మొదట్లో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ఆదిపురుష్ ఇప్పుడు కలెక్షన్ల వేటలో నెమ్మదించింది. అయితే వివాదాలు, విమర్శలు మాత్రం ఇంతవరకు తగ్గనేలేదు. పైపెచ్చు రోజుకో వివాదం సినిమాను చుట్టుముడుతూనే ఉంది. ఇకపోతే ఆదిపురుష్‌లోని ఓ డైలాగ్ వల్ల నేపాల్ ప్రభుత్వం భారతీయ సినిమాలపై కన్నెర్రజేసింది. ఈ సినిమాలో.. సీత భారత్‌లో పుట్టిందని అర్థం వచ్చేలా ఓ డైలాగ్ ఉంది. దీనిపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
నేపాల్ రాజధాని అయిన ఖాట్మండులో సినిమాపై నిషేధం విధించారు. అంతేకాకుండా హిందీ సినిమాలను సైతం బ్యాన్ చేశారు. దీనిపై మేకర్స్ క్షమాపణలు కోరినప్పటికీ అక్కడి ప్రభుత్వం మాత్రం కనికరం చూపించలేదు. దీంతో నేపాల్ ఫిలిం యూనియన్ ఆదిపురుష్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ పఠాన్ హై కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
సెన్సార్ బోర్డు ఆమోదించిన ఏ సినిమా ప్రదర్శనను కూడా ఆపడానికి వీల్లేదని తెలిపింది. ఆదిపురుష్‌పై బ్యాన్‌ను ఎత్తివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు మాటలు కూడా వినేదే లేదంటున్నాడు ఖాట్మండు మేయర్ బాలెన్ షా. 'దేశ సార్వభౌమాదిధికారం, స్వతంత్రత విషయానికి వస్తే నేను ఏ చట్టానికి, న్యాయానికి కూడా కట్టుబడి ఉండను' అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు.
చదవండి: మెగా ప్రిన్సెస్ రాక.. నిహారిక రియాక్షన్ చూశారా?
నువ్వు లేకుండా ఇల్లు బోసిపోతోంది: నటి ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment