
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఆదివారం తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా.. గృహసారధుల నియామకాలపై ప్రధానంగా చర్చించారాయన. వాస్తవానికి నిన్నటితో(శనివారం) గృహసారధుల నియామక సమయం ముగిసింది. అయితే.. అన్ని నియోజకవర్గాల్లో నియామకాలు పూర్తి కాలేదు. ఈ క్రమంలో..
ఈనెలాఖరు వరకు ఆ సమయం పెంచుతూ సజ్జల ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఫిబ్రవరి 1వ తేదీ నుండి గృహసారధులతో మండలాల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారాయన.
Comments
Please login to add a commentAdd a comment