మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం చావుబతుకుల మధ్య ఉన్నాడంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరైతే ఏకంగా ఆయన చనిపోయాడని అంటున్నారు. దీనిపై ఆయన అనుచరుడు చోటా షకీల్ స్పందిస్తూ భాయ్ క్షేమంగా ఉన్నాడని, తన ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత దావూద్ పేరు తెరపైకి రావడంతో సాధారణ క్రిమినల్ నుంచి డాన్‌గా ఎదిగిన తీరును, అతడి దుర్మార్గాలను గుర్తు చేసుకుంటున్నారు జనాలు.
హీరోయిన్‌తో ప్రేమాయణం
ఈ డాన్‌కు క్రిమినల్స్‌తోనే కాదు బాలీవుడ్‌తోనూ సంబంధాలున్నాయి. హీరోయిన్ మందాకినిని ఎంతో ఆరాధించాడు దావూద్. ఆమెను కూడా ప్రేమ ముగ్గులోకి దింపాడు. ఈ మందాకిని.. 80వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తన అందం, అభినయంతో కుర్రకారుకు కంటి మీద నిద్ర లేకుండా చేసింది. 1985లో రిలీజైన రామ్ తేరి గంగా మెయిలీ సినిమా ఆమె కెరీర్‌లోనే టాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌తో ఎన్నో అవకాశాలు ఆమె ఇంటి తలుపు తట్టాయి. ఈ నటి.. సింహాసనం, భార్గవ రాముడు చిత్రాలతో తెలుగువారికీ పరిచయమైంది. కానీ ఒకే ఒక్క ఫోటో ఆమె కెరీర్‌నే నాశనం చేసింది. 1994లో దావూద్‌తో మందాకిని కలిసి ఉన్న ఫోటోలు లీకయ్యాయి. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది.
ఆ మోడల్ కోసం హత్య
మొదట తనకేం తెలియదని బుకాయించిన హీరోయిన్ ఆ తర్వాత మాత్రం తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని చెప్పింది. ఈ సంఘటన వల్ల మందాకినికి అవకాశాలు రావడం ఆగిపోయాయి. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పి కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది నటి. అనంతరం డాక్టర్ కాగ్యుర్ రింపోచే ఠాకూర్‌ను పెళ్లాడి విదేశాల్లో సెటిలైంది. వీరికి రబ్బిల్ అనే కుమారుడు, రబ్జే ఇనయ అని ఓ కూతురు ఉన్నారు. ఇదిలా ఉంటే నటి, మోడల్ అనిత అయ్యుబ్ కూడా దావుద్ ప్రియురాలే అని ఓ ప్రచారం ఉంది. ఈమెను సినిమాలోకి తీసుకోవడానికి నిర్మాత జావెద్ సిద్దిఖి నిరాకరించడంతో దావూదే అతడిని కాల్చి చంపాడని చెప్తుంటారు.
దావూద్ ఇబ్రహీంతో మందాకిని
చదవండి: నా దేశంలో రక్షణ లేకుండా పోయింది.. అడుగు బయటపెట్టాలంటేనే..
Comments
Please login to add a commentAdd a comment