
సాక్షి, వనపర్తి: బీఆర్‌ఎస్, బీజేపీ నేతల తప్పుడు మాటలు నమ్మొద్దని.. ఆ పార్టీలు కలిసి కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇందిరమ్మ ప్రభుత్వంలో ఒకేసారి రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశాం. 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పథకాలు అమలు చేయడం లేదని ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు వాతలు పెట్టాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ చేశామని సీఎం పేర్కొన్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రాష్ట్రానికి సమస్య మోదీ కాదు.. కిషన్‌రెడ్డి’ అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. తెలంగాణపై కిషన్‌రెడ్డి పగబట్టారు. ఆయనకు ఎందుకంత అక్కసు?. ఖట్టర్ సమీక్షకు హాజరుకాని కిషన్‌రెడ్డి.. మెట్రోకు సహకరిస్తున్నారంటే నమ్మాలా?. కిషన్‌రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదానికి గత ప్రభుత్వమే కారణం. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు.’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment