
సాక్షి, యాదాద్రి భువనగిరి: ప్రేమ వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన జిల్లాలోని సమస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే నారాయణపురంలో భవాని అనే అమ్మాయి పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గిరి అనే యువకుడు గత కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతున్నాడు. అతన్ని మందలించినా కూడా అతనిలో మార్పు రాలేదు. అతని వేధింపులతొ తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా నిందితుడు గిరి పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ప్రేమ పేరుతో వల విసిరి ఉన్మాదం)