over action
-
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ ఓవరాక్షన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపి కార్యకర్తలు ఓవరాక్షన్‌కు దిగారు. కార్లు, బైకులపై వచ్చి హడావుడి చేశారు. పార్టీ ఆఫీసు ముందు వాహనాలను ఆపి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా వాహనాల్లో వచ్చి హల్ చల్ చేశారు. -
ఏపీకి గోవా కల్చర్..
-
దర్శిలో టీడీపీ నేతల ఓవరాక్షన్
-
ఆస్పత్రుల్లో ప్రైవేటు సైన్యం!
సాక్షి, సిటీబ్యూరో: వాళ్లు సెక్యూరిటీ గార్డులు..గేటు దగ్గరి నుంచి డాక్టర్‌ను కలిసే దాకా అడుగడుగునా ఉరుముతూ కనిపిస్తుంటారు. తెలిసీతెలియక ఏదైనా అడిగితే చిరాకు పడుతుంటారు. మరోసారి అడిగామంటే అంతే సంగతులు..అక్కడికి వచ్చే పేషెంట్ గజగజలాడాల్సిందే. ఈ పరిస్థితి ఏదో ప్రైవేటు ఆస్పత్రుల్లోనిది కాదు.. మన భాగ్యనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల వ్యవహార శైలి. నిజం..నగరంలోని దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు సెక్యూరిటీ రాజ్యం నడుస్తోంది. ఒక రకంగా ప్రైవేటు సైన్యాన్ని పెంచి పోషిస్తున్నట్టే ఉంది వ్యవహారం. దూరభారాల నుంచి వచ్చే రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం..గట్టిగా మాట్లాడితే దుర్భాషలాడటం.. మరీ కాదంటే దౌర్జన్యం చేయడం పరిపాటిగా మారింది. తాజాగా అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న పరిస్థితుల గురించి పాఠకులకు తెలియజేసేందుకు ఫొటోలు తీసేందుకు వెళ్లిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై ప్రైవేటు సెక్యూరిటీ గార్డు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రుల్లోని ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఆగడాలపై మరోసారి చర్చకు తెరలేచింది. అంత ఉలుకెందుకు? ఆస్పత్రుల్లో తాకిడిని నియంత్రించేందుకు థర్డ్ పార్టీ ద్వారా ప్రైవేటు సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పరచుకుంటుకున్నారు. అయితే వారి వ్యవహార శైలి ఏ ఆస్పత్రిలో చూసినా.. ఎప్పుడైనా వివాదాస్పదమే. చిన్న విషయాలకే రోగులపై విరుచుకుపడటం, దుర్భాషలాడటం సర్వసాధారణం అయింది. ఆస్పత్రులకు వచ్చే వారు అనారోగ్యంతో ఎంతో బాధతో వస్తుంటారు. కనీసం వారితో మర్యాదగా మాట్లాడుదామనే ఆలోచనే ఉండట్లేదని రోగులు వాపోతున్నారు. నేరస్తులను చూసినట్టు చూస్తుంటారని, చేతిలో లాఠీల్లాంటి కర్రలతో బెదిరిస్తుంటారని చెబుతున్నారు. శిక్షణ లేకుండానే విధుల్లోకి..? ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించే ప్రైవేటు సెక్యూరిటీకి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. ప్రజలతో ఎలా మెలగాలి? వారితో ఎలా ప్రవర్తించాలి..? అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి..? మానవతా దృక్పథం ఎలా అలవర్చుకోవాలి వంటి అనేక అంశాలపై వారికి అవగాహన కలి్పంచాలి. పైగా వీరిని గమనించే ఇన్చార్జి వారి ప్రవర్తన ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. ప్రతిసారి షిఫ్ట్ మారుతున్న సమయంలో రోల్ కాల్‌కు పిలిచి వారికి సూచనలు చేస్తుండాలి. కానీ ఏ ఆస్పత్రిలో కూడా ఇలా జరుగుతున్న దాఖలాలు లేవు. దీంతో సెక్యూరిటీ గార్డులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సమస్యలు దాస్తే ఏం లాభం? ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సమస్యలపై దృష్టి సారించాల్సిన పరిపాలనా యంత్రాంగం.. మసిపూసి మారేడు కాయ చేయడంపైనే దృష్టిసారిస్తోంది. ఆస్పత్రుల్లోని సమస్యలను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా కూడా ఎన్నడూ లేని ఆంక్షలు విధిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి..ఆ సమస్యలు బయటకు రాకుండా మేనేజ్ చేస్తే సరిపోతుందిలే అన్న చందంగా పాలక వర్గం వ్యవహరిస్తోంది. దీంతో రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పోతోంది. మీడియాపై ఆంక్షలు విధించి, సమస్యలను దాచేస్తే సరిపోతుందా.. నిజాలు బయటకు రాకుండా ఎంతకాలం దాస్తారంటూ పలువురు రోగులు ప్రశి్నస్తున్నారు.‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై దాడి.. విధుల్లో భాగంగా ఉస్మానియా ఆస్పత్రిలో పరిస్థితిని ప్రపంచం ముందు పెట్టేందుకు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ఫొటోగ్రాఫర్ జి.బాలస్వామిపై అక్కడి సెక్యూరిటీ గార్డు దాడి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కెమెరా లాక్కుని దుర్భాషలాడిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాను విధుల్లో భాగంగా ఇక్కడికి వచ్చానంటూ ఎంత చెప్పినా వినకుండా దౌర్జన్యం చేశారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు సూపరింటెండెంట్‌ను నిలదీయగా, సదరు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించామని తెలిపారు. అయితే వ్యవస్థ మొత్తం ఇలాగే ఉండగా, ఒక్కరిపై వేటు వేసి చేతులు దులుపుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనని చెబుతున్నారు. ఎన్నడూ లేనంత ఆంక్షలు ఇప్పుడే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. -
టీడీపీ చోటా లీడర్ల ఓవర్ యాక్షన్
-
పవన్ తిరుమల పర్యటనలో ఓవరాక్షన్.. భక్తుల ఇబ్బందులు
సాక్షి, తిరుపతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు, పోలీసులు హడావిడితో అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ కోసం భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వాహనాలనూ ఆపేశారు. దీంతో చాలాసేపు భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందిమంగళవారం పవన్ పర్యటన నేపథ్యంలో.. తిరుమల వెళ్లే ఘాట్ రోడ్‌లోని వాహనాలను అధికారులు నిలిపివేశారు. సుమారు అరగంటకు పైగా ఆపేయడంతో భక్తులు అసహనానికి లోనయ్యారు. పవన్ వెళ్లిన చాలా సేపటి తర్వాత వాహనాలను అనుమతించారు. ‘‘గతంలో ఎందరు నేతలు వచ్చినా.. ఇలాంటి అనుభవం మాత్రం ఎదుర్కొలేదు’’ అని కొందరు భక్తులు అంటున్నారు.ఇక లడ్డూ వ్యవహారంపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్.. రేపు తిరుమలలో దానిని విరమించే అవకాశం ఉంది. ఎల్లుండి తిరుపతిలో వారాహి సభలో పవన్ పాల్గొంటారు. కోర్టు వ్యాఖ్యలపై.. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది తెలిసిందే. ఈ పరిణామంపై పవన్ స్పందిస్తూ.. సీఎం చంద్రబాబు తన వద్ద ఉన్న సమాచారాన్ని మాత్రమే చెప్పారు. తనకు ఉన్న సమాచారం మేరకే సుప్రీం కోర్టు అలా వ్యాఖ్యానించింది. తిరుమల లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారంపై ఎక్కువ మాట్లాడను అని అన్నారు.ఇదీ చదవండి: బాబు ఫోకస్ అంతా అక్కడే ఇక! -
కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. తాడేపల్లి పోలీసుల ఓవరాక్షన్
గుంటూరు, సాక్షి: తాడేపల్లి పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్‌ను ఈ ఉదయం అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్టు విషయంలో వెంకటరామిరెడ్డికి కోర్టు ఇదివరకు ఊరట ఇచ్చింది. ఆయన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అయినా ఆ గడువు ఆదేశాలను పట్టించుకోకుండా ఈ ఉదయం 11గం.కే ఆయన్ని ఇంటి నుంచి తాడేపల్లి పోలీసులు తీసుకెళ్లారు. ఆయన్ని ఎక్కడి తీసుకెళ్లారు? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
దర్శి టీడీపీ ఇంఛార్జ్ ఓవర్ యాక్షన్
-
కడపలో టీడీపీ చెత్త పాలిటిక్స్.. భగ్గుమన్న వైఎస్సార్సీపీ
వైఎస్సార్ కడప, సాక్షి: వైఎస్సార్ కడపలో టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్‌కు పాల్పడ్డారు. మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గత మూడు రోజులుగా చెత్తపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి అనవసర రాజకీయం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చెత్తను కార్పొరేటర్లు మేయర్ ఇంటి ముందు వెయ్యాలని టీడీపీ నేతలను మాధవి రెడ్డి రెచ్చగొట్టారు. దీంతో ఇవాళ టీడీపీ నేతలను మేయర్ ఇంటి వద్దకు పంపించి చెత్తను వేయాలని ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్యే, నేతలు చేస్తున్న చెత్త పాలిటిక్స్‌పై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న కడప నగరంలో ఇలాంటి రెచ్చగొట్టి రాజకీయాలు చేయవద్దని వైఎస్సార్సీపీ నేతలు సూచిస్తున్నారు. ఇన్ని ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెచ్చగోట్ట రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.మేయర్ ఆగ్రహంతన ఇంటి ముందు చెత్త వేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట మేయర్ సురేష్ బాబు ధర్నాకు దిగారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరి ధర్నాలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చెత్త పై టీడీపీ నేతలను రెచ్చగొట్టి తన ఇంటి ముందు చెత్త వేసేలా ఎమ్మెల్యే చేయడం దుర్మార్గం. హుందాగా వ్యవహరించాలని గతంలోనూ ఆమెను మేం కోరాం. గెలిచిన మూడు నెలలకే ఇలాంటి నీచపు రాజకీయాలా?. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. కడపలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడూ లేవు. టీడీపీ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. ఇంటికొచ్చి చెత్త వేస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడపలో అల్లర్లు చేస్తున్నారు. హత్యారాజకీయాలు చేస్తున్నారు. నా ఇంటి ముందు చెత్త వేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. కఠినంగా శిక్షించాలి. -
కూటమి నేతల ఓవరాక్షన్
-
జనసేన కార్యకర్తల ఓవర్ యాక్షన్
-
టీడీపీ నేతల ఓవర్ యాక్షన్
-
కూటమి గుండెల్లో ఓటమి భయం..
-
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!
-
దళితులపై మరోసారి చింతమనేని దాష్టీకం
-
ఆకాశంపై ఉమ్మేసిన రామోజీ, లోకేష్
-
దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం: మంత్రి అంబటి వార్నింగ్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతల ఓవరాక్షన్‌కు మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఖమ్మంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తే కొందరు టీడీపీ వారు దాడికి యత్నించారు. దీంతో, ఖమ్మంలో నాకు నిరసన సెగ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి సీరియస్ అయ్యారు. కాగా, మంత్రి అంబటి శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఒక నిశ్చితార్థానికి వెళ్తే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఖమ్మంలో హఠాత్తుగా పది మంది వచ్చి వేసేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వచ్చి దాడికి యత్నించారు. ఇలాంటి కులోన్మాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్న నాపైనే దాడి చేయాలని ప్రయత్నించారు. రెండు దాడులపై విచారణ జరగాలి.. డబ్బు మదంతో కొందరు ఉన్మాదులు పేట్రేగిపోతున్నారు. వీరికి తోడుగా కొన్ని ఛానల్లు అంబటికి నిరసన సెగ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నాయి. దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం. ఉన్మాదులపై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటాం. నిన్న నా కారుపై గోధుమల బస్తాలు పడటం, ఇవ్వాళ దాడికి యత్నించటంపై విచారణ జరగాలి. నన్ను చంపితే రూ.50 లక్షలు.. గతంలో కార్తీక వనభోజనాల సమయంలో నన్ను చంపేసిన వారికి రూ.50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈరోజు దాడికి ప్రయత్నించిన వారిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లినవారిపై కూడా దాడి చేస్తారా?. ఇలాంటి కులోన్మాదంతోనే వంగవీటి రంగాని హతమార్చారు. ముద్రగడ పద్మనాభం మీద కూడా దాడి చేశారు. ఇది ఎంత మాత్రం సహించరానిది. చంద్రబాబు మీద ప్రేమ ఉంటే అది వేరేలా వ్యక్తం చేసుకోండి. అంతేకానీ దాడులు చేస్తామంటే మేము చేతులు కట్టుకుని కూర్చోము. టీడీపీ నేతలకు దమ్ముంటే అలా చేయండి.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని పిటిషన్లు వేసినా న్యాయస్థానాల నిబంధనల మేరకు నడుచుకుంటాం. ఆయన కదలికలను పసిగట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. అజ్ఞాత వ్యక్తి లేఖ రాశాడని చంద్రబాబు చెప్తున్నారు. ఆ లేఖ ఏంటో? రాసినదెవరో పోలీసుల విచారణలో తేలుతుంది. పెండ్యాల శ్రీనివాస్‌ని చంద్రబాబు దేశం దాటించారు. ఆయన్ని పిలిపించి సీఐడీకి అప్పగిస్తే చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేసే పరిస్థితే లేదు. ఇక తెలంగాణ టీడీపీ అడ్డా అని ఎలా అంటారు?. చంద్రబాబు తప్పు చేసి జైలుకు వెళ్లాడు. మీకు దమ్ముంటే రాజమండ్రి జైలు గోడలు పగులకొట్టండి. దాడికి యత్నించిన ఎనిమిది మంది ఒకే కులం వారు. వారికే కాదు నాకూ కులం ఉందని గుర్తు పెట్టుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, అంతకుముందు ఖమ్మంలో టీడీపీ నాయకులు ఓవరాక్షన్ చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి అంబటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అక్కడికి కర్రలతో వెళ్లారు. అక్కడ అంబటి రాంబాబుతో టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో టీడీపీ నేత కేతినేని హరీష్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘కోడ్’ పేరుతో అత్యుత్సాహం!
హైదరాబాద్: మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరు చెప్పి పోలీసులు సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీల పేరుతో దొరికిన నగదు దొరికినట్లు సీజ్ చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో ఖర్చులకు ఉద్దేశించిందే అన్నట్లు హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కనిపిస్తోంది. బుధవారం రామాయంపేట చెక్‌పోస్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సంఘానికి లెక్కలు చూపించడం కోసమే అన్నట్లు ఈ పోలీసులు విచక్షణ మరచి వ్యవహరించారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు కామారెడ్డిలో లాజిస్టిక్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు. తమ వ్యాపార కార్యకలాపాల కోసం వెళ్లిన వీళ్లు బుధవారం కారులో తిరిగి వస్తున్నారు. అందులో ఉన్న బ్యాగులో రూ.50 వేలు (రూ.500 నోట్ల కట్ట) ఉంది. రామాయంపేట వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసిన పోలీసులు ఈ కారు ఆపారు. బ్యాగ్ తనిఖీ చేసిన ఎస్ఐ నేతృత్వంలోని పోలీసులు అందులో రూ.50 వేలు ఉండటం గమనించారు. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి రూ.50 వేల వరకు నగదు ఎలాంటి రసీదులు లేకుండా తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయినప్పటికీ చెక్‌పోస్టులోని పోలీసులు యువకులను ఆ నగదుకు లెక్కలు చెప్పమని గద్దించారు. అవి తమ వ్యాపారానికి సంబంధించినవి అని చెప్తున్నా వినిపించుకోలేదు. రూ.50 వేలు సీజ్ చేసే అవకాశం లేకపోవడంతో ఆ పోలీసులు ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేచారు. ఆ యువకుల జేబుల్లో, పర్సులు తనిఖీ చేశారు. ఒకరి పర్సులో రూ.200 ఉండటంతో ఆ మొత్తంతో కలిపి తాము రూ.50,200 సీజ్ చేసినట్లు, అవి ఒకరి వద్దే లభించినట్లు పంచనామా సిద్ధం చేశారు. ఇందులో ఇద్దరి పేర్లు ప్రస్తావించకుండా ఒకరి పేరు రాసి ఆ మొత్తం స్వాదీనం చేసుకున్నారు. రూ.50 వేలకు మించిన నగదు ఒకరి వద్ద ఉంటే సీజ్ చేస్తారా? లేక ఒక వాహనంలో ఉంటే సీజ్ చేస్తారా? దానికి సంబంధించి ఈసీ ఆదేశాలు చూపాలంటూ యువకులు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ ఉత్తర్వులు చూపాలంటే ముందు పేరు చెప్పాలంటూ తెలుసుకుని పంచనామాపై రాశారు. రామాయంపేట పోలీసుల తీరుపై యువకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమ లెక్కల కోసం ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు న్యాయమనిప్రశ్నిస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రం మొత్తం ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. కోడ్ పేరుతో పోలీసుల చూపిస్తున్న అత్యుత్సాహం సామాన్యులకు ఇబ్బందులు తెచి్చపెడుతోంది. కోడ్ అమలులోకి వచి్చన నాటి నుంచి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా నగదు సీజ్ చేశారు. హైదరాబాద్‌లోనే ఈ మొత్తం రూ.15 కోట్ల వరకు ఉంది. బోయిన్పల్లి పోలీసులు ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్న రూ.55,900 నగదుతో మాత్రమే ఎన్నికల లింకులు ప్రాథమికంగా బయటపడ్డాయి. ఈ నగదు తరలిస్తున్న న్యూ బోయిన్పల్లి వాసి ఎం.భాస్కర్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కావడంతో ఆ కోణంలో ‘ఎలక్షన్ డబ్బు’గా అనుమానిస్తూ స్వాదీనం చేసుకున్నారు. ఇది మినహా మరే ఇతర ఉదంతంలోనూ నగదు స్వాధీనంలో రాజకీయ కోణం బయటపడకపోవడం గమనార్హం. -
హైదరాబాద్ మెట్రోలో టీడీపీ ఓవరాక్షన్
-
చంద్రబాబు లాయర్లపై చర్యలు !..బాబు కొంప ఎక్కడ..?
-
బాబు లాయర్ల అతి.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి
సాక్షి, విజయవాడ: వరుసబెట్టి పిటిషన్లు.. న్యాయస్థానాల్లో వరుస ఎదురు దెబ్బలు.. అయినా కొనసాగుతున్న పిటిషన్ల పర్వం. దారులన్నీ మూసుకుపోతున్న తరుణంలో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో చంద్రబాబు అండ్ కో ఉంది. ఈ సమయంలో ఆయన తరపు లాయర్లు కూడా ఫ్రస్టేట్ అవుతున్నారు. సీఐడీ తరపు న్యాయవాదులతో తాజాగా దురుసుగా ప్రవర్తించారు. ఇవాళ ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డులపై విచారణ జరిగింది. సీఐడీ అధికారుల కాల్‌డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్ వేశాయి. పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ జడ్జికి వివరించగా.. అసలు పిటిషనుకు అర్హతే లేదని సీఐడీ న్యాయవాది వివేకానంద తెలిపారు. ఈ సందర్భంలో.. సీఐడీ తరపు స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ వివేకానందపైకి చంద్రబాబు లాయర్లు దూసుకెళ్లారు. వివేకా లీగల్ సబ్మిషన్లు చెబుతున్న సమయంలో లాయర్ లక్ష్మీనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో.. ఈ కేసులో ఎందుకిలా చేస్తున్నారంటూ లక్ష్మీ నారాయణను జడ్జి ప్రశ్నించారు. మరోవైపు లక్ష్మీ నారాయణ తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేశారు సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద. అయితే ఇరువైపులా వాగ్వాదం జరిగింది. ఇరువైపులా అరుపులతో కాసేపు కోర్ట్ హాల్ దద్దరిల్లిపోయింది. దీంతో.. న్యాయవాదులపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ, నాగరాజు అనే లాయర్లు.. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్నారా? అంటూ ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. అయితే ‘లేరు’అని చంద్రబాబు తరపు న్యాయవాదులు సమాధానం ఇచ్చారు. దీంతో.. న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టు హాల్లో అతిగా ప్రవర్తించిన వాళ్ల పేర్లు రాసుకోవాలంటూ జడ్జి ఆదేశించారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్న వాళ్లు తప్ప అందరూ బయటకెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ.. ఈ విధంగా ఉంటే విచారించాలేనంటూ బెంచ్ దిగి వెళ్లిపోయారు. -
స్కిల్ స్కాంతో చంద్రబాబుకు సంబంధం లేదని ఎల్లో బ్యాచ్ దబాయింపు
-
బాలకృష్ణ మీసం తిప్పడంపై స్పీకర్ తమ్మినేని స్ట్రాంగ్ వార్నింగ్
-
అసెంబ్లీలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు..
-
తిరుమలలో టీడీపీ కార్యకర్త ఓవరాక్షన్.. భక్తుల ఆగ్రహం
సాక్షి, తిరుమల: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ అయ్యాక టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు జైలులో ఉండటంతో ఎల్లో బ్యాచ్‌కు మైండ్ బ్లాంక్ అయిపోయి తాము ఏం చేస్తామో అనేది తెలియక.. పిచ్చి వేషాలు వేస్తున్నారు. తాజాగా టీడీపీ కార్యకర్తలు తిరుమలలో టీడీపీ జెండాతో ఓవరాక్షన్ చేశారు. వివరాల ప్రకారం.. పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంలో టీడీపీ కార్యకర్తలు ఒకరు బరితెగించాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద టీడీపీ కార్యకర్తలు టీడీపీ జెండాలు ప్రదర్శించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఎల్లో బ్యాచ్ అపవిత్ర కార్యక్రమాలకు దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పార్టీ జెండాను ప్రదర్శించడంపై సీరియస్ అవుతున్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక, చంద్రబాబు అరెస్ట్‌ను ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో, కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు పిచ్చెక్కిపోయి ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ టీడీపీ జెండాలను ప్రదర్శిస్తున్నారు. ఇది కూడా చదవండి: తిరుమలలో నేడు ధ్వజారోహణం.. సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ -
కోకాపేట వద్ద టీడీపీ నేత మాగంటిబాబు ఓవరాక్షన్
-
బంద్ పేరుతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
-
టీడీపీ గూండాలతో లోకేశ్ బలప్రదర్శన: పీవీఎల్
-
బాలకృష్ణ పీఏ ఓవరాక్షన్
సాక్షి, శ్రీసత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ, టీడీపీ లీడర్ శ్రీనివాస్ రావు ఓవరాక్షన్‌కు దిగాడు. శనివారం నియోజకవర్గంలోని చలివెందుల పోలింగ్ కేంద్రం వద్ద తన అనుచరులతో హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తతంగా మారింది. చలివెందుల పంచాయతీ ఉప ఎన్నికల సందర్భంగా.. పోలింగ్ కేంద్రం వద్ద శ్రీనివాసరావు, తన అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. పోలింగ్ సరళిని తాను పరిశీలించాలంటూ కేంద్రంలోకి వెళ్లబోయే ప్రయత్నం చేశాడు. అయితే.. అది రూల్స్‌కు విరుద్ధమంటూ పోలీసులు అడ్డుకోగా.. దూసుకెళ్లే యత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగాడు. దీంతో దౌర్జన్యకారుల్ని పోలీసులు చెదరగొట్టారు. -
బాబు స్ఫూర్తి?.. పవన్ ఓవరాక్షన్
సాక్షి, విశాఖపట్నం: పుంగనూరు హింసాత్మక ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీయాలనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర భగ్నం అయ్యింది. అంత ఉద్రిక్త పరిస్థితుల్లోనూ పోలీసులు సంయమనం పాటించి పరిస్థితిని చెయ్యి జారిపోకుండా అదుపు చేసుకున్నారు. ఈ తరుణంలో బాబు స్ఫూర్తితో ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాన్ ఇవాళ విశాఖ పర్యటనతో అలాంటి ఉద్రిక్తతలనే రాజేయాలని ప్రయత్నించారేమో అనిపించకమానదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ్టి విశాఖ పర్యటనలో మామూలు ఓవరాక్షన్ చేయలేదు. ఎప్పటిలాగే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాదు.. నిబంధనలకు విరుద్ధంగా అభిమానులతో ర్యాలీ కూడా నిర్వహించాడు. ఎప్పటిలాగే పోలీసులతో సైతం వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే దిశగా పరిస్థితి మారింది. కానీ, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఇక నిబంధనలకు అనుగుణంగా రుషికొండపై నిర్మాణాలు జరుగుతుంటే.. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఉన్న పవన్ ఇష్టానుసారం విమర్శలు చేసుకుంటూ పోయారు. హడావిడి తప్ప ఏముంది? పవన్ సేమ్ ఆరోపణలతో రుషికొండను గతంలోనూ పర్యటించాడు. మరి అప్పటికీ.. ఇప్పటికీ ఏం మార్పు వచ్చిందని నిలదీస్తున్నారు స్థానికులు. ఎందుకంటే పవన్ పర్యటన వల్ల ఇవాళ వాళ్లు బాగా ఇబ్బంది పడ్డారు కాబట్టి!. ఉదయం నుంచే తన పర్యటన అంటూ లీకులు ఇచ్చి.. జనసైనికుల్ని, అభిమానుల్ని గుమిగూడేలా చేశారు పవన్. ఇక సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చి.. హడావిడి చేసి వెళ్లాడంతే. ఈ క్రమంలో ఫ్యాన్స్, జనసైనిక్స్‌కు తప్ప పవన్ పర్యటన వల్ల ప్రజలకు ఒరిగిందేం లేదని, పైగా ఈ పర్యటనతో తాము ఇబ్బంది పడాల్సి వచ్చిందని జనం తిట్టుకుంటున్నారు. ఇక పవన్ ఆదేశాలతో జోడిగుళ్లపాలం వద్ద జనసేన నేతల పేరిట కొందరు చేసిన హడావిడి అయితే మామూలుగా లేదు. ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు వాళ్లు. ఇదిలా ఉంటే.. రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారంటూ ఇప్పటికే జనసేనానికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. ఇదీ చదవండి: వారాహి యాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు -
పోలీసుల అతి.. ఆగని ప్రజాగ్రహం.. రణరంగాన్ని తలపిస్తున్న ఫ్రాన్స్
ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలపై పోలీసులు 17 ఏళ్ల యువకుడ్ని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ పౌరులు పెను విధ్వంసమే సృష్టి స్తున్నారు. మైనార్టీలపై ఫ్రాన్స్ పోలీసుల అకృత్యాలు ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అమెరికాలో జాత్యహంకారంతో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి హత్యపై కూడా అప్పట్లో ఫ్రాన్స్ నిరసనలతో దద్దరిల్లింది. గతంలో ఫ్రాన్స్‌లో పోలీసుల అతిపై పలుమార్లు తీవ్ర ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. వాటి వివరాలు.. నేహల్ ఎం.. అల్జీరియా సంతతికి చెందిన నేహల్‌కు 17 సంవత్సరాలు. మంగళవారం అతను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు ఆ కారు ఆపడానికి ప్రయత్నించారు. అయితే నేహల్ కారు ఆపకుండా తమ మీదకి దూసుకురావడంతో అతనిపై కాల్పులు జరపాల్సి వచి్చందని, దీంతో అందరి ప్రాణాలు కాపాడడానికే అతనిపై కాల్పులు జరిపామన్నది పోలీసుల వాదన. ఆ కాల్పుల్లో నేహల్ మృతి చెందడంతో సామాన్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల తీరుని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల వాదనకు పూర్తిగా విరుద్ధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ఆ యువకుడిపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. దీంతో వేలాది మంది యువతీయువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతున్నారు. దేశం ఒక అగ్ని గుండంగా మారింది. మైకేల్ జెస్లెర్.. 2020 నవంబర్‌లో నల్లజాతీయుడైన మ్యూజిక్ ప్రొడ్యూసర్ మైకేల్ జెస్లర్పై పోలీసులు తమ కర్కశత్వం ప్రదర్శించారు. పారిస్‌లో ఉన్న జెస్లర్ని ఒక కేసులో అరెస్ట్ చేయడానికి నలుగురు పోలీసులు వెళితే అతను ప్రతిఘటించాడన్న సాకుతో వారు తమ దాషీ్టకం ప్రదర్శించారు. జెస్లర్ను గొడ్డును బాదినట్టు బాదారు. ఈ వీడియో బయటకి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం ఆ నలుగుర్ని సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో ఫ్రాన్స్‌లోని వ్యవస్థల్లో జాతి వివక్షపై మరోసారి విస్తృతంగా చర్చ జరిగింది. జార్జ్ ఫ్లాయిడ్ 2020 జూన్‌లో అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను తెల్ల తోలు అహంకారంతో ఒక పోలీసు అధికారి నేలపై పడేసి తన మోకాలితో అతని గొంతుపై ఎనిమిది నిమిషాల సేపు నొక్కి ఉంచి హత్య చేయడంపై నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పోలీసులు నల్లజాతి వారిని, అరబ్బులని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. ఫ్లాయిడ్ మృతిపై అమెరికాను మించి ఫ్రాన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం నిందితుల్ని అరెస్ట్ చేసినప్పడు వారి మెడపై చెయ్యి వెయ్యడాన్ని నిషేధించింది. యెల్లో వెస్ట్స్ ఉద్యమం 2018లో ఫ్రాన్స్ ప్రభుత్వం చమురుపై పన్ను విధించడానికి సన్నాహాలు చేస్తోందనే వార్తలపై ప్రజాందోళనలు భగ్గుమన్నాయి. ప్రతిపాదిత పన్నుని నిరసిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనల్ని అణగదొక్కడానికి పోలీసులు మరింత హింసకు పాల్పడ్డారు. రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగం, గ్రనేడ్స్ కూడా వాడడంతో క్షతగాత్రులైన వేలాదిమంది శాశ్వతంగా మంచానికే పరిమితమైపోయారు. అడమా ట్రయోర్.. 2016 జూలైలో 24 ఏళ్ల వయసున్న అడమా ట్రయోర్ అనే యువకుడు పోలీసు కస్టడీలో మరణించడంతో ఫ్రాన్స్‌లో ఘర్షణలు చెలరేగాయి. ఉత్తర పారిస్‌లోని బీమాంట్ పోలీసుల అదుపులో ఉండగా అడమా ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతి గల కారణాలపై వైద్యులు భిన్న నివేదికలు సమరి్పంచడం, అనారోగ్యంతో అడమా మరణించాడని పోలీసులు చెప్పడంతో ప్రజలు రోడ్డెక్కారు. జస్టిస్ ఫర్ అడమా అంటూ పోస్టర్లు ప్రదర్శిస్తూ వేలాది మంది రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తతలకి దారితీసింది. పారిస్ ఊచకోత.. 2005 నవంబర్‌లో పోలీసులను తప్పించుకుంటూ వెళ్లిన ఇద్దరు ముస్లిం అబ్బాయిలు జయ్యద్ బెన్నా, బౌనా టరయోర్ విద్యుద్ఘాతంతో మరణించడంపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇద్దరు మైనార్టీలపై పోలీసులు దొంగలన్న ముద్ర వేసి వారి మరణానికి కారకులయ్యారన్న ఆగ్రహంతో ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనల్లో 10 వేల ప్రభుత్వ వాహనాలను తగులబెట్టారు. 233 ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. పోలీసులు 4 వేల మందిని పైగా అదుపులోనికి తీసుకున్నారు. ఈ సమయంలో అల్లర్లను అదుపు చేయడానికి ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచి్చంది. ఫ్రాన్స్‌లో పోలీసుల హింస దశాబ్దాల క్రితం నుంచే ఉంది. వలస పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించిన అల్జీరియన్లపై పోలీసుల అకృత్యాలు ఫ్రాన్స్ చరిత్రపై ఒక మాయని మచ్చగా మిగిలిపోతాయి. అరబ్బులు, ముస్లింలపై పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తారో తెలపడానికి ఇదే నిలువెత్తు ఉదాహరణ. పోలీసు కాల్పుల్లో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. పెరిగిపోతున్న పోలీసు హింస ► ఫ్రాన్స్‌లో పోలీసుల హింస రోజురోజుకి పెరిగిపోతోంది. గత అయిదేళ్లలో ఈ అకృత్యాలు 20% పెరిగినట్టు స్వచ్ఛంద సంస్థల నివేదికలు చెబుతున్నాయి. పోలీసులకుండే అధికారాలను పెంచుతూ 2017లో చట్టాలను సవరించారు. పోలీసుల కన్నుగప్పి పారిపోయే వారి వాహనాలపై కాల్పులు జరపవచ్చునని కొత్త చట్టాల్లో చేర్చారు. 2021లో వాహనాలపై పోలీసుల కాల్పుల ఘటనలు 157 జరగగా, 2022లో 138 జరిగాయి. ఇక గత ఏడాది పోలీసు కాల్పుల్లో 13 మంది అమాయకులు మరణించారు. దేశంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. -
ఇదేందయ్యా ఇది.. టీడీపీ నేతల ఓవరాక్షన్
పూతలపట్టు: గ్రామానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి గ్రామంలో ఎవరూ ఉండకూడదని స్థానిక టీడీపీ నేతలు ప్రజలను భయాందోళనకు గురి చేసి ఇళ్లకు తాళాలు వేయించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని పేట అగ్రహారం పంచాయతీలో జరిగింది. అయితే, గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు బుధవారం పేట అగ్రహారం పంచాయతీలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఇంటింటికీ ఎమ్మెల్యే వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తుండటాన్ని స్థానిక టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజలను ఎమ్మెల్యే కలవకుండా చేయాలని పంచాయతీలోని 5 గ్రామాల్లో ప్రజలంతా తాళాలు వేసుకుని వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. తాళాలు వేసుకుని వెళ్లకుంటే అంతు చూస్తామని తీవ్రంగా భయపెట్టారు. దీంతో పల్లెల్లో ఒకటి రెండు ఇళ్లు మినహా మిగిలినవారంతా భయపడి తాళాలు వేసుకుని పక్క గ్రామాలకు, పొలాల వద్దకు వెళ్లిపోయారు. పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే ఏం జరిగిందని అధికారులను ప్రశ్నించారు. ఎవరూ ఉండకూడదని టీడీపీ నాయకులు భయపెట్టడంతో జనం తాళాలు వేసుకుని వెళ్లారని అధికారులు చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేట అగ్రహరంలో 498 మంది లబ్ధిదారులకు రూ.2.15 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఏపీకి మరో జాతీయ అవార్డు -
టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్.. ఎమ్మెల్యే ధీటైన జవాబు
సాక్షి పల్నాడు: వినుకొండ మండలం శావల్యాపురంలో తెలుగుదేశం నాయకులు ఓవరాక్షన్‌కు దిగారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా శావల్యపురంలో జీవీ ఆంజనేయులు పాదయాత్ర చేశారు. అయితే.. ఈ క్రమంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆ యాత్రకు తారసపడ్డారు. అయితే.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి వాహనానికి టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. వాహనాన్ని చుట్టుముట్టి పార్టీ నినాదాలు చేస్తూ రెచ్చిపోయారు. దీంతో సహనం నశించిన ఎమ్మెల్యే.. ఆగ్రహంతో బయటకు వచ్చారు. ‘రండిరా.. చూసుకుందాం..’ అంటూ యెల్లో బ్యాచ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈలోపు రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పోలీసులు కలుగజేసుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎమ్మెల్యే కారును అక్కడి నుంచి పంపించేశారు. -
చిత్తూరు జిల్లా కుప్పంలో రెచ్చిపోయిన టిడిపి కార్యకర్తలు
-
విస్తుగొలుపుతున్న షేక్ దస్తగిరి తీరు
-
మహిళా సర్పంచ్ పై రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
-
Nellore: రామ్మూర్తి నగర్ పోలింగ్ స్టేషన్ వద్ద టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, నెల్లూరు: అధికారం లేకపోయినా టీడీపీ నేతల ఓవరాక్షన్ మాత్రం తగ్గడం లేదు. పోలీసుల పట్ల దురుసు ప్రవర్తనలు కనిపిస్తూనే ఉన్నాయి. నెల్లూరులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ చేసిన ఓవర్ యాక్షన్ పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్మూర్తి నగర్ పోలింగ్ పోలింగ్ బూత్‌లోకి వెళ్తున్న టీడీపీ నేతల్ని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డు చూపించాలని అడగడంతో అజీజ్ కి చిరెత్తుకొచ్చింది. నానా యాగీ చేసి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు అవేదన వ్యక్తం చేశారు. పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమపై టీడీపీ నేతల జులుం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. చదవండి: సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు -
ఇప్పటంలో జనసేన మూకల ఓవరాక్షన్.. గుడిలోకి వెళ్లి తాళాలు వేసి..
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా ఇప్పటంలో గతంలో తొలగించకుండా మిగిలిపోయిన ఆక్రమణల విషయంలో జనసేన మూకలు శనివారం మరోసారి గ్రామంలో చిచ్చుపెట్టేందుకు యత్నించారు. అధికారులు ఎంతచెప్పినా వినకపోవడంతోపాటు గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. సదరు ఆక్రమణలు ప్రభుత్వ భూమిలోనివేనని అధికారులు స్పష్టంచేయడం.. పోలీసుల హెచ్చరికలతో జనసేన మూకలు తోకముడిచాయి. వివరాల ప్రకారం.. గతంలో నానా రభస సృష్టించి ఇప్పటంలో అభివృద్ధి పనులను జనసేన శ్రేణులు అడ్డుకోవడంతో మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) అధికారులు అప్పట్లో కొన్ని ఆక్రమణలను తొలగించలేదు. వీటిని తిరిగి శనివారం తొలగించేందుకు సిద్ధమవుతుండగా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి జనసేన, టీడీపీ శ్రేణులు గ్రామంలో మరోసారి రగడ సృష్టించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని రాయడానికి వీల్లేని భాషలో ఇష్టానుసారం దూషించారు. కానీ, ఎంటీఎంసీ అధికారులు మాత్రం సంయమనం పాటించారు. అంతేకాక.. తామేమీ ప్రైవేట్ ఆస్తులను తొలగించడంలేదని.. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించుకున్న ప్రహరీ గోడలు, మెట్లు, వ్యాపార సముదాయాలు మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టంచేశారు. ఇంతలో అది ప్రభుత్వ భూమి అయితే ఆధారాలు చూపాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేయగా అధికారులు అందుకు సరేనన్నారు. అదే సమయంలో గ్రామంలో బయట వ్యక్తులు ఎవరూ ఉండకూడదని పోలీసులు హెచ్చరించడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. వారిని అడ్డుకునే ప్రయత్నంలో జనసేన మూకలు రెచ్చిపోగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు అక్కడి రామాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. ఇంతలో ఎంటీఎంసీ అధికారులు 1916 నాటి రికార్డులను తీసుకొచ్చి వారికి చూపించారు. దీంతో.. అధికారులు ఆక్రమణలపై చేసిన మార్కింగ్ కొలతలు.. రికార్డుల్లో ఉన్న కొలతలు ఒకటేనని తేలిపోయింది. ఇక ఏం మాట్లాడాలో అర్ధంకాక అధికారులతో జనసేన మూకలు వాదనకు దిగాయి. పోలీసులు హెచ్చరించడంతో వారు బయటకొచ్చి వెళ్లిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది. ఇదిలా ఉంటే.. జనసేన శ్రేణులు గుడిలోకి వెళ్లి తాళాలు వేసుకోవడం.. ప్రభుత్వం, సీఎంపై నానా మాటలు అనడంతో గ్రామానికి చెందిన మహిళలు బహిరంగంగానే ఆక్షేపించారు. -
గన్నవరంలో హైటెన్షన్
-
విజయవాడ తూర్పులో టీడీపీ నేతల బరితెగింపు
-
కుప్పంలో పచ్చ బ్యాచ్ వీరంగం
-
కుప్పం: పోలీసులపై చేయి చేసుకున్న టీడీపీ నేతలు
-
మాచర్లలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్
-
శ్రీకాకుళం జిల్లాలో రౌడీ సేన దౌర్జన్యం
-
హైకోర్టు జడ్జీల బదిలీపై టీడీపీ యాగీ
సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ దొనడి రమేశ్‌లను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కొందరు న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు విధులను బహిష్కరించారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఉదయం కోర్టు విధులు ప్రారంభం కాగానే టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొందరు న్యాయవాదులు పలు కోర్టు హాళ్లలోకి వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని న్యాయమూర్తులను కోరారు. ఇదే సమయంలో నిరసనకారుల్లో కొందరు.. సహచర న్యాయవాదులను తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్న ధోరణిలో బహిష్కరణకు సహకరించాలని కోరారు. దీంతో నిరసనకారుల తీరు పట్ల కొందరు న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. అసలు హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు రాకుండా మీరెలా విధుల బహిష్కరణ చేపడుతారంటూ నిరసనకారులను ఆ న్యాయమూర్తులు ప్రశ్నించారు. కోర్టు హాళ్లలో అరవడం వంటివి చేయవద్దని, కోర్టు బయటకు వెళ్లి చూసుకోండని తేల్చి చెప్పారు. దీంతో కొంత వెనక్కి తగ్గిన నిరసనకారులు ఆయా కోర్టులకు వెళ్లి న్యాయవాదులను విధుల బహిష్కరణకు సహకరించాలంటూ అభ్యర్థించారు. దీంతో కొందరు న్యాయవాదులు కోర్టు హాళ్ల నుంచి బయటకు రాగా, మరికొందరు కోర్టు హాళ్లలోనే ఉండిపోయారు. న్యాయమూర్తులు సైతం కేసుల విచారణను ప్రారంభించారు. నిరసనకారులు తిరిగి కోర్టు హాళ్లకు వచ్చి పదే పదే విజ్ఞప్తి చేయడంతో న్యాయవాదులు బయటకు వచ్చారు. దీంతో న్యాయమూర్తులు కొద్దిసేపటి తరువాత బెంచ్ దిగి తమ తమ ఛాంబర్లకు వెళ్లిపోయారు. బెంచ్‌లు దిగేసినప్పటికీ న్యాయమూర్తులు సాయంకాలం వరకు హైకోర్టులోనే ఉన్నారు. హైకోర్టు పాలనా కార్యకలాపాలు యథాతథంగా సాగాయి. హైకోర్టు ప్రధాన ద్వారం నుంచి ర్యాలీ టీడీపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు ఇతర పార్టీలకు చెందిన కొంత మంది న్యాయవాదులను పోగు చేసి, హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద జస్టిస్ దేవానంద్, జస్టిస్ రమేశ్‌ల బదిలీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏకపక్ష బదిలీలను ఆపాలని నినదించారు. హైకోర్టు ప్రధాన ద్వారం నుంచి క్యాంటీన్ వరకు ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో రోజూ ఎల్లో మీడియా చర్చల్లో పాల్గొనే ఓ న్యాయవాది టీడీపీ న్యాయవాదుల ప్రోద్బలంతో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాక ఈ న్యాయమూర్తుల బదిలీలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే ప్రజా జడ్జీలుగా ముద్రపడిన ఈ ఇద్దరు న్యాయమూర్తుల బదిలీ జరుగుతోందని ఆ న్యాయవాది ఆరోపించారు. ఈ బదిలీల్లోకి కులాన్ని సైతం లాగారు. ర్యాలీ అనంతరం నిరసనకారుల్లో పలువురు తమ దారిన తాము వెళ్లిపోయారు. కొందరు మాత్రం హైకోర్టు న్యాయవాదుల సంఘంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తుల బదిలీకి వ్యతిరేకంగా హైకోర్టు న్యాయవాదుల సంఘం పేరు మీద కొన్ని తీర్మానాలు చేశారు. బదిలీ సిఫారసులను ఆపేసి ఇద్దరు న్యాయమూర్తులను యథాతథంగా ఏపీ హైకోర్టులో కొనసాగేలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ తీర్మానం చేశారు. బదిలీలకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసనలు తెలియచేయాలని కూడా తీర్మానించారు. సోమవారం కూడా విధుల బహిష్కరణను కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇది న్యాయవ్యవస్థపై దాడి చేయడమే.. న్యాయమూర్తుల బదిలీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించడం దారుణం. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. పరిపాలనా సౌలభ్యం కోసం న్యాయమూర్తులను బదిలీ చేస్తుందే తప్ప, అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఫిర్యాదుల ఆధారంగా బదిలీ చేయడం ఉండదు. అంతర్గతంగా ఇంటెలిజెన్స్ ఇచ్చే సమాచారం ఆధారంగా కొలీజియం నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని తప్పుపట్టే హక్కు ఎవరికీ లేదు. న్యాయమూర్తుల బదిలీలను ప్రశ్నించడమంటే సుప్రీంకోర్టు కొలీజియాన్ని అవమాన పరచడమే. ప్రభుత్వం చెబితేనే సుప్రీంకోర్టు కొలీజియం న్యాయమూర్తులను బదిలీ చేసిందని చెప్పడం న్యాయవ్యవస్థపై దాడి చేయడమే అవుతుంది. – పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ ఆ తీర్మానంతో సంబంధం లేదు హైకోర్టు న్యాయవాదుల సంఘం పేరున తీర్మానం చేయడాన్ని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఖండిస్తోంది. తీర్మానాలు చేసేందుకు ఆ న్యాయవాదులకు సంఘం ఎలాంటి ఆథరైజేషన్ ఇవ్వలేదు. న్యాయవాదులు ఎలాంటి సమ్మెకు పిలుపునివ్వడం గానీ, సమ్మెలో పాల్గొనరాదన్న సుప్రీం ఆదేశాలకు మా సంఘం కట్టుబడి ఉంది. హైకోర్టు విధుల బహిష్కరణకు మేం పిలుపునివ్వలేదు. న్యాయవాదులు కోర్టు విధులకు ఆటంకం కలిగించవద్దని వి జ్ఞప్తి చేస్తున్నాం. –జానకిరామిరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ప్యాకేజీ శ్రవణ్.. ఒళ్లు దగ్గరపెట్టుకో.. సీఎం జగన్‌పై న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ చేసిన ఆరోపణలు సబబు కాదు. తక్షణం సీఎంకు క్షమాపణ చెప్పాలి. స్వతంత్ర న్యాయ వ్యవస్థకు కులాలను ఆపాదించడం దారుణం. శ్రవణ్‌కుమార్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. శ్రవణ్ ఓ 420. జడ్జి కాకున్నా ఆ పదవి తగిలించుకున్న ఇతనిపై చీటింగ్ కేసు నమోదు చేయాలి. ప్యాకేజీకి ఆశపడి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే సహించేది లేదు. – పెరికె వరప్రసాద్‌రావు, గవాస్కర్, బెజవాడ న్యాయవాదుల సంఘం చదవండి: AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల వివరాలు ఇవే.. -
టీడీపీ మహిళా కౌన్సిలర్ ఓవరాక్షన్.. ఉద్యోగిపై దాడియత్నం!
తాడిపత్రి: టీడీపీ కౌన్సిలర్ల దాష్టీకం పరాకాష్టకు చేరుకుంది. రెండు రోజుల క్రితం మున్సిపల్ ఉద్యోగిపై ఏకంగా దాడికి యత్నించి, దూషణలకు దిగారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. రెగ్యులర్ నాన్ మస్టర్ రోల్ (ఆర్‌ఎన్‌ఎంఆర్) ఉద్యోగి జేసీ సూర్యనారాయణరెడ్డి శుక్రవారం ఉదయం విధుల విషయమై కమిషనర్ వద్దకు వెళ్లాడు. అప్పటికే చైర్మన్ చాంబర్లో కూర్చుని ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్, 36వ వార్డు టీడీపీ కౌన్సిలర్ జింకా లక్ష్మీదేవి, మరికొంతమంది కౌన్సిలర్లు ఉద్యోగి సూర్యనారాయణపైకి దూసుకొచ్చారు. ‘ఎప్పుడు చూసినా కమిషనర్ చాంబర్ వద్దే ఉంటావు.. ఇక్కడ ఏం పని’ అంటూ గద్దించారు. వారి మాటలను పట్టించుకోకుండా సదరు ఉద్యోగి కమిషనర్ చాంబర్ నుంచి బయటకు వెళ్తుండగా కౌన్సిలర్ లక్ష్మీదేవి అడ్డుకుని.. చొక్కా పట్టుకునేందు ప్రయచింది. కమిషనర్ జోక్యం చేసుకుని సర్దిచెప్పబోయారు. అయినా వినకుండా మహిళా కౌన్సిలర్‌తో పాటు మరి కొందరు కౌన్సిలర్లు ఉద్యోగిపై తిట్ల దండకం మొదలు పెట్టారు. ఉద్యోగిపై కార్యాలయంలోనే దాడికి యత్నించి, మానసిక స్థైర్యం దెబ్బతీసేలా ప్రవర్తించిన టీడీపీ కౌన్సిలర్ల తీరు పట్ల అక్కడే ఉన్న ప్రజలు అసహ్యించుకోవడం కనిపించింది. రెస్ట్ హౌస్‌గా చైర్మన్ చాంబర్ టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి చాంబర్‌ను రెస్ట్ హౌస్లా వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వీరు నిత్యం ఉద్యోగుల విధుల్లోకి తలదూర్చడం, వారిని భయపెట్టడం వంటి చర్యలకు పూనుకుంటున్నారన్నది కొందరు మున్సిపల్ ఉద్యోగుల వాదన. ఎవరు ఏ పని చేయాలి.. ఎవరిని కలవాలనేది కూడా కౌన్సిలర్లే తమకు చెబితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ ఉద్యోగికి పని చేయకున్నా జీతమా..? మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, టీడీపీ సానుభూతిపరుడు అయిన రెగ్యులర్ నాన్‌మస్టర్ రోల్ ఉద్యోగి తిరుపాల్‌రెడ్డి పని చేయకున్నా జీతం వస్తోంది. మరి ఆ ఉద్యోగి విధులు ఏవి.. ఎక్కడ పని చేస్తున్నాడు.. వంటి వివరాలను ప్రజలకు తెలిపి ప్రజాధనం దురి్వనియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత టీడీపీ కౌన్సిలర్లపై లేదా అని ఉద్యోగులు నిలదీస్తున్నారు. కౌన్సిలర్లపై ఫిర్యాదు తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు దాడికి యత్నించిన టీడీపీ కౌన్సిలర్ లక్ష్మీదేవితో పాటు మరికొంతమంది కౌన్సిలర్లపై ఆర్‌ఎన్‌ఎంఆర్ ఉద్యోగి జేసీ సూర్యనారాయణరెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిని ఖండిస్తూ నిరసన ఆర్‌ఎన్‌ఎంఆర్ ఉద్యోగిపై దాడికి యతి్నంచి, మానసిక స్థైర్యం దెబ్బతీసేలా టీడీపీ కౌన్సిలర్ జింకా లక్ష్మీదేవి, మరికొందరు ప్రవర్తించిన తీరుపై మున్సిపల్ ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు. దురుసుగా మాట్లాడిన కౌన్సిలర్ లక్ష్మీదేవిపై చర్యలు తీసుకోవాలని కార్యాలయ మేనేజర్ రాజేశ్వరీబాయికి ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. చర్యలు తీసుకోకుంటే మున్సిపల్ సేవలు స్తంభింపజేసేందుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. -
వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం వారి కనుసన్నల్లోనే..
వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం అంతా వారిష్టం. వారి కనుసన్నల్లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) కొనసాగుతోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ అండతో వారిద్దరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాలనలోనూ వారు జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరో అడుగు ముందుకేసి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఆస్పత్రిలో పరికరాల కొనుగోళ్లలోనూ వారిదే పైచేయి. సూపరింటెండెంట్ వారి చేతిలో కీలుబొమ్మలా మారడంతో లక్షల రూపాయల విలువైన ఎక్విప్మెంట్ కొనుగోళ్లను వారికే నామినేషన్‌పై అప్పగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, నల్లగొండ: కంచే చేను మేసినట్లుగా ఉంది జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ వ్యవహారశైలి. ఆస్పత్రికి రోజూ ఇన్‌పేషంట్లుగా రెండుమూడొందల మంది, అవుట్పేషంట్లుగా ఐదారు వందల మంది వైద్యం కోసం వస్తుంటారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండడంతో రోగులు ఇతర పట్టణాల నుంచి కూడా వస్తారు. ఆస్పత్రిని పర్యవేక్షిస్తూ వైద్యులు, సిబ్బందిని నిత్యం సమన్వయం చేసుకుంటూ రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన అధికారి వారందరికీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులతో పాటు ఇతర ఉద్యోగులను చులకన భావంగా చూడడం వల్ల వారు మనకెందుకులే అన్న తీరుగా రోగుల పట్ల వ్యవహరిస్తున్నారు. వైద్యులు, ఉద్యోగులు అందించే సలహాలను, సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుని సమన్వయం చేయాల్సిన అధికారి వ్యవహారశైలిపైఅందరూ గుర్రుగా ఉన్నారని తెలిసింది. టెండర్లు పిలువకుండానే రూ.50 లక్షల సామగ్రి కొనుగోలు జీజీహెచ్‌లో రెండు నెలల క్రితం ఆపరేషన్ థియేటర్లో రూ.50 లక్షల విలువ చేసే ఎక్విప్మెంట్తో పాటుగా ఏసీలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే వాటి కొనుగోలు కోసం ఎలాంటి టెండర్లు పిలవకుండానే వారే కొన్ని సంస్థల పేరుతో టెండర్లు దాఖలు చేసినట్లు సృష్టించి తన సామాజిక వర్గానికి చెందిన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి టెండర్లు వచ్చేలా చేసి కొనుగోలు చేసినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. నాణ్యత లేని పరికరాలు, ఏసీలను కొనుగోలు చేసి ఆస్పత్రి ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆస్పత్రి వర్గాలే బాహాటంగా చెపుతున్నాయి. మందుల కొనుగోలు విషయం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు వేధింపులు జీజీహెచ్‌లో పనిచేసే ఉద్యోగులపై సూపరింటెండెంట్ వేధింపులకు పాల్పడుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఒక ఉద్యోగిపై ఆయన వ్యవహరించిన తీరుపై ఆస్పత్రి ఎదుట ఉద్యోగులు ఆందోళన చేసి కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మహిళా, పురుషులు అనే తేడా లేకుండా ఏకవచనంతో మాట్లాడడం, ఇతర పదజాలాన్ని వాడడం వల్ల మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వివరణ కొరడానికి పర్యవేక్షకుడిని ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
TS Police: ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా.. అర్ధరాత్రి రోడ్డుపై భార్యాభర్తలను..
Telangana police.. బైక్‌పై వస్తున్న తమపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, అర్ధరాత్రి నడిరోడ్డుపై అరగంట పాటు నిలబెట్టారని, అవసరం లేని ప్రశ్న లతో ఇబ్బంది పెట్టారని హైదరాబాద్‌లో పని చేస్తున్న భార్యాభర్తలు.. డీజీపీకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని దుర్గారావు, ఆయన భార్య భవాని హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం రాత్రి భార్యా భర్తలతో పాటు, భవాని సోదరుడు వెంకటేశ్ ఒకే బైక్‌పై కమలాపురం వస్తున్నారు. నేలకొండపల్లి వచ్చేసరికి రాత్రి 12.20 అయింది. ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు తమను ఆపి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెట్టారని దుర్గారావు, భవాని ఆరోపించారు. తాను సమాధానం చెబుతున్నా పట్టించుకోకుండా, తన భార్యను ప్రశ్నించారని తాళిబొట్టు, పెళ్లిఫొటోలు చూపించినా వినకుండా జీపు ఎక్కమంటూ దురుసుగా ప్రవర్తించారని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. తాము బైక్‌పై వస్తున్నామని చెప్పినా.. బస్ టికెట్లు చూపించమని అడిగారని, మీదే కులం అంటూ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్నారని, అరగంట పాటు తమను రోడ్డుపైనే నిలబెట్టారని, ఈ ఘటనను వీడియో తీస్తుంటే మొబైల్ లాక్కుని.. తనపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారని దుర్గారావు వాపోయారు. తమకు జరిగిన అవమానంపై మంత్రి కేటీఆర్, డీజీపీతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్‌ను కలసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై ఆదివారం నేలకొండపల్లి ఎస్సై స్రవంతిని వివరణ కోరగా తమ సిబ్బంది విధుల్లో భాగంగానే వారిని వివరాలడిగారని తెలిపారు. ఇది కూడా చదవండి: ఆబ్కారీకి నకిలీ మకిలి! కోట్లలలో అక్రమార్జన -
సీఎం కేసీఆర్ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల నుంచి సర్దాపూర్‌లో మార్కెట్ యార్డు ప్రారంభోత్సవానికి సీఎం వెళ్తుండగా చంద్రపేట మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ నాయకులు, వికలాంగుడు శ్రీనివాస్ రోడ్డు దాటుతుండగా, అప్పటికే సీఎం కాన్వాయ్ అక్కడికి చేరడంతో నిరసన తెలిపేందుకు వస్తున్నాడేమోనని పోలీసులు అతని లాగేయడంతో కింద పడ్డారు. తాను టీఆర్ఎస్ నాయకున్నేనని చెప్పినా వినకుండా పోలీసులు కింద పడేసి తొక్కారని శ్రీనివాస్ రోడ్డుపై బైఠాయించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు స్థానికుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శ్రీనివాస్‌ను తన్నిన పోలీస్.. క్షమాపణ చెప్పాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోలీస్ అధికారి అక్కడికి చేరుకుని స్థానికులను సముదాయించడంతో ఆందోళన సద్దుమణిగింది. -
బూతులు తిడుతూ.. టీడీపీ నేత దాదాగిరి
సాక్షి, చిత్తూరు: విచక్షణ కోల్పోయిన ఓ టీడీపీ నేత.. వార్డు వాలంటీర్‌పై దాదాగిరికి పాల్పడ్డాడు. సహాయక కార్యక్రమానికి అడ్డు తగులుతూ.. ఓవరాక్షన్ చేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని వడమాలపేట మండలం లక్ష్మీపురంలో టీడీపీ నేత ధనుంజయులు నాయుడు తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెడ్‌జోన్ పరిధిలో ప్రజలకు ఎమ్మెల్యే రోజా వార్డు వాలంటీర్ల ద్వారా గురువారం కూరగాయలు, నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తన అనుమతి లేకుండా నిత్యావసరాలు పంచుతావా అంటూ వాలంటీర్‌పై టీడీపీ నేత ధనుంజయులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బండ బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించాడు. టీడీపీ నేత ప్రవర్తనపై వాలంటీర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధనుంజయులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
వెలగపూడి బ్యాచ్ ఓవర్ యాక్షన్
ఎప్పుడో హుద్ హుద్ బాధితులకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణంలో.. లబ్ధిదారుల ఎంపికలో.. కాలనీ ప్రారంభోత్సవంలో ఐదేళ్లు సాచివేత ధోరణి అనుసరించిన తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి.. ఆయన అనుచరగణం పట్టాభిరామ్ తదితరులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రారంభోత్సవాన్ని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎంవీపీ కాలనీలో శుక్రవారం జరిగిన ఈ ప్రభుత్వ కార్యక్రమానికి ఎమ్మెల్యేగా వెలగపూడి ఫ్లెక్సీ పెట్టడం వరకు తప్పులేదు.. కానీ అక్కడి టీడీపీ బ్యాచ్ పార్టీ నాయకుడు పట్టాభిరామ్‌తోపాటు టీడీపీ ఫ్లెక్సీలు పెట్టి వివాదానికి తెర తీశారు. అభ్యంతరం చెప్పిన వైఎస్సార్సీపీ నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దుర్భాషలాడారు. పైగా ఎమ్మెల్యేను హౌసింగ్ బోర్డు అధికారులు ఆహ్వానిచినా.. పిలవలేదని తప్పుడు ఆరోపణలతో ప్రొటోకాల్ వివాదం రేపడానికి ప్రయత్నించారు. మంత్రి ముత్తంశెట్టి తదితరులు పాల్గొన్న ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు. సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): ఎంతో ఆర్భాటంగా జరగాల్సిన హుద్‌హుద్ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గ్యాంగ్ రగడ చేసింది. గత ఐదేళ్లలో పట్టించుకోని వెలగపూడి.. ఇప్పుడు లబ్ధి పొందాలని హడావుడి చేశారు. హుద్‌హుద్ తుపాను బాధితులకు ఎంవీపీ కాలనీలో కట్టిన ఇళ్లను ప్రారంభించకుండా ఐదేళ్ల పాటు తాత్సారం చేశారు. ఈ కేటాయింపుల్లోనూ పక్షపాతంగా వ్యవహరించారనే ఆరోపణలు ఆది నుంచి ఉన్నాయి. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు వీటిని త్వరితగతిన కేటాయించాలనే లక్ష్యంతో ముందుకు సాగింది. హౌసింగ్ బోర్డుపై ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు ఇళ్ల ప్రారంభోత్సవానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎంవీపీ కాలనీ సెక్టార్–7లో నిర్మించిన హుద్‌హుద్ ఇళ్లను ప్రారంభించేందుకు హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే వెలగపూడితో పాటు టీడీపీ నగర కార్యదర్శి పట్టాభిరామ్ తదితరులు వచ్చి దౌర్జన్యానికి దిగారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలగపూడి త్రయం ఫ్లెక్సీల లొల్లి.. హుద్‌హుద్ ఇళ్లు ప్రారంభం సందర్భంగా మంత్రి అవంతితో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నాయకుల ఫ్లెక్సీలు ఎంవీపీ కాలనీ సెక్టార్–7లో ప్రదర్శించారు. అక్కడికి వచ్చిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వెలగపూడి ఫ్లెక్సీతో పాటు ఆ పార్టీ నగర కార్యదర్శి పట్టాభిరామ్ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టాభి ఫ్లెక్సీ ఎలా పెడతారని ప్రశ్నించారు. దీంతో అధికారులు పట్టాభిరామ్ ఫ్లెక్సీని తొలగించారు. అనంతరం మంత్రి ఇళ్లను ప్రారంభించేందుకు ప్రయత్నించగా మరోసారి పట్టాభిరామ్ వాగ్వాదానికి దిగారు. పక్కకు వెళ్లిపోవాలంటూ వైఎస్సార్సీపీ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల భర్త వెంకటరావు కలుగజేసుకొని దురుసు ప్రవర్తన మానుకోవాలని పట్టాభికి సూచించినా ఆయన వినలేదు. వైఎస్సార్సీపీ శ్రేణులను మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తోపులాట చోటుచేసుకుంది. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను వారించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆహ్వానం అందలేదంటూ హల్చల్.. ఎమ్మెల్యే వెలగపూడికి ఆహ్వానం అందలేదంటూ టీడీపీ శ్రేణులు వెల్లడించడాన్ని వైఎస్సార్సీపీ నాయకులు తప్పుపట్టారు. గత ఐదేళ్లలో ఇళ్ల ప్రారంభోత్సవాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడెందుకు హల్చల్ చేస్తున్నారని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ వంశీకృష్ణ మండిపడ్డారు. టీడీపీ హయాంలో చేసిన దౌర్జన్యాలు, అరచకాలు తమ ప్రభుత్వంలో కొనసాగించాలని చూస్తూ తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. హుద్ హుద్ ఇళ్ల కేటాయింపుల్లో వెలగపూడి నిబంధనలకు పాతర వేశారని వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విజయనిర్మల దుయ్యబట్టారు. ఆ అక్రమ కేటాయింపులను బయటకు తీస్తామని హెచ్చరించారు. అనంతరం మంత్రి అవంతి కార్యకర్తలు, అధికారుల సమక్షంలో హుద్‌హుద్ ఇళ్లును ప్రారంభించారు. ప్రొటోకాల్ పాటించాం.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రొటోకాల్ పాటించాం. ముందుగానే హౌసింగ్ బోర్డు తరఫున ఎమ్మెల్యే వెలగపూడిని ఆహ్వానించాం. నేను స్వయంగా ఫోన్ చేసి కూడా ఆహ్వానించాను. ఆహ్వానించలేదని చెప్పడం అవాస్తవం. మంత్రి, ఎంపీల అనంతరం ఎమ్మెల్యే పేరు శిలాఫలకంపై వేయించాం. అయితే ఆయన సభాధ్యక్షుడిగా తన పేరు ముందుండాలని అన్నారు. అయితే అక్కడ ఎలాంటి సభ తాము నిర్వహించలేదు. ఎంవీపీలో మొత్తం 96 హుద్‌హుద్ ఇళ్లు నిర్మించాం. ఇందులో 75 కేటాయింపులు మాత్రమే ఇప్పటి వరకు జరిగాయి. మిగిలిన కేటాయింపులపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో నిలిపివేశాం. జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు మిగతా ఇళ్ల కేటాయింపులు చేపడతాం. – చిన్మయ్యాచారి, పీడీ, హౌసింగ్ బోర్డు -
పెద్దారవీడు ఎస్సై ఓవరాక్షన్
-
లాఠీలు ఝుళిపించిన పోలీసులు
ఏలూరు /కాళ్ల: కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహంతో కేరింతలు కొడుతున్న వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో పలువురు గాయపడిన సంఘటన మండలంలోని సీసలిలో జరిగింది. సోమవారం రాత్రి మైక్‌లో పాటలు పెట్టుకుని ఆనందంతో గడుపుతున్న వారి వద్దకు కాళ్ల ఎస్సై రాజ్‌కుమార్ సిబ్బందితో వచ్చి మైక్ నిలుపుదల చేసి వెంటనే వెళ్లిపోవాలని కోరారు. ఈ సందర్భంగా వాగ్వివాదం జరగడంతో పో లీసులు లాఠీలకు పని చెప్పారు. డీజే సౌండ్ సిస్టం యజమాని మత్తి శాంతారావు, భూపతి ఆదాం, నర్శింహులు, జె.శ్యామ్యూల్, గంటా లాజర్ తదితరులు గాయపడ్డారు. తీవ్ర గాయాలైన శాంతారావు, ఆదాంలను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించి పోలీసులు చికిత్స చేయిస్తున్నారు. రాజీకోసం పోలీసుల యత్నాలు తాము రికార్డింగ్ డాన్సులు, అసభ్యకర నృత్యాలు వంటివి ఏవీ చేయలేదని, దైవ ప్రార్థనలు చేసి భక్తి గీతాలాపన చేసుకుంటున్నామని, సమయం అయిపోయింది వెళ్లిపోండని చెబుతూనే ఎస్సై రాజ్‌కుమార్, పోలీసులు లాఠీలతో తీవ్రంగా కొట్టారని బాధితులు శాంతారావు, ఆదాం తదితరులు వాపోయారు. దళితులపై జరిగిన దాడికి సంబంధించి భీమవరం రూరల్ సీఐ సునిల్‌కుమార్ రాజీ కుదుర్చుతున్నారని బాధితులు తెలి పారు. తన చేతి ఎముక విరిగిపోవడంతో స్టీల్ రా డ్డు వేసి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, అయితే షుగర్ 360 ఉన్నందున ఆపరేషన్ కష్టమని, సిమెంట్ పోత పోశారని బాధితుడు శాంతారావు చెప్పారు. ఆదాంకు మోకాలుపై కట్టుకట్టారు. ఎక్స్‌రే తీసి ఎముకకు దెబ్బతగిలిందేమోనని పరీ క్షించారని చెప్పారు. బాధితుల్ని దళిత పేటకు చెందిన పలువురు పరామర్శించారు. ఎమ్మెల్యే వీవీ శివరామరాజు చికిత్స పొందుతున్న బాధితుల్ని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. -
టోల్గేట్ సిబ్బందిపై చింతమనేని చిందులు..
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న చింతమనేని మరోసారి తన మార్కు ఓవరాక్షన్ చేశారు. మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ వద్ద తన వాహనాన్ని ఆపిన సిబ్బందిపై చింతమనేని దూషణకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. కారుకు నెంబర్ ప్లేట్, ఎమ్మెల్యే పాస్ లేకుండా టోల్గేట్ నుంచి వెళ్లేందుకు చింతమనేని ప్రయత్నించారు. దీంతో టోల్గేట్ సిబ్బంది చింతమనేని కారును అడ్డుకున్నారు. కనీసం ఎమ్మెల్యే స్టికర్ కూడా లేకపోవడంతో వారు వాహనాన్ని నిలిపివేశారు. దీంతో చింతమనేని తనకు అలవాటైన రితీలో టోల్గేట్ సిబ్బందిని దూషించారు. అయిన కూడా సిబ్బంది వెనక్కి తగ్గకపోవడంతో.. చింతమనేని కారు అక్కడే వదిలివేసి బస్సులో వెళ్లిపోయారు. టోల్గేట్ వద్ద వీఐపీ వాహనాలు వెళ్లే మార్గంలో వాహనాన్ని విడిచి వెళ్లారు. చింతమనేని వ్యవహరంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం నంబర్ ప్లేట్ లేకుండా, కారు పాస్ లేకుండా కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే రాసి ఉండంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చింతమనేనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ.. తన కారును అక్కడి నుంచి ఎలా తెప్పించుకోవాలో తెలుసంటూ చింతమనేని వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. -
ఖాకీ క్రౌర్యం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పంటలకు గిట్టుబాటు ధరలు, కేసీ కెనాల్, ఎల్ఎల్సీ, తెలుగుగంగ ఆయకట్టులో రెండు కార్లకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించిన వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. జెడ్పీ ఎదుట శాంతియుతంగా రాస్తారోకో చేస్తున్న నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉద్యమకారుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పలువురు నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. మహిళలు, అయ్యప్ప, సాయిబాబా మాలధారులను సైతం ఈడ్చేయడంతో అనేకమందికి రక్త గాయాలయ్యాయి. మెరువు వేగంతో జెడ్పీకి.. వైఎస్సార్సీపీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు, బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్తలు హఫీజ్‌ఖాన్, కాటసాని రామిరెడ్డి, నంద్యాల, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నేతలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు, మహిళలు, రైతులు జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని పురస్కరించుకొని ముట్టడికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు, బిర్లాగేటు, బళ్లారి రోడ్డులో మాటు వేశారు. అయితే.. నాయకులు చాకచక్యంగా వ్యవహరించారు. ముందుగా కార్యకర్తలను పంపారు. తర్వాత నాయకులు స్కూటర్లు, ఆటోల్లో పోలీసులకు మస్కాగొట్టి జెడ్పీకి మెరుపు వేగంతో చేరుకొని రాస్తారోకోకు దిగారు. టమాటాలు రోడ్డుపై పారబోసి.. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని, ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని, కాలువల కింద రెండో పంటకు నీరివ్వాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఖాకీల కర్కశం ఆందోళనకు దిగిన ఐదు నిమిషాల్లోనే అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. దీంతో పోలీసులు, ఉద్యమకారుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రామిరెడ్డి, ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, గంగుల నాని, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, చెరుకులపాడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మంత్రాలయం వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డితో పాటు వందలాది మంది నాయకులు, కార్యకర్తలను డీఎస్పీ యుగంధర్‌బాబు నేతృత్వంలో బలవంతంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో మానవత్వం లేకుండా ప్రవర్తించారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న బీవై రామయ్యను ఈడ్చుకెళ్లడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. రోడ్డుపైనే పడిపోయి ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. పార్టీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి సాయిబాబా మాలధారణలో ఉన్నప్పటికీ బలవంతంగా తీసుకెళ్లి వ్యాన్‌లో పడేశారు. దీంతో ఆయన కూడా అస్వస్థతకు గురయ్యారు. నాయకురాళ్లను సైతం ఈడ్చుకుంటూ వెళ్లడంతో జమీల, విజయలక్ష్మీ, శౌరీ విజయకుమారి, సలోమిలకు రక్తగాయాలయ్యాయి. రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి చొక్కా చించేశారు. పలువురిపై లాఠీ చార్జీ చేశారు. తోపులాటలో జమీలకు సంబంధించిన బంగారు బ్రాస్లెట్, శౌరీ విజయకుమారికి చెందిన రూ.5 వేల నగదు పోయాయి. ప్రతిఘటించిన కార్యకర్తలు నేతలను అరెస్టు చేయడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. నాయకులను తీసుకెళ్తున్న వాహనానికి అడ్డుపడ్డారు. మూడంచెలుగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మద్దయ్య, నాయకులు రెహమాన్, అదిమోహన్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, పలువురు కార్యకర్తలు జెడ్పీ సమావేశానికి వస్తున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. వీరిపైనా పోలీసులు విచక్షణా రహితంగా లాఠీచార్జీ చేసి.. అనంతరం అరెస్టు చేశారు. సీహెచ్ మద్దయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ రెండో పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. మొక్కజొన్న, ఉల్లిగడ్డలను పారబోసి అన్నదాతకు అండగా ఉన్న వారిని అరెస్టు చేస్తారా అంటూ నిలదీశారు. సొంత పూచీకత్తుతో విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా, అంతకముందు నాయకులను రిమాండ్‌కు పంపాలని పోలీసులు భావించారు. అయితే.. తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకరరెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌరుచరితారెడ్డి, ఐజయ్య పొడియం ముందు బైఠాయించడంతో వెనక్కి తగ్గారు. అనంతరం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఉన్న డిప్యూటీ సీఎంకు జిల్లా రైతాంగ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో గుండం సూర్యప్రకాష్‌రెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, శిల్పా భువనేశ్వరరెడ్డి, మధుసూదన్, చెరకుచెర్ల రఘురామయ్య, ఆదిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నాగరాజుయాదవ్, అక్కిమి అనుమంతరెడ్డి, చంద్రమౌళి, పొలూరు భాస్కరరెడ్డి, మణివర్ధన్‌రెడ్డి, రైల్వే ప్రసాద్, గోపాల్‌రెడ్డి, శివశంకర్‌నాయుడు, మహేశ్వరరెడ్డి, కొంతలపాడు శ్రీనివాసరెడ్డి, కరుణాకరరెడ్డి, డీకే రాజశేఖర్, పురుషోత్తమరెడ్డి, గోపాల్‌రెడ్డి(ఆదోని), సిద్ధారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రమణారెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, మిడ్డూరు శ్రీనివాసులు, మహిళా నాయకులు మదారపు రేణుకమ్మ, సలోమి, సఫియాఖాతూన్, మంజుశ్రీ,, నంద్యాలకు చెందిన ఉసేనమ్మ, రాజ్యలక్ష్మీ, బేగం, మద్దమ్మ, మరియమ్మ, లక్ష్మీదేవి, సుచరిత తదితరులు పాల్గొన్నారు. రెండో పంటకు నీరివ్వాలి ఈ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. శ్రీశైలంలోకి 854 అడుగులు నీరు రాకముందే ఇతర జిల్లాలకు తరలించుకుపోతున్నారు. ఇక్కడ రైతులకు మాత్రం ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పడం దారుణం. కేసీ కెనాల్, ఎల్ఎల్సీ, తెలుగుగంగ కింద డిసెంబర్ వరకు మొదటి కారు పంటకే నీళ్లు ఇవ్వకపోతే అన్నదాతల గోడు ఎవరికీ చెప్పుకోవాలి? రెండు పంటలకు నీరివ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం. వైఎస్సార్ హయాంలో జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి, సిద్దాపురం, గురురాఘవేంద్ర, పులికనుమ తదితర ప్రాజెక్టులను నిర్మించారు. కానీ, ఈ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టూ చేపట్టలేదు. తీవ్ర వర్షాభావంతో అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది. అయినా సర్కారులో చలనం లేదు. – శిల్పా చక్రపాణిరెడ్డి గిట్టుబాటు ధరలు లేకనే అన్నదాత ఆత్మహత్యలు తీవ్ర వర్షాభావం వల్ల అరకొర పంటలే పడుతున్నాయి. వీటికి కూడా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎకరా పంటకు రూ.50 వేల వరకు పెట్టుబడులు వస్తున్నా.. పండిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు లేవు. మార్కెట్లో కేజీ ఉల్లి మూడు, కేజీ టమాటాలు రెండు రూపాయలు, మొక్కజొన్న, వరికి క్వింటాల్‌కు రూ.1750 కనీస మద్దతు ధర ఉంటే రూ.1,200లకు మాత్రమే రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. – బీవై రామయ్య ఎకరాకు రూ.25 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలి జిల్లాలో తీవ్ర కరువు నెలకొన్నా.. సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కేవలం కరువు మండలాలను ప్రకటించి చేతులు దులిపేసుకుంది. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. – కాటసాని రాంభూపాల్‌రెడ్డి -
ఎమ్మెల్యే డైరెక్షన్..ఎస్ఐ ఓవరాక్షన్
కర్నూలు, నంద్యాల: టీడీపీ నాయకులు చెప్పిందే జరగాలి.. కాదు..కూడదు.. అంటే పోలీసులపై ఒత్తిడి తెచ్చి అమాయక ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. టీడీపీ నాయకుడు బాలశంకర్‌రెడ్డి మాట వినడం లేదని రహదారి విషయంలో ఓ అమాయికుడిని గత ఐదు నెలలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేయడంతో ఎస్ఐ విష్ణునారాయణ తమను చితక బాదాడని బండిఆత్మకూరు మండలం పెద్దదేవళాపురం గ్రామానికి చెందిన పెద్ద లింగమయ్య, ఆయన లింగేశ్వరమ్మ తెలిపారు. ఎస్ఐ కొట్టిన దెబ్బలు తాళలేక చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి ఆదివారం వచ్చారు. బాధితుడు పెద్దలింగమయ్య తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దదేవళాపురం గ్రామంలో మాధవరం రోడ్డు కొన్ని సంవత్సరాలుగా ఉంది. గ్రామానికి చెందిన బాలశంకర్‌రెడ్డి భార్య ఐదుసంవత్సరాల క్రితం సర్పంచ్‌గా ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన పెద్దలింగమయ్య వీరి మాట వినడం లేదని టీడీపీ నాయకుడు శంకర్‌రెడ్డి.. మాధవరం రోడ్డును లింగమయ్య పొలంలో వెళ్లేలా చేశారు. కొన్నేళ్లుగా ఉన్న రహదారిని తీసి వేసి తన పొలంలో రస్తా ఎలా వేస్తారని ఐదు నెలల నుంచి లింగమయ్య పోరాడుతూ వస్తున్నాడు. ఈ విషయంపై జేసీ ప్రసన్నవెంకటేష్ను కలిసి ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించారని లింగమయ్య తెలిపారు. అప్పటి నుంచి తన పొలంలో వేసిన రస్తాను తీసివేస్తామని చెప్పిన నాయకు.. ఈ రోజు వరకు తీయలేదన్నారు. ఈ విషయంపై మూడు రోజుల క్రితం బాలశంకర్రెడ్డిని అడగగా తన భార్యపై దాడి చేశారన్నారు. ఆదివారం ఉదయం తాము ఇంటి వద్ద ఉండగా ఎస్ఐ పిలుస్తున్నారని, స్టేషన్‌కు రావాలని కానిస్టేబుళ్లు వచ్చారన్నారు. ఎందుకు రావాలని అడగగా ఎస్ఐ మాట్లాడాలని అంటున్నాడంటూ.. స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. తెల్లకాగితంపై సంతకం పెట్టాలంటూఎస్ఐ బెదిరింపు... స్టేషన్‌కు వెళ్లగానే ఎస్ఐ.. ‘‘నిన్ను కొడితే ఎవరు అడ్డు వస్తారో... పిలుచుకొని రా.. చూద్దాం’’ అంటూ మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా తనపై లాఠీతో ఎక్కడ పడితే అక్కడ కొట్టాడని లింగమయ్య తెలిపారు. అడ్డువచ్చిన తన భార్య లింగేశ్వరమ్మను ఎస్ఐ కొట్టారన్నారు. తెల్లకాగితం తీసుకొని వచ్చి సంతకం పెట్టాలంటూ ఒత్తిడి చేశారన్నారు. సంతకం పెట్టనని చెప్పడంతో తీవ్రంగా కొట్టారన్నారు. ఎస్ఐ ఎందుకు కొడుతున్నారో కూడా తన అర్థం కాలేదన్నారు. ఎమ్మెల్యేతో ఎస్ఐకి ఫోన్ చేయించారు.. గ్రామానికి చెందిన బాలశంకర్‌రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో ఎస్ఐకి ఫోన్ చేయించారని లింగమయ్య చెప్పారు. ఎమ్మెల్యే ఫోన్ చేయడంతోనే ఎస్ఐ తనను తీవ్రంగా కొట్టారన్నారు. నాకున్న 90సెంట్ల పొలంలో 20సెంట్లలో రహదారి వేస్తే ఎలా జీవనం ఎలా గడవాలని వాపోయారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతానన్నారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఏం సార్ పోలీసులకు పెళ్లాం, బిడ్దలుండరా?
శాంతియుతంగా సాగుతున్న మునిసిపల్ కార్మికుల సమ్మెపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేసింది. సోమవారం నిర్వహించతలపెట్టిన మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడిని భగ్నం చేసింది. కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్ది బలవంతంగా ఈడ్చి వాహనాల్లోకి విసిరేశారు. ఈ క్రమంలో మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారు. అనంతపురం న్యూసిటీ: పారిశుద్ధ్య పనులను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి కార్మికులను రోడ్డుపాలు చేసే జీఓ 279ను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని మునిసిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మెలో తారస్థాయికి చేరింది. డిమాండ్ల సాధనలో భాగంగా సోమవారం సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎస్‌యూసీఐ మద్దతుతో మునిసిపల్ కార్మికులు రామ్‌నగర్‌లోని మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడించేందుకు భారీ సంఖ్యలో వెళ్లారు. ఇంటి ముందు బైఠాయించి జీఓ 279ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దొరికిన కార్మికులను దొరికినట్టుగా అక్కడి నుంచి ఈడ్చిపడేశారు. కొంతమంది నాయకులను చుట్టుముట్టి కాళ్లు, చేతులు పట్టుకుని లాగేశారు. చేతులు పెడవిరిచి, మెడను తిప్పి, పిడిగుద్దులు గుద్దారు. నొప్పితో విలవిలలాడినా కర్కశంగా వ్యవహరించారు. మహిళా కార్మికులపైనా విరుచుకుపడ్డారు. లేడీ కానిస్టేబుళ్లతో వారిని అక్కడి నుంచి పక్కకు పంపించే అవకాశం ఉన్నా మగ పోలీసులు రెచ్చిపోయారు. మహిళలు పక్కకు కదలకుండా వారిని చుట్టుముట్టి.. వారిని చేతులతో నెట్టుతూ బలవంతంగా వాహనాల్లోకి కుక్కారు. ఒంటిపై దుస్తులు జారిపోతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. డీఎస్పీ వెంకట్రావ్ ఆదేశాల మేరకు కార్మికులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తోపులాటలో సీఐటీయూ నాయకులు గోపాల్, మంజుల, నాగరత్న, ఆదిలక్ష్మి, శివ గాయపడ్డారు. వీరిని పోలీసు స్టేషన్ నుంచి సర్వజనాస్పత్రికి తరలించారు. మంజుల, ఆదిలక్ష్మిలకు ఫ్రాక్చర్ అయినట్లు తెల్సింది. దుర్మార్గపు చర్య జీఓ 279 రద్దు చేయాలని పోరాడుతున్న కార్మికులపై దాడులు చేయడం దుర్మార్గపు చర్య అని వామపక్షాల నేతలు నాగేంద్ర, రాజారెడ్డి, నాగరాజు, కార్మిక సంఘాల నేతలు గోపాల్, రాజేష్‌గౌడ్ ఖండించారు. ఉద్ధేశ్యపూర్వకంగానే కార్మికులపై పోలీసులు దాడులు చేశారన్నారు. మహిళా కార్మికులని చూడకుండా దాడులు చేయడం సరికాదన్నారు. మహిళలను మగ పోలీసుల ద్వారా బలవంతంగా జీపులోకి తోసేయడం దారుణమన్నారు. సమ్మెను ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ నెల 19 నుంచి ప్రత్యక్ష ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు కార్మికులు రారని తేల్చి చెప్పారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. పరామర్శ పోలీసుల తోపులాటలో గాయపడ్డ కార్మికులను వైఎస్సార్సీపీ కార్పొరేటర్ జానకి పరామర్శించారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఆమె తప్పుబట్టారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ధ్వజమెత్తారు. పోలీసులా.. పశువులా? ఏం సార్ పోలీసులకు పెళ్లాం, బిడ్దలుండరా? ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తారా? యదపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు. ఒంటిపై చీరలేకుండా ఊడదీశారు. దెబ్బలు తగిలినా బాధ లేదు. కానీ పోలీసులు చేసిన పనులు బాగలేవు. వాళ్లు పోలీసులా..పశువులా? – మంజుల, పారిశుద్ధ్య కార్మికురాలు -
పోలీసులు.. కీలుబొమ్మలు
శింగనమల : పోలీసులు అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారని వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా ప్రజల సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేయడం తగదని అన్నారు. టీడీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు, మంత్రులు అడుగడుగునా పోలీసుల ద్వారా అడ్డు తగులుతూనే ఉన్నారన్నారు. ఏ కార్యక్రమం తలపెట్టినా ముందస్తుగా నేతలను గృహనిర్బంధం, ముందస్తు అరెస్టులతో అణచివేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాప్తాడు, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, రాయదుర్గం, తాడిపత్రి, శింగనమల వంటివే కాకుండా జిల్లా అంతటా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసుల రాజ్యంలో ఉన్నామా.. లేకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు పోలీసుల చేత ఎన్నికయ్యారా అని విమర్శించారు. ముచ్చుకోట వద్ద ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకున్నా వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో దిగ్బంధిస్తామని హెచ్చరించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, పార్లమెంటు సమన్వయకర్తలతో కలిసి పోలీసుల తీరుపై డీజీపీ, గవర్నర్లకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు పోలీసు వ్యవస్థను కించపరిచినా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే ఎంతోమంది ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వస్తున్నారని.. మీకు అధికార పార్టీపై అభిమానం ఉంటే ఖాకీ చొక్కాలు విప్పి పచ్చ చొక్కాలు వేసుకుని రావాలని హితవు పలికారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం : కేతిరెడ్డి జిల్లాలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. మేము ఏమైన రాళ్లు రువ్వుతున్నామా.. ఎవరో తాడిపత్రి ఎమ్మెల్యే, ఎంపీ చెబితే మీరు వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. తాడిపత్రి ఎమ్మెల్యే తిమ్మంపల్లిలో పర్యటిస్తే 500 మంది పోలీసులతో బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేస్తారని నిలదీశారు. తాము ప్రజాసమస్యల కోసం పాదయాత్ర చేస్తామంటే పోలీస్‌స్టేషన్‌లో పెడతారా అంటూ విరుచుకుపడ్డారు. అదే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులను అవమానకర రీతిలో దూషించినా ఆయనపై ఎటువంటి కేసూ నమోదు చేయరన్నారు. నీరు రాకుండా జేసీ సోదరుల అడ్డుకట్ట శింగనమల: ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయకపోవడంతో పాటు వర్షపునీరు కూడా డ్యాంలోకి చేరకుండా జేసీ సోదరులు అడ్డుకట్ట వేశారని వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. ముచ్చుకోట నుంచి పెద్దపప్పూరుకు చేపట్టిన పాదయాత్రను అడ్డుకుని, పెద్దారెడ్డిని శింగనమల పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డ్యాంలో నీరు ఉంటే పెద్దపప్పూరు మండలంలోని 20 గ్రామాల్లో భూగర్భజలం పెరుగుతుందన్నారు. తద్వారా రైతులు పంటలు పండించుకుంటే.. ఇక జేసీ ఇంటి వద్దకు ఎవరూ తిరిగి చూడరని 30 సంవత్సరాలుగా రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేయాలని తాము కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. తాడిపత్రిలో పోలీస్ వ్యవస్థ లేదని, అక్కడ జేసీ సోదరుల కనుసన్నల్లోనే పోలీసులు నడుచుకుంటున్నారన్నారు. ప్రబోధానందాశ్రమంపై జేసీ సోదరులు, వారి అనుచరులు దాడి జరిపితే పోలీసులు సుమోటోగా కూడా కేసు నమోదు చేయలేదన్నారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ధైర్యముంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ నేతల పరామర్శ శింగనమల పోలీస్స్షేన్లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, యువజనవిభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరిసాంబశివారెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, మైనారిటీ సెల్ అధ్యక్షుడు గయాజ్‌బాషా, తాడిపత్రి, యల్లనూరు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పరామర్శించారు. మధ్యాహ్నం కేతిరెడ్డి పెద్దారెడ్డి విడుదల తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని మధ్యాహ్నం సొంత పూచికుత్తపై విడుదల చేశారు. పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు పోయిన తరువాత తాడిపత్రికి వెళ్లకూడదని డీఎస్పీలు రామకృష్ణ, చిన్నికృష్ణలు కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనాన్ని నిలిపి అభ్యంతరం చెప్పారు. రోడ్డుపైనే పోలీస్‌స్టేసన్ మందు అనుచరలు అందోళన చేస్తామని చెప్పడంతో వాహనాలను పంపించి వేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐలు నిరంజన్‌రెడ్డి, ప్రసాద్‌రావు, ఎస్ఐ కరీం బందోబస్తు చేపట్టారు. -
మహిళపై టీడీపీ నాయకుడి దాష్టీకం
కళ్యాణదుర్గం: తెలుగుదేశం పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. అధికార పార్టీ నాయకుడి దాష్టీకం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనవద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించండి అని మహిళ కోరడంతో ఆగ్రహించిన నాయకుడు విచక్షణ కోల్పోయి ఊరి మధ్యలో అందరూ చూస్తుండగా ఆమెను కిందపడేసి వివస్త్రను చేశాడు. బాధితురాలు చెప్పు తీసుకుని తిరగబడే సరికి సదరు నాయకుడు పలయానం చిత్తగించాడు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే... నియోజకవర్గంలోని ఓ మండల టీడీపీ మాజీ కన్వీనర్ తను సన్నిహితంగా ఉంటున్న మహిళ వద్ద అప్పు తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వకపోవడంతో సదరు మహిళ రెండు రోజుల కిందట నిలదీసింది. తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించేయాలని డిమాండ్ చేసింది. దీంతో అతను అందరూ చూస్తుండగానే దుర్భాషలాడుతూ ఆమెను ఊరి మధ్యలో కిందపడేశాడు. చీరను లాగి.. జాకెట్ చించి వివస్త్రను చేశాడు. తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లడంతో బాధితురాలు చెప్పు తీసుకుని తిరగబడింది. అంతే ఆ నేత అక్కడి నుంచి పారిపోయాడు. టీడీపీ నేత తీరును ప్రతి ఒక్కరూ అసహ్యించుకున్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా నడి బజార్లో దుశ్వాసనపర్వానికి పాల్పడిన అతడిని తప్పుబట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధిత కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. పోలీసులు సదరు నాయకుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ టీడీపీ ముఖ్యనేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో కనీస విచారణ కూడా చేయకుండా వదిలేశారు. -
గుంటూరులో హెడ్ కానిస్టేబుల్ ఓవరాక్షన్
-
లాఠీ ఝుళిపించిన ఎస్సై
పశ్చిమగోదావరి, నరసాపురం : ఆర్టీసీ బస్సు సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం స్థానిక బస్టాండ్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై టౌన్ పోలీసులు అకస్మాత్తుగా లాఠీలు ఝళిపించడంతో అందరూ విస్తుపోయారు. సమయానికి విద్యార్థులకు బస్సులు అందుబాటులో ఉండటంలేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే టౌన్ ఎస్సై కె.చంద్రశేఖర్ సిబ్బందితో వచ్చి కొందరు ఎస్ఎఫ్ఐ నాయకులను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు పోలీసులతో వాదనకు దిగారు. మేము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటేమమ్మల్ని స్టేషన్‌కు ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నించారు. దీంతో టౌన్ ఎస్సైతో సహా కొంతమంది పోలీసులు సహనం కోల్పోయి లాఠీచార్జికి దిగారు. ఒక్కసారిగా భీతిల్లిన విద్యార్థులు పరుగులు తీశారు. పోలీసు చర్యలతో తేరుకున్న తరువాత భారీ ర్యాలీతో వెళ్లి పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేశారు. దీంతో అదుపులోకి తీసుకున్న విద్యార్థి నాయకులను వదిలిపెట్టడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం విద్యార్థులు ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకు ఫిర్యాదు చేశారు. బస్సుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వైవీ ప్రదీప్, పి.తిరుపతిరావు నాయకత్వం వహించారు. -
ఎస్ఐ ఓవర్‌యాక్షన్ !
అనంతపురం సెంట్రల్: ట్రాఫిక్ ఎస్ఐ రెచ్చిపోయారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ వాహనదారునిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఈ ఘటన మంగళవారం రాత్రి పీటీసీ సమీపంలోని ఫ్లైఓవర్‌పై చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు... అనంతపురంలోని ఆదర్శనగర్‌లో నివాసముంటున్న నారాయణరెడ్డి కుమారుడు లక్ష్మీకాంతరెడ్డి వ్యక్తిగత పనిపై కారులో బయటకు వచ్చారు. రాత్రి 9 గంటలకు పీటీసీ సమీపంలోని ఫ్లైఓవర్‌పై వెళ్తుండగా కారు ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో కొంత ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ఎస్ఐ శేషగిరి అక్కడికి చేరుకుని లక్ష్మీకాంతరెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పొరపాటు జరిగింది. వదిలేయండి అంటూ ప్రాధేయపడినా వినలేదు. జరిమానా వేయడంతో.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిమానా రుసుం చెల్లిస్తానని లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. దీంతో ఎస్ఐ శేషగిరి రెచ్చిపోయాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా భౌతిక దాడికి దిగారు. తాను చేసిన తప్పేమిటంటూ అడుగుతున్నా వినకుండా దాడి చేసినట్లు బాధితుడు వాపోయారు. మనస్థాపానికి గురైన బాధితుడు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఎస్ఐ శ్రీరామ్ రాయబారం ఘటన విషయం ఉన్నతాధికారులకు తెలియకుండా ఉండేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. హుటాహుటిన టూటౌన్ ఎస్ఐ శ్రీరామ్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితునితో చర్చించారు. అతనికి దగ్గర బంధువైన మరో లీడర్ ద్వారా రాజీ చేయించి, వెనువెంటనే డిశ్చార్జి అయ్యేలా రాయబారం నడిపారు. తప్పు చేయనప్పుడు అంత వేగంగా సంప్రదింపులు చేయాల్సిన అవసరం పోలీసులకేముందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మర్యాదగా మాట్లాడుకుందాం... ఫ్రెండ్లీ పోలీసులు అనే పదాలు పేరుకు మాత్రమే అన్న ధోరణి పోలీసుల్లో వ్యక్తమవుతోందని ఈ సందర్భంగా పలు వురు వ్యాఖ్యానించారు. దీనిపై ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణయ్యను వివరణ కోరేందుకు యత్నిం చగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
నందిగామలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు
సాక్షి, నందిగామ : కృష్ణా జిల్లా నందిగామలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రైతు సమస్యలపై మార్కెట్ యార్డు అధికారులతో మాట్లాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వాగ్వివాదానికి దిగి, గొడవ పడ్డారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులైన రైతులు తెచ్చిన సుబాబుల్ కొనుగోలు చెయడానికి మార్కెట్ యార్డులోని అధికారులు నిరాకరించారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు మార్కెట్ యార్డు వద్ద రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. అయినా లాభం లేకపోవడంతో మార్కెట్ యర్డ్లోని సుబాబుల్‌ని రైతులు జగ్గయ్య పేటకు తీసుకెళ్లాలని భావించారు. ట్రాక్టర్లలో సుబాబుల్‌ని తరలిస్తుండగా నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రైవేటు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. రైతులు సుబాబుల్ తరలిస్తున్న ట్రాక్టర్లను నిలిపివేసిన అధికారులు వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడుతుండగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ నాయకులపై మార్కెట్ యార్డు చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు వర్గీయులు మాటల యుద్ధానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. రైతులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ నేతలు స్టేషన్ బయట ఆందోళనకు దిగారు. -
ఎస్సై ఓవరాక్షన్..
సాలూరురూరల్ (పాచిపెంట): పాచి పెంట ఎస్సై సన్యాసినాయుడు ఓవరాక్షన్ కారణంగా ఒక గిరిజనుడు ఆస్పత్రి పాలుకా గా, సంఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల మేరకు.. మాతుమూరు గ్రామానికి చెందిన మరడ రవణమ్మకు కొండతాడూరులో కొంత భూమి ఉంది. ఈ భూమిలో గిరిజనులు, సీపీఎం నాయకులు ఆదివారం ఎర్రజెండాలు పాతారు. దీంతో విషయం తెలుసుకున్న రవణమ్మ తన భూమిలో జెండాలు పాతిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎస్సై సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న పశువుల కాపరి సుర్రు అప్పలస్వామి, స్థానికులు పొడిజన్ని లక్ష్మి, పొడిజన్ని సురేష్, తదితరులను విచారించారు. అయితే వీరు విషయం సక్రమంగా చెప్పకపోవడంతో పశువుల కాపరి అప్పలస్వామిని ఎస్సై కొట్టాడు. అప్పలస్వామి అపస్మారకస్థితికి చేరుకోవడంతో స్థానికులు సాలూరు ఆస్పత్రికి తరలించారు. విధులకు అడ్డుతగిలారు.. ఇదిలా ఉంటే విచారణకు వెళ్లిన తమపై సుర్రు అప్పలస్వామి, పొడిజన్ని లక్ష్మి, పొడిజన్ని సురేష్, చింత సీతయ్యలు ఎదురుదాడికి దిగారని ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. విధులకు ఆటంకం కలిగించడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎస్సై తీరు సరికాదు.. రాయిగుడ్డివలస సర్పంచ్ సీతయ్య విలేకరులతో మాట్లాడుతూ, బాధిత గిరిజనులకు అండగా నిలవాల్సిన ఎస్సై భూకామాంధులకు అండగా నిలుస్తున్నాడని ఆరోపించారు. సీపీఎం నాయకులతో కలిసి గిరిజనులు ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలు పాతారన్నారు. అయితే ఎస్సై భూకామాంధులకు ఒత్తాసు పలుకుతూ అభం..శుభం తెలియని పశువుల కాపరి అప్పలస్వామిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఎస్సై దాడిలో గాయపడిన అప్పలస్వామిని స్థానికులు సాలూరు సీహెచ్‌సీకి తరలించారని తెలిపారు. ఇదిలా ఉంటే సంఘటనా స్థలంలో లేకపోయినా, పరామర్శకు వచ్చాననే అక్కసుతో ఎస్సై తనపై కూడా కేసు నమోదు చేశాడని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సైపై చర్యలు తీసుకోవడంతో పాటు భూమిలేని గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. -
ఆ హీరోయిన్ను భరించటం వల్ల కావట్లేదు!
సాక్షి, సినిమా : మోడల్ కమ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ సమయంలో ఆమె నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. ఆమె మెయింటెనెన్స్ బిల్లు తడిసి మోపెడవుతుండటంతో భరించటం మా వల్ల కాదు బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నారు. స్పోర్ట్బాయే కథనం ప్రకారం... ‘సనమ్ రే’ ఫేమ్ ఊర్వశి ప్రస్తుతం భానుప్రియా అనే ఓ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ ప్రారంభమై కొద్ది రోజులే అవుతోంది. అయినప్పటికీ అప్పుడే ఆమె వ్యవహారంతో యూనిట్ సభ్యులు విసిగిపోతున్నారంట. షూటింగ్ కోసం ఇంటి నుంచి బయలుదేరిన సమయంలోనే ఆమె అసిస్టెంట్లు ఫోన్ ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారంట. అది అంతా ఇంతా కాదు. దాదాపు యూనిట్ సభ్యులకు సరిపడేంత. అందులో ఆమె, సహయక సిబ్బంది కాస్త మాత్రమే తిని.. మిగతాది ఆమె ఇంటికి పంపిచేస్తున్నారంట. ఊర్వశి వ్యవహారం రోజు రోజుకీ శృతి మించిపోతోందని.. షూటింగ్ మీరా రోడ్లో జరిగితే.. ఎక్కడో జూహులో ఉన్న కాస్ట్ లీ రెస్టారెంట్ నుంచి భోజనం ఆర్డర్ చేస్తోందని.. ఈ వ్యవహారంలో ప్రొడక్షన్ మేనేజర్‌తో ఆమె గొడవ పడినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆమెపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. మరీ ఆరోపణలపై హేట్ స్టోరీ-4 బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
చేసినోడు..చూసినోడే కాదు...రాసినోడిదీ తప్పేనట!
ఫ్రెండ్లీ పోలీసింగ్.. పోలీసులు మీకు, సమాజానికి స్నేహితులే.. శాంతిభద్రతల పరిరక్షణలో వారికి సహకరించండి..మీ చుట్టుపక్కల ఏదైనా అన్యాయమో.. అక్రమమో.. నేరమో జరుగుతుంటే వెంటనే వారికి ఫోన్ చేయండి.. వారొచ్చి అడ్డుకుంటారు..మీ వివరాలు గోప్యంగా ఉంచుతారు.. పోలీసు ఉన్నతాధికారులు ఉవాచించే ఈ ప్రకటనలన్నీ ఊకదంపుడు ప్రసంగాలేననిపిస్తోంది.. నిజానికి వారికి అంత పెద్దమనసు లేదనిపిస్తోంది.. ఎక్కడో ఏమో కానీ మన విశాఖ పోలీసులు మాత్రం అలానే ప్రవర్తిస్తున్నారు. నేర సమాచారం ఇచ్చిన వారినే అరెస్టుల పాల్జేస్తున్నారు.. మూడురోజుల క్రితం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టపగలు, నడిరోడ్డుపై జరిగిన ఓ అత్యాచార ఘటన సమాచారం ఇచ్చిన ఆటోడ్రైవర్‌ను అరెస్టు చేశారు. చివరికి ఆ దుస్సంఘటనను కవర్ చేసినా మీడియా ప్రతినిధులను కూడా పిలిపించి వేధింపులకు గురిచేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆడ లేక మద్దెల ఓడు... అవడానికి ముతక సామెతే కావొచ్చు గానీ విశాఖ నగర పోలీసుల పని తీరుకు ఇది సరిగ్గా వర్తిస్తుంది. నగరంలో రోజురోజుకీ పేట్రేగిపోతున్న నేరాలు, ఘోరాలు, దారుణాలను ఏమాత్రం కట్టడి చేయలేని పోలీసులు... వృత్తిరీత్యా ఆయా ఘటనలను కవరేజ్ చేస్తున్న పాత్రికేయులను మాత్రం వేధింపులకు గురి చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... మూడురోజుల కిందట రైల్వేస్టేషన్ సమీపంలో మ తిస్థిమితం లేని యాచకురాలిపై ఓ యువకుడు మిట్టమధ్యాహ్నం అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉ న్న ఓ ఆటో డ్రైవర్ సాక్ష్యాధారాల కోసం సెల్ఫోన్లో చిత్రీ కరించి వెంటనే పోలీసులకు, మీడియా వారికి సమాచా రం అందించాడు. అత్యాచారాన్ని అడ్డుకోకుండా సెల్ఫో న్లో చిత్రీకరించిన అతని వైనంపై విమర్శలు వెల్లువెత్తినా... తాను ఆ సమయంలో అంతకంటే ఏమీ చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు. మద్యం మ త్తులో తెగబడుతున్న ఆ యువకుడిని అడ్డుకోలేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలోనే తాను సెల్ఫోన్లో వీడియో తీశానని చెబుతున్నాడు. ఇప్పుడు ఇ దంతా ఎందుకంటే... వీడియో తీసిన ఆటోడ్రైవర్‌ను స్టేషన్‌కు ఎత్తుకెళ్లిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చే పట్టారు. అక్కడితో ఆగకుండా ఆ అత్యాచార ఫ ుటనను కవర్ చేసిన మీడియా జర్నలిస్టులను సై తం వేధింపులకు గురి చేయడం ఇప్పుడు వివా దాస్పదమవుతోంది. మంగళవారం సాయంత్రం ఆ ఘటన కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ సురేష్ మీడియా ప్రతినిధులకు ఫోన్ చే శారు. ఆ రోజు ఘటన గురించి తమకు మరిన్ని వివరాలు కా వాలని, ఓసారి స్టేషన్‌కు వస్తే మాట్లాడుకుందామని అన్నారు. అడపాదడపా మీడియా ప్రతినిధులు, పోలీసులు ఒకరినొకరు స మాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మామూలే కాబట్టి.. కొంతమం ది ఫొటో జర్నలిస్టులు మంగళవారం రాత్రి ఫోర్త్ టౌన్‌కు వెళ్లారు. ఎస్ఐ ఓవర్‌యాక్షన్ విలేకరులను పిలిచి ఎస్ఐ సురేష్ చేసిన ఓవర్ యాక్ష న్ వివాదాస్పదమవుతోంది. సమాచారం ఇవ్వాల్సిం దిగా రమ్మని సూచించిన ఎస్ఐ తీరా అ క్కడకు వెళ్లిన తర్వాత... విచారణ మా దిరి మాట్లాడటంపై అభ్యంతరాలు వ్య క్తమవుతున్నాయి. ఆ వీడియో మీకు ఎక్కడిది... మీకు ఎవరు పంపించారు.. మీరు ఎవరెవరికి పంపించారు.. అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ చూ సి ఇస్తా అని తీసుకుని.. షేర్ ఇట్తో డేట్ చెక్ చేశాడు.. అక్కడితో ఆగకుండా ఫోన్ సీజ్ చేస్తానంటూ హడావుడి చేశాడు. ఆ ఘటనకు సంబంధించి తెల్లకాగితంపై ఎస్ఐ ఏదేదో రాసుకుని.. కింద సంతకం పెట్టాల్సిందిగా ధొటో జర్నలిస్టులపై ఒత్తిడి తీసుకువచ్చాడు.. ఇదేమిటి.. మాకేం సంబంధం అని మొత్తుకున్నా రాసివ్వాల్సిందేనంటూ ఒత్తిడి చేశాడు. ఆఫీసు వేళల్లో మీరు మమ్మల్ని పిలిచి ఇలా అడగడం సరికాదని ఫొటో జర్నలిస్టులు స్పష్టం చేసి స్టేషన్ బయటకు వచ్చేశారు. అత్యాచార ఘటన వార్తను కవర్ చేసిన ఫొటో జర్నలిస్టులపై ఓ ఎస్ఐ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది. ఆటో డ్రైవర్ శ్రీను అరెస్ట్ సీతమ్మధార (విశాఖ ఉత్తరం): మానవత్వంతో పోలీసులకు సమాచారం ఇచ్చినందుకు ఆటోడ్రైవర్ని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. నగరంలో ఆదివారం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో మతిస్ధిమితం లేని మహిళపై యువకుడు లైంగిక దాడికి దిగిన సంఘటనను వీడియో తీసిన ఆటో డ్రైవరు శ్రీనును నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... పట్టపగలే నడిరోడ్డుపై శివ అనే యువకుడు లైంగిక దాడికి దిగిన దారుణాన్ని వీడియో తీసి పలువురికి పంపించినందుకు పోలీసులు ఆటోడ్రైవర్‌పై 354 (సి) సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బుధవారం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆటోడ్రైవరు శ్రీనును వేరే చోట ఉంచినట్లు సమాచారం. -
నంద్యాలలో పోలీసుల ఓవర్ యాక్షన్!
-
మంత్రిగారి ఓవరాక్షన్
-
రియల్ ఎస్టేట్ గొడవలల్లో ఎస్ఐ ఓవరాక్షన్
-
పెళ్లి ఫ్లెక్సీల్లో వైఎస్జగన్ ఫోటో పెట్టారని..
-
వైజాగ్‌లో పోలీసుల ఓవరాక్షన్
-
ఖాకీ జులుం
సివిల్ కేసులో తలదూర్చిన ఎస్ఐ శ్రీరామ్‌శ్రీనివాస్ టీడీపీ నాయకుల తరఫున వత్తాసు.. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కుటుంబంపై హుకుం రాజీకి రాకుంటే చంపుతామంటూ బెదిరింపులు విచారణ పేరుతో మహిళా ఎంపీటీసీపై దూషణ బంధువును పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చుకెళ్లిన వైనం న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామన్న బాధితులు రాయదుర్గం అర్బన్ : అధికార తెలుగుదేశం పార్టీ నేత మెప్పు కోసం బొమ్మనహాళ్ ఎస్ఐ శ్రీరాంశ్రీనివాస్ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలి కుటుంబంపై జులుం ప్రదర్శించారు. సివిల్ కేసులో తలదూర్చటమే కాకుండా.. ఎంపీటీసీ కుటుంబ సభ్యులను అవమానకర రీతిలో దూషించటమే కాకుండా భయభ్రాంతులకు గురి చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీసే.. తన మాట వినకుంటే చంపేస్తానని బెదిరించారు. ఎస్ఐ ఆగడాలపై బాధిత నేమకల్లు ఎంపీటీసీ సభ్యురాలు తులసమ్మ, భర్త, మాజీ ఎంపీటీసీ పరమేశ్వరప్ప, ఆయన తల్లి గంగమ్మ, అన్న గాదిలింగ, మామలు నాగేంద్రప్ప, బసప్ప, బంధువు గోవిందప్ప, వీరి అనుచరుడు బోయ రామాంజనేయులు తదితరులు మంగళవారం రాయదుర్గంలో మీడియా ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయకపోతే సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నకిలీ డాక్యుమెంట్లతో దౌర్జన్యం పరమేశ్వరప్ప తండ్రి కురుబ హనుమంతప్ప 1994 మార్చి 16న నేమకల్లు గ్రామ పొలం సర్వే నంబర్ 223/2లో విస్తీర్ణం 4.18 ఎకరాలు పైకి 2.09 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. 2008లో ఈయన మరణించాడు. ఇదే సర్వేనంబర్ తూర్పు దిశన ఉన్న 2.09 ఎకరాల భూమిని టీడీపీ నేత టీవీఎస్ కాంతారావు సోదరుడు అప్పారావు పేరిట 2014లో కొనుగోలు చేశారు. ఈ భూమిలో కాంతారావు క్రషర్ ఏర్పాటు చేసుకున్నాడు. కురుబ హనుమంతప్ప 2.09 ఎకరాల భూమిని కూడా తనకు అమ్మినట్లు కాంతారావు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆక్రమించుకున్నాడు. సంతకం కాకుండా వేలిముద్ర అందులో ఉండటంతో ఇదంతా చీటింగ్ అని, ఫోర్జరీ సంతకం చేశారని పరమేశ్వరప్ప 2016 అక్టోబర్ 17న బొమ్మనహాళ్ పోలీస్‌స్టేషన్‌లో కాంతారావు, ఆయన సోదరుడు అప్పారావులపై ఫిర్యాదు చేయడంతో క్రైం నంబర్ 69/16, సెక్షన్ 420,506 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. అయినప్పటికీ వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో కాంతారావు సోదరులు ఈ నెల 16న పరమేశ్వరప్ప పొలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి తమ క్రషర్ కూలీలకు షెడ్లు వేయడానికి ఈ నెల 16న గుంతలు తీయించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పరమేశ్వరప్పను ‘ప్రభుత్వం మాది, మీ భూమిని అక్రమించుకుంటాం, మీ దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ కాంతారావు దౌర్జన్యం చేయడంతో పాటు ఇంకోసారి పొలంలోకి వస్తే చంపేస్తామంటూ బెదిరించాడు. తమ పొలంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ పరమేశ్వరప్ప కుటుంబ సభ్యులపై కాంతారావు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ క్రమంలో ‘రూ. 6లక్షలు ఇప్పిస్తా... భూమిని వదిలిపెట్టాలం’టూ ఎస్ఐ బెదిరించాడని పరమేశ్వరప్ప తెలిపారు. ప్రస్తుతం ఎకరా భూమి అక్కడ రూ. 10లక్షలు ఉందని తెలిపినప్పటికీ, పట్టించుకోవడం లేదని, కాంతారావు కంటే కూడా ఎస్ఐ వేధింపులే అధికమయ్యాయని వాపోయారు. న్యాయం కోసం ఎస్పీకి ఫిర్యాదు కాంతారావు ఫిర్యాదు నేపథ్యంలో ఎస్ఐ శ్రీరాం శ్రీనివాస్ తమను బెదిరిస్తుండటంతో తమకు న్యాయం చేయాలంటూ ఈ నెల 21న జిల్లా ఎస్పీకి తాము ఫిర్యాదు చేసినట్లు మాజీ ఎంపీటీసీ పరమేశ్వరప్ప, ఎంపీటీసీ తులసమ్మ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీరాం శ్రీనివాస్ సోమవారం రాత్రి 8 గంటల సమయంలో తాను లేని సమయంలో ఇంటికి వచ్చి అన్న కూతురు పవిత్ర భోజనం చేస్తుంటే ప్లేటును బూటు కాలితో తన్నాడని, తన భార్య తులసమ్మను బండబూతులు తిట్టాడని పరమేశ్వరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాతో పెట్టుకుంటాడా.. చంపేస్తా.. నా కొడుకును.. ఎస్పీ వద్దకు వెళతాడా, నేనేమిటో చూపిస్తా ...నేననుకుంటే మీరు ఉంటారా.. అంటూ ఇల్లంతా బూటుకాళ్లతోనే వెదికి, చివరికి క్రైం నంబర్ 03/2017 సెక్షన్ 447,427,506 రీడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసు(కాంతారావు ఫిర్యాదు)లో ముద్దాయిలుగా ఉన్నారని, 15 రోజుల్లోగా స్టేషన్లో హాజరుకావాల’ని హెచ్చరించినట్లు తెలిపారు. మంగళవారం ఉదయాన్నే ఎస్ఐ మరోసారి తమ ఇంటికి వచ్చి అల్లుడు వన్నూరుస్వామిని ఈడ్చుకెళ్లారని, అతడిని ఏం చేస్తారోనన్న భయం వెంటాడుతోందని విలపించారు. విచారించేందుకు వెళ్లా – ఎస్ఐ శ్రీరాంశ్రీనివాస్ ఈ విషయంపై సాక్షి ఎస్ఐ శ్రీరాంశ్రీనివాస్ను వివరణ కోరగా, కాంతారావు ఫిర్యాదు మేరకు తాను విచారించేందుకు గ్రామానికి వెళ్ళానని, మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించలేదని తెలిపారు. ========================== -
కర్ణాటక పోలీసుల దాష్టీకం
- ఒకరికి బదుల మరొకర్ని చితకబాదిన వైనం - ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన ---------------------------------------------------- గుంతకల్లు : విచారణ పేరుతో ఒకరికి బదుల మరొకర్ని చితకబాదిన కర్ణాటక పోలీసుల దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు అనంతపురం జిల్లా గుంతకల్లు శివార్లలోని ఆలూరు రోడ్డు కాల్వగడ్డ ఏరియాలో నివాసముంటున్న షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి తాపీ మేస్త్రీ కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక పాతబస్టాండ్ ఏరియాలోని మెకానిక్ షెడ్డులో బైక్‌ను రిపేరి చేయించుకుంటుండగా అదే సమయంలో టాటాసుమోలో వచ్చిన కర్ణాటక రాష్ట్రం బళ్లారి కౌల్‌బజార్ ఠాణా పోలీసులు ‘అబ్దుల్లా అంటే నువ్వేనా’ అని అడిగారు. ఔనని సమాధానం చెప్పేలోగానే లాఠీలతో చితకబాదేశారు. ‘నన్ను ఎందుకు కొడుతున్నారని’ అతను అడుగుతున్నా పట్టించుకోని పోలీసులు ఏకంగా అతని చేతికి సంకెళ్లు వేసి తమ వెంట పట్టణ శివార్లలోని బళ్లారి చౌరస్తాలోకి పిల్చుకెళ్లారు. ఆ తరువాత అబ్ధుల్లాను సెల్‌ఫోన్ కెమెరాలో బంధిచి వాట్సప్ ద్వారా బళ్లారి కౌల్‌బజార్ పోలీసుస్టేషన్‌కు నిర్ధరణ కోసం పంపగా... అసలు వ్యక్తి అతను కాదని అక్కడి నుంచి సమాధానం రావడంతో వదిలేశారు. తన వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కొని సిమ్‌కార్డు(నెంబర్: 8341085352) తీసుకువెళ్లారని బాధితుడు ఆరోపించాడు. గుంతకల్లు మండలం నరసాపురం కొట్టాలలో నివాసముంటున్న అబ్ధుల్లా అనే వ్యక్తి(అంత్రాలు వేస్తూ జీవించేవాడు)పై బళ్లారి కౌల్‌బజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు కావడంతో అతని కోసం వచ్చి తనను తీసుకువెళ్లి చితకబాదారని తాపీ మేస్త్రీ అబ్ధుల్లా బోరుమన్నాడు. తల, వీపు, ముఖంపై బలంగా పిడిగుద్దలు కురిపించారని కన్నీటిపర్యంతమయ్యాడు. తనకు జరిగిన అన్యాయంపై గుంతకల్లు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు అబ్ధుల్లా విలేకరులకు గురువారం తెలిపారు. -
మేజర్లైనప్పటికీ జంటను విడదీసేందుకు కుట్ర
-
వైఎస్సార్ జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్
-
గొంతెత్తితే ఉక్కుపాదం
తుళ్లూరు రూరల్ : ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన రాజధాని ప్రాంత రైతుల్లో కొందరు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఉద్దండ్రాయునిపాలెంలోని పాఠశాలలో గురువారం సాదాసీదాగా సమావేశం కావాలని భావించారు. ఈ విషయం తెలియడంతో సర్కారు వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తాజాగా రాజధాని గ్రామాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదీ అసలు కథ.. రాజధాని గ్రామాల పరిధిలో ఉన్న 5,524 ఎకరాల లంక, అసైన్డ్, దేవాదాయ భూములకు సంబంధించిన రైతులకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించలేదు. ప్లాట్లు కూడా ఇచ్చేది లేదని అధికారులు తేల్చిచెప్పేశారు. ఉన్న గ్రామాలను కూడా తొలగించి సింగపూర్ సంస్థకు అప్పగిస్తారని తెలిసి తుళ్లూరు మండలం ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు, సంబంధిత అధికారులను కలిసి పలుమార్లు వివరించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమ వేదనను పట్టించుకోకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక రైతులంతా భవిష్యత్ ప్రణాళికపై చర్చించుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు ఉద్దండ్రాయునిపాలెం గ్రామాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ మేరకు కుల వివక్ష పోరాట సమితి నాయకుల సహకారంతో గురువారం సాయంత్రం ఉద్దండ్రాయునిపాలెంలో సమావేశానికి సిద్ధమయ్యారు. ఎలాంటి హడావుడి లేకుండా పాఠశాల ఆవరణలోని అరుగుపై కూర్చొని చర్చించుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియడంతో పోలీసులకు హుకుం జారీ చేశారు. రైతులు నోరెత్తకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైతే అక్రమ కేసులు పెట్టి లోపలకు నెట్టాలని గట్టిగా చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటి వరకు తహశీల్దార్ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా, ఉన్నట్లుండి గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉందని తుళ్లూరు ఎస్ఐ ప్రకటించారు. బిత్తరపోయిన గ్రామస్తులు, మహిళలు.. ‘ఇక్కడ ఏం జరుగుతుందని పోలీసులు హడావుడి చేస్తున్నారు? ఇదేం అన్యాయం. మాట్లాడుకోవటానికి కూడా స్వేచ్ఛ లేదా... అంటూ పోలీసులపై తిరగబడ్డారు. పలువురి అరెస్ట్ స్థానికుల ఆవేదనను పోలీసులు పట్టించుకోలేదు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. గ్రామస్తుల వినతి మేరకు వచ్చిన రైతు సంఘం నాయకులు గద్దె చలమయ్య, జొన్నా శివశంకర్, కులవివక్ష పోరాట సమితి నేతలు మాల్యాద్రి, కృష్ణమోహన్, ఎం.రవి, నవీన్‌ప్రకాష్, వీర్ల అంకయ్య తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ‘మా గ్రామంలో కూర్చొని మాట్లాడుకోవటానికి మీ అనుమతి కావాలా..’ అంటూ మహిళలు ఎదురు తిరిగారు. అదుపులోకి తీసుకున్న వారిని విడిచిపెట్టకపోతే పోలీసు వాహనాలు వెళ్లనీయబోమని మహిళలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న నేతలను వదిలేసి వెళ్లిపోయారు. -
‘తెలుగు తమ్ముడి’ హల్చల్
నిబంధనలు మీరి కారుతో చొరబడిన చోటా నేత కానిస్టేబుల్ అడ్డుచెప్పినా బేఖాతర్ కొల్లిపర(గుంటూరు): అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు నిబంధనలు పాటించాల్సిన అవసరం లేనట్టుంది. అధికారులు నిబంధనలను గుర్తు చేస్తే వాటిని తుంగలో తొక్కేయడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తుండడం రివాజుగా మారింది. ఇందుకు మండలంలోని వల్లభాపురం దక్షిణ ఘాట్ వద్ద ఆదివారం జరిగిన ఉదంతమే ఉదాహరణ. ఘాట్ల వద్దకు పుష్కరాల ప్రారంభం సందర్భంలో తొలి రెండు రోజులు వాహనాలను అధికారులు అనుమతించలేదు. కరకట్ట మీదనే వాహనాలు నిలిపి వేసి నడుచుకుంటూ ఘాట్ల వద్దకు వెళ్లాల్సి ఉంది. పుష్కరాలకు భక్తుల తాకిడి అంతంత మాత్రంగానే ఉండడంతో అధికార పక్ష నేతల ఒత్తిడితో రెండు రోజుల అనంతరం ఆంక్షలను సడలించారు. ఘాట్ల సమీపం వరకు వాహనాలను అనుమతించారు. ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో వాహనాల రాకపోకలపై ఘాట్ల వద్ద పోలీసులు ఆంక్షలను విధించారు. సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మండలానికే చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన వాహనంలో ఆయన అనుయాయులు వల్లభాపురం ఘాట్లోనికి వెళ్లేందుకు రాగా, విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ వాహనాలు వెళ్లేందుకు వీలులేదని చెప్పాడు. అయినా కారులో ఉన్న వారు వినకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. కారు అద్దాన్ని చేతితో కొట్టి నిలిపివేసేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించగా, కారుకు వెనుక ఉన్న అద్దం పగిలింది. కానిస్టేబుల్ చేతికి రక్తగాయమైంది. కారులోని వారు దిగి పోలీసులతో ఘర్షణ పడ్డారు. రూ. 10 వేలు డిమాండ్.. అద్దం పగిలినందుకు గాను నాయకులు తమకు రూ. 10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఘాట్ బందోబస్తు ఇన్చార్జి అయిన సీఐ బెల్లం శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులోని వారికి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినకపోవడంతో పోలీసులు రూ. 10 వేలు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. చివరకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. డబ్బులు వద్దని, కానిస్టేబుల్‌తో క్షమాపణ చెప్పించాలని సూచించారు. అప్పటికే ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో గాయానికి కట్టుకట్టించుకుంటున్న కానిస్టేబుల్‌ను పిలిపించి, తమ అనుయాయులకు క్షమాపణ చెప్పించడం కొసమెరుపు. -
పోలీసుల ఓవరాక్షన్‌తో ఇక్కట్లు
విజయవాడ(భవానీపురం) : పోలీసుల ఓవరాక్షన్‌తో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. భవానీపురం స్వాతి సెంటర్ దగ్గర బస్సు దిగిన యాత్రికులు ఎదురుగా కనించే భవానీఘాట్కు చేరుకోగానే పోలీసులు వారిని నేరుగా ఘాట్‌లోకి అనుమతించకుండా అటు పొమ్మని పంపించేస్తున్నారు. దీంతో భక్తులు కొంచెం దూరం నడిచివెళ్లి అడ్డదారిలో ఘాట్‌కు చేరుకుంటున్నారు. ఈ అడ్డదారంతా మట్టి, చెత్తాచెదారంతో ఉండటంతో పడుతూ లేస్తూ ఘాట్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. పున్నమి ఘాట్‌లో సజావుగా రాకపోకలు సాగిస్తున్న భక్తులకు పోలీసులు బారికేడ్లు అడ్డంపెట్టి ఇబ్బందులకు గురిచేశారు. ప్లాట్‌ఫాంపై బారికేడ్లు పెట్టి పక్కన చిన్న దారి వదిలి అందులోనించి వెళ్లమని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. పోలీసుల ఓవరాక్షన్‌కు కొందరు ఎదురు తిరగడంతో ముందు వారితో వాగ్వాదానికి దిగిన పోలీసులు తరువాత దూకుడు తగ్గించి అడ్డంగా పెట్టిన బారికేడ్లను తొలగించారు. -
పాస్ ఉన్నా.. నో ఎంట్రీ
సాక్షి, విజయవాడ : ఒక వైపు ట్రాఫిక్ ఆంక్షలు... మరో వైపు అన్ని చోట్ల దారి మళ్ళింపులు... ఇంకో వైపు ఇతర జిల్లాల నుంచి బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు వెరసి సామాన్యులతో పాటు అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్యూటీ పాస్‌లు ఉన్నప్పటికీ, ఉన్నతస్థాయి అధికారులు అయినప్పటికీS ఇతర జిల్లాల పోలీసులకు ప్రాధాన్యం తెలియకపోవటంతో రోజు ఏదో ఒక చోట గందరగోళం నెలకొంటోంది. కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఈవో సూర్య కుమారి వాహనాన్ని కొండ కింద నిలిపివేసి అనుమతి లేదనడంతో ఆమె కొండపైకి నడిచివెళ్ళారు. నగర కమిషనర్ వీరపాండియన్ వాహనాన్ని , పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ బి. రాజశేఖర్ వాహనాన్ని కూడా పోలీసులు అడ్డుకోవడంతో సమస్య తలలెత్తింది. కృష్ణా పుష్కరాలకు కోసం రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు, కర్ణాటక, ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నాయి. ఈ క్రమంలో నగరంలో పనిచేసే ఎక్కువ మంది కానిస్టేబుల్స్‌ను కమిషనరేట్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో విధులకు కేటాయించారు. నగరంలో వారధి నుంచి కృష్ణలంక వరకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు, వారధి నుంచి బెంజ్ సర్కిల్ ఆటో నగర్, రామవరప్పాడు తదితర ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర పోలీసులు ఉన్నారు. అలాగే కర్ణాటక , ఒడిస్సా రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులు నో ట్రాఫిక్ జోన్ వద్ద ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడే సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ఎవరు వీఐపీనో, ఎవరు కాదో బయటి ప్రాంత పోలీసులకు తెలియడం లేదు. ప్రతి వాహనాన్ని ఆపడమే తమ డ్యూటీగా భావిస్తున్నారు. మేం ఫలానా అని చెబుతున్నా వినడం లేదు. కొందరు పోలీసులు మరీ అత్యుత్సాహంగా పాస్‌లు ఉన్న కార్లు, ఇతర వాహనాలను కూడా అడ్డుకుంటున్నారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదులు కొందరు ప్రముఖులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇదే విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మొదలుకొని డీజీపీ నండూరి సాంబశివరావు, చివరకు మంత్రులు, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి పోలీసు ఆంక్షల విషయాన్ని తీసుకెళ్ళారు. డీజీపీ, హోంమంత్రి మాట్లాడుతూ ఆంక్షలు సడలించామని ప్రకటించినా అవేవీ ఆచరణలోకి రాలేదు. ఈక్రమంలో ఐఏఎస్ అధికారులు పోలీసుల తీరుపై నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఐఏఎస్‌లకు కలెక్టర్ పేరిట జారీచేసిన పాస్‌లు అనుమతించకపోవడంతో కలెక్టరు బాబు, సీపీ సవాంగ్‌తో మాట్లాడారు. -
పోలీసుల అత్యుత్సాహం
– వైఎస్సార్సీపీ నేతల ముందస్తు అరెస్ట్ – హోదాపై ప్రశ్నిస్తారనే దురుద్దేశంతోనే.. అనంతపురం సెంట్రల్ : జిల్లా కేంద్రంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ముందస్తు అరెస్ట్‌ల పేరుతో శనివారం ఉదయమే వైఎస్సార్సీపీ నేతలను త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ధర్మవరం, బుక్కరాయసముద్రం మండలాల్లో పర్యటించనున్న సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురావడంపై ఒత్తిడి పెంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విద్యార్థి, యువజన విభాగం నాయకుల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలపాలని భావించారు. అందులో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఆలూరు సాంబశివారెడ్డి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. విషయం తెలుసుకున్న త్రీటౌన్ సీఐ గోరంట ్లమాదవ్, శింగనమల ఎస్ఐ హమీద్‌ఖాన్ అక్కడికి చేరుకుని నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినదించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై ముఖ్యమంత్రిని నిలదీస్తారనే ఈ అరెస్ట్‌లు చేసినట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండిపరుశురాం, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నగర అధ్యక్షులు మారుతీనాయుడు, అధికారప్రతినిధి పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు రఫీ, నాయకులు రాఘవేంద్ర, రమణ, పురుషోత్తం, నూర్‌బాషా, సాకేనవీన్ తదితరులు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు.