ఒక్కోసారి మృతికి సంబంధించిన కొన్ని ఘటనలు రెండింతల విషాదాన్ని పంచుతాయి. ఒకేసమయంలో కుటుంబసభ్యులిద్దరు మృతి చెందడాన్ని ఎవరూ తట్టుకోలేరు. కన్నీరు పెట్టుకుంటారు. ఇటువంటి ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
తన తల్లి చితికి నిప్పుపెడుతున్న ఒక కుమారుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ, ఉన్నట్టుండి కింద పడిపోయాడు. చుట్టూ ఉన్నవారు అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే అతను మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లోగల సోహ్నాలో చోటుచేసుకుంది. తల్లీ కొడుకులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందడం స్థానికులకు త్రీవ విషాదాన్ని పంచింది. ఈ ఘటనల అనంతరం బంధువులు తొలుత తల్లికి ఆ తర్వాత కుమారునికి అంత్యక్రియలు నిర్వహించారు.
సోహ్నా పఠాన్ వాడా నివాసి ధరమ్ దేవి (92) వయోభారంతో మృతి చెందారు. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆమె కుమారుడు సతీష్ (69) తల్లి చితికి నిప్పు పెడుతున్న సమయంలో ఛాతీ నొప్పికి లోనయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సతీష్‌ను పరిశీలించి, మృతిచెందినట్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే ధరమ్ దేవి భర్త మరణించారు. తల్లీకొడుకులు ఒకేసారి మృతి చెందడంతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇది కూడా చదవండి: మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్‌గా ఉంటూ..
Comments
Please login to add a commentAdd a comment