Love Harasement
-
ప్రేమోన్మాది నాగరాజుకు ఉరిశిక్ష విధించాలి
నెల్లూరు(అర్బన్): ప్రేమ పేరుతో వెంటపడి వేధించి పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో తల్లీకూతుళ్లపై హత్యాయత్నం చేసిన క్రూరుడు నాగరాజును సమాజంలో తిరగనీయకూడదని, అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించాలని మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో పూజిత, ఆమె తల్లి కాంతమ్మలపై నిందితుడు నాగరాజు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరులోని ఎనెల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పూజిత, కాంతమ్మను మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి శనివారం పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళలపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి ఆదేశాలిచ్చామన్నారు. అనంతరం ఆమె దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న వన్‌స్టాప్ సఖి సెంటర్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి వల్లెం విమల, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయనిర్మల, రాజ్యలక్ష్మి, అధికార ప్రతినిధి సుప్రియ పాల్గొన్నారు. -
ప్రేమ వేధింపులు భరించలేక..
-
ప్రేమ వేధింపులకు బలైన బాలిక
సాక్షి, యాదాద్రి భువనగిరి: ప్రేమ వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన జిల్లాలోని సమస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే నారాయణపురంలో భవాని అనే అమ్మాయి పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గిరి అనే యువకుడు గత కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతున్నాడు. అతన్ని మందలించినా కూడా అతనిలో మార్పు రాలేదు. అతని వేధింపులతొ తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా నిందితుడు గిరి పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ప్రేమ పేరుతో వల విసిరి ఉన్మాదం) -
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి దారుణ హత్య
సాక్షి, చెన్నై: వావి వరుసలు మరచిన ఓ యువకుడు, కుటుంబ గౌరవానికి, బంధాలకు కలంకం తెచ్చే రీతిలో కిరాతకుడయ్యాడు. వరుసకు చిన్నాన్న కుమార్తెను ప్రేమించాడు. తనకు దక్కని ఆ అమ్మాయి మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ప్రేమోన్మాదిగా మారాడు. బుధవారం నిశ్చితార్ధానికి సిద్ధం అవుతున్న ఆ యువతిని మంగళవారం రాత్రి దారుణంగా కడతేర్చాడు. ఈ సంఘటన తిరుచ్చిలోని కీరమంగళంలో కలకలంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఇటీవల కాలంగా వన్‌సైడ్ ప్రేమకు బలి అవుతున్న యువతుల సంఖ్య పెరుగుతోంది. ప్రేమ పేరుతో వేధించడంతో పాటు ఆగ్రహంతో ఉన్మాదులుగా మారుతున్నారు. అయితే చెల్లెలు వరుస అమ్మాయిని ప్రేమిస్తున్నానని వేధిస్తూ, చివరకు ఆమెను హతమార్చడం తిరుచ్చిలోని కీరమంగళంలో కలకలం రేపింది. వన్‌సైడ్ లవ్.. తిరుచ్చి నెం.1 టోల్ గేట్ సమీపంలోని కీరమంగలంకు చెందిన శివ సుబ్రమణ్యన్‌కు హేమలత(27) కుమార్తె ఉంది. పట్టభద్రురాలైన హేమలత తిల్లె నగర్‌లోని ఓ మొబైల్ నెట్ వర్కింగ్ సంస్థలో పనిచేస్తుంది. శివ సుబ్రమణ్యన్‌కు వరుసకు అన్న అయిన జ్ఞాన సంబంధం కుమారుడు సత్యకుమార్(30) ప్రతిరోజూ హేమలతను తన బైక్‌లో ఆ సంస్థ వద్ద డ్రాప్ చేసి, ఇంటికి తీసుకొస్తుంటాడు. వారి కుటుంబాల మధ్య హఠాత్తుగా విభేదాలు తలెత్తాయి. పక్క పక్క ఇళ్లలో ఉన్నా, మాటలు, రాకపోకలు కరువయ్యాయి. ఇందుకు సత్యకుమార్ కారణమని ఆ పరిసర వాసులు చెప్పుకునే వారు. ఆగిన నిశ్చితార్థం.. ఈ నేపథ్యంలో హేమలతకు బుధవారం తిరుచ్చికి చెందని ఓ యువకుడితో వివాహ నిశ్చితార్ధానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి హఠాత్తుగా ఇంట్లోకి వెళ్లిన సత్యకుమార్ తన చేతిలోని వేట కత్తితో శివసుబ్రమణ్యంను నరికాడు. అడ్డొచ్చిన అతని సోదరుడు వైరవేల్ను సైతం కత్తితో దాడి చేశాడు. వీరి కేకలు విని హేమలత బయటకు పరుగెత్తికు వచ్చింది. ఆ ప్రేమోన్మాది కత్తితో హేమలత గొంతు మీద నరికాడు. ఈ సంఘటన నుంచి తేరుకున్న ఇతర కుటుంబీకులు సత్యకుమార్‌ను అడ్డుకునే యత్నం చేయడంతో ఉడాయించాడు. గొంతు తెగడంతో హేమలతను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న సమయపురం సీఐ జ్ఞానవేల్, టోల్ గేట్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందతుడు సత్యకుమార్ కోసం గాలింపు చేపట్టారు. విచారణలో సత్యకుమార్ వన్‌సైడ్ లవ్, ప్రేమోన్మాదంతో సాగించిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ప్రేమోన్మాదిగా మారాడు.. ఒక్కరోజు సత్యకుమార్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తాను ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకుంటానని హేమలత దృష్టికి తెచ్చాడు. తనకు అన్నయ్య అన్న విషయాన్ని మరచినట్టున్నావని అతడ్ని ఆమె మందలించింది. ఇంట్లో చెబితే పరువు పోతుందని భావించి అతడికి దూరంగా ఉండడం మొదలెట్టింది. అయితే, రోజు రోజుకు సత్యకుమార్ వేధింపులు పెరగడంతో కొన్ని నెలల క్రితం ఆ విషయాన్ని తండ్రికి చెప్పింది. దీతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. హేమలతకు సత్యకుమార్ నుంచి వేధింపులు పెరగడంతో ఆమెకు వివాహ ఏర్పాట్లు చేశారు. బుధవారం నిశ్చితార్ధానికి ఏర్పాట్లు జరిగాయి. విషయం తెలుసుకున్న సత్యకుమార్ ఉన్మాదిగా మారాడు. మంగళవారం రాత్రి సత్యకుమార్ ఆగ్రహాంతో హేమలత కుటుంబాన్నే మట్టుబెట్టే యత్నం చేశాడు. అంతేకాక ఆమె గొంతు నరికి పారిపోయినట్లు విచారణలో వెలుగు చూసింది. అజ్ఞాతంలో ఉన్న సత్యకుమార్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. -
ఫోన్లో ఏం మాట్లాడాడో.. అంతలోనే
యాచారం : ప్రజల మానప్రాణాలు కాపాడాల్సిన ఆ పోలీసే.. ఓ యువతి పట్ల కాలయముడైనాడు. ప్రేమించాలంటూ కానిస్టేబుల్ వేధింపులను తట్టుకోలేక ఆ యువతి వంటిపై కిరోసిన్ పోసుకోని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మన్నగూడలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ చంద్రకుమార్, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్నన్నగూడకు చెందిన సోమా నర్సింహ నగరంలోని అంబర్‌పేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. అదే గ్రామానికి చెందిన మండల శ్యామల (23) అనే దళిత యువతిని ప్రేమించమంటూ నాలుగేళ్ల క్రితం వెంటపడ్డాడు. అతని వేధింపులు భరించలేక అప్పట్లోనే ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో సోమా నర్సింహను మందలించి, నచ్చజెప్పి వదలిపెట్టారు. బుద్ధిమారని ఆ కానిస్టేబుల్ తిరిగి ఫోన్లో శ్యామలను వేధింపులకు గురిచేస్తున్నాడు. సోమవారం యువతి తల్లిదండ్రులు ఉపాధి పనులకు వెళ్లగానే గ్రామంలో ఉన్న అతడు సోమవారం శ్యామలకు ఫోన్ చేశాడు. ఫోన్లో అతను ఏదో మాట్లాడగానే శ్యామల వంటిపై కిరోసిన్ పోసుకోని నిప్పంటించుకుంది. తీవ్రంగా శరీరం కాలిపోవడంతో నగరంలోని గాంధీ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. దళిత యువతి కావడంతో కానిస్టేబుల్ చులకనగా చూస్తూ వేధింపులకు గురిచేశాడని.. తన కూతురు శ్యామల ఆత్మహత్యకు సోమా నర్సింహనే కారకుడని మృతురాలి తండ్రి నర్సింహ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.