సీఎం కప్‌లో అపశ్రుతి
వనపర్తి: జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన గ్రా మస్థాయి సీఎం క్రీడా పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న పదవ తరగతి విద్యార్థి వాలీబాల్ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పామిరెడ్డిపల్లి ముందరితండాకు చెందిన సాయి పునీత్ (15) బలిజపల్లి జెడ్పీ హైసూ్కల్‌లో చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి ఉదయం నుంచి క్రీడాపోటీల్లో పాల్గొన్నాడు.
పాఠశాల ఆవరణలో ఉదయం ఒకసారి కళ్లుతిరిగి పడిపోగా.. నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో తల్లి నీలమ్మ అక్కడికి చేరుకుంది. అయితే తనకు ఏమీ కాలేదని.. తల్లిని ఇంటికి వెళ్లమని పునీత్ చెప్పటంతో ఆమె ఇంటికి వెళ్లిపోయింది. మళ్లీ క్రీడల్లో పాల్గొన్న పునీత్ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
నిర్వాహకులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. కాగా.. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు జిల్లా కేంద్రంతో పాటు బలిజపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment