
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, జగిత్యాల : మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని సజీవదహనం చేశారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన పవన్‌కుమార్ (38) బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి బావమరిది జగన్ వారం క్రితం గుండెపోటుతో చనిపోయాడు. అయితే.. జగన్ మృతికి పవన్‌కుమార్ కారణమని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం జగన్ పెద్దకర్మకు హాజరై చిత్రపటం వద్ద పవన్‌కుమార్ మొక్కుతుండగా పెద్ద బావమరిది విజయ్‌స్వామి, జగన్ భార్య సుమలత ఇద్దరూ కలసి అతడిని గదిలో బంధించారు. పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో పవన్‌కుమార్ సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment