Afghan Singer Hasiba Noori Killed By Unknown Gunmen In Pakistan - Sakshi
Sakshi News home page

Fact Check: ఆఫ్ఘన్‌ సింగర్‌ హత్య.. ఆ వార్తల్లో నిజం లేదన్న గాయని!

Published Mon, Jul 17 2023 10:52 AM | Last Updated on Wed, Aug 2 2023 3:15 PM

Afghan Singer Hasiba Noori Killed By Unknown Gunmen In Pakistan - Sakshi

Afghan singer Hasiba Noori is ALIVE: గతంలో పాక్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రముఖ ఆఫ్ఝన్ సింగర్‌ హసీబా నూరి మరణించిందన్న సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది.  అయితే ఆ  వార్తలను సింగర్ హసీబా నూరి ఖండించింది. సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలు, ఫోటోలు ఫేక్ అని కొట్టిపారేసింది. కాగా.. ఆఫ్ఘాన్‌ను తాలిబన్లు వశం చేసుకోవడంతో ఆమె పాక్‌లోని కరాచీలో శరణార్థిగా తలదాచుకుంటోంది. 

తాజాగా ఈ విషయానికి సంబంధించి ఫేస్‌బుక్‌లో ఒక వీడియో బయటపడింది. అందులో నూరి తన మరణ వార్తను ఫేక్‌ అని కొట్టిపారేయగా.. జర్నలిస్ట్ ఇఫ్తికార్ ఫిర్దౌస్ కూడా గాయనితో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడినట్లు ధృవీకరించారు.  ఆమె సజీవంగా ఉందని నిరూపించడానికి వీడియో కాల్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో నూరి ఆసుపత్రి బెడ్‌పై పడుకున్నట్లు వచ్చిన ఫోటోలు.. ఆమె కరాచీలో జరిగిన శస్త్రచికిత్స తర్వాత తీసుకున్నట్లు సింగర్ స్పష్టం చేశారు.

కాగా..  హసిబా నూరి ఫాలోయింగ్ ఉన్న పాష్టో గాయని. ఆమె అరియానా టెలివిజన్, ఏఎంసీ టీవీ లాంటి ఆఫ్ఘన్ ఛానెల్స్‌లో పనిచేసింది. "మినా," "సబ్జా జనమ్," "అల యారం" వంటి పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఆగష్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, హసిబా నూరీతో పాటు అనేక ఇతర కళాకారులు పాకిస్తాన్‌లో శరణార్థులుగా తలదాచుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement