చోటా షకీల్‌ బంధువు ఆరిఫ్‌ షేక్‌ మృతి | Gangster Chhota Shakeel's Brother-In-Law Died | Sakshi
Sakshi News home page

చోటా షకీల్‌ బంధువు ఆరిఫ్‌ షేక్‌ మృతి

Jun 22 2024 11:17 AM | Updated on Jun 22 2024 11:34 AM

Brother in Law of Gangster Chhota Shakeel Died

అండర్ వరల్డ్ డాన్ ఛోటా షకీల్ బంధువు ఆరిఫ్ షేక్ అలియాస్ ఆరిఫ్ భాయిజాన్ ముంబైలో గుండెపోటుతో మృతి చెందాడు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో అరెస్టయిన ఆరిఫ్ షేక్.. ఛోటా షకీల్‌కు బావ వరుస అవుతాడు.

ప్రస్తుతం ఆరిఫ్‌ ఆర్థర్ రోడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ముంబైలోని జెజె ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరీఫ్ మృతి చెందాడు.

అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరుడు ఛోటా షకీల్‌కు  ఆరిఫ్‌ సహాయం అందించాడనే ఆరోపణలున్నాయి. 61 ఏళ్ల ఆరిఫ్ షేక్‌ను 2022 మేలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. గత రెండేళ్లుగా ఆర్థర్ రోడ్ జైలులో ఆరిఫ్‌ శిక్ష అనుభవిస్తున్నాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి కారణంగా ఆరిఫ్ షేక్‌ను జూన్ 21న ఆస్పత్రికి తరలించారు. ఆరీఫ్‌కు ఇద్దరు సంతానం అని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement