
హుజూరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువకుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ జిల్లా హు జూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో సోమవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హుజూరాబాద్ మండలం ఇప్పలనర్సింగాపూర్‌కు చెందిన కిల్లి కుమారస్వామి, వసంత కూతురు వరుణ్‌ప్రియ (18) హన్మకొండలోని మహిళా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెను అదే గ్రామానికి చెందిన అజయ్ (19) మూడేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
ఈ విషయం తెలిసిన వరుణప్రియ తల్లిదండ్రులు అజయ్‌ను మందలించినా.. అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కుమారస్వామి కూతురు వరుణ్‌ప్రియను.. ఆమె అమ్మమ్మ ఇల్లున్న పెద్దపాపయ్యపల్లిలో వదిలిపెట్టి వచ్చాడు. ఇంట్లో అందరూ వ్యవసాయ పనులకు వెళ్లారు. వారు వచ్చి చూసేసరికే వరుణ్‌ప్రియ ఇంట్లో ఉరేసుకుని కనిపించింది. అజయ్ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుజూరాబాద్ సీఐ తిరుమల్‌గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment