న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చాలా బలంగా ఉన్నారని ఆయన కీలక అనుచరుడు, సన్నిహితుడు చోటా షకీల్ చెప్పాడు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రాణ గండం సమీపించిందని మీడియాలో వచ్చిన కథనాలన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే అని ఓ మీడియాకు తెలిపాడు. ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే దానిని మీడియా అనవసరంగా ప్రచారం చేస్తోందని, దావూద్కు ఎలాంటి ప్రాణముప్పు లేదని చెప్పాడు.
దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, వైద్యులు కూడా గ్యాంగ్రీన్ చివరిదశలో ఉన్నట్లు తేల్చి చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరాచీలోని లియాఖత్ జాతీయ ఆస్పత్రిలో అతనికి సైనిక ఆస్పత్రి వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారని, సీఎన్‌ఎన్-న్యూస్ 18 తాజా కథనం ప్రకారం గ్యాంగ్రీన్ చివరి దశలో ఉందని, దావూద్ మరణించే అవకాశముందని వైద్యులు చెప్పినట్లు కథనాలు వెల్లడయ్యాయి.
ఈ నేపథ్యంలోనే దావూద్ ఆరోగ్యంపై చోటా షకీల్ స్పందించాడు. 'మా గ్యాంగ్ స్టర్ దావూద్ చాలా ఫిట్ గా ఉన్నారు. వ్యక్తిగత లాభంతో ఎవరో సృష్టించిన గందరగోళంతో ఈ వదంతులు వ్యాపిస్తున్నాయి. మీ వార్తా సంస్థల వద్ద ఉంది తప్పుడు సమాచారం. దావూద్ ఫిట్ గా ఉన్నారు' అని అతడు చెప్పాడు.
'మా డాన్ చాలా ఫిట్గా ఉన్నారు'
Published Tue, Apr 26 2016 8:39 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM