ట్రేలియా నుంచి బాలికి వస్తుండగా విమానాశ్రయంలోనే అరెస్ట్ ► ఈ వారంలోనే భారత్‌కు తరలింపు! ► ఇండోనేసియా అధికారులతో భారత దర్యాప్తు సంస్థల సంప్రదింపులు ► దావూద్ ఇబ్రహీంకు పోటీగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ రాజన్ ► ముంబై నేర సామ్రాజ్యంపై పట్టు కోసం డీ కంపెనీకి సవాలు... ► 'చోటా'హత్యకు దావూద్ పలు విఫలయత్నాలు ► రాజన్ అరెస్ట్ గొప్ప విజయం: రాజ్‌నాథ్ న్యూఢిల్లీ/జకార్తా అండర్‌వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్(55) అరెస్టయ్యాడు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఇండోనేసియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలిలో ఆ దేశ పోలీసులు ఆదివారం చోటా రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి బాలికి వచ్చిన రాజన్‌ను ఆస్ట్రేలియా పోలీసులిచ్చిన సమాచారంతో బాలి విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ఈ వారమే ఆయనను భారత్‌కు తరలించనున్నారు. భారత్- ఇండోనేసియాల మధ్య నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ప్రత్యేక ఒడంబడిక లేనప్పటికీ.. రాజన్ తరలింపులో ఎలాంటి సమస్య ఎదురుకాబోదని భారతీయ అధికారులు భావిస్తున్నారు. రాజన్‌ను భారత్‌కు తీసుకువచ్చేందుకు దౌత్యపరమైన అనేక మార్గాలున్నాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడైన రాజన్ మరో ప్రముఖ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఒకప్పుడు కుడిభుజం.. దావూద్ డీ కంపెనీలో నంబర్ 2. 1993 ముంబై పేలుళ్ల అనంతరం దావూద్‌కు, డీ కంపెనీకి ప్రధాన ప్రత్యర్థిగా మారాడు. ముంబైలో దావూద్ నేర సామ్రాజ్యాన్ని సవాలు చేశాడు. అప్పట్నుంచీ రాజన్‌ను హతమార్చేందుకు దావూద్ పలుమార్లు విఫల యత్నాలు చేశాడు. పరారీలో ఉన్న చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికల్జే అలియాస్ మోహన్ కుమార్ అలియాస్ నానా కోసం భారత్ గత రెండు దశాబ్దాలుగా గాలిస్తోంది. ఆయనపై 20కి పైగా హత్యాకేసులు, డ్రగ్స్ దందా, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు, అక్రమంగా ఆయుధాలు కలిగిఉండటం సహా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాజన్ విషయంలో సహకరించాల్సిందిగా ఇంటర్‌పోల్‌తో పాటు పలు దేశాలకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. 1995లోనే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బాలీలో రాజన్‌ను అరెస్ట్ చేశారు. చోటా రాజన్ అరెస్ట్ వార్తను ఇండోనేసియా పోలీసులు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా ధ్రువీకరించారు. రాజన్ అరెస్ట్ గొప్ప విజయమని రాజ్‌నాథ్ అభివర్ణించారు. గుర్తింపు, పరిశీలన తదితర చట్టపరమైన ప్రక్రియ అనంతరం తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. సీబీఐ, ఇతర భారతీయ దర్యాప్తు సంస్థలు ఇండోనేసియా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయన్నారు. రాజన్ అరెస్ట్‌లో చొరవ చూపిన ఇంటర్‌పోల్‌కు, ఇండోనేసియా అధికారులకు రాజ్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ తదుపరి లక్ష్యం 1993 ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహమేనా అన్న మీడియా ప్రశ్నకు 'భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూద్దాం' అంటూ బదులిచ్చారు. రాజన్ అరెస్ట్ విషయమై ఆస్ట్రేలియా అధికారులతో చాలాసార్లు సంప్రదింపులు జరిపామని, భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేసియాల సమష్టి కృషి, పరస్పర సహకారంతోనే రాజన్ అరెస్ట్ సాధ్యమైందని సీబీఐ అధికార ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. రాజన్‌పై అత్యధిక కేసులు ముంబైలోనే నమోదై ఉన్నాయని, ఆయనను భారత్‌కు తరలించిన అనంతరం రాష్ట్రానికి తీసుకువచ్చే విషయమై కేంద్రాన్ని అభ్యర్థిస్తామని మహారాష్ట్ర హోంమంత్రి రామ్ షిండే తెలిపారు. రాజన్ మారు పేరుతో, వేరే ధ్రువపత్రాలతో గత ఏడేళ్లుగా కట్టుదిట్టమైన వ్యక్తిగత భద్రతాసిబ్బంది రక్షణలో ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. రాజన్ ఆస్ట్రేలియాలో ఉంటున్న విషయాన్ని ఆదేశ ఫెడరల్ పోలీస్ గత నెలలో ధ్రువీకరించిందని, ఈ విషయమై భారతీయ అధికారులతో సంప్రదింపులు జరిపిందని బాలి పోలీస్ అధికార ప్రతినిధి హేరీ వియంటో వెల్లడించారు. ప్రస్తుతం రాజన్‌ను బాలి పోలీస్ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిపారు. అరెస్ట్ సమయంలో రాజన్ వద్ద మోహన్కుమర్ పేరుతో పాస్‌పోర్ట్ ఉందన్నారు. ఆ ఒప్పందం కీలకం ఇండోనేసియాతో ఇటీవల కుదిరిన ఒక ఒప్పందం రాజన్ తరలింపులో కీలకంగా మారనుంది. ఇరుదేశాల నుంచి కోర్టు వారంటుతో నేరస్తుల తరలింపు సాధ్యమయ్యే అవకాశం ఆ ఒప్పందంతో లభిస్తుంది. ఇరుదేశాల్లోని పరారీలో ఉన్న నిందితుల తరలింపుతో పాటు నేరపరమైన అంశాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. ఆ ఒప్పందంపై ఈ ఆగస్ట్‌లోనే సంతకాలు జరిగాయి. అనంతరం ఆగస్ట్ 21న ఆ ఒప్పందాన్ని భారత్ ప్రభుత్వం దీన్ని నోటిఫై చేసింది. ఇండియాకు తీసుకువచ్చేంతవరకు అనుమానమే..! రాజన్‌ను భారత్‌కు తీసుకువచ్చేంతవరకు తనకు అనుమానమేనని ముంబైలో క్రిమినల్ గ్యాంగ్‌ల పనిపట్టిన అధికారి, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ ఎంఎన్ సింగ్ వ్యాఖ్యానించారు. తన గత అనుభవాల ఆధారంగా అలా అనుమానిస్తున్నానన్నారు. 2000 సంవత్సరంలో బ్యాంకాక్‌లో రాజన్‌పై దాడి జరిగి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తాను, మహారాష్ట్ర హోంమంత్రి చగన్ భుజ్‌బల్ నాటి కేంద్ర విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్‌ను కలిసి, రాజన్‌ను భారత్‌కు తీసుకువచ్చే విషయంలో చొరవ చూపాలని కోరి న విషయాన్ని సింగ్ గుర్తు చేసుకున్నారు. రాజన్‌ను విచారించడం ద్వారా వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం, రాజకీయ నేతలు, పోలీసుల మధ్య నెలకొని ఉన్న రహస్య సంబంధాలు వెల్లడయ్యే అవకాశముందని ముంబైలో పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి వైపీ సింగ్ వ్యాఖ్యానించారు. 2011లో హత్యకు గురైన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ క్రైం రిపోర్టర్ జ్యోతిర్మయి డే కేసు విషయంలో, 2010లో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కాస్కర్పై హత్యాయత్నం కేసు విషయంలోనూ పురోగతి సాధ్యమవుతుందన్నారు. జ్యోతిర్మయి డేను రాజన్ ఆదేశాల మేరకే హత్య చేశారని ఆరోపణలున్నాయి. రాజన్‌కు ఆర్థికంగా సహకరించిన ముంబైలోని బిల్డర్ల వివరాలు వెల్లడవుతాయని సింగ్ పేర్కొన్నారు. -
కానిస్టేబుల్ కొడుకు.. అంతర్జాతీయ నేరస్థుడు!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ముంబైలో ఓ సామాన్య పోలీసు కానిస్టేబుల్ కొడుకు.. కట్ చేస్తే, 1993 నాటి ముంబై పేలుళ్ల సూత్రధారి!! చీకటి సామ్రాజ్య అధినేత. ఎన్నెన్నో మాఫియా సినిమాలకు స్ఫూర్తిదాయకుడు. అతడు ఇంకెవరో కాదు.. దావూద్ ఇబ్రహీం కస్కర్. ఎంతోమంది మాఫియా డాన్లను తయారుచేసి వాళ్లందరి పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోయేలా చేసింది కూడా దావూద్ ఇబ్రహీమే. ఒకప్పుడు ముంబై మాఫియా అంటే మస్తాన్ హైదర్ మీర్జా, వరదరాజన్ మొదలియార్, అబ్దుల్ కరీం లాలా, బాషూ దాదా.. వీళ్లే ఉండేవాళ్లు. ఇలాంటి కరడుగట్టిన వాళ్ల మధ్య ఓ నిజాయితీ గల కానిస్టేబుల్.. ఇబ్రహీం కస్కర్. అతడి రెండో కుమారుడే దావూద్ ఇబ్రహీం కస్కర్. చదువు వంటబట్టక.. పెడదోవ పట్టాడు. చిన్న చిన్న గొడవలతో మొదలుపెట్టి, అప్పటికే ఉన్న డాన్ల మీద దాడులు చేసే స్థాయికి ఎదిగాడు. పోలీసులు కూడా.. నగరంలో డాన్లను అణిచేయడానికి మొదట్లో ఇతడి సాయం తీసుకున్నారు. కానీ దావూద్ వాళ్ల చేయి దాటిపోయి, తానే ఒక డాన్‌గా ఎదిగాడు. భారతదేశంలో ఉంటే ఇబ్బంది అవుతుందని దుబాయ్ పారిపోయాడు. అక్కడి నుంచే కొన్ని ఆపరేషన్లు చేసిన తర్వాత.. కరాచీకి తరలిపోయాడు. అప్పటినుంచి పాకిస్థాన్‌లోనే దాక్కున్న దావూద్ ఇబ్రహీం చిరునామా ఇన్నాళ్లకు మన నిఘా వర్గాలకు చేజిక్కింది. గతంలో ఓసారి తాను లొంగిపోతానంటూ ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీకి దావూద్ కబురు పంపగా, మనవాళ్లు అతడు పెట్టిన షరతులకు ససేమిరా ఒప్పుకొనేది లేదంటూ జారిపోనిచ్చారు. ఆ తర్వాత నకిలీనోట్ల చలామణి లాంటి వ్యాపారాలతో మరింత బలం పెంచుకున్న దావూద్.. ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆధారాలన్నీ లభ్యం ఇన్నాళ్ల బట్టి పాకిస్థాన్‌లో ఉంటూనే ముంబై నేర సామ్రాజ్యాన్ని శాశిస్తున్నాడు. బాలీవుడ్ సినిమాల్లో సగానికి పైగా అతడి డబ్బులతోనే రూపొందుతున్నాయన్న విషయం కూడా బహిరంగ రహస్యమే. అలాంటి దావూద్ ఇబ్రహీం.. అసలు తమ దేశంలోనే లేడని పాకిస్థాన్ కొన్నాళ్లు సన్నాయి నొక్కులు నొక్కింది. కానీ ఇప్పుడు అతడి భార్య పేరు మీద ఉన్న టెలిఫోన్ బిల్లు సహా.. మొత్తం మూడు చిరునామాలు భారత నిఘా వర్గాలకు చేజిక్కాయి. దుబాయిలో దావూద్ సామ్రాజ్య విస్తరణ, తనకు అడ్డువచ్చిన వారినల్లా మట్టుపెట్టడం, బాలీవుడ్లో హంగామా, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన మారణహోమం, ఆపై జరిగిన బొంబే స్టాక్ ఎక్స్చేంజి పేలుళ్లు, దావూద్ కరాచీకి మకాం మార్చటం, ఛోటా షకీల్- దావూద్ మధ్య విద్వేషాలు, వాటి ఆధారంగా మన పోలీసులు పరోక్షంగా రాజన్‌కు సహకరించడం, 9/11 తర్వాత దావూద్ ఇబ్రహీంకు అల్ కాయిదాతో కూడా సంబంధాలున్నట్లు తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా 'మోస్ట్ వాంటెడ్'గా అతడిని గుర్తించడం లాంటి అనేక పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. ఇప్పుడేమంటారు.. ఇన్ని పరిణామాల తర్వాత ఎట్టకేలకు దావూద్ పూర్తి ఆచూకీని సాక్ష్యాధారాలతో సహా మన నిఘా వర్గాలు సంపాదించాయి. ప్రస్తుతం ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. దావూద్ ఇబ్రహీం ఫొటో కూడా ఇన్నాళ్లూ ఎప్పటిదో పాత ఫొటోనే ఉండేది. అలాంటిది ఇప్పుడు వార్ధక్యం మీద పడిన తర్వాత దావూద్ ఎలా ఉన్నాడో కూడా కొత్త ఫొటో దొరికింది. లాడెన్ కూడా ఎక్కడున్నాడో తమకు తెలియదని పాక్ చెప్పిన తర్వాతే అమెరికా నేవీ సీల్స్ స్వయంగా ఆ దేశంలో ప్రవేశించి లాడెన్‌ను మట్టుబెట్టిన విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా మనవాళ్లు గుర్తుచేసుకోవాలి!! - కామేశ్వరరావు పువ్వాడ -
లొంగిపోతానన్నాడు కానీ...
-
దావూద్ లొంగిపోతానన్నాడు కానీ...
న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లోంగిపోతానంటూ వచ్చిన కథనాన్ని కొనసాగింపుగా ప్రముఖ అంగ్ల దిన పత్రిక హిందుస్థాన్ టైమ్స్ ఆదివారం మరో కథనాన్ని ప్రచురించింది. అందులో ఈ వివాదాస్పద కథనంపై డీల్లీ పోలీస్ మాజీ కమిషనర్ నీరజ్ కుమార్, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శంతన్ సేన్ మరింత స్పష్టత ఇచ్చారు. లొంగిపోతానంటూ దావూద్ తన సహచరుడు లాలా ద్వారా వర్తమానం పంపాడని నీరజ్ తెలిపారు. అయితే లొంగిపోవడం సంగతి పక్కన పెట్టి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో దావుద్ పడ్డాడన్నారు. కానీ దావూద్ లొంగిపోతానంటూనే... కొన్ని షరతులు పెట్టాడని శంతన్ సేన్ వివరించారు. అందులోభాంగా 1993 బాంబు పేలుళ్ల కేసు తప్ప మిగతా కేసులన్నింటినీ ఎత్తేయాలని షరత్ విధించాడన్నారు. దావూద్ షరతులను మేము అంగీకరించలేదన్న విషయాన్ని వారు స్పష్టం చేశారు. లొంగిపోవడానికి వచ్చిన నిందితుడు ఎప్పుడూ షరతులు పెట్టకూడదన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. అందుకే మేము దాన్ని తిరస్కరించామన్నారు. కండిషన్లు పెట్టినందునే దావూద్‌తో మాట్లాడవద్దని నీరజ్‌కుమార్‌కు స్పష్టం చేశామన్నారు శంతన్ సేన్. -
నరేంద్ర మోదీ దమ్మున్న నేతే అయితే...
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ దమ్మున్న నేతే అయితే అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ను శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీహెచ్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ప్రధానితో చర్చించడం కాదు... పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్న అండర్ వరల్డ్ డాన్‌ను భారత్‌కు రప్పించాలని మోదీకి సవాల్ విసిరారు. ఆదివారం హైదరాబాద్‌లో వీహెచ్ విలేకర్లతో మాట్లాడుతూ.... నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రజలందరికి పంచుతానని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీకి వీహెచ్ సూచించారు. -
దావూద్ మా దేశంలో లేడు: పాకిస్థాన్
చీకటి సామ్రాజ్యాధినేత దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్థాన్ మరోసారి చెప్పింది. దావూద్ పాక్‌లోనే ఉన్నట్లుగా భారతదేశ వర్గాలు మరోసారి శుక్రవారం నాడు ప్రకటించిన నేపథ్యంలో పాక్ స్పందించింది. దావూద్ ఇక్కడ లేడన్న విషయాన్ని భారత అధికారులకు కూడా తెలియజేసినట్లు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తస్నీం అస్లాం తెలిపారు. పోనీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా దావూద్ అక్కడున్నాడా అని అడగ్గా, గతంలోనూ అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు. తాము పక్కాగా వెతికినా ఇక్కడేమీ కనపడలేదన్నారు. గతంలో ఒసామా బిన్ లాడెన్ విషయంలో కూడా పాక్ ఇలాగే వ్యవహరించింది. అతడెక్కడున్నాడో తమకు తెలియదని పదే పదే బుకాయించింది. చివరకు అమెరికా నేవీ సీల్స్ అసలు అనుమతి కూడా తీసుకోకుండా నేరుగా ఆకాశమార్గంలో వచ్చి, లాడెన్‌ను పాక్ నడిబొడ్డున అబోతాబాద్లో మట్టుబెట్టారు. అప్పటికి గానీ అసలు లాడెన్ అక్కడున్న విషయమే తమకు తెలియదని పాక్ బొంకింది. ఇప్పుడు కూడా అలాగే చేస్తోందన్నది భారత వర్గాల ఆరోపణ.