![Young Man Attacked With Woman At Nellore](/styles/webp/s3/article_images/2024/05/19/LOVER-ATTICK.jpg.webp?itok=iYTwr_Q5)
బాధితులకు అండగా ఉంటాం
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి
నెల్లూరు(అర్బన్): ప్రేమ పేరుతో వెంటపడి వేధించి పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో తల్లీకూతుళ్లపై హత్యాయత్నం చేసిన క్రూరుడు నాగరాజును సమాజంలో తిరగనీయకూడదని, అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించాలని మహిళా కమిషన్ రాష్ట్ర చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో పూజిత, ఆమె తల్లి కాంతమ్మలపై నిందితుడు నాగరాజు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరులోని ఎనెల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పూజిత, కాంతమ్మను మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి శనివారం పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళలపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు.
![](/sites/default/files/inline-images/1_43.jpg)
బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి ఆదేశాలిచ్చామన్నారు. అనంతరం ఆమె దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న వన్‌స్టాప్ సఖి సెంటర్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి వల్లెం విమల, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయనిర్మల, రాజ్యలక్ష్మి, అధికార ప్రతినిధి సుప్రియ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment