
బెంగళూరు : అండర్ వరల్డ్ డాన్ ముతప్ప రాయ్(68) శుక్రవారం కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ముతప్ప శుక్రవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ముతప్పరాయ్ విద్యావంతుడు, ఉన్నత కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ముతప్ప విజయ బ్యాంక్‌లో ఉద్యోగిగా వృత్తిని ప్రారంభించాడు. దాదాపు 30 ఏళ్లు బెంగుళూరు అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. (టిక్‌టాక్.. ఎంత పని చేసింది?)
1980 చివరలో బెంగళూరు అండర్ వరల్డ్‌తో రాయ్‌కి పరిచయం ఏర్పడింది. అనంతరం జయ కర్ణాటక అనే సంస్థను స్థాపించాడు. కొద్ది కాలానికి క్యాన్సర్ బారిన పడటంతో మాఫీయా నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం మైసూరు రోడ్డులోని బీదాదిలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఇక రాయ్ అంత్యక్రియలు అతని నివాస స్థలంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంత్యక్రియల్లో పాల్గొనడానికి ప్రజలు ఎవరినీ అనుమతించడం లేదు. (లాక్‌డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం )
Comments
Please login to add a commentAdd a comment