సాక్షి, చిత్తూరు: విచక్షణ కోల్పోయిన ఓ టీడీపీ నేత.. వార్డు వాలంటీర్‌పై దాదాగిరికి పాల్పడ్డాడు. సహాయక కార్యక్రమానికి అడ్డు తగులుతూ.. ఓవరాక్షన్ చేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని వడమాలపేట మండలం లక్ష్మీపురంలో టీడీపీ నేత ధనుంజయులు నాయుడు తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెడ్‌జోన్ పరిధిలో ప్రజలకు ఎమ్మెల్యే రోజా వార్డు వాలంటీర్ల ద్వారా గురువారం కూరగాయలు, నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తన అనుమతి లేకుండా నిత్యావసరాలు పంచుతావా అంటూ వాలంటీర్‌పై టీడీపీ నేత ధనుంజయులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బండ బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించాడు. టీడీపీ నేత ప్రవర్తనపై వాలంటీర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధనుంజయులుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment