Gadapa Gadapaki Mana Prabhutvam
-
బంటుమిల్లి గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం
-
చంద్రగిరి మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న మంత్రి రోజా
-
కృష్ణ సముద్రం సచివాలయం పరిధిలో మంత్రి రోజా పల్లెనిద్ర
-
రాజోలు నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
స్పీడ్ పెంచే సమయం వచ్చింది..సీఎం వైఎస్ జగన్ మాతో చెప్పిన అంశాలు ఇవే
-
Why not 175/175 for YSRCP : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి పార్టీ నేతలకు సూచించారు. 175కి 175 సీట్లు గెలవడం అసాధ్యం ఏమీ కాదని, కచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్. ఈరోజు (మంగళవారం) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ఈ మేరకు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కో-ఆర్డినేటర్లు, పార్టీ రీజినల్ ఇంచార్జులు హాజరయ్యారు. మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చింది ‘ఇప్పటివరకూ మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాలు మరో ఎత్తు. వచ్చే 6 నెలలు ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యం. మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చింది. మన పార్టీ, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన చూశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఒంటరిగా పోటీ చేయలేక ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయి. మన పార్టీ, మన ప్రభుత్వం పట్ల సానుకూల అంశం చూశాం. ఇదే ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేయాలి’ అని సూచించారు సీఎం జగన్. ‘అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలి. మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులమే. టికెట్లు రానంత మాత్రాన నిరాశ వద్దు. కొందరికి టికెట్లు ఇవ్వొచ్చు.. మరికొందరికి ఇవ్వకపోవచ్చు. టికెట్లు రాని వారికి మరో అవకాశం కల్పిస్తాం’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం చేపట్టబోతున్నాం ప్రజల్లో ఎవరికి ఇస్తే కరెక్ట్ అనే ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవచ్చు. టికెట్ ఇవ్వనంత మాత్రాన వాళ్లు నా వాళ్లు కాకుండాపోరు. టికెట్లపై ప్రతి ఒక్కరూ నా నిర్ణయాలను పెద్ద మనసుతో స్వాగతించాలి. టికెట్లు రాని వారికి మరొక అవకాశం కల్పిస్తాం. లీడర్, పార్టీ మీద నమ్మకం ఉండాలి. సర్వేలు కూడా తుది దశలోకి వస్తున్నాయి. చివరి దశ సర్వేలు కూడా జరుగుతాయి. ప్రజల్లో ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు. ప్రతి ఒక్కరూ ప్రజలతో మమేకమై ఉండాలి. వచ్చే నెలల్లో చేపట్టే కార్యక్రమాలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం చేపడతాం’ అని తెలిపారు సీఎం జగన్. మొత్తం ఐదు దశల్లో జగనన్న సురక్ష కార్యక్రమం జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల చాలా పాజిటివ్ వచ్చింది. దాదాపు 98 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చాం. అర్హులకు అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేశాం.ఇప్పుడు ఆరోగ్య సురక్ష చేపడుతున్నాం. ఆరోగ్య పరంగా ప్రతి ఇంటిని జల్లెడ పడతాం. ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తాం. గుర్తించిన వారికి మెరుగైన చికిత్సలు అందిస్తాం. విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో చేయూతనిస్తాం. ఇందులో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులను మమేకం చేస్తాం.మొత్తం ఐదు దశల్లో జగనన్న సురక్ష కార్యక్రమం. తొలి దశలో వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారు.రెండో దశలో ఏఎన్ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి పరీక్షలు చేయడానికి వెళ్తారు. మూడో దశలో వాలంటీర్లు, గృహ సారథులు ప్రజా ప్రతినిధులు క్యాంపు వివరాలు తెలియజేస్తారు. నాల్గో దశలో క్యాంపులను ఏర్పాటు చేస్తారు. ఐదో దశలో అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి వారికి నయం అయ్యే వరకూ చేయూతనిస్తారు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష
-
తేటగుంటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్
-
గడప గడప వద్దే సమస్యల పరిష్కారం
-
అర్ధరాత్రి గడప గడపకు నిర్వహించిన ఎమ్మెల్యే విష్ణు
-
డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఏం చేసాడో చూడండి
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్
-
గడప గడపకు మన ప్రభుత్వం...ఇంటింటికి వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు
-
ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు
-
ఆత్మకూరులో గడప గడపకు మన ప్రభుత్వం
-
ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గడప గడపకు మన ప్రభుత్వం
-
ఆంధ్రప్రదేశ్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాని
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
-
ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రతి గడప పులకరింపు
-
AP: గడపల్లో ఘన స్వాగతం
సాక్షి, అమరావతి: ఓట్లు దండుకుని మొహం చాటేసిన మనుషులనే ఇన్నాళ్లూ చూశాం! ఎన్నికలు ముగియగానే మేనిఫెస్టోను మాయం చేసి చెత్తబుట్ట పాలు చేసిన పార్టీల గురించే మాకు తెలుసు! అధికారం చేపట్టాక ప్రజా సమస్యలను గాలికి వదిలేసి గ్రామాల వైపు తిరిగి చూడని నేతల పాలనలో దశాబ్దాల పాటు నలిగిపోయాం! మళ్లీ ఎన్నికలు వస్తే గానీ మా గుమ్మం తొక్కని నాయకులతో విసిగిపోయాం! అలాంటిది.. చరిత్రలో తొలిసారిగా 99 శాతం హామీలను నెరవేర్చి చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో మా గుమ్మం వద్దకు వస్తున్న ప్రజా ప్రతినిధులను ఇప్పుడే చూస్తున్నాం..! ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ఇంకా ఏమైనా సమస్యలున్నాయా?.. ఆశీర్వదించండంటూ ఆత్మీయంగా గడప గడపనూ పలుకరిస్తున్న నాయకులను చూడటం ఇదే మొదటిసారి అని రాష్ట్ర ప్రజానీకం పేర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంతో ప్రతి గడప పులకరిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ నెల 20వతేదీ నాటికి ఎమ్మెల్యేలు 83,83,908 గృహాలను సందర్శించారు. ఆయా కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేకూర్చిన ప్రయోజనాలను వివరించి వారి ఆశీర్వాదాలను పొందారు. రాష్ట్రంలోని మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకుగానూ ఇప్పటివరకు ఎమ్మెల్యేలు 9,316 సచివాలయాలను సందర్శించారు. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా సచివాలయాల వారీగా పర్యటిస్తూ ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలను కలుసుకుంటున్న ఎమ్మెల్యేలు ఆయా కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన మేలును వివరిస్తూ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? అని ఆరా తీస్తూ ఆయా కుటుంబాలతో టిక్ పెట్టిస్తున్నారు. ప్రాధాన్యత పనులను గుర్తించి నిధులు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం మేర వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. నవరత్నాల్లో భాగంగా కులమతాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ పారదర్శకంగా, సంతృప్త స్థాయిలో ప్రయోజనాలను అందించింది. ఏటా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి ఆయా పథకాల కింద లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తోంది. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులంతా ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలను కలుసుకునేలా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గతేడాది మే 11వ తేదీన ప్రారంభించింది. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన ప్రయోజనాలను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖలను అందజేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే సచివాలయాల పరిధిలో రెండు రోజుల పాటు పర్యటించడంతో పాటు స్థానికంగా ప్రజలకు అవసరమైన, ప్రాధాన్యత కలిగిన పనులను గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరు చేస్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో రూ.20 లక్షల చొప్పున అత్యంత ప్రాధాన్యత పనులను గుర్తించి వెంటనే మంజూరు చేస్తున్నారు. సచివాలయాలవారీగా నివేదికలు సిద్ధం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ నెల 20వతేదీ వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు పాల్గొన్నారనే వివరాలతో సచివాలయాలవారీగా నివేదికను ప్రణాళికా శాఖ రూపొందించింది. ఇప్పటి వరకు ఎన్ని గృహాలను సందర్శించారు? సచివాలయాల వారీగా ఎన్ని ప్రాధాన్యత పనులను గుర్తించారు? ఎన్ని పనులకు నిధులు మంజూరు చేశారు? ఎన్ని ప్రారంభమయ్యాయి? ఎన్ని పనులు పూర్తి చేశారు? తదితర వివరాలను నివేదికలో పొందుపరిచారు. సచివాలయాల్లో ఎన్ని రోజులు? (ఈనెల 20 వరకు) ► ఒక్కో సచివాలయంలో ఒక రోజు గడిపిన ఎమ్మెల్యేలు 9 మంది ► ఒక్కో సచివాలయంలో రెండేసి రోజులు గడిపిన ఎమ్మెల్యేలు 85 మంది ► ఒక్కో సచివాలయంలో మూడు రోజులు గడిపిన ఎమ్మెల్యేలు 46 మంది ► ఒక్కో సచివాలయంలో మూడు రోజులకు పైగా గడిపిన ఎమ్మెల్యేలు 11 మంది ఎంత మంది.. ఎన్ని రోజులు వెళ్లారు? (ఈ నెల 20 వరకు) ► 150 రోజులకు పైగా గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 40 మంది ► 121 – 150 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 43 మంది ► 91 – 120 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 38 మంది ► 61 – 90 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 18 మంది ► 31 – 60 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 11 మంది ► 1 – 30 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యే 1 గడప గడపకూ ప్రాధాన్యత పనులు ఇలా (ఈనెల 20 వరకు) ► రూ.1,454.30 కోట్ల విలువైన 37,725 ప్రాధాన్యత పనులు అప్లోడ్ ► రూ.1,342.68 కోట్ల విలువైన 34,767 పనులు మంజూరు ► రూ.1,179.06 కోట్ల విలువైన 31,346 పనులు ప్రారంభం ► రూ.251.22 కోట్ల విలువైన 6,554 పనులు పూర్తి -
పనితీరు బాగుంటేనే ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం: సీఎం వైఎస్ జగన్
-
గడపగడపకూ కార్యక్రమం అత్యంత కీలకమని ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచన...ఇంకా ఇతర అప్డేట్స్
‘‘రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇవ్వాళ్టి నుంచి మనం వేసే ప్రతి అడుగు చాలా కీలకం. 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ మనం గెలవాలి.
-
‘గడప గడపకూ’ వర్క్ షాప్ : పనితీరే ప్రామాణికం
ఎమ్మెల్యేల పనితీరు ప్రజల్లో బాగుంటే ఆ ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. ప్రజల్లో గ్రాఫ్ బాగా లేకపోతే ఆ ఎమ్మెల్యేలను కొనసాగించడం కుదరదు. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోండి. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే కొన్ని కోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారు. కోట్ల మంది పేదలకు మంచి జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగా లేకపోతే.. వాళ్లను అక్కడే కొనసాగించడం వల్ల వారికీ నష్టం, పార్టీకీ నష్టం. కోట్లాది మంది పేదలకూ నష్టం జరుగుతుంది. మనం సర్వే చేసినప్పుడు మీ గ్రాఫ్‌లు బలంగా ఉండాలి. దీనికి గడప గడపకూ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువగా ఉండేందుకు బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ గ్రాఫ్ పెరుగుతుంది. సర్వేలు అనుకూలంగా లేకపోతే.. టికెట్లు ఇవ్వకపోతే.. నన్ను బాధ్యుడ్ని చేయొద్దు. రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవాలి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ‘‘మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ్టి నుంచి మనం వేసే ప్రతి అడుగు చాలా కీలకం. 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ మనం గెలవాలి. ఇంతకు ముందుకన్నా బ్రహ్మాండమైన మెజార్టీలు రావాలి. మన లక్ష్యం అదీ. అందుకే గడప గడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలి..’’ అని సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. 175కు 175 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా తెచ్చిన మార్పులను ‘వై ఏపీ నీడ్స్ జగన్..?’ (ఏపీకి జగన్ ఎందుకు కావాలి..?) అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ తెలియజేద్దామని పిలుపునిచ్చారు. ‘నెగెటివ్ మీడియాను అడ్డం పెట్టుకుని మారీచుల్లా మనపై యుద్ధం చేస్తున్నారు.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో మనం యుద్ధం చేస్తున్నాం. ఆ దుష్ఫ్రచారాన్ని ప్రతి గడపలోనూ తిప్పికొట్టాలి..’ అని సూచించారు. వర్క్ షాప్‌లో ముఖ్యమంత్రి జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రతి లబ్ధిదారుడినీ చైతన్యం చేయాలి.. ఇవాళ మూడు ప్రధాన కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో మొదటిది ఈ నెల 23వతేదీన ప్రారంభించబోతున్న జగనన్న సురక్ష కార్యక్రమం. రెండోది.. గడపగడపకూ మన ప్రభుత్వం. ఇక మూడో అంశం ‘‘వై ఏపీ నీడ్స్ జగన్..?’’ అనే కార్యక్రమం. నాలుగేళ్ల పరిపాలనలో గొప్పగా, దేశానికే ఆదర్శంగా నిలబడగలిగిన పనులు ఏం చేశామన్న విషయాలతోపాటు వాటికి సంబంధించి ఆధారాలతో సహా అవగాహన కలిగించేలా ‘వై ఏపీ నీడ్స్ జగన్..’ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. మనం రాక్షసులతోనూ, మారీచులతోనూ యుద్ధం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అయితేనే మనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తగినవిధంగా తిప్పికొట్టగలిగే పరిస్థితి ఉంటుంది. మనం చేస్తున్న మంచి ఏమిటన్నది ప్రతి మనిషి దగ్గరికి, ప్రతి కుటుంబం వద్దకు పదేపదే తీసుకెళ్లాలి. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టగలిగే పరిస్థితిలోకి ప్రతి లబ్ధిదారుడిని తయారు చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఆ భావనే ఆశీస్సులుగా మారి.. వచ్చే ఎన్నికల్లో మనం 175కు 175 నియోజకవర్గాలూ గెలవాలి. ఆ దిశగా అడుగులు పడాలి. అదేం కష్టమైన పనికాదు. ఎందుకంటే.. రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాలకు మంచి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం కుటుంబాలకు మంచి జరగ్గా పట్టణ ప్రాంతాల్లో 84 శాతానికి మేలు జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉన్నప్పుడు.. దేవుడి దయతో మన ప్రభుత్వం మంచి చేయగలిగిందని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పి ఆ ఇంట్లో ప్రతి అక్కచెల్లెమ్మ మనసులో ఇది నిజమే కదా అనే భావనను తేవాలి. ఆ భావనే ఆశీస్సులుగా మారి ప్రతి ఇళ్లూ మనకు ఓటు వేస్తుంది. అది జరిగితే ప్రతి గ్రామం మనకు ఓటు వేస్తుంది. ప్రతి నియోజకవర్గం ఆటోమేటిక్‌గా మనకే ఓటు వేసే పరిస్థితి వస్తుంది. 175కు 175 స్థానాల్లో మనం విజయం సాధిస్తాం. జగనన్న సురక్షతో సమస్యల పరిష్కారం..: ► మీతోపాటు క్యాడర్‌ను కూడా యాక్టివేట్ చేసి గృహ సారథులు, వలంటీర్లు, సచివాలయ కన్వీనర్లను ఏకం చేస్తూ ముందుకు సాగాలి. ఇప్పటికే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కొనసాగుతోంది. ఎక్కడైనా, ఏదైనా సమస్య మీరు ప్రయత్నం చేసినప్పటికీ పరిష్కారం కాకపోతే దాన్ని పరిష్కరించేలా భరోసా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి అనుబంధంగా, అదనంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం కొనసాగుతుంది. ► ‘జగనన్న సురక్ష కార్యక్రమం’ ద్వారా మొత్తం సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ, గృహ సారథుల వ్యవస్థ ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడ పడుతుంది. అర్హులై ఉండి కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయి పథకాలకు దూరం కాకూడదనే లక్ష్యంతో జల్లెడ పట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా అర్హులు మిగిలిపోయిన వారు ఉంటే కుటుంబంలో విభజన చేసి రేషన్ కార్డు అందించడం నుంచి వివిధ రకాల సర్టిఫికెట్లు అక్కడికక్కడే మంజూరు చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్లి కాసేపు గడిపి సర్టిఫికెట్స్ పరంగా, పథకాల పరంగా సమస్యలుంటే జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తాం. ► మండల స్థాయి అధికారులు ప్రతి సచివాలయంలో ఒకరోజు పాటు గడుపుతారు. తహసీల్దార్, పంచాయితీరాజ్ ఈవో ఒక బృందంగా.. ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్ మరొక బృందంగా ఏర్పడతారు. షెడ్యూల్ ప్రకారం సచివాలయాలకు వెళతారు. ఏ తేదీన ఎక్కడకు వెళతారో ముందే ప్రకటిస్తారు. ఉత్సాహం ఉన్నవారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ► సచివాలయం పరిధిలో ప్రతి కుటుంబాన్నీ అధికారులతో కూడిన ఈ బృందాలు కలుస్తాయి. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోవడం, సర్టిఫికెట్ల జారీకి అవసరమైన డాక్యుమెంట్లు, పథకాల అర్హతకు సంబంధించిన పత్రాలు తీసుకుంటారు. వీటిని తీసుకుని తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రతి వినతికీ సర్వీసు నంబరు, టోకెన్ కేటాయించి ఆయా కుటుంబాలకు అందచేస్తారు. ► వారం తర్వాత అధికారులతో కూడిన బృందం ఆయా గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుకుని సర్టిఫికెట్లు జారీ చేసే కార్యక్రమం చేపడుతుంది. అర్హులందరికీ పథకాలు మంజూరు చేస్తారు. ఒక పండగ వాతావరణంలో గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్తారు. దీనివల్ల నూరు శాతం కార్యక్రమం సంతృప్తిగా జరుగుతుంది. ► జగనన్న సురక్ష కార్యక్రమం క్యాంపుల్లో దాదాపు 11 రకాల సర్టిఫికెట్లు జారీ చేస్తారు. కులం, ఆదాయం, జనన ధృవీకరణ, వివాహం, ఫ్యామిలీ మెంబర్, డెత్, బియ్యం కార్డులు, కుటుంబాల విభజన, సీసీఆర్సీ, మ్యుటేషన్లు, ఫోన్ నంబర్లకు ఆధార్ లింకేజి లాంటివన్నీ అందించే కార్యక్రమం జరుగుతుంది. ► మండలంలో ప్రతి రోజూ రెండు క్యాంపులు జరుగుతాయి. నియోజకవర్గంలో ఎన్ని మండలాలుంటే అన్నింటా రెండేసి క్యాంపులు చొప్పున జరుగుతాయి. ప్రతి క్యాంపు దగ్గర ఎమ్మెల్యేలు కనిపించాలి. జగనన్న సురక్ష కార్యక్రమంపై ఈ నెల 23 నుంచి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. జూలై 1 నుంచి క్యాంపులు ప్రారంభం అవుతాయి. దుష్ఫ్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టండి.. ► గతంలో చంద్రబాబు పాలన, ఇవాళ మన ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలతో నాడు – నేడు కంటెంట్ తయారు చేసి ప్రజల దగ్గరకు చేర్చాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ద్వారా వెలువడుతున్న వ్యతిరేక కథనాలకు సంబంధించి నిజాలేమిటో ప్రజలకు వివరిస్తూ నెగెటివ్ మీడియా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలి. ► ప్రభుత్వం చేస్తున్న మంచిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి. సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి. అబద్ధాలు, విష ప్రచారాలను పూర్తిస్థాయిలో తిప్పికొట్టాలి. రాబోయే రోజుల్లో మనపై దుష్ప్రచారం పెరుగుతుంది. సోషల్ మీడియాలో అబద్ధాలను ఇంకా ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చే కార్యక్రమం చేస్తారు. ఇంత దారుణమైన ఎమ్మెల్యే ఎవరూ లేరంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. ప్రతి ఒక్కరిపైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. వీటిని ఎదుర్కొంటూ ముందుకు పోవాలి. గ్రామ స్ధాయి నుంచి మన సోషల్ మీడియా టీమ్‌లను తయారు చేసుకోవాలి. ఈ కౌంటర్ మెకానిజం కచ్చితంగా ఉండాలి. దీనికి సిద్ధం కావాలి. ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ... ‘‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కారం కావాలి. ఏకంగా 1.50 లక్షల మంది సచివాలయ సిబ్బంది, 2.60 లక్షల మంది వలంటీర్లు, 3 వేల మంది మండల స్థాయి సిబ్బంది, 26 మంది సీనియర్ ఐఏఎస్‌లు, 7.5 లక్షల మంది గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు ప్రతి గ్రామంలో ఒక రోజు కేటాయిస్తూ 15 వేల క్యాంపులు నిర్వహిస్తారు. 30 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఇంకా ఎవరైనా అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారేమో పరిశీలించి వారికి కూడా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటారు. ఇలా ప్రతి సమస్యను పరిష్కరించాలన్న ధృక్పథంతో అడుగులు వేస్తోన్న పరిస్ధితి దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. ఈ రాష్ట్రంలో మాత్రమే జరుగుతోంది’’ – ‘జగనన్న సురక్ష’పై సీఎం జగన్ -
గడపగడపకు మన ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం సమీక్ష
-
పుదూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని సంక్షేమ పథకాలు సీఎం జగన్ ఇచ్చారు: డిప్యూటీ సీఎం కొట్టు
-
ఇదేందయ్యా ఇది.. టీడీపీ నేతల ఓవరాక్షన్
పూతలపట్టు: గ్రామానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి గ్రామంలో ఎవరూ ఉండకూడదని స్థానిక టీడీపీ నేతలు ప్రజలను భయాందోళనకు గురి చేసి ఇళ్లకు తాళాలు వేయించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని పేట అగ్రహారం పంచాయతీలో జరిగింది. అయితే, గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు బుధవారం పేట అగ్రహారం పంచాయతీలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఇంటింటికీ ఎమ్మెల్యే వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తుండటాన్ని స్థానిక టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజలను ఎమ్మెల్యే కలవకుండా చేయాలని పంచాయతీలోని 5 గ్రామాల్లో ప్రజలంతా తాళాలు వేసుకుని వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. తాళాలు వేసుకుని వెళ్లకుంటే అంతు చూస్తామని తీవ్రంగా భయపెట్టారు. దీంతో పల్లెల్లో ఒకటి రెండు ఇళ్లు మినహా మిగిలినవారంతా భయపడి తాళాలు వేసుకుని పక్క గ్రామాలకు, పొలాల వద్దకు వెళ్లిపోయారు. పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే ఏం జరిగిందని అధికారులను ప్రశ్నించారు. ఎవరూ ఉండకూడదని టీడీపీ నాయకులు భయపెట్టడంతో జనం తాళాలు వేసుకుని వెళ్లారని అధికారులు చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేట అగ్రహరంలో 498 మంది లబ్ధిదారులకు రూ.2.15 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఏపీకి మరో జాతీయ అవార్డు -
మహాయజ్ఞంలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పుష్ప శ్రీవాణి
-
‘చంద్రబాబుతో అంటకాగితే జనసేన అడ్రస్ గల్లంతే’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీ, కులం, మతం, ప్రాంతం ఇలా అన్నింటికీ అతీతంగా అర్హులందరికీ అందుతున్నాయని డిప్యూటీ సీఎం, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగొలను గ్రామంలో శుక్రవారం రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామంలోని గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన వడ్డూరి రాంబాబు ఇంటి వద్ద ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంత్రి సత్యనారాయణ గడపగడపకు కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటి వద్ద ఆ కుటుంబానికి జగనన్న సంక్షేమ పథకాలు ద్వారా చేకూరిన లబ్ధిని చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్నకు సంక్షేమ పథకాలు అమలులో పార్టీ, కులం, మతం, ప్రాంతం వంటి ఎలాంటి భేదం లేవన్నారు. అన్నింటికీ అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలనేదే ముఖ్యమంత్రి జగనన్న ఆశయమన్నారు. గడపగడపకు వెళ్లి ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లక్షలాది రూపాయల లబ్ధిని చదువుతుంటే వారు స్వయంగా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రానికి ఏలినాటి శని లాంటి చంద్రబాబు.. నవరత్నాలను నవ మోసాలు అంటూ విమర్శించడం చాలా దారుణమని తీవ్రంగా ఖండించారు. 14 ఏళ్ల పాటు పాలించిన చంద్రబాబు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని సీఎం జగన్‌లా నేను ఎందుకు చేయలేకపోయాను అని పశ్చాత్తాపపడితే బాగుంటుందని హితవు పలికారు. అంతేగానీ, ఇప్పటికీ వయసు మీద పడినా పదవీ కాంక్షతో చంద్రబాబు పిశాచిలా ప్రజలను పట్టిపీడిస్తున్నారని ఫైరయ్యారు. జనసేన పార్టీకి రాజకీయ సిద్ధాంతం లేదు. పవన్ కళ్యాణ్‌కు గమ్యం లేదని.. స్థిరమైన అభిప్రాయాలు లేవన్నారు. పవన్ రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాణించలేడని ప్రముఖ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్ళు తెరిచి మర్రిచెట్టు లాంటి చంద్రబాబును విడిచి బయటకు వస్తే భవిష్యత్తు ఉంటుందన్నారు. అంతేగానీ, చంద్రబాబుతోనే అంటకాగితే తెలుగుదేశంతో పాటు జనసేనకు అడ్రస్ కూడా గల్లంతుకావడం ఖాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరుగొలను గ్రామంలో ఆయన గడపగడపకు వెళ్లి ఆయా కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో చేకూరిన ఆర్థిక లబ్ధిని గణాంకాలతో సహా చదివి వినిపించారు. ఈ క్రమంలోనే ఏ ప్రభుత్వంలో మేలు జరిగింది.. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది అనేది ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: థాంక్యూ సీఎం సార్.. మీ సాయంతో అంతరిక్షం అందుకుంటున్నా -
మహాయజ్ఞంలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
సున్నిపెంట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం
-
ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే నాని
-
ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలపై వివరించిన రోజా
-
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
ఏ రాజకీయ పార్టీ చేయలేని సాహసం YSRCP చేస్తుంది
-
రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు
-
గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నాం
-
ఇంటింటికెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీసిన ఎంపీ అవినాష్ రెడ్డి
-
నెల్లూరు జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలన్నీ: సీఎం జగన్
రాజకీయాలంటే.. మానవ సంబంధాలు నేను నాన్న దగ్గర నుంచి నేర్చుకున్న అంశం ఏమిటంటే.. రాజకీయాలంటే మానవ సంబంధాలు! ఏ ఒక్క ఎమ్మెల్యేనూ పోగొట్టుకోవాలని నేను అనుకోను. ఏ ఒక్క కార్యకర్తనూ పోగొట్టుకోవాలని కూడా అనుకోను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మాటలను నమ్మవద్దు. మీతో పని చేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ అడుగులన్నీ అందుకోసమే. మీరంతా మళ్లీ గెలిచి రావాలనే ఇవన్నీ చేస్తున్నాం. మనం సరైన పద్ధతుల్లో పనిచేయకపోతే, ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగా లేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం. మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు. అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలి. గ్రాఫ్ పెరగాలంటే ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి. అందుకే గడప గడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి. అది సక్రమంగా నిర్వహిస్తే కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది. – సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ‘మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు అనే వ్యక్తి ఒక ముసుగులో గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, పవన్‌కళ్యాణ్ కలసి చేస్తున్న దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం అధికారంలోకి వచ్చాక తెరపడింది. మళ్లీ చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టి దోపిడీని కొనసాగించేందుకు ప్రభుత్వంపై ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమ కల్పించేలా గజదొంగల ముఠా దుష్ఫ్రచారం చేస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ చేస్తారు. దాన్ని ఎక్కడికక్కడ సమర్థంగా తిప్పి కొట్టాలి’ అని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ప్రాంతీయ సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గడప గడపకూ కార్యక్రమం సగం సచివాలయాల పరిధిలో ఇప్పటికే పూర్తైందని, మిగతా సగం సచివాలయాల పరిధిలో ఆగస్టులోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో పర్యటించాలన్నారు. ఇది పూర్తయితే సెప్టెంబరు నుంచి ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుడదామని తెలిపారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో బటన్ నొక్కి డబ్బులు జమ చేసే బాధ్యతను తాను నిర్వర్తిస్తానని, గడప గడపకూ వెళ్లి చేసిన మంచిని వివరిస్తూ ప్రజలతో మమేకమై ఆశీర్వాదాలు పొందే బాధ్యతను నేతలు సక్రమంగా నెరవేర్చాలని సూచించారు. నేను, మీరూ ఏకమై సమన్వయంతో, సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తే 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ విజయం సాధించడం ఖాయమని నేతల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారు. సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే... రెట్టించిన వేగంతో గడప గడపకూ.. ఫిబ్రవరి 13న గడప గడపకూ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి 16 వరకూ కొనసాగింది. ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి. దీనివల్ల గడప గడపకూ కార్యక్రమానికి కాస్త గ్యాప్ వచ్చింది. మళ్లీ ఆ కార్యక్రమాన్ని ఉద్ధృతంగా చేపట్టాలి. గేర్ మార్చి రెట్టించిన వేగంతో చేయాలి. అందుకే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేరుగా రూ.2 లక్షల కోట్లు జమ.. దేవుడి దయ వల్ల రాష్ట్ర చరిత్రే కాదు.. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగేళ్లు గడవక ముందే రూ.2 లక్షల కోట్ల పైచిలుకు సొమ్మును ఎలాంటి వివక్షకు తావులేకుండా, లంచాలకు అవకాశం లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశాం. పట్టణ ప్రాంతాల్లో 84 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం కుటుంబాలకు సగటున 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా మంచి చేయగలిగాం. ఆ ఇళ్లల్లో అక్కచెల్లెమ్మలకు మేలు జరిగింది. ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగలేదు. అర్హులను పారదర్శకంగా గుర్తించి ప్రయోజనం చేకూర్చాం. పేదలు మిస్‌కాకుండా వెరిఫికేషన్ చేసి మరీ సంతృప్త స్థాయిలో పథకాలు అందిస్తున్నాం. పరిమితి పెంపుతో మరింత ప్రయోజనం మనం అధికారంలోకి రాక ముందు గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6 వేలు మాత్రమే నెలకు ఆదాయ పరిమితిగా ఉన్న బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10 వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12 వేలకు పెంచి పథకాలు అందిస్తున్నాం. తద్వారా 87 శాతం ఇళ్లకు డీబీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా మేలు చేస్తున్నాం. ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్? ఈమధ్య కాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబును చూసి కొన్ని మాటలు మాట్లాడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని మాటలు చెబుతున్నారు. వాస్తవాలు అందరికీ తెలియాలి. 21 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 17 స్థానాల్లో మనం గెలిచాం. ఒక ఎమ్మెల్సీ స్థానం అంటే 34 – 39 నియోజకవర్గాల పరిధి ఉంటుంది. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అంటే 80 లక్షలకుపైగా ఓట్ల పరిధిలో ఎమ్మెల్సీ స్థానం ఉంటుంది. ఆ పరిధిలో 87 శాతం అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలతో మంచి చేస్తున్నాం. 80 లక్షల కుటుంబాల్లో కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదు చేసుకున్నారు. మనం మంచి చేసిన 87 శాతం మందిలో ఎమ్మెల్సీ ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. దాదాపు రెండున్నర లక్షల మంది ఎమ్మెల్సీ ఓటర్లలో 80 శాతం మంది డీబీటీలో లేనివారే ఉన్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు కనిపిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుంది? అంతా ఏకమైనా మొదటి ప్రాధాన్యతతో నెగ్గలేకపోయారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరొక అంశం.. ఒకటో ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం, మూడో ప్రాధాన్యతలకు సంబంధించినది. మిగిలిన పార్టీలంతా కలిశాయి. మనం ఒంటరిగా పోటీ చేశాం. అయినప్పటికీ కూడా టీడీపీ మొదటి ప్రాధాన్యతతో గెలవలేకపోయింది. రెండో ప్రాధాన్యత ఓటు బదిలీ కావడం, ఇంతమంది ఏకం కావడం వల్ల జరిగిన అంశం ఏ రకంగానూ ప్రభావం చూపలేదు. ఒక వాపును చూపించి.. అది బలం అన్నట్లుగా చంద్రబాబు ప్రొజెక్ట్ చేసుకోవడం, దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంత పాడటాన్ని చూస్తున్నాం. లిస్టు కూడా తయారు చేస్తున్నారంటూ... రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు. టికెట్లు ఇవ్వని 50 – 60 మంది ఎమ్మెల్యేల లిస్టు కూడా తయారు చేస్తున్నారని చెబుతారు. ఆ జాబితాలో ఇంతమంది వెళ్లిపోతున్నారంటూ ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈనాడు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే దారుణమైన ఎమ్మెల్యే ఉండరని మన పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యేపైనా ప్రచారం చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారు. వాటిని మనం తిప్పికొట్టే కార్యక్రమం చేయాలి. ప్రతి ఊరులో, ప్రతి నియోజకవర్గంలోనూ దీన్ని గట్టిగా చెప్పాలి. లబ్ధిదారులే మన ప్రచారకర్తలు.. సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నాయి. మన క్యాడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి. సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి. క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల నియామక వ్యవస్థను పూర్తి చేసుకోవాలి. ప్రతి లబ్ధిదారుడిని మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలి. ప్రతి లబ్ధిదారుడు వారికి జరిగిన మంచిని నలుగురితో పంచుకునేలా ప్రోత్సహించాలి. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులను మమేకం చేయాలి. వారంతా కలసి ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి కుటుంబానికీ తీసుకెళ్లాలి. ఇది మీరు కచ్చితంగా చేయాలి. నెలకు 25 రోజులు గడప గడపకూ.. దాదాపు 15 వేల సచివాలయాలు ఉండగా సగం సచివాలయాల పరిధిలో గడప గడపకూ కార్యక్రమం పూర్తయింది. మిగిలిన సగం కూడా వచ్చే 5 నెలల్లో అంటే ఆగస్టు నాటికి పూర్తి చేయాలి. నెలకు 9 సచివాలయాలను పూర్తి చేయాలి. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి. ఇది పూర్తయితే సెప్టెంబరు నుంచి ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం. 7న ‘జగనన్నే మన భవిష్యత్తు’ ప్రారంభం.. ‘జగనన్నే మన భవిష్యత్తు’ కార్యక్రమాన్ని ఏప్రిల్ 7వతేదీన ప్రారంభిస్తున్నాం. ఇది ఏప్రిల్ 20 వరకు జరుగుతుంది. సచివాలయాల కన్వీనర్, గృహ సారథులను ఏకం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. గ్రామ స్థాయిలో మన వ్యవస్ధను ఏకం చేసి ప్రతి ఇంటికి పంపుతున్నాం. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లేలా ఇది పక్కాగా జరగాలి. 13న ‘జగనన్నకు చెబుదాం’... వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు స్ప్లిట్ కాకపోవడం లాంటి సమస్యలు గ్రామాల్లో ఒకటి అరా ఉంటే వాటిని కూడా మిస్ కాకూడదని ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ నెల 13న దీన్ని చేపడుతున్నాం. ఎవరికి సమస్య ఉన్నా నేరుగా నాకే ఫోన్ చేయవచ్చు. వాటిని పరిష్కరిస్తాం. -
గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష (ఫోటోలు)
-
ఆ రూమర్లను కొట్టిపారేసిన ఏపీ సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫుల్స్టాప్ పెట్టారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్ మీడియాతో పాటు యెల్లో బ్యాచ్ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారాయన. సోమవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు పాల్గొన్న సమావేశంలో సీఎం జగన్.. తాజా రాజకీయ ప్రచారాలపై మాట్లాడారు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన సీఎం జగన్.. మంత్రుల మార్పుల సహా, ఇతరత్రా రూమర్లపైనా ఎమ్మెల్మేలతో చర్చించారు. రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు మరిన్ని వస్తాయన్న ఆయన.. వాటిని అంతే బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: గేరు మార్చండి.. జెట్ స్పీడ్‌తో పని చేయండి: సీఎం జగన్ -
CM Jagan: రెట్టించిన స్పీడ్‌తో పనిచేయాలి
సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా.. నేడు(సోమవారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్, పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఏమన్నారంటే.. ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశాం దాని తర్వాత కార్యక్రమానికి కాస్త గ్యాప్ వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గ్యాప్ వచ్చింది మార్చి 16వరకూ కోడ్ కొనసాగింది తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి దీనివల్ల గడపగడపకూ కాస్త గ్యాప్ వచ్చిందిమళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి గేర్ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలి రాష్ట్ర చరిత్రే కాదు… దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే.. రూ.2లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అక్కౌంట్లో పడింది అర్బన్ ప్రాంతంలో 84శాతం, రూరల్ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, యావరేజీన 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదు 87శాతం కుటుంబాలను గమనించినట్టైతే… అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశాం పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్ చేసిన మరీ… వారికి పథకాలు అందిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చాం: బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ… గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు. ఇచ్చాం ఇలా చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫, చంద్రబాబును చూసినా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు 21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే.. 17 స్థానాల్లో మనం గెలిచాం మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి: ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లైన ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో దాదాపు చాలా శాతం మంది డీబీటీలో లేనివారు కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుంది రాష్ట్రంలో ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపిల్ ఏదైతే.. ఉందో.. అది ఇది కాదు ఒకటో ప్రాధాన్యం.. రెండో ప్రాధాన్యం… మూడో ప్రాధాన్యాలు ఉన్నాయి మిగిలిన పార్టీ అందరూ కలిశారు.. మనం ఒక్కరిమే అయినప్పటికీ కూడా… తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి.. జరిగింది అయినా కూడా ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారు దానికితోడు ఈనాడు రాయడం, ఆంధ్రజ్యోతి రాయడం, టీవీ-౫ చూపడం రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు 60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారుచేస్తున్నారని చెప్తారు ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు ఇంతకంటే.. దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారంచేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అందుకే అంటున్నా.. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం వారంతా గజ దొంగల ముఠా దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం వచ్చాక గండిపడింది అందుకే గజదొంగల ముఠా ఇవన్నీ చేస్తున్నాయి రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి వాటిని తిప్పికొట్టాలి సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం కేడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలి గృహసారథులను, సచివాలయ కన్వీనర్లు.. వ్యవస్థను పూర్తిచేసుకోవాలి ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారుచేసుకోవాలి వాలంటీర్లను, గృహసారథులను మమేకం చేయాలి వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వంచేస్తున్నమంచిని ప్రతికుటుంబానికీ తీసుకెళ్లాలి దాదాపుగా ఇప్పటికి సగం సచివాలయాల్లో గడపగడపకూ పూర్తిచేశాం ఈ సగం వచ్చే 5 నెలల్లో, అంటే ఆగస్టు నాటికి పూర్తిచేయాలి నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలి నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారంచుడదాం ఒకవైపున గడపగడపకూ జరుగుతుంది… రెండోవైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయి వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నాం రాజకీయాల్లో నేను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోను మీతో పనిచేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే.. ఈ కార్యక్రమాలు ఈ అడుగులన్నీ కూడా దానికోసమే కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నాకు ప్రతి నియోజకవర్గంలో లక్షలమంది మనపై ఆధారపడి ఉన్నారు ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం మన అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలి ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది నేను చేయాల్సింది.. నేను చేయాలి మీరు చేయాల్సిది మీరు చేయాలి ఈరెండూ సంయుక్తంగా, సమర్థవంతంగా జరిగితే… అప్పుడు కచ్చితంగా 175కి 175 గెలుస్తాం ఇదీ చదవండి: బోధనాస్పత్రుల బలోపేతం -
అంకుపల్లి.. మంత్రి కాకాణి వైపే.. మంత్రికి అపూర్వ స్వాగతం
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం ఆర్.వైపాళెం సచివాలయ పరిధిలోని అంకుపల్లి గ్రామంలో ఆదివారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కాకాణి అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తామని అంకుపల్లి గ్రామస్తులు అన్నారు. -
ప్రతి ఎమ్మెల్యే మళ్లీ గెలవాలి: సీఎం జగన్
-
సీఎం జగన్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం (ఫొటోలు)
-
వాళ్లను తిప్పికొడదాం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ నినాదంతో ముందుకు పోదాం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో.. ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఈ సమీక్ష సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసిన సీఎం జగన్.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ నినాదంతో ప్రతీ గడపకూ వెళ్లి గృహ సారథులు పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. గడపగడపకూ కార్యక్రమం అత్యంత కీలకం. నిర్దేశించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య వ్యత్యాసం వివరించాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో గడప గడప మన ప్రభుత్వం కొనసాగించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా మిగతా జిల్లాల్లో నిర్వహించాలని సూచించారు. 93 శాతం గృహసారథుల నియామకం పూర్తి దాదాపు 5 లక్షల మంది గృహసారథులను నియమించుకున్నామని ఈ సందర్భంగా పార్టీ కేడర్‌ను ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 16 లోగా అక్కడక్కడా మిగిలిపోయిన నియామకాలను పూర్తిచేయాలి. పార్టీకార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాలంటే గృహసారథులనేవాళ్లు చాలా ముఖ్యమైనవాళ్లు. గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల మొదటి బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో ముగిశాయి. రెండో బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు మిగిలిన మండలాల్లో రేపటి(మంగళవారం) నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి19 వరకూ నడుస్తాయి. మండలాల వారీగా జరిగే ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. ఈ శిక్షణ కార్యక్రమాలు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల రూపేణా వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీకి సుమారు 5.65 లక్షలమందితో క్షేత్రస్థాయిలో పార్టీ సైన్యం ఉంది. వీరంతా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 1.65 కోట్ల గృహాలను సందర్శిస్తారు. మార్చి 18 నుంచి 26 వరకూ కూడా జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్‌ను పార్టీకి చెందిన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు డోర్ టు డోర్ నిర్వహిస్తారు. గత ప్రభుత్వం కన్నా.. ఈ ప్రభుత్వం అందించిన మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తారు. గృహసారథులను కో–ఆర్డినేట్ చేసే బాధ్యతను సచివాలయ కన్వీనర్లకు అప్పగించాలన్నారు. వాళ్లను తిప్పికొడదాం సుమారు 14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. టీడీపీకి బాకా ఊదుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా అవి చూపిస్తున్నాయి. ప్రజలకు నిరంతరం ఏదో ఒక భ్రమ కల్పించే పనులు చేస్తున్నాయి. వాటిని తిప్పికొడుతూ మనం ముందుకు సాగాలి. గ్రాడ్యుయేట్లు, టీచర్లకు సంబంధించిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పరిశీలకులు వీరంతా కలిసికట్టుగా పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. పుంజుకోవాల్సిందే గడప గడపకూ మన ప్రభుత్వంపైన కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకూ దాదాపు 7,447 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం నిర్వహణ జరిగింది. సగటున నెలలో సుమారు 6 సచివాలయాలను సందర్శించారు ఎమ్మెల్యేలు. అలాగే.. ప్రతి ఇంట్లో ఉన్నవారిని కూడా పలకరించి వారితో కొంత సమయం గడపాలని సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు సూచించారు. గడప గడప కి మనప్రభుత్వ కార్యక్రమం నిర్వహణ అత్యంత కీలకమని మరోసారి స్పష్టంచేసిన సీఎం జగన్.. నిర్వహణలో వెనకబడ్డ ఎమ్మెల్యేలు పుంజుకోవాలని చెప్పారు. వచ్చే సమీక్ష సమావేశం నాటికి ఆ ఎమ్మెల్యేలు మెరుగుపడాలని తెలిపారు. మళ్ళీ ప్రతి ఎమ్మెల్యే గెలవాలి. నిరంతరం ప్రజలోనే ఉండాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. -
‘గడపగడపకూ’ అభివృద్ధి
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): స్థానిక సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు ప్రభుత్వం సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం (జీజీఎంపీ) పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు గడపగడపకు కార్యక్రమంలో భాగంగా వారి దృష్టికి వచ్చిన మౌలిక వసతుల సమస్యలను గుర్తించి ఆయా పనులకు తీర్మానం చేయించి జీజీఎంపీ పనుల్లో నిధులు మంజూరు చేయించి త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏఏ పనులంటే.. సచివాలయ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 లక్షలతో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, పారిశుద్ధ్య, లైటింగ్ తదితర పనులు చేపడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అత్యవసరమైన పనులకు ముందుగా ప్రాధాన్యమిస్తూ నిధులను వెచ్చిస్తున్నారు. 22.05 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు జిల్లావ్యాప్తంగా జీజీఎంపీ నిధులతో 22.05 కిలోమీటర్లు మేర సీసీ రోడ్లు మంజూరు చేయగా ఇప్పటివరకు 8.02 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. సీసీ రోడ్లకు సంబంధించి మొత్తం 414 పనులు చేపట్టగా 95 పనులు పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా 1,035 పనులు జిల్లాలో ఇప్పటివరకూ 1,035 పనులు మంజూరు చేయగా 837 పనులు జరుగుతున్నాయి. సుమారు 100 పనులు పూర్తయ్యాయి. మరో 158 పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోని 19 మండలాలు, 6 మున్సిపాలిటీల్లో పనులు 80 నుంచి 90 శాతం మేర పురోగతిలో ఉన్నాయి. జీజీఎంపీ నిధులు మైనర్ పంచాయతీలకు వరంలా మారాయి. ఆయా నిధులతో మౌలిక వసతులు కల్పించడంతో గ్రామంలో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శాఖల వారీగా పనులు ఇలా.. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 466 పనులు మంజూరు కాగా 424 పనులు చేపట్టారు. 42 పనులు చేపట్టాల్సి ఉంది. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా 172 పనులు మంజూరు కాగా 158 పనులు చేపట్టారు. 14 పనులు చేపట్టాల్సి ఉంది. విద్యుత్ శాఖ ద్వారా 5 పనులు మంజూరు కాగా 3 పనులు చేపట్టారు. 2 పనులు చేపట్టాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో 392 పనులు మంజూరు కాగా 184 పనులు జరుగుతున్నాయి. 108 పనులు చేపట్టాల్సి ఉంది. రోడ్డు, డ్రెయిన్ నిర్మాణం ప్రభుత్వం మా గ్రామ సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరు చేసింది. గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి జీజీఎంపీ నిధులతో సీసీ రోడ్డు, డ్రెయిన్, కల్వర్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. మూడు పనులు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – వీరవల్లి శ్రీనివాస్, సర్పంచ్, తోకలపూడి జిల్లావ్యాప్తంగా పనులు జిల్లావ్యాప్తంగా జీజీఎంపీ పనులు జరుగుతున్నాయి. సీసీ, గ్రావెల్ రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టాం. కలెక్టర్ ఆదేశాలు, సలహాల మేరకు వేగంగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో సుమారు 100 పనులు పూర్తికాగా 837 పనులు సాగుతున్నాయి. వీటిని వేగంగా పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నాం. – కేఎస్ఎస్ శ్రీనివాస్, జిల్లా పంచాయతీరాజ్ ఈఈ, భీమవరం -
అన్నా మీ మేలు మరువలేము..
ఒంగోలు: ‘‘అన్నా మీ మేలు మరువలేము, అడగకుండానే అన్నీ ఇస్తున్నారు. ఇంతకంటే మాకేం కావాలి..తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మీ వెంటే ఉంటామంటూ’’ ప్రజలు స్పష్టం చేశారు. స్థానిక విజయ్‌నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి డివిజన్ కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి నాగేశ్వరరావు, వడ్డెపాలెం కొండలు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వ పరంగా అందిన కార్యక్రమాలను వివరించారు. పథకాల అమలులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ వారిని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ఇళ్ల పట్టాల గురించి అడగ్గా మార్చినెలలో ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తిచేస్తామని వివరించారు. జగనన్న విద్యాదీవెన, అమ్మ ఒడి పథకం అందుతున్న చిన్నారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు బాలినేని సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి బాలినేని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో తమ్మిశెట్టి అంజయ్య, తమ్మిశెట్టి వాసు, బండారు ఏడుకొండలు, తమ్మిశెట్టి శ్రీను, బండారు దుర్గయ్య, బండారు వెంకటేశ్వర్లు, బండారు డేవిడ్, బండారు శ్రీను, బండారు అంకమ్మ, గుంజి శివదుర్గ, మక్కిల దుర్గ , శ్రీను, వల్లపు ఆనంద్, గుంజి భరత్, బండారు శివ, బండారు గణేష్, బండారు అంజయ్య, బండారు రమేష్, బండారు ఆంజనేయులు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బాలినేనితోపాటు ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, నగర మేయర్ గంగాడ సుజాత, 31వ డివిజన్ కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి గోలి తిరుపతిరావు, మోడుబోయిన సురేష్‌యాదవ్, సంయుక్త కార్యదర్శి పటాపంజుల శ్రీనివాసులు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గంటా రామానాయుడు, ట్రేడ్ యూనియన్ జిల్లా, నగర అధ్యక్షుడు కేవీ ప్రసాద్, గోవర్థన్‌రెడ్డి, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు మీరావలి, వైఎస్సార్సీపీ నాయకులు పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, బడుగు ఇందిర, పోకల అనూరాధ, తమ్మినేని మాధవి, దాసరి కరుణాకర్, వల్లెపు మురళి, జాజుల కృష్ణ, నగర పాలక సంస్థ కమిషనర్ యం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం
తాడేపల్లిగూడెం రూరల్(పశ్చిమగోదావరి జిల్లా): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెం మండలం కృష్ణాపురం గ్రామంలో వందవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎస్సీల అభివృద్ధికి రూ.33,635 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్ జగన్ మూడున్నరేళ్ల పాలనలో రూ.48,909 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఎస్టీల అభివృద్ధికి చంద్రబాబు రూ.12,487 కోట్లు వెచ్చిస్తే, వైఎస్ జగన్ పాలనలో రూ.15,589 కోట్లు ఖర్చు చేశారన్నారు. దీన్ని బట్టి చూస్తే సీఎం జగన్ పాలనలోనే వారి అభివృద్ధికి అధిక నిధులు వెచ్చించినట్లు తేటతెల్లమవుతుందన్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఎస్సీ, ఎస్టీలతో పవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ఆయా సామాజికవర్గాలకు చంద్రబాబు హయాంలో అన్యాయం జరుగుతుంటే ఏనాడు పవన్ ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. అయితే, జగన్ ప్రభుత్వంపై ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేస్తున్నారని విషప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో పెద్దవాటాదారుడు ఎవరంటే రామోజీరావు అని వ్యాఖ్యానించారు. రూ.11వేల కోట్ల విలువైన పోలవరం ప్రాజెక్టును నామినేషన్ పద్ధతిలో రామోజీరావు అల్లుడికి కేటాయించిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. అటువంటి వ్యక్తులు నేడు పచ్చమీడియా వేదికగా ప్రభుత్వంపై అసత్యప్రచారాలు చేస్తున్నారన్నారు. దేశంలో అతి తక్కువ అప్పు కలిగిన రాష్ట్రంగా నాల్గవ స్థానంలోనూ, అప్పులు సక్రమంగా చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని, దీనిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ఏ రకమైన బడ్జెట్ ఉందో అదే విధమైన బడ్జెట్ నేడు జగన్ పాలనలో ఉందన్నారు. అయితే, నాడు చంద్రబాబు ఇంతటి సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. రాష్ట్రంలో నేడు సమర్థవంతమైన పాలన సాగుతుందన్నారు. గతంలో వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్ ప్రజలకు న్యాయం చేసేందుకు పాదయాత్రలు చేశారని, నేడు లోకేష్ పాదయాత్ర దేనికోసమని ప్రశ్నించారు. వార్డు మెంబరుగా కూడా గెలవలేని వ్యక్తి దొడ్డిదారిన ఎమ్మెల్సీగా, మంత్రిగా లోకేష్ పనిచేశాడన్నారు. మరలా ప్రజాక్షేత్రంలో పోటీ చేస్తే తుక్కుతుక్కుగా ఓడించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ ధ్వయంలో పవన్‌ను సీఎం చేస్తానంటేనే గాని ఓట్లు పడే పరిస్థితి లేదని, దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తొలుత గ్రామంలో రూ.60లక్షలు వ్యయంతో నిర్మించనున్న గ్రామ దేవత అలుసులమ్మ ఆలయానికి శంకుస్థాపన చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ పొనుకుమాటి శేషులత, వైస్ ఎంపీపీలు కట్టా రంగబాబు, సూర్పని రామకృష్ణ, సర్పంచ్‌లు రాజమహేంద్రవరపు లక్ష్మణరావు, పిచ్చుకల రాజారావు, ఎలిపే గాంధీ, ఎంపీటీసీ సభ్యులు మట్టా సత్యనారాయణ, మార్లపూడి సుబ్బారావు, జంపెల్ల సత్యవతి, నార్ని శంకరరావు, కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సంపతరావు కృష్ణారావు, మండల సచివాలయాల కన్వీనర్ ముప్పిడి సంపత్‌కుమార్, జిల్లా నీటి సంఘం మాజీ డైరెక్టర్ ఈదర వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్లు వెలిశెట్టి నరేంద్రకుమార్, జడ్డు హరిబాబు, చిక్కాల సత్యనారాయణ, ఉప సర్పంచ్‌లు మేణ్ణి రామారావు, చిట్టూరి కాశీవిశ్వనాథం, తహసీల్దార్ వైకేవీ.అప్పారావు, ఎంపీడీవో ఎం.వెంకటేష్ పాల్గొన్నారు. -
గడప గడపకు మన ప్రభుత్వంపై సజ్జల సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఆదివారం తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. గృహసారధుల నియామకాలపై ప్రధానంగా చర్చించారాయన. వాస్తవానికి నిన్నటితో(శనివారం) గృహసారధుల నియామక సమయం ముగిసింది. అయితే.. అన్ని నియోజకవర్గాల్లో నియామకాలు పూర్తి కాలేదు. ఈ క్రమంలో.. ఈనెలాఖరు వరకు ఆ సమయం పెంచుతూ సజ్జల ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఫిబ్రవరి 1వ తేదీ నుండి గృహసారధులతో మండలాల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారాయన. -
టీడీపీ మాజీ ఎంపీ కుటుంబానికి పథకాల లబ్ధి రూ.45,702
సాక్షి, నాయుడుపేట టౌన్ (తిరుపతి జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా రూ.45,702 లబ్ధి చేకూరింది. వైఎస్సార్ ఆసరా ద్వారా 2020–21, 2021–22లకు రూ.17,261 చొప్పున, సున్నా వడ్డీ కింద 2020లో రూ.2,628, 2021లో రూ.1,575, 2022లో రూ.1,112 నగదు అమృతసరళ బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. పంట రుణాల సున్నా వడ్డీ నగదును రెండు విడతలుగా రూ.5,865 నెలవల బ్యాంక్ ఖాతాలో వేసింది. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సంక్షేమ పథకాల బుక్‌లెట్‌ను నాయుడుపేటలో నెలవలకు అందజేశారు. చదవండి: (తిరుమలలో అద్దె గదుల ధరల పెంపుపై ఈవో ధర్మారెడ్డి క్లారిటీ) -
కళ్లలో కారం చల్లి, కర్రలతో దాడి
లబ్బీపేట, కృష్ణలంక (విజయవాడ తూర్పు): విజయవాడలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ మహిళా నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనడానికి మంగళవారం తారకరామ నగర్లో పలువురు వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఎదురు చూస్తున్నారు. అంతలో టీడీపీకి చెందిన షేక్ ఫాతిమా రమీజా మరికొందరు అక్కడికి వచ్చి వారితో దురుసుగా వ్యవహరించారు. మాటలతో రెచ్చగొడుతూ వారిపైకి దూసుకెళ్లారు. వెంట తెచ్చుకున్న కారం వారి కళ్లల్లో చల్లి.. కర్రలతో దాడి చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన బచ్చు మాధవి, సునీత మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న వలంటీర్ శాంతిరెడ్డిపైనా దాడికి యత్నించారు. టీడీపీ దాడిలో గాయపడిన సునీత, బచ్చు మాధవి సౌత్ ఏసీపీ రవికిరణ్, కృష్ణలంక సీఐ దుర్గారావు పోలీసు సిబ్బందితో వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కళ్లల్లో కారం చల్లి, దాడి చేశారని బి.సునీత.. టీడీపీకి చెందిన షేక్ ఫాతిమా, రమీజా, శైలు, మరో 10 మందిపై ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని, వైఎస్సార్సీపీ నేతలే తమ వాళ్లపై దాడి చేశారని ఆందోళన చేపట్టారు. బచ్చు మాధవి, రామిరెడ్డి, దామోదర్, మరో 11 మంది తమపై దాడి చేశారంటూ ఫాతిమా, రమీజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో తనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓటమి భయంతోనే టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దేవినేని అవినాష్ మండిపడ్డారు. -
Andhra Pradesh: వేగంగా ‘ప్రాధాన్యత’ పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు గుర్తించిన ప్రాధాన్యత పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి సచివాలయం పరిధిలో అత్యంత ప్రాధాన్యత గల పనులను గుర్తించి, ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఇలా అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన రూ.1,002.34 కోట్ల విలువైన 25,934 పనులను పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. వీటిలో ఇప్పటివరకు రూ.922.88 కోట్ల విలువైన 23,845 పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.758 కోట్లకు పైగా విలువైన 20,408 పనులు ప్రారంభం కాగా, రూ.32.15 కోట్ల విలువైన 813 పనులను పూర్తి చేశారు. రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ నెల 2వ తేదీ వరకు 5,173 సచివాలయాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. వాటి పరిధిలో ప్రజలకు అవసరమైన అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత పనులను గుర్తించి, వాటి వివరాలను గడప గడపకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఇలా అప్లోడ్ చేసిన పనులను వెంటనే మంజూరు చేయడం, వాటిని ప్రారంభించడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఒక్కో సచివాలయం పరిధిలోని పనులకు రూ.20 లక్షల చొప్పున రూ.3,000 కోట్లు మంజూరు చేయడమే కాకుండా, పూర్తయిన పనుల బిల్లుల చెల్లింపునకు తొలి విడతగా రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను డీడీవోలకు పంపింది. ఈ పనుల పురోగతిని కూడా ఎప్పటికప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పూర్తయిన పనుల బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేసి నిబంధనల ప్రకారం చెల్లించాలని డీడీవోలను ఆదేశించింది. పనుల పురోగతి, బిల్లుల చెల్లింపులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. -
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
-
తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!
అద్దె చెల్లించాల్సిన బాధ తప్పి సొంత ఇంట్లో ఉన్నామనే సంతోషం ఉందని నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నప్పుడు చాలామంది మహిళలు చెబుతున్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. నూతన సంవత్సర శోభ పల్లె గడప తొక్కిందని చెప్పడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్రంలో కోకొల్లలుగా మనకు కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగు పడటమే నిజమైన అభివృద్ధి అని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం... పాలనను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లింది. సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కరోనా విపత్తు సృష్టించిన ఆర్థిక అల్లకల్లోలం నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తూనే... పేదల జీవితాలకు ఆసరాగా నిలబడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వం అందుకుంటున్న ప్రతి పథకం లోనూ ప్రజలకు ప్రస్పుటంగా కనిపిస్తోంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ప్రజల గుమ్మం ముందుకు వెళుతున్న క్రమంలో.. పేదల జీవితాల్లో వస్తున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరిన అక్కాచెల్లెమ్మల కళ్లల్లో, ఎవరి మీదా ఆధార పడకుండా ఒకటో తేదీ వేకువనే అందుతున్న పెన్షన్‌తో గౌరవంగా బతుకుతున్న అవ్వాతాతల ముఖాల్లో, ఆసరా–చేయూతతో తన కాళ్ల మీద నిలబడి ఆత్మగౌరవంతో జీవిస్తున్న అక్కల ఆత్మీయ పలకరింపుల్లో, పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి అండగా నిలిచిన ‘అమ్మఒడి’ అందుకుంటున్న చెల్లెమ్మల సంతోషంలో, అన్నం పెడుతున్న అమ్మను గౌరవించడాన్ని బాధ్యతగా తీసుకొని ఇంటి ముందుకు ప్రభుత్వం పంపించిన వాహనం నుంచి బియ్యం తీసు కుంటున్న మహిళల మోముల్లో, వ్యవసాయాన్ని పండగ చేయడానికి అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాల సేవలు అందుకుంటున్న రైతన్నల ఆనందంలో... ఒకరేమిటి... ఊరిలో అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతున్న సంతృప్తిలో కొత్త సంవత్సరం శోభ కనిపిస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో పడుతోంది. మిల్లర్లు, దళారుల బెడద లేకుండా మద్దతు ధరకు రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. ఊరికే కొత్త రూపుతెచ్చిన గ్రామ సచివాలయాలు... ప్రజల ముంగిటకు పాలనను తీసుకొచ్చి ప్రజల అవసరాలు తీర్చి వారి ముఖాల్లో సంతోషానికి కారణంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందుబాటులోకి రావడంతో నూతన సంవత్సరం శోభ ఇనుమ డిస్తోంది. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో లక్ష మందికి ఒకేసారి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగులు తమ ఇళ్లతో పాటు వారు పనిచేస్తున్న సచివాలయం పరిధిలోని ఇళ్లకూ నూతన సంవత్సరం శోభను తీసుకురావడానికి, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సందేశాన్ని మోసుకెళ్లడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్ ఈ జనవరి 1 నుంచి రూ. 2,750 పెంచారు. పెన్షన్ పెంపుతో 64 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. రైతు భరోసాను అర కోటి మందికి పైగా రైతులకు అందిస్తున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద దాదాపు 4 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు లబ్ధి పొందుతున్నారు. జగనన్న చేదోడు 3 లక్షల మందికి, జగనన్న తోడు దాదాపు 5.5 లక్షల మందికి... ఇలా చెప్పుకొంటూపోతే, పల్లె గడపలో ప్రభుత్వం నుంచి పథకాలు అందుకోని వారు ఉండరనే చెప్పాలి. అందుకే ప్రగతిపథం వైపు అడుగులేస్తున్న ప్రతి ఇంటి గడపలో నూతన సంవత్సరం శోభ కనిపిస్తోంది. చదువు ఒక్కటే పేదల తలరాత మారుస్తుందని నమ్మిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే దృఢ సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉండటం వల్లే ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చి... అందులో బైజూస్ పాఠాలు అందిస్తున్నారు. ఒకప్పుడు కేవలం కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమయిన ఇలాంటివి ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో సాకారం కావడం.. రాజ్యాంగం ఇచ్చిన సమాన అవకాశాలు పొందే హక్కును రక్షించడమే. నాణ్యమైన చదువులతో పైకొస్తున్న ప్రతి విద్యార్థి.. ఒక తరం తలరాత మార్చే చైతన్యదీప్తి. ఈ వెలుగులతో కొత్త సంవత్సరం శోభ పల్లె గడప తొక్కింది. (క్లిక్ చేయండి: బాబోయ్! హ్యాండిల్ విత్ కేర్...) - కైలే అనిల్ కుమార్ ఎమ్మెల్యే, పామర్రు, కృష్ణా జిల్లా -
‘సంక్షేమ పాలన’కు టీడీపీ ఎంపీటీసీ స్వాగతం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల హృదయాలను సైతం కదిలిస్తున్నాయి. ఇందుకు విశాఖజిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం కాలనీలో మంగళవారం జరిగిన ఘటన అద్దం పడుతోంది. భీమునిపట్నం ఎమ్యెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాపురం ఎస్సీ కాలనీలో నిర్వహించారు.తమ గడప ముందుకు వచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు కంటుబోతు లక్ష్మి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనను కొనియాడారు. –పద్మనాభం(విశాఖజిల్లా) -
ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ఎవరూ అలక్ష్యం చేయొద్దు: సీఎం జగన్
-
ఇది వర్గాల యుద్ధం: సీఎం జగన్
మనం పాలకులం కాదు ప్రజా సేవకులం. అధికారం చలాయించడం కోసం కాదు మనం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండేది.. నేను సీఎంగా ఉండేది.. ఎదిగే కొద్దీ ఒదగాలి. అధికారంలో ఉండేకొద్దీ ఇంకా ఎక్కువ ఒదగాలి. అప్పుడే ప్రజల నుంచి ఇంకా మంచి స్పందన లభిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే నష్టపోతాం. ప్రతి గ్రామానికి వెళ్లండి. ప్రతి ఇంటినీ సందర్శించండి. ఏ ఇంటికైనా వెళ్లకపోతే.. మీరు తమ ఇంటికి రాలేదని, వారు మనకు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. వారు మనకు ఓటేయరని తెలిసినా వెళ్లండి. ఎందుకంటే వారికి ఎంతగా మంచి చేశామనే రికార్డులు మన దగ్గర ఉన్నాయి. వాటిని చిరునవ్వుతో వివరిస్తే, వారి మనసు మారొచ్చు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఇవాళ కులాల మధ్య కాదు.. క్లాస్‌ల మధ్య.. అంటే పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోంది. మనం పొరపాటున అధికారంలోకి రాకపోతే, రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికీ న్యాయం జరగదు. పేదవాడి ప్రతినిధి మనమే. మనం నష్టపోతే పేదలు నష్టపోతారు. వారికి న్యాయం జరగాలంటే మళ్లీ మనం తప్పకుండా అధికారంలోకి రావాలి. ఇందుకోసం ప్రతి గడపనా కనీసం ఐదు నిమిషాల పాటు గడపాలి. మూడున్నరేళ్లలో మనం చేసిన మంచి గురించి చెప్పాలి’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్బోధించారు. ‘దయచేసి అందరూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ధ్యాస పెట్టండి.. మూడున్నరేళ్లుగా మనం చేస్తున్న మంచిని.. రానున్న రోజుల్లో చేయబోయే మేలును వివరించండి. మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరండి. మీరు ఆ ఇంటికి కేటాయించే సమయం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని మీకు చేరువ చేస్తుంది. మీ గెలుపునకు బాటలు వేస్తుంది’ అంటూ దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమం కొనసాగుతున్న తీరుపై సమీక్షించారు. ఇకపై మరింత మెరుగ్గా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. గడప గడపకు మన ప్రభుత్వంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు సమర్థులనే పార్టీ కన్వీనర్లుగా నియమించండి ► నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న ముగ్గురు కార్యకర్తలనే సచివాలయ కన్వీనర్లుగా నియమించాలి. అందులో తప్పనిసరిగా ఒక మహిళ ఉండాలి. ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు. వారికి తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ ఉండి తీరాలి. ఆ తర్వాత ప్రతి 50 ఇళ్లకు ఒక తమ్ముడు, ఒక చెల్లిని గృహ సారథులుగా నియమించాలి. వారు ఆ 50 ఇళ్లకు సంబంధించిన వారై ఉండాలి. ఎక్కడా వలంటీర్లు గృహ సారథులుగా ఉండకూడదు. ► పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు జనవరిలో ఆసరా మూడో దఫా రూ.6,500 కోట్లు చెల్లించబోతున్నాం. దానికి సంబంధించి ఇంటింటా ప్రచారం చేస్తూ, వారికి లేఖలు అందిస్తాం. ఆ తర్వాత గృహ సారథుల నియామకానికి సంబంధించి మరో దఫా వెరిఫికేషన్ ఉంటుంది. ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్‌ల పంపిణీ ► రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్‌ల పంపిణీ మొదలవుతుంది. పగలు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాలి. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ రూ.2,750 పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. పెన్షన్ పెంపుదలపై వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ వారోత్సవాలలో రోజూ ఏదో ఒక మండలంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. సాయంత్రం గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ► గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్దేశించిన విధంగా జరగాలి. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం రెండు రోజులు.. రోజుకు కనీసం 6 గంటల పాటు తిరగాలి. అలా తిరగని ఎమ్మెల్యేలు.. మరోసారి ఆయా సచివాలయాలు సందర్శించాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, వారికి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలు వివరించాలి. ఒక వేళ ఒక గ్రామంలో రెండు రోజుల్లో మొత్తం తిరగలేమనుకుంటే.. మూడు, నాలుగు రోజుల సమయం తీసుకోండి. ఎక్కడా తొందర పడకూడదు. మొక్కుబడిగా పని చేయొద్దు. ప్రభావం చూపే పనుల్లో రాజీ వద్దు ► గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే (హై ఇంప్యాక్ట్ వర్క్) పనులనే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించండి. ఎక్కడా స్వ ప్రయోజనాలు ఆశించకండి. ఎవరినో సంతోష పరచాలని కూడా ఆలోచించొద్దు. ఆ పనుల కోసం ప్రతి సచివాలయానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. అందువల్ల మీరు పనుల ప్రాధాన్యతను గుర్తించి, అక్కడికక్కడే ప్రతిపాదనలతో అప్లోడ్ చేస్తే, వెంటనే ఆమోదం లభిస్తుంది. ► అత్యంత ప్రాధాన్యత కలిగిన 23,808 పనులకు సంబంధించి రూ.930.28 కోట్లతో ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు రాగా, వాటిలో 21,275 పనులకు అనుమతి ఇచ్చాం. ఆ పనుల విలువ రూ.828.45 కోట్లు. వాటిలో 17,905 పనులు మొదలయ్యాయి. ఈ పనుల విలువ రూ.662.14 కోట్లు. మీరంతా మళ్లీ గెలవాలి మీ మీద నాకు ప్రేమ ఎక్కువ. మీలో ఎవరినీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. మీ అందరినీ మళ్లీ చట్టసభలో చూడాలి. అదే నా కోరిక. మనం మన బాధ్యత సక్రమంగా నెరవేర్చకపోతే, కోట్ల మంది నష్టపోతారు. మోసంతో కూడిన రాజకీయాలు.. ప్రజలను ఉపయోగించుకుని వదిలేసే రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు.. అబద్ధాల రాజకీయాలు.. ప్రజల మీద, పేదవాడి మీద ప్రేమ లేని రాజకీయాలు రాజ్యమేలుతాయి. మనకు ఎన్నికలకు ఇంకా 16 నెలల సమయం ఉంది. గడప గడపకూ.. కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? అని ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, ఆ ఇంటికి చేసిన మంచిని వివరించి, వారి ఆశీర్వాదం కోరండి. అప్పుడే వారి నుంచి మనకు సానుకూలత లభిస్తుంది. ఎన్నికల ముందు మీకు అంత సమయం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరితో మమేకం అవ్వండి. అదే మన గెలుపునకు బాటలు వేస్తుంది. -
మార్చి నాటికి పూర్తి స్థాయి నివేదికలు తెప్పిస్తా : సీఎం వైఎస్ జగన్
-
AP: ముందస్తు ఎన్నికలపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ప్రతి రెండున్నర నెలలకు ఓ సారి గడపగడపకు కార్యక్రమంపై సీఎం సమీక్ష ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం.. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు పథకాలు చేరకపోతే అనుకున్న ఆశయం నెరవేరదు. ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి సీరియస్‌గానే సీఎం సమీక్షించారని పేర్కొన్నారు. ‘‘సిన్సియర్‌గా పనిచేయక పోతే మీకే బాగుండదు, నష్టపోతారని సీఎం చెప్పారు. ఎమ్మెల్యేలంతా ప్రతి ఇంటికీ తిరగాలని సీఎం జగన్ ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో పర్ఫార్మెన్స్ బాగుంటే ఆటోమెటిగ్గా అభ్యర్థులుగా ఉంటారు. ఎమ్మెల్యేల పనితీరు బాగుంటే అది సర్వేల్లో ప్రతిబింబిస్తుంది. సైంటిఫిక్ మెథడ్ అనుకుని సర్వేను సీఎం జగన్ ఫాలో అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు గెలిచేలా సీఎం ప్లాన్ వేశారు. మైక్రో లెవెల్ ప్లానింగ్ ఎలా ఉండాలనే విషయమై సీఎం ఆదేశించారు’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘ఏ పార్టీకైనా వారి ఎన్నికల స్ట్రాటజీలు వారికి ఉంటాయి. ప్రతి 3 నెలలకు ఓసారి ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు వస్తుంటాయి. ఏ సమయంలో వచ్చిన నివేదికను ఫైనల్‌గా తీసుకోవాలనేది సీఎం జగన్ ఇష్టం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. దానిపై చర్చే జరగలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా తిరిగి గెలవాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష. ఇచ్చిన అవకాశాన్ని ఎవరూ చేజార్చు కోవద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. చదవండి: సీఎం జగన్ సమీక్ష.. మాజీ మంత్రి కన్నబాబు ఏమన్నారంటే? -
ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని సీఎం చెప్పారు : కురసాల కన్నబాబు
-
చంద్రబాబు ముందస్తు ఆశలు నెరవేరే అవకాశం లేదు : సజ్జల
-
సీఎం జగన్ సమీక్ష.. మాజీ మంత్రి కన్నబాబు ఏమన్నారంటే?
సాక్షి, తాడేపల్లి: Gadapa Gadapaki Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని సీఎం చెప్పారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలకు వివరించాలని, సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారని కన్నబాబు అన్నారు. ‘‘గృహ సారధుల నియామకం కూడా జరగాలి. దాని వ్యవస్థీకృతం చేయాలని సీఎం చెప్పారు. గడప గడపకు కార్యక్రమంపై నిర్లక్ష్యం వద్దని సీఎం చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తక్కువ రోజులు గడప గడప చేశారు. మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే మార్చిలో వర్క్‌షాప్ ఉంటుందని చెప్పారు. ఈలోగా వెనుకబడిన వారి పనితీరు మార్చుకోవాలని సూచించారు.’’ అని కన్నబాబు పేర్కొన్నారు. చదవండి: మద్యం బ్రాండ్లు..అసలు నిజాలు.. రాష్ట్రానికి లిక్కర్ కింగ్ చంద్రబాబే..! -
ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.. ఎవరూ అలక్ష్యం చేయొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును ప్రజలకు వివరించి.. ఆశీస్సులు కోరేందుకు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 32 మంది ఎమ్మెల్యేలు తక్కువ రోజులు పాల్గొన్నారని, రానున్న రోజుల్లో వారు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎవరూ అలక్ష్యం చేయొద్దు. మార్చి నాటికి పూర్తిస్థాయి నివేదికలు తెప్పిస్తానని సీఎం అన్నారు. సీఎం జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..: సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లుగా సమర్థులైన వారే ఉంటారు: నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న కార్యకర్తలను సచివాలయ కన్వీనర్లుగా నియమించడం జరుగుతుంది. ఆ తర్వాత గృహ సారథుల నియామకం జరుగుతుంది. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమిస్తాం. జనవరిలో ఆసరా మూడో దఫా చెల్లింపు జరగబోతున్నది. రూ.6500 కోట్లు ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించి ఇంటింటా ప్రచారం చేస్తూ, వారికి లేఖలు అందిస్తాం. ఆ తర్వాత గృహ సారథుల నియామకానికి సంబంధించి మరో దఫా వెరిఫికేషన్ ఉంటుంది. ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే: సచివాలయాల కన్వీనర్లుగా ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు. వారు సమర్థులై ఉండాలి. వారికి తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్ ఉండి తీరాలి. అయితే ఎక్కడా వలంటీర్లు గృహసారథులుగా ఉండకూడదు. అలాగే వారు ఆ 50 ఇళ్లకు సంబంధించిన వారై ఉండాలి. తప్పనిసరిగా పర్యటించాలి: డిసెంబర్ 21 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్‌ల పంపిణీ మొదలవుతుంది. పగలు ఆ కార్యక్రమం చేసి, సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. అలాగే 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ. ఇక్కడ కూడా వారం రోజుల పాటు ఎమ్మెల్యేలు ఏదో ఒక మండలంలో పర్యటించాలి. సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్దేశించిన విధంగా జరగాలి. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం రెండు రోజులు.. రోజుకు కనీసం 6 గంటల పాటు తిరగాలి. అలా తిరగని ఎమ్మెల్యేలు.. మరోసారి ఆయా సచివాలయాలు సందర్శించాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి ఇంట్లో కనిసం 5 నిమిషాలు గడిపి, వారికి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలు వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి: ఒక వేళ ఒక గ్రామంలో రెండు రోజుల్లో మొత్తం తిరగలేమనుకుంటే, మూడు, నాలుగు రోజుల టైమ్ తీసుకొండి. కానీ ప్రతి ఇంటికి వెళ్లండి. ఎక్కడా తొందరపడకూడదు. మొక్కుబడిగా పని చేయొద్దు. ఒక ఊరు తీసుకుంటే కచ్చితంగా పూర్తి చేయండి. లేకపోతే మీరు తమ ఇంటికి రాలేదని, వారు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. వారు మనకు ఓటేయరని తెలిసినా, మీరు పోవడం మానకండి. ఎందుకంటే వారికి ఎంత మంచి చే«శామన్నది మన దగ్గర రికార్డులు ఉన్నాయి. వాటిని చిరునవ్వుతో వివరిస్తే, వారి మనస్సు మారొచ్చు. కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్లండి. ప్రతి ఇల్లు సందర్శించండి. పనుల్లో రాజీ వద్దు: అలాగే గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే (హై ఇంప్యాక్ట్ వర్క్) పనులనే గుర్తించండి. ఎక్కడా స్వప్రయోజనాలు ఆశించకండి. ఎవరినో సంతోషపర్చాలని కూడా ఆలోచించొద్దు. ఆ పనుల కోసం ప్రతి సచివాలయానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. అందువల్ల మీరు పనుల ప్రాధాన్యతను గుర్తించి, అక్కడికక్కడే ప్రతిపాదనలతో అప్లోడ్ చేస్తే, వెంటనే ఆమోదించడం జరుగుతుంది. మీరంతా మళ్లీ గెలవాలి: ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మీ మీద నాకు ప్రేమ ఎక్కువ. మీలో ఎవ్వర్నీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. మీ అందరినీ మళ్లీ చట్టసభలో చూడాలి. అదే నా కోరిక. మనం మన బాధ్యత సక్రమంగా నెరవేర్చకపోతే, కోట్ల మంది నష్టపోతారు. ఇవాళ రాష్ట్రంలో కులాల మధ్య కాదు.. క్లాస్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది. పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రతి పేదవాడికి ప్రతినిధి ఎవరంటే మనమే. మనం నష్టపోతే పేదవారు నష్టపోతారు. మనం పొరపాటున కూడా అధికారంలోకి రాకపోతే, రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికి కూడా న్యాయం జరగదు. మోసంతో కూడిన రాజకీయాలు. ప్రజలను ఉపయోగించుకుని వదిలేసే రాజకీయాలు. వెన్నుపోటు రాజకీయాలు. అబద్ధాల రాజకీయాలు. ప్రజల మీద ప్రేమ లేని రాజకీయాలు. పేదవాడి మీద అస్సలు ప్రేమ లేని రాజకీయాలు. ఇవీ రాజకీయాలు. అలాంటి రాజకీయాలు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ ధ్యాస పెట్టండి. ప్రతి ఇంట్లో కనీసం రెండు, మూడు నిమిషాలు గడపండి. మీరు ఆ ఇంటికి కేటాయించే సమయం, మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని మీకు చేరువ చేస్తుంది. ఎన్నికలకు ఇంకా 16 నెలలే.. మనకు ఎన్నికలకు ఇంకా 16 నెలల టైమ్ మాత్రమే ఉంది. కాబట్టి, ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, ఆ ఇంటికి చేసిన మంచిని వివరించి, వారి ఆశీర్వాదం కోరండి. అప్పుడే వారి నుంచి మనకు సానుభూతి లభిస్తుంది. ఎందుకంటే, ఎన్నికల ముందు మీకు అంత సమయం ఉండదు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఎందుకు చేస్తున్నామనేది దయచేసి ఆలోచన చేయండి. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, మనం ప్రజా సేవకులం. అధికారం మన చేతిలో ఉన్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది.. మనం అధికారం చలాయించడం కోసం కాదు మనం ఎమ్మెల్యేలుగా ఉండేది. మంత్రులుగా ఉండేది. నేను సీఎంగా ఉండేది. అందుకే ఎదిగేకొద్దీ ఒదగాలి. ఈ అధికారం ఉండేకొద్దీ మనం ఇంకా ఎక్కువ ఒదగాలి. అప్పుడే ప్రజల నుంచి ఇంకా స్పందన లభిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే, నష్టపోతాం. అందుకే ప్రతి ఇంట్లో మనం వారితో కనీసం 5 నిమిషాలు గడిపితే, ప్రజల మద్దతు మనకు దక్కుతుంది. మనల్ని ఆదరిస్తారని సీఎం జగన్ స్పష్టం చేశారు. రూ.828 కోట్ల విలువైన పనులు: గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన పనుల (హై ఇంప్యాక్ట్ వర్క్స్–హెచ్‌ఐడబ్ల్యూ స్)కు సంబంధించి చూస్తే.. 23,808 పనులకు సంబంధించి రూ.930.28 కోట్ల పనుల ప్రతిపాదనలు రాగా, వాటిలో 21,275 పనులకు అనుమతి ఇచ్చారు. ఆ పనుల విలువ రూ.828.45 కోట్లు. వాటిలో 17,905 పనులు మొదలు కాగా, ఆ విలువ రూ.662.14 కోట్లు. -
ఇది కదా జగనన్న పాలన..
నరసన్నపేట: అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లాంలో టీడీపీ సీనియర్ నాయకుడు, తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జల్లు చంద్రమౌళికి మూడున్నరేళ్లుగా ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఈ విషయాలన్నీ వివరించారు. చంద్రమౌళికి రైతు భరోసా కింద రూ. 38,500, సున్నా వడ్డీ కింద రూ.1,168, వైఎస్సార్ ఆసరా కింద రూ. 11,640 ప్రయోజనం కలిగినట్లు వివరించారు. బుక్‌లెట్‌ను ఎమ్మెల్యే కృష్ణదాస్ జల్లు చంద్రమౌళికి ఇచ్చారు. ఇది కదా జగనన్న పాలన అంటే.. అని స్థానికులు చర్చించుకున్నారు. -
అవినీతికి తావు లేకుండా అభివృద్ధి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అవినీతి రహిత పాలన అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని, దీనిపై టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలడం సరికాదని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దళారుల ప్రమేయం లేకుండా, పైసా లంచం ఇవ్వకుండా, పారదర్శకంగా.. అర్హతే ప్రామాణికంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం నగరంలోని పీఎన్‌కాలనీలో మంగళవారం ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనాలతో మాట్లాడితేనే ప్రభుత్వ పనితీరుపై వారి సంతృప్తి స్థాయి తెలుస్తుందని చెప్పారు. వ్యవస్థ దానంతటదే పని చేసుకునే పద్ధతి రావాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో అలాగే జరుగుతుందన్నారు. మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజలకు పథకాలు అందించాలని అప్పట్లో ప్రధానిగా రాజీవ్ గాంధీ చెప్పారన్నారు. మధ్యవర్తుల కారణంగానే అప్పట్లో 90 శాతం స్కీమ్‌లు అర్హులకు చేరేవి కావన్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, వ్యవస్థను మార్పు చేస్తూ వివిధ పథకాల కింద లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా ప్రజలకు నేరుగా అందించామని స్పష్టం చేశారు. ఇది మార్పు కాదా? అని ప్రశ్నించారు. విద్యా రంగంలో సంస్కరణల ద్వారా మంచి మార్పులు తీసుకొచ్చామన్నారు. నిన్నా మొన్నటి వరకు రాష్ట్రం అక్షరాస్యతలో దేశంలో 22వ స్థానంలో ఉండేదని, తాజా సంస్కరణల వల్ల ఆ పరిస్థితిలో బాగా మార్పు వస్తోందన్నారు. అయితే సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంత వ్యతిరేకత ఉండటం సహజమని చెప్పారు. ప్రజలు వాటిని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుందన్నారు. ఇది అర్థం కాని వారే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని వివరించారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ హయాంలోనే జిల్లా అభివృద్ధి ► బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్, రూ.3 వేల కోట్లతో భావనపాడు పోర్టు నిర్మించనున్నాం. గొట్టా బ్యారేజ్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఉద్దానంలో రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు, పలాసలో కిడ్నీ రోగుల కోసం రూ.50 కోట్లతో డయాలసిస్ సెంటర్, ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. ► జిల్లాల పునర్విభజన పూర్తయింది. రిమ్స్‌ను 900 పడకలతో తీర్చిదిద్దాం. ఇదంతా అభివృద్ధి కాదా? ఇది టీడీపీ నేతలకు కనిపించడం లేదా? మరో తెలంగాణ కాకూడదు.. ► రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను చంద్రబాబు పట్టించుకోకుండా, నారాయణ కమిటీ సిఫార్సులను అమలు చేయడం దారుణం. చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం వారి స్వార్థానికి రాష్ట్రంలో ప్రజలందరినీ బలి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మరో తెలంగాణ కాకూడదు. ఈ దృష్ట్యా పాలన రాజధాని విశాఖే అన్న నినాదం వినిపించేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజల వెనుకబాటుతనాన్ని గుర్తించిన నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి. ► వైజాగ్.. రాష్ట్రం మధ్యలో లేదని కొంత మంది చెప్పడం హాస్యాస్పదం. దేశంలో తమిళనాడు, మహారాష్ట్రల్లో చెన్నై, ముంబై ఎక్కడ ఉన్నాయో గమనించాలి. పాలన రాజధానిగా అందరినీ ఆదరించే గుణం వైజాగ్ సొంతం. న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. దేశంలో సుమారు 8 రాష్ట్రాల్లో ఈ విధంగా రాజధానులు ఉన్నాయి. -
ఊరూరా అదే జోరు
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో గురువారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కు తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
వాడవాడలా వేడుకగా
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో సోమవారం ఈ కార్యక్రమం సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే అక్కడికక్కడే వాటిని పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పారు. -
ప్రాధాన్య పనులు వేగంగా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వేగం పుంజుకుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సచివాలయాల సందర్శన సందర్భంగా అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనులకు నిధులు మంజూరు చేసి ప్రారంభించడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ వరకు 3,120 సచివాలయాల పరిధిలో రూ.624 కోట్ల విలువైన ప్రాధాన్యత పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటివరకు 17,107 గుర్తించగా 15,163 అత్యంత ప్రాధాన్యత పనులను మంజూరు చేశారు. ఇందులో ఇప్పటికే 1,697 సచివాలయాల పరిధిలో 8,248 పనులు ప్రారంభమయ్యాయి. వీటికి అవసరమైన సిమెంట్‌ను వైఎస్సార్ నిర్మాణ పోర్టల్ ద్వారా రాయితీపై కొనుగోలు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ ఆదేశించారు. ప్రాధాన్యత పనులను చేపట్టేందుకు సచివాలయాలకు రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.3,000.88 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనుల మంజూరు, ప్రారంభంపై సీఎస్ సమీర్ శర్మ ప్రతీ గురువారం వీడియో కాన్పరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అత్యధికంగా రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ పనులు గడప గడపకు మన ప్రభుత్వంలో అత్యధికంగా అంతర్గత రహదారులు, మంచినీటి పథకాలు, డ్రైనేజీ పనులను మంజూరు చేస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ లైన్ల మార్పు పనులకు డిమాండ్ ఉందని, ట్రాన్స్‌కోకు అడ్వాన్స్ చెల్లింపులు లేకుండా వీటిని చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. అడ్వాన్స్ చెల్లింపుల నుంచి వీటికి మినహాయింపు కల్పించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనులను అప్లోడ్ చేసిన వారంలోగా మంజూరు చేయడంతో పాటు నెల రోజుల్లోనే ప్రారంభిస్తున్నామన్నారు. -
అభివృద్ధే మన అజెండా.. ప్రతి ఒక్కరికీ సంక్షేమం
ఒంగోలు: అభివృద్ధే మన అజెండా అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం మూడో డివిజన్ అయిన కరుణాకాలనీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని బాలినేని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లింల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. వాసన్నా అంటూ ఆప్యాయతను కనబరిచారు. కరుణాకాలనీలో కబేలా స్థలం ఖాళీగా ఉందని, దానిని కమ్యూనిటీ స్థలం కోసం కేటాయిస్తే తమ ప్రాంతంలో ఇబ్బందులు తొలగిపోతాయంటూ పలువురు ప్రజలు బాలినేనికి విజ్ఞప్తి చేశారు. దీనిని వెంటనే పరిశీలించి నివేదిక అందజేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ను బాలినేని ఆదేశించారు. అదే విధంగా కొంతమంది పరిస్థితి దయనీయంగా ఉండడం చూసి చలించిన బాలినేని అక్కడికక్కడే వారికి కొంత మొత్తం ఆర్థిక సాయం అందించారు. అదే విధంగా మరికొంతమంది డ్రైనేజీ కాలువలు మరమ్మతులు చేపట్టాలని కోరారు. విద్యుత్ లైన్లు ఇళ్లకు అందుబాటులో ఉంటున్నాయని, తద్వారా ప్రమాదం జరిగే ఉందంటూ వివరించారు. రేషన్ బియ్యం, సంక్షేమ ఫలాలతోపాటు ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయా లేదా అంటూ బాలినేని అడిగి తెలుసుకున్నారు. గతంలో పెన్షన్ కోసం తిండీ తిప్పలు లేకుండా ఒకటికి రెండు రోజులు పడిగాపులు పడాల్సి వచ్చేదని, అప్పుడు కూడా వేలిముద్రలు పడడంలేదంటూ అధికారులు తిప్పి పంపేవారన్నారు. కానీ నేడు ఒకటో తేదీ నిద్రలేచే సరికే పెన్షన్ చేతిలో పెడుతున్నారని, నిజంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చల్లగా ఉండాలంటూ వృద్ధులు దీవించారు. సాయంత్రం ప్రకాశం కాలనీలో పర్యటించారు. బాలినేని వెంట స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, ఆమె భర్త గండు మధు, 3వ డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్, నగర మేయర్ గంగాడ సుజాత, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జిలాని, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, వైఎస్సార్ కళాపరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి షేక్ దస్తగిరి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, ఒంగోలు నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ, బడుగు ఇందిర, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, అయినాబత్తిన ఘనశ్యాం, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షేక్ మీరావలి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోలి తిరుపతిరావు, ఒంగోలు సూపర్‌బజార్ డైరెక్టర్ వల్లెపు మురళి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖుద్దూస్, షేక్ రజాక్, వైఎస్సార్సీపీ నగర కార్యదర్శి షేక్ సలాం, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు గోవర్థన్‌రెడ్డి, వీరాంజనేయస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ దుగ్గిరెడ్డి వీరాంజనేయరెడ్డి, కొమ్మూరి రవిచంద్ర, కార్పొరేటర్లు అంగిరేకుల గురవయ్య, తాడి కృష్ణలత ఉన్నారు. -
మాటిస్తున్నా...మా ప్రభుత్వం దాన్ని క్లియర్ చేస్తుంది
-
అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మఒడి ఇస్తాం: వెల్లంపల్లి
-
‘గడప గడపకు’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన.. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికెళ్లిన వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విద్యాధరపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. గడప గడపకి కార్యక్రమంలో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇంటికి వెళ్లారు. ఆయన భార్య జయప్రదకు రైతు భరోసా కింద 13,500 రూపాయలు అందినట్లుగా ధ్రువీకరణ ప్రతాన్ని అందజేశారు. చదవండి: ‘సైకిల్’ కకావికలం.. కుప్పంలో పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ఇంటిలోనే ఉన్నప్పటికీ వర్ల రామయ్య, ఆయన భార్య జయప్రద బయటకురాలేదు. ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి డ్రైవర్‌ను పంపించారు. రైతు భరోసా అందినట్లుగా డ్రైవర్ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంట్లో కూడా రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. టీడీపీ నేత కూడా ప్రభుత్వ పథకం అందుకున్నారన్నారు. అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి ఇస్తామని వెల్లంపల్లి అన్నారు. -
చంద్రబాబు సృష్టించిన మాయా లోకమే భ్రమరావతి: కొడాలి నాని
సాక్షి, గుడివాడ: కృష్ణా జిల్లాలోని గుడివాడ 17వ వార్డులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అధికార యంత్రాంగంతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమరావతి పేరుతో చేస్తున్న పాదయాత్ర, చంద్రబాబులపై విమర్శలు గుప్పించారు. ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటం.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటమని పేర్కొన్నారు. ‘తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారు. చంద్రబాబు సృష్టించిన మాయా లోకమే భ్రమరావతి. రాష్ట్రంలో అందరూ బాగుండాలని జగన్ కోరుకుంటున్నారు. అందరూ బాగుండాలని 95 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు. మేము మాత్రం బాగుండాలని అమరావతి రైతులు విచిత్రంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది. ఆరు నూరైనా మూడు రాజధానులను కొనసాగిస్తాం.’ అని స్పష్టం చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇదీ చదవండి: ‘దళిత జాతిని అవమానపర్చిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్ మాటంటే మాటే’ -
ఇంటింటా ఆనందం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రతి ఇంటివద్ద ప్రజలు ఆనందంతో స్వాగతం చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ సోమవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే తామంతా నడుస్తామని ప్రజాప్రతినిధులతో ప్రజలు చెప్పారు. -
‘గడప గడపకు ప్రభుత్వం’ ఫలితాలు షురూ
‘గడప గడపకు ప్రభుత్వం’ అన్నది ఓ విశిష్ట కార్యక్రమం. దీనిని నిరంత రాయంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పం ఆహ్వానించదగినది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు అందుతాయి. ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధుల పని తీరుతోపాటు పార్టీ నేతల భాగ స్వామ్యం, అప్పగించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో వారు చూపుతున్న శ్రద్ధ తదితర అంశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించడమేకాక, తన అభి ప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. పనితీరు సరిగాలేని పార్టీ నేతల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. పనితీరు మార్చుకోకుంటే తప్పిస్తానని నిష్కర్షగా చెబు తున్నారు. ఇవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో సరి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రజలకిచ్చిన హామీలలో 97 శాతం మేర నెరవేరు స్తున్నందున ప్రజలలో సంతృప్తి స్థాయిలు ఎక్కువగా ఉంటా యని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచనా. అయితే, ప్రజల సంతృప్తి అన్నది మొత్తంగా ప్రభుత్వంపైనా, తాము ఎన్ను కొన్న ప్రజాప్రతినిధి పనితీరు పైనా, అధికార యంత్రాంగం స్పందనపైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల తానొక్కణ్ణే కష్టపడితే సరిపోదనీ, ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న దాంట్లో అబద్ధం ఏముంది? ఎన్ని పనులు చేసినా ఇంకా చేయాల్సి నవి ఉంటూనే ఉంటాయి. అలాగే సమన్వయ లోపంతో కొన్ని పనులు జరగడం ఆలస్యం అవుతుంది. ‘గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం’లో అక్కడక్కడ ఎమ్మెల్యేలకు ప్రజల నుండి నిరసన వ్యక్తం అవుతున్న మాట నిజమే. అయితే, దాని గురించి బెంబేలు పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఏ పాలకుడి వద్ద రాత్రికిరాత్రే అద్భుతాలు సృష్టించే మంత్ర దండం ఉండదు. కష్టపడాల్సిందే. అందరి సహకారం స్వీకరించాల్సిందే. అప్పుడే ఫలితాలు అందుతాయి. రాష్ట్రంలో అమలు జరుగుతున్న ‘నవరత్నాల’ను ఒక్క ఏడాది కంటే ఎక్కువ కాలం కొనసాగించలేరని కొందరు జోస్యం చెప్పారు. కానీ, కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ రథ చక్రాలు ఆగలేదు. ఏ ఒక్క పథకమూ కుంటు పడలేదు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 97 శాతం పైగా అమలు చేయడం అన్నది బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు. ఒకట్రెండు హామీల విష యంలో వాటిని యుధాతథంగా అమలు చేయ డానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించే స్థితిలో లేనందువల్ల వాటిని మెరుగైన విధానంలో అమలు చేస్తామని ధైర్యంగా, నిజాయితీగా చెప్పగలగడం కూడా గతంలో లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దాడి చేస్తున్న వారి ప్రధాన ఆరోపణల్లో ఒకటి రాష్ట్రంలో సంపద సృష్టి జరగడం లేదన్నది. ఆంధ్రప్రదేశ్‌లో 2 ఎకరాల భూమి విలువకు ప్రస్తుతం తెలంగాణలో 1 ఎకరం భూమి మాత్రమే వస్తుందట. ఈ ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర ప్రదేశ్‌లో భూముల విలువ పడిపోయిందంటూ కొందరు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి, ఇదొక డొల్ల వాదన. వీరి దృష్టిలో సంపద అంటే కేవలం రియల్ ఎస్టేట్. తెలం గాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో స్థిరపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతి ప్రాంతంలో కోట్లు కుమ్మ రించి భూములు కొన్నారు. వాస్తవిక అంతర్గత విలువ (ఇంట్రిన్సిక్ వాల్యూ) లేకుండా కేవలం ప్రచారార్భాటంతో విలువను పెంచి అదే సంపద సృష్టిగా చెప్పుకొన్నారు. నిజానికి అసలైన అభివృద్ధి ఏమిటన్నది ఈ 3 ఏళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమా ణాలు మెరుగుపర్చడమే సంపద సృష్టి అని నిరూపించారు. పెట్టుబడిదారీ విధానంలో ప్రభుత్వాలు వ్యాపారాలు చేస్తాయి. లాభాలు కోసం వెంపర్లాడతాయి. అదికూడా తమ ప్రయోజనాలు కాపాడే వర్గాల కోసం. కానీ, జగన్ విధానం వ్యక్తిగతమైన లాభాలు అందించే వ్యవస్థను ప్రోత్సహించడం కాదు. అన్ని వర్గాలను, ప్రత్యేకించి దశాబ్దాలుగా అణగారి ఉన్న వర్గాలను బాగు చేయడం. వారిని ఆర్థికంగా, సామా జికంగా, రాజకీయంగా సాధికా రుల్ని చేయడం. నిజమైన అభివృద్ధి, నిజమైన సంపద సృష్టి అంటే అదే. కానీ, ఈ అభివృద్ధి నమూనాను కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమను తాము ఎలీట్ వర్గాలుగా భావిస్తూ సమాజంలో ఉన్నత విద్య, వైద్య సదుపాయాలు అనుభవించడం తమ జన్మహక్కుగా, అన్ని రంగాలలో పైచేయి తమదే ఉండాలన్న ఫ్యూడల్ మనస్తత్వంతో... పేదలు, బడుగు బలహీన వర్గాలవారు సామాజిక, ఆర్థిక నిచ్చెనమెట్ల ద్వారా పైకి చేరుకొంటుంటే చూచి సహించ లేకపోతున్నారు. ఎలీటెస్ట్ థియరీ (శ్రేష్టవర్గ సిద్ధాంతం) ప్రకారం వారు తమకు కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆపాదించు కొంటారు. వారు ఇతర వర్గాల ప్రజలతో కలిసి ఉండడానికి ఇష్టపడరు. కానీ, ఆ వర్గాల ఓట్లతోనే అధికారం సంపాదిం చాలని చూస్తారు. ఉదాహరణకు అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ ఎలీట్ వర్గాలు నిరాకరించాయి. రాజ ధాని ప్రాంతాన్ని కూడా ఓ గేటెడ్ కమ్యూనిటిలా తయారు చేయాలనుకొన్నారు. అందువల్లనే... అమరావతిలో పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ‘సామాజిక సమతుల్యత’ దెబ్బతింటుందని పేదలను, బలహీన వర్గా లను అవమానపర్చే విధంగా చెప్పారు. అంటే ప్రభుత్వం అన్నది కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే పని చేయాలా? లేక జగన్ విధానంలో లాగా పేదల కోసం పని చేయాలా? రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి అన్నది కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు పరిమితం చేయాలా? లేక అన్ని వర్గాల ప్రజలకూ అందించాలా? గత 3 ఏళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వ విజయాలు చెప్పు కోవడానికి చాలానే ఉన్నా... అన్నింటిలోకెల్లా భూమిలేని నిరుపేదలకు 36 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం అన్నది ఓ చారిత్రాత్మక విజయం. స్వాతంత్య్రానంతరం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వ లేదు. ఇపుడు రాష్ట్ర ప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజాకేంద్రక అభివృద్ధి నమూనాకు మద్దతు పలకడం. సామాన్యులు, పేదలూ 2024లో కూడా వైసీపీనే గెలిపించాలి. పెట్టుబడిదారీ వర్గా లకు మరోసారి కోలుకోలేని గుణపాఠం నేర్పాలి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
వాడవాడలా వేడుకగా..
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తోన్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఓ వైపు వర్షం కురుస్తున్నా అన్ని జిల్లాల్లో శనివారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవించారు. -
గడపగడపకు మన ప్రభుత్వం: శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
ఒంగోలు సబర్బన్: నగరంలోని శివారు ప్రాంతాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని మూడో డివిజన్లో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బాలినేని నిర్వహించారు. తొలుత డివిజన్ ప్రారంభంలోని బలరాం కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడో డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, మధు దంపతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు బాలినేనికి గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం మిలటరీ కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని స్థానికులను అడిగి బాలినేని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో డివిజన్లో ఎక్కువ భాగం స్లమ్ ఏరియా ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మూడో డివిజన్లో రోడ్లు వేశామని ప్రగల్భాలు పలికారంటూ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై ధ్వజమెత్తారు. నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ, ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. మూడో డివిజన్లో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందన్నారు. ఈ డివిజన్లో ఎక్కువ అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు. డివిజన్లోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. వలంటీర్ల పనితీరు కూడా సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మళ్లీ సీఎంగా వైఎస్ జగన్, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని గెలవాలని నినాదాలు చేశారు. మిలటరీ కాలనీలో ఒక మహిళ మంచినీటి ట్యాప్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇవ్వలేదని బాలినేని దృష్టికి తీసుకురాగా, ఎంఈ కే మాల్యాద్రిని పిలిచి బాలినేని ప్రశ్నించారు. మూడు రోజుల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తామని ఎంఈ తెలిపారు. ఓ ఇంటి వాకిటికి ఎదురుగా విద్యుత్ స్తంభం ఉండటాన్ని బాలినేని గమనించారు. అక్కడకు వెళ్లినప్పుడు ఆ ఇంటి మహిళ కూడా విద్యుత్ స్తంభం సమస్యను బాలినేని దృష్టికి తీసుకురావడంతో విద్యుత్ ఏఈని పిలిపించిన బాలినేని.. ఆ స్తంభాన్ని పక్కకు మార్చాలని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కాలువల నిర్మాణానికి శంకుస్థాపన... గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మిలటరీ కాలనీలో కాలువ నిర్మాణానికి బాలినేని శంకుస్థాపన చేశారు. టెంకాయలు కొట్టి భూమి పూజ చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మిలటరీ కాలనీ, మసీదు కాలనీ, బాలినేని భరత్ కాలనీల్లో కాలువల నిర్మాణానికి ఇప్పటికే రూ.30 లక్షలు మంజూరు చేశామని, తొలుత మిలటరీ కాలనీలో కాలువ పనులు ప్రారంభించామని బాలినేని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షుడు ఎస్కే జాఫర్, కార్పొరేటర్లు ఎందేటి పద్మావతి రంగారావు, చల్లా తిరుమల రావు, తాడి కృష్ణలత, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వాకా బసివిరెడ్డి, ఇస్లాంపేట జిలానీ, బేతంశెట్టి శైలజ, యరజర్ల రమేష్, ఊసా మధుబాబు, డివిజన్ నాయకులు సుల్తాన్, రమీజా, కోటయ్య, చిన్నా, పేరిరెడ్డి, రాజేంద్ర, హబీబ్, వెంకట్, సుజాత, డానియేలు, అమర్, తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమాభివృద్ధికి సలాం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సోమవారం ఉత్సాహంగా కొనసాగింది. గ్రామ గ్రామానా ప్రజలు ఎదురేగి నాయకులకు స్వాగతం పలికారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ఇంటికి వచ్చి సమస్యల గురించి అడుగుతుండటంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని సమస్యల పరిష్కారం కోసం నాయకులు అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో తమకు అందిన సంక్షేమ పథకాలపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 95 శాతం హామీలను అమలు చేసిందని, రానున్న కాలంలో మరింత లబ్ధి చేకూరుస్తుందని నాయకులు వివరించారు. -
మీ దీవెనలే ప్రభుత్వానికి బలం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద అపూర్వ ఆప్యాయత దక్కుతోంది. అన్ని జిల్లాల్లో శనివారం ఈ కార్యక్రమం ఉల్లాసంగా..ఉత్సాహంగా సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి, మీకు మా ఆశీస్సులు ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవించారు. మీ చల్లని దీవెనలే మన ప్రభుత్వానికి బలమని, మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ఈ సందర్భంగా వారు ప్రజలకు చెప్పారు. -
గ్రామాలు, వార్డుల్లో పనుల జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తూ.. ప్రాధాన్యత పనులను గుర్తిస్తున్నారు. వాటిని మంజూరు చేసి, పనులు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే 4,199 సచివాలయాలను ఎమ్మెల్యేలు, మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా వాటి పరిధిలో 12,428 ప్రాధాన్యత పనులను గుర్తించగా, వాటి వివరాలను అప్లోడ్ కూడా చేశారు. ఇందులో 7,329 పనులను అధికారులు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 1,044 పనులను ప్రారంభించారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 305 పనులు, తూర్పుగోదావరిలో 202, బాపట్లలో 200, శ్రీకాకుళంలో 157, కాకినాడ జిల్లాలో 152 పనులు ప్రారంభమయ్యాయి. అత్యధికంగా పార్వతిపురం మన్యం జిల్లాలో 513 పనులు, ప్రకాశంలో 483, అనకాపల్లిలో 443, కాకినాడలో 440, పల్నాడులో 423, బాపట్ల జిల్లాలో 404 పనులు మంజూరు చేశారు. ఈ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున రూ.3,000.88 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గుర్తించిన మరుసటి రోజే పనులు అప్లోడ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సచివాలయాలను సందర్శించిన మరుసటి రోజే ప్రాధాన్యతగా గుర్తించిన పనులను వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకున్నాం. వారంలోగా మంజూరు చేసి, నెలలోనే పనులు ప్రారంభించేలా చూస్తున్నాం. వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నూరు శాతం పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రాధాన్యత పనులుగా గుర్తించిన వాటిలో మిగిలిన 5,099 పనులను ఈ నెల 5వ తేదీలోగా మంజూరు చేసి, ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
గడప గడపకు కార్యక్రమంలో స్పందన బాగుంది : సజ్జల
-
గడప గడపకు పనులు 'నెలలో మొదలు'
సాక్షి, అమరావతి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఆయా సచివాలయాల పరిధిలో నెల రోజుల్లోగా ప్రాధాన్యత పనులు ప్రారంభం కావాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ–క్రాప్ జాబితాలను అక్టోబర్ 25న సచివాలయాల్లో ప్రదర్శించాలని నిర్దేశించారు. డిసెంబర్ 21 నాటికి ఐదు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్ – 3 కింద డిసెంబర్లో ఇళ్లను మంజూరు చేయాలన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనే కలెక్టర్ల పనితీరుకు ప్రామాణికమని, వాటి ఆధారంగానే మార్కులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 26న రైతు భరోసా రెండో విడత సాయంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కూడా విడుదల చేస్తామని తెలిపారు. వసతి దీవెన నవంబర్ 10న విడుదల చేస్తామని చెప్పారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెలలో ఆరు సచివాలయాలు.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల అభ్యర్థనల మేరకు ప్రాధాన్యత పనులకు ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించాం. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఎలాంటి ఆలస్యం, అలసత్వానికి తావు ఉండకూడదు. 15,004 సచివాలయాలను ఈ కార్యక్రమం ద్వారా సందర్శిస్తున్నాం. ఎమ్మెల్యేలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, మండల స్థాయి సిబ్బంది అంతా నెలలో కనీసం 6 సచివాలయాలను సందర్శించాలి. ఎమ్మెల్యేలు కనీసం రెండు రోజుల పాటు సంబంధిత సచివాలయంలో గడిపి ప్రతి ఇంటినీ సందర్శించాలి. ఒక రోజులో కనీసం 6 గంటల పాటు గడప గడపకూ నిర్వహించాలి. మండల అధికారులు, పాలనా సిబ్బంది, సచివాలయ సిబ్బంది కూడా అంతే సమయం గడపాలి. పక్కాగా ఈ–క్రాపింగ్ ఈ– క్రాప్ అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. పొరపాట్లకు తావులేకుండా నూరు శాతం పూర్తి చేయాలి. కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. ఈ సీజన్లో 107.62 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. రైతులను వారి క్షేత్రాల్లోకి తీసుకెళ్లి ఫొటో తీసుకోవడం, వివరాల నమోదు సెప్టెంబరు 30లోగా పూర్తిచేయాలి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వీఆర్వోలు బయోమెట్రిక్ ద్వారా వీటిని ఆధీకృతం చేయాలి. అక్టోబరు 3లోగా ఇది పూర్తి చేయాలి. రైతుల కేవైసీలను అక్టోబరు 10లోగా పూర్తి చేయాలి. అక్టోబరు 10 నుంచి రైతులకు ఇ– క్రాప్ డిజిటల్ రశీదులు, ఫిజికల్ రశీదులు ఇవ్వాలి. అక్టోబరు 15 లోగా అది పూర్తి చేసి సోషల్ ఆడిట్ చేపట్టాలి. అక్టోబరు 25 నుంచి వారం రోజుల పాటు ఇ–క్రాప్ తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. నవంబరు 1 నుంచి తుది జాబితాను అన్ని పోర్టల్స్‌లో అందుబాటులో ఉంచాలి. ఈ షెడ్యూల్ ప్రకారం ఇ– క్రాప్ పూర్తిచేసే బాధ్యత కలెక్టర్లదే. కనీసం 10 శాతం ఇ–క్రాప్‌ను స్వయంగా ఎంఏవో, ఎమ్మార్వోలు పరిశీలించాలి. కనీసం 6 శాతం ఆర్డీఏలు, ఏవీఏలు పరిశీలించాలి. కనీసం 5 శాతం ఇ–క్రాప్‌లను డీవోలు, 2 శాతం ఇ–క్రాప్‌లను జేసీలు, ఒక్క శాతం కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలి. 17.05 కోట్ల పని దినాలు ఉపాధిహామీ కింద ఇప్పటివరకూ 17.05 కోట్ల పనిదినాలను సృష్టించడం అభినందనీయం. ఇప్పటివరకూ సగటు వేతనం రూ.210.02 ఉండగా కనీసం రూ.240 చొప్పున అందేలా కృషి చేయాలి. కేంద్రం నుంచి రూ.1,400 కోట్ల ఉపాధిహామీ బకాయిలు త్వరలోనే వస్తాయి. రాగానే వెంటనే విడుదల చేస్తాం. సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. డిజిటల్ లైబ్రరీలపై ప్రత్యేక శ్రద్ధ డిసెంబర్‌లోగా 4,500 గ్రామ సచివాలయాలకు కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కలుగుతుంది. అక్కడ డిజిటల్ లైబ్రరీలను పూర్తి చేయాలి. మిగిలిన చోట్ల కూడా డిజిటల్ లైబ్రరీలపై కలెక్టర్లు దృష్టి సారించాలి. పులివెందుల నియోజకవర్గం వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌లో ఏర్పాటైన డిజిటల్ లైబ్రరీని వినియోగించుకుంటూ గ్రామానికి చెందిన 30 మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం గృహ నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్ధ పుంజుకుంటుంది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో గృహ నిర్మాణం బాగుంది. సత్యసాయి, ప్రకాశం, అనకాపల్లి, కృష్ణా, అనంతపురం జిల్లాలు దీనిపై దృష్టి పెట్టాలి. విశాఖలో 1.24 లక్షల ఇళ్లను కేటాయించాం. అక్టోబరు నాటికి అన్ని ఇళ్ల పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలి. కనీస సదుపాయాలు (బోర్‌వెల్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు, అప్రోచ్ రోడ్లు, సీడీ వర్క్స్, గోడౌన్స్) ఇప్పటికే 85 శాతం పూర్తయ్యాయి. ఇక్కడ ఇళ్ల పనులు వేగంగా జరిగేలా సంబంధిత కలెక్టర్లు చూడాలి. పూర్తయిన పనులకు సంబంధించి పేమెంట్లు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగంగా ముందుకు సాగాలి. ఆప్షన్ 3 కింద 3.27 లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. 10 వేల ఇళ్లకు పైబడి ఉన్న లే అవుట్లలో స్టేజ్ కన్వర్షన్ వేగంగా జరగాలి. విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, కాకినాడ, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, ఆదోని, తిరుపతి, జీవీఎంసీ లే అవుట్లపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలి. డిసెంబర్ 21 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం డిసెంబర్ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తిచేసేలా అడుగులు ముందుకేయండి. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలి. ఇళ్లు పూర్తయ్యే నాటికి ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. మిగిలిపోయిన లబ్ధిదారులకు డిసెంబర్లో ఫేజ్ 3 కింద ఇళ్ల మంజూరుకు కలెక్టర్లు కార్యాచరణ రూపొందించాలి. పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలపై ఆడిట్ ప్రక్రియ వచ్చే 20 రోజుల్లో సంపూర్ణంగా పూర్తి కావాలి. డిసెంబర్ నాటికి 1.75 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తిచేసి ఇవ్వబోతున్నాం. ఈమేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి కావాలి. ఎస్వోపీల ప్రకారం సర్వే జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష సర్వేలో భాగంగా ఇప్పటివరకూ 5,738 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ పూర్తైంది. 2,662 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలు జిల్లాలకు విడుదలయ్యాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం సర్వే ప్రక్రియ సాగాలి. స్పందన ఆర్జీల్లో సమయ పాలన, నాణ్యత స్పందన అర్జీల్లో సమయ పాలన, నాణ్యత కనిపిస్తోంది. దీనికి దోహదపడ్డ అధికారులకు అభినందనలు. నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాని పెండింగ్ కేసులు, తిరిగి విచారణ చేయాల్సిన అర్జీల సంఖ్య బాగా తగ్గింది. పరిష్కారంలో నాణ్యత ఉందనేందుకు ఇది నిదర్శనం. కలెక్టర్లు అందరికీ అభినందనలు. అర్జీ పరిష్కారానికి ముందు విచారణ వివరాలను అర్జీదారులకు ఫోన్ ద్వారా తెలియజేయాలి. ఈ కొత్త ఫీచర్ సెప్టెంబరు 14 నుంచి ప్రారంభమైంది. ఇది తప్పనిసరిగా అమలు చేయాలి. దరఖాస్తుదారుడితో లొకేషన్లో సెల్ఫీ తీసుకుని అప్లోడ్ చేయాలి. ఈ ఫీచర్ కూడా సెప్టెంబరు 26 నుంచి మొదలైంది. ఇది కూడా తప్పనిసరిగా పాటించాలి. సచివాలయాల్లో రోజూ సాయంత్రం స్పందన ప్రతి బుధవారం కలెక్టర్లు స్పందనపై సమీక్ష చేయాలి. సచివాలయాల్లో రోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకూ స్పందన నిర్వహించాలి. కలెక్టర్ల నుంచి దిగువ స్థాయి అధికారుల వరకూ తప్పనిసరిగా స్పందనలో పాల్గొనాలి. స్పందనలో పాల్గొన్న అధికారులు కలెక్టర్లు నిర్వహించే సమీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలి. స్పందన అర్జీల పరిష్కారంలో కలెక్టర్లు, అధికారులు, ఎస్పీలు మానవీయత ప్రదర్శించాలి. తిరిగి విచారణ చేయాల్సిన అర్జీల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాలి. అలా జరిగితేనే అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉన్నట్లు. తిరిగి అదే సమస్యపై అర్జీ వస్తే పై అధికారి లేదా మరో అధికారితో విచారణ చేయించండి. ఎస్డీజీ లక్ష్యాలపై కలెక్టర్ల పర్యవేక్షణ ఎస్డీజీ లక్ష్యాలపై కలెక్టర్లు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి. డేటాను సక్రమంగా అప్లోడ్ చేయాలి. అప్పుడే ఎస్‌డీజీల్లో మార్పులు కనిపిస్తాయి. ఎస్డీజీల ఆధారంగానే కలెక్టర్లకు మార్కులు కేటాయిస్తాం. పనితీరు, సమర్థత ఎస్డీజీ లక్ష్యాల సాధన ఆధారంగా నిర్ణయిస్తాం. ఎస్డీజీ లక్ష్యాల సాధనను మన రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చూస్తుంది. ఏసీబీ, ఎస్ఈబీ నంబర్లతో పోస్టర్లు దిశ యాప్‌ను ప్రతి ఇంట్లో డౌన్లోడ్ చేసుకునేలా చూడాలి. దిశ పనితీరుపై పర్యవేక్షణ చేసేలా కలెక్టర్లు, ఎస్పీలు మాక్ కాల్స్ చేయాలి. అవినీతి నిర్మూలనకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ నంబర్ 14400 పోస్టర్ అందరికీ కనిపించేలా 3 గీ 5 సైజులో ఉండాలి. ఈ పోస్టర్ లేకపోతే సంబంధిత కార్యాలయంలో ఉండే ముఖ్య అధికారిని బాధ్యుడ్ని చేయాలి. ప్రతి యూనివర్శిటీ, కాలేజీలో కూడా ఎస్ఈబీ నంబర్ 14500 ఉండాలి. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి. భూసేకరణపై దృష్టి పెట్టాలి జాతీయ రహదారులకు భూ సేకరణపై కలెక్టర్లు దృష్టి సారించాలి. బెంగళూరు– విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రంలో 345 కి.మీ మేర ఉంది. దాదాపు రూ.17 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణపై దృష్టిపెట్టాలి. జాతీయ రహదారులకు సంబంధించి 2,758 కి.మీ పరిధిలో రూ.33,507 కోట్లతో చేపడుతున్న 95 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మరో 2,687 కిలోమీటర్ల పరిధిలో రూ.55,890 కోట్లతో చేపడుతున్న మరో 63 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధంగా ఉన్నాయి. జాతీయ రహదారులకు సంబంధించి దాదాపు రూ.1.05 లక్షల కోట్లకు పైగా విలువైన పనులు చేపడుతున్నాం. వీటికి భూసేకరణపై కలెక్టర్లు దృష్టి సారించాలి. సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీస్ అజయ్ జైన్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. వేగంగా మంజూరు.. ప్రారంభం ఒక సచివాలయంలో రెండు రోజుల పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగిశాక అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనులను మంజూరు చేయాలి. వాటిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. మంజూరైన నెల రోజుల్లోగా పనులు ప్రారంభం కావాలి. నిర్దేశించుకున్న మేరకు ప్రతి వార్డు లేదా గ్రామ సచివాలయంలో రెండు రోజులపాటు రోజుకు 6 గంటలపాటు గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించకుంటే పనులు మంజూరు కావు. ఇప్పటివరకూ గడప గడపకూ నిర్వహించిన సచివాలయాల్లో ప్రాధాన్యతగా గుర్తించి పెండింగ్‌లో ఉన్న పనులను అక్టోబర్ 5లోగా మంజూరుచేయాలి. అవి అక్టోబర్ చివరి నాటినుంచి ప్రారంభం కావాలి. -
వారసులు అందరికీ ఉంటారు.. కానీ ఆమోదించాల్సింది వారే..
సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యమైనా గెలుపేనని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో చెప్పారన్నారు. ఈ మేరకు మంత్రి బొత్స మాట్లాడుతూ.. 'వారసులు అందరికీ ఉంటారు, నాకూ మా అబ్బాయి ఉన్నాడు.. మా వాడు వైద్య రంగం వైపు వెళ్లాడు. ఎవరైనా వారసుల్ని దింపొచ్చు, కానీ ప్రజలు ఆమోదించాలి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 గెలవాలనుకోవటం అత్యాశ కాదు. ఒక్క స్థానం పోయినా పర్వాలేదు అనుకుంటే ఆ సంఖ్య క్షేత్రస్థాయిలో పది అవుతుంది. శాశ్వత అధ్యక్షుడి ఎన్నికపై నాకు సమాచారం లేదు. మా పార్టీ విషయాలు మేం మాట్లాడుకుంటాం. శాఖాపరమైన సమీక్షలు జరిపినట్లే పార్టీ పరంగా సీఎం ఎమ్మెల్యేల పనితీరు సమీక్షించి లోటుపాట్లు చెప్పారు' అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చదవండి: (టీడీపీలో ఆధిపత్య పోరు.. అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి) -
జనంలోనే ఉండాలి
‘‘రాజకీయం అనే జీవితాన్ని మనం ఎంచుకున్నాం. మీరు ఎమ్మెల్యేలుగా మళ్లీ గెలిస్తే ప్రజల్లో గౌరవాన్ని మరింత పెంచుతుంది. ఎమ్మెల్యేలుగా ఉన్న మీరు ఓడిపోతే గౌరవం తగ్గుతుంది. దేవుడి దయవల్ల మనకు అలాంటి పరిస్థితి లేదు. కష్టపడితే చాలు.. తిరిగి గెలుచుకుని రాగలుగుతాం. మన పాలన ద్వారా ప్రజలకు మంచి చేయగలిగిన కార్యక్రమాలన్నీ చేపట్టాం. మన గ్రాఫ్ పెంచుకోవడానికి ఇవి అస్త్రాలు, ఆయుధాల్లాంటివి. అవి మీ చేతుల్లో ఉన్నాయి. వాటిని వినియోగించుకోండి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వంద శాతం నిర్వహిస్తే 175 శాసనసభ స్థానాలనూ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం’’ గడప గడపకూ వర్క్ షాప్‌లో సీఎం జగన్ సాక్షి, అమరావతి: గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటికీ వెళ్లాలని, ప్రతి ఒకరినీ కలుసుకుంటూ వారంలో నాలుగు రోజుల పాటు ప్రజల మధ్యే గడపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. చిత్తశుద్ధితో, అంకిత భావంతో దీన్ని నిర్వహించాలని సూచించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు.. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో బుధవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్‌లో సీఎం జగన్ మాట్లాడారు. ఎన్నికలు ఇంకా 19 నెలలే మాత్రమే ఉన్నందున ఇప్పుడు ఎమ్మెల్యేలే స్వయంగా గడప గడపకూ వెళ్లాలని స్పష్టం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమ బంధువులు, వారసులను ఈ కార్యక్రమానికి పంపుతూ ఇతర పనుల్లో నిమగ్నం కావడం సరి కాదన్నారు. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు నుంచి కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించాల్సి ఉన్నందున ఇప్పటి నుంచే వారిని కూడా వెంటబెట్టుకుని వెళ్లడం వల్ల ప్రజాసేవపై అవగాహన పెరుగుతుందన్నారు. కొందరు షెడ్యూల్ ప్రకారం పనిచేయడం లేదని, దీన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎన్నికల హామీల్లో 98.4 శాతం అమలు చేశామని, సంక్షేమ పథకాల ద్వారా పారదర్శకంగా నేరుగా రూ.1.71 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు. ఎలాంటి వివక్ష, అవినీతికి తావివ్వకుండా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాం.. మీ ఇంటికి మేలు చేశాం.. ఆశీర్వదించండి అని కోరుతూ ప్రజల ముందుకు వెళ్తున్న ఏకైక ప్రభుత్వం దేశ రాజకీయ చరిత్రలో ఇదేనని చెప్పారు. గడప గడపకూ కార్యక్రమాన్ని వంద శాతం నిర్వహిస్తే 175 శాసనసభ స్థానాలనూ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు. వర్క్ షాప్‌లో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అన్నీ అనుకూలం.. గడప గడపకూ తలెత్తుకుని వెళ్లే పరిస్థితి మనకు ఉంది. ఎందుకంటే.. మనం చక్కటి పరిపాలన ప్రజలకు అందించాం. ఆ తర్వాతే ప్రతి గడపకూ వెళ్తున్నాం. ప్రతి ఇంటికీ ఏ మేలు జరిగింది? ఎంత జరిగింది? ఏ స్కీములందాయి? అనే జాబితాలు తీసుకుని వెళ్తున్నాం. ఈ మేరకు ప్రతి కుటుంబానికి లేఖ కూడా అందిస్తున్నాం. మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాం. ఇచ్చిన హామీలను నెరవేర్చాం. ప్రతి ఇంట్లోనూ మన ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. గతంలో నాన్న (వైఎస్సార్) ప్రభుత్వ హయాంలో చూశాం. దానికంటే ఎక్కువగా ఇప్పుడు జరుగుతోంది. ఇంత సానుకూల పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవడం అవసరం. ప్రతి ఇంటికీ వెళ్లాల్సిందే... ఒక సచివాలయానికి (గ్రామం) వెళ్లినప్పుడు 100 శాతం.. అంటే ప్రతి ఇంటికీ తప్పనిసరిగా వెళ్లాలి. లేఖ అందించి చేసిన మంచిని వివరించి, చేయనున్న మంచిని చెప్పి ఆశీర్వదించమని కోరాలి. అలా చేయకపోతే నష్టం జరుగుతుంది. ఒకసారి గ్రామ సచివాలయానికి వెళ్తే ఎన్ని రోజులైనా సరే మొత్తం అన్ని ఇళ్లకూ వెళ్లాలి. గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్దేశించుకున్న విధంగా సంపూర్ణంగా పూర్తి చేయాలి. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల నిధులు ఇస్తున్నాం. గ్రామానికి బాగా ఉపయోగపడే వాటిపై ఖర్చు చేయమన్నాం. గ్రామ సచివాలయాల్లో ఎమ్మెల్యే తిరిగినప్పుడు కేటాయించిన నిధుల ప్రకారం పనులు మంజూరు చేయాలి. గ్రామంలోకి వెళ్లినప్పుడు సమస్య మీ దృష్టికి రాగానే అప్పటికప్పుడే ఆ పని మంజూరు చేయాలి. ఆ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. మొదటిసారి వర్క్‌షాప్‌తో పోలిస్తే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పురోగతి బాగుంది. కానీ అందరికీ ఒక విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నా. పరీక్ష రాసేటప్పుడు షార్ట్‌కట్స్ ఉండవు. వాటికి తావిస్తే ఫెయిల్ అవుతాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. 175కు 175 కొట్టాలి.. మళ్లీ చెబుతున్నా. నూటికి నూరు శాతం 175కి 175 కొట్టాలి. ఒక్క సీటు కూడా మిస్ కాకూడదు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికే గడప గడపకూ రూపంలో మీకు చక్కటి ప్రణాళిక ఇచ్చా. 175కు 175 సీట్లు సాధించడం అన్నది అసాధ్యం కానే కాదు. ముమ్మాటికీ ఇది సాధ్యం. మనసా వాచా, కర్మణా దీన్ని నమ్ముతున్నా కాబట్టి విశ్వాసంతో చెబుతున్నా. రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు మంచి జరిగింది. ప్రతి ఇంటికీ మంచి చేశామని లెటర్ తీసుకుని వెళ్తున్నాం. దీనికి స్పందనగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. సచివాలయానికి వెళ్లేటప్పుడు ప్రాధాన్యతగా మీరు గుర్తించిన పనులు 2 నెలల్లో మొదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజూ పరీక్షలా సిద్ధం కావాలి గడప గడపకూ కార్యక్రమం ఎందుకంటే రేపు మనల్ని మనం గెలిపించుకోవడం కోసం.. మనకు మనంగా చేస్తున్న కార్యక్రమం ఇది. దీంట్లో ఎక్కడైనా షార్ట్‌కట్స్ ఉపయోగిస్తే నష్టపోయేది మనమే. ఇవాళ్టి నుంచి చూస్తే ఎన్నికలకు బహుశా 19 నెలలు సమయం ఉంది. ప్రతిరోజూ పరీక్షలకు సిద్ధం అవుతున్నామని భావిస్తూ అంతా అడుగులు వేయాలి. అలా పని చేయకపోతే నష్టపోయేది మనమే. అందుకు మీరు చేయాల్సిందల్లా నెలలో కనీసం 16 రోజులు గడప గడపకూ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి. ఎన్నికలకు 19 నెలలు ఉంది. అంటే మనకు తగిన సమయం ఉంది. మనం చేయాల్సిందల్లా ప్రతి ఇంటికీ వెళ్లడం. తిరిగితేనే మన గ్రాఫ్ పెరుగుతుంది. గేర్ మార్చడానికే...: కొందరు తమ గ్రేడ్ పెంచుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ నాతో అడుగులు వేశారు. అందుకే ఎవరినీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. వారి గేర్ మార్చడమే నా లక్ష్యం. ఎన్నికలకు 6 నెలల ముందు సర్వే చేయిస్తా. ప్రజాదరణ ఉంటేనే మళ్లీ టికెట్లు ఇస్తా. ఎందుకంటే మనల్ని నమ్ముకుని కోట్ల మంది ఉన్నారు. షార్ట్ కట్స్ లేకుండా 100 శాతం గడపగడపకూ పూర్తిచేయాలి. మీ తరఫు నుంచి ఇది జరిగితే క్లీన్‌స్వీప్ చేస్తాం. తిరిగి డిసెంబరు మొదటి రెండు వారాల్లో సమావేశం అవుదాం. అప్పటికి మనకు 70 రోజుల టైమ్ వస్తుంది. కాబట్టి నెలకు 16 రోజులు ప్రతి సచివాలయంలో ప్రతి ఇల్లు తిరగాలి. ప్రతి సచివాలయంలో కనీసం మూడు రోజులైనా ఉండాలి. ప్రజలకు మంచి చేయడానికే..: మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ప్రజలున్నారు. వారికి మనం జవాబుదారీగా ఉన్నాం. జుత్తు ఉంటే ముడేసుకోవచ్చు. అసలు జుత్తు లేకపోతే ముడేసుకోవడానికి ఏమీ ఉండదు. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలుగుతాం. 175కి 175 టార్గెట్ పెట్టుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యం మిస్ కాకూడదు. దానికోసం అందరం కష్టపడదాం. రీజినల్ కోఆర్డినేటర్లు మరింత బాధ్యతగా ఉండాలి. గడప గడపకూ విషయంలో ఎవరైనా వెనకబడినట్లు ఉంటే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. వారికి మార్గనిర్దేశం చేయాలి. ప్రతి ఇల్లూ తిరగాలి ... ప్రతి ఒక్కరినీ కలవాలి – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, నియోజక వర్గ బాధ్యులు తమ సచివాలయాల పరిధిలో ప్రతి ఇల్లూ తిరగాలని, ప్రతి మనిషిని కలవాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి సమీక్షతో పోలిస్తే రెండో సమీక్ష నాటికి పరిస్థితి మెరుగుపడిందని, మూడో సమీక్ష నాటికి మరింత మెరుగు కావాలని సూచించారన్నారు. కొందరు కేవలం ఒక్క గంట మాత్రమే వెళ్తున్నారని, దాన్ని పరిగణలోకి తీసుకోబోమని, ఆ సచివాలయాల పరిధిలో మళ్లీ తిరగాలని, లేదంటే నిధులు మంజూరు కావని హెచ్చరించారని తెలిపారు. 38 రోజులకు గాను 16 రోజులు మాత్రమే తిరిగిన వారిలో మార్పు రావాలని, మూడో సమీక్ష నాటి ఆ సంఖ్య సున్నాగా ఉండాలని నిర్దేశించారన్నారు. వారానికి 4 రోజులు కచ్చితంగా ప్రజల్లోనే – హోంమంత్రి తానేటి వనిత గడప గడపకూ వెళ్లి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా నిలబడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. బుధవారం జరిగిన వర్క్‌షాప్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వారానికి నాలుగు రోజులు, నెలలో కచ్చితంగా 16 రోజులు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు వారి కుమారులు, బంధువులను గడప గడపకూ కార్యక్రమానికి పంపిస్తున్నారని, అలా కాకుండా నియోజకవర్గ ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారన్నారు. చేశారన్నారు. ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వెళ్తేనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు వీలుంటుందని చెప్పారన్నారు. గ్రామ సచివాలయ పరిధిలో సమస్యలను గుర్తించి తెలియచేస్తే వెంటనే నిధులు మంజూరు చేస్తామని సీఎం చెప్పారన్నారు. -
గడప గడపకు వెళ్లాల్సిందే : సీఎం జగన్
-
తీరు మారాలి.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జి మంత్రులను ఉద్దేశించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల వద్దకే వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకుని.. సత్వర పరిష్కారం చేయాల్సిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ఆయన గట్టిగానే ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ మేరకు ఈ కార్యక్రమంలో వెనుకబడ్డ 27 మందిని ఆయన సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది. వారంలో నాలుగు రోజుల చొప్పున.. నెలకు పదహారు రోజులు కూడా తిరగకపోతే ఎలా? అని 27 మంది తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు వాళ్ల పేర్లు చదివి మరీ.. వేగం పెంచాలని వాళ్లకు ఆయన సూచించారు. గంటా రెండు గంటలు తిరగడం కాదు.. ఏడు నుంచి ఎనిమిది గంటలు గ్రామాల్లో తిరగాలి. అదే గ్రామంలో పార్టీ నేతల ఇళ్లలో భోజనాలు చేయాలి. ప్రతి గడపకూ కచ్చితంగా సమయం కేటాయించాలి. డిసెంబర్లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తా. అప్పటిలోగా అందరూ బాగా తిరగాలి. మళ్లీ నాతో పని చేయాలనే మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నా అని పరోక్షంగా వాళ్లను హెచ్చరించారు ఆయన. కుటుంబ సభ్యులు, బంధువులను గడప గడపకులో తిప్పొద్దని, ప్రజా ప్రతినిధులే వెళ్లాలని సమస్యలు గుర్తించి.. వెంటనే పరిష్కారం చేయాలని, అలాగే కేటాయించిన నిధులను వినియోగించుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఈ విషయాన్ని ఏపీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి పేర్ని నాని సైతం ధృవీకరించారు. ఇదీ చదవండి: వరుసగా మూడోసారి నంబర్‌వన్: సీఎం జగన్ -
ప్రతీ గడపకూ టైం కేటాయించాల్సిందే!: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ప్రతీ గడపకు సమయం కేటాయించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సూచించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలతో బుధవారం ఆయన నేతృత్వాన జరిగిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీరుపై ఆయన సమీక్షించారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో మరింత సమయం గడపాలని సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రజల వినతులను వెంటనే పరిష్కరించాలని, ఎక్కడా నిర్లక్ష్యం చేయొద్దని ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో గడప గపడకు.. పై గత సమీక్ష కన్నా ఇప్పుడు ఫలితం మెరుగ్గా ఉందని, మరికొందరు మాత్రం తీరు మార్చుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. 175 సీట్లకు 175 కొట్టాలి. ఒక్క సీటు మిస్ కావొద్దు. ప్రతి ఇంటికి వెళ్లాలి. నెలలో కనీసం పదహారు రోజులు గ్రామాల్లో ఉండాలి. వంద శాతం ఇళ్లను కవర్ చేయాలి. ఎమ్మెల్యేగా ఓడితే గౌరవం తగ్గుతుంది. కష్టపడితే గెలుపు దక్కుతుంది. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలం. ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్‌ను రీచ్ కావాలి అని ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయ కార్యకర్తలతో సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. జరుగుతున్న సంక్షేమం ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ తరుణంలో.. కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఇంకేమి చేయాలి? అనే అంశాలపై సీఎం జగన్ ప్రజా ప్రతినిధులకు ఇవాళ్టి సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఇదీ చదవండి: వలస వచ్చి మామీద పెత్తనమా.. ఎచ్చర్లలో ఎల్లో ఫైట్! -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉత్సాహంగా సాగింది. ఇందులో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ..ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా తమకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ప్రజాప్రతినిధుల వద్ద పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్లకు వస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు ప్రజలు వాడవాడనా ఎదురేగి స్వాగతం పలికారు. సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని దీవించారు. -
రాజధానిపై మోసగించింది బాబే
జంగారెడ్డిగూడెం: రాజధాని విషయంలో ప్రజలను, రైతులను మోసగించిన విపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్‌పై నిందలు మోపుతున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్నారు. సీఎం జగన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికే మూడు రాజధానులను ప్రకటించినట్లు చెప్పారు. బుధవారం జంగారెడ్డిగూడెంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోర్టుకు ఆ అధికారం ఉందా..? రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకునేందుకు కోర్టుకు ఉన్న హక్కులు ఏమిటి? న్యాయమూర్తుల తీర్పును నేను వ్యతిరేకించడం లేదు. ఒకసారి ఆలోచించాలి. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయమా? కోర్టులు చేసే నిర్ణయమా? రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదే. పరిపాలనా విధుల్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం లేదు. మూడు నెలల్లో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించే అధికారం కూడా లేదు. నిధులను బట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఈ రెండింటిపై విరుద్ధమైన తీర్పులు ఇచ్చాయి. తీర్పుపై కచ్చితంగా కామెంట్ చేస్తాం. న్యాయమా.. కాదా? అని కామెంట్ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. న్యాయమూర్తులను మేము కామెంట్ చేయడం లేదు. తీర్పును మాత్రమే కామెంట్ చేస్తున్నాం. అంబేడ్కర్ చెప్పినట్లు రెండు రాజధానులు, మూడు రాజధానులు పెట్టుకోవడం తప్పేమీ కాదు. అంబేడ్కర్ ఆనాడే దక్షిణాదిలో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని సూచించారు. రాజధానుల విషయంలో రాజ్యాంగంలో సవివరంగా పేర్కొన్నారు. 33 వేల ఎకరాలు అవసరమా..? రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరమా? హైదరాబాద్ లాంటి రాజధానిని సుమారు 5 వేల ఎకరాల్లో నిర్వహిస్తుండగా రాష్ట్రంలో రాజధానికి 33 వేల ఎకరాలు అవసరమా? చంద్రబాబు ఆయన కోటరీకి మేలు చేయడానికి, భూములతో వ్యాపారం చేసేందుకే పెద్ద ఎత్తున సేకరించారు. చంద్రబాబుకు దళితులు, పేదలంటే చులకన. అమరావతి ప్రాంతంలో 29 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని ప్రభుత్వం భావిస్తే అందుకు అడ్డుపడి స్టే తెచ్చారు. బాబు కుటిల రాజకీయాలు.. చంద్రబాబు కుటిల రాజకీయాన్ని ప్రజలు గమనించాలని చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కమిటీ కన్వీనర్ బీవీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబును ఓడించేది మత్స్యకారుడే..
వజ్రపుకొత్తూరు రూరల్: ‘అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులను తొక్క తీస్తాం.. తోలు తీస్తాం... అంటూ కించపరిచిన చంద్రబాబును గంగపుత్రులు ఎన్నడూ మర్చిపోరు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ఓ మత్స్యకారుడే కుప్పంలో ఓడిస్తారు...’ అని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గుణుపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని, అందువల్లే ఆ పార్టీని ప్రజలు 23 స్థానాలకు పరిమితం చేశారని చెప్పారు. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఈ నెల 22న వైఎస్సార్ చేయూత సొమ్ము జమ కానుందని తెలిపారు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆస్పత్రి నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, మరికొద్ది రోజుల్లో భావనపాడు పోర్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. నువ్వలరేవు జెట్టీ పనులు, రూ.700 కోట్లతో ఇంటింటికీ తాగునీటి ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయన్నారు. -
ఆహ్వానిస్తూ.. అర్జీలిస్తూ
సాక్షి నెట్వర్క్: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అన్ని జిల్లాల్లోనూ విజయవంతంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామగ్రామానికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తమ గ్రామానికి వచ్చిన నాయకులను ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తూ తమ సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వానికి తామంతా అండగా నిలుస్తామని చెప్పారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను నాయకులు అధికారులతో చెప్పి అక్కడికక్కడే పరిష్కరించారు. -
ఇంటింటా ఆనందం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రతి ఇంటివద్ద ప్రజలు ఆనందంతో స్వాగతం చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఆదివారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే తామంతా నడుస్తామని ప్రజాప్రతినిధులతో ప్రజలు చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
ఆత్మీయ ఆదరణ
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఆత్మీయ ఆదరణ లభిస్తోంది. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. అన్ని జిల్లాల్లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, అర్హులకు అవి అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన చిన్నచిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. -
గడప గడపకూ భరోసా
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లగా, వారికి ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో తామంతా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. జగన్‌కు తమ ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. -
ప్రతి ఇంటా ఆనందం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో సోమవారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. -
గడప గడపకు మంత్రి దాడిశెట్టి రాజా
-
ఆత్మీయ ఆదరణ
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఆత్మీయ ఆదరణ లభిస్తోంది. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, అర్హులకు అవి అందుతున్నాయా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన చిన్నచిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. -
ఇంటింటా సంక్షేమ కాంతులు
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రతి ఇంటివద్దా ప్రజలు ఆనందంతో స్వాగతం పలుకుతున్నారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తోందని చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ శనివారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
ఊరూరా అదే జోరు.. ‘గడప గడపకు’ అపూర్వ ఆదరణ
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో శుక్రవారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కు తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. ఇదీ చదవండి: పూర్తి సహకారం అందిస్తాం.. కేంద్రమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు: సీఎం జగన్ -
గడప గడపకు మన ప్రభుత్వం: ఎమ్మెల్యే రాచమల్లు దాతృత్వం
ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా): విద్యావంతురాలైన దివ్యాంగురాలు ముత్యాల లక్ష్మికి కృత్రిమ కాలును ఏర్పాటు చేసుకునేందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి గురువారం రూ.2.5 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం 33వ వార్డు పరిధిలోని ఆర్ట్స్‌కాలేజి రోడ్డులో తిరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేకు దివ్యాంగురాలి సమస్య ఎదురైంది. ఎంఎస్సీ (మ్యాథ్స్) చదివిన ముత్యాల లక్ష్మి ప్రస్తుతం 35వ వార్డు సచివాలయంలో వలంటీర్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఎడమ కాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసి కాలిని పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం ఆమె ఇంటి వద్దే ఉంది. ఆమె ఆత్మ స్థైర్యాన్ని గమనించిన ఎమ్మెల్యే రాచమల్లు కృత్రిమ కాలు ఏర్పాటు చేస్తే లక్ష్మి జీవన పరిస్థితి పూర్తి మెరుగ్గా ఉంటుందని భావించి ఈ సహాయం అందించారు. ఈ సందర్భంగా దివ్యాంగురాలు లక్ష్మి మాట్లాడుతూ పెద్ద మనసుతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తనకు సహాయం అందించారన్నారు. తాను ఎమ్మెల్యే ఇచ్చిన రూ.2.5 లక్షలతోపాటు మరో లక్ష కలిపి కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకుంటానని తెలిపారు. నాలుగో వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి రూ.20 వేలు, పదో వార్డు కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి రూ.15 వేలు దివ్యాంగురాలికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో పద్మశాలీయ సేవా సంఘం పట్టణాధ్యక్షుడు అగ్గారపు శ్రీనివాసులు, మున్సిప ల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, తొగటవీర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ చౌడం రవీంద్ర, నాయకులు మల్లికార్జున ప్రసాద్, గజ్జల కళావతి, గుమ్మళ్ల పద్మావతి, జాకీర్ పాల్గొన్నారు. -
గడప గడపన ఘన స్వాగతం
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం గురువారం ఉత్సాహంగా సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అమలు చేస్తున్న పథకాలను వివరించి బుక్లెట్లు, కరపత్రాలను పంపిణీ చేశారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా.. అని అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. వివిధ పథకాలతో తాము పొందిన లబ్ధి గురించి చెప్పి ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని తెలిపారు. -
కుప్పంలో అడ్రస్, ఓటర్ కార్డులేని చంద్రబాబు సవాల్ చేస్తారా?: కొడాలి నాని
సాక్షి, కృష్ణాజిల్లా: గుడివాడ 8వ వార్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. కుప్పానికే పరిమితమైన చంద్రబాబు ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను పిలిపించుకుని నానా అల్లరి చేస్తున్నాడని మండిపడ్డారు. ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గంలో కూడా చంద్రబాబుకు ఎదురుగాలి వీస్తోందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు ఆఖరికి కుప్పంలో పోరాడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమితో రాష్ట్రంతో పాటు, కుప్పంలో కూడా చంద్రబాబు పీడ విరగడ అవుతుందన్నారు. కుప్పంలో అడ్రస్, ఓటర్ కార్డులేని చంద్రబాబు.. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఏ రకంగా సవాల్ విసురుతారని ప్రశ్నించారు. సీఎం జగన్ దెబ్బకు టీడీపీ, జనసేన, బీజేపీ కకావికలం కాక తప్పదన్నారు. ఎవరికోసమో, ఎవరో అడిగారనో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. చదవండి: (చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు.. ప్రాణహాని ఉంది: ఎంపీపీ అశ్విని) -
మీ వెంటే మేమంతా
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రజా సంక్షేమానికై అహర్నిశలూ శ్రమిస్తున్న జగనన్న వెంటే తామంతా నడుస్తామని నాయకులతో ప్రజలు చెబుతున్నారు. అన్ని జిల్లాల్లో బుధవారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సమస్యలు తమ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. మేనిఫెస్టోలో అన్ని హామీలను నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
గడప గడపకు మన ప్రభుత్వం: అదే ఆదరణ
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రభుత్వం అందించే పథకాల వివరాలు తెలుసుకుంటున్నందుకు స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని దీవిస్తున్నారు. అన్ని జిల్లాల్లో మంగళవారం ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. -
CM YS Jagan: ఈ కార్యక్రమాలను నేనే నేరుగా పర్యవేక్షిస్తా
వృద్ధిరేటులో ఏపీ టాప్‌లో నిలవడం సంతోషకరం.. దేశం కంటే అధికంగా నమోదైంది. పారదర్శక విధానాలే మూల కారణం.. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి. – ‘స్పందన’పై సమీక్షలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత పనులకు రూ.3,000 కోట్లు కేటాయించామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రాధాన్యత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడమే కాకుండా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సూచించిన ప్రాధాన్యత పనులు, ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, ఉపాధి హామీ పనులు, స్పందన వినతుల పరిష్కారం తదితర అంశాలపై కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. కలెక్టర్లూ పాల్గొనాలి.. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో కనీసం రెండు రోజులు పర్యటించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రజల నుంచి అందే వినతుల ఆధారంగా ప్రాధాన్యత పనులను గుర్తించి వాటిపై సంబంధిత ఎమ్మెల్యే విజ్ఞాపనలు పంపుతున్నారు. ఈ ప్రాధాన్యత పనులను పూర్తి చేసేందుకు ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించాం. వీటిని చేపట్టేలా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. వేగంగా పనులు చేపట్టడమే కాకుండా వాటిని అంతే వేగంతో పూర్తి చేయాలి. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలి. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దాదాపు 15 వేల సచివాలయాల పరిధిలో ప్రాధాన్యతా పనుల కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కలెక్టర్లు కూడా పాల్గొనాలి. దీనివల్ల అనుకున్న కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి, సమన్వయ పరచడానికి ఆస్కారం కలుగుతుంది. కలెక్టర్లు విధిగా ప్రతి నెలా ఆరు సచివాలయాలను సందర్శించాలి. ఈ కార్యక్రమాలను నేనే నేరుగా పర్యవేక్షిస్తా. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధి పనుల్లో మంచి ప్రగతి ఉపాధి హామీ పనుల్లో మంచి ప్రగతి కనిపించింది. పనితీరు బాగుంది. ఉపాధి హామీలో మనం దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈ వేగం కొనసాగాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సగటున 117 శాతం పనిదినాల కల్పన జరుగుతోంది. రాష్ట్ర సగటు కన్నా తక్కువగా ఉన్న అన్నమయ్య, విజయనగరం, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉపాధి పనులపై దృష్టి పెట్టాలి. పనుల్లో నాణ్యత పెరగాలి. గ్రామాల రూపురేఖలను మార్చేస్తాయి.. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఇవి గ్రామాల స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తాయి. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి వేగంగా, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. గ్రామ సచివాలయాల భవనాలు త్వరగా పూర్తి చేయడంపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి. ఆర్బీకేల భవన నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలి. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పూర్తి చేయడంపైనా కలెక్టర్లు దృష్టి సారించాలి. వీటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను అక్టోబరు 31 నాటి కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. డిసెంబరు నాటికి 4,500 గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ చేరుతుంది. మంజూరు చేసిన 3,966 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణాన్ని డిసెంబర్ నెలాఖరునాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. వీటితోపాటు గ్రామాల్లో ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఉంటాయి. ఇవన్నీ గ్రామాల రూపురేఖలను సమూలంగా మారుస్తాయి. ప్రతి సచివాలయాన్నీ ఒక యూనిట్‌గా తీసుకుని పనులు పూర్తి చేయాలి. కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారుల వరకూ కూడా వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మొత్తం ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి. రహదారులకు భూసేకరణపై దృష్టి రాష్ట్రంలో రహదారులకు సంబంధించి 99 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. 3,079 కిలోమీటర్ల మేర రూ.29,249 కోట్ల అంచనా వ్యయంతో పనులు సాగుతున్నాయి. అంతర్ రాష్ట్ర సరిహద్దుల అనుసంధానం కోసం మరో 7 ప్రాజెక్టులు కూడా చేపడుతున్నాం. డీపీఆర్ స్థాయిలో మరో 45 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తంగా 151 ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.92 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి. స్పందన.. ఎవరెవరు ఎప్పుడంటే..? స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యం. ఎలా పరిష్కరిస్తున్నారన్న దానిపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పందన కార్యక్రమం కచ్చితంగా జరగాలి. సంబంధిత సిబ్బంది ఆ సమయంలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన నిర్వహించాలి. సంబంధిత అధికారులంతా పాల్గొనాలి. కలెక్టర్లు దీన్ని కచ్చితంగా అమలు చేసేలా చూడాలి. ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ప్రతి గురువారం చీఫ్ సెక్రటరీ కలెక్టర్లతో స్పందనపై సమీక్షించాలి. అదే సమయంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన (ఎస్డీజీ) పైనా సమీక్ష చేపట్టాలి. లక్ష్యాలను చేరుకునేలా నిరంతరం పర్యవేక్షించాలి. స్పందన కార్యక్రమాన్ని నేనే నేరుగా పర్యవేక్షిస్తా. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 11.43 శాతంగా నమోదు కావడం సంతోషకరం. ఇది దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది. కీలక రంగాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ఉండాలి. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నా. కలెక్టర్లందరికీ అభినందనలు. మీ అందరి కృషి ఫలితమే దీనికి కారణం. కీలక రంగాలపై దృష్టి పెట్టడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి. ఎంఎస్ఎంఈ రంగానికి వెన్నుదన్నుగా నిలవాలి. ఆ రంగం నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని సక్రమంగా పరిష్కరించాలి. ప్రతి పథకం ఎస్డీజీతో ముడిపడి ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. వాటిని సక్రమంగా పర్యవేక్షిస్తే ఎస్డీజీ యధావిధిగా పెరుగుతుంది. ఈ స్పందన సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణం, సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్లానింగ్ సెక్రటరీ విజయ్‌కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అది తప్పుడు వార్త
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలపై తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రయత్నాలను ప్రజలే తిప్పికొడుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం సీతాయిలంకలోని తుమాటి లత అనే మహిళ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల నిధులు పూర్తిగా అందలేదని ఎమ్మేల్యే సింహాద్రి రమేష్‌బాబును గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో నిలదీసినట్లు ఆ పత్రిక సోమవారం ఒక వార్త ప్రచురించింది. ఆ కార్యక్రమంలో జరిగిన దానికి భిన్నంగా తప్పుడు సమాచారాన్ని వండి వార్చింది. వాస్తవానికి తుమాటి లత బ్యాంకు అకౌంట్లో ప్రభుత్వం వివిధ పథకాల కింద రూ. 1.72 లక్షలు జమ చేసినట్లు పేర్కొంటూ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆమెకు కరపత్రాన్ని అందించారు. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ. 1.40 లక్షల వరకు అందినట్లు, బ్యాంకు అకౌంట్ పుస్తకంలో ఆమేరకు జమ చేసినట్లు అందులో వివరించారు. అయితే ఈ రెండు పథకాల కింద తమకు రూ.82 వేలు మాత్రమే అందినట్లు లత చెప్పడంతో ఆమెకు స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అధికారులు వెంటనే 1.72 లక్షల నిధులు లత, ఆమె కుటుంబీకులకు చెందిన ఏయే బ్యాంకు అకౌంట్లలోకి ఏ తేదీల్లో జమ అయ్యాయో వివరంగా చూపించారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన కింద 1.40 లక్షలు ఏయే తేదీల్లో జమ అయ్యాయో రికార్డులు చూపి మరీ చెప్పారు. తన అకౌంట్లో, తన కుమార్తె అకౌంట్లో మొత్తం నిధులు జమ అయ్యాయని, తానే పొరపాటున పూర్తిగా రాలేదని అనుకున్నానని లత వివరించారు. పూర్తి మొత్తం అందించినట్లు బ్యాంకు అకౌంట్లలో జమ అయిన మొత్తాలను చూపి మరీ అధికారులు తమకు వివరించారని చెప్పారు. అయితే, ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు వార్త రావడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. -
ఊరూరా ఘన స్వాగతం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజలు ఘన స్వాగతం చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఆదివారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే తామంతా నడుస్తామని ప్రజాప్రతినిధులతో ప్రజలు చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
గడప గడపలో ఘన స్వాగతం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అన్ని జిల్లాల్లో శనివారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పారు. -
సాలూరు మున్సిపాలిటీలో గడప గడపకు మన ప్రభుత్వం
-
గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు
తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,004 సచివాలయాలకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. మరోవైపు.. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం రూ. 3 వేల కోట్ల కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఆత్మీయ ఆదరణ లభిస్తోంది. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తోన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, అర్హులకు అవి అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకుంటున్నారు. ఇదీ చదవండి: CM YS Jagan: గడప గడపకూ మనలో ఒకడై.. -
ప్రతి ఇంటా ఆనందం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో ఆదివారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పారు. -
ఏపీ: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
-
ప్రజా క్షేత్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు
-
గడప గడపనా పండుగలా
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఆత్మీయ ఆదరణ లభిస్తోంది. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. అన్ని జిల్లాల్లో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తోన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, అర్హులకు అవి అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. -
ఊరూరా పండుగలా..
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తోన్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజలు ఘన స్వాగతం చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఆదివారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తోన్న సంక్షేమ పథకాలను వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే తామంతా నడుస్తామని ప్రజాప్రతినిధులతో ప్రజలు చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
ఆత్మీయ ఆదరణ
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఆత్మీయ ఆదరణ లభిస్తోంది. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. అన్ని జిల్లాల్లో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, అర్హులకు అవి అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన చిన్నచిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. -
ఊరూరా ఘన స్వాగతం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజలు ఘన స్వాగతం చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ బుధవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే తామంతా నడుస్తామని ప్రజాప్రతినిధులతో ప్రజలు చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
కుప్పం నుంచి ఆరంభం.. 175కు 175 లక్ష్యంగా అడుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్ పార్టీ శ్రేణులను సమాయత్తపరుస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. గత నెల 18న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు వర్క్‌షాప్ నిర్వహించారు. లక్షలాది కుటుంబాలు వైఎస్సార్సీపీపై ఆధారపడ్డాయని, ఆ కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తిరిగి అధికారంలోకి రావాలని సీఎం వైఎస్ జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. 2019 ఎన్నికలకంటే మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రావాలని, అది కష్టం కానే కాదని స్పష్టంచేశారు. ఆగస్టు 4 నుంచి నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల కార్యకర్తలతోనూ సమావేశమై దిశానిర్దేశం చేస్తానని ప్రకటించారు. నెలకు 10 నుంచి 15 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తొలి సమావేశం గురువారం సాయంత్రం కుప్పం నియోజకవర్గానికి చెందిన 60 మంది కార్యకర్తలతో జరుగుతోంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, అందిస్తున్న సుపరిపాలనపై సీఎం జగన్ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. మూడేళ్లుగా చేసిన మంచిని, రాబోయే కాలంలో చేయబోయే మంచిని ఇంటింటికీ వెళ్లి.. వివరించాలని, జనంతో మమేకమవ్వాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయడానికి ఇది దోహదం చేస్తుంది. బాబు చేజారిన కుప్పం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి కుప్పం నియోజకవర్గం కంచు కోట. 1989 నుంచి 2019 వరకూ నాలుగా దశాబ్దాలుగా చంద్రబాబు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈ కంచు కోటను ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బద్దలు కొట్టింది. చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, అందిస్తున్న సుపరిపాలనకు కుప్పం నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ 87 శాతం కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ఇది కుప్పం నియోజకవర్గ ప్రజలు గుర్తించారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసేలా మద్దతుగా ఓట్లేశారు. దాంతో.. కుప్పం నియోజకవర్గం చంద్రబాబు చేతుల్లోంచి జారిపోయింది. ఇక్కడ టీడీపీ ఉనికి కోల్పోయే దుస్థితికి దిగజారింది. ఇదే చిత్తశుద్ధి, అంకితభావం, పట్టుదలతో పనిచేస్తే 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ విజయం ఖాయమని సీఎం వైఎస్ జగన్ కార్యకర్తలకు విశదీకరించనున్నారు. బూత్ స్థాయి నుంచే దుష్ఫ్రచారం తిప్పికొట్టేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేశారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి, ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి నెలా పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదును జమ చేస్తున్నారు. అయినప్పటికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో కూడిన దుష్టచతుష్టయం ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తోంది. దాన్ని బూత్ స్థాయి నుంచే ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. సోషల్ మీడియా సైన్యంగా ఏర్పడి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించడంతోపాటు.. దుష్టచుతుష్టయం చేస్తున్న దుష్ఫ్రచారాన్ని సమర్ధంగా ఎదుర్కోవాలని చెప్పనున్నారు. నిత్యం జనంతో మమేకమయ్యేలా గడప గడపకూ నేతలు సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనాన్ని, అభివృద్ధి పథకాల ద్వారా గ్రామంలో జరిగిన ప్రగతిని ప్రతి ఒక్కరికీ గుర్తు చేయాలనే లక్ష్యంతో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు మూడేళ్లుగా సంక్షేమ పథకాల ద్వారా ఆ కుటుంబ సభ్యులకు చేసిన మంచిని వివరిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను వారికి అందజేస్తున్నారు. టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉన్న తేడాను అర్థమయ్యేలా వివరిస్తూ.. ఆశీర్వదించాలని కోరుతున్నారు. -
శునకానందంలో దుష్ట చతుష్టయం: మంత్రి అంబటి ధ్వజం
సత్తెనపల్లి: తనపై ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు పత్రికల్లో, ప్రసార సాధనాల్లో కథనాలు ఇస్తూ దుష్ట చతుష్టయం శునకానందం పొందుతోందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పా రు. సోమవారం పల్నాడు జిల్లా రాజుపాలెం గ్రామంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 375 గృహా లకు వెళ్లి సంక్షేమ పథకాల అమలు గురించి తెలు సుకోవడంతోపాటు, వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ చేశారు. ఆయనను కొందరు నిలదీసినట్లు ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయి. వీటికి స్పందిస్తూ అంబటి ఓ వీడియో విడుదల చేశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తాను ప్రజలను కలుసుకున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒకరు, జనసేన పార్టీకి చెందిన ఒకరు సంక్షేమ పథకాలపై ప్రశ్నించారని అంబటి ఆ వీడియోలో చెప్పారు. దీనిని దుష్టచతుష్టయం చిలువలు పలువలు చేసిందన్నారు. తనను మహిళలు నిలదీశారని, బెండు తీశారని టీడీపీకి చెందిన దుష్ట చతుష్టయం ఛానల్లో పదే పదే ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దుష్టచతుష్టయమే ముందుగా ఇలా ప్రశ్నించాలని ప్లాన్ చేసి వారితో అడిగించి ఉంటారని అన్నారు. ఇందుకు దుష్టచతుష్టయానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎద్దేవా చేశారు. టీడీపీకి చెందిన చానల్స్‌లో తనపై నెగెటివ్ వార్తలు మాత్రమే ఇస్తారని, పాజిటివ్ వార్తలు ఎలాగూ ఇవ్వరని చెప్పారు. నెగెటివ్ వార్తలు అయినప్పటికీ, తన కోసం ప్రత్యేకంగా స్పేస్ కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ వీడియోలో చురకలంటించారు. -
గడప గడపనా.. నీరాజనం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారులు గురువారం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లగా వారికి ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆనందంగా తెలియజేశారు. -
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై దుష్టచతుష్టయం విషం చిమ్ముతున్నారు
-
ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాం: కొడాలి నాని
-
గడప గడపకు మన ప్రభుత్వం: వాడవాడలా వేడుకగా
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో ఆదివారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
అవ్వ అడిగిందని ఒక్క రోజులోనే రోడ్డు.. స్వయంగా పని మొదలుపెట్టిన మంత్రి వేణు
రామచంద్రపురం రూరల్: ఓ అవ్వ కోరిందని ఒక్క రోజులోనే రోడ్డును నిర్మించి ఆమె కోరిక తీర్చారు.. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం మండలం భీమక్రోసుపాలెం గ్రామంలో మూడు రోజులుగా ఆయన పర్యటిస్తున్నారు. శుక్రవారం గుండుపల్లి మంగాయమ్మ అనే వృద్ధురాలు ఏళ్ల తరబడి తన ఇంటికి దారి లేదని, వర్షం వస్తే బురదలో తిరగడానికి ఇబ్బంది కలుగుతోందని మంత్రి వేణు దృష్టికి తెచ్చింది. దీంతో ఆయన శనివారం గడపకు గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి తాను హాజరయ్యే సమయానికి గ్రావెల్ రోడ్డు వేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా గ్రామానికి వచ్చిన వెంటనే మంత్రి వేణు స్వయంగా పారతో బొచ్చెలో గ్రావెల్ నింపుకుని పని మొదలుపెట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో రోడ్డు పూర్తి చేశారు. ఒక్క రోజులోనే తన ఇంటికి రోడ్డు నిర్మించడంతో ఆ అవ్వ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. -
అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట: ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
-
గడపగడప కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి: సీఎం జగన్
-
ఎల్లో మీడియా అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదు: ఆదిమూలపు సురేష్
-
మీ ఇంటికి వచ్చాం.. సమస్యలుంటే చెప్పండి
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజలు ఘన స్వాగతం చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ గురువారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ‘మీ ఇంటి వద్దకే వచ్చాం.. సమస్యలేమైనా ఉంటే చెప్పండి’ అని ప్రజల్ని అడిగారు. తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే తామంతా నడుస్తామని ప్రజాప్రతినిధులతో ప్రజలు చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉత్సాహంగా సాగింది. ఇందులో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా తమకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల వద్ద పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్లకు వస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు ప్రజలు వాడవాడనా ఎదురేగి స్వాగతం పలికారు. సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని దీవించారు. -
లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి
జీవితంలో చిత్తశుద్ధి, అంకితభావంతో అడుగులు వేయకపోతే కుప్ప కూలుతాం... చిత్తశుద్ధి, అంకితభావంతో అడుగులు వేస్తేనే నిలదొక్కుకుంటాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో, అంకితభావంతో, నాణ్యతతో చేయండి. ప్రతి సచివాలయంలో గడప గడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో ప్రాధాన్యత ఉన్న పనులను పూర్తి చేయించే ఛాలెంజ్ నేను తీసుకుంటున్నా. దానికి సంక్షేమ పథకాల ద్వారా పారదర్శకంగా, నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ చేయడం తోడైతే ఎమ్మెల్యేలుగా మీకు మంచి పేరొస్తుంది. చిరస్థాయిగా ఎమ్మెల్యేగా నిలబడిపోతారు. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు సీఎం జగన్ మార్గనిర్దేశం సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మనపై ఆధారపడ్డాయి... ఆ కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తిరిగి అధికారంలోకి రావాలి..’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గ నిర్దేశం చేశారు. మునుపటికన్నా ఇంకా మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రావాలని, అది కష్టం కానే కాదని పునరుద్ఘాటించారు. సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే ప్రతి నెలా వివక్ష, అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని గుర్తు చేశారు. ‘నేను చేయాల్సిందంతా చేస్తున్నా. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే నా ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా. ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేశా. ఇక చేయాల్సింది మీరే. చేసిన మంచిని ప్రజలకు వివరించి గతానికీ ఇప్పటికి తేడాను అర్థమయ్యేలా చెప్పి.. మనసు మనవైపు ఉండేలా వారికి గుర్తు చేసేందుకు చిత్తశుద్ధితో, అంకితభావంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నాణ్యతతో చేయండి. మీరూ నేనూ కలసికట్టుగా సాగితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతాం’ అని సూచించారు. మరింత మెరుగ్గా.. మూడేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా చేస్తున్న మంచిని, అందిస్తున్న సుపరిపాలనను ప్రజలకు చాటిచెప్పాలనే లక్ష్యంతో మే 11న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సర్కార్ చేపట్టింది. దీనిపై ప్రతి నెలా వర్క్‌షాప్ నిర్వహించి అభిప్రాయాలు తీసుకుని మరింత మెరుగ్గా నిర్వహించేలా చర్యలు చేపడతామని ఆదిలోనే సీఎం జగన్ ప్రకటించారు. ఆ మేరకు జూన్ 8న వర్క్‌షాప్ నిర్వహించారు. అందులో భాగంగా సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ వర్క్‌షాప్ నిర్వహించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నాణ్యంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏ కార్యక్రమంలోనైనా నాణ్యత ముఖ్యం.. జీవితంలో ఏ కార్యక్రమాన్నైనా నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకుంటాం. అందుకే క్వాలిటీతో కార్యక్రమాలు చేయడం అన్నది ముఖ్యం. గడపగడపకూ కార్యక్రమాన్ని కూడా అంకితభావం, చిత్తశుద్ధి, నాణ్యతతో చేయండి. పరిపాలనలో అనేక సంస్కరణలు తెచ్చాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పలు చర్యలు తీసుకున్నాం. ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాం. అభివృద్ధి పనులు చేపట్టాం. లబ్ధిదారుల జాబితా పరిశీలిస్తే ప్రతి నియోజకవర్గంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాయి. మనం చేసిన మంచిన కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా గుర్తించారు కాబట్టే గతంలో ఎన్నడూ లేని రీతిలో పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయగలిగాం. అలాంటప్పుడు 175కు 175 శాసనసభ స్థానాల్లో ఎందుకు గెలవలేం? చేస్తున్న మంచిని గుర్తు చేయండి.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మీరు ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. అక్కచెల్లెమ్మలకు రాసిన లేఖలను మీరే చదివి వినిపిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందాయా? అని అడుగుతున్నారు. అందాయి.. అందాయి.. అంటూ ఆ అక్కచెల్లెమ్మలు సంతోషంగా చెబుతున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం మంచి చేయనప్పుడు... మనం ఇంత మంచి చేస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ స్థానాల్లో ఎందుకు గెలవలేం? మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఉన్న తేడాను అర్థమయ్యేలా వివరించి చేస్తున్న మంచిని చెబుతూ మనసు మనవైపు ఉండేలా అక్కచెల్లెమ్మలకు గుర్తు చేయడమే. అందుకు చిత్తశుద్ధితో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నాణ్యంగా చేయాలి. ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు.. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించి పనులు చేయించే ఛాలెంజ్‌ను నేను తీసుకున్నా. ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ జీవో కూడా ఇచ్చాం. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్) నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయిస్తున్నాం. సచివాలయాలకు కేటాయించే నిధులకు ఇది అదనం. ఒక నెలలో ఎమ్మెల్యేలు తిరిగే సచివాలయాల్లో పనులకు సంబం«ధించి ముందుగానే కలెక్టర్లకు డబ్బులు ఇస్తాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యత పనుల కోసం ఆ డబ్బు ఖర్చు చేయాలి. పనులు సూచించిన వెంటనే ప్రారంభించి పూర్తయ్యేలా చూస్తాం. వచ్చే నెల రోజుల్లో కనీసం 16 రోజులు, గరిష్టంగా 21 రోజులు గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ కార్యక్రమంలో భాగంగా రానున్న నెల రోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలి. కమిట్మెంట్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. గడప, గడపకూ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 175 నియోజక వర్గాలకు పరిశీలకులను నియమిస్తాం. గ్రాఫ్ నిర్ణేతలు ప్రజలే: సజ్జల వైఎస్సార్సీపీ ఐదేళ్లపాటు మాత్రమే అధికారంలో ఉండాలని రాలేదు.. ప్రజల ఆశీస్సులతో నిరంతరం అధికారంలో ఉండాలని కోరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోందని తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు హాజరైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే ఎమ్మెల్యేలకు వార్నింగ్‌లు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. లోపాలుంటే సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారన్నారు. అందరం కలసి పనిచేస్తే విజయం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారన్నారు. ప్రజలే ఎమ్మెల్యేల గ్రాఫ్‌ను నిర్ణయిస్తారని తెలిపారు. గ్రాఫ్ పెరిగేందుకు సీఎం జగన్ కిటుకులు చెప్పారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు రానున్న నెలరోజుల్లో 7 సచివాలయాలను సందర్శించాలని సీఎం సూచించారన్నారు. వచ్చే నెల రోజుల్లో కనీసం 16 రోజులు, గరిష్టంగా 21 రోజులు గడప గడపకూ కార్యక్రమంలో అంకితభావంతో పాల్గొనాలని నిర్దేశించారన్నారు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే మహిళల పసుపు కుంకుమలు పోతాయన్న పవన్ వ్యాఖ్యలపై స్పందించడం వృథా అని పేర్కొన్నారు. 175 సీట్లే లక్ష్యంగా ముందుకు: మంత్రి అంబటి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని, మరింత మెరుగ్గా నిర్వహణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గాలకు రూ.2 కోట్ల చొప్పున సీఎం నిధులు కేటాయించారని చెప్పారు. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల ఫండ్ ఇవ్వనున్నారని తెలిపారు. 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. రాష్ట్రంలో 85 శాతం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, వైఎస్సార్ సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ‘సాటి నటి రోజాను ఆ రోజు టీడీపీ అవమానిస్తే పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు. చంద్రబాబు హయాంలో ముద్రగడను హింసిస్తే కనీసం స్పందించ లేదు’ అని అంబటి దుయ్యబట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. -
వారి మద్దతు తీసుకుంటే 175 స్థానాల్లో ఎందుకు గెలవలేం: సీఎం జగన్
-
ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందన తెలుసుకోవాలని సూచన
-
ఏపీ: గడపగడపకు మన ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
గడపగడపకు మన ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
గడప గడపకు మన ప్రభుత్వం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రిజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం మార్గనిర్దేశం చేశారు. చదవండి: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్ కీలక ఆదేశాలు.. ఈ సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశించారు. ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నిధులు ఇస్తామని సీఎం తెలిపారు. సచివాలయం విజిట్ పూర్తయిన వెంటనే కలెక్టర్లు నిధులిస్తారని సీఎం ప్రకటించారు. 10 రోజుల్లోపు గడప గడప చేసిన వారి పేర్లు సీఎం జగన్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారంటే..: ♦గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో నాణ్యత చాలా ముఖ్యం ♦జీవితంలో ఏ కార్యక్రమమైనా.. నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకుంటాం ♦అందుకే క్వాలిటీతో కార్యక్రమాలు చేయడం అన్నది ముఖ్యం ♦గడపగడపకూ కార్యక్రమాన్ని కూడా నాణ్యతతో చేయండి ♦పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చాం ♦ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నాం ♦అనేక పథకాలను అమలు చేశాం, అభివృద్ధి పనులు చేపట్టాం ♦రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మనమీద ఆధారపడి ఉన్నాయి ♦వారికి న్యాయం జరగాలంటే.. మనం అధికారంలోకి తిరిగి రావాలి ♦అధికారంలోకి మామూలుగా రావడంకాదు, మునుపటికన్నా మెరుగైన ఫలితాలతో రావాలి ♦కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించాం ♦అలాంటప్పుడు మనం అనుకున్న ఫలితాలు ఎందుకు సాధించలేం? ♦రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు అందించాం ♦వారి మద్దతు తీసుకుంటే.. 175కి 175 స్థానాలో ఎందుకు గెలవలేం? ♦నేను చేయాల్సింది అంతా చేస్తున్నాను ♦ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలి ♦ఎలాంటి వివక్షలేకుండా, అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నాం ♦పథకాలకు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే పంపుతున్నాం ♦ప్రతినెలా క్యాలెండర్ ఇచ్చి.. ఎలాంటి పరిస్థితులు ఉన్నా పథకాలకు బటన్ నొక్కుతున్నాం ♦ప్రతి ఒక్కరికీ మంచి చేయడాన్ని నా ధర్మంగా.. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను ♦దీనివల్ల ఒక వాతావరణం, ఒక ఫ్లాట్‌ఫాం క్రియేట్ అయ్యింది ♦దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఎమ్మెల్యేల బాధ్యత ♦ఎమ్మెల్యేలు చేయాల్సింది చేస్తేనే ఫలితాలు సాధిస్తాం ♦ఇద్దరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతాం ♦అలాంటి పరిస్థితి మనకళ్లముందు కనిపిస్తున్నప్పుడు మనం అడుగులు ముందుకేయాలి ♦గతంలో కన్నా.. మెరుగ్గా ఫలితాలు సాధించాలి ♦ఒక్కో సచివాలయంలో ప్రాధాన్యతా పనులకు రూ.20 లక్షలు కేటాయింపు ♦గడపగడపకూ వెళ్లినప్పుడు ప్రజలనుంచి వినతులను పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యతా పనులకోసం ఈ డబ్బు ఖర్చు ♦ఒక నెలలో ఎమ్మెల్యేలు తిరిగే సచివాలయాల్లో పనులకు సంబం«ధించి ముందుగానే కలెక్టర్లకు డబ్బు ఇవ్వనున్నాం: ♦తర్వాత వెంటనే పనులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ ♦ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలమేరకు ఇవాళ జీవో కూడా ఇచ్చాం ♦ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్) నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయింపు ♦సచివాలయాలకు కేటాయించే నిధులకు ఇది అదనం ♦ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించి పనులు చేయించే ఛాలెంజ్‌ను నేను తీసుకున్నాను ♦ఇక మీరు చేయాల్సిందల్లా గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడమే ♦గడప, గడపకూ కార్యక్రమంలో భాగంగా రానున్న నెలరోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలి ♦వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు– గరిష్టంగా 21రోజులు గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి ♦కమిట్మెంట్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి ♦గడప,గడపకూ కార్యక్రమాన్ని మానిటర్ చేయాలన్న సీఎం ♦ఇందు కోసం 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించాలని సీఎం ఆదేశం -
ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం వైఎస్ జగన్
-
గడప గడపకూ భరోసా
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లగా వారికి ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తు న్నాయని చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆనందంగా తెలియజేశారు.