సాక్షి, వనపర్తి జిల్లా: హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద మందడి మండలం వెల్టూర్ స్టేజి సమీపంలోని జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారును వెనక నుండి డీసీఎం ఢీకొట్టడంతో కారు ముందు వెళ్తున్న ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన లారీని కారు ఢీ కొట్టింది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 108 అంబులెన్స్‌లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో పదేళ్ల బాలుడు, మరో మహిళ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కారులో వెళ్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment