cremation
-
తల్లి చితికి నిప్పంటిస్తూ.. గుండెపోటుతో కుమారుని మృతి
ఒక్కోసారి మృతికి సంబంధించిన కొన్ని ఘటనలు రెండింతల విషాదాన్ని పంచుతాయి. ఒకేసమయంలో కుటుంబసభ్యులిద్దరు మృతి చెందడాన్ని ఎవరూ తట్టుకోలేరు. కన్నీరు పెట్టుకుంటారు. ఇటువంటి ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. తన తల్లి చితికి నిప్పుపెడుతున్న ఒక కుమారుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ, ఉన్నట్టుండి కింద పడిపోయాడు. చుట్టూ ఉన్నవారు అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే అతను మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లోగల సోహ్నాలో చోటుచేసుకుంది. తల్లీ కొడుకులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందడం స్థానికులకు త్రీవ విషాదాన్ని పంచింది. ఈ ఘటనల అనంతరం బంధువులు తొలుత తల్లికి ఆ తర్వాత కుమారునికి అంత్యక్రియలు నిర్వహించారు.సోహ్నా పఠాన్ వాడా నివాసి ధరమ్ దేవి (92) వయోభారంతో మృతి చెందారు. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆమె కుమారుడు సతీష్ (69) తల్లి చితికి నిప్పు పెడుతున్న సమయంలో ఛాతీ నొప్పికి లోనయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సతీష్‌ను పరిశీలించి, మృతిచెందినట్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే ధరమ్ దేవి భర్త మరణించారు. తల్లీకొడుకులు ఒకేసారి మృతి చెందడంతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.ఇది కూడా చదవండి: మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్‌గా ఉంటూ.. -
తండ్రి చితికి నిప్పు పెట్టేంతలో కుమారుని మృతి
బివార్: విధి రాతను ఎవరూ తప్పించలేరని అంటారు. కొన్ని ఉదంతాలు చూసినప్పుడు ఇది ముమ్మాటికీ నిజం అనిపిస్తుంది. రాజస్థాన్‌లోని బివార్ జిల్లాలో గల జాలియా గ్రామంలో విధి ఆడిన వింత నాటకం స్థానికులను కంటతడి పెట్టించింది. తండ్రి మృతదేహాన్ని స్మశాన వాటికవరకూ తీసుకెళ్లిన కుమారుడు హఠాత్తుగా కన్నుమూశాడు.వివరాల్లోకి వెళితే జాలియా గ్రామంలోని బ్రహ్మపురి ప్రాంతంలో నివసిస్తున్న రాధాకృష్ణ నాగ్లా అనే వృద్ధుడు మృతిచెందాడు. తండ్రి మరణంతో అతని కుమారుడు మహావీర్ ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. బంధువుల సహాయంతో తండ్రి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లాడు. తండ్రి చితికి నిప్పు పెట్టేంతలో స్పృహ తప్పిపడిపోయాడు. అతనిని గమనించినవారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహావీర్ ప్రసాద్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులంతా షాకయ్యారు. చివరికి వారే తొలుత రాధాకృష్ణకు, ఆ తరువాత మహావీర్ ప్రసాద్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. మహావీర్ ప్రసాద్ సోదరుడు రాజ్ కుమార్ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. ఇప్పుడు రాధాకృష్ణ, మహావీర్ ప్రసాద్‌లు మృతిచెందడంతో వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి అనాథగా మారింది. -
కాశీలో గంగానది ఉగ్రరూపం.. 84 ఘాట్లు నీట మునక
ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో గంగానది ఉగ్రరూపం దాల్చింది. వరదల కారణంగా గంగానది జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఘాట్లకు సమీపంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాశీలోని మొత్తం 84 ఘాట్లు నీట మునిగాయి. ప్రస్తుతం హరిశ్చంద్ర ఘాట్ వీధుల్లో దహన సంస్కారాలు జరుగుతున్నాయి.గత 10 రోజులుగా వారణాసిలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వీధుల్లో దహన సంస్కారాలు చేయడం వల్ల కర్మకాండలు చేసేవారు సరైన సంప్రదాయాలను పాటించలేకపోతున్నారు. అక్కడ స్థలం తక్కువగా ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. సాయంత్రం పూట దహన సంస్కారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మణికర్ణిక ఘాట్‌లో దహన సంస్కారాల కోసం జనం చాలా సేపు వేచి ఉండాల్సి వస్తోంది. -
పంజాగుట్టలోని శ్మశానవాటికలో జరగనున్న చంద్రమోహన్ అంత్యక్రియలు
-
తల్లిని సజీవదహనం చేసిన తనయుడు
కంబదూరు: నవమాసాలు మోసి.. జన్మనిచ్చి.. కంటికి రెప్పలా కాపాడి.. పెంచి పెద్ద చేసిన కన్నతల్లినే ఓ కుమారుడు పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంబదూరులోని ఓబయ్య కాలనీకి చెందిన ఈడిగ గోపీనాథ్, సుజాతమ్మ(59) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు ఇద్దరికీ పెళ్లిళ్లు కావడంతోపాటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంటర్ చదివిన కుమారుడు ప్రణీత్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తాగుడుకు బానిసైన అతను ఉద్యోగం మానేసి స్వగ్రామం చేరుకున్నాడు. రోజూ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను హింసించేవాడు. సోమవారం కూడా మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని అనారోగ్యంతో మంచంలో పడుకుని ఉన్న తల్లి సుజాతమ్మను అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి సుజాతమ్మ భర్త గోపీనాథ్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చేలోపే పూర్తిగా కాలిపోయిన సుజాతమ్మ మృతి చెందింది. ఘటనాస్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడు ప్రణీత్‌ను అరెస్ట్ చేశారు. -
సర్పంచ్ కట్టించిన శ్మశానవాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం
పరకాల: ఓ సర్పంచ్ కొత్తగా కట్టించిన శ్మశానవాటిక.. ఆయన దహన సంస్కారాలతోనే ప్రారంభమయ్యింది. ఈ దురదృష్టకర ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబోతుపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... హైబోతుపల్లి గ్రామ సర్పంచ్ కంచ కుమారస్వామి (25) కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో సర్పంచ్ గత నెల 29న పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం చనిపోయాడు. కాగా, ఆ గ్రామాన్ని ఇటీవలే గ్రామపంచాయతీగా ప్రకటించారు. సర్పంచ్ కంచ కుమారస్వామి ఆధ్వర్యంలో గ్రామంలో శ్మశాన వాటిక (వైకుంఠధామం) నిర్మించారు. కానీ ప్రారంభించలేదు. ఈ క్రమంలో సర్పంచ్ కుమారస్వామి ఆత్మహత్య చేసుకోవడంతో.. కుటుంబ సభ్యులు ఆయన మృతదేహానికి అదే శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్ కట్టించిన శ్మశాన వాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం కావడంతో గ్రామస్తులంతా కంటనీరు పెట్టుకున్నారు. -
ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు
-
కైకాల నివాసం నుండి ప్రారంభమైన అంతిమ యాత్ర
-
పెద్ద కొడుకు చేతుల మీదుగా కైకాల అంత్యక్రియలు
Kaikala Satyanarayana Funeral Live Updates: ►కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. హిందూ సాంప్రదాయ పద్దతిలో తంతు ముగించారు. ►కైకాల సత్యన్నారాయణకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన పెద్ద కుమారుడు లక్ష్మి నారాయణ ►చివరిచూపు కోసం తండోపతండాలుగా వచ్చిన కైకాల అభిమానులు.. ► మహా ప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ► కైకాల భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు ► కైకాల సత్యనారాయణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల శుక్రవారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. అయితే నేడు(శనివారం)ఉదయం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం భౌతికకాయన్ని 10.40కి ఫిలిం చాంబర్‌కు తరలించనున్నారు. అటు నుంచి 11.30గంటలకు మహాప్రస్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి. -
మ్యాన్ మేడ్ స్టోన్: మనిషి చితికి చేరినా, వజ్రంగా మెరుస్తూ..
సైన్స్ వైఫల్యాలలో మనిషి మరణం ఒకటి. ఎన్నో వింతలు, విడ్డూరాలు చేయగలిగిన టెక్నాలజీ, మరణాన్ని జయించడంలో పదేపదే విఫలమవుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం చనిపోయిన వారిని ఎప్పటికీ చెరగని జ్ఞాపకంగా మార్చడంలో మాత్రం విజయవంతమైంది. మృతదేహాన్ని దహనం చేశాక మిగిలే బూడిదతో వజ్రాలను తయారుచేసి, ఆత్మీయులకు చిరకాల జ్ఞాపికలుగా అందిస్తోంది. అమెరికా, స్విట్జర్లాండ్, యూకే వంటి పలు దేశాల ప్రజలు మరణించిన తమవారిని చెక్కుచెదరని వజ్రాభరణాలుగా మార్చుకుంటున్నారు. వాటిని నిత్యం ధరిస్తూ మరణించిన ఆత్మీయులు తమతోనే ఉన్నట్లు భావిస్తున్నారు. వీటిని లక్కీ డైమండ్స్, మెమోరియల్ డైమండ్స్ అని పిలుచుకుంటున్నారు. మనిషి శరీరంలోని ఘన మూలకాల్లో కార్బన్ అత్యధికంగా ఉంటుంది. మనిషి శరీరం దహనమైపోయినా, అధిక పరిమాణంలో మిగిలే కార్బన్ తో వజ్రాలను తయారు చేసే ప్రక్రియను కొన్నేళ్ల కిందటే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు అందించిన పరిజ్ఞానంతో కొన్ని అంతర్జాతీయ కంపెనీలు ఇలా ఆత్మీయుల చితాభస్మంతో వజ్రాలను తయారు చేసి, వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు అందిస్తున్నాయి. అయితే, ఇదంతా పెద్ద స్కామ్ అని, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసి డబ్బులు గుంజడానికే కంపెనీలు ఇలా మోసం చేస్తున్నాయని, డైమండ్ తయారీకి చితాభస్మం నుంచి 10% కార్బన్ మాత్రమే వాడుతున్నారని, మిగిలిన 90% సాధారణ స్టాక్ కార్బన్ వాడుతుంటారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి చాలా కాలం అయినా.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల తర్వాత ఇది విపరీతంగా విస్తరించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా అయిన వారిని కోల్పోయి, కనీసం కడసారి చూపులకైనా నోచుకోలేని స్థితిలో అల్లాడిపోయిన ఎందరికో ఈ విధానం ఊరటనిస్తోంది. తమవారు లేరనే విషాదం నుంచి కోలుకునేందుకు ప్రేమపూర్వక జ్ఞాపికగా మిగులుతోంది. స్నేహితుల్ని, ఆత్మీయుల్ని ఎంతో మంది ఈ వజ్రాలను తయారు చేయించుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. నిజానికి ఈ మనిషి చితాభస్మంతో తయారైన వజ్రాలు (మ్యాన్ మేడ్ స్టోన్) మొదట 1980లలో వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చినా, ఇటీవలి కాలంలోనే వీటికి ఆదరణ పెరుగుతోంది. -
అంత్యక్రియల్లో జాప్యం.. నిలిచిన ప్రాణం
సాక్షి, హైదరాబాద్: ‘ఆలస్యం.. అమృతం విషం’ అంటారు. కానీ ఇక్కడ ఆలస్యమే అమృతమై పసికందుకు ప్రాణాలు పోసింది. వివరాల్లోకి వెళితే.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడకు చెందిన అన్నం శ్రీకాంత్ భార్య ఘట్కేసర్ హాస్పిటల్లో మగ శిశువుకు ఇటీవల జన్మనిచ్చింది. బాబు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో 10 రోజులపాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. వెంటిలేటర్ తీసేస్తే బాబు బతకడని చెప్పిన వైద్యులు, రూ.4 లక్షలు బిల్లు కట్టించుకుని బుధవారం రాత్రి డిశ్చార్జి చేశారు. ఇంటికి తీసుకొచ్చాక సమాధి చేసేందుకు ‘వసంత వ్యాలీ’ కాలనీలోని ప్రభుత్వ స్థలంలో గుంత తవ్వించారు. ఇంతలో కాలనీవాసులు ఇది శ్మశానవాటిక కాదని, ఇందులో సమాధి చేయొద్దని అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుండగానే.. అకస్మాత్తుగా పసికందులో కదలికలు ప్రారంభమయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు రాత్రి 11 గంటల సమయంలో నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. చదవండి: ఐఆర్సీటీసీ స్వదేశ్ దర్శన్ పర్యాటక రైళ్లు -
కానరాని కొడుకులు.. అమ్మలే.. ఆ నలుగురై
సాక్షి, భువనేశ్వర్/పూరీ: కాటి వరకు భుజాన మోసుకుని వెళ్లాల్సిన కన్న కొడుకులు కానరాలేదు. తోడబుట్టిన అన్నదమ్ములు తల్లి అంతిమయాత్రకు రాకపోవడంతో నలుగురు అక్కచెల్లెళ్లు ఓ ముందడుగు వేశారు. సామాజిక ఆంక్షలు తెంచుకుని, తమ తల్లి పాడిని భుజనా ఎత్తుకున్నారు. 4 కిలోమీటర్ల దూరం మోసి, అమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. పూరీ పట్టణంలో ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానిక మంగళా ఘాట్ ప్రాంతంలో జతి(80) అనే వృద్ధురాలు కన్నుమూసింది. ఈమెకి ఇద్దరు కొడుకులు ఉన్నా ఒక్కరూ ఆమెను కడసారి చూసేందుకు రాలేదు. దీంతో ఈమె నలుగురు కుమార్తెలు కన్న తల్లి రుణం తీర్చుకున్నారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మంగళాఘాట్ నుంచి స్వర్గ ద్వార్ వరకు తల్లి మృతదేహాన్ని మోసుకుని వెళ్లి, దహన సంస్కారాలు చేయించారు. ఈ స్మశాన వాటికలో అంత్యక్రియలు స్వర్గలోక ప్రాప్తికి సోపానంగా స్థానికులు భావిస్తారు. కని, పెంచిన తల్లికి స్వర్గ లోకం ప్రాప్తించాలని ఆ నలుగురు కుమార్తెలు తమ తల్లికి కడపటి వీడ్కోలు పలికారు. -
శ్మశానంలో వర్షానికి నీటిలో తేలియాడిన మృతదేహం
టేకుమట్ల: ఒకే మృతదేహానికి రెండుసార్లు అంతిమ వీడ్కోలు పలికిన హృదయ విదారక సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని అంకుషాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. అంకుషాపూర్ గ్రామానికి చెందిన గురుకుంట్ల భద్రమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని చలివాగు ఒడ్డుకు పూడ్చి అంతిమ సంస్కారాలు చేశారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చలివాగు ఉప్పొంగడంతో పూడ్చిన శవం నీటిలో తేలియాడుతూ మండలంలోని వెలిశాల శివారులో గల చెట్ల కొమ్మలకు చిక్కుకోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని బైటికి తీసి అంకుషాపూర్ గ్రామానికి చెందిన గురుకుంట్ల భద్రమ్మగా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అక్కడే దహన సంస్కారాలు నిర్వహించినట్లు ఎస్సై రమణారెడ్డి తెలిపారు. (చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం సొంత అన్న చోరీ) చదవండి: రాజకీయ నాయకుడి వేధింపులకు మహిళ బలి -
AP: శ్మశానవాటికలో దారుణం.. శిశువు బతికుండగానే ఖననానికి యత్నం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశానవాటికలో దారుణం చోటు చేసుకుంది. నలుగురు ఓ శిశువు బతికి ఉండగానే ఖననం చేయడానికి యత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిశువును బతికుండగానే ఖననం చేయడానికి ప్రయత్నించారు. కవర్లో ఉంచిన శిశువును పాతి పెట్టాలని వారు శ్మశానవాటిక సిబ్బందిని కోరారు. దీంతో కవర్ తెరవగా శిశువు ఏడ్వటంతో శ్మశానవాటిక సిబ్బంది షాక్‌కు గురయ్యారు. సిబ్బంది ప్రశ్నించడంతో శిశువును వదిలి నలుగురు పరారయ్యారు. వెంటనే శ్మశానవాటిక సిబ్బంది కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్మశానవాటికకు చేరుకొని శిశువును రైల్వే న్యూకాలనీలోని ఆస్పత్రికి తరలించారు. -
తోటి వారిని కోల్పోయి.. బరువెక్కిన హృదయాలతో తిరుగు ముఖం
రేపల్లె (గుంటూరు): ఆ వలస కూలీలంతా కలిసే వచ్చారు. అగ్ని కీలల రూపంలో విరుచుకుపడిన ఆ కాళరాత్రి తమలో ఆరుగుర్ని సజీవ దహనం చేయడంతో భయకంపితులయ్యారు. అస్థికలుగా మారిన తోటి వారికి బరువెక్కిన హృదయాలతో అంత్యక్రియలు జరిపించారు. ఘోర ప్రమాదం మిగిల్చిన విషాదాన్ని తట్టుకోలేక.. తమతో వచ్చిన వారు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక విలపిస్తూనే సొంతూళ్లకు పయనమయ్యారు. గుంటూరు జిల్లా లంకెవానిదిబ్బ గ్రామంలోని బెయిలీ ఆక్వా ఫామ్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర ప్రమాదంలో సజీవ దహనమైన ఒడిశాలోని రాయగఢ్ జిల్లా గునుపూర్ మండలానికి చెందిన యువకులు నబీన్ సబార్ (23), పండబూ సబార్ (18), మనోజ్ సబార్ (18), కరుణకార్ సబార్ (18), రామ్మూర్తి సబార్ (19), మహేంద్ర సబార్ (20) అíస్థికలకు ఘటనా స్థలంలోనే ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల తల్లిదండ్రులు, బంధువులు, తోటి కూలీలు అదే గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. బావురుమన్న తల్లిదండ్రులు, బంధువులు ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, బంధువులు ఒడిశా నుంచి శనివారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని కీలల్లో కాలిబూడిదైన అస్థికలను చూసి బావురుమన్నారు. మమ్మల్ని పోషించడం కోసం ఇంత దూరం వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ రోదించారు. వారితోపాటు వచ్చిన ఒడిశాలోని గోన్పూర్ ఎమ్మెల్యే రఘునాథ్ గుమెంగో ప్రమాదానికి గల కారణాలను ఇక్కడి అధికారుల నుంచి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన గదిలోంచి బయటపడ్డ నలుగురు కూలీల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని అధికారులు, బెయిలీ ఆక్వా ఫామ్ యాజమాన్యాన్ని కోరారు. ఒడిశా నుంచి మొత్తం 25 మంది వలస కూలీలు ఆక్వా ఫామ్‌లో పని చేసేందుకు 15 రోజుల క్రితం రాగా.. గురువారం రాత్రి 10 మంది ఒక గదిలోను, 15 మంది మరో గదిలోను నిద్రించిన విషయం విదితమే. 10 మంది నిద్రించిన గదిలో ఆరుగురు అగ్ని కీలల్లో సజీవ దహనం కాగా.. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందటంతో భయాందోళనకు గురైన మిగిలిన 19 మంది కార్మికులు శనివారం సాయంత్రం తమ వారు లేరన్న బాధతో రోదిస్తూ స్వగ్రామాలకు పయనమయ్యారు. సమగ్ర విచారణకు డిమాండ్ ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. శనివారం లంకెవానిదిబ్బ గ్రామానికి చేరుకున్న సీపీఎం, సీపీఐ (ఎంఎల్) నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఆరుగురి మృతిపై సమగ్ర విచారణ జరిపించి, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఇదిలావుండగా.. ప్రమాదానికి రొయ్యల చెరువు యజమాని నిర్లక్ష్యమే కారణమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు గఫూర్, కార్యదర్శి నరసింగరావు శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. యజమానిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. -
రూ. 2 కోట్ల కోసం కిడ్నాప్.. కోవిడ్ శవంగా అంత్యక్రియలు
లక్నో: మిత్రుని కోసం ప్రాణాలిచ్చే స్నేహితుల గురించి చదివాం. కానీ ప్రస్తుతం డబ్బుల కోసం మిత్రుడి ప్రాణాలు తీసే ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఆగ్రాలో చోటు చేసుకుంది. డబ్బు కోసం స్నేహితుడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతడిని చంపి.. కోవిడ్ వల్ల చనిపోయాడని చెప్పి.. అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కానీ పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోల్డ్ స్టోరేజ్ ఓనర్ సురేష్ చౌహాన్ ఒక్కగానొక్క కుమారుడు సచిన్ చౌహాన్(23) జూన్ 21న కిడ్నాప్ అయ్యాడు. 2 కోట్ల రూపాయల కోసం స్నేహితులే ఈ నేరానికి పాల్పడ్డారు. సచిన్ స్నేహితులు నలుగురు, మరో వ్యక్తితో కలిసి అతడి కిడ్నాప్‌కు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో సచిన్ స్నేహితుడు ఒకరు అతడికి కాల్ చేసి పార్టీ చేసుకుందామని పిలిచాడు. తర్వాత అందరూ ఓ పాడుబడిని ట్యాంక్ మీద కూర్చుని మందు తాగారు. అనంతరం లామినేషన్ పేపర్‌తో సచిన్‌కు ఊపిరాడకుండ చేసి హత్య చేశారు నిందితులు. సచిన్ కిడ్నాప్ అయిన నాటి నుంచి అతడి తల్లి.. కుమారుడి నంబర్‌కు కాల్ చేస్తూనే ఉంది. వేరే వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేసి.. సచిన్ ఇక్కడ లేడని తెలిపేవారు. దాంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. మరోవైపు సచిన్ స్నేహితులు.. తమ మిత్రుడు కోవిడ్ వల్ల చనిపోయాడని నమ్మించడం కోసం.. పీపీఈ కిట్లు ధరించి.. మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించి.. అస్థికలను సమీపంలోని నదిలో నిమజ్జనం చేశారు. ఇక వీరి కదలికపై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి వీరి గురించి పోలీసలుకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 2 కోట్ల రూపాయల కోసం తామే సచిన్‌ను కిడ్నాప్ చేశామని.. కానీ అతడు బతికుంటే తమకు ప్రమాదం అని భావించి.. హత్య చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘నిందితులు 25 రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశారు. సచిన్‌ను చంపిన తర్వాత అతడి తల్లిదండ్రులకు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని భావించారు’’ అని తెలిపాడు. చదవండి: పోలీసులే కిడ్నాపర్లుగా మారి.. ఆస్తులు రాయించుకున్నారు -
ఒకరిది మానవత్వం... మరొకరిది ‘పైసా’చికత్వం
కోదాడ: కరోనాతో మృతి చెందాడని బంధువులు ముఖం చాటేశారు.. తమకు ఎక్కడ అంటుకుంటుందేమోనని అయినవారు ఆమడదూరం పారిపోయారు. కానీ... మనిషిలో ఇంకా మానవత్వం మిగిలి ఉందని దానికి కుల మతాలు ఉండవని కొందరు ముస్లిం యువకులు నిరూపించగా.. ఎలా పోతే మాకేంటి పైసలే మాకు పరమావధి అన్నట్లు మరికొందరు ప్రవర్తించి దహనసంస్కారాలు చేయడానికి వచ్చిన వారి నుంచి మృతదేహాన్ని కాల్చినందుకు రూ.32 వేలను శ్మశానం సాక్షిగా వసూలు చేసి తమలోని ‘పైసా’చికత్వాన్ని చాటుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన గురువారం కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన మహంకాళి గోపాలకృష్ణమూర్తి (70) కరోనాతో మృతి చెందాడు. ఇతడు దివ్యాంగుడు. ఈయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేరు. కరోనాతో మృతి చెందడంతో బంధువులు ఎవరూ అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. కేవలం ఇద్దరు బిడ్డలు, ఆయన సోదరుడు హుస్సేన్‌రావు మాత్రమే వచ్చారు. ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఆరుగురు ముస్లిం యువకులు మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. మృతదేహాన్ని ఇంటినుంచి బయటికి తీసుకురావడంతో పాటు హిందూ శ్మశానవాటిక వద్దకు చేర్చారు. అక్కడ కూడా మృత దేహాన్ని వారే చితి మీదకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదంతా వారు ఉచితంగా సేవాదృక్పథంతో చేయడం గమనించదగ్గ విషయం.. రూ. 32 వేలు.. నిలబెట్టి వసూలు చేశారు.. కరోనాతో మృతి చెందిన గోపాలకృష్ణమూర్తి అంత్యక్రియలకు కోదాడ హిందూ శ్మశానవాటికలో రూ. 32 వేలు ఇవ్వాల్సిందేనని అక్కడ ఉన్నవారు డి మాండ్ చేసి మరీ వసూలు చేసినట్లు మృతుడి సోదరుడు హుస్సేన్‌రావు తెలిపాడు. చితి కోసం కేవలం ఆరుక్వింటాళ్ల కట్టెలు పెట్టి రూ. 32 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని ఇచ్చిన తర్వాతే మృతదేహాన్ని కాల్చారని వాపోయాడు. ఈ విషయాన్ని ఆయన రికార్డు చేసి సామాజికమాధ్యమంలో పెట్టడంతో చర్చనీయాంశమైంది. కరోనా మృతదేహాల దహనం కోసం సిబ్బందిని పెట్టామని పురపాలకసంఘం అధికారులు చెబుతున్నారని, కానీ వాస్తవంగా అక్కడ ఎవరూ లేరని ఈ దోపిడీపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. చదవండి: పెట్రోల్, టైర్లతో దహనం.. ఐదుగురు పోలీసులపై వేటు -
పెట్రోల్, టైర్లతో దహనం.. ఐదుగురు పోలీసులపై వేటు
లక్నో: కరోనా మన జీవిన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. సంబరాలు సంతోషాలు లేవు.. కనీసం నలుగురు మనుషుల కూడి దహన సంస్కారాలు చేయడానికి కూడా వీలు లేని పరిస్థితులు. మహమ్మారి భయంతో కోవిడ్‌తో మరణించిన వారి శవాలను అలాగే వదిలేసి వెళ్తున్నారు. కొద్ది రోజల క్రితం గంగా నదిలో పదుల కొద్ది శవాలు కొట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీన్ని మరువక ముందే మరో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కోవిడ్ మృతదేహాలను పోలీసులు రోడ్డు మీద అత్యంత అమానవీయ రీతిలో దహనం చేశారు. టైర్లు, పెట్రోల్ పోసి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు ఇందుకు బాధ్యులైన ఐదుగురు పోలీసులును సస్పెండ్ చేశారు. ఈ సంఘటన బల్లియాలో మాల్దేపూర్ ఘాట్ వద్ద చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం నదిలో రెండు శవాలు కొట్టుకువచ్చాయి. పోలీసులకు సమాచారం అందిచడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని శవాలను బయటకు తీశారు. ఆ తర్వాత వాటిని దహనం చేయడానికి ఇంధనం లేకపోవడంతో టైర్లు వేసి.. పెట్రోల్ పోసి దహనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలయ్యింది. పోలీసు అధికారి సమక్షంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. చదవండి: ఎవరూ లేకున్నా.. కడసారి వీడ్కోలుకు ఆ నలుగురు -
షాకింగ్ ఘటన: ఒక్కసారిగా పాడెపై నుంచి లేచిన బామ్మ
ముంబై: కరోనాతో మృతి చెందిందని వృద్ధురాలికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె అంత్యక్రియలకు బంధువులను పిలిపించారు. కొద్దిసేపట్లో అంత్యక్రియలు మొదలు పెట్టనుండగా ఒక్కసారిగా ఆ పెద్ద మనిషి పాడెపై నుంచి ఏడుస్తూ కళ్లు తెరిచింది. దీంతో బంధువులంతా షాకయ్యారు. ఎలాగోలా తమ బామ్మ బతికిందని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బామ్మ ఆస్పత్రిలో ఉంది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముధాలేలోని బారామతి గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ (76)కు మే 10వ తేదీన కరోనా సోకిందని తేలింది. దీంతో కుటుంబసభ్యులు కారులో ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆస్పత్రిలో ఆమెకు బెడ్ లభించలేదు. దీంతో కారులోనే చాలాసేపు వేచి ఉన్నారు. ఈ సమయంలో బామ్మ శకుంతల అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆమెలో చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె మృతి చెందిందని భావించారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. శకుంతల మృతదేహాన్ని పాడెపై ఉంచి బంధవులంతా ఏడుస్తుండగా అకస్మాత్తుగా శకుంతల ఏడుస్తూ కళ్లు తెరిచింది. ఒక్కసారిగా కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. బామ్మ చనిపోలేదు.. బతికే ఉందని భావించి ఒక్క క్షణం తర్వాత తేరుకుని ఆనందపడ్డారు. వెంటనే ఆమెను బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. చదవండి: మానవత్వం చాటిన ఎమ్మెల్యే కంచర్ల -
కరోనా విలయం: తండ్రి చితిపై దూకేసిన కుమార్తె
రాజస్థాన్: దేశంలో రెండో దశలో రోజువారీ రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అటు మరణాలు కూడా అదే స్థాయిలో ప్రకంపలు పుట్టిస్తోంది. ఈ మహమ్మారి సంక్షోభం అనేక కుటుంబాల్లో సృష్టిస్తున్న విలయం అంతాకాదు ఇంతాకాదు. శాశ్వతంగా తమకు దూరమైన ఆప్తులకు కనీసం కడసారి వీడ్కోలు చెప్పేందుకు కూడా వీలులేక అల్లాడిపోతున్నాయి.ఈ క్రమంలో రాజస్థాన్‌లో షాకింగ్ ఉదంతం ఒకటి కలకలం రేపింది. కరోనాతో మృతి చెందిన తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఓ కుమార్తె ఆయన మండుతున్న చితిపై దూకేసింది. ఇటీవలే తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్తె తండ్రి చితిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన పలువురిని కంట తడిపెట్టించింది. రాజస్థాన్ బార్మెర్ జిల్లా రాయ్ కాలనీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పాక్ సరిహద్దుల్లో బార్కర్ జిల్లా రాయ్ కాలనీలో నివాసం ఉంటున్న దామోదర్ దాస్ (73) ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు. భార్య ఇటీవలే కన్నుమూసింది. దీంతో ముగ్గురు కుమార్తెలు ఆయనను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఈ క్రమంలో తండ్రిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆరోగ్యం విషమించి ఆయన కన్ను మూశారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామపంచాయితీ సిబ్బంది, అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బంధువుల సమక్షంలో దామెదర్ చిన్న కుమార్తె శారద(34) తండ్రి చితికి నిప్పంటించారు. ఇంతలో అందరూ చూస్తుండగానే ఆమె కాలుతున్న చితిపైకి దూకేసింది. దీంతో అక్కడున్నవారంతా హతాశులయ్యారు. వెంటనే తేరుకుని ఆమెను తప్పించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే శారదకు 70 శాతానికి పైగా గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ఆమెను కాపాడే క్రమంలో మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘనటపై వివరాలను పరిశీలిస్తున్నామని దర్యాప్తు కొనసాగుతోందని అధికారి ఆనంద్ సింగ్ వెల్లడించారు. బాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం జోధ్‌పూర్‌కు తరలించినట్టు చెప్పారు. గాయపడిన మరో ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. -
చనిపోయిందని శ్మశానానికి.. ఆఖరు క్షణంలో ట్విస్ట్..
రాయ్‌పూర్: ఓ వృద్ధురాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. కోవిడ్ టెస్టు చేశారు. నెగటీవ్ రీపోర్టు వచ్చింది. కానీ ఈసీజీలో నిల్ అని రావడంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తీసుకెళ్లాక అరుదైన ఘటన చోటుచేసుకుంది. అదేంటో తెలుసుకునేందుకు వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కు చెందిన 77 ఏళ్ల లక్ష్మీబాయ్ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. కొన్ని రోజుల నుంచి ఇంట్లోనే చికిత్స అందిస్తుండగా తాజాగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. భీంరావ్ అంబేద్కర్ ఆసుపత్రిలో చేర్చారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ టెస్టులు నిర్వహించగా నెగటీవ్ రిపోర్టు వచ్చింది. అనంతరం ఈసీజీలో మాత్రం ‘నిల్’ అని రిపోర్టు వచ్చింది. దీన్ని పరిశీలించిన వైద్యులు.. లక్ష్మీబాయి చనిపోయినట్లు ధృవీకరించారు. లక్ష్మీబాయి మనవరాలు నిధి కూడా వైద్యరంగంలోనే పనిచేస్తున్నారు. తన బామ్మ మెడికల్ రిపోర్టులు ఆమె కూడా పరిశీలించి చనిపోయినట్టు నిర్ధారించుకుంది. అనంతరం అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గోకుల్ నగర్ శ్మశానవాటికకు తీసుకెళ్లారు. కానీ అప్పటికీ మృతదేహం చల్లబడలేదు. దీంతో నిధికి అనుమానం వచ్చింది. ఒక వైద్యుడిని అక్కడికి పిలిపించి పరీక్షించగా అసలు విషయం బయటపడింది. లక్ష్మీబాయి అప్పటికి ఇంకా మరణించలేదని, పల్స్ మీటర్లో ఆక్సిజన్ స్థాయి 85గా ఉందని డాక్టర్ గుర్తించారు. ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందించాలని పేర్కొన్నారు. దీంతో వెంటనే లక్ష్మీబాయిని హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. మార్గం మధ్యలో అంబులెన్స్‌లోనే ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ విషయంపై నిధి అంబేడ్కర్ ఆసుపత్రి వైద్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈసీజీ సక్రమంగా తీయకపోవడంతో తన బామ్మ చనిపోయిందని వాపోయింది. కొన్ని గంటల ముందే ఆసుపత్రికి తీసుకొస్తే బతికేదని, తన బామ్మ చావుకు డాక్టర్లే కారణమని ఆరోపించింది. అయితే ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని తమ ఆసుపత్రిలో మొదటిసారి ఇలా జరిగిందని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. చదవండి: హోం ఐసోలేషన్.. కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ ఎనిమిది నెలల గర్భిణిని కాల్చి చంపిన భర్త -
ఎవరూ లేకున్నా.. కడసారి వీడ్కోలుకు ఆ నలుగురు
కోరుట్ల: కరోనా వైరస్ ఆత్మీయత, అనుబంధాలకు అడ్డు తెరలు కడుతోంది. చివరి చూపు.. స్పర్శకు నోచుకోకుండా నా అన్నవాళ్లను దూరం చేస్తోంది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవరూ దరిచేరని దయనీయ స్థితిలో కరోనా మృతుల అంత్యక్రియలను తమ భుజాలపై వేసుకుంటున్నారు కోరుట్లకు చెందిన పలువురు యువకులు. భయానక వాతావరణం కళ్ల ముందు కనిపిస్తుంటే ధైర్యం కోల్పోకుండా మానవత్వంతో మృతదేహాలకు కడసారి వీడ్కోలు పలుకుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారం వ్యవధిలో 12 మంది మృతి... కోరుట్ల పరిసర ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలో 12 మంది కరోనాతో జగిత్యాల, కరీంనగర్, హైద్రాబాద్‌లలోని ఆసుపత్రుల్లో ప్రాణాలు వదిలారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు భయపడి, దగ్గరికి కూడా రాలేదు. ఎక్కడ కరోనా వైరస్ తమకు సోకుతుందోనని ఆందోళన చెంది, దూరంగా ఉన్నారు. అంతటా ఓదార్పు మాటలే తప్ప దహన సంస్కారాలు చేసేందుకు సాహసించని పరిస్థితి. అన్నిచోట్లా ఇది నిత్యకృత్యమవుతోంది. యువత బాసట.. బాధితులకు ఊరట కోవిడ్ మృతుల అంత్యక్రియలకు భయపడుతున్న నేపథ్యంలో కోరుట్ల యువత తామున్నామని ముందుకు రావడం బాధిత కుటుంబాలకు ఊరటనిస్తోంది. కోరుట్ల పట్టణంలో ఇప్పటివరకు చనిపోయిన 12 మందికి స్థానిక బీజేపీ, బీజేవైఎం నాయకులు, మానవ సందేశ సమితి ఆధ్వర్యంలోని ఇందాదుల్ ముస్లిమీన్ యూత్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న యువకులను ప్రతిఒక్క రూ అభినందిస్తున్నారు. మానవత్వంతో చేస్తున్నాం.. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి కుటుంబీకులు, బంధువులు ముందుకు రావడం లేదు. బీజేపీ, బీజేవైఎం నాయకులందరం కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడ్డాం. మానవత్వంతో కోవిడ్ మృతులకు దహన సంస్కారాలు చేస్తున్నాం. గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు 45 మందికి అంత్యక్రియలు నిర్వహించాం. – మాడవేని నరేష్, బీజేపీ ఫ్లోర్ లీడర్, కోరుట్ల ఎంతో పుణ్యం.. కరోనాతో మృతిచెందిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వైరస్‌తో ఎక్కడ ఎవరు చనిపోయినా దహన సంస్కారాలు చేసేందుకు మా యువత ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కరోనా ప్రారంభంలో మానవత్వ సందేశ సమితి ప్రోత్సాహంతో మృతులకు అంత్యక్రియలు పూర్తి చేశాం. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. – అలీమొద్దీన్, ఇందాదుల్ ముస్లిమీన్ యూత్ అధ్యక్షుడు, కోరుట్ల ( చదవండి: వ్యాక్సిన్ వికటించి వ్యక్తి మృతి? ) -
మానవత్వం చాటుకున్న యువకులు
కల్వకుర్తి టౌన్: ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందగా కరోనా సోకిందన్న అనుమానంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆ గ్రామస్తులెవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కొందరు ముస్లిం యువకులు పీపీఈ కిట్లు వేసుకుని ఖననం చేసి మానవత్వం చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని పంజుగులకు చెందిన షమీంబీ (65), గఫార్ (78) లకు సంతానం లేదు. స్థానికంగా ఇంటివద్దే చిన్నపాటి కిరాణం కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వయసు మీదపడటంతో ఇటీవల దుకాణం సైతం మూసివేశారు. ఈ నెల 12న గఫార్ అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, షమీంబీ ఈనెల 15వ తేదీన ఉదయం అనారోగ్యం కారణంగా కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చూపించుకుని తిరిగి స్వగ్రామం చేరుకుంది. అయితే పరిస్థితి విషమించటంతో అదే రాత్రి ఆమె మృతి చెందింది. ఈ విషయం గ్రామస్తులకు తెలిసినా కరోనా సోకిందనే అనుమానంతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు కల్వకుర్తి పట్టణానికి చెందిన మక్బూల్, ఖదీర్, కరీముల్లా, అతావుల్లా వారి స్నేహితులు కలిసి అదే అర్ధరాత్రి అక్కడికి వెళ్లారు. పీపీఈ కిట్లు ధరించి వృద్ధురాలి మృతదేహాన్ని రిక్షాలో వేసుకుని జేసీబీ సాయంతో శివారులో గుంతను తీసి, ఖననం చేశారు. ‘సావెల్’ను వణికిస్తున్న కరోనా.. బాల్కొండ: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామంలో కరోనా కారణంగా రెండు రోజుల్లో నలుగురు మృతి చెందారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేసినా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇక్కడ పది రోజుల్లో వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దులో మెండోరా మండలం ఉంది. అందులో సావెల్ గ్రామం గోదావరి తీరాన చివరన ఉంది. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కరోనా నిబంధనలను పాటించాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో రమేశ్ సూచించారు. చదవండి: కరోనా వేగం తగ్గాలంటే టీకా వేగం పెరగాల్సిందే! -
సర్పంచ్ పాడె మోసిన మంత్రి జగదీశ్ రెడ్డి
పెద్దవూర: అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతిచెందిన సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, పెద్దవూర సర్పంచ్ అంత్యక్రియలు ఆదివారం స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల నడుమ నిర్వహించారు. ఆయన మృతితో పెద్దవూర గ్రామ పంచాయతీలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లో మృతి చెందగా శనివారం రాత్రి 9 గంటలకు పెద్దవూర తీసుకువచ్చిన మృతదేహాన్ని ఆదివారం 11 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమైంది. తమ అభిమాన నాయకుడి కడచూపు కోసం వందలాదిగా తరలివచ్చారు. కిలోమీటర్ పైగా సాగిన అంతిమ యాత్రలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డిలు పాల్గొని నడిచారు. పాడె మోసిన మంత్రి జగదీశ్‌రెడ్డి తన సహచరుడు, సీనియర్ టీఆర్ఎస్ నేత, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి అంతిమ యాత్రలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని పాడెను మోశారు. భాస్కర్‌రెడ్డితో తనకు గల అనుభవాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రముఖుల పరామర్శ అనారోగ్యంతో మృతి చెందిన పెద్దవూర సర్పంచ్ కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి పార్థీవ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎక్సైజ్, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, కర్నె ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కుమార్, ఎంసీ కోటిరెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, మన్నెం రంజిత్‌యాదవ్, జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ చెన్ను అనురాధసుందర్‌రెడ్డి, కర్నాటి లింగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కంకణాల నివేదితారెడ్డి, డీవీఎన్‌రెడ్డి, ఇరిగి పెద్దులు, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రామ చిలుకకు ఘనంగా అంత్యక్రియలు
ఖమ్మం : కరెంట్ షాక్‌తో మృతి చెందిన రామచిలుకకు అంత్యక్రియలు నిర్వహించిన ఘటన జిల్లాలోని బోనకల్ మండలం రావినూతల గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం హై టెన్షన్ కరెంటు వైర్లపై వాలిన రామచిలుక షాక్‌తో మృతి చెందింది. ఇది చూసిన స్థానికులు చలించి పోయారు. రామచిలుకకు సాంప్రదాయం ప్రకారం అంతక్రియలు నిర్వహించారు. రామనామంతో ఉన్న రామచిలుకకు అంత్యక్రియలు నిర్వహించడం వల్ల మంచి కలుగుతుందన్న భావనతో అంత్యక్రియలు నిర్వహించామన్నారు. ప్రకృతిలో ప్రతీ జీవిపై జాలిని చూపించాలని పశుపక్ష్యాదులపై ప్రేమను కలిగి ఉండాలని జంతు ప్రేమికుడు రావట్ల సత్యనారాయణ అన్నారు. అంతక్రియలు నిర్వహించేటప్పుడు రామ నామాన్ని జపించారు. -
తల్లీకొడుకుల కన్నీటి చితి
సాక్షి, కొత్తూరు: కొత్తూరు గ్రామ ప్రజలు తీవ్ర విషాదానికి గురయ్యారు. ప్రతీ ఒక్కరూ కన్నీంటి పర్యంతమయ్యారు. గ్రామంలోని కొత్తకోటపేట కాలనీకి చెందిన తల్లీ, కుమారుడు కనపాకల చిన్మమ్ముడు (65), కొడుకు శ్రీనివాసరావు (32) శనివారం పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో చిన్నమ్ముడు అదే రోజు మధ్యాహ్నం మృతి చెందగా.. శ్రీనివాసరావు శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తరువాత తనువుచాలించిన విషయం విదితమే. తల్లి మృతదేహానికి పాలకొండ ఏరియా ఆస్పత్రిలో, కొడుకుకు రిమ్స్‌లో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వేర్వేరు వాహనాల్లో మృతదేహాలను కొతూర్తు శ్మశానవాటికకు నేరుగా తీసుకొచ్చారు. దీంతో చిన్నమ్ముడు, శ్రీనివాసరావు మృతదేహాలను కడసారి చూసేందుకు కొత్తూరు గ్రామస్తులంతా అక్కడకు చేరుకొని కన్నీరు పెట్టారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. ఇద్దరి మృతదేహాలకు పక్కపక్కనే చితిలు ఏర్పాటు చేసి ఏకకాలంలో దహన కార్యక్రమాలు పూర్తిచేశారు. చిన్నమ్ముడు భర్త ఐదేళ్ల క్రితం మృతి చెందడం, కొడుకు కూడా చనిపోవడంతో ఆ కుటుంబంలో ఎవరూలేరు దీంతో ఆమెకు పెద్ద అల్లుడు, శ్రీనివాసరావుకు మామయ్య తలకొరివి పెట్టారు. పక్కపక్కనే తల్లీకొడుకుల మృతదేహాలు దహనం అవుతుండడాన్ని చూసిన ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. కొత్తూరు ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని పలువురు చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకుడు, సర్పంచ్ ప్రతినిధి పడాల లక్ష్మణరావు తల్లీకొడుకుల అంతిమ సంస్కారాలకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. చదవండి: నాన్న ఇక రాడు -
మంత్రాల నెపంతో సజీవదహనం
సాక్షి, జగిత్యాల : మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని సజీవదహనం చేశారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన పవన్‌కుమార్ (38) బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి బావమరిది జగన్ వారం క్రితం గుండెపోటుతో చనిపోయాడు. అయితే.. జగన్ మృతికి పవన్‌కుమార్ కారణమని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం జగన్ పెద్దకర్మకు హాజరై చిత్రపటం వద్ద పవన్‌కుమార్ మొక్కుతుండగా పెద్ద బావమరిది విజయ్‌స్వామి, జగన్ భార్య సుమలత ఇద్దరూ కలసి అతడిని గదిలో బంధించారు. పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో పవన్‌కుమార్ సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అందుకే అర్థరాత్రి దహనం చేశాం: యూపీ సర్కార్
న్యూఢిల్లీ: హథ్రాస్ మృతురాలికి అర్థరాత్రి దహన సంస్కారాలు నిర్వహించడంతో యూపీ పోలీసుల పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు గల కారణాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివరించింది. మరుసటి రోజు భారీ స్థాయిలో శాంతిభద్రతలకు ముప్పు తలెత్తే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక కారణంగానే తాము ఆ విధంగా చేయాల్సి వచ్చిందని తెలిపింది. అర్ధరాత్రి 2.30 నిమిషాలకు ఎందుకు దహనం చేయాల్సి వచ్చిందో కూడా తన అఫిడవిట్లో యూపీ సర్కార్ వివరించింది. బాబ్రీ మసీదు తీర్పు నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్ విధించారని, ఆ నేపథ్యంలో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న భావనతో అర్థరాత్రి దహనం చేసినట్లు తెలిపింది. సఫ్దార్‌గంజ్ హాస్పిటల్లో సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన ధర్నా గురించి ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చిందని, ఆ ఘటనకు కులం రంగు పూశారని యూపీ సర్కార్ సుప్రీం కోర్టుకు తెలిపింది. మరోవైపు ఇవాళ యోగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం.. హత్రాస్ క్రైమ్‌సీన్‌కు వెళ్లి సమాచారం సేకరిస్తున్నది. (హత్రాస్ ఉదంతం: పోలీసుల ఎదుటే బెదిరింపులు) హత్రాస్ కేసులో సీబీఐ విచారణ చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని యూపీ సర్కార్ తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరింది. సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ విచారణ కొనసాగాలని యూపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు విషప్రచారం నిర్వహించారని అఫిడవిట్లో యోగి ప్రభుత్వం ఆరోపించింది. హత్రాస్ ఘటన పట్ల ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన వివరాలను సుప్రీంకు సమర్పించారు. అర్థరాత్రి దహనం చేసేందుకు యువతి తల్లితండ్రులను జిల్లా అధికారులు ఒప్పించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. -
‘అతడు వస్తాడు.. నీ గుండె, లివర్ తింటాడు’
చిన్న పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటేనో.. చెప్పిన మాట వినకుండా అల్లరి చేస్తున్న సమయాల్లో సాధారణంగా తల్లులు ఏదో ఒక బూచిని చూపి వారిని దారికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. థాయ్‌లాండ్‌లో కూడా తల్లిదండ్రులు ఇలాంటి ధోరణే అవలంబిస్తారట. అయితే అక్కడి బూచోడికి ఓ పేరుంది. సీ ఓయే. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం మరణించిన అతడి శవాన్ని ఓ ఆస్పత్రి మ్యూజియంలో గాజు గ్లాసులో భద్రపరిచారు. అతడి గురించిన కథలు వింటే పెద్దవాళ్లకు సైతం వెన్నులో వణుకు రావాల్సిందే. అందుకే..‘‘సీ వస్తాడు. నీ లివర్ తినేస్తాడు’’అనగానే అల్లరి పిడుగులు కూడా కిమ్మనకుండా చెప్పిన మాట వింటారట. అయితే ‘సీ’ నిజంగానే అంతటి నరరూప రాక్షసుడా లేదా అకారణంగా శత్రుత్వ రాజకీయాలకు బలైపోయాడా అంటే మాత్రం స్థానికంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మనిషి మాంసం తినేందుకు అలవాటు పడ్డ సీకి తగిన శిక్షే పడిందని కొంతమంది చెబుతుంటే.. మరికొంత మంది మాత్రం అతడు అమాయకుడంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సీ ఎవరు? అరవై ఏళ్ల తర్వాత అతడి మృతదేహాన్ని దహనం చేసేందుకు దారి తీసిన పరిస్థితులేమిటి? చైనా నుంచి వలస వచ్చి.. స్థానిక మీడియా వివరాల ప్రకారం.. చైనాకు చెందిన సీ ఓయే తన దేశం తరఫున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. జపనీస్ సేనలు తమ సైన్యాన్ని చుట్టముట్టిన వేళ ఎలాగోలా తప్పించుకున్న అతడు ఆకలికి తట్టుకోలేక తోటి సైనికుల మృతదేహాలను తిన్నాడు. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం పందొమిదేళ్ల వయసులో 1946లో థాయ్‌లాండ్‌కు వలస వచ్చి ఓ ఇంట్లో తోటమాలిగా పనికి కుదిరాడు. ఈ క్రమంలో 1958లో రేయాంగ్ ప్రావిన్స్‌లోని ఓ అడవిలో ఎనిమిదేళ్ల బాలుడి శవాన్ని దహనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కిడ్నాపైన ఆ బాలుడి శరరీంలో కొన్ని అవయవాలు మిస్పయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఘటన జరగడానికి నాలుగేళ్ల ముందు అంటే 1954లో వివిధ ప్రాంతాల్లో కిడ్నాపైన ఐదుగురు పిల్లల హత్యకు సంబంధించి.. పెండింగ్‌లో ఉండిపోయిన కేసులకు కూడా సీనే కారణమని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. (5,232 మంది హత్యకు సాయం.. రెండేళ్ల శిక్ష) చిన్న పిల్లల గుండె, కాలేయం తినేవాడు ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా.. చిన్న పిల్లలను హతమార్చి వారి గుండె, కాలేయం, పేగులు తినడం తనకు అలవాటు అని సీ వెల్లడించినట్లు మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 1959లో ముప్పై రెండేళ్ల వయసులో సీనిని కాల్చి చంపేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని పరిశోధనల నిమిత్తం సిరిరాజ్ ఆస్పత్రికి అప్పగించారు. అప్పటి నుంచి అక్కడి ఫోరెన్సిక్ మ్యూజియంలో గాజు గ్లాసులో ‘‘కానిబెల్(స్వజాతి మాంసాన్ని భక్షించేవాడు)’’ పేరుతో ప్రదర్శనకు ఉంచారు. ఇక అప్పటి నుంచి సీ జీవితం ఆధారంగా ఎన్నో హారర్ సినిమాలు తెరకెక్కాయి. పుస్తకాల్లో అతడి కథ గురించి కొంతమంది రచయితలు ప్రస్తావించారు. అయితే ఈ కేసుల్లో నిజంగానే సీ నిజంగానే దోషి అనడానికి మాత్రం పూర్తి స్థాయిలో ఆధారాలు లభించలేదు. కఠిన చర్యలు.. అరవై ఏళ్ల తర్వాత అంత్యక్రియలు ఈ నేపథ్యంలో అందరు పిల్లల్లాగానే తాను కూడా సీ ఓయే గురించి బాల్యంలో కథలు విన్న ఫరా చక్రపత్రనన్ అనే వ్యక్తికి మాత్రం ఎందుకో ఈ విషయాలు నమ్మబుద్ధికాలేదు. చైనా- థాయ్‌లాండ్ మధ్య శత్రుత్వం కారణంగా థాయ్ మిలిటరీ ప్రభుత్వం అప్పట్లో చైనీస్ వలసదారులను అకారణంగా శిక్షలకు గురిచేసేదని, జైలులో బంధించేదనే కథనాలు.. ఫరాను సీ గురించి మరింత లోతుగా ఆలోచించేలా చేశాయి. అంతేగాకుండా మిస్సయిన పిల్లలంతా ఒకే విధంగా చనిపోలేదనే విషయం కూడా అతడి మెదడును తొలచివేసింది. ఏదేమైనా చేసిన తప్పునకు శిక్ష అనుభవించాడు కాబట్టి సీని ‘కానిబెల్’ అని పేర్కొంటూ ఇంకా అతడి మృతదేహాన్ని మ్యూజియంలో ఉంచడం సరైన చర్య కాదని భావించాడు. అందుకే.. చనిపోయిన వ్యక్తికి కనీసం శాస్త్ర ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకోవాలంటూ 2018లో ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇందుకు మరికొంత మంది కూడా తోడు కావడంతో సిరిరాజ్ ఆస్పత్రి ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని గతేడాది జూన్‌లో కానిబెల్ ట్యాగ్‌ను తొలగించి.. ఆగస్టులో సీ మృతదేహాన్ని మ్యూజియం నుంచి వేరే చోటుకు మార్చింది. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం గురువారం ఎట్టకేలకు సీ అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ముందుకు వచ్చారు. తొమ్మిది మంది బౌద్ధ సన్యాసుల సమక్షంలో సీ శవపేటిక ముందు మంత్రాలు పఠిస్తూ, కాగితపు పూలు జల్లి శ్మశానానికి తరలించారు. కరెక్షన్ డిపార్ట్మెంట్ హెడ్ అతడి శవానికి నిప్పు అంటించారు. సీ ఓయే అమాయకుడు ఈ విషయం గురించి ఫరా మాట్లాడుతూ.. ‘‘నేను మ్యూజియంకు వెళ్లినపుడు అతడిని చూశాను. అప్పటి వరకు ఓ మాన్ ఈటర్గానే తను నాకు తెలుసు. కానీ ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత అతడు ఓ బాధితుడు అనిపించింది. నేరం చేశాడో లేదో తెలియదు గానీ గాజు గ్లాసులో దశాబ్దాల తరబడి బొమ్మగా మిగిలిపోయాడు. అతడి హక్కులు హరించివేయబడ్డాయి అనిపించింది. అందుకే ఈ పిటిషన్ దాఖలు చేశా’’ అని చెప్పుకొచ్చారు. ఇక సీ ఓయేకు తోటమాలిగా పని ఇచ్చిన దంపతుల కూతురు వనప్ప తాంగ్చిన్.. తన కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం సీ ఓయే ఓ అమాయకుడని పేర్కొన్నారు. అతడిని తమ కుటుంబంలో ఒకడిగా భావించేవారని.. అంతటి హేయమైన నేరానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోయామని చెప్పుకొచ్చారు. తమ గ్రామస్తులు కూడా ఇదే విషయాన్ని చెప్పారని, ఎట్టకేలకు అతడి అంత్యక్రియలు నిర్వహించడం ఊరట కలిగించే విషయమని పేర్కొన్నారు. -
అంత్యక్రియలకు జీహెచ్ఎంసీ నూతన కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: కరోనా మృతదేహాల దహన సంస్కారాలపై జీహెచ్ఎంసీ నూతన కార్యాచరణ ప్రారంభించింది. అందులో భాగంగా జీహెచ్ఎంసీలో మొబైల్ శ్మశాన వాటికలను ఏర్పాటు చేశారు. వీల్ ఆన్ క్రిమేషన్పై అధికారులు దృష్టిపెట్టారు. రూ.7.5 లక్షలతో కార్పొరేషన్ బాక్సులను కొనుగోలు చేసింది. వీటితో జీహెచ్ఎంసీ మొదటి దశ ట్రయల్స్‌ను కూడా పూర్తి చేసింది. ఇకపై కరోనా మృతదేహాలకు మొబైల్ ఎలక్ట్రికల్ క్రిమేషన్స్ బాక్సులతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చక్రాలపై ఎలక్ట్రికల్ శ్మశాన వాటికను ఎక్కడికైనా తరలించే సౌకర్యం ఉంది. ఎర్రగడ్డలోని శ్మశానవాటికలో ప్రయోగాత్మకంగా మొబైల్ క్రియేషన్స్ బాక్సులను ఏర్పాటు చేశారు. ప్లగ్- ఇన్ మోడల్‌గా ఎక్కడికైనా క్రిమేషన్ బాక్స్‌లను రవాణా చేయవచ్చు. 1,200 డిగ్రీల ఫారెన్హీట్తో రెండు గంటల్లోనే అంత్యక్రియలు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. (బాబోయ్! అంబులెన్స్.. విమానం మోత!) -
పాడె మోసేందుకూ ముందుకు రాలేదు
సాక్షి, శాలిగౌరారం: ‘కరోనా’అనుమానం మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని మంటగలిపింది. అనారోగ్యంతో మృతిచెందిన ఓ వ్యక్తి దహన సంస్కారాలకు ఒక్కరూ ముందుకు రాలేదు. పాడె మోసేందుకు కూడా బంధువులు ముందుకు రాకపోవడంతో.. ఎడ్లబండే ఆ కుటుంబానికి ఆధారంగా మారింది. అయితే ఆ బండిని లాగేందుకు ఎడ్లు కూడా లేకపోవడంతో మృతుడి ఇద్దరు బావలే ఎడ్లుగా మారారు.. తమ్ముడు వెనకాల ఎడ్లబండిని నెట్టాడు. హృదయ విదారక పరిస్థితుల్లో వారు దహన సంస్కారాలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఆకారం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా ఆదివారం వెలుగులోకి వచి్చంది. వివరాలిలా ఉన్నాయి.. ఆకారం గ్రామానికి చెందిన మర్రిపల్లి నర్సయ్య, యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు జానయ్య (32) కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన జానయ్యను ‘కరోనా’అనుమానంతో ఈనెల 9న నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. జానయ్య నుంచి నమూనాలను సేకరించి కరోనా పరీక్షలకు పంపించారు. 10న రాత్రి జానయ్య మృతి చెందాడు. వైద్య పరీక్షల నివేదికలు రానప్పటికీ మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చి ఆస్పత్రి వైద్య సిబ్బంది జానయ్య మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయతి్నంచగా కరోనా అనుమానంతో బంధువులు, గ్రామస్తులు దహన సంస్కారాలకు వచ్చేందుకు నిరాకరించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో మృతుడి కుటుంబీకులే మృతదేహన్ని ఖననం చేసేందుకు గుంత తీసుకున్నారు. ఎడ్లబండిపై జానయ్య మృతదేహాన్ని పెట్టుకుని వెళ్లి అంతిమ సంస్కారం నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎడ్లబండికి మృతుడి ఇద్దరు బావలే ఎడ్లుగా మారగా తమ్ముడు బండిని వెనకనుంచి నెట్టుతూ తీసుకెళ్లారు. చివరకు మృతుని పొలం వద్ద అంత్యక్రియలను పూర్తిచేశారు. -
కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీలపై కేసు నమోదు
సిమ్లా: కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకున్నందుకు గాను సీనియర్ కాంగ్రెస్ నాయకుడితో పాటు ముగ్గురు కౌన్సిలర్లు, మరో 16 మంది మీద హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడిని మండి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు సుమన్ చౌదరిగా గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం కోసం అంబులెన్స్‌లో శ్మశానవాటికకు తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు కాన్సా, తన్వా గ్రామాల ప్రజలతో కలిసి రోడ్డుకు అడ్డంగా బైఠాయించి అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. దాంతో సుమన్ చౌదరితో పాటు మిగతా వారిపై అంటు వ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేశాం’’ అన్నారు పోలీసులు. సుమన్ చౌదరి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఓ వైపు కాంగ్రెస్ నాయకులు కరోనాను ఓడించండి.. మానవత్వాన్ని బతికించండి అంటూ ప్రచారం చేస్తుండగా.. మరో వైపు సుమన్ చౌదరి కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అంత్యక్రియలపై వివాదం.. కేటీఆర్‌కు ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురంలో కరోనా మృతుడి అంత్యక్రియలపై వివాదం చోటుచేసుకుంది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా తన భర్త అంత్యక్రియలు నిర్వహించారని జీహెచ్ఎంసీ, గాంధీ ఆస్పత్రిపై మాధవి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళుతూ ట్వీట్ చేశారు. అయితే ఈ వివాదంపై స్పందించిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్.. కరోనాతో ఆస్పత్రిలో చేరిన 23 గంటల్లోనే ఆ వ్యక్తి మరణించాడని, ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపే మృతదేహాన్ని పోలీసులకు అప్పగించామని స్పష్టం చేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? వనస్థలిపురంలోని మధుసూదన్ కుటుంబం కరోనా బారిన పడింది. దీంతో వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా నుంచి కోలుకున్న మిగతా కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా.. మధుసూదన్ మాత్రం ఇంటికి రాలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నింగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో కరోనా చికిత్స కోసం వెళ్లిన తన భర్త జాడ తెలియడం లేదంటూ కేటీఆర్‌కు ట్విటర్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని ఆమె కోరారు. తాను, తన భర్త,ఇద్దరు కూతుళ్లతో కోవిడ్ ఆస్పత్రిలో చేరామని, తనతో పాటు కూతుళ్లు తిరిగివచ్చారని, తన భర్త ఎక్కడున్నాడో తెలియడం లేదని ఆమె కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. @KTRTRS Missing case of my husband at Gandhi hospital.... Hello K. Taraka Rama Rao sir, Myself madhavi w/o Madhusudhan(age:42) living with two daughters in vanasthalipuram. As our family members being suffering from corona had admitted in Gandhi hospital & we all had — Alampally Madhavi (@AlampallyMadha3) May 20, 2020 స్పందించిన మంత్రి ఈటల కరోనా బారిన పడి మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలపై చెలరేగిన వివాదంపై మంత్రి ఈటల రాజేందర్ తాజాగా స్పందించారు. ‘వనస్థలిపురానికి చెందిన ఈశ్వరయ్య కుటుంబం మొత్తానికి కరోనా వైరస్ సోకింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే ఈశ్వరయ్య చనిపోయారు. అయన కుమారుడు మధుసూదన్ అదే రోజు కరోనాతో ఆస్పత్రిలో చేరారు. ఈ నెల 1వ తేదీన చనిపోయారు. మధుసూదన్ మృతి గురించి పోలీసులకు చెప్పాము, అయితే తన భర్త చనిపోయాడని భార్యకు తెలిస్తే షాక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆమెకు ఈ విషయం చెప్పలేదు. అప్పటికే ఒకరిని కోల్పోయారు, మరొకరి మృతి గురించి చెబితే తట్టుకోలేరని వాళ్ల సన్నిహితులు కూడా అన్నారు. అంతేకాకుండా ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ కరోనాతో ఆస్పత్రిలోనే ఉండటంతో ప్రభుత్వమే దహన సంస్కారాలు చేసింది. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టే పరిస్థితి లేద’ని మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. చదవండి: తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా మరణం ఇంట్లో నాగన్న.. బయట కరోనా -
మాకు కరోనా సోకుతుంది.. శవాన్ని తీసుకురావొద్దు
చండీగఢ్ : కరోనా సోకిందేమో అన్న అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళ అంత్యక్రియలు అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో వారిపై లాఠీచార్జ్ ప్రయోగించారు. పంజాబ్‌లోని అంబాల కంటోన్మెంట్ సమీపంలోని చంద్‌పురా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఓ మహిళ శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ సోమవారం కన్నుమూసింది. దహనసంస్కారాల నిమిత్తం బందువులు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తుండగా, అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. కరోనా సోకి చనిపోయివుండొచ్చనే అనుమానంతో అడ్డుతగిలారు. దీంతో మృతురాలి బంధువులు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ పరీక్షల కోసం నమూనా సేకరించినట్టు ఆసుపత్రి వర్గాలు సైతం చెప్పాయని పేర్కొన్నారు. అయినప్పటికీ గ్రామస్తులు వినకపోవడంతో పరిస్థితిని అదుపుచేసేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీస్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎట్టకేలకు మృతురాలి దహన సంస్కారాలు జరిపించామని అంబాలా పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ జోర్వాల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. -
కరోనా: పోలీసులపై రాళ్లదాడి.. గాల్లోకి కాల్పులు
చండీగఢ్: కరోనా అనుమానిత మహిళ మృతదేహాన్ని దహనం చేస్తున్నారనే వార్తలతో స్థానికులు పోలీసులపై దాడి చేసిన ఘటన హరియాణాలోని అంబాలాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో ఓ మహిళ (60) పట్టణంలోని కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. శవాన్ని దహనం చేసేందుకు డాక్టర్లు, పోలీసులు శ్మశాన వాటికకు చేరుకోగానే.. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన స్థానికుల గుంపు వారిపై రాళ్లతో దాడికి దిగింది. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. (చదవండి: జర్నలిస్టులకు రూ .10 లక్షల బీమా: హర్యానా) ఆస్థమాతో బాధపడుతున్న మహిళ.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. మహిళకు సంబంధించిన కోవిడ్ నిర్ధారణ రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనాతో చనిపోయినా.. వైరస్ అనుమానితులుగా చనిపోయినా మృతదేహాన్ని దహనం చేసేందుకు పూర్తి రక్షణాత్మక పద్ధతులు పాటిస్తామని వెల్లడించారు. గ్రామస్తులు అనవసరంగా అంత్యక్రియలను అడ్డుకున్నారని తెలిపారు. స్థానికులకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదని అంబాల డీఎస్పీ రామ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ల దాడిలో ఒక అంబులెన్స్ కూడా ధ్వంసమైందన్నారు. లాక్డౌన్ పాటించకుండా.. తమ విధులను అడ్డుకున్నవారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 289 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ముగ్గురు మరణించారు. అంబాల పట్టణంలో 12 కేసులు నమోదయ్యాయి. (చదవండి: ఉద్దవ్ ఠాక్రే పదవీ గండం నుంచి బయటపడతారా?) -
అందరూ ఉన్న అనాథ
కాజీపేట: బతికి ఉండగా కన్నతల్లికి పిడికెడు అన్నం పెట్టకుండా రోడ్డున పడేసి అనాథ ఆశ్రమం పాల్జేశాడు ఓ కొడుకు. తల్లి మరణించిందని తెలిసినా కడసారి చూడటానికి సైతం రాకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులే దహన సంస్కారాలు నిర్వహించిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హన్మకొండ రెడ్డికాలనీకి చెందిన శ్యామలయ్య (72)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పిల్లలను పెంచి పెద్ద చేసిన తర్వాత భర్త చనిపోవడంతో శ్యామలమ్మ ఒంటరిగా మిగిలింది. కొడుకు తల్లికి పిడికెడు అన్నం పెట్టకపోవడంతో పస్తులు ఉండాల్సి వచ్చేది. వృద్ధురాలు పడుతున్న బాధను చూడలేక స్థానికులు గత ఏడాది జూన్‌లో ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ అనాథ ఆశ్రమ నిర్వాహకులు ఛోటు, యాకుబీ శ్యామలమ్మను ఆశ్రమానికి తరలించారు. అప్పటి నుంచి ఆరోగ్యంగానే ఉన్న ఆమె.. బుధవారం అస్వస్థతకు గురై మరణించింది. ఆరీ్టసీలో ఉద్యోగం చేస్తున్న కుమారుడు వెంకటేశ్వర్లుకు తల్లి మరణించిన విషయం చెప్పినా రాలేదు. దీంతో నిర్వాహకుల కూతురు ఆఫ్రీన్ పర్వేజ్ దహన సంస్కారాలు నిర్వహించారు. -
ముగిసిన వేణుమాధవ్ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని మౌలాలి హౌజింగ్ బోర్డ్ లక్ష్మీనగర్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు వేణుమాధవ్ దహన సంస్కారాలు నిర్వహించారు. వేణుమాధవ్ పెద్ద కుమారుడు చితికి నిప్పంటించాడు. ఫిలిం చాంబర్ నుంచి ప్రారంభమైన అంతియ యాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు వేణుమాధవ్‌కు కడసారి నివాళులర్పించారు. (చదవండి : నవ్వు చిన్నబోయింది) టాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన వేణుమాధవ్ 400లకు పైగా సినిమాల్లో నటించారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించారు. కొంత కాలంగా సినీరంగానికి దూరంగా ఉంటున్న ఆయన, కాలేయ సంబంధిత వ్యాదితో బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. -
ముగిసిన కోడెల అంత్యక్రియలు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ముగిశాయి. గుంటురు జిల్లా నరసరావుపేటలో స్వర్గపురిలో కోడెల చితికి ఆయన కుమారుడు శివరామ్ నిప్పంటించారు. కోడెలకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు తరలివచ్చారు. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు హాజరయ్యారు. హైద్రాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ నుంచి కోడెల భౌతికాయాన్ని నిన్న రోడ్డు మార్గంలో గుంటూరుకు తరలించిన విషయం తెలిసిందే. నేతల నివాళి అనంతరం భౌతిక కాయాన్ని సత్తెనపల్లి మీదుగా నరసరావుపేటకు తరలించారు. -
పరువు హత్య : చివరి క్షణంలో పోలీసులు రావడంతో..
న్యూఢిల్లీ : కూతురు ప్రేమ వ్యవహారం నచ్చకపోవడంతో ఓ కుటుంబం కన్నెర్రజేసింది. దారుణంగా గొంతు నులిపి హత్య చేసి ఆత్మహత్యగా అందర్నీ నమ్మించాలనుకుంది. కానీ, పోలీసుల రాకతో సీన్ మారింది. వివరాలు.. ఉత్తర ఢిల్లీలోని ఆజాద్‌పూర్ ఆదర్శనగర్‌లో రెండు నెలల క్రితం శీతల్ అనే బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అయితే, వారు మృతురాలి ఇంటికి చేరుకునేలోపే శవాన్ని మాయం చేశారు. ఆగమేఘాలమీద మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంతిమ సంస్కరాలకు ఏర్పాట్లు చేశారు. మరికొద్ది క్షణాల్లో శవాన్ని దహనం చేస్తారనగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆఘమేఘాలమీద శవ దహనానికి ఏర్పాట్లు చేయడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. ఆ నివేదికలో అసలు విషయం బయటపడింది. దారుణంగా హింసించి, గొంతు నులమడంతో శీతల్ మరణించిందనే నిజం తెలిసింది. శీతల్ తండ్రి లఖన్ (50), ఇంటిపక్కనే ఉండే రాజు (30) ఇద్దరూ చేసిన నేరాన్ని ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. శీతల్ ఓ యువకుడిని ప్రేమించడంతోనే తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. గత జూలై 24న శీతల్ హత్య జరగగా అసలు నిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. -
ముగిసిన జైట్లీ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అంత్యక్రియలను ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, ప్రముఖుల సమక్షంలో జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు అరుణ్ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇక దివంగత నేత భౌతికకాయాన్ని స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జైట్లీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ భార్య, కుమారుడితో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 66 సంవత్సరాల అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో ఈ నెల 9 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నసంగతి తెలిసిందే. జైట్లీ గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్య, అరుదైన కేన్సర్‌తో బాధపడుతున్నారు. -
ముగిసిన షీలా దీక్షిత్ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : గుండెపోటుతో శనివారం కన్నుమూసిన ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాల మధ్య ఆమె పార్థివ దేహానికి ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దివంగత నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు అంతిమ యాత్రకు తరలివచ్చారు. అంతకుముందు షీలా దీక్షిత్ భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. ప్రజల సందర్శనార్ధం ఇక్కడ కొద్దిసేపు ఉంచిన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ పీసీసీ కార్యాలయానికి భౌతిక కాయాన్ని తరలించారు. యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ బీజేపీ కురువృద్ధులు ఎల్కే అద్వానీ సహా పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు దివంగత నేతకు నివాళులు అర్పించారు. మరోవైపు దివంగత నేతతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోనియా గాంధీ ట్వీట్ చేశారు. ఇక షీలా దీక్షిత్ ఢిల్లీ అభివృద్ధికి విశేషంగా కృషిచేశారని, ఆమె విలువైన మార్గదర్శకత్వాన్ని తాను కోల్పోయానని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. కాగా షీలా దీక్షిత్ గుండెపోటుతో శనివారం ఉదయం ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరగా వైద్యులు తీవ్రంగా శ్రమించినా మరోసారి గుండె పోటు రావడంతో మధ్నాహ్నం 3.55 గంటలకు మరణించిన సంగతి తెలిసిందే. -
చితి నుంచి.. పోస్టుమార్టంకు
ముజఫర్‌నగర్: చితిపై దహనమవుతున్న మృతదేహన్ని పోలీసులు పోస్ట్‌మార్టంకు తరలించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ముజఫర్‌నగర్ జిల్లాలోని గోథానా గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళ మరణించడంతో కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అయితే మహిళను అత్తింటివారే చంపారని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చితిపై కాలుతున్న మృతదేహన్ని తీసి పోస్ట్‌మార్టంకు పంపించారు. మహిళ భర్త విజయ్‌పాల్‌తో పాటు మరో నలుగురుపై కేసు నమోదు చేశామని, నిందితులు అందరూ పరారీలో ఉన్నారని పోలీసు అధికారి అమర్దీప్ లాల్ తెలిపారు. -
హరికృష్ణకు కన్నీటి వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ అంత్య క్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛ నాలతో జరిగాయి. కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు హరి కృష్ణకు కడసారి కన్నీటి నివాళులర్పించారు. హరికృష్ణ తనయులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు అంతిమ సంస్కారాలు నిర్వహిం చారు. చితికి కల్యాణ్‌రామ్ నిప్పంటించారు. పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. హరికృష్ణ చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. నివాళులర్పించిన రాజకీయ, సినీ ప్రముఖులు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జస్టిస్ చలమేశ్వర్, మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, ఎంపీలు కవిత, డి.శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నేతలు మేకపాటి రాజమెహన్రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, ప్రసన్న కుమార్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సురేశ్‌రెడ్డి, రేణుకాచౌదరి, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగల, సీఎం రమేశ్, నన్నపనేని రాజకుమారి, మాగంటి బాబు, యార్గగడ్డ లక్ష్మీప్రసాద్, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు, నటులు నాగార్జున, కోటా శ్రీనివాసరావు, జగపతి బాబు, అర్జున్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ఆలీ, బెనర్జీ, మంచు లక్ష్మి, మనోజ్ తదితరులు హరికృష్ణ నివాసానికి చేరుకుని, ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హరికృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజామున వచ్చిన వారిని ఉదయం 11 గంటల తర్వాత కూడా లోనికి అనుమతించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీ సులకు, అభిమానులకు మధ్య స్వల్ప తోపు లాట చోటు చేసుకుంది. పోలీసులు చివరకు వీఐపీలకు, అభిమానులకు ప్రత్యేక దారులను ఏర్పాటు చేసి, భౌతికకాయం సందర్శనార్థం అనుమతించడంతో వారు శాంతించారు. అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేం దుకు ఎన్‌ఎండీసీలోని హరికృష్ణ నివాసానికి అభిమానులు పెద్ద మొత్తంలో చేరుకోవడంతో మాసబ్‌ట్యాంక్ మొదలు మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటన్నరపాటు సాగిన అంతిమ యాత్ర హాలులో ఉన్న హరికృష్ణ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోర్టికోలోకి తీసుకొచ్చారు. అక్కడే కుమారులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో బ్రాహ్మణులు సంప్రదాయ పద్ధతిలో పూజలు చేయించారు. అనంతరం అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంతిమ యాత్ర సాగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ స్వయంగా పాడెను మోసుకుంటూ వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైకుంఠరథంలో ఎక్కించారు. ‘నందమూరి హరికృష్ణ అమర్ రహే..’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేసుకుంటూ అభి మానులు ముందుకు సాగారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్‌ఎండీసీలోని హరికృష్ణ స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర సరోజినీదేవి కంటి ఆస్పత్రి, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్, జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మధ్యాహ్నం 3.30 గంటలకు మహా ప్రస్థానానికి చేరుకుంది. దాదాపు గంటన్నర పాటు అంతిమయాత్ర సాగింది. తండ్రికి తగ్గ తనయుడు: వెంకయ్య సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో తెలుగు లోనే మాట్లాడతానని హరికృష్ణ పట్టుబట్టారు. ఆ సమయంలో నేను జోక్యం చోసు కుని తెలుగును ఇంగ్లిష్‌లోకి అనువాదం చేస్తానని అప్పటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్‌కు చెప్పాను’అనే విషయాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. గురువారం హరికృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. తండ్రికి తగ్గ తనయుడిగా హరికృష్ణ బతికారని కొనియాడారు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేశారని వ్యాఖ్యానించారు. అనుకున్న పనిని తనదైన శైలిలో చేసిన వ్యక్తి హరికృష్ణని అన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ తనయుడిగా హరికృష్ణ వ్యవహరించారని పేర్కొన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనా లతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించిం ది. అంతిమయాత్ర మహాప్రస్థానానికి చేరు కున్న తర్వాత వైకుంఠరథం నుంచి భౌతిక కాయాన్ని కిందికి దింపారు. కుమారులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ముందు నడుస్తుండగా ఆ వెనుకాలే చంద్రబాబు, జస్టిస్ చలమేశ్వర్, హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులంతా పాడెపట్టి భౌతిక కాయాన్ని చితివరకు మోసుకొచ్చారు. పోలీ సులు హరికృష్ణ భౌతికకాయానికి గౌరవ వంద నం చేసి.. గాల్లోకి మూడు సార్లు కాల్పులు జరిపారు. సరిగ్గా 4.10 గంటలకు కల్యాణ్ రామ్ హరికృష్ణ చితికి నిప్పంటించారు. -
సరిగ్గా అదే రోజున, అక్కడే ఆయన అంత్యక్రియలు!
ముంబై : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్(63) అంత్యక్రియలు ముంబైలోని చరాయి శ్మశాన వాటికలో గురువారం ముగిశాయి. అయితే సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు(ఆగస్టు 23)న గురుదాస్ చరాయి శ్మశాన వాటికను ప్రారంభించారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. విధి ఎంత విచిత్రమైందో అంటూ ఆయన సన్నిహితులు నివాళులు అర్పించారు. ఆయన హఠాన్మరణం తమకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇదే రోజున.. ‘ఆరోజు నాకు గుర్తుంది. నేను, గురుదాస్‌జీ, మా సహచరుడు హాందోర్ జీ కలిసి.. తొమ్మిదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు(ఆగస్టు 23)న ఈ శ్మశాన వాటికను ప్రారంభించాము. ఇప్పుడు గురుదాస్ జీ అంత్యక్రియలు ఇక్కడే, ఇలా జరగడం చూస్తుంటే విధి ఎంత విచిత్రమైందో కదా అన్పిస్తోంది. ఈ శ్మశాన వాటికను పునరుద్ధరించి అందుబాటులోకి తెస్తానన్న మాటను నిలబెట్టుకున్న గురుదాస్ ఇక్కడే శాశ్వతంగా నిద్రిస్తారని ఊహించలేదు. నిబద్ధత, నిజాయితీలకు మారుపేరైన గురుదాస్‌జీ లోటును ఎవరూ తీర్చలేరు’ అంటూ ముంబై మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్ గురుదాస్ కామత్‌కు నివాళులు అర్పించారు. కాగా న్యూఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురుదాస్ బుధవారం తుదిశ్వాస విడిచారు. -
అందుకే కరుణానిధిని ఖననం చేశారు
చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, లక్షలాది మంది అభిమానులు ఆశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. తొలుత పళనిస్వామి ప్రభుత్వం కరుణానిధి అంతిమ సంస్కరాలకు మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడానికి నిరాకరించిన సంగతి తెలిసింది. దాంతో స్టాలిన్, డీఎమ్‌కే వర్గాలు హై కోర్టుకు వెళ్లి మరి కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిగేలా కృషి చేశారు. హిందువు కదా.. ఖననం ఎలా హిందూ సాంప్రదాయం ప్రకారం చిన్న పిల్లల్ని, సాధువుల్ని తప్ప మిగితా ఎవరూ మరణించిన వారిని దహనం (క్రిమేషన్) చేస్తారు. కేవలం క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే ఖననం (బురియల్) చేస్తారు. కానీ కరుణానిధిని కూడా ఖననం చేశారు. ఎందుకిలా అంటే కరుణానిధి హిందూ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికి, ఆయన నాస్తికుడు. జీవించినంత కాలం ఆయన తనను తాను నాస్తికునిగానే ప్రచారం చేసుకున్నారు. అందువల్లనే కరుణానిధి అభిప్రాయాలకు విలువ ఇస్తూ ఆయనను దహనం చేయకుండా ఖననం చేశారు. ఒక కరుణానిధినే కాక గతంలో పెరియార్ ఇ.వి. రామసామి, సీఎన్ అన్నాదురై వంటి మహామహులందరిని ఖననం చేశారు. ఇప్పుడు వారి దారిలోనే కరుణానిధిని కూడా ఖననం చేశారు. 14 ఏట నుంచి నాస్తికవాదం వైపు సమాజంలో ఉన్న బ్రాహ్మణాధిక్యాన్ని ప్రశ్నిస్తూ పెరియార్ ఇ వి రామసామి నాయకర్ ‘ద్రవిడ ఉద్యమా’న్ని తీసుకొచ్చారు. ఈ ఉద్యమ భావజాలానికి ఆకర్షితులైన కరుణానిధి దీనిలో భాగస్వామి అయ్యారు. అనంతరం ఈ ఉద్యమ ఫలితంగా ఆవిర్భవించిన ‘ద్రవిడ కళగం పార్టీ’(డీకేపీ)లో చేరారు. డీకే పార్టీలో వచ్చిన వివాదం ఫలితంగా ‘డీఎమ్‌కే’ పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ కూడా దేవున్ని నమ్మదు. అయితే కరుణా నిధి నాస్తికుడిగా ఉన్నప్పటికీ, ఇతరుల నమ్మకాలకు పూర్తి విలువనిచ్చేవారని తెలిసింది. ఆయన దేవున్ని నమ్మనప్పటికీ, ఇతరుల విశ్వాసాలను మాత్రం వ్యతిరేకించేవారు కాదని తెలిసింది. -
మెరీనాలో కరుణ అంత్యక్రియలకు నో
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలపై సందిగ్దం నెలకొంది. మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాది వెనుక భాగంలో కరుణానిధి అంత్యక్రియలు చేపట్టాలని కుటుంబ సభ్యులు భావించారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు చేపట్టడానికి అనుమతి నిరాకరించింది. గాంధీ మండపం రోడ్డులో అంత్యక్రియలకు ప్రభుత్వం అనుమతించింది. అక్కడ రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు తెలిపింది. దీనిపై డీఎంకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరుణానిధి అంత్యక్రియలను ఎట్టి పరిస్థితుల్లోనూ మెరీనా బీచ్‌లోనే చేపడతామని డీఎంకే ప్రకటించింది. ఇందుకోసం కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపింది. మెరీనాలో అనుమతి దొరికే వరకు కరుణ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచాలని డీఎంకే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ కలిగిన డీఎంకే కార్యకర్తలు సంయమనంతో మహానేతకు నివాళులు అర్పించాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. -
అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా..
విజయవాడ : విజయవాడలో అంత్యక్రియలకు సిద్దం చేస్తుండగా బాలిక తిరిగి బతికిందనే వార్త సంచలనం సృష్టించింది. దీంతో విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ వివరణ ఇవ్వాల్సివచ్చింది. అసలు ఏం జరిగిందంటే ? రాజరాజేశ్వరి పేటకి చెందిన సాయి దుర్గ అనే బాలిక అనారోగ్యానికి గురవ్వడంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి సాయి దుర్గ మరణించినట్లు ధృవీకరించారు. సాయిదుర్గ చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కన్నీరుమున్నీరైన బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంతలోనే బాలిక కదిలిందంటూ చెప్పడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. బతికున్న బాలికను చనిపోయిందని డెత్ సర్టిఫికెట్ ఇచ్చారంటూ ఆసుపత్రి సిబ్బందిపై బాలిక బంధువులు మండిపడ్డారు. అయితే శుక్రవారం సాయంత్రమే సాయి దుర్గ మృతి చెందిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ చక్రధర్ సాయి తెలిపారు. అయినా డాక్టర్లతో మరోసారి ధృవీకరించామన్నారు. కుటుంబ సభ్యుల అపోహల కారణంగానే ఈ గందరగోళం జరిగిందన్నారు. ప్రయివేటు అంబులెన్స్ డ్రైవర్ చేసిన నిర్వాకంపై విచారణ చేపడతామన్నారు. ప్రయివేటు ఆర్ ఎంపీ వైద్యురాలు బాలిక బతికుందని చెప్పడంతో అసలు గందరగోళం తలెత్తిందని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలలు ప్రాణాలు కాపాడానికే ఉన్నాయి. తీయడానికి కాదని చక్రధర్ సాయి అన్నారు. బాలిక చనిపోయింది కాబట్టే నాలుగు ఆసుపత్రిల చుట్టూ తిప్పినా వైద్యం చేయడానికి ఎవరు ముందుకు రాలేదని తెలిపారు. ఈ ఘటనపై మంత్రి కామినేని శ్రీనివాస్ డీఎమ్ఈని విచారణకు ఆదేశించారు. -
దారుణం : కులానికి మచ్చ తెచ్చారని..
మల్కాన్‌గిరి(భువనేశ్వర్) : ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా రెండు రోజులపాటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. క్షత్రియ కులానికి చెందిన ఓ వ్యక్తి సఫాయి పని చేసి, గ్రామానికి మచ్చ తెచ్చాడని అతడి కుటుంబాన్ని గ్రామస్తులు వెలేశారు. అంతేకాకుండా సదరు వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారి కుటుంబసభ్యులను ఆ గ్రామం వెలేసింది. ఈ సంఘటన మల్కాన్ గిరి జిల్లా నువాగూడా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. క్షత్రియ కుటుంబంలో జన్మించినా బతుకుదెరువు కోసం కమలా చితాల్(75) కుమారుడు లక్ష్మణ్ డ్రైనేజీ శుద్ధి చేయడం, స్మశాన వాటికలో పనిచేయడం చేశాడు. దీంతో క్షత్రియ కులాన్ని అవమాన పరిచాడంటూ గ్రామస్తులు ఆగ్రహం చెంది వారి కుటుంబాన్ని ఏడేళ్ల కిందట వెలేశారు. అయితే లక్ష్మణ్ కొన్నేళ్ల కిందటే మృతిచెందినా వారి కుటుంబంపై మాత్రం గ్రామస్తులు వేసిన శిక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. అనారోగ్యంతో కమలా చితాల్ మృతిచెందడంతో ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకు వెళ్లకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. కమలా చితాల్ కోడలు, ఆమె మనవడు రబింద్ర చితాల్లు అంత్య క్రియలకు సహకరించాలని గ్రామస్తులను ప్రాధేయపడ్డారు. వాళ్లు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒడిశాలోని పూరీ జగన్నాథ్ దేవాలయం మహాప్రసాదానికి రూ. 1000, వారి వంశాన్నితిరిగి గ్రామంలోకి అనుమతించినందుకు మరో రూ.3000 కట్టమన్నారని మధ్యవర్తిత్వం వహించిన గ్రామ వార్డు మెంబర్ సుబ్రాన్సు పరిచా తెలిపారు. దీంతో డబ్బు చెల్లించడంతో శుక్రవారం సాయంత్రం గ్రామస్తులు అంత్యక్రియలకు అనుమతిచ్చారు. కాగా, ఈ సంఘటనపై మల్కాన్ గిరి జిల్లా కలెక్టర్ కే సుదర్శన్ విచారణకు ఆదేశించారు. -
అమ్మా.. ఇక సెలవు!
దర్శి: ఐదేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు.. ఐదు నెలల క్రితం అన్న మృతి చెందాడు.. సోమవారం రాత్రి తల్లి కూడా అందని తీరాలకు వెళ్లిపోయింది. అయినా ఆ కూతురు గుండె నిబ్బరంతో తల్లికి తలకొరివి పెట్టి కన్నతల్లి రుణం తీర్చుకుంది. దర్శికి చెందిన భార్గవికి మూడు సంవత్సరాల క్రితం వివాహామైంది. కాగా ఐదు సంవత్సరాల క్రితం తండ్రి పాపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు. విధి వెక్కిరించడంతో ఐదు నెలల క్రితం అన్న లోకేష్‌రెడ్డి విద్యుత్ షాక్‌తో విజయవాడలో మృతి చెందాడు. ఈ క్రమంలో పుచ్చమిట్టలో నివాసముంటున్న రమణమ్మ (53) అనారోగ్య కారణంతో ఒంగోలు ఆసుపత్రిలో మృతి చెందింది. తల్లి మరణ వార్త తెలుసుకుని కుమార్తె విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులందరూ మృతి చెందడంతో తల్లి రమణమ్మ మృత దేహానికి తలకొరివి పెట్టే వారు లేకుండా పోయారు. దీంతో తానే తలకొరివి పెడతానంటూ ముందుకు వచ్చింది. భర్త సమ్మతం కూడా లభించడంతో మంగళవారం కర్మకాండలు ముగించింది. బంధువులంతా ఈ సంఘటన చూసి మరింత కన్నీరుమున్నీరయ్యారు. కూతురు అంటే ఇలా ఉండాలని దీవించారు. అయితే దహన సంస్కారాలు చేసే సమయంలో కొంతమంది అడ్డువచ్చారు. ఆడ పిల్లలు ఇలా చేయడానికి వీల్లేదన్నారు. కానీ భార్గవి ప్రేమ ముందు వారంతా తలదించక తప్పలేదు. -
ఆ చిట్టితల్లికి ఎంత కష్టమో
ఒంగోలు క్రైం: తండ్రి ఆలనలో.. తల్లి లాలనలో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన ఆ చిట్టితల్లికి తీరని కష్టం వచ్చి పడింది. ఆడుతూపాడుతూ కాలం గడపాల్సిన వయసులో తల్లికి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకెళ్తే... కార్తీక వన మహోత్సవానికి ఆదివారం విజయవాడ వెళ్లి బోటు ప్రమాదంలో మృతిచెందిన వారిలో దేవాబత్తిన లీలావతికి ఆమె ఏకైక కుమార్తె మను మంగళవారం అంత్యక్రియలు నిర్వహించింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహా ప్రస్థానంలో బంధువులు దగ్గరుండి మనుతో లీలావతి మృతదేహానికి దహన సంస్కారాలు చేయించారు. కొడుకైనా, కూతురైనా మను ఒక్కటే కావడంతో తానే కుమారుడి పాత్ర పోషించి తన పేగు బంధ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంది. ఈ సంఘటనతో చూపరులు సైతం కంట తడి పెట్టారు. ముంతను ఉట్టిలో పెట్టుకుని చేతపట్టి తల్లి మృతదేహం ముందు మను నడుస్తుంటే దారినపోయే వారు సైతం అయ్యో ఆ చిన్నారికి ఎంత కష్టమో.. అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లి మృతదేహం చుట్టూ ఆఖరి ప్రదక్షిణలు చేసే సమయంలో మనుకు అడుగులు ముందుకు పడలేదు. కానీ, తప్పేది లేదంటూ బంధువులు ఆమెతో బలవంతంగానే అడుగులు వేయించి అంత్యక్రియలు పూర్తిచేయించారు. సుమా రు రెండు గంటలపాటు ఆ చిన్నారి మహా ప్రస్థానంలో వెక్కివెక్కి ఏడ్చి చివరకు సొమ్మసిల్లి పడిపోవడంతో బంధువులు ఆమెను వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. ఏడేళ్ల వయసులోనే తండ్రి మృతి... మనుకు ఏడేళ్ల వయసులోనే తండ్రి మరణించగా, తల్లి లాలనలో పెరుగుతూ ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంతలో తల్లి లీలావతి బోటు ప్రమాదంలో మృతిచెందగా, ఆ బాధ తట్టుకోలేక అమ్మమ్మ లక్ష్మీకాంతం ప్రాణాలు విడిచింది. ఇలాంటి కష్టం ఏ చిట్టితల్లికీ రాకూడదని అంత్యక్రియలను చూసిన ప్రతిఒక్కరూ భగవంతుడిని కోరుకున్నారు. -
దానగుణం అంటే అది!
పూర్వం ఒక గొప్ప సంపన్నుడుండేవాడు. అతను దెవభక్తిపరుడు. క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్లేవాడు. కార్తీక వ్రతం ఆచరించేవాడు. విరివిగా దానధర్మాలు చేసేవాడు. కాశీ యాత్ర కూడా చేశాడు. కానీ ఎవరైనా అవసరార్థం పదీపరకా అడిగినా చిల్లిగవ్వ కూడా ఇచ్చేవాడు కాదు. ఒకసారి అతను ఉంటున్న వీధిలోనే ఒక పేద యువతికి ఆ వీధివాళ్ళంతా కలసి పెళ్ళిచెయ్యాలని నిర్ణయించుకొని చందా పోగుచేశారు. ఆ వీధిలోని కొంతమంది పెద్దమనుషులు ఈయన వద్దకు వెళ్ళారు. కాని అతను నేనేమీ ఇవ్వలేనని చెప్పేశాడు. దాంతో పేదలకు సహాయం చెయ్యని దైవభక్తి దేనికని తలా ఓ తిట్టు తిట్టారు. ఈ పూజలు, ఉపవాసాలు ఎందుకని నానా మాటలన్నారు. అదే గ్రామంలో ఓ మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. అతను బాగా దానధర్మాలు చేసేవాడు. పేద యువతుల పెళ్ళిళ్ళకు, పేదల చదువులకు, అనాథలకు, వితంతువులకు ఉదారంగా సహాయం చేసేవాడు. ఎవరైనా పేదవ్యక్తి మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకయ్యే ఖర్చును భరించేవాడు. అతణì ్ణ ప్రజలు ఎంతగానో గౌరవించేవారు. అతనికోసం పూజలు చేసేవారు. ఒకసారి ఈ సంపన్న భక్తుడు అనారోగ్యానికి గురయ్యాడు. ప్రజలకు అతని పట్ల ప్రేమ, సానుభూతి లేకున్నా, వ్యాధిగ్రస్తులను పరామర్శించడం పుణ్యకార్యమని పరామర్శకు వెళ్ళారు. ఆశ్చర్యమేమిటంటే, దానధర్మాలు చేసే ఈ మనిషి సంపన్నుడి సేవలో నిమగ్నమై ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసినవారు ‘నిజంగా మనిషంటే ఈ మహానుభావుడే, ఆ పిసినారి నైజం తెలిసి కూడా అతనికి సేవలు చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు’. అని అతణ్ణి కొనియాడారు. కొన్నాళ్ళకు ఆ సంపన్నుడు మరణించాడు. అందరూ అతని అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దహన సంస్కారాలు పూర్తయిన తరువాత ఆ పెద్దమనిషి ‘అందరూ కొద్దిసేపు ఆగండి’ అని చెప్పాడు.. అందరూ స్నానాల తర్వాత శివాలయం ఆవరణలో గుమిగూడిన తరువాత, ‘మిత్రులారా! మీకో విషయం తెలియజెప్పాలి. అందరూ ఆ పెద్దాయన్ని పిసినారి అని తిట్టుకునేవారు కదా... నిజానికి ఆయన గొప్పదాత. కుడిచేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదన్నది ఆయన పద్ధతి. దానికోసం ఆయన నన్ను ఎన్నుకున్నారు. నేను చేపట్టే సేవాకార్యక్రమాలన్నీ ఆయన సమకూర్చిన ధనంతోనే!’ అని సభికులవైపు చూశాడు. అందరి కళ్లూ సజలాలయ్యాయి. ప్రతి ఒక్కరి చేతులు జోడించి ఆయన ఆత్మశాంతికోసం ప్రార్థన చేశారు. -
కన్నీటికే కన్నీరు!
∙చావు బతుకుల మధ్య ఉన్నరోగిని ఆస్పత్రికి చేర్చలేని దుస్థితి ∙తీవ్రజ్వరం, తలనొప్పితో కొంజుర్తి పెడెంపాలెం నివాసి మృతి ∙మృతదేహాన్ని డోలిలో తరలించిన బంధువులు కళ్లెదుట తమ ఆత్మీయుడు మృత్యువుతో పోరాడుతుంటే ఆస్పత్రికి చేర్చలేని దయనీయ పరిస్థితి. ఉలకని పలకని 108..మూడు కిలోమీటర్లు దారుణ రహదారుల్లో డోలీలో తీసుకువచ్చి ఆటోలో ఆస్పత్రికి తరలించేలోగానే ఆ నడి వయస్కుడు అనంతలోకాలకు చేరాడు. సకాలంలో వైద్యం అంది ఉంటే ఆ అభాగ్యుడు బతికిఉండే వాడన్నది యథార్థం. చోడవరం: ఆ గ్రామస్తులది దయనీయ పరిస్థితి. దారుణ రహదారితో వెతలకు గురవుతున్నారు. కొంజుర్తి సమీపంలోని పెడెంపాలెం గ్రామానికి రోడ్డు సదుపాయం లేదు. ఈ గూడేనికి రిగ్‌బోరు వెళ్లక పోవడంతో గొట్టపుబావి కూడా ఏర్పాటు కాలేదు. ఇక్కడి వారికి ఊటనీరే గతి. ఈ కారణంగా గ్రామస్తులు తరచూ వ్యాధులకు గురవుతున్నారు. ఆరోగ్య సిబ్బంది సేవలందిస్తున్నా నయం కావడంలేదు. ప్రస్తుతం గ్రామంలో పలువురు వ్యాధుల తో మంచానపడి విలవిల్లాడుతున్నారు. ఈ స్థితిలోనే గ్రామానికి చెందిన సెగ్గే చినపోతురాజు(46)జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు లక్షణాలతో నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం అర్ధరాత్రి నుంచి తలనొప్పి ఎక్కువైంది. వాంతులు కావడంతో తట్టుకోలేక పోయాడు. బంధువులు 108కు సమాచారం ఇచ్చారు. ఖాళీ లేదంటూ ఆ సిబ్బంది చెప్పడంతో కల్యాణపులోవ వరకు మూడు కిలోమీటర్లు డోలీమోతగా తీసుకొచ్చారు. అక్కడి నుంచి కొత్తకోట మీదుగా రోలు గుంట ఆస్పత్రికి ఆటోలో తీసుకు వెళుతుండగా చనిపోయాడు. మృతదేహాన్ని కల్యాణపులోవ వరకు ఆటోలో అక్కడి నుంచి మళ్లీ మూడుకిలోమీటర్లు డోలీమోతగా స్వగ్రామానికి తీసుకువెళ్లారు. చినపోతురాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆప్తుడ్ని కోల్పోయామన్న బాధ ఒక పక్క, సరైన రహదారి, రవాణా సౌకర్యం లేక డోలీమోతగా తీసుకువెళ్లడం మరో పక్క బంధువులను కుంగదీస్తోంది. కుమిలి కుమిలి రోదిస్తున్నారు. 108 వచ్చి ఉంటే.. చినపోతురాజును ఆస్పత్రికి తరలించాలని శుక్రవారం తెల్లవారు జాము 2 గం టల నుంచీ ఫోన్ చేసినా వాహనం ఖా ళీ లేదంటూ సమాధానం వచ్చేదని, దీంతో డోలీ మోతగా కళ్యాణపులోవ వరకూ మోసుకువచ్చి ఆపై ఆటోలో రోలుగుంట తీసుకురావడానికి మూడు గంటల సమయం పట్టిందని మృతు ని సోదరుడు పెద పోతురాజు తెలిపాడు. ఫోన్ చేసిన వెంటనే 108 వచ్చి ఉంటే తన తమ్ముడు బతికేవాడంటూ ఏడుస్తూ చెప్పాడు. -
కూతుళ్లే..కొడుకులై..
► తండ్రికి దహన సంస్కారాలు చేసిన కూతుళ్లు బాపట్ల టౌన్: కొడుకులు లేరు. అయితేనేం ఇద్దరు కూతుళ్లే కొడుకులయ్యారు. తమను గుండెలపై పెట్టుకుని చూసుకున్న తండ్రిని..చితి వరకు భుజాలపై మోశారు. కన్నతండ్రి రుణాన్ని ఆయన కట్టె కాలే వరకు తీర్చుకున్నారు. పట్టణంలోని కాకుమానువారిపాలెంకు చెందిన మేరుగ వెంకటేశ్వర్లు (75) తాపీ వర్కర్. శనివారం రాత్రి అనారోగ్యంతో చనిపోయారు. వెంకటేశ్వర్లుకు కొడుకులు లేరు. లక్ష్మి, నాగమణి ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. శనివారం తండ్రి మృతి చెందడంతో బోరున విలపించారు. ‘చిన్నతనంలో అల్లారుముద్దుగా ఎత్తుకు తిప్పిన మా తండ్రిని శ్మశానవాటిక వరకు మేమే మోసుకుపోతామం’టూ పాడినెత్తుకున్నారు. చితి వరకు వెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేశారు. -
వానరానికి అంత్యక్రియలు
వల్లూరు (ఆచంట) : వానరాలను దైవ స్వరూపంగా భావిస్తారు కొందరు. ఆచంట మండలం వల్లూరులో ప్రమాదవశాత్తూ చనిపోయిన ఓ వానరానికి అంతిమయాత్ర, అంత్యక్రియలు ఘనంగా నిర్వహించడంతోపాటు అన్నసంతర్పణ చేసి కోతిపై తమ భక్తి చాటుకున్నారు. ఈనెల 5న వల్లూరులోని జెడ్పీ హైస్కూల్ మైదానంలో కొబ్బరి చెట్టుపై నుంచి పడి ఓ వానరానికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు దాన్ని స్థానిక పశువైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. దీంతో చలించిన గ్రామస్తులు అదే రోజు అంతిమ యాత్ర నిర్వహించి ఖననం చేశారు. దాని స్మృత్యర్థం అన్న సంతర్పణ చేయాలని నిర్ణయించుకుని తలో చేయి వేశారు. జెడ్పీ హైస్కూల్ ఆవరణలో బుధవారం అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
భార్య చితి కోసం చిత్తుకాగితాలు, చెత్త..
ఇండోర్: అంబులెన్స్ దారి మధ్యలోనే వదిలేయడంతో భార్య మృతదేహాన్ని 10 కిలోమీటర్ల దూరం భుజాన మోస్తూ తీసుకెళ్లిన ఒరిస్సాలోని ఓ వ్యక్తి ఉదంతం మరువక ముందే.. మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. శ్మశానంలో భార్య మృతదేహానికి దహనసంస్కారాలు చేయడానికి పంచాయితీ పెద్దలు నిర్ణయించిన డబ్బు లేకపోవడంతో.. ఏం చేయాలో పాలుపోని ఆ భర్త, దహనానికి చుట్టుపక్కల చిత్తుకాగితాలు, చెత్త, పాతటైర్లు సేకరిస్తూ నరకం చూశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇండోర్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతం రతన్గర్ గ్రామంలో చోటుచేసుకుంది. గత శుక్రవారం రతన్గర్ గ్రామ సమీపంలోని గిరిజన గ్రామంలో నోజీభాయ్ అనే మహిళ మృతి చెందింది. దీంతో ఆమె భర్త జగదీష్ దహనసంస్కాలు చేయడానికి రతన్గర్ శ్మశానవాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లాడు. రతన్గర్ పంచాయితీ పెద్దలు మాత్రం రూ. 2500 చెల్లిస్తేనే దహనసంస్కారాలకు అవకాశం అని తెగేసి చెప్పారు. తన దగ్గర అంత డబ్బులేదని జగదీష్ చెప్పినా వారు కనికరించలేదు. దీంతో ఏం చేయాలో తోచని జగదీష్.. సుమారు మూడు గంటల పాటు సమీపంలో దొరికిన వాటితో చితికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారిలో కొందరు శవాన్ని నదిలో పడేయమంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారని జగదీష్ వాపోయాడు. చివరకు గ్రామంలో ఓ వ్యక్తి కొంత కలపను సహాయం చేసినట్లు వెల్లడించాడు. ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. రతన్గర్ గ్రామపెద్దలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
అంత్యక్రియలు చేస్తుండగా.. కదిలిన బిడ్డ!
మంబై: ఈ బిడ్డ బతికే అవకాశం లేనే లేదని డాక్టర్లు చెప్పడంతో.. కొడుకు చనిపోయాడని అంత్యక్రియలకు తీసుకెళ్లిన తల్లిదండ్రులకు షాక్ తగిలింది. ఐదు నిమిషాల్లో మరణిస్తాడనుకున్న బిడ్డ మృత్యుంజయుడిగా బయటపడిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన భాగ్య శ్రీ, నాగోజీ రావు దంపతులు కొన్నాళ్లుగా గుజరాత్‌లోని భరుచ్ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్లకు మూడు రోజుల కిందట పండంటి కొడుకు పుట్టాడు. బిడ్డ పుట్టుకతోనే శ్వాససంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతుండటంతో సర్ సాయాజీరావు జనరల్ ఆసుపత్రి డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందించారు. బిడ్డ చికిత్సకు ఎంతకూ స్పందించకపోతుండటంతో వెంటిలేటర్ పై నుంచి తీసిన ఐదు నిమిషాల్లో మరణిస్తాడని తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో.. ఇక తమ కొడుకు చనిపోయాడని భావించిన ఆ తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించబోయారు. ఆ సమయంలో బిడ్డ కదలడం గమనించిన తండ్రి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు బిడ్డను మళ్లీ వెంటిలేటర్ మీద ఉంచారు. ఆ తర్వాత బిడ్డ చికిత్సకు క్రమంగా స్పందించడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయని.. బిడ్డ ఇప్పుడు సొంతంగా ఊపిరి తీసుకుంటున్నాడని డాక్టర్ పాండే తెలిపారు. -
జపాన్‌లో శవాల హోటల్
టోక్యో: జపాన్‌లో వృద్ధతరం మరణాలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో శవాలను తగులబెట్టేందుకు క్రిమిటోరియంలో క్యూలు పెరిగిపోతున్నాయి. ఒక్కోసారి శవాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నాలుగు రోజులపాటు కూడా నిరీక్షించాల్సి వస్తోంది. అలాంటప్పుడు శవాలను భద్రపరిచేందుకు క్రిమిటోరియంలో చోటు కూడా లేదు. మరి ఎలా? ఇలాంటి అవసరాలను తీర్చడం కోసమే జపాన్‌లోని కవసాకి నగరంలో ఓ శవాల హోటల్ (కార్ప్స్ హోటల్) వెలిసింది. కవసాకి నగరంలోని క్రిమిటోరియం సమీపంలోనే ‘సౌసౌ’ అనే పేరుతో ఆ శవాల హోటల్ ఉంది. అందులో ఒక్క రాత్రికి ఒక్క శవానికి 5,800 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. హోటల్‌కు కూడా డిమాండ్ పెరుగుతుండడంతో నాలుగు రోజులకు మించి ఓ శవాన్ని ఉంచుకోవడం లేదు. నాలుగు రోజుల్లో అంత్యక్రియలు కూడా ముగుస్తున్నాయికనుక ప్రజలు పెద్దగా ఇబ్బంది పడడం లేదు. ఈ హోటల్లో శవ పేటకలను భద్రపర్చేందుకు ఫ్రీజర్లు కాకుండా ఏకంగా ఏసీ గదులను ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వచ్చి తమకు సంబంధించిన శవాలను రోజుకు ఎన్నిసార్లయినా వచ్చి చూసుకోవచ్చు. అక్కడే నిద్రిచ్చే వసతిని మాత్రం కుటుంబ సభ్యులకు స్థలాభావం వల్ల హోటల్ యజమానులు కల్పించడం లేదు. డిమాండ్‌కు తగ్గట్టుగా మరిన్ని క్రిమిటోరియంలు నిర్మించేందుకు కవసాకిలో స్థలం లేదని శవాల హోటల్ యజమాని హిసావో టేక్‌గిషి తెలిపారు. జపాన్‌లో వద్ధాప్యం కారణంగా ఏటా 20వేల మంది మరణిస్తున్నారు. ఈ సంఖ్య 2040 నాటికి 17లక్షలకు పెరిగుతుందని ప్రభుత్వ అంచనాలు తెలియజేస్తున్నాయి. శవాలకున్న డిమాండ్‌ను దష్టిలో పెట్టుకొని తాను త్వరలోనే ఇతర నగరాల్లో కూడా శవాల హోటళ్లను ప్రారంభించాలనుకుంటున్నట్లు సౌసౌ హోటల్ యజమాని తెలిపారు. ఇప్పటికే ఆ హోటల్ అక్కడున్నందుకు ఇరుగుపొరుగున నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వారు ప్లా కార్డులు ధరించి ధర్నా కూడా చేశారు. -
ప్రిన్స్ అంత్యక్రియలు ఎందుకు సీక్రెట్‌గా చేశారు?
న్యూయార్క్: అతడు హాలీవుడ్ గానాలోకానికి బాద్ షా లాంటివాడు. అతడు పాడేందుకు వేధికపైకి వస్తున్నాడని తెలియగానే ఇళ్లలో ఉన్నవారంతా టీవీలకు అతుక్కుపోతారు. తమ ముందే పాడుతున్నట్లుగా మైమరిచిపోతారు. మైఖెల్ జాక్సన్ అంతటి పేరున్న ఆ ఐకాన్ పర్సనాలిటి ప్రిన్స్. అవును ప్రిన్స్ రోజర్స్ నెల్సన్ గొప్ప పాప్ సింగర్.. బరాక్ ఒబామా దంపతులు సైతం ఆయనకు వీర అభిమానులు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఆయన ఎంతోమంది అభిమానులను సంపాధించుకున్నాడు. అనూహ్యంగా ఈ గురువారం ఆయన కన్నుమూశారు. అయితే, లక్షలమంది అభిమానులు సొంతం చేసుకున్న ఆయనకు వరుసగా నేటి వరకు అశ్రునివాళులు అర్పిస్తున్నప్పటికీ అతడి కుటుంబ సభ్యులు మాత్రం అంత్యక్రియలు శరవేగంగా రహస్యంగా కానిచ్చేశారు. మిన్నే పొలిస్ లోని ఫస్ట్ మెమోరియల్ వెస్ట్రన్ చాపెల్ వద్ద కేవలం నాలుగు గంటల్లో అంత్యక్రియలు ముగించి వెంటనే ఆయన చితాభస్మాన్ని తీసుకొని తుది క్రతువుకు వెళ్లిపోయారు. ఈ విషయంపై వివరణ కోరగా తాను ఒక వేళ చనిపోతే ఎలాంటి హాడావుడి లేకుండా,ఇబ్బందుల్లో పడకుండా, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా తన అంత్యక్రియలు పూర్తి చేయాలని వారికి విజ్ఞప్తి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఖరీదైన సమాధులు
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉన్న స్థానిక చైనీయుల సమాధుల మధ్యనుంచి నడుస్తుంటే.. విలాసవంతమైన కాలనీ మధ్యనుంచి వెళ్తున్నట్లే అనిపిస్తుంది. రెండు వీధుల్లో విస్తరించి ఉన్న ఈ సమాధుల్లో కొన్ని రెండుమూడంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి. చెప్పుకోవడానికి అవి సమాధులే కాని వాటిలో ఏసీ, టాయిలెట్, ఆధునిక వంటగది వంటి సమస్త సదుపాయాలన్నీ ఉంటాయి. మరణించిన వారి బంధువులు వారాంతాల్లో ఈ సమాధులను సంద ర్శించి తమ పూర్వీకులకు ఆహారం, సుగంధ ద్రవ్యాలను సమర్పిస్తుంటారు. మిలియనీర్స్ రో, లిటిల్ బ్రేవర్లీ హిల్స్ అనే రెండు వీధులున్న ఈ శ్మశానవాటికను 19వ శతాబ్దం చివరి భాగంలో ఏర్పాటు చేశారు. స్థానిక కేథలిక్కులు తమ శ్మశానాల్లో చైనీయులను ఖననం చేయనివ్వకపోవడంతో వీటిని ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో మనీలాకు వలసవచ్చిన చైనీయులు వ్యాపారంలో రాణించి సంపన్న వర్గంగా రూపాంతరం చెందారు. తమ స్థాయికి గుర్తుగా ఈ ఖరీదైన సమాధుల్ని నిర్మించారు. - మనీలా -
అక్కడ కుక్క, పిల్లులకూ శ్మశానాలు
బీజింగ్: మనం పెంచుకుంటున్న కుక్క, పిల్లి, చిలుక మరణిస్తే ఏం చేస్తాం? వాటిని తీసుకెళ్లి మున్సిపాలిటీ వ్యాన్‌లో పడేస్తాం లేదా ఇంటి వెనకాల పెరట్లో గుంత తీసి పాతేస్తాం. కానీ చైనాలో అలా చేయడం నేరం. అందుకనే అక్కడ పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక శ్మశానాలే వెలిశాయి. వెలుస్తున్నాయి కూడా. అలాంటి వాటిలో ఒకటి బీజింగ్ శివారులో వెలసిన ‘బైఫూ పెట్ హెవెన్’. అది 6.7 హెక్టార్లు విస్తరించి ఉంది. పెట్ హెవెన్‌లో వేలాది చెట్లను పెంచారు. చెట్టు వద్దనే పెంపుడు జంతువులను ఖననం చేయాల్సి ఉంటుంది. ఒక్కో చెట్టుకు 20వేల రూపాయల నుంచి 44 వేల రూపాయలను వసూలు చేస్తారు. తాము 2005లో ఈపెట్ సర్వీసును ప్రారంభించామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు వేల చెట్లు అమ్ముడు పోయాయని, ప్రజలు దాదాపు 20వేల పెంపుడు జంతువులను ఖననం చేశారని బైఫూ పెట్ హెవెన్ వ్యవస్థాపకుడు చెన్ షావోచున్ తెలిపారు. చైనాలో ఏటా 42.5 లక్షల పెంపుడు కుక్కలను, 20 లక్షల పిల్లులను ఖననం చేస్తున్నారని ‘డాగ్స్ ఫాన్స్’ మేగజైన్ వెల్లడించింది. ఈ ఖననాల సంఖ్య ఏడాదికి 30 శాతం పెరుగుతోందని తెలిపింది. దేశవ్యాప్తంగా కోటి పెంపుడు కుక్కలను, పిల్లులు, పక్షులు, ఇతర జంతువులను కలుపుకుంటే దాదాపు పది కోట్ల జంతువులను ఖననం చేసి ఉంటారని 2014లో జరిపిన ఓ సర్వే తెలిపింది. ‘అదర్ సైడ్’ అనే మరో పెట్ క్రిమేషన్ కంపెనీ ఇటీవల చైనా నగరాల్లో విస్తరిస్తూ వస్తోంది. తాము పెంపుడు జంతువు బరువునుబట్టి చార్జీ తీసుకుంటామని, స్థానిక కరెన్సీ ప్రకారం వంద యాన్ల నుంచి వెయ్యి యాన్ల వరకు వసూలు చేస్తామని క్రిమేటర్ వాంగ్ జిలాంగ్ తెలిపారు. తాను ఇప్పటి వరకు కుక్కలు, పిల్లులే కాకుండా చిలుకలు, కుందేళ్లు, తాబేళ్లను కూడా ఖననం చేశానని ఆయన అన్నారు. తమ జంతువుల శ్మశానానికి వచ్చే వారిలో పేదలు, ధనవంతులు అనే తేడా ఉండదని, ఎవరైనా బరువునుబట్టి చెల్లింపులు సమర్పించుకోవాల్సిందేనని ఆయన అన్నారు. పెంపుడు జంతువులను పెరట్లో పాతిపెట్టినా, చెత్త కుప్పల్లో పడేసినా అంటురోగాలు వ్యాపిస్తాయనే ఉద్దేశంతో వాటిని నిషేధిస్తూ చైనా చట్టాలు తీసుకొచ్చింది. 2014లో ఈ చట్టాలను మరింత కఠినతరం చేసింది. అప్పటి నుంచి చైనా ప్రజల్లో చైతన్యం పెరిగింది. జంతువులను చిన్నపాటి జబ్బు చేసినా ఆస్పత్రికి తీసుకెళ్లే అలవాటు కూడా బాగా పెరిగింది. దేశంలో బ్యాచ్‌లర్ కుటుంబాల సంఖ్య పెరుగుతున్నట్లుగానే పెంపుడు జంతువుల సంఖ్య కూడా పెరుగుతోందని పెకింగ్ యూనివర్శిటీ సోషియాలోజి ప్రొఫెసర్ జీ జ్యూలాన్ తెలిపారు. పెంపుడు జంతువుల పెరుగుతున్న అవసరాలను దష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిధులతో మరిన్ని ప్రత్యేక శ్మశానాలు ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. cremation, dogs, cats, Beijing, pet heven, కుక్క, పిల్లులకు శ్మశానాలు, బీజింగ్, బైఫూ పెట్ హెవెన్ -
అధికారులే ఆత్మబంధువులయ్యారు..
మానవత్వం పరిమళించింది. అభం శుభం తెలియని ఈగల అప్పారావు కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఖననం చేసేందుకు అధికారులే కుటుంబ సభ్యులు పాత్ర పోషించారు. ఒక్కసారిగా ఒకే కుటుంబానికి చెందిన 23మంది మోసయ్యపేట గ్రామస్తులు వాహనం బోల్తా సంఘటనలో మృతి చెందడంతో ఆయా మృతదేహాలకు ఖననం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందుకు వచ్చి అన్ని బాధ్యతలు చేపట్టింది. మునగపాక : మునుపెన్నడూ లేనివిధంగా ఒకే కుటుంబానికి చెందిన 23 మందిని ఖననం చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే ఖర్మకాండలు నిర్వహించేందుకు ఇతర గ్రామాలనుంచి కాటికాపరులను తీసుకువచ్చి కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ పద్మావతి, విశాఖ రూరల్ ఎస్పి కోయ ప్రవీణ్, జేసీ నివాస్‌లు ఈ ఖననం కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. సాధారణంగా ఒక వ్యక్తి మృతిచెందితే ఆయా కుటుంబానికి చెందిన వ్యక్తులు ఖర్మకాండలు చేయాల్సి ఉంటుంది. అయితే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఈగల అప్పారావు కుటుంబ సభ్యులకు మాత్రం పలు శాఖల అధికారులు ఈ తతంగాన్ని పూర్తి చేశారు. దీనికి తోడు కాటికాపరులను ఎంజెపురం, వెదురువాడ, వాడపాలెం, అచ్చుతాపురం తదితర ప్రాంతాలనుంచి తీసుకువచ్చి చిన్నపిల్లలను పూడ్చి వేయడంతోపాటు ఇతరులను ఖననం చేయించారు. అచ్యుతాపురం ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఇన్చార్జి తహశీల్దార్ భాస్కరరావు, పలువురు పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అంత్యక్రియలకు ఇతర ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడంతా హృదయ విదారకర దృశ్యాలు కనిపించాయి. మృతులకు మంత్రుల నివాళులు విశాఖపట్నం సిటీ : అచ్యుతాపురం మండలం మోసాయిపేట గ్రామ మృతులకు జిల్లా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. రాజమండ్రి నుంచి మోసాయిపేటకు మూడు వాహనాల్లో మృత దేహాలను తీసుకొచ్చారు. జాయింట్ కలెక్టర్ నివాస్ ఆదేశాల మేరకు అనకాపల్లి ఆర్డీఓ పద్మావతి మృతుల దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎస్పీ కోయ ప్రవీణ్, జాయింట్ కలెక్టర్ నివాస్ తదితరులంతా దగ్గరుండి మృతుల అంత్యక్రియలు పూర్తి చేశారు. కలివిడి మనస్తత్వం ప్రసాద్ అన్ని పనుల్లోను తండ్రికి తోడుగా ఉంటున్నాడు. ఇది వరకు ట్రాన్స్‌పోర్టు సర్వీస్ చేసేవాడు. ఇటీవల పొయినీర్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అందరితో కలిసిపోయే మనస్తత్వం. ఇంతలోనే ఇంత దారుణం జరగడం మమ్మల్ని కలచివేసింది. -కె.వెంకట్రావు, ప్రసాద్ స్నేహితుడు ఎంతోమందికి దారిచూపాడు.. అప్పారావు డ్రైవర్అప్పారావుగా ఈ ప్రాంతంలో పేరుంది. అతని చేతిలో ఎంతో మంది డ్రైవర్లు తయార య్యారు. దేశంలో చాలా ప్రాంతాలు తిరిగాడు. మావూరులో ఆయన్ని చూసి చాలామండి మోటారు ఫీల్డ్‌లోకి వెళ్లారు. చాలామందికి దారిచూపించాడు. ఆకుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. - పంచదార్ల రాంబాబు, గ్రామపెద్ద కొత్త మోసయ్యపేట అందరి బంధువు.. కనక వల్లనే ఆ కుటుంబం నిలబడింది. కనక తన ఐదుగురు చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసింది. గ్రామంలో ఏ శుభకార్యమైనా ఆమె ఉంటుంది. అందరూ కావాలనుకునే మనస్తత్వం. పిల్లల్ని బాగా చవించింది. భార్యభర్తలు ఒక్కమాట మీద ఉండి కుటుంబాన్ని నిలబెట్టారు. అంతా బాగుంది అన్నపుడు వారే లేకుండా పోయారు. -అప్పికొండ ఈశ్వరరమ్మ గ్రామస్తురాలు, మోసయ్యపేట ఇంతఘోరం ఎప్పుడూ చూడలేదు... అందర్నీ చేరదీశారు. పిల్లలు ఉద్యోగాలు చేస్తే చూడాలనుకున్నారు. చదువంటే మహాఇష్టం. మనవలు, మనవరాళ్లను కూడా బాగా చదివించాలని అనుకునేవారు. కుటుంబం మొత్తమే తుడిచిపెట్టుకుపోయారు. ఇది చాలా బాధాకం. -గొలగాని అమ్మాజి, అచ్యుతాపురం బంధువు -
భార్య చితి వద్దే భర్త కన్నుమూత
ఉప్పల్ (హైదరాబాద్): భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ భర్త.. ఆమె చితి వద్దే తీవ్ర మనస్తాపంతో కన్ను మూశాడు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...ఉప్పల్ బీరప్పగడ్డకు చెందిన గర్నెపల్లి నర్సింహ(80), మీనమ్మ(75) దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే, మీనమ్మ అనారోగ్య కారణాలతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందింది. వీరికి ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. బుధవారం కుటుంబ సభ్యులు మీనమ్మ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఉప్పల్ నాలా వద్ద గల శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. నడువలేని స్థితిలో ఉన్న భర్త నర్సింహను అతని కుమారులు ఆటోలో శ్మశాన వాటికకు తీసుకు వచ్చారు. ఆయన భార్యను కడసారిగా చూసుకున్నాడు. అంత్యక్రియల్లో భాగంగా కొడుకు చితి చుట్టూ తిరిగి నిప్పు పెట్టేలోగానే నర్సింహ కుర్చీలో కూర్చున్న చోటే కన్నుమూశాడు. దీంతో హతాశులైన కుటుంబ సభ్యులు కాసేపటి తరువాత నర్సింహకు కూడా అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు. -
ప్రభుత్వ లాంఛనాలతో 'దాశరథి' అంత్యక్రియలు
హైదరాబాద్: ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీ దాశరథి రంగాచార్యుల పార్థీవదేహానికి మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని వెస్ట్ మారేడుపల్లి శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. రంగాచార్యులు 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలలు, శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించిన గొప్ప వ్యక్తి దాశరథి రంగాచార్యులు. -
అధికార లాంఛనాలతో నాగరాజు అంత్యక్రియలు
నల్లగొండ : నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం రసూల్ గూడలో కానిస్టేబుల్ నాగరాజు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. సూర్యాపేట కాల్పుల దుండగుల ఎన్కౌంటర్ నేపథ్యంలో వారితో శనివారం పోరాడి ప్రాణాలొదిలిన నాగరాజుకు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు జరగనున్నాయి. దుండగుల తూటాలకు మృత్యు ఒడికి చేరిన కానిస్టేబుల్ నాగరాజు అంత్యక్రియలకు రాష్ట్రమంత్రులు హరీష్ రావు, జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి హాజరుకానున్నారు. -
ఎప్పటిలాగే భుజాన వేసుకుని...
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దింపి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడని భేతాళ కథల్లో చదువుకున్నాం. సుందర్రాజన్ కూడా విక్రమార్కుడి వంటివాడే. ఇరవై ఏళ్లుగా అతడు గట్టుపై నుండి చెరువులోకి దూకి, శవాన్ని వెదికిపట్టి, భుజానవేసుకుని పైకి తెస్తున్నాడు. భేతాళ కథల్లో విక్రమార్కుడికి శ్రమ తెలియకుండా ఉండడం కోసం శవంలోని భేతాళుడు కథలు చెబుతుంటాడు. ఇక్కడ ఈయన శ్రమను పట్టించుకునేవారే లేదు. కనీసం ఆ శ్రమను గుర్తించేవారే లేదు. ఇంత చేస్తున్నా ప్రభుత్వం దృష్టిలో తనకు విలువ లేదని, తనకు కళ్లు లేకున్నా కన్నీళ్లు ఉన్నాయని ఆవేదన చెందుతున్నాడు... పుట్టుకతోనే అంధుడైన సుందర్రాజన్. మిణుగురులు : సమాజానికి దివిటీలు - కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై చెన్నై నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో పల్లికరణై సమీపంలోని జల్లడియన్పేట సుందర్రాజన్ సొంతూరు. లారీ డ్రైవర్‌గా పనిచేసే బాలన్, వెల్లియమ్మ దంపతుల తొమ్మిది మంది సంతానంలో ఇతను ఏడవ బిడ్డ. పుట్టుకతోనే అంధుడు. బ్రెయిలీ పాఠశాలలో చదివించలేని నిరుపేద కుటుంబం వారిది. బాల్యం ఎలాగో గడిచింది. యవ్వనంలో ఉపాధి లేక, బతుకు భారమై దిక్కుతోచని స్థితిలో అన్న దేవనాథన్ సాయంతో ఈత నేర్చుకున్నాడు. ఆనాడు అతనికి తెలియదు ఒకనాటికి ఈ ఈతే తనకు పేరు తెస్తుందని, సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెస్తుందని. ఈత... ఊతం అయింది కాలక్షేపం కోసం నేర్చుకున్న విద్య అతడిని గజ ఈతగాడిని చేసింది. సుందర్‌రాజన్‌కు 20 ఏళ్ల వయస్సు ఉన్నపుడు అతని ఇంటి సమీపంలోని బావిలో పడి ఒకతను చనిపోయాడు. పురాతన బావి కావడంతో బొంతరాళ్ల నడుమ శవం ఇరుక్కుపోవడంతో ఎవ్వరూ బయటకు తీయలేకపోయారు. సుందర్రాజన్ వెంటనే బావిలోకి దూకి శవాన్ని ఒడుపుగా బావి గట్టుకు చేర్చాడు. ఇందుకు సంతోషించిన మృతుని బంధువులు కొంత మొత్తాన్ని ముట్టజెప్పారు. చూపులేని అతని జీవితంలో అదే అతని తొలి సంపాదన. పుట్టుకకు అర్థమే లేని జీవితాన్ని గడుపుతుండగా ఈ సంఘటన అతనిలోని ఆలోచనలను మేల్కొలిపింది. ఈతనే ఊతంగా చేసుకుని అంధకారమైన జీవితంలో వెలుగులు నింపుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇచ్చింది పుచ్చుకుంటాడు చెరువులు, బావుల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వారిని వెతికి ఒడ్డుకు చేర్చడమే క్రమేణా అతని వృత్తిగా మారింది. అగ్నిమాపకశాఖలో పనిచేసే గజ ఈతగాళ్లు సైతం నిస్సహాయతను వ్యక్తం చేసిన సంఘటనల్లో సుందర్రాజనే వారికి చేయూత నివ్వడం ప్రారంభమైంది. చూపున్నవారు సైతం వెతికిపట్టుకోలేని నీటి అడుగులోని శవాలను కాళ్లతోనే తడిమి అతను గుర్తిస్తాడు. వెంటనే ఆ శవాలను విక్రమార్కుడిలా భుజాన వేసుకుని ఒడ్డుకు చేరుస్తాడు. ప్రస్తుతం చెన్నై మహానగరంలోనే కాదు పరిసర గ్రామాలలో సైతం సేవలు అందిస్తున్నాడు. ప్రమాదకరమైన లోతులున్న నదులు, పాడుబడిన బావులలోని శవాలను పైకి తీసేందుకు అగ్నిమాపక అధికారులు సైతం సుందర్రాజన్పైనే ఆధారపడుతున్నారు. ఇతను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి సకల మర్యాదలతో తీసుకెళతారు, పని పూర్తికాగానే కోరిన చోట విడిచిపెడతారు. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో శవాన్ని తీసినా ఇంత ఇవ్వాలని డబ్బు డిమాండ్ చేయడు. ఇచ్చినది పుచ్చుకుంటాడు లేకుంటే ఒకరికి సాయపడ్డానని సరిపెట్టుకుంటాడు. ప్రస్తుతం నలభైలలో పడిన సుందర్రాజన్ ఇప్పటి వరకు తాను 149 శవాలను వెలికి తీసినట్లు గర్వంగా చెప్పుకుంటాడు. సమాజానికి మేలు చేసేందుకు సర్వేంద్రియాలూ ఉండాల్సిన అవసరం లేదు, మంచి మనసుంటే చాలు అనేందుకు సుందర్రాజన్ జీవితమే చక్కటి నిదర్శనం. ఆపాటి విలువ కూడా చేయనా?! కళ్లను లేకుండా చేసి శపించిన ఆ దేవుడు ఈత ద్వారా నాకు వరం ఇచ్చాడు. పదమూడు ఏళ్ల వయస్సులోనే ఈత నేర్చుకున్నా. నదులు, బావుల్లో అరవై అడుగుల లోతున్నా చాలాసేపు ఊపిరిబిగబట్టి లోపలికి వెళ్లి శవాన్ని వెతికిపట్టుకొస్తాను. కాళ్లే నాకు కళ్లు, శవాలను కాళ్లతోనే తడిమి గుర్తిస్తాను. వికలాంగుల కోటాలో రెండునెలల కిందటే మంజూైరె న వెయ్యి రూపాయల పింఛనే నా జీవనాధారం. పెళి ్లకాలేదు, ఇల్లు లేదు. జల్లడియన్పేట పంచాయితీ కార్యాలయం ప్రాంగణంలోనే ఉంటూ, శవం తీయడానికి ఎవరు పిలుస్తారా అని ఎదురుచూస్తుంటా. గత ఇరవై ఏళ్లుగా నాతో పనులు చేయించుకుంటున్న అగ్నిమాపక శాఖ గానీ, ప్రభుత్వం గానీ వికలాంగుల కోటాలో ఉద్యోగం ఇవ్వలేదు. అవసరమైనపుడు మాత్రం వచ్చి తీసుకెళ్లి తృణమో, పణమో చేతుల్లో పెట్టి పంపేస్తారు. అయినా నేను పెద్దగా బాధపడడం లేదు. కొన్ని లక్షల మంది జనాభా కలిగిన నగరంలో ఇంతటి ఈత సామర్థ్యం కలిగిన వాడిని నేనొక్కడినే అయినందుకు గర్వపడుతున్నా. చూపు లేని కళ్లతోనే శవాల వెలికితీత ద్వారా సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నా. బాంబులను గుర్తించేందుకు కుక్కలను, బందోబస్తు విధులకు గుర్రాలను పెంచి పోషించే పోలీస్ శాఖకు కళ్లు లేని నేను భారమవుతానా? నేను కుక్కపాటి విలువ కూడా చేయనా? కంటిచూపులేని నన్ను ఎందు కోసమైతే వాడుకుంటున్నారో అదే ఉద్యోగం ఇచ్చేలా ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. -
పూర్తయిన రేపిస్టు అంత్యక్రియలు
దిమాపూర్: నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో ప్రజల ఆగ్రహావేశాలకు ప్రాణాలుకోల్పోయిన అత్యచార నిందితుడి అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్రికత్త పరిస్థితులు ఉండటం, అసోం, నాగాలాండ్ మధ్య ఈ విషయం కాస్త వివాదాలకు దారితీయడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య బల్క్ ఎస్సెమ్మెస్‌లను పోలీసులు నిషేధించారు. సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్‌గా పనిచేస్తున్న సయ్యద్ ఫరీద్‌ఖాన్ (35) అనే వ్యక్తి ఇరవయ్యేళ్ల నాగా యువతిపై గతనెల 23, 24 తేదీల్లో వేర్వేరు ప్రదేశాల్లో అత్యాచారం చేసినట్లు కేసునమోదైంది. అనంతరం ఫిబ్రవరి 25న అతన్ని పోలీసులు అరెస్టు కోర్టులో అప్పజెప్పగా అతడిని సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ప్రజలు నిందితున్ని జైలు నుంచి బయటకు ఈడ్చి కొట్టి చంపారు. -
ఎమ్మెస్ నారాయణ అంత్యక్రియలు పూర్తి
-
వి.ఆర్. కృష్ణయ్యర్ అంత్యక్రియలు పూర్తి
కొచ్చి: ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు, కమ్యూనిస్టు యోధుడు వి.ఆర్. కృష్ణయ్యర్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. కేరళ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆయన ఇద్దరు కుమారులు కర్మకాండ నిర్వహించారు. తర్వాత శవదహనశాలలో ఆయన భౌతికకాయాన్ని దహనం చేశారు. కేరళ మంత్రి కే బాబు ప్రభుత్వ ప్రతినిధిగా అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు కృష్ణయ్యర్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఒమన్ చాంది, మంత్రులు కేఎం మణి, కే బాబు, కేపీ మోహనన్, ప్రతిపక్ష నేత అచ్యుతానందన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పి. రవీంద్రన్, క్రైస్తవ మత పెద్దలు శ్రద్ధాంజలి ఘటించారు. -
గుజరాత్ డీజీపీ పాఠక్‌కు అంతిమ వీడ్కోలు
థాయ్‌లాండ్‌లో గుండెపోటుతో మరణించిన గుజరాత్ డీజీపీ అమితాబ్ పాఠక్ అంత్యక్రియలు పూర్తి పోలీసు లాంఛనాలతో ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగాయి. సెలవు మీద కుటుంబంతో కలిసి ఆహ్లాద పర్యటన కోసం థాయ్‌లాండ్ వెళ్లిన పాఠక్ (58) అక్కడ ఉండగానే తీవ్రమైన గుండెపోటు రావడంతో శనివారం ఓ బీచ్ రిసార్టులో మరణించారు. ఆయన మృతదేహాన్ని గుజరాత్ తీసుకొచ్చారు. అహ్మదాబాద్‌లో పాఠక్‌కు పూర్తి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఎలిస్ బ్రిడ్జి వద్ద గల వి.ఎస్. ఆస్పత్రి సమీపంలోని ఏఎంసీ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయని ఇన్చార్జి డీజీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు. అంత్యక్రియలకు ముందు ఆయన మృతదేహాన్ని ఐపీఎస్ ఆఫీసర్ల మెస్‌లో సందర్శకుల కోసం ఉంచారు. 1977 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన అమితాబ్ పాఠక్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయన స్వస్థలం ఉత్తరప్రదేశ్. ఈ సంవత్సరం ఫిబ్రవరి 27న డీజీపీగా నియమితులైన పాఠక్.. 2015 ఫిబ్రవరిలో పదవీవిరమణ చేయాల్సి ఉంది.