Bangalore Highway
-
హైదరాబాద్- బెంగుళూరు హైవేపై ఘోర ప్రమాదం
సాక్షి, వనపర్తి జిల్లా: హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద మందడి మండలం వెల్టూర్ స్టేజి సమీపంలోని జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారును వెనక నుండి డీసీఎం ఢీకొట్టడంతో కారు ముందు వెళ్తున్న ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన లారీని కారు ఢీ కొట్టింది.దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 108 అంబులెన్స్‌లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో పదేళ్ల బాలుడు, మరో మహిళ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కారులో వెళ్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది. -
అన్నమయ్య జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లి-బెంగుళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఐదుగురి మృతి చెందారు. మదనపల్లి మండలం బార్లపల్లి వద్ద ఘటన జరిగింది. -
హైవే ఎక్కుతున్నారా.. ఓసారి జేబులు చెక్ చేసుకోండి!
షాద్‌నగర్: టోల్ బాదుడు ఏటా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. యథావిధిగా ఈ ఏడాది కూడా టోల్‌ప్లాజాలో ధరలు పెరుగుతుండటంతో జాతీయ రహదారిపై ప్రయాణం మరింత భారం కానుంది. టోల్ ప్లాజాలో రుసుములు పెరుగుతుండటంతో అటు వాహనదారులు, ఇటు సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ –బెంగళూరు 44వ జాతీయ రహదారిపై షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజాలో రుసుము భారీగా పెరిగింది. పెంచిన ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రయాణికులపై మరింత భారం బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణించే వారిపై భారం మరింత పెరగనుంది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం టోల్ ధరలు పెంచుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు సరికాదంటున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణికులు, వాహనదారులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారి వెంట సబ్వే సరిగా లేకపోవడంతో రోడ్డు పక్కన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా తప్పని పెంపు షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వరకు జాతీయ రహదారిని (సుమారు 58 కి.మీ) రూ.600 కోట్లతో విస్తరించి అవసరమైన చోట బైపాస్ నిర్మించారు. ఈ జాతీయ రహదారిని 2009లో కొత్తూరులో ప్రారంభించారు. షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులో నిర్మించిన టోల్ ప్లాజాలో ఏటా టోల్ రుసుము పెంచుతూ వస్తున్నారు. స్కూల్ బస్సుల నుంచి యథావిధిగా.. టోల్ ప్లాజాలో నెలవారీ పాసుల రుసుమును కూడా పెంచుతున్నారు. కారు, ప్యాసింజర్, వ్యాను లేక జీపు రూ.2,115 నుంచి రూ.2,425, లైట్ కమర్షియల్ వాహనాలు, మినీ బస్సులు రూ. 3,700 నుంచి రూ. 4,245, ట్రక్కు, బస్సు రూ.7,395 నుంచి రూ.8,485, మల్టీయాక్సిల్ వాహనాలు రూ.11,895 నుంచి రూ.13,635కి పెంచనున్నారు. స్కూల్ బస్సుల నుంచి యథావిధిగా నెలవారీగా రూ.1000 వసూలు చేయనున్నారు. అన్ని వాహనాలపై బాదుడే.. టోల్గేట్లో ఈసారి అన్ని రకాల వాహనాలైన కారు, ప్యాసింజర్ వ్యాన్, లైట్ కమర్షియల్ వాహనాలతో పాటు ట్రక్కు, బస్సు, మల్టీయాక్సిల్ వాహనాలు (అనేక చక్రాల వాహనం)లకు రుసుములను భారీగా పెంచనున్నారు. దీంతో టోల్ ప్లాజాకు ఆదాయం కూడా పెరగనుంది. నిత్యం ఈ టోల్ ప్లాజా నుంచి సుమారు 15వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు సుమారు రూ.28లక్షల మేర ఆదాయం సమకూరుతుంది. టోల్ ధరలు పెరుగుతుండటంతో మరో రూ.మూ డు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. (క్లిక్: మందుబాబులకు షాక్.. తాగేదంతా మద్యం కాదు) రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పెట్రోల్, ఢీజిల్ ధరల పెరుగుదల, టోల్ రుసుములు రవాణా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాహనాల యజమానులు తమ లారీలను నడపలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మళ్లీ టోల్ ధరల పెంపుతో భారం తప్పదు. – సయ్యద్ సాధిక్, లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుసుము తగ్గించాలి కరోనా నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టోల్ రుసుము పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతుంది. రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయపడాల్సిన వస్తోంది. రుసుము తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – శివకుమార్, షాద్‌నగర్ -
భువనగిరిలో విజన్ కౌంటీ!
సాక్షి, హైదరాబాద్: నగరంలో సొంతిల్లు అనేది ఉన్నత శ్రేణి వర్గాలకే కాదు సామాన్య, మధ్యతరగతి ప్రజలకూ ఉండాలి. అలా అని సిటీ కి దూరంగా, రవాణా సదుపాయాలు కూడా సరిగా లేని ప్రాంతాల్లో ఇల్లుండటం కాదు. సిటీకి దగ్గర్లో, అందుబాటు ధరల్లో ఫ్లాట్లు లభించాలి. అప్పుడే అది అఫడబుల్ హౌజింగ్ అవుతుందంటున్నారు విజన్ ఇండియా డెరైక్టర్ లింగమయ్య. అందుకే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్, బెంగళూరు హైవేల్లో అందుబాటు ధరల్లో పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామన్నారు. పూర్తి వివరాలివిగో.. హైదరాబాద్ దక్షిణ దిశ ప్రాంతాల్లో స్థిరాస్తి ధరలు అందుబాటులో లేక నివాస, వాణిజ్య సముదాయాలు తూర్పు దిశకు విస్తరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో మెట్రో పనులు శరవేగంగా జరుగుతుండటం, ఇప్పటికే ఉన్న ఐటీ కంపెనీలకు తోడు పోచారంలో ఐటీఐఆర్ ప్రాజెక్టూ రానుండటం వంటి కారణాలతో ఉప్పల్, ఘట్కేసర్, భువనగిరి ప్రాంతాలకు డిమాండ్ బాగా పెరిగింది. సామాన్యులకు సైతం ధరలు అందుబాటులో ఉండేలా భువనగిరిలో 15 ఎకరాల్లో ‘విజన్ కౌంటీ’ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 200- 500 చ.గ. ప్లాట్ల విస్తీర్ణం ఉంటుంది. బెంగళూరు హైవేలోని కొత్తూర్‌లో 18.5 ఎకరాల్లో ‘విజన్ ప్యారడైజ్’ పేరుతో మరో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించాం. 150 - 650 చ.గ. మధ్య మొత్తం 208 ఓపెన్ ప్లాట్లను అందంగా తీర్చిదిద్దుతున్నాం. దీనికి దగ్గర్లోనే మరో 50 ఎకరాల్లో విజన్ ప్రైడ్‌ను కూడా అభివృద్ధి చేస్తాం. ఫేజ్-1లో 25 ఎకరాల్లో మొత్తం 300 ఓపెన్ ప్లాట్లొస్తాయి. త్వరలోనే షాద్‌నగర్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి ఆనుకొని 70 నుంచి 100 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విజన్ ప్యారడైజ్ ప్రాజెక్ట్‌కు ఆనుకొనే వందల ఎకరాల్లో జాన్సన్ అండ్ జాన్సన్, పీ అండ్ డబ్ల్యూ వంటి మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తున్నాయి. దీంతో సమీప భవిష్యత్తులో కొత్తూర్ ప్రాంతంలో వేల కుటుంబాలు నివాసం ఏర్పరుచుకోనున్నాయి. అందుకే ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన 3 నెలల్లోనే 50 శాతం విక్రయాలైపోయాయంటే ఇక్కడి గిరాకీ, భవిష్యత్తు అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు.