పూతలపట్టు: గ్రామానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి గ్రామంలో ఎవరూ ఉండకూడదని స్థానిక టీడీపీ నేతలు ప్రజలను భయాందోళనకు గురి చేసి ఇళ్లకు తాళాలు వేయించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని పేట అగ్రహారం పంచాయతీలో జరిగింది.
అయితే, గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు బుధవారం పేట అగ్రహారం పంచాయతీలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఇంటింటికీ ఎమ్మెల్యే వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తుండటాన్ని స్థానిక టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజలను ఎమ్మెల్యే కలవకుండా చేయాలని పంచాయతీలోని 5 గ్రామాల్లో ప్రజలంతా తాళాలు వేసుకుని వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు.
తాళాలు వేసుకుని వెళ్లకుంటే అంతు చూస్తామని తీవ్రంగా భయపెట్టారు. దీంతో పల్లెల్లో ఒకటి రెండు ఇళ్లు మినహా మిగిలినవారంతా భయపడి తాళాలు వేసుకుని పక్క గ్రామాలకు, పొలాల వద్దకు వెళ్లిపోయారు. పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే ఏం జరిగిందని అధికారులను ప్రశ్నించారు. ఎవరూ ఉండకూడదని టీడీపీ నాయకులు భయపెట్టడంతో జనం తాళాలు వేసుకుని వెళ్లారని అధికారులు చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేట అగ్రహరంలో 498 మంది లబ్ధిదారులకు రూ.2.15 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఏపీకి మరో జాతీయ అవార్డు
Comments
Please login to add a commentAdd a comment