
వైఎస్సార్ జిల్లా చాగలేరులో మహిళతో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం గురువారం ఉత్సాహంగా సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అమలు చేస్తున్న పథకాలను వివరించి బుక్‌లెట్‌లు, కరపత్రాలను పంపిణీ చేశారు.
సమస్యలు ఏమైనా ఉన్నాయా.. అని అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. వివిధ పథకాలతో తాము పొందిన లబ్ధి గురించి చెప్పి ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని తెలిపారు.