
సాక్షి, తిరుపతి: లోకేష్ పీఏపై వచ్చిన అభియోగాలు పక్కదారి పట్టించేందుకే నారీ సంకల్ప దీక్ష పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ మేరకు రోజా మీడియాతో మాట్లాడుతూ.. 'టీడీపీ హయాంలో మహిళలపై అనేక దాడులు జరిగాయి. తాజాగా విజయవాడలో టీడీపీ నాయకుడి వేధింపుల వల్ల జరిగిన ఓ ఘటనలో కూడా ఆడపిల్ల చనిపోతూ క్షోభ పడింది. టీడీపీ శ్రేణులు నారీ దీక్ష వినోద్ జైన్ ఇంటి ముందు చేయాలి.
నారీ నరకాసురులు ఎక్కువైపోయారు. కత్తెర పట్టుకుని తిరిగిన టీడీపీ మహిళా నేతలు ఇప్పుడు ఎక్కడకు వెళ్లారు. తెలుగు మహిళలు ఇపుడు ఎక్కడున్నారు. టీడీపీ హయాంలో మహిళలపై ఎన్నో అకృత్యాలు, అత్యాచారాలు జరిగాయి. మహిళా సంక్షేమం కోసం పనిచేస్తోన్న ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆడపిల్లకు అన్యాయం జరిగితే సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆడిబిడ్డలకు అన్యాయం జరిగితే సీఎం జగన్ ఊరుకోరు' అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.
చదవండి: (కేంద్రం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం: విజయసాయిరెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment