
ఏలూరు /కాళ్ల: కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహంతో కేరింతలు కొడుతున్న వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో పలువురు గాయపడిన సంఘటన మండలంలోని సీసలిలో జరిగింది. సోమవారం రాత్రి మైక్‌లో పాటలు పెట్టుకుని ఆనందంతో గడుపుతున్న వారి వద్దకు కాళ్ల ఎస్సై రాజ్‌కుమార్ సిబ్బందితో వచ్చి మైక్ నిలుపుదల చేసి వెంటనే వెళ్లిపోవాలని కోరారు. ఈ సందర్భంగా వాగ్వివాదం జరగడంతో పో లీసులు లాఠీలకు పని చెప్పారు. డీజే సౌండ్ సిస్టం యజమాని మత్తి శాంతారావు, భూపతి ఆదాం, నర్శింహులు, జె.శ్యామ్యూల్, గంటా లాజర్ తదితరులు గాయపడ్డారు. తీవ్ర గాయాలైన శాంతారావు, ఆదాంలను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించి పోలీసులు చికిత్స చేయిస్తున్నారు.
రాజీకోసం పోలీసుల యత్నాలు
తాము రికార్డింగ్ డాన్సులు, అసభ్యకర నృత్యాలు వంటివి ఏవీ చేయలేదని, దైవ ప్రార్థనలు చేసి భక్తి గీతాలాపన చేసుకుంటున్నామని, సమయం అయిపోయింది వెళ్లిపోండని చెబుతూనే ఎస్సై రాజ్‌కుమార్, పోలీసులు లాఠీలతో తీవ్రంగా కొట్టారని బాధితులు శాంతారావు, ఆదాం తదితరులు వాపోయారు. దళితులపై జరిగిన దాడికి సంబంధించి భీమవరం రూరల్ సీఐ సునిల్‌కుమార్ రాజీ కుదుర్చుతున్నారని బాధితులు తెలి పారు. తన చేతి ఎముక విరిగిపోవడంతో స్టీల్ రా డ్డు వేసి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, అయితే షుగర్ 360 ఉన్నందున ఆపరేషన్ కష్టమని, సిమెంట్ పోత పోశారని బాధితుడు శాంతారావు చెప్పారు. ఆదాంకు మోకాలుపై కట్టుకట్టారు. ఎక్స్‌రే తీసి ఎముకకు దెబ్బతగిలిందేమోనని పరీ క్షించారని చెప్పారు. బాధితుల్ని దళిత పేటకు చెందిన పలువురు పరామర్శించారు. ఎమ్మెల్యే వీవీ శివరామరాజు చికిత్స పొందుతున్న బాధితుల్ని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment