
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై పూడూరు గేట్ వద్ద ఆర్టీసీ బస్సు – బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను పూడూరు మండలం మేడికొండకు చెందిన వారిగా గుర్తించారు.
ఓ ఇద్దరు యువకులు, ఓ బాలుడు కలిసి బైక్‌పై పూడూరు నుంచి మేడికొండ వైపు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మేడికొండ, ఒకరు గొంగుపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment