Nellore district police
-
ప్రేమోన్మాది నాగరాజుకు ఉరిశిక్ష విధించాలి
నెల్లూరు(అర్బన్): ప్రేమ పేరుతో వెంటపడి వేధించి పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో తల్లీకూతుళ్లపై హత్యాయత్నం చేసిన క్రూరుడు నాగరాజును సమాజంలో తిరగనీయకూడదని, అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించాలని మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో పూజిత, ఆమె తల్లి కాంతమ్మలపై నిందితుడు నాగరాజు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరులోని ఎనెల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పూజిత, కాంతమ్మను మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి శనివారం పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళలపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి ఆదేశాలిచ్చామన్నారు. అనంతరం ఆమె దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న వన్‌స్టాప్ సఖి సెంటర్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి వల్లెం విమల, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయనిర్మల, రాజ్యలక్ష్మి, అధికార ప్రతినిధి సుప్రియ పాల్గొన్నారు. -
నమ్మించి.. ఆపై ఉడాయించి..
నెల్లూరు: వ్యాపారినంటూ నమ్మించి స్థానికుల నుంచి రూ.మూడు కోట్లను కాజేసి వ్యక్తి పరారైన ఘటన ఆత్మకూరు పరిధిలోని నెల్లూరుపాళెంలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చెందిన ఓ వ్యక్తి తన పేరు భాస్కర్‌రెడ్డి అంటూ నెల్లూరుపాళెం వద్ద మక్కెన రోశయ్య ఇంట్లో మూడు నెలల క్రితం అద్దెకు చేరారు. ఆత్మకూరు సమీపంలోని నాగులపాడు రోడ్డులో గోడౌన్ లాంటి ఇంటిని అద్దెకు తీసుకొని లారీల్లో చక్కెర బస్తాల ఎగుమతి, దిగుమతి చేస్తూ హడావుడి చేశారు. నెల్లూరుపాళెంలోని పాత ఆర్టీఏ కార్యాలయ సమీపంలో మరో ఇంటిని అద్దెకు తీసుకొని గెస్ట్‌హౌస్‌గా వినియోగించసాగారు. తాను చక్కెరతో పాటు వర్జీనియా పొగాకుతో ఐటీసీ తయారు చేసిన సిగరెట్ల హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నానని చుట్టుపక్కల వారిని నమ్మించారు. తన వ్యాపారానికి కోట్లు అవసరమని.. పెట్టుబడి పెడితే రూ.లక్షకు రోజుకు రూ.1500 వడ్డీని ఏరోజుకా రోజు చెల్లిస్తానని చెప్పారు. దీనికి ఆశపడిన రోశయ్య రూ.కోటిన్నరను ఆయనకు ముట్టజెప్పారు. చెప్పిన విధంగా రూ.2.25 లక్షల చొప్పున అధిక వడ్డీని క్రమం తప్పకుండా అందించసాగారు. విషయం తెలుసుకున్న నెల్లూరుపాళెం సెంటర్లోని వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు ఎగబడ్డారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.30 లక్షలను సమర్పించారు. అనంతరం భాస్కర్‌రెడ్డి పత్తా లేకపోవడంతో కంగారుపడిన బాధితులు ఆయన గురించి ఆరాతీశారు. ఇదే తరహాలో బుచ్చిరెడ్డిపాళెంలోనూ పలువుర్ని నమ్మించి నగదుతో పరారయ్యాడని తెలుసుకొని లబోదిబోమంటూ ఆత్మకూరు పోలీసులను ఆశ్రయించారు. అతని ఫోన్ లోకేషన్‌ను పరిశీలించి బద్వేల్లో ఉన్నారని గుర్తించి పోలీసుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. సుమారు రూ.మూడు కోట్ల మేర కాజేసి ఉడాయించారని బాధితులు రోశయ్య, చెరుకూరి కామాక్షయ్య సన్నిబోయిన ప్రభాకర్, ఈదల సురేష్, ప్రసాద్, ఖాజారహంతుల్లా, మాదాల విష్ణు, బొబ్బల రాజా, ముక్కాల శ్రీనివాసులు, పుచ్చకట్ల రమణయ్య, మాదాల కృష్ణయ్య, తదితరులు తెలిపారు. ఫిర్యాదు మేరకు డీఎస్పీ కోటిరెడ్డి, ఎస్సైలు ముత్యాలరావు, రాజేష్ దర్యాప్తు చేపట్టారు. -
‘ఈనాడు’ రిపోర్టర్లపై కేసు నమోదు చేయండి.. నెల్లూరు కోర్టు ఆదేశం
సాక్షి, నెల్లూరు: అసత్య కథనాలతో రోజురోజుకు దిగజారుతున్న ఈనాడు రామోజీరావుకు షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో పని చేసే నలుగురు ఈనాడు రిపోర్టర్ల పై కేసు నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నుడాలో అక్రమాలు అంటూ.. 2022లో ఈనాడులో వచ్చిన కథనంపై అప్పటి వీసీ రమేష్ కోర్టుకు వెళ్లారు. దళితుడు కావడంతోనే తనపై అసత్యాలు రాశారని.. తనకు న్యాయం చేసి.. రోత రాతలు రాసిన రిపోర్టర్లపై చర్యలు తీసుకోవాలని అప్పటి నుడా వీసీ రమేష్ కోర్టుకెక్కారు. నలుగురు ఈనాడు రిపోర్టర్స్‌పై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖను నెల్లూరు జిల్లా కోర్టు ఆదేశించింది. చదవండి: టీడీపీ చీప్ ట్రిక్స్.. ట్విట్టర్ ఖాతాలో అసత్య ప్రచారం అసలు కేసు నేపథ్యమేంటీ? నుడా ఏంటీ గడబిడ అంటూ ఈనాడు పత్రిక మే 2022న ఒక వార్తను అచ్చేసింది. అందమైన అబద్దాలన్నింటిని ఏర్చికూర్చి దానికి తన సొంత పైత్యాన్ని జోడించి పాఠకుల ముందేసింది. నుడా అంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. దీని పరిధిలో వేస్తోన్న లేఅవుట్‌కు సంబంధించి అనుమతి కోసం నిర్వాహకుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించింది. నుడాలో కీలక బాధ్యత నిర్వహిస్తోన్న ఓ అధికారిపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ కథనం అల్లింది. ఈ కథనంపై అప్పటి వైస్ ఛైర్మన్ రమేష్ కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనం అచ్చేసిందని, ఈనాడుపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దానికి విచారణ జరిపిన న్యాయస్థానం నలుగురు రిపోర్టర్లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. -
Nellore: రామ్మూర్తి నగర్ పోలింగ్ స్టేషన్ వద్ద టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, నెల్లూరు: అధికారం లేకపోయినా టీడీపీ నేతల ఓవరాక్షన్ మాత్రం తగ్గడం లేదు. పోలీసుల పట్ల దురుసు ప్రవర్తనలు కనిపిస్తూనే ఉన్నాయి. నెల్లూరులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ చేసిన ఓవర్ యాక్షన్ పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్మూర్తి నగర్ పోలింగ్ పోలింగ్ బూత్‌లోకి వెళ్తున్న టీడీపీ నేతల్ని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డు చూపించాలని అడగడంతో అజీజ్ కి చిరెత్తుకొచ్చింది. నానా యాగీ చేసి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు అవేదన వ్యక్తం చేశారు. పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమపై టీడీపీ నేతల జులుం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. చదవండి: సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు -
బాలికపై యాసిడ్ దాడి కేసులో నిందితుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): బాలికపై యాసిడ్‌తో దాడి చేసి గొంతుకోసి నగదు, బంగారంతో ఉడాయించిన ఘటనలో నిందితుడు నాగరాజును బుధవారం నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సీహెచ్ విజయారావు వివరాలు వెల్లడించారు. వెంకటాచలం మండలం చెముడుగుంట నక్కల కాలనీకి చెందిన దంపతులకు 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ బాలిక మేనత్త కుమారుడు నెల్లూరు నాగరాజు వ్యసనాలకు బానిసై ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 5వ తేదీ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఆమెపై యాసిడ్‌తో దాడి చేసి చెవి కమ్మలు దోచుకుని ఆమె గొంతుకోశాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మృతి చెందిందనుకుని బీరువాలోని రూ.నాలుగు వేలు దోచుకెళ్లాడు. కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసులు నిందితుడిని అతని ఇంటి వద్దే అరెస్ట్ చేసి చోరీ సొత్తు, యాసిడ్ బాటిల్, కత్తి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సీ వివరించారు. -
భార్యపై అనుమానం.. మూడు నిండు ప్రాణాలు బలి
సాక్షి, నెల్లూరు: అనుమానం పెనుభూతంగా మారింది. మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. భార్యను, 5 నెలల పాపను గొంతు నులిమి చంపి, భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మండలం ఇస్కపల్లిపాళెంలో ఆదివారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. ఇస్కపల్లిపాళెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు ఆవుల మురళి (25)కి అదే గ్రామానికి చెందిన స్వాతి (22)తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో పాప పుట్టింటి. అప్పటి నుంచి ఆ బిడ్డ తనకు పుట్టినది కాదంటూ భార్య మీద భర్త అనుమానం పెంచుకున్నాడు. దీనికి మురళీ తల్లిదండ్రులు, సోదరి ఆద్యం పోస్తూ వచ్చారు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తొలి కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన స్వాతి గురువారం అత్తారింటికి వచ్చింది. అయితే తాను అత్తింటికి వెళ్లనని భర్త, అత్త, మామ వేధిస్తున్నారని పదేపదే చెప్పినప్పటికి ఆడపడుచు తాను హామీగా ఉంటానని నమ్మించి అత్తారింటికి తీసుకొచ్చారు. ఈ ఆదివారం వేకువ జామున భార్య స్వాతి, పాపను గొంతు నులిమి హత్య చేసిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాడు. దిక్కుతోచని స్థితిలో భర్త మురళి అదే గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఇస్కపల్లిపాళెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మురళి కుటుంబ సభ్యులు స్టేషన్‌కు తరలింపు స్వాతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మురళి తల్లిదండ్రులు ఆవుల బంగారమ్మ, ఆవుల గోవిందయ్య, ఆడపడుచు వెంకటమ్మపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు సీఐ ఖాజావలీ తెలిపారు. కావలి ఇన్చార్జి డీఎస్పీ శ్రీనివాసులు, అల్లూరు ఎస్సై శ్రీనివాసులు విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమోన్మాది దారుణం..కత్తితో పొడిచి.. టవల్‌తో గొంతు నులిమి
గూడూరు: ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది తన ప్రేమికురాలి ఇంట్లోకి చొరబడి ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు. చుట్టుపక్కల వాళ్లు రావడంతో తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే వచ్చిన పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. గూడూరులోని తిరుపతి రైల్వేలైన్ గేటు సమీపంలో పల్లెపాటి సుధాకర్, సరిత దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరూ ఉపాధ్యాయులు. వీరికి ఇంజనీరింగ్ చదువుతున్న తేజస్విని, పదో తరగతి చదువుతున్న కుమారుడు సంతానం. గురువారం దంపతులిద్దరూ పాఠశాలకు వెళ్లగా ఇంట్లో తేజస్విని, ఆమె సోదరుడు ఉన్నారు. చెన్నూరు పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చిన్నికృష్ణ కుమారుడు వెంకటేష్ బెంగళూరులో స్టాఫ్‌వేర్ ఇంజనీర్. ప్రస్తుతం ఇంటి వద్దే ఉండి పని చేస్తున్నాడు. తేజస్విని, వెంకటేష్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఈ విషయం పెద్దలకు తెలియడంతో వారిద్దరూ కలవకుండా కట్టడి చేశారు. కత్తితో పొడిచి.. టవల్‌తో గొంతు నులిమి.. గురువారం యువతి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే వెంకటేష్ ఆమె ఇంటికి వచ్చాడు. తేజస్విని సోదరుడు తలుపు తీయగానే అతడిని నెట్టేసి లోపలికి చొరబడి ఆమె ఉన్న గదిలోకి వెళ్లి గడియ పెట్టేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో గానీ వెంకటేష్.. తేజస్విని గొంతులో కత్తితో పొడిచి, ఆపై టవల్‌తో గొంతు నులిమి చంపేశాడు. యువతి సోదరుడి కేకలతో అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగువారు కిటికీలోంచి చూడగా బెడ్‌పై తేజస్విని పడి ఉంది. స్థానికులు రావడంతో భయపడ్డ వెంకటేష్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇద్దరినీ హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతి చెందిందని.. వెంకటేష్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: కవల పిల్లల అనుమానాస్పద మృతి..
నెల్లూరు: మనుబోలు మండలం రాజోలు గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పది నెలల వయస్సు కలిగిన ఇద్దరు కవల పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది. అయితే, నిన్న సాయంత్రం పాలు (తల్లిపాలు కాదు) తాగిన వెంటనే కవల పిల్లలిద్దరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటీన నెల్లూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే, దంపతుల మధ్య గతకొన్ని రోజులుగా తీవ్ర మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పిల్లల మృతిపై వీరి పాత్ర ఉందేమోనన్న అనుమానంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు , దంపతులిద్దరిని అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో మరిన్ని విషయాలు రాబడతామని పేర్కొన్నారు. చదవండి: బంజారాహిల్స్: మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. భర్త కొట్టడంతో.. -
ఏటీఎం కార్డుల క్లోనింగ్ ముఠా అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి నగదు కాజేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి స్కిమ్మింగ్ మెషిన్, కార్డ్ రీడర్, ల్యాప్‌టాప్, కారుతోపాటు రూ.7.04 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్పీ ఐశ్వర్య రస్తోగి శుక్రవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. హర్యానా రాష్ట్రంలోని భివానీ జిల్లా భవానీకేడ తాలూకా బార్శి గ్రామానికి చెందిన సందీప్‌కుమార్ 8వ తరగతి వరకు చదువుకున్నాడు. అతనికి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉంది. ఏటీఎం కేంద్రాల వద్ద వృద్ధులు, నిరక్షరాస్యులతో మాటలు కలిపి వారి డెబిట్ కార్డులను తీసుకుని స్కిమ్మింగ్ మెషిన్ ద్వారా స్కాన్ చేసి కార్డులో ఉండే డేటాను బ్లూటూత్ ద్వారా తన ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేవాడు. అనంతరం కార్డ్ రీడర్ ద్వారా నకిలీ కార్డులోకి ఆ డేటాను ట్రాన్స్ఫర్ చేసి దాని సాయంతో ఏటీఎం కేంద్రాల్లో నగదును డ్రా చేసేవాడు. తన సోదరుడు మంజీత్, బంధువైన జగ్జీత్ కలిసి ఏడాదిన్నర కాలంగా తమిళనాడు, కర్ణాటక, గోవా, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు వెయ్యికి పైగా నేరాలకు పాల్పడ్డాడు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, వనపర్తి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 49 చోట్ల ఇతరుల కార్డుల్ని క్లోన్ చేసి ఏటీఎంల నుంచి నగదు డ్రా చేశాడు. ఈ ముఠా ఒక్క నెల్లూరులోనే 16 నేరాలు చేయడంతో టాస్క్‌ఫోర్స్ బృందం, దర్గామిట్ట పోలీసులు నిఘా పెట్టారు. నిందితులు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ పడమర వైపున గల ఏటీఎం కేంద్రం వద్ద ఉన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. -
అరకోటి దోచింది ఖాకీలే..
నెల్లూరు(క్రైమ్): ఖాకీలే దోపిడీ దొంగలుగా మారారు. రైల్వే పోలీసులమని నమ్మించి రైల్లో అక్షరాల అరకోటిని దోచుకున్నారు. పోలీసుల విచారణలో ఈ విషయం తేటతెల్లమైంది. ఈ నెల 15న నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన దోపిడీ కేసులో సూత్రధారులైన టీడీపీ నేత, అతని స్నేహితురాలితో పాటు ఆర్ఐ, ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.వసంతకుమార్ సోమవారం వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. కావలి పట్టణానికి చెందిన అనిత అక్కడే బంగారు వ్యాపారి మల్లికార్జున వద్ద పనిచేస్తోంది. చెన్నాయపాళేనికి చెందిన టీడీపీ నాయకుడు రవితో ఆమె సన్నిహితంగా ఉంటోంది. రవి అప్పులపాలై ఉండటం, అనితకు సైతం నగదు అవసరం కావడంతో బంగారు వ్యాపారిని బురిడీ కొట్టించి నగదు దోచుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని రవి తన బంధువైన ఏపీఎస్పీ కానిస్టేబుల్ (ప్రస్తుతం విజయవాడ ఎస్డీఆర్ఎఫ్)లో విధులు నిర్వహిస్తున్న మహేష్‌తో చర్చించాడు. మహేష్ తనతో పాటు పనిచేస్తున్న సహచర కానిస్టేబుల్స్ షేక్ సుల్తాన్‌బాషా, సుమన్‌కుమార్, ఆర్ఐ పి.మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరారు. దోచుకున్న సొమ్మును పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. 15న మల్లికార్జున రూ.50 లక్షలు అనితకు ఇచ్చి చెన్నై వెళ్లి బంగారు బిస్కెట్లు తేవాలన్నాడు. అనిత ఈ విషయాన్ని రవికి చెప్పింది. తన స్నేహితురాలు, సీజన్బాయిలతో కలసి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై వెళుతున్నామని చెప్పింది. మహేష్‌కు విషయాన్ని చేరవేసిన రవి.. అతని సూచనల మేరకు అదే రైలెక్కాడు. పథకం ప్రకారం నెల్లూరు రైల్వేస్టేషన్లో సుల్తాన్‌బాషా, సుమన్‌కుమార్‌లు రైలెక్కారు. అనిత ఉన్న కోచ్‌లోకి వెళ్లి తాము రైల్వే పోలీసులమని బెదిరించి నగదు ఉన్న బ్యాగులతో గూడూరు రైల్వేస్టేషన్లో దిగేశారు. అదే రోజు రాత్రి బిట్రగుంట వద్ద నగదును పంచుకున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలింది.. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అనిత ఈ వ్యవహారాన్ని తన యజమానికి తెలియజేసింది. ఆయన సూచనల మేరకు గూడూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. అనిత ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో రైల్వే పోలీసులు 25వ తేదీన ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం బయటపడింది. ఆ తర్వాత రవిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు కానిస్టేబుళ్లు, ఆర్ఐ వద్ద నుంచి రూ. 30 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. -
బాస్ డైరెక్షన్.. పోలీస్ యాక్షన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఎన్నికల కోడ్ రాకముందే పోలీసు పాలన మొదలైంది. ఇటీవల సర్వేల పేరుతో అనేక బృందాలు జిల్లాలో తిరుగుతుండటంతో అలజడి రేగింది. ఈక్రమంలో గురువారం కూడా బెంగళూరుకు చెందిన పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తోంది. అది కూడా వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి సమీపంలోనే సర్వే నిర్వహించి ప్రజల వివరాలను ట్యాబ్‌లో నమోదు చేసుకుంటున్నారు. సర్వే వ్యవహారంపై అనుమానం వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు వీరిని ప్రశ్నించి వేదాయపాళెం పోలీసుస్టేషన్లో అప్పగించి వారిపై అనుమానంతో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వారిని విచారించకముందే ఇంటెలిజెన్స్ డీఎస్పీ చెంచుబాబు నుంచి ఫోన్లు మొదలయ్యాయి. సర్వే టీమ్‌లోని సభ్యులకు ఆయన నంబర్ నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో పోలీస్‌స్టేషన్‌లో పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. సర్వే టీమ్ నుంచి ఫిర్యాదు తీసుకొని ఆగమేఘాల మీద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై సీఐ నరసింహారావు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐతో మాట్లాడితే సాయంత్రం స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పారు. మళ్లీ సాయంత్రం తర్వాత ఫోన్ చేసి స్టేషన్‌కు వెళ్లితే 7 గంటలకు అరెస్ట్ చూపి కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. ఆ తర్వాత రాత్రి 12 గంటల వరకు పోలీసులు స్పందిచకపోవటంతో ఎమ్మెల్యే స్టేషన్‌కు వెళ్లి సీఐ తీరును ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ఎదుట హాజరుపర్చకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో రాత్రి 1గంటల సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించి మళ్లీ స్టేషన్‌కు తెచ్చారు. వాస్తవానికి ఎలాంటి తప్పు చేయనప్పటికీ పోలీస్ అధికారుల ఒత్తిడితో కేసులు నమోదు చేసి దాని కొనసాగింపుగా స్టేషన్లో ఉంచటంపై ఎమ్మెల్యే ఎన్నికల సంఘానికి పూర్తి ఆధారాలతో సీఐ నరసింహరావుపై ఫిర్యాదు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేకు నష్టం చేకూర్చేలా ప్రచారం అధికార పార్టీ నేతలు తెరతీసి నీచ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీకి ఏం సంబంధం జిల్లాలో స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాలు పూర్తిగా అధికారపార్టీ అనుకూలంగా పనిచేస్తున్నాయనే విమర్శ పోలీసు వర్గాల్లోనే బలంగా వినిపిస్తోంది. రెండు విభాగాలకు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారులే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లాలో ఇంటెలిజెన్స్ డీఎస్పీగా జిల్లాపై సమగ్ర అవగాహన ఉన్న చెంచుబాబును ఎంచుకున్నారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీగా దాదాపు ఏడాది కాలంగా జిల్లాలో పనిచేస్తున్నారు. గతంలో జిల్లాలో ఎస్సైగా పనిచేశారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల తటస్థంగా ఉన్న రాజకీయ నాయకులను అధికార పార్టీలో చేర్పించడంలో కీలక భూమిక పోషిస్తున్నారన్న విమర్శలు ఆ శాఖలోనే వినిపిస్తున్నాయి. సర్వే బృందానికి ఇంటెలిజెన్స్ డీఎస్పీకు ఉన్న సంబంధం ఏంటనే చర్చ సాగుతోంది. ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా సర్వేకు డీఎస్పీకి ఉన్న బంధం ఏంటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటెలిజెన్స్ బాస్ ఆదేశాలలు, అధికార పార్టీ నేతల ఆదేశాలతో డీఎస్పీ జోక్యం పెరిగిందనే ప్రచారాలు సాగుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల కోడ్ రాక ముందు కుట్ర రాజకీయాలకు పోలీసులు సహకరించడం చర్చగా మారింది. -
తల్లడిల్లిన తల్లి గుండె
అప్పటివరకూ తల్లితో ఉల్లాసంగా గడిపిన చిన్నారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. కళ్లెదుటే రక్తపు మడుగులో విగతజీవిగా మారిన బిడ్డను చూసి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. తినుబండారాలు కొనుక్కునేందుకు తల్లితోపాటు దుకాణానికి వెళ్లిన పాప తిరిగి ఇంటికి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. నిండు నూరేళ్లు జీవించాల్సిన కుమార్తె తన కళ్ల ముందే లారీ చక్రాల కింద నలిగిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. బాలాయపల్లి మండలం అంబలపూడి అరుంధతీయవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. నెల్లూరు / బాలాయపల్లి: మూడు సంవత్సరాల చిన్నారి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని మృతిచెందిన ఘటన మండలంలోని గూడూరు – వెంకటగిరి రోడ్డు మార్గంలో అంబలపూడి అరుంధతీయవాడ గ్రామ సమీపం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండంలోని అంబలపూడి గ్రామానికి చెందిన రాపూరు ఈశ్వరయ్య, సురేఖల రెండో కుమార్తె సౌమ్య. ఈశ్వరయ్య ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సౌమ్య శుక్రవారం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది. కాసేపటికి తల్లిని దుకాణానికి తీసుకెళ్లి తినుబండారాలు కొనివ్వమని అడిగింది. సురేఖ రోడ్డుకు అవతల ఉన్న దుకాణానికి సౌమ్యను తీసుకెళ్లి తిరిగి ఇంటికి వెళుతోంది. ఈ క్రమంలో రోడ్డు పక్కన గూడూరు వైపు నుంచి వెంకటగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆపి ఉంది. అందులో నుంచి ప్రయాణికులు దిగుతున్నారు. బస్సు ముందు నుంచి సురేఖ, సౌమ్యలు రోడ్డు దాటుతున్నారు. ఈ సమయంలో ఓ లారీ బస్సును వెనుకనుంచి ఢీకొట్టబోయింది. స్థానికులు చూసి కేకలు వేయడంతో లారీ డ్రైవర్ బస్సును తప్పించి నేరుగా సౌమ్యను ఢీకొట్టాడు. బాలిక మీద నుంచి లారీ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయింది. లారీ డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అతను పరారయ్యేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు వెళుతుండగా.. సురేఖ వెనుక వస్తుండగా సౌమ్య ముందు వెళుతోంది. కళ్లెదుటే ఘటన జరగడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సౌమ్య మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని గుండలవిసేలా విలపించింది. కేకలు పెడుతుండగా డ్రైవర్ సౌమ్యను ఢీకొట్టాడని గ్రామస్తులు చెబుతున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మరణంలోనూ ఒకరికొకరు తోడుగా
వారిద్దరిది అన్యోన్య దాంపత్యం. దంపతులంటే ఇలా ఉండాలని చూసిన వారందరూ అనుకునేంతగా కలిసుండేవారు. వారిని చూసి ఎవరికి కన్నుకుట్టిందో తెలియదు గానీ రోడ్డుప్రమాదంలో దంపతులిద్దరూ మృతిచెందారు. మరణం కూడా తమని వేరుచేయలేదని నిరూపించుకున్నారు. నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని పప్పులవీధిలో ఉన్న దత్తాత్రేయ అపార్ట్మెంట్లో గ్రంథి నాగేశ్వరరావు(57), సులోచనమ్మ(55) నివాసం ఉంటున్నారు. వారికి అరుణ్, హరిత అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వతహాగా కష్టజీవి అయిన నాగేశ్వరరావు లారీ ఓనర్‌గా జీవనం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో జిల్లా లారీ అసోసియేషన్ కోశాధికారిగా బాధ్యతలు కూడా నిర్వహించారు. తనలా తన పిల్లలు కష్టపడకూడదని భావించి వారిని ఉన్నత చదువులు చదివించి వివాహం చేశారు. ప్రస్తుతం కుమారుడు అరుణ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా కుమార్తె హరిత తన తల్లిదండ్రులకు దగ్గర్లోనే నివాసం ఉంటోంది. ఆమె భర్త చిన్నబజారులో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచే దైవభక్తి ఎక్కువకావడంతో పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడ్డాక దంపతులిద్దరూ పుణ్యక్షేత్రాలు సందర్శించుకోసాగారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వారు కారులో తిరుమలకు వెళ్లారు. శనివారం ఉదయం స్వామివారి దర్శించుకున్న అనంతరం నెల్లూరుకు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో పెళ్లకూరు మండలం గుర్రప్పతోట వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో నాగేశ్వరరావు, సులోచనమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న కుమారుడు, కుమార్తె, బంధువులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, దంపతులిద్దరి మృతదేహాలు చూసి బోరున విలపించారు. వారి మరణంతో పప్పులవీధిలోని దత్తాత్రేయ అపార్ట్మెంట్ వద్ద విషాధచాయలు అలముకున్నాయి. స్నేహితులు, బంధువులు ఒక్కొక్కరిగా అక్కడకి చేరుకుంటున్నారు. కాగా శనివారం రాత్రికి నాగేశ్వరరావు, సులోచనమ్మల మృతదేహాలు నెల్లూరుకు చేరుకోనున్నాయి. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు. డ్రైవింగ్‌పై పట్టు నాగేశ్వరరావుకు డ్రైవింగ్ మీద మంచిపట్టు ఉందని, ఎంతో చాకచక్యంగా డ్రైవింగ్ చేసేవాడని ఆయన స్నేహితులు అంటున్నారు. ఆలయాల సందర్శనకు వెళ్లిన ప్రతిసారి డ్రైవర్‌ను వెంటబెట్టుకుని వెళ్లేవారని, అయితే కొద్దిరోజులుగా ఆయనే డ్రైవింగ్ చేస్తున్నాడని పేర్కొంటున్నారు. తమ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): దంపతుల నడుమ స్వల్ప వివాదం చెలరేగి క్షణికావేశానికి లోనైన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం నెల్లూరు నగరంలోని శ్రీహరినగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సమాచారం మేరకు మర్రిపాడు మండలం చిలకపాడు గ్రామంలో బి.ఓబుల్‌రెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన కుమార్తె స్రవంతి(26) బీటెక్ పూర్తిచేసుకొంది. 2013లో ఆమెకు మర్రిపాడు మండలం సింగన్నపల్లికి చెందిన ఆర్.వెంకటేశ్వర్లురెడ్డితో వివాహమైంది. వెంకటేశ్వర్లురెడ్డి అమెరికాలోని లాస్ఏంజెల్స్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వివాహానంతరం దంపతులిద్దరూ అమెరికాకు వెళ్లారు. ఈక్రమంలో 2016 జూలైలో స్రవంతి తన చెల్లెలు వివాహ నిశ్చితా ర్థం కార్యక్రమంలో పాల్గొనేందుకు స్వగ్రామానికి వచ్చింది. అప్పటి నుంచి ఆమె తన తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. వీసా సమస్యల కారణంగా వెంకటేశ్వర్లురెడ్డి చిలకపాడుకు రాలేకపోయారు. ఐదు నెలల క్రితం ఆయన స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి ఇటలీ వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకొంటూ దంపతులిద్దరూ నగరంలోని శ్రీహరినగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. దీపావళి పండగ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీ చిలకపాడుకు వెళ్లాలని దంపతులిద్దరూ నిర్ణయించుకొన్నారు. స్రవంతి తన తండ్రి ఓబుల్‌రెడ్డికి ఫోన్ చేసి ఊరికి వస్తున్నామని చెప్పగా ఆయన బస్సులో రావాలని సూచించాడు. అయితే వెంకటేశ్వర్లురెడ్డి చిలకపాడు నుంచి తన ఊరికి బైక్‌పై వెళదామని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. బస్సులోనే వెళదామని స్రవంతి పట్టుబట్టింది. వెంకటేశ్వర్లురెడ్డి ససేమిరా అన్నారు. కుమారుడు రామ్‌శ్రావణ్‌రెడ్డి వస్తువులన్నీ కింద పడేస్తుండడంతో స్రవంతి అతనిని మందలించడాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకు కుమారుడిని తిడుతావని ఆమెను ప్రశ్నించాడు. దీంతో మనస్థాపం చెంది సీలింగ్‌ఫ్యాను హుక్కుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ విషయాన్ని గమనించిన భర్త స్థానికుల సహకారంతో ఆమెను కిందకు దించి సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందిందని నిర్ధారణ కావడంతో బాలాజీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. శుక్రవారం అర్ధరాత్రి మృతురాలి తండ్రి ఓబుల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రభుత్వ వైద్యులు శనివారం మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. -
నెల్లూరులో కాల్పుల కలకలం
నెల్లూరు(క్రైమ్): దుండగుల కాల్పులతో బొల్లినేని ఆస్పత్రిలో మృతిచెందిన మహేంద్రసింగ్ మృతదేహాన్ని, సంఘటన స్థలిని శనివారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మృతునికి వ్యాపార లావాదేవీల్లో లేదా వ్యక్తిగతంగా ఎవరితోనైనా విభేదాలున్నాయా అనే వివరాల గురించి ఆరా తీశారు. కుటుంబ సభ్యులను విచారించగా ఎవరితోనూ విభేదాలులేవని వారు వెల్లడించినట్లు సమాచారం. అయితే దుండగులు ఎందుకు హత్యచేయాల్సి వచ్చిందనే విషయం పోలీసులకు చిక్కు ప్రశ్నలామారింది. ముమ్మరంగా తనిఖీలు వ్యాపారిపై దుండగులు కాల్పులకు తెగబడిన నేపథ్యం యంత్రాంగం అప్రమత్తమైంది. నగర డీఎస్పీ మురళీకృష్ణతోపాటు నెల్లూరు రూరల్, సీసీఎస్, ట్రాఫిక్ డీఎస్పీలు రాఘవరెడ్డి,బాల సుందరరావు, మల్లికార్జున నగరంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహేంద్రసింగ్ శరీరంలో మూడు బుల్లెట్లు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. చిన్నబజారు పోలీసులు హత్యఘటనపై కేసు నమోదు చేశారు. వరుస సంఘటనల నేపథ్యంలో సిబ్బంది పనితీరుపై ఎస్పీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తెలిసినవారి పనే.. మహేంద్రసింగ్‌పై కాల్పులు జరిపిన వారు తెలిసివారే అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండు నుంచి వచ్చిన దుండగులు తొలుత మహేంద్రసింగ్‌తో మాట్లాడుతూ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. మహేంద్రసింగ్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేప«థ్యంలో మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. -
పోలీసులా ? పచ్చచొక్కాల ఏజెంట్లా ?
నెల్లూరు జిల్లా జడ్పీ కార్యాలయంలో శనివారం జరిగిన సంఘటన టీడీపీ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభివర్ణించారు. ఆదివారం నెల్లూరులో స్థానిక ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లా పరిషత్ ఎన్నికలలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు... ఓ పార్టీకి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. తమ పార్టీ జడ్పీటీసీ సభ్యుడ్ని తమ సమక్షంలోనే టీడీపీ నేతలు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా... పోలీసులు పచ్చ తమ్ముళ్లకు అడ్డుపడకుండా వాళ్లకు సహకరించడం ఎంతవరకూ సబబు అని పోలీసులను ఈ సందర్భంగా కాకాని గోవర్దన్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసులా లేక పచ్చ చొక్కాల ఏజెంట్లా అంటు ఆగ్రహాం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడిపై స్పందించాలని రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 13న జరిగే జడ్పీ ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుని నియమించాలని ప్రభుత్వాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.