Chhota Shakeel
-
చోటా షకీల్ బంధువు ఆరిఫ్ షేక్ మృతి
అండర్ వరల్డ్ డాన్ ఛోటా షకీల్ బంధువు ఆరిఫ్ షేక్ అలియాస్ ఆరిఫ్ భాయిజాన్ ముంబైలో గుండెపోటుతో మృతి చెందాడు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో అరెస్టయిన ఆరిఫ్ షేక్.. ఛోటా షకీల్‌కు బావ వరుస అవుతాడు.ప్రస్తుతం ఆరిఫ్ ఆర్థర్ రోడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ముంబైలోని జెజె ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరీఫ్ మృతి చెందాడు.అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరుడు ఛోటా షకీల్‌కు ఆరిఫ్ సహాయం అందించాడనే ఆరోపణలున్నాయి. 61 ఏళ్ల ఆరిఫ్ షేక్‌ను 2022 మేలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. గత రెండేళ్లుగా ఆర్థర్ రోడ్ జైలులో ఆరిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి కారణంగా ఆరిఫ్ షేక్‌ను జూన్ 21న ఆస్పత్రికి తరలించారు. ఆరీఫ్‌కు ఇద్దరు సంతానం అని తెలుస్తోంది. -
సలాహుద్దీన్.. భత్కల్ సోదరులు..
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం పీచమణిచే చర్యల్లో భాగంగా మరో 18 మంది వ్యక్తులను మంగళవారం కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరిలో నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకులు భత్కల్ సోదరులు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు చోటా షకీల్ ఉన్నారు. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల (సవరణ) చట్టం (యూఏపీఏ) కింద కేంద్రం ఉగ్రవాదులుగా ప్రకటించిన వారి సంఖ్య 31కు చేరుకుంది. తాజా జాబితాలో 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, ఇబ్రహీం అథర్, యూసఫ్ అజార్, ముంబై ఉగ్రదాడుల సూత్రధారుల్లో ఒకడు, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా టాప్ కమాండర్ సాజిద్ మిర్, అదే సంస్థ కమాండర్ యూసఫ్ ముజమ్మిల్ తదితరుల పేర్లున్నాయి. ఇదే ఘటనకు సంబంధించి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ముగ్గురు సోదరులు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, ఇబ్రహీం అఖ్తర్, యూసఫ్ అజార్‌లను ఉగ్రవాదులుగా ప్రకటించింది. నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ అలియాస్ సయ్యద్ మొహమ్మద్ యూసఫ్ షా, డిప్యూటీ చీఫ్ గులాం నబీ ఖాన్ అలియాస్ అమిర్ ఖాన్‌లను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించింది. భత్కల్ సోదరులు.. ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రసంస్థను ఏర్పాటు చేసిన రియాజ్ ఇస్మాయిల్ షాబంద్రి అలియాస్ రియాజ్ భత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్ పేర్లు ఉన్నాయి. వీరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (2010), జమా మసీదు (2010), షీతల్‌ఘాట్ (2010), ముంబై (2011)ల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. వీరిపై జైపూర్ (2008), ఢిల్లీ (2008), అహ్మదాబాద్, సూరత్ (2008)ల్లో వరుస పేలుళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దావూద్ అనుచరులు నలుగురు.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించిన దావూద్ ఇబ్రహీం నలుగురు ముఖ్య అనుచరులు చోటా షకీల్, మొహమ్మద్ అనిస్ షేక్, టైగర్ మెమన్, జావెద్ చిక్నా పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. యూఏపీఏ అమల్లోకి వచ్చాక కేంద్రం 2019 సెప్టెంబర్‌లో నలుగురిని, 2020 జూలైలో 9 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఇప్పటికే ఉగ్రముద్ర పడిన వారిలో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ముంబై ఉగ్రదాడి నిందితుడు జకీ ఉర్ రహ్మాన్ లఖ్వి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరంజీత్ సింగ్ పన్వర్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషన్ చీఫ్ వాధవా బబ్బర్ తదితరులు ఉన్నారు. -
సిటీపై డి–గ్యాంగ్ కన్ను!
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్లో తలదాచుకున్న అంతర్జాతీయ డాన్ దావూద్ ఇబ్రహీం కన్ను హైదరాబాద్‌పై ఉందా? దీనికి ఔననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దావూద్‌కు చెందిన డి–కంపెనీ హైదరాబాద్‌లో ఉండే ఓ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్లు తెలిసింది. దీనికోసం దావూద్ కుడిభుజం ఛోటా షకీల్ ఢిల్లీకి చెందిన షార్ప్ షూటర్ నసీం అలియాస్ రిజ్వాన్‌ను రంగంలోకి దింపాడు. నసీంను నార్త్ఈస్ట్ ఢిల్లీ పోలీసులు నవంబర్‌లో అరెస్టు చేశారు. నసీం విచారణ నేపథ్యంలో ‘హైదరాబాద్ సెలబ్రిటీ–డి కంపెనీ’ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు దర్యాప్తులో ఉందని చెప్తుండగా.. తెలంగాణ అధికారులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. టార్గెట్ నేపథ్యంలో.. నసీం ఢిల్లీలో జరిగిన అనేక దోపిడీ, దొంగతనం, హత్యలు, హత్యాయత్నం నేరాల్లో నిందితుడిగా.. మరికొన్ని కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న నసీం కోసం ఢిల్లీ పోలీసులు కొన్నాళ్లుగా గాలిస్తున్నారు. అతడిపై రూ.50 వేల రివార్డ్ ప్రకటించారు. షార్ప్ షూటర్‌గా పేరున్న నసీం డి–కంపెనీకి అనుబంధంగా పని చేస్తున్నాడని, దావూద్‌తో పాటు ఛోటా షకీల్ ఆదేశాల మేరకు కొందరు ప్రముఖుల్ని చంపడానికి రంగంలోకి దిగాడని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో గతేడాది జూన్‌లో నార్త్ఈస్ట్ ఢిల్లీ పోలీసులు నసీం అనుచరుడు జునైద్ చౌదరిని అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో నవంబర్ మొదటి వారంలో నసీంను పట్టుకున్నారు. వెలుగులోకి కీలకాంశాలు.. ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల విచారణలో నసీం తాను ఛోటా. షకీల్ ఆదేశాల మేరకు కొందరు ప్రముఖుల్ని టార్గెట్ చేసినట్లు అంగీకరించాడు. పాక్‌లో పుట్టి కెనడియన్‌గా మారిన రచయిత తారిఖ్ ఫథాతో పాటు ‘కాఫీ విత్ డీ’ సినిమా నిర్మాత మరికొందరు సెలబ్రిటీలు ఉన్నట్లు బయటపెట్టాడు. తారిఖ్ ఢిల్లీ వచ్చిన సందర్భంలో ఆయన్ను హతమారిస్తే రూ.1.5 కోట్లు చెల్లించడానికి షకీల్ ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపాడు. మరోవైపు తీహార్ జైల్లో ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ కదలికల్నీ కనిపెట్టాల్సిందిగా షకీల్ చెప్పాడనీ అంగీకరించాడు. షకీల్–రాజన్ మధ్య వైరం ఉన్న నేపథ్యంలో అతడిని హతమార్చడానికి రెక్కీగా ఈ ఆదేశాలు ఇచ్చినట్లు స్పెషల్ సెల్ అనుమానిస్తోంది. షకీల్ రెండుసార్లు నసీంతో మాట్లాడి ఈ కాంట్రాక్టులు ఇచ్చినట్లు వెల్లడైంది. రూ. 45 లక్షల సుపారీ ఛోటా షకీల్ నసీం విచారణలో హైదరాబాద్‌కు సంబంధించిన కోణం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఉంటున్న ఓ సెలబ్రిటీని చంపేందుకు షకీల్ నుంచి అతడు రూ.45 లక్షల సుపారీకి అంగీకరించాడని వెల్లడైనట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ మున్నా సింగ్‌తో కలసి చేయాల్సిందిగా షకీల్ స్పష్టం చేసినట్లు స్పెషల్ సెల్ గుర్తించింది. దీనికోసం గుర్గావ్ ప్రాంతంలో మున్నాను కలిసే యత్నాల్లో ఉండగా నసీం ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ సెల బ్రిటీ ఎవరు? అతడిని టార్గెట్ చేయాల్సిన అవసరం డి–కంపెనీకి ఎందుకు వచ్చింది? అనేవి అంతు చిక్కట్లేదు. గతంలోనే సిటీలో డి–గ్యాంగ్ ఛాయలు కనిపించాయి. ఓ వీడియో కంపెనీ యజమానుల్ని దుబాయ్ కు పిలిపించుకుని వారిని కలిసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ విషయంపై ‘సాక్షి’ ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల్ని సంప్రదించగా.. నసీం కేసు దర్యాప్తులో ఉందని, అనేక అంశాలు వెలుగులోకి రావాలని చెప్పారు. తెలంగాణ, హైదరాబాద్ పోలీసులు మాత్రం సిటీ సెలబ్రిటీని డి–కంపెనీ టార్గెట్ చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. -
ఆఖరి శ్వాస వరకూ దావూద్‌తోనే!
ముంబై : డీ గ్యాంగ్‌లో విభేధాలు వచ్చాయన్న వార్తలపై ఛోటాషకీల్ తాజాగా స్పందించారు. దావూద్ ఇబ్రహీంతో తనకు ఎటువంటి విభేధాలు లేవని.. ఆఖరి శ్వాస వరకూ అతనితో ఉంటానని ఛోటా షకీల్ స్పష్టం చేశారు. అండర్ వరల్డ్‌లో డీ కంపెనీ కోసమే పనిచేస్తానని ఛోటా షకీల్ స్పష్టం చేసినట్లు తెలిసింది. దావూద్ ఇబ్రహీంతో వచ్చిన విభేధాల వల్ల ఛోటా షకీల్ వేరు కుంపటి పెట్టుకున్నట్లు వచ్చిన నిఘా సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దావూద్ గొడవలు వచ్చాయనడం కేవలం పుకార్లు మాత్రమేనని ఛోటా షకీల్ అన్నారు. తన చివరి శ్వాస వరకూ డీ కంపెనీకే పనిచేస్తానని ఛోటా షకీల్ తాజాగా పేర్కొన్నారు. ఒక గుర్తుతెలియన ప్రాంతం నుంచి ఛోటా షకీల్ జీ న్యూస్‌కు ఈ విషయాన్ని తెలిపారు. అదే సమయంలో ‘నేను భాయ్‌తో ఎప్పటిలాగే ఉన్నా. ఇకముందు ఉంటాను’ అని తెలిపారు. డీ గ్యాంగ్‌లో దావూద్‌కు ఛోటా షకీల్‌ను కుడి భుజంగా వ్యవహరిస్తారు. డీ గ్యాంగ్‌లో దావూద్ సోదరుడు అనీస్ పాత్ర పెరగడంతో.. షోటా షకీల్ దావూద్‌కు దూరమయినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో దావూద్‌ను, ఛోటా షకీల్‌ను కలిపేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందని తెలిస్తోంది. -
‘డి’ డాన్ ఎవరు?
(సాక్షి నాలెడ్జ్ సెంటర్) దాదాపు 20 దేశాల్లో మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న డాన్ దావూద్ ఇబ్రహీం వారసుడు ఎవరు? దావూద్ వ్యవహారాలు నచ్చని అతడి కుమారుడు మొయిన్ నవాజ్ ఇప్పటికే ఆ ముఠాకు దూరంగా ఉంటున్నాడు.. ఇప్పుడు దావూద్ ప్రధాన అనుచరుడు, ‘డి కంపెనీ’అనధికార సీఈవోగా పేరుపడ్డ చోటా షకీల్ కూడా ముఠా నుంచి బయటికి వెళ్లిపోయాడు. మరిప్పుడు ‘డి కంపెనీ’కి నాయకుడు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27న 62 ఏళ్లు నిండుతున్న దావూద్ అనారోగ్యం కారణంగా వారసుడిపై దిగాలుగా ఉన్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. నమ్మినబంటు దూరం ప్రస్తుతం పాకిస్తాన్‌లోని కరాచీలో ఉంటూ మాఫియా సామ్రాజ్యాన్ని నియంత్రిస్తున్న దావూద్ ఇబ్రహీంకు 30 ఏళ్లుగా నమ్మినబంటుగా ఉన్నాడు షకీల్. దావూద్ గ్యాంగ్ రోజూవారీ కార్యకలాపాల బాధ్యత చూసేది అతనే. దావూద్ తరఫున మీడియాతో మాట్లాడడం (కరాచీ నుంచి ఫోన్లో) చేసేదీ తనే. దావూద్ తర్వాత ‘డి కంపెనీ’కి తనే నేతృత్వం వహించవచ్చన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఎందుకంటే దావూద్ కుమారుడు మోయిన్ నవాజ్‌కు మాఫియా కార్యకలాపాలపై ఇష్టం లేదు. ముఠా నాయకత్వం తీసుకోవడానికి అతను సిద్ధంగా లేడని, దాంతో దావూద్ దిగులుతో ఉన్నాడని ముంబైలోని దావూద్ అనుచరుడు ఇక్బాల్ హసన్ వెల్లడించినట్లుగా పోలీసులు తెలిపారు కూడా. దీంతో కరాచీలోనే ఉంటున్న దావూద్ తమ్ముడు అనీస్‌కు ముఠా నాయకత్వం దక్కే వీలుందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ మధ్య దావూద్ సమక్షంలోనే అనీస్‌కు, చోటా షకీల్‌కు మధ్య విభేదాలు తలెత్తాయని.. అప్పటినుంచి డి గ్యాంగ్‌కు షకీల్ దూరంగా ఉంటున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీనిపై దావూద్ హెచ్చరించినా కూడా అనీస్ తీరు మార్చుకోలేదని.. దాంతో చోటా షకీల్ సొంత ముఠా ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నాయి. అయితే దావూద్, చోటా షకీల్‌ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నాయి. ఆ ఇద్దరు విడిపోతే భారత్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టే కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందని పాకిస్తాన్ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. సుమారు 20 దేశాల్లో.. భారత్‌తోపాటు పాకిస్తాన్, నేపాల్, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, టర్కీ, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో, యూఏఈ, సైప్రస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్, మలేసియా, సింగపూర్ల వరకూ దావూద్ డి కంపెనీ నేర సామ్రాజ్యం విస్తరించిందని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ గ్యాంగ్ ఆస్తులు, వ్యాపార కార్యకలాపాల విలువ 670 కోట్ల డాలర్ల (సుమారు రూ.40 వేల కోట్లు) అని రెండేళ్ల క్రితమే అంచనా వేశారు. కరాచీలో ఆరు వేల చదరపు గజాల విస్తీర్ణమున్న భారీ భవంతిలో నివసిస్తున్న దావూద్‌కు ప్రధానంగా హవాలా కార్యకలాపాల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది. ఇదికాక మాదకద్రవ్యాల రవాణా, బలవంతపు వసూళ్లు, బినామీలతో సినిమాల నిర్మాణం, కిరాయి హత్యలు, రియల్ ఎస్టేట్, బెట్టింగ్, ఉగ్రవాదం, నకిలీ నోట్ల చలామణీ వంటి కార్యకలాపాలతో ఒక కంపెనీ తరహాలో వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం నడుస్తోంది. ఈ గ్యాంగ్ ఆదాయంలో 40 శాతం భారత్ నుంచే వస్తుందని అంచనా. ఇక దావూద్‌కు దుబాయ్‌తోపాటు యూఏఈ, బ్రిటన్లలో ఇతరుల పేర్లతో చట్టబద్ధమైన ఆస్తులు ఉన్నాయి. ఒక్క ఇంగ్లండ్‌లోనే దావూద్ పెట్టుబడులు 45 కోట్ల డాలర్ల (సుమారు రూ.3 వేల కోట్లు) మేర ఉంటాయని తెలుస్తోంది. డి కంపెనీ దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన వజ్రాలను గుజరాత్లో సానబెట్టే వ్యవహారాన్ని చోటా షకీల్ పర్యవేక్షిస్తాడని, ముంబైలోని గ్యాంగ్ సభ్యులకు నెలకు రూ.15 లక్షల దాకా చెల్లిస్తారని పోలీసులు చెబుతున్నారు. ముఠాలో 5 వేల మంది సభ్యులు! దావూద్ ముఠాలో ఐదు వేల మంది దాకా సభ్యులున్నారని.. లష్కరే తొయిబా, అల్ కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలతో గట్టి సంబంధాలు ఉన్నాయని 2015లో అమెరికా కాంగ్రెస్ నివేదికలోనే పేర్కొన్నారు. కొన్నేళ్లు డి గ్యాంగ్‌లో పనిచేసిన చోటా రాజన్, అబూ సలేం, ఫాహీం తర్వాత సొంత ముఠాలు పెట్టుకున్నారు. భారత్‌లో కొందరు మహిళలు దావూద్ గ్యాంగ్‌లో పనిచేస్తున్నట్లు కొన్ని నెలల క్రితం వార్తలొచ్చాయి. కరాచీలోనే దావూద్ 2015 ఆగస్టులో దావూద్ భార్య మెహజబీన్ పేరుతో ఉన్న ఒక ఫోన్ బిల్లును టైమ్స్‌నౌ టీవీ చానల్ సంపాదించింది. ఆ నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడగా.. దావూద్ నిద్రపోతున్నారనీ, తాను కరాచీలో ఉంటున్నట్టు ఆమె ధ్రువీకరించడం గమనార్హం. కానీ పాకిస్తాన్ మాత్రం దావూద్ తమ దేశంలో లేడని బుకాయిస్తుంటుంది. బిట్‌కాయిన్స్‌తో లావాదేవీలు తన చట్టవ్యతిరేక నగదు లావాదేవీలు సులువుగా సాగడానికి వీలుగా దావూద్ ఇబ్రహీం.. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. డి గ్యాంగ్ రూ.950 కోట్ల విలువైన బిట్ కాయిన్స్ సంపాదించిందని అతని సోదరుడు ఇక్బాల్ ఇటీవల ఓ ఇంటరాగేషన్‌లో వెల్లడించాడు. ఈ బిట్‌కాయిన్స్‌ను రియల్ ఎస్టేట్, మాదకద్రవ్యాలు, ఆయుధాల సరఫరా కార్యకలాపాల్లో చెల్లింపులకుఉపయోగిస్తున్నారని బయటపెట్టాడు. ఎవరీ చోటా షకీల్? 1988లో దావూద్ గ్యాంగ్‌లో చేరిన షకీల్ అసలు పేరు షకీల్ షేక్. దావూద్‌తో పాటు దుబాయ్ పారిపోయాడు. 1993 ముంబై పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితుడు. 2003లో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసు సహా అనేక మంది శివ సైనికుల హత్యలతో షకీల్‌కు సంబంధముంది. 2000లో బ్యాంకాక్‌లో డి గ్యాంగ్ ప్రధాన శత్రువు చోటా రాజన్‌పై హత్యాయత్నం కూడా షకీల్ పన్నిన పథకం ప్రకారమే జరిగింది. డి కంపెనీకి అత్యధిక ఆదాయం వచ్చే భారత్‌లో కార్యకలాపాలన్నిటికీ బాధ్యుడు ఇతనే. దేశంలో కిరాయి హంతకుల ఎంపిక, రిక్రూట్మెంట్ అంతా షకీల్ కనుసన్నల్లోనే జరుగుతుందని చెబుతారు. షకీల్ తర్వాత టైగర్ (ఇబ్రహీం) మెమన్, ఉస్మాన్ చౌధరీ తదితరులు డి ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనీస్‌కే ముఠా పగ్గాలు? కస్కర్ అనే ఇంటి పేరున్న కొంకణ ముస్లిం కుటుంబంలో పుట్టిన దావూద్‌కు 11 మంది తోబుట్టువులు ఉన్నారు. వారిలో దావూద్ అన్న షాబీర్ గ్యాంగ్‌వార్‌లో మరణించగా.. సోదరి హసీనా కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయింది. ప్రస్తుతం దావూద్ అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా గ్యాంగ్ అధీనంలోని ఆస్తులను కుటుంబ సభ్యులకు, ఓ ట్రస్టుకు పంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లోని నేర సామ్రాజ్యాలు నడిపే కుటుంబాల మాదిరిగానే ముఠా నాయకత్వాన్ని ఇబ్రహీం కుటుంబసభ్యుల్లో ఒకరికి ఇవ్వాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఇదే జరిగితే దావూద్ సోదరుడు అనీస్‌కే నాయకత్వం దక్కుతుందని కొందరు చెబుతుండగా.. అనీస్‌కు కూడా వయసు పైబడిందని డి గ్యాంగ్‌ను నడిపే స్థితిలో లేడని వార్తలొస్తున్నాయి. -
డీ గ్యాంగ్‌లో సంక్షోభం
ఇస్లామాబాద్ : ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితులు.. దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీంకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న చోటా షకీల్ కొన్నాళ్లుగా కరాచీలో ప్రత్యేకంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విబేధాల వల్ల దావూద్‌ను చోటా షకీల్ కలిసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని చీకటి సామ్రాజ్యంలో గుసగులు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ అయిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు ఒక రిపోర్ట్ ద్వారా బయటకు తెలిసింది. వీరిద్దరూ విడిపోతే భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించలేమని ఐఎస్ఐ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దాదాపు మూడు దశాబ్దాలుగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చోటా షకీల్ అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దావూద్ కుడి భుజంగా చోటాషకీల్ను డీ గ్యాంగ్ పిలుచుకుంటారు. దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం వల్ల ఇద్దరి మధ్య విభేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. డీ గ్యాంగ్ నిర్వహణలో అనీస్ జోక్యం పెరిగిపోవడంతో చోటా షకీల్ దావూద్‌తో విభేధించినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో చోటా షకీల్ తాజాగా తూర్పు ఆసియా దేశాల్లోని ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఇదిలాఉండగా.. చోటా షకీల్-దావూద్ ఇబ్రహీం మధ్య తిరిగి సయోధ్య నెలకొల్పేందుకు ఐఎస్ఐ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. డీ గ్యాంగ్ సహకారం వల్ల అప్పట్లో ముంబై వరుస బాంబు పేలుళ్లు పాకిస్తాన్ తెగబడింది. ఈ నేపథ్యంలోనే వారిని కలిపేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
చోటా షకీల్ కేసులపై ఆరా
సాక్షి,ముంబయి:అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు ఛోటా షకీల్‌పై నమోదైన కేసుల వివరాలను థానే పోలీసులకు ముంబయి పోలీసులు చేరవేశారని అధికారులు చెప్పారు. దావూద్ చిన్న సోదరుడు ఇక్బాల్ కస్కర్ అరెస్ట్ అయిన థానే కేసులో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టాన్ని ప్రయోగించవచ్చా అనే అంశంలో థానే పోలీసులు ముంబయి పోలీసు వర్గాలను ఈ సమాచారం కోరారు. థానే పోలీసులు కోరిన సమాచారం అంతటినీ వారికి అందచేశామని ముంబయి అధికారులు తెలిపారు. దావూద్ ఇబ్రహీం, ఆయన సోదరులు అనీస్, ఇక్బాల్,చోటా షకీల్‌పై నమోదైన దోపిడీ కేసుల్లో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం వర్తింపచేయవచ్చా అనే దానిపై లోతైన పరిశీలన అవసరమని పోలీసు అధికారులు పేర్కొన్నారు. థానే కేసులో దీన్ని వర్తింపచేయాలంటే చోటా షకీల్‌పై గతంలో నమోదైన కేసులను ప్రాతిపదికగా చూపాల్సి ఉంటుందని చెప్పారు. -
దావూద్ ఆరోగ్యంపై స్పందించిన ఛోటా షకీల్
అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు గుండెపోటు వచ్చిందని ఒకసారి.. కాదు కన్నుమూశాడని మరోసారి సోషల్ మీడియాలో రకరకాలుగా వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో అతడి సన్నిహిత అనుచరుడు ఛోటా షకీల్ స్పందించాడు. అతడి ఆరోగ్యం భేషుగ్గా ఉందని, దావూద్‌కు అనారోగ్యంగా ఉందంటూ పాకిస్తానీ మీడియాలో వచ్చినవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పాడు. వాస్తవానికి శుక్రవారం నుంచే దావూద్ ఇబ్రహీం చనిపోయాడంటూ వదంతులు వ్యాపించాయి. దీనిపై ఛోటా షకీల్ కరాచీ నుంచి భారతీయ జాతీయ మీడియాతో మాట్లాడాడు. ''నా గొంతు వింటే మీకు ఏమైనా జరిగినట్లు అనిపిస్తోందా? అవన్నీ వదంతులే. భాయీ బ్రహ్మాండంగా ఉన్నారు, ఎలాంటి సమస్యా లేదు'' అని ఛోటా షకీల్ చెప్పాడు. కరాచీలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం విషమ పరిస్థితిలో ఉన్నట్లుగా కథనాలు వచ్చాయి. అతడు గత కొంత కాలంగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో పరిస్థితి మరింత విషమించిందని పాకిస్తానీ మీడియాలోని ఒక వర్గం తెలిపింది. అయితే ఇప్పుడు అదంతా తప్పేనని ఛోటా షకీల్ అంటున్నాడు. -
ఛోటా షకీల్ నుంచి బెదిరింపు కాల్స్!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజంగా వ్యవహరించే ఛోటా షకీల్ నుంచి బాలీవుడ్ దర్శకుడు, నిర్మాతలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై రైటర్ కమ్ డైరెక్టర్ విశాల్ మిశ్రా, నిర్మాత వినోద్ రమణి మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఛోటా షకీల్ ఆఫీస్ నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ డీసీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదుచేశారు. తాము తీసిన మూవీలో కొన్ని సీన్లు డిలీట్ చేయాలని, లేనిపక్షంలో విడుదల చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారని వారు తెలిపారు. డీసీపీ బీకే సింగ్ కథనం ప్రకారం.. బాలీవుడ్ లేటెస్ట్ మూవీ 'కాఫీ విత్ డి' ప్రమోషన్ ఈవెంట్స్ ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ మూవీలో దావూద్ ఇబ్రహీంపై జోకులు ఉన్న సీన్లు, అతడ్ని చెడుకోణంలో చిత్రీకరించిన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని ఖచ్చితంగా తొలగించాలని, లేకపోతే మూవీనే విడుదల చేయవద్దని ఛోటా షకీల్ ఆఫీస్ నుంచి తమకు కాల్స్ వచ్చాయిన వారు ఫిర్యాదుచేశారు. తమకు ముంబైతో సబంధంలేని కారణంగా ఢిల్లీలో ఫిర్యాదు చేస్తున్నట్లు డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్పారు. మొదట వారికి ఢిల్లీ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత దుబాయ్ నుంచి కాల్స్ చేసి తాము చెప్పింది చేస్తారా లేదా అని హెచ్చరించారు. సునీల్ గ్రోవర్ (కపిల్ శర్మ షో ఫేమ్) అనే జర్నలిస్టు దావూద్ ఇబ్రహీంను ఇంటర్వ్యూ చేసే సీన్లు ఈ మూవీలో ఉన్నాయి. ఇవే సమస్యకు దారితీశానని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేశామని, విచారణ చేపట్టనున్నట్లు డీసీపీ వివరించారు. -
జైల్లో ఉన్నా.. ఆ డాన్‌ను లేపేస్తామంటున్నారు?
న్యూఢిల్లీ: గత ఏడాది అక్టోబర్‌లో ఇండోనేషియాలో పట్టుబడ్డ అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ప్రస్తుతం తీహార్ జైలులో అత్యంత భద్రత మధ్య ఉన్నాడు. అయినా అతడికి చావు బెదిరింపులు ఆగడం లేదు. ఛోటా రాజన్‌ను చంపేస్తామంటూ తాజాగా దావూద్ ఇబ్రహీం నమ్మిన బంటు, గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ తీహార్ జైలు సీనియర్ అధికారికి ఎస్సెమ్మెస్ చేశాడు. ఈ బెదిరింపు మెసేజ్ నేరుగా ఛోటా షకీల్ మొబైల్ ఫోన్ నుంచే వచ్చినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్‌కు మంరిత అదనపు భద్రత కల్పించాలని జైలు అధికారులు నిర్ణయించారు. 971504265138 సెల్ నంబర్ నుంచి తీహార్ జైలు లా అధికారి సునీల్ గుప్తాకు ఇటీవల ఓ ఎస్సెమ్మెస్ వచ్చింది. ఛోటా రాజన్‌ను అతిత్వరలోనే అంతం చేస్తామని ఆ ఎస్సెమ్మెస్ బెదిరించింది. ఆ వెంటనే తీహార్ జైలు ల్యాండ్‌లైన్ నంబర్ ఓ కాల్ కూడా వచ్చింది. అందులోనూ రాజన్ ను చంపేస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలో రాజన్‌కు మరింత భద్రత పెంచిన జైలు సిబ్బంది.. ఈ బెదిరింపుల గురించి పోలీసులకు సమాచారమిచ్చారు. -
దావూద్ చనిపోతే.. వారసుడెవడు?
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ప్రాణ గండం సమీపించిందనే కథనాల నేపథ్యంలో దావూద్ వారసుడు ఎవరన్నది కీలకంగా మారింది. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, ఆయనకు సోకిన గ్యాంగ్రీన్ చివరిదశలో ఉందని వైద్యులు తేల్చి చెప్పినట్లు తాజాగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనాలు నిజం కావని, దావూద్ బలంగానే ఉన్నాడని అతని రైట్ హ్యాండ్ ఛోటా షకిల్ చెప్తున్నప్పటికీ.. దావూద్ చనిపోతే అతని స్థానంలో మాఫియా నేరప్రపంచం పగ్గాలు ఎవరు చేపడతారు? ముంబై మాఫియాను ఎవరు నడిపిస్తారన్నది? చర్చనీయాంశంగా మారింది. ముంబై అండర్ వరల్డ్ కేసులు ఎన్నింటినో దర్యాప్తు చేసిన మాజీ పోలీసు అధికారి ఒకరు స్పందించారు. దావూద్ చనిపోతే.. అతని వీరవిధేయుడైన ఛోటా షకీల్ వారసుడిగా పగ్గాలు చేపట్టే అవకాశముందని వెల్లడించారు. 'దావూద్ స్థానంలో ఛోటా షకీలే పగ్గాలు చేపట్టే అవకాశముంది. షకీల్‌కు దూకుడు ఎక్కువ' అని ముంబై మాజీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ షంషేర్ ఖాన్ పఠాన్ తెలిపారు. అయితే, దావూద్ విషమపరిస్థితిలో ఉన్నాడని, రేపోమాపో అన్నట్టుగా అతని పరిస్థితి ఉందన్న కథనాలపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. మరోవైపు దావూద్ ఇబ్రహీం చాలా బలంగా ఉన్నాడని ఆయన కీలక అనుచరుడు చోటా షకీల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రాణ గండం సమీపించిందని మీడియాలో వచ్చిన కథనాలన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే అని అతను ఓ మీడియాకు తెలిపాడు. ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే దానిని మీడియా అనవసరంగా ప్రచారం చేస్తోందని, దావూద్‌కు ఎలాంటి ప్రాణముప్పు లేదని చెప్పుకొచ్చాడు. ఏదీఏమైనా -
'మా డాన్ చాలా ఫిట్‌గా ఉన్నారు'
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చాలా బలంగా ఉన్నారని ఆయన కీలక అనుచరుడు, సన్నిహితుడు చోటా షకీల్ చెప్పాడు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రాణ గండం సమీపించిందని మీడియాలో వచ్చిన కథనాలన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే అని ఓ మీడియాకు తెలిపాడు. ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే దానిని మీడియా అనవసరంగా ప్రచారం చేస్తోందని, దావూద్‌కు ఎలాంటి ప్రాణముప్పు లేదని చెప్పాడు. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, వైద్యులు కూడా గ్యాంగ్రీన్ చివరిదశలో ఉన్నట్లు తేల్చి చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరాచీలోని లియాఖత్ జాతీయ ఆస్పత్రిలో అతనికి సైనిక ఆస్పత్రి వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారని, సీఎన్ఎన్-న్యూస్ 18 తాజా కథనం ప్రకారం గ్యాంగ్రీన్ చివరి దశలో ఉందని, దావూద్ మరణించే అవకాశముందని వైద్యులు చెప్పినట్లు కథనాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలోనే దావూద్ ఆరోగ్యంపై చోటా షకీల్ స్పందించాడు. 'మా గ్యాంగ్ స్టర్ దావూద్ చాలా ఫిట్ గా ఉన్నారు. వ్యక్తిగత లాభంతో ఎవరో సృష్టించిన గందరగోళంతో ఈ వదంతులు వ్యాపిస్తున్నాయి. మీ వార్తా సంస్థల వద్ద ఉంది తప్పుడు సమాచారం. దావూద్ ఫిట్ గా ఉన్నారు' అని అతడు చెప్పాడు. -
ఛోటారాజన్‌కు ప్రాణభయం.. వీడియో కాన్ఫరెన్సుతో విచారణ!
ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న మాఫియాడాన్ ఛోటా రాజన్‌కు ప్రాణభయం విపరీతంగా పట్టుకుంది. అతడిని తాము చంపేయడం ఖాయమని డి-గ్యాంగులోని నెం.2 ఛోటా షకీల్ బహిరంగంగా హెచ్చరించాడు. దాంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నా కూడా.. తన ప్రాణాలకు గ్యారంటీ లేదని ఛోటా రాజన్‌కు అర్థమైపోయింది. కోర్టుకు వెళ్లే సమయంలోను, కోర్టు హాల్లో కూడా చంపడం ముంబై మాఫియా గ్యాంగులకు వెన్నతో పెట్టిన విద్య. అలాగే తనను కూడా హతమారుస్తారన్న భయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని కోరాడు. దాన్ని జడ్జి కూడా ఆమోదించారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక జడ్జి వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మోకా కోర్టులో విచారణ సాగుతుండటంతో రాజన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు అనుమతించాలని సీబీఐ కోరింది. తీహర్ జైలు సూపరింటెండెంట్ కూడా ఈ మేరకు ఇంతకుముందే సీబీఐకి ఓ లేఖ రాశారు. ఆర్థర్ రోడ్డు జైలు ప్రాంగణంలో ఉన్న మోకా కోర్టుకు రాజన్ హాజరు కావాల్సి ఉంది. అయితే అతడిని నేరుగా ప్రవేశపెట్టాలంటే ప్రాణాలకు ముప్పు కాబట్టి, వీడియో కాన్ఫరెన్సు ద్వారానే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం నకిలీ పాస్‌పోర్టు కేసులో మాత్రమే ఛోటా రాజన్ అరెస్టయ్యాడు. ముంబైకి చెందిన ప్రముఖ జర్నలిస్టు జె డే హత్యకేసులో కూడా రాజన్‌పై ప్రొడక్షన్ వారంటు ఉంది. ఛోటా రాజన్ ఇప్పుడు చచ్చిన పాముతో సమానమని, అతడిని తాము ప్రత్యర్థిగా భావించడంలేదని ఇంతకుముందు దావూద్ ఇబ్రహీం పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఛోటా షకీల్ చెప్పాడు. అయితే అతడిని తీహార్ జైల్లోనే తాము లేపేయడం ఖాయమని స్పష్టం చేశాడు. ఇంతకుముందు కూడా రాజన్‌ను హతమార్చేందుకు ప్రయత్నించామని, అయితే అతడు తృటిలో తప్పించుకున్నాడని చెప్పాడు. -
ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడి అరెస్ట్
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కుడిభుజంగా వ్యవహరించే ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడు అబ్బాస్‌ను ముంబై ఏఈసీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అబ్బాస్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, ఈ నెల 7 వరకు పోలీస్ కస్టడీకి ఆదేశించారు. తీహార్ జైల్లో ఉన్న మరో మాఫియా డాన్ ఛోటా రాజన్‌ను జైల్లోనే చంపేస్తామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఛోటా షకీల్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడు అబ్బాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోనేసియా పోలీసులు ఛోటా రాజన్‌ను అరెస్ట్ చేసి భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. -
'జైల్లోనే ఛోటా రాజన్‌ను చంపేస్తాం'
మాఫియా డాన్ ఛోటా రాజన్‌ను తిహార్ జైల్లోనే హతమారుస్తామని మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజం ఛోటా షకీల్ హెచ్చరించాడు. శనివారం దావూద్ 60వ బర్త్ డే సందర్భంగా ఛోటా షకీల్ ఓ జాతీయ వెబ్‌సైట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దావూద్ బర్త్ డే వేడుకలు, డి గ్యాంగ్ వ్యవహారాలు, ఛోటా రాజన్‌తో విరోధం తదితర విషయాల గురించి మాట్లాడాడు. ఛోటా రాజన్ చచ్చిన పాముతో సమానమని ఛోటా షకీల్ అన్నాడు. 'రాజన్‌ను మేం ప్రత్యర్థిగా భావించడం లేదు. మాకు వ్యతిరేకంగా అతను నిలబడలేడు. ప్రస్తుతం అతడు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజన్‌ను తిహార్ జైల్లోనే చంపేస్తాం. అతణ్ని చంపేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నించాం. అయితే కొద్దిలో తప్పించుకున్నాడు. ఈ రోజు కాకపోతే రేపయినా రాజన్‌ను హతమారుస్తాం' అని ఛోటా షకీల్ చెప్పాడు. బాలిలో రాజన్‌ను అరెస్ట్ చేసిన ఇండోనేసియా పోలీసులు అతణ్ని భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లో రహస్య జీవితం గడుపుతున్న దావూద్ ఘనంగా బర్త్ డే వేడుకలు చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఛోటా షకీల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక డి గ్యాంగ్ నుంచి దావూద్ వైదొలిగి మరొకరికి బాధ్యతలు అప్పగించనున్నట్టు వచ్చిన వార్తలు కూడా వాస్తవం కాదని వెల్లడించాడు. 'దావూడ్ భాయ్ ఎప్పటికి రిటైర్ కాడు. ఎప్పటికి అతనే మాకు బాస్. అతడి స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఎవరికీ లేదు' అని ఛోటా షకీల్ చెప్పాడు. -
రాజన్‌ను త్వరలోనే లేపేస్తాం
మాఫియా డాన్, దావూద్ ఇబ్రహీం కుడి భుజం లాంటి ఛోటా షకీల్ నోరు విప్పాడు. త్వరలోనే తాము ఛోటా రాజన్‌ను లేపేయడం ఖాయమని స్పష్టం చేశాడు. పాతికేళ్లుగా తమ డి కంపెనీకి ఛోటా రాజన్‌తో శత్రుత్వం ఎందుకు ఉందో కూడా తెలిపాడు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల నిందితుల్లో ఆరుగురిని ఛోటా రాజన్ గ్యాంగు చంపేసింది. 1998-2001 మధ్య ఈ హత్యలు జరిగాయి. దాన్ని తాము ఈరోజు వరకు జీర్ణించుకోలేకపోతున్నట్లు షకీల్ చెప్పాడు. బాలిలో రాజన్ అరెస్టు అయినప్పటి నుంచి మళ్లీ రెండు దశాబ్దాల నాటి పాత పగలను గుర్తుకు తెచ్చుకున్నామన్నాడు. అప్పట్లో రాజన్ గ్యాంగు హతమార్చినవాళ్లలో యాకూబ్ యేడా సోదరుడు మజీద్ ఖాన్ ఒకడు. అతడు దావూద్ ఇబ్రహీంతో పాటు ఛోటా షకీల్‌కు కూడా బాగా సన్నిహితుడు. ఈ హత్యలో రాజన్‌కు పోలీసులు కూడా సహకరించారని షకీల్ అంటున్నాడు. ఇప్పటికే డి కంపెనీ కోర్టులో రాజన్‌కు మరణశిక్ష విధించామని, ఈ హత్యల కారణంగా త్వరలోనే రాజన్‌ను చంపడం ఖాయమని స్పష్టం చేశాడు. త్వరలోనే అవకాశం రావాలని అల్లాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. సీబీఐ వాళ్లు రాజన్‌ను ముంబై పోలీసులకు అప్పగించడానికి నిరాకరించడంపై కూడా ఛోటా షకీల్ వ్యాఖ్యానించాడు. ''రాజన్ ఏమైనా వాళ్లకు చుట్టమా.. అందుకే ముంబై పోలీసులకు అప్పగించలేదా? కేసులన్నీ ముంబైలోనే కదా ఉన్నవి.. ఆరుగురు నిర్దోషులను చంపేశాడు. ఆ కేసులు కూడా ముంబై పోలీసుల వద్దే ఉన్నాయి. ఈ హత్యల వల్లే అతడికి దేశభక్తుడన్న పేరు వచ్చేసింది'' అని ఛోటా షకీల్ అన్నాడు. -
విక్కీ మల్హోత్రా చేతికి ఛోటా రాజన్ సామ్రాజ్యం!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ ఛోటారాజన్ అరెస్టుతో ఆయన సామ్రాజ్యం పగ్గాలు మరో గ్యాంగ్ స్టర్ విక్కీ మల్హోత్రా చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తున్నది. విక్కీ మల్హోత్రా ఛోటా రాజన్‌కు కుడిభుజం లాంటివాడు. తన బాస్ ఆశీస్సులతో అతను స్వతంత్ర అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసి.. దావూద్ ఇబ్రహీం 'డీ' గ్యాంగ్‌కు చెక్ పెట్టాలని భావిస్తున్నాడు. గడిచిన కొద్ది నెలల్లో అతని కదలికలు చూస్తుంటే.. అతడు సొంత గ్యాంగ్‌తో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నదని అతని కోసం గాలిస్తున్న భద్రతా సంస్థలు చెప్తున్నాయి. విక్కీ మల్హోత్రా గత రెండు దశాబ్ధాల నుంచి ఛోటారాజన్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నాడు. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ వెంటే ఉన్నాడు. 2000 సంవత్సరంలో బ్యాంకాక్‌లో ఛోటారాజన్పై హత్యాయత్నం జరిగిన తర్వాత అతని కీలక అనుచరులు రవి పూజారి, సంతోష్ షెట్టి దూరం జరిగినా.. విక్కీ మాత్రం ధోకా చేయలేదు. 2005లో ఢిల్లీలోని అశోకా హోటల్ వద్ద అరెస్టయిన విక్కీ 2010లో బెయిల్ మీద బయటకొచ్చి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటినుంచి అతను దుబాయ్, ఆఫ్రికా మధ్య చక్కర్లు కొడుతున్నట్టు భావిస్తున్నారు. ఇదే సమయంలో దావూద్ కూడా గ్యాంగ్ కార్యకలాపాలను ఆఫ్రికాకు విస్తరించడం గమనార్హం. 'డీ' కంపెనీ వ్యవహారాలను కమాండ్ చేస్తున్న ఛోటా షకీల్ ముంబైలో అండర్ వరల్డ్ సామ్రాజ్యంలో పట్టుసాధించకుండా నిరోధించేందుకే ఛోటా రాజన్ సామ్రాజ్య పగ్గాలు విక్కీకి ఇచ్చినట్టు భావిస్తున్నారు. విక్కీ మల్హోత్రా గ్యాంగ్‌ను నిరోధించేందుకు 'డీ' కంపెనీ ప్రయత్నిస్తే.. మళ్లీ ముంబైలో గ్యాంగ్‌వార్ ప్రారంభమయ్యే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఛోటా షకీల్ నుంచి ముప్పు పొంచి ఉండటం, ఆస్ట్రేలియా పోలీసులు తనకోసం గాలిస్తుండటం, అనారోగ్యం తదితర కారణాలతో గత మే-ఏప్రిల్‌లోనే ఛోటా రాజన్ ఆస్ట్రేలియా నుంచి పలుసార్లు ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపాడని, పెద్దగా సానుకూలత రాకపోవడంతో తనకు తాను ముందుకొచ్చి అతను అరెస్టయి ఉంటాడని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో తనతో టచ్‌లో ఉన్న విక్కీ మల్హోత్రాను ఒప్పించి.. అతనికి తన సామ్రాజ్యాన్ని అప్పగించి.. ఛోటా రాజన్ అరెస్టయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. విక్కీ గతంలో దావూద్ కంపెనీతో చేతులు కలిపాడని వచ్చిన వార్తలను భద్రతా సంస్థలు తోసిపుచ్చాయి. అతడు ఇప్పటికీ ఛోటా రాజన్‌కే నమ్మకస్తుడిగా ఉన్నాడని పేర్కొన్నాయి. -
లొంగిపోయాడా?
చోటా రాజన్ అరెస్టుపై సందేహాలు (సెంట్రల్ డెస్క్): ఇరవై ఏళ్లుగా భారత చట్టానికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న చోటా రాజన్ నిజంగానే అరెస్టయ్యాడా? లేక తనకు తానుగా లొంగిపోయాడా? కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న రాజన్ అనుచరవర్గాన్ని దాదాపుగా కోల్పోయాడని, దావూద్ కుడిభుజం చోటా షకీల్ నుంచి ప్రాణహాని పొంచివుండటంతో భారత్‌లోని జైళ్లే తనకు సురక్షితమని భావించి లొంగిపోయాడనే వాదన వినిపిస్తోంది. చోటుచేసుకున్న పరిణామాలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి. ఒంటరి ప్రయాణం... ముఖం నిండా నవ్వు మోహన్‌కుమార్ అనే మారుపేరుతో జి9273860 నంబరుతో రాజన్‌కు 2008లో సిడ్నీలో భారత పాస్‌పోర్ట్ మంజూరు అయ్యింది. ఉన్నతస్థాయిలో సహకారం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదనేది కొందరి వాదన. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చోటారాజన్ ప్రాణహానిని తప్పించుకోవడానికి లొంగిపోవడమే మేలనే నిర్ణయానికి వచ్చి ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లోని ఉన్నతాధికారులకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఒకప్పటి ఐబీ అధినేత, ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ అరెస్టు అనబడే లొంగుబాటు వ్యవహారాన్ని డీల్ చేశారని, ఎప్పుడు, ఎలా జరగాలనేది ప్లాన్ చేసి... ఆదివారం సిడ్నీ నుంచి బాలిలో దిగగానే ఇండోనేసియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. గత ఏడాది చివరి నాటికే అనుచరగణాన్ని దాదాపుగా కోల్పోయిన రాజన్ ప్రాణభయంతో వణికిపోయాడని, పోలీసులకు చిక్కగానే రిలీఫ్‌గా ఫీలయ్యాడని, అతని ముఖంలో చిరునవ్వు దీని ఫలితమేనని పరిశీలకుల విశ్లేషణ. మాఫియా డాన్ అయిన రాజన్ సురక్షితమని భావించకపోతే... ఎందుకు ఒంటరి ప్రయాణం చేస్తాడనే ప్రశ్న తలెత్తుతోంది. అలాగే ఎలాంటి ప్రతిఘటనా లేకుండా అతను లొంగిపోవడం కూడా గమనార్హం. బంధం గట్టిదే...! దావూద్ గ్యాంగ్ సభ్యులను, ఐఎస్ఐ తరఫున పనిచేస్తున్న వారిని ఏరిపారేయడానికి రాజన్‌ను భారత ఏజెన్సీలు వాడుకున్నాయి. పాక్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్ఎస్ మాస్టర్‌మైండ్ ఖాలిద్ మసూద్, నేపాల్ చట్టసభల సభ్యుడు దిల్షాద్ మీర్జా బేగ్, పర్వేజ్ టాండాలను ఐబీ సహకారంతోనే రాజన్ ముఠా మట్టుబెట్టింది. దావూద్‌కు సన్నిహితులుగా భావించే తకీయుద్దీన్ వాహిద్‌ఖాన్ (ఈస్ట్‌కోస్ట్ ఎయిర్‌లైన్స్) జమీమ్ షా (నేపాల్ కేబుల్ ఆపరేటర్)లను హతమార్చడంలోనూ రాజన్ గ్యాంగ్ హస్తముందని భావిస్తారు. 1998 తప్పుడు పాస్‌పోర్ట్‌పై ప్రయాణిస్తూ థాయ్‌లాండ్‌లో చోటా రాజన్ దొరికిపోయాడు. ఇంటర్‌పోల్ నోటీసు ఉన్నప్పటికీ అప్పుడు భారత్ అతనికోసం పెద్దగా ఆసక్తి చూపలేదట. ఒక్కరోజులోనే విడుదలయ్యాడు. తర్వాత 2000 సంవత్సరంలో బ్యాంకాక్‌లోనే డి గ్యాంగ్ అతనిపై దాడి చేసినపుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో థాయ్ పోలీసుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రశ్నించడానికి భారత్ నుంచి ఐదుగురు పోలీసులు బృందం బ్యాంకాక్‌కు బయలుదేరింది. ఈలోపే అనుచరులు విజయ్ షెట్టి, సంతోష్ షెట్టిలు రాజన్‌ను ఆసుపత్రి నుంచి తప్పించారు. ఇక్కడా భారత ఏజెన్సీల పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముంబై పోలీసులకు సమాచారం లేదు చోటా రాజన్‌పై ఉన్న కేసుల్లో సింహభాగం ముంబైలో నమోదైనవే. అయితే అతని అరెస్టు లేదా లొంగుబాటుకు సంబంధించి ముంబై పోలీసులకు ఎలాంటి సమాచారమూ లేదట. 2005లో దావూద్ పెద్ద కూతురు మహ్రూక్‌ను జావిద్ మియాందాద్ కుమారుడు జునైద్‌కు ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. అప్పుడు ఐబీ చీఫ్‌గా ఉన్న అజయ్ దోవల్... ఈ పెళ్లి వేడుకలో దావూద్‌ను టార్గెట్ చేయాలని ప్లాన్ వేశారు. రాజన్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌షూటర్ వికీ మల్హోత్రా, ఫరీద్ తనాషాలను ఈ పనిమీద కరాచీకి పంపాలని నిర్ణయించారు. వేడుక జరిగే మండపంలోకి దావూద్ రాగానే వికీ అతన్ని కాల్చాలనేది పథకం. వీరిద్దరూ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగా... దోవల్ ప్లాన్ గురించి తెలియని ముంబై పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్లాన్ తలకిందులైంది. ఈ విషయాన్ని హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.సింగ్ ఆగష్టులో ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ వెల్లడించారు కూడా. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకూడదని భావించారేమో... రాజన్ వ్యవహారాన్ని ఈసారి ముంబై పోలీసులకు తెలియకుండా గుట్టుగా ఉంచారు. మంచి బాలుడు గిర్వి.. పశ్చిమ మహారాష్ట్ర సతారా జిల్లాలోని ఫల్తాన్ తెహసీల్‌లో ఓ చిన్న గ్రామం. గతంలో అక్కడ ఒక గుడిసె ఉండేది. ఆ తర్వాత అది ఓ పెద్ద భవంతిగా అవతరించింది. ఆ భవంతి పేరు సదాలక్ష్మి. ఆ చుట్టుపక్కల దాన్ని మించిన కట్టడం లేదని ఆ గ్రామస్తులు చెబుతారు. 20 ఏళ్లుగా పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ రాజేంద్ర సదాశివ్ నికల్జే అలియాస్ చోటా రాజన్ తన చిన్నప్పుడు అక్కడ ఎక్కువ కాలం గడిపాడు. రాతి గోడలతో, ఇనుపగేట్లతో పకడ్బందీగా నిర్మించిన ఆ ప్యాలెస్‌లో అందమైన లాన్లు కూడా ఉన్నాయి. 50ల్లో ముంబైకి వలసవెళ్లిన రాజన్ తండ్రి సదాశివ్ సఖరాం నికల్జే విగ్రహమూ అక్కడ ఉంది. రాజన్ చిన్నప్పుడు తమ దుకాణానికి తరచుగా వచ్చేవాడని, అతడు మంచి బాలుడని ఓ గ్రామస్తుడు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ముంబైలోపుట్టిన రాజన్ వేసవి సెలవుల్లో, దీపావళి సెలవుల్లో గిర్వి గ్రామానికి వచ్చేవాడన్నారు. ముంబైలో అండర్ వరల్డ్ డాన్‌గా మారిన తర్వాత ఇక్కడికి రావడం మానేశాడని చెప్పారు. అయితే కుటుంబ శుభకార్యాలు జరిగినప్పుడు మాత్రం రాజన్ భార్య, సోదరులు ఇక్కడికి వస్తుంటారని మరో గ్రామస్తుడు చెప్పారు. 1976లో తండ్రి మరణానంతరం రాజన్ సొంత గ్రామానికి రావడం మానేశాడ న్నారు. రాజన్ నేర కార్యకలాపాల్లో పాలుపంచుకునేవాడని అంగీకరించిన గ్రామస్తులు.. దావూద్ ఇబ్రహీంకు విరోధిగా మారడాన్ని మాత్రం స్వాగతించడం గమనార్హం. -
ఛోటా రాజన్‌ను పట్టించింది నేనే
నేర సామ్రాజ్యాన్ని తనదైన శైలిలో ఏలిన ఛోటా రాజన్ ఇంతకీ ఎలా పట్టుబడ్డాడో తెలుసా.. అతడి బద్ధశత్రువు, మరో మాఫియా నాయకుడు షకీల్ షేక్.. అలియాస్ ఛోటా షకీలే పట్టించాడట. నిజానికి 15 ఏళ్ల క్రితమే ఛోటా రాజన్‌ను బ్యాంకాక్‌లో చంపించేందుకు షకీల్ ప్లాన్ వేశాడు. ఇప్పుడు రాజన్ అరెస్టు తనకేమంత సంతోషంగా అనిపించట్లేదని చెప్పాడు. గత వారంలో కూడా తన మనుషులు ఫిజీలో ఛోటా రాజన్‌ను చంపేందుకు ప్రయత్నించారని, అతడు ఎక్కడెక్కడ దాక్కుంటున్నాడో అన్నీ తమకు తెలుసని ఛోటా షకీల్ చెప్పాడు. తర్వాత అతడు ఇండోనేసియాకు పారిపోతున్న విషయం తెలిసి.. అతడిని అరెస్టు చేయించానన్నాడు. డి కంపెనీ కూడా తమ శత్రువు అరెస్టును జీర్ణించుకోలేకపోతోంది. తమ శత్రుత్వం ఇక్కడితో ముగిసిపోయేది కాదని మాఫియా నాయకులు అంటున్నారు. ఎలాగైనా అతడిని చంపాలనుకుంటున్నానని, అప్పటివరకు విశ్రమించేది లేదని షకీల్ అన్నాడు. అతడిని భారతదేశానికి పంపేసినా కూడా తన ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని తెలిపాడు. తాను భారత ప్రభుత్వాన్ని నమ్మేది లేదని, వాళ్లే ఇన్నాళ్లబట్టి రాజన్‌ను పెంచి పోషించారని, తమమీదకు ఉసిగొల్పారని షకీల్ మండిపడ్డాడు. అసలు భారతదేశంలో అతడి మీద విచారణ జరిగి, శిక్ష పడుతుందన్న నమ్మకం తమకు లేదన్నాడు. శత్రువును ఖతమ్ చేయడమే తమ ఫండా (లక్ష్యం) అని తనదైన శైలిలో షకీల్ చెప్పాడు. అతడు ఎక్కడున్నా క్షమించేది లేదని స్పష్టం చేశాడు. దావూద్ ఇబ్రహీంకు కుడిభుజం లాంటి ఛోటా షకీల్.. ఎప్పటినుంచో రాజన్ కోసం వెతుకుతున్నాడు. 1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత రాజన్.. దావూద్ గ్యాంగ్ నుంచి విడిపోయాడు. 2000 సెప్టెంబర్ నెలలో రాజన్ మీద బ్యాంకాక్‌లో దాడి చేయించింది ఛోటా షకీలే. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజన్.. ఆస్పత్రిపాలయ్యాడు. ఆ తర్వాత తన అనుచరుల సాయంతో ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఈ రెండు గ్యాంగుల మధ్య దాదాపు రెండు దశాబ్దాల వైరం ఉంది. అటు ఇటు జరిగిన దాడుల్లో రెండు గ్యాంగులకు చెందిన చాలామంది హతమయ్యారు. వాళ్లలో ముందుగా మరణించింది దావూద్‌కు సన్నిహిత అనుచరుడు శరద్ శెట్టి. ఆ తర్వాత బిల్డర్ ఓపీ కుక్రేజా, ఎయిర్‌లైన్స్ సంస్థ ఎండీ టకీయుద్దీన్ వాహిద్, నేపాల్ ఎమ్మెల్యే మీర్జా బేగ్, అక్కడి కేబుల్ ఆపరేటర్ జమీమ్ షా, పర్వేజ్ తండా.. ఇలా ఒకరి తర్వాత ఒకరు నేలకొరిగారు. ఆ తర్వాత ముంబై పేలుళ్లకు కుట్రపన్నిన వాళ్లు ఒక్కొక్కరిని రాజన్ చంపడం మొదలుపెట్టాడు. సలీమ్ కుర్లా, మజీద్ ఖాన్, మహ్మద్ జింద్రన్.. ఇలాంటి వాళ్లు ఛోటా రాజన్ గ్యాంగు చేతిలో నేలరాలారు. -
ప్రతీకారం తీర్చుకుంటాం : చోటా షకీల్
న్యూఢిల్లీ : ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమన్ను ఉరి తీయడంపై అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు చోటా షకీల్ మండిపడ్డారు. స్వదేశానికి వచ్చి లొంగిపోతే ఉరి శిక్ష వేయమంటూ యాకుబ్‌కు ప్రమాణం చేసి నమ్మక ద్రోహనికి పాల్పడిందని ఆయన భారత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మెమన్ ఉరి తీయడం భారత ప్రభుత్వం చట్టపరంగా చేసిన హత్య అని షకీల్ అభివర్ణించారు. అందుకు తగ్గ పరిణామాలు ఉంటాయని భారత ప్రభుత్వాన్ని చోటా షకీల్ హెచ్చరించారు. టైగర్ మెమన్ చర్యలకు గాను అతడి సోదరుడిని శిక్షించారన్నారు. యాకుబ్ మెమన్ అమాయకుడు అని గుర్తు చేశారు. అలాంటి వాడిని ఉరి తీసి భారత ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇచ్చినట్లు అని ప్రశ్నించారు. ఈ మేరకు చోటా షకీల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 1993లో ముంబై మహానగరంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లకు యాకుబ్ మెమన్ నిందితుడని కోర్టు తెల్చింది. దాంతో అతడికి ఉరి శిక్ష వేసింది. దీంతో ఉరిశిక్షను రద్దు చేయాలంటూ యాకుబ్ పెట్టుకున్న దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించారు. ఆ క్రమంలో జులై 30 మహారాష్ట్రలోని నాగ్ పూర్ జైల్లో యాకుబ్ మెమన్ కు ఉరిశిక్షను అమలు చేశారు. దీనిపై చోటా షకీల్ పై విధంగా స్పందించారు. -
స్పాట్ ఫిక్సింగ్ లో వారిద్దరిదే కీలక పాత్ర: కోర్టు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ ప్రత్యేక పాత్ర ఉన్నట్టు దర్యాప్తులో తేలిందని డిల్లీ కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈకేసులో దావూద్, షకీలిద్దరూ కీలక ముద్దాయిలని, వీరికి సంబంధిచిన ఆస్థుల జప్టు పోలీసులు పూర్తి చేశారని అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి నీనా భన్సాల్ కృష్ణ తెలిపారు. ఈ కేసులో వీరిద్దరికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఆస్తుల జప్తులకు మార్గనిర్ధేశం చేయాలని కోర్టును ఢిల్లీ పోలీసులు కోరారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఇప్పటికే దావూద్, షకీల్ ఆస్తులను జప్తు చేశామని కోర్టుకు పోలీసులు తెలిపారు.