'బెంగళూరులో దావుద్ కుమారుడు' | Dawood Ibrahim married a Bollywood actress, has a son in Bengaluru? | Sakshi
Sakshi News home page

'బెంగళూరులో దావుద్ కుమారుడు'

Published Fri, Nov 20 2015 11:03 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'బెంగళూరులో దావుద్ కుమారుడు' - Sakshi

'బెంగళూరులో దావుద్ కుమారుడు'

బెంగళూరు: అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం అలియాస్ 'డి' బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖలతో ఓ రేంజ్లో పరిచయాలు ఉన్నాయి. ఆ విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఓ ప్రముఖ అందాల నటితో 'డి'  ప్రేమాయణం సాగించి....ఆ తర్వాత వారిద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నారని మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత దావుద్ పాకిస్థాన్లో స్థిరపడ్డాడని.. సదరు హీరోయిన్ మాత్రం ముంబైలో లేదా దుబాయిలో ఉందని సమాచారం. ఇంతవరకు అంతా బాగానే ఉంది.

కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. దావుద్, బాలీవుడ్ హీరోయిన్ ప్రేమకు ప్రతిరూపంగా ఓ బాబు జన్మించాడు. అతడు మాత్రం అటు పాకిస్థాన్లోనో లేక దుబాయిలోనో కాకుండా భారత్లోనే పెరుగుతున్నాడు. అది కూడా భారత్ సిలికాన్ నగరమైన బెంగళూరులో నివసిస్తున్నాడు. సదరు బాలీవుడ్ హీరోయిన్ సోదరి ఇంటిలో పెరుగుతున్నాడు. ఈ విషయాలు చెప్పింది ఎవరో కాదు. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్, సీబీఐ డిప్యూటీ డైరెక్టర్గా గతంలో విధులు నిర్వహించిన ఐపీఎస్ మాజీ అధికారి నీరజ్ కుమార్ తెలిపారు.

తాజాగా  'డయిల్ డి ఫర్ డాన్' పుస్తకాన్ని నీరజ్ రచించారు. ఈ పుస్తకం శనివారం (నవంబర్ 21వ తేదీన) విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో పుస్తకంలోని కొన్ని విషయాలను ఆయన వెల్లడించారు. దావుద్తో వివిధ సందర్భాలలో మూడు సార్లు మాట్లాడానని అది కూడా టెలిఫోన్లో మాత్రమే అని నీరజ్ తెలిపారు. 90వ దశకంలో దావుద్ బాలీవుడ్ చిత్రపరిశ్రమను తన కనుసైగలతో ఏలాడు. ఆ తర్వాత ప్రముఖ నటుడు రాజ్‌ కపూర్ నిర్మించిన చిత్రాలలోనే కాకుండా ఒకటి రెండు తెలుగు చిత్రాలలో నటించిన మందాకినిని దావుద్ విహహం చేసుకున్నాడని మీడియాలో వార్తలు గుప్పు మన్నాయి. అయితే సదరు హీరోయిన్ కుమారుడే బెంగళూరులో ఉన్నాడేమో... ఓ వేళ ఉంటే... అతడికి ఇప్పుడు ఎంత వయస్సు ఉంటుంది.... ఇప్పుడు ఏం చదువుతున్నాడు లేదా వ్యాపార రంగంలోకి వెళ్లాడా లేక తండ్రిలాగానే మాఫియా చక్రం తిప్పుతున్నాడా అనేది మాత్రం నీరజ్ స్పష్టం చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement