
సాక్షి, నెల్లూరు: అధికారం లేకపోయినా టీడీపీ నేతల ఓవరాక్షన్ మాత్రం తగ్గడం లేదు. పోలీసుల పట్ల దురుసు ప్రవర్తనలు కనిపిస్తూనే ఉన్నాయి. నెల్లూరులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ చేసిన ఓవర్ యాక్షన్ పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్మూర్తి నగర్ పోలింగ్ పోలింగ్ బూత్‌లోకి వెళ్తున్న టీడీపీ నేతల్ని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డు చూపించాలని అడగడంతో అజీజ్ కి చిరెత్తుకొచ్చింది.
నానా యాగీ చేసి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు అవేదన వ్యక్తం చేశారు. పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమపై టీడీపీ నేతల జులుం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
చదవండి: సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు