review meeting
-
వారికే ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేస్తామన్నారు. పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం చేస్తామని.. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇస్తామని సీఎం తెలిపారు.‘‘ఇళ్ల విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలి. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని.. అదే సమయంలో శాఖపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలి. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులను సీఎం ఆదేశించారు. -
రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్ష
వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశుపోషణ, పాడి పరిశ్రమ..వంటి విభిన్న విభాగాలకు అందించే రుణాల పంపిణీ పురోగతిని కేంద్రం సమీక్షించింది. కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి నాగరాజు ఈమేరకు అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించారు.రుణాలతో ఉపాధి అవకాశాలు పెంపుప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నాగరాజు బ్యాంకర్లకు సూచించారు. ఈ రంగాలకు అందించే రుణ పంపిణీని మెరుగుపరచడంలో బ్యాంకులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వ్యవసాయ వృద్ధి కోసం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్నారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాబట్టి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో రుణ పంపిణీ పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ పంపిణీని నిర్ధారించడానికి ప్రాంతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించారు.ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?రుణ పంపిణీపై ప్రభుత్వం దృష్టిచేపల పెంపకందారులను గుర్తించి వారికి కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సహకరించాలని చెప్పారు. అందుకోసం రాష్ట్ర విభాగాలు, ఇతర సంఘాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సులువుగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని నొక్కి చెప్పారు. -
భేటీలతో మోదీ బిజీ బిజీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించారు. మూడోసారి అధికారంలోకి వస్తే ‘100 రోజుల అజెండా’లో చేయాల్సిన పనులపై చర్చించారు.వరస సమీక్షలు రేమాన్ తుపాను బీభత్సం, సహాయక చర్యలు తదితరాలపై మోదీ సమీక్ష జరిపారు. దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో పౌరుల మరణానికి కారణనమైన హీట్‌వేవ్‌పై సమీక్ష జరిగింది. ఆస్పత్రుల్లో సరిపడ పడకలు, వైద్యులు, వైద్యసిబ్బంది, ఔషధాల లభ్యతపై చర్చించారు. జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. అన్నింటికన్నా ముఖ్యమైనదిగా భావిస్తున్న ‘100 రోజుల అజెండా’పై విడిగా మరో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాగానే చేపట్టాల్సిన పనుల పురోగతిపై ప్రధాని అధికారులను ఆరాతీశారు. తొలి 100 రోజుల్లో ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని గతంలో మంత్రిమండలి సభ్యులను మోదీ ఆజ్ఞాపించడం తెల్సిందే. ఫైర్, ఎలక్ట్రిక్ సేఫ్టీ ఆడిట్లు చేయండి ఎండలు, వేడి వాతావరణం కారణంగా భవనాల్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగి అగి్నప్రమాదాలకు దారి తీయకుండా ఎప్పటికప్పుడు ఫైర్, ఎలక్ట్రిక్ సేఫ్టీ ఆడిట్లను చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అధిక ఉష్ణోగ్రతల ధాటికి అటవీప్రాంతాల్లో కార్చిచ్చు ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచనలు చేశారు. ‘ మిజోరం, అస్సాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయలో రేమాల్ తుపాను బాధితులకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు’ అని కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ భేటీల్లో పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై సీఎస్ సమీక్ష
-
అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. అంగన్వాడీల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టిసారించాలన్న సీఎం.. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: జీహెచ్ఎంసీ ప్రక్షాళన.. 14 మంది అధికారులపై వేటు -
Kurnool: ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి
కర్నూలు(సెంట్రల్): నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాఎన్నికల అధికారి/కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్, కులగణన సర్వే తదితర అంశాలపై ఆమె రిటర్నింగ్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జేసీ నారపురెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓల పాత్ర కీలకమన్నారు. ఈక్రమంలో త్వరగా మండలాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వచ్చే 10–15 రోజుల్లో మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి నివేదిక పంపాలన్నారు. సెక్టార్ ఆఫీసర్లు, బీఎల్ఓలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎన్నికల అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల పనులతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. కిందిస్థాయి సిబ్బంది మీద ఆధారపడకుండా రిటర్నింగ్ అధికారి హ్యాండ్‌బుక్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇతర నియమాలను తప్పనిసరిగా చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. సెక్టార్ ఆఫీసర్లతో మాట్లాడుకొని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరేందుకు అవసరమైన రూట్‌మ్యాప్‌లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై సమీక్షలు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కులగణన సర్వే 88 శాతం పూర్తి జిల్లాలో కులగణన సర్వే 88 శాతం పూర్తయిందని, బుధవారంలోపు 90 శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను కలెక్టర్ సృజన ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సర్వేను వేగవంతం చేయించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా టాప్‌లో ఉందన్నారు. కానీ ఆరోగ్యశీ యాప్‌ను డౌన్లోడ్ చేయించడంలో మాత్రం జిల్లా దిగువ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. బుధవారంలోపు ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్‌లో పురోగతి సాధించేలా చూడాలన్నారు. ఆరోగ్య సురక్ష క్యాంపులకు సంబంధించి వలంటీర్లతో సర్వేను వేగవంతం చేయించాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇచ్చిన స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 9వ తేదీలోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జేసీ నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగర పాలక కమిషనర్ భార్గవ్‌తేజ, ఆదోని సబ్‌కలెక్టర్ శివనారాయన్ శర్మ, డీఆర్వో కె.మధుసూదన్‌రావు, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలు ఎం.శేషిరెడ్డి, రామలక్ష్మి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడాకూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయి. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలి. జనవరి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంచుతాం. రూ.3 వేలకు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నామని సీఎం చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ►జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం జరుగుతుంది ►2019లో మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు ►మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 లు చేశాం ►ఆ తర్వాత ఇప్పుడు రూ.3 వేల వరకూ పెంచుకుంటూ వచ్చాం ►గత ప్రభుత్వంలో నెలకు రూ.400 కోట్ల మాత్రమే సగటున పెన్షన్లకోసం ఖర్చు చేసేవారు ►ఇవాళ మన ప్రభుత్వ హయాంలో నెలకు సుమారు రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నాం ►మన రాకముందు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు అయితే ఇవాళ పెన్షన్ల సంఖ్య దాదాపు 66 లక్షలు ►ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి, ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకూడదని.. ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ – సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం ►ఒకటో తారీఖు అది ఆదివారమైనా, పండుగైనా సరే .. పొద్దునే వాలంటీర్ చిక్కటి చిరునవ్వుతో పెన్షన్‌ను ఇంటివద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకురాగలిగాం ►ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ మార్పును తీసుకురాగలిగాం: ►ఈ మార్పును ఎలా తీసుకు రాగలిగాం? ఇంత మంచి ఎలా చేయగలిగాం? అన్నది ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది ►రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం ►మూడో కార్యక్రమం వైఎస్సార్ ఆసరాలో భాగంగా జనవరి 23 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ►నాలుగోది వైయస్సార్ చేయూత కార్యక్రమం.. ఇది ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది ►ఈ నాలుగు కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహిస్తుంది ►అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో .. మరలా రీవెరిఫికేషన్ చేసి, వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది: ►ఈ కార్యక్రమం జరిగే లోపే వెరిఫికేషన్ పూర్తి చేసిన దాదాపు 1.17 లక్షల పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు ►66,34,742మందికి సుమారు రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి ►మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది ►క్రెడిబులిటీకి అర్ధం చెబుతూ ఈ ప్రభుత్వం పనిచేస్తోంది ►ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి ►పెన్షన్ల పెంపు కార్యక్రమం జనవరి 1వ తేదీనే ప్రారంభమవుతుంది ►ఇందులో భాగంగా నేను కూడా 3వ తారీఖున కాకినాడలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను ►అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖునే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది ►ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ►ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ►8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్ కానుక కార్యక్రమం జరుగుతుంది ►ఏయే మండలాల్లో ఏయే రోజుల్లో జరుగుతుందన్న దానిపై షెడ్యూలు చేసుకోవాలి పెన్షన్‌తోపాటు నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి ►ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, ఉత్సాహవంతులు, లైక్ మైండ్స్.. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలి ►ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలి ►రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం లేదు ►వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నాం ►వాళ్ల కోసం పట్టించుకునే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలాంటి ఏర్పాటు గతంలో ఎప్పుడూ లేదు ►దేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బు ఎక్కడా ఇవ్వలేదు ►మనం చెప్పిన మాటను నెరవేర్చాలా మన ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేసింది ►ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో, ఎంత గొప్పగా చేయగలుగుతున్నామో అందరికీ తెలిసిందే ►ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను ప్రతి లబ్ధిదారులకు తెలియాలి ►ఈ పెన్షన్ కార్యక్రమం కోసం ఏడాదికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ►కాని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంకిత భావంతో అవ్వాతాతలకు అండగా నిలబడేందుకు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాం వైఎస్సార్ ఆసరా... ►2019లో మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలన్నీ పూర్తిగా కుదేలైపోయాయి ►ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సీ గ్రేడ్, డీ గ్రేడ్‌గా సంఘాల్లో చేరిన పరిస్థితి ►18శాతం పైచిలుకు అక్కౌంట్లు అన్నీ కూడా అవుట్ స్టాండింగ్, ఎన్పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి ►గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది ►మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి చేయూత నిచ్చి ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం: ►మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం ►క్రమం తప్పకుండా ప్రతి ఏటా లబ్ధిదారులకు అందించగలిగాం ►అందుకనే ఈరోజు పొదుపు సంఘాల్లో ఎన్పీఏలు కేవలం 0.3 శాతానికి చేరాయి: ►అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడు ఉండి నడిపించిన ప్రభుత్వం మనది ►ఒక్క ఆసరా కోసమే రూ.25,570 కోట్లు ఖర్చు చేశాం ►మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,195 కోట్లు ఇచ్చాం ►నాలుగో విడతగా.... చివరి ఇన్స్టాల్మెంట్ కింద సుమారు రూ.6,400 కోట్లు ఇస్తున్నాం ►జనవరి 23న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ►ఇది కూడా జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కొనసాగుతుంది ►ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు ►మహిళల్లో సుస్థర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం ►ఇందులో భాగంగానే అనేక మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలతో టై అప్ చేయించాం ►బ్యాంకులతో టై అప్ చేయించాం ►స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం: ►ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాల్లో మహిళలు, మహిళా సంఘాల్లో అవగాహన కల్పించాలి ►ఆసరా, చేయూత కార్యక్రమాల లబ్ధిదారులకు ఇది చాలా అవసరం : ►మహిళా సంఘాలు తీర్మానాలు చేసుకుంటే ఆసరా కింద ఇచ్చే డబ్బు గ్రూపు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుంది: వీడియోల రూపంలో విజయ గాథలు ►పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాధలను వీడియోల రూపంలో పంపాలి ►ఇలా పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తాం ►ఇవి మరికొందరిలో స్ఫూర్తిని పెంచుతాయి: ►ఏ రకంగా ఈ పథకాలు, కార్యక్రమాలు వారి జీవితాలను మార్చాయో ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి ►ఈ పథకాల ద్వారా మహిళల్లో వచ్చిన మార్పులను ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి ►ఉత్తమమైన వాటికి సచివాలయాల స్ధాయిలో రూ.10వేలు, మండల స్థాయిలో రూ.15వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, జిల్లా స్థాయిలో రూ.25వేలు బహుమతిగా ఇస్తాం ►ఫిబ్రవరి 15–16 ప్రాంతంలో ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తాం ►వాటితోపాటు లబ్ధిదారులపై రూపొందించివాటిలో ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు ►ఆసరా కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి ►ఇందులో మహిళా సంఘాల కార్యకలాపాలు తెలియజేసే స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలి వైఎస్సార్ చేయూత కార్యక్రమం... ►ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైయస్సార్ చేయూత కార్యక్రమం జరుగుతుంది ►గతంలో ఆంధ్రరాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు ►ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు ఇచ్చాం ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాల్లో వారికి తోడుగా నిలబడ్డమే కాకుండా, వారికి జీవనోపాధి చూపించే దిశగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ►45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750లు ఇచ్చాం ►26 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం ►ఈ పథకంలో ఇప్పటివరకు యూనిక్ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు ►ఈ పథకం వారి జీవితాల్లో ఏరకంగా మార్పులు తీసుకు వచ్చిందో తెలియజెప్పాలి ►చివరి విడతద్వారా 26,39,703 మంది లబ్ధి పొందారు ►అదే విధంగా మహిళల జీవనోపాథి మార్గాలపై వారిలో మరింత అవగాహన కల్పించి, వారికున్న అవకాశాలనుకూడా వివరించాలి ►ఈ కార్యక్రమంలో కూడా నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి ►అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి జనవరి 19 – అంబేద్కర్ విగ్రహం ప్రారంభం. ►జనవరి 19 విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నాం ►19 ఎకరాల్లో రూ.404 కోట్లతో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం ►సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం ►సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి ►ప్రతి సచివాలయం పరిధిలోకూడా సమావేశాలు పెట్టి, అవగాహన కలిగించాలి ►ప్రతి సచివాలయం నుంచి 5 మందిని 19న జరిగే అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలి ►ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకమైన బస్సులు నడుపుతాం ►సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణలో వాళ్లూ భాగస్వామ్యులయ్యేటట్టు చేయాలి ►గ్రామ స్థాయిలో మనం గొప్ప వ్యవస్థను తీసుకు వచ్చాం ►గ్రామ స్వరాజ్యం తీసుకు వచ్చాం ►ఇదొక గొప్ప మార్పు ►దీనికి మద్ధతు తెలిపే కార్యక్రమాలు జరగాలి ►ఈ మార్పునకు ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం నిలుస్తుంది -
స్పీడ్ పెంచిన సీఎం రేవంత్.. ఇక GHMC, HMDA వంతు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్షలు నిర్వహించారు. ఇక, తాజాగా కొత్త ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏపై సమీక్ష చేపట్టనుంది. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 25వ తేదీ తరువాత జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏ పరిధిలో రిపోర్టు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్, పెండింగ్ పనుల లిస్ట్‌పై బల్దియా కసరత్తు మొదలు పెట్టింది. ఇక, హెచ్ఎండీఏ పరిధిలో ఓఆర్ఆర్ టెండర్లు, భూముల వేలంతో పాటు పెండింగ్ పనుల లిస్ట్‌ను అధికారులు సిద్దం చేస్తున్నారు. మరోవైపు, ఆదాయ మార్గాల్లో భాగంగా రెండింటిపై ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి వద్దే మున్సిపల్ శాఖ ఉన్న విషయం తెలిసిందే. -
మేడిగడ్డపై అంత నిర్లక్ష్యమా.. మంత్రి ఉత్తమ్ సీరియస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మేడిగడ్డ పనులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే, మేడిగట్ట బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్, ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సమీక్షలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్..‘అంత పెద్ద ప్రాజెక్ట్‌లో ఎలా నాసిరకం పనులు చేసారు. ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తపించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. -
నిబంధనలు సడలించి న్యాయం చేస్తాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో దెబ్బతిన్న పంటలపై, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అలాగే ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వాళ్లకు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం జగన్ అన్నారు. అవసరమైతే కొన్ని నిబంధనలు సడలించైనా రైతులకు న్యాయం చేయాలని సూచించారాయన. ‘‘రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదే విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేసి, వారిలో భరోసాను నింపాలి. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్గా ఉండాలి. కొన్ని నిబంధనలు సడలించి అయినా రైతులకు న్యాయం చేయాలి’’ అని సీఎం జగన్ అన్నారు. రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలుచేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటుంది. ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయి అని అన్నారాయన. ఆ సమయంలో ‘రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించారా?’ అని అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. ఈ నెల 11 నుంచి 18 వరకు ఎన్యూమరేషన్ జరుగుతోందని, 19 నుంచి 22 వరకు సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేలలో లిస్ట్‌లు అందుబాటులో ఉంచుతామని అధికారులు సీఎం జగన్‌కు నివేదించారు. -
తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం పలు కీలక విభాగాలపై సమీక్ష చేపట్టారు. ఉదయం నుంచి ఆయన ఐదు కీలక శాఖలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దని అన్నారు. ప్రతినెల నార్కోటిక్ బ్యూరోపై రివ్యూ చేస్తామని తెలిపారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్పీఎస్సీ, సింగరేణిలపై రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష చేశారు. మరోసారి టీఎస్పీఎస్సీపై సమీక్ష నిర్వహించినున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. -
పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టాలి
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ... రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
యాదాద్రి : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. బుధవారం ఉప్పల్‌లోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన భునవగిరి జోన్ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలిసి ఉండాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తీసుకెళ్లే రూట్‌ను చెక్ చేసుకోవాలని, చెక్‌పోస్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. సమస్యలు సృష్టించేవారిపై నిఘా ఉంచాలి అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గతంలో జరిగిన ఎన్నికల్లో సమస్యలు సృష్టించిన వారిపై నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు సీపీ సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా పంపే సందేశాలు, వీడియోలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందజేయాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ అంబర్ కిషోర్, డీసీపీ రాజేష్ చంద్ర, రాచకొండ ట్రాఫిక్ డీసీసీ–1 అభిషేక్ మహంతి, మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి, ఎస్ఓటీ డీసీపీ–1 గిరిధర్, మహేశ్వరం డీసీపీ శ్రీని వాస్, ఎస్బీ డీసీపీ బాలస్వామి, సెబర్ క్రైమ్ డీసీపీ అనురాధ, అడ్మిన్ డీసీపీ ఇందిరా, ఎల్పీనగర్ డీసీపీ సాయిశ్రీ, ట్రాఫిక్ డీసీపీ–2 శ్రీనివాసులు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్, క్రైమ్ డీసీపీ అరవింద్, అడిషనల్ డీసీపీలు పాల్గొన్నారు. -
భూగర్భ గనులను కాపాడాలి
మంచిర్యాల: భూగర్భ గనులను కాపాడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే న్యూటెక్ గనికి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం శ్రీరాంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో పునః ధ్రువీకరణ కింద ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, నిజామాబాద్ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ జి.లక్ష్మణ్ హాజరయ్యారు. సభకు హాజరైన వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. చాలామంది వక్తలో సభలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. సింగరేణిలో భూగర్భ గనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, జీవితకాలం దగ్గరపడ్డ గనుల్లోని నిక్షేపాలను అన్వేషించి వెలికితీత ద్వారా జీవిత కాలం పెరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. భూగర్భ గనులతోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, సింగరేణి గనుల వల్ల జరిగే కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందని, ఇందుకోసం మరిన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులు, శ్రీరాంపూర్ డీఎంఎఫ్టీ నిధులను సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలని, కానీ సింగరేణికి సంబంధం లేని ప్రాంతాలకు తరలించారని తెలిపారు. శ్రీరాంపూర్ ప్రాంతంలో ఆర్కే 6 గని పరిసరాల్లో సింగరేణి ప్రత్యేక శ్మశానవాటిక ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నుంచి కే.సురేందర్‌రెడ్డి, ఏఐటీయూసీ నుంచి ఎస్కే బాజీసైదా, ముస్కె సమ్మయ్య, ఐఎన్టీయూసీ నుంచి జే శంకర్రావు, బీఎంఎస్ నాయకులు పేరం రమేశ్, హెచ్ఎమ్మెస్ నేత తిప్పారపు సారయ్య, సీఐటీయూ నాయకులు భాగ్యరాజ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఎన్విరాన్మెంట్ జీఎం జేవీఎల్ గణపతి, ఏరియా ఎస్ఓటు జీఎం రఘుకుమార్, ఓసీపీ పీఓలు పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్, ఏజెంట్లు రాముడు, డీజీఎం(పర్సనల్) అరవిందరావు, ఏరియా ఎన్విరాన్మెంట్ హనుమాన్‌గౌడ్ పాల్గొన్నారు. అభ్యంతరాలు పరిష్కరిస్తాం.. సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలను పరిశీలించి కంపెనీ పరిధిలో ఉన్న వాటిని తప్పనిసరిగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. ఏరియా పరిధిలోని అంశాలను వెంటనే పరిష్కరిస్తాం. సింగరేణి అభివృద్ధి చెందితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు పరిసర గ్రామాల్లో చేసుకొనే వీలుంది. –బీ.సంజీవరెడ్డి, జీఎం, శ్రీరాంపూర్ ప్రభుత్వానికి నివేదిస్తాం ఈ సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలు, సమస్యలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో రికార్డు చేయించడం జరిగింది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సింగరేణితోనే ఈ ప్రాంతంలో అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి సంస్థను కాపాడుకోవాలి. – సబావత్ మోతీలాల్, జిల్లా అదనపు కలెక్టర్ -
లక్ష్యం సాధిస్తే రూ.40 వేల కోట్ల టర్నోవర్
గోదావరిఖని: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతోందని, మిగిలిన ఆర్నెల్లలో రోజూ కనీసం 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నిఏరియాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వచ్చేఏడాది మార్చి చివరికల్లా 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని అధిగమించాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆర్నెల్లలో వర్షాలతో కొంతఇబ్బంది కలిగినా అన్నిఅవరోధాలు అధిగమిస్తూ గతేడాది బొగ్గు రవాణాలో 12 శాతం వృద్ధి, ఉత్పత్తిలో 7శాతం, ఓవర్‌బర్డెన్ తొలగింపులో 15 శాతం వృద్ధి సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆర్నెల్లు కీలకమని పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్నిఏరియాలకు అవసరమైన యంత్రాలు, అనుమతులు, ఓబీ కాంట్రాక్టులు ఇప్పటికే సమకూర్చామన్నారు. ఇకపై వర్షప్రభావం ఉండే అవకాశం లేదన్నారు. ఓపెన్‌కాస్ట్‌ల్లో నిలిచిన నీటిని బయటకు తోడేయాలని, బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపును మరింత వేగవంతం చేయాలని సూచించారు. లక్ష్యాలు సాధిస్తే రూ.3,500కోట్ల లాభాలు ఈఏడాది నిర్దేశిత 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే.. లక్ష్యానికి అనుగుణంగా రవాణా చేసే అవకాశం ఉందని సీఎండీ తెలిపారు. తద్వారా రూ.40 వేల కోట్ల టర్నోవర్, సుమారు రూ.3,500 కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. అంకిత భావంతో పనిచేయాలి సింగరేణి ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేదఫా రూ.1,750 కోట్ల వేజ్‌బోర్డు ఎరియర్స్ చెల్లించామని, సీఎం ప్రకటించినట్లు 32శాతం లాభాల బోనస్ రూ.711 కోట్లు కూడా దసరా పండుగకు ముందే విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. దీపావళి బోనస్‌ను పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. కంపెనీపై విశ్వాసం, విధుల్లో అంకితభావంతో కార్మిక, అధికారులు, సమష్టిగా కృషి చేయాలని కోరారు. లక్ష్యాల అధిగమించిన సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి నిర్దేశిత లక్ష్యాలు సాధించిందని శ్రీధర్ అన్నారు. ఈ ఏడాది బొగ్గు రవాణా లక్ష్యం 307 లక్షల టన్నులు కాగా 330 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి, 7 శాతం వృద్ధిని నమోదు చేసిందని వివరించారు. గతేడాది ఇదే సమయం కన్నా 12శాతం అధికమని పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఎన్.బలరాం, సత్యనారాయణరావు, వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు సరేంద్రపాండే, అల్విన్, ఎం.సురేశ్, రమేశ్ పాల్గొన్నారు. -
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న సీఎం.. అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలన్నారు. చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్న సీఎం.. లబ్ధిదారులు తొలి విడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలి. ఆ కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం సూచించారు. చదవండి: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనది, ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్‌ను నియమించడంవల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోంది. అలాగే గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా ప్రారంభించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుంది. జగనన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. మౌలిక సదుపాయాలు దగ్గరనుంచి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. జగనన్న కాలనీలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలి. లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నందున మౌలిక సదుపాయాలు విషయంలో రాజీ పడొద్దు. అపరిశుభ్రతకు ఈ కాలనీలను నిలయంగా మారకూడదు. అందుకనే కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.‘‘స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం అన్నది చాలా కీలకం. ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిర్వహించాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశానికి సీఎస్ జవహర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
AP: ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల ప్రగతిని శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ వేగవంతంగా ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వీటి ప్రగతిపై ప్రతి 15 రోజులకు నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ను సీఎస్ ఆదేశించారు. నెలకు ఒకసారి ఈ అంశంపై సమీక్షిస్తానని సీఎస్ అన్నారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పరిశ్రమలకు సంబంధించి చేసుకున్న అవగాహనా ఒప్పందాలపై సీఎస్ సమీక్షించారు. ఆ సమ్మిట్‌లో పరిశ్రమల శాఖకు సంబంధించి వివిధ కంపెనీల ద్వారా 3 లక్లల 41వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 లక్షల 38 వేల మందికి ఉపాధి కల్పించే 107 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోగా ఇప్పటికే కొన్ని కంపెనీలు, పరిశ్రమలకు ముఖ్యమంత్రి స్వయంగానూ, వర్చువల్గానుశంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? డిశంబరు నెలాఖరులోగా మరో 36 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఇంకా పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస చర్యలు తదితర అంశాలపై సీఎస్ అధికారులతో సమీక్ష జరిపారు. అంతకు ముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ కే.ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్ఐపీబీలో ఆమోదించిన ప్రాజెక్టులు వాటి ప్రగతిని వివరించారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న అవగాహనా ఒప్పందాలు ఆయా కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జేడీ రామలింగేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష
-
నియోజక వర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన తానేటి వనిత
-
వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష...
-
రైతుల పంట ఉత్పత్తులకు భరోసా
వైఎస్సార్ చేయూత, ఆసరా వంటి పథకాలను వినియోగించుకుని లబ్ధి పొందుతున్న మహిళల ద్వారా సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించి వారి స్వయం ఉపాధికి ఊతమివ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఆరు వేల మైక్రో యూనిట్లు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. మార్కెట్‌తో సమన్వయం చేసుకుంటూ ఇతర పంటల్లో కూడా మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిరోధించేలా అడుగులు ముందుకు వేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : రైతులు పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరిపైనా ఉందని, ప్రభుత్వం నిర్ధేశించిన కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఏ ఒక్క రైతూ పంట ఉత్పత్తులను అమ్ముకోడానికి వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు ఎవరైనా సరే.. కనీస మద్దతు ధర చెల్లించిన తర్వాతే రైతుల నుంచి పంట ఉత్పత్తులు సేకరించేలా చూడాలన్నారు. డిమాండ్ లేదనో మరే కారణంతోనైనా మద్దతు ధర దక్కకుండా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపీ ఎంఎస్పీ యాక్టు–2023 తీసుకురావాలని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో జరుగుతోన్న వివిధ కార్యక్రమాల పురోగతిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం ప్రకటించే ఎమ్మెస్పీ ధీమా కల్పించేలా ఈ చట్టం ఉండేలా చూడాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకే కాకుండా ఆక్వా, డెయిరీ రైతుల ఉత్పత్తులకు కూడా రక్షణ కల్పించేలా ఈ చట్టాన్ని రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మార్కెటింగ్‌లో ఆర్బీకేల ప్రమేయం ►విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు.. వేటిలోనూ నకిలీ, కల్తీ లేకుండా నివారించడంలో ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అదే రీతిలో మార్కెటింగ్‌లో కూడా ఆర్బీకేల ప్రమేయం ఉండాలి. పంటల సాగు, బీమా కల్పన, ధాన్యం కొనుగోలులో ఆర్బీకేలు ఇప్పటికే రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. ►ధాన్యం సేకరణలో ఆర్బీకేల ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేశాం. కనీస గిట్టుబాటు ధరలు రాని ఏ పంట కొనుగోళ్లలో అయినా ఆర్బీకే జోక్యం చేసుకుంటుంది. మిగిలిన పంటల కొనుగోలు కూడా ఆర్బీకే కేంద్రంగా జరిగేలా చూడాలి. ఏ రకమైన కొనుగోళ్లకు అయినా ఆర్బీకే కేంద్రం కావాలి. డ్రోన్ టెక్నాలజీ విస్తృతం ►వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలి. ఇప్పటికే సూక్ష్మ ఎరువులు, పురుగు మందుల వినియోగం లాంటి కార్యక్రమాలు డ్రోన్ల ద్వారా చేస్తున్నాం. ఇదే కాకుండా డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు చేయించే పరిస్థితిని తీసుకురావాలి. తద్వారా ఆర్బీకే స్థాయిలో భూసార పరీక్షలు జరిగేలా చూడాలి. ►భూసార పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించడమే కాకుండా, ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా తెలుసుకునే పరిస్థితి వస్తే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. పైగా సేకరించే డేటాలో కచ్చితత్వం ఉండేందుకు అవకాశం ఉంటుంది. ►సాగులోనే కాదు పంట దిగుబడులపై అంచనాలకు కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారు. వరి దిగుబడులను డ్రోన్ల సాయంతో అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగిలిన పంటల విషయంలో కూడా ఇదే తరహా ప్రయోజనాలు డ్రోన్ టెక్నాలజీ ద్వారా పొందేలా చూడాలి. బహుళ ప్రయోజనకారిగా డ్రోన్లను వినియోగించు కోవడం వల్ల వ్యవసాయ రంగానికి, రైతులకు మరింత మేలు జరుగుతుంది. వీడియోల ద్వారా సాగులో శిక్షణ ►10 వేల ఆర్బీకేల్లో 10 వేల డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. సాగులో శిక్షణ కార్యక్రమాలపై మరిన్ని వీడియోలు రూపొందించి ఆర్బీకే ఛానెల్ ద్వారా మరింతగా రైతులకు చేరువ చేయాలి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాధ్యమైనంత ఎక్కువ మంది కౌలుదారులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలి. వీరికి రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలి. ►వైఎస్సార్ ఉచిత పంటల బీమా దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ నాలుగేళ్లలో ఇప్పటి వరకు 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.5 కోట్లు పరిహారంగా అందించాం. రబీ సీజన్‌కు సంబంధించి పంటల బీమా పరిహారాన్ని అక్టోబర్‌లో ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. పంటల ఆధారంగా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ► జిల్లాల్లో స్థానికంగా పండే పంటల ఆధారంగా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు దిశగా కృషి చేయాలి. నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ యూనిట్లను అందుబాటులోకి తీసుకురావాలి. ► రెగ్యులర్ మార్కెట్‌కే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్‌కు అనుకూలమైన వంగడాలను ఉద్యానవన పంటల్లో ప్రోత్సహించాలి. గత నాలుగేళ్లలో 4.34 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటల నుంచి ఉద్యానవన పంటల వైపు మళ్లింపు జరిగింది. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ► తరచూ ధరల్లో తీవ్ర హెచ్చు తగ్గులకు గురయ్యే టమాటా, ఉల్లి లాంటి పంటల ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ పంటల సాగు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఆయా జిల్లాల్లో మహిళలతో నడిచేలా సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ► ఇందుకోసం అవసరమైన వ్యవసాయ ఉపకరణాలు, డ్రైయింగ్ ప్లాట్ ఫామ్‌లతో పాటు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. గోడౌన్లు, కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. వీటి వల్ల పంట ఉత్పత్తుల జీవితకాలం పెరుగుతుంది. రైతులకు మంచి ధరలు వస్తాయి. ఉద్యానవన పంటలకు ఈ మౌలిక సదుపాయాలు ఎంతగానో అవసరం. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు ఐ.తిరుపాల్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్, ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రేపు సీఎం జగన్ పోలవరం పర్యటన..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం.. అధికారులతో ప్రాజెక్ట్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: పబ్లిసిటీ కాదు.. బాధితులకు సేవచేయడం ముఖ్యం: మంత్రి అమర్నాథ్ -
పారిశ్రామిక రంగ ప్రగతిలో ఎంఎస్ఎంఈలది కీలక పాత్ర: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నంబర్ ఒన్ స్థానంలో నిలుస్తున్నామని అధికారులు వెల్లడించగా, జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందని, పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని స్పష్టం చేశారు. 2022 జనవరి – డిసెంబరు మధ్యకాలంలో రూ.45,217 పెట్టుబడులు వచ్చాయని వెల్లడించిన అధికారులు.. 2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయని తెలిపారు.ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని సూచనలు చేశారు. సీఎం వైఎస్ జగన్ కామెంట్స్ ►పారిశ్రామిక రంగ ప్రగతిలో MSMEలది కీలక పాత్ర ►ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయి ►ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలి ►ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులు ఏంటి? వాటి ఉత్పత్తిని సాధించడానికి MSMEలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం? ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం? ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి ► MSMEలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలి ►పరిశ్రమల శాఖలో MSMEఎంఎస్‌ఎంఈలకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి ►ఈ విభాగానికి ఒక కార్యదర్శిని కూడా నియమించాలి ►రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలి ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్, టూరిజం సీఈవో కన్నబాబు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ అండ్ ఎండీ ఎస్.రమణా రెడ్డి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు ఏపీ ప్రభుత్వ భరోసా -
టెన్త్ పేపర్ లీక్‌పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సబిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేన, పోలీస్ రేంజ్ ఐ.జిలు షానవాజ్ కాసీం , చంద్రశేఖర్ రెడ్డి లు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని, ఈ పరీక్షల విషయంలో తమ స్వార్థ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సబితా స్పష్టంచేశారు. పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఏవిధమైన అపోహలకు, అనుమానాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్‌లను మూసివేయించాలని అన్నారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందించారు. చదవండి: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్ సీపీ -
వ్యవసాయంపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 15 నుంచి రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ చేయడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అకాల వర్షాలు వల్ల పంట నష్టంపై ఎన్యుమరేషన్ స్ధితి గతులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ జరుగుతోందని, ఏప్రిల్ మొదటి వారంలో నివేదిక ఖరారు చేస్తామని, ఏప్రిల్ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదలచేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. రబీ సన్నాహకాలపైన సీఎం సమీక్ష. ఇప్పటికే 100 శాతం ఇ-క్రాపింగ్ పూర్తైందని అధికారులు వెల్లడించారు. నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు లేకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఇక్కడ జరిగే పొరపాట్లు వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధపెట్టాలని సీఎం సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్బీకేల ద్వారానే నాణ్యమైన ఎరువులను పంపిణీ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా 2023–24లో 10.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన అధికారులు. ఎరువులతో పాటు ఏపీ ఆగ్రోస్ ద్వారా రైతులకు అవసరమైన స్థాయిలో పురుగుమందుల పంపిణీకి కూడా చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. నకిలీ, నాణ్యతలేని పురుగుమందులు లేకుండా చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. పొలంబడి శిక్షణ ♦పొలంబడి శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్న అధికారులు ♦ఆర్బీకేల ద్వారా ఆయా రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నామన్న అధికారులు ♦ఈ శిక్షణ కార్యక్రమాల వల్ల వరి, వేరుశెనగలో 15శాతం, పత్తిలో 12 శాతం, మొక్కజొన్నలో 5శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గాయన్న అధికారులు ♦పత్తిలో 16శాతం, మొక్కజొన్నలో 15 శాతం, వేరుశెనగ 12 శాతం, వరిలో 9శాతం దిగుబడులు పెరిగాయన్న అధికారులు ♦పూర్తి సేంద్రీయ వ్యవసాయ పద్దతుల దిశగా అడుగులు వేయడానికి ఇది తొలిమెట్టు అన్న అధికారులు ♦26 ఎఫ్‌పీవో(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)లకు జీఏపి (గుడ్‌అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికెట్‌ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు వ్యవసాయ పరికరాల పంపిణీ ♦రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్ ♦ యాంత్రీకరణ పెరిగేందుకు దోహదపడుతుందన్న సీఎం ♦ ఏప్రిల్‌లో ఆర్బీకేల్లోని 4225 సీహెచ్‌సీలకు యంత్రాల పంపిణీ ♦జులైలో 500 డ్రోన్లు, డిసెంబర్ కల్లా మరో 1500 డ్రోన్లు పంపిణీ ♦జులై లో టార్పాలిన్లు, జులై నుంచి డిసెంబర్ మధ్య మూడు విడతలుగా స్ప్రేయర్లు పంపిణీ మిల్లెట్స్ సాగుపై చర్యలు ♦రాష్ట్రంలో మిల్లెట్స్ సాగును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం ఆదేశాలమేరకు అనేక చర్యలు తీసుకున్నామన్న అధికారులు ♦19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున మిల్లెట్ క్లస్టర్లు పెట్టామన్న అధికారులు ♦3 ఆర్గానిక్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడి ♦ఎగుమతికి ఆస్కారం ఉన్న వరి సాగును ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు. ♦2022 ఖరీఫ్‌లో 2.74 లక్షల హెక్టార్లలో ఎగుమతిచేయదగ్గ వరి రకాలను సాగుచేస్తున్నామన్న అధికారులు ♦దాదాపు 6.29 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యిందని వెల్లడి ♦2022–23 రబీలో 1.06 లక్షల హెక్టార్లలో ఎగుమతి వెరైటీలను సాగుచేశారని, 3.79 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉందని వెల్లడించిన అధికారులు ♦ఆర్బీకేల్లో కియోస్క్‌ల సేవలు పూర్తిస్థాయిలో రైతులకు అందాలని, దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్న సీఎం ♦ఉద్యానవన పంటల మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం ♦కొత్త తరహా ఉత్పత్తులు వస్తున్నకొద్దీ.. మార్కెటింగ్ ఉదృతంగా ఉండాలన్న సీఎం ♦దీనివల్ల రైతులు తమ పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బందులు ఉండవని, మంచి ఆదాయాలు కూడావస్తాయన్న సీఎం ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ ♦ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం ♦భూ పరీక్షకోసం నమూనాల సేకరణ, వాటిపై పరీక్షలు, వాటి ఫలితాలను రైతులకు అందించడం, ఫలితాలు ఆధారంగా పాటించాల్సిన సాగు విధానాలపై అవగాహన తదితర ♦అంశాలపై ఒక సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించుకోవాలన్న సీఎం ♦ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు చేసేదిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦జూన్‌లో ఖరీఫ్ నాటికి పరీక్షల ఫలితాలు ఆధారంగా రైతుకు సాగులో పాటించాల్సిన పద్ధతులపై పూర్తి వివరాలు, అవగాహన కల్పించాలన్న సీఎం ♦పంటలకు అవసరమైన స్థాయిలోనే ఎరువులు, పురుగుమందులు ఉండాలన్న సీఎం ♦ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్... ఆర్బీకేల కార్యక్రమాలను ఒక దశకు తీసుకెళ్తాయన్న సీఎం చదవండి: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే: కొడాలి నాని ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు తిరుపాల్ రెడ్డి, ఉద్యానవన శాఖ సలహాదారు శివప్రసాద్ రెడ్డి, ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్ బి.నవీన్ నిశ్చల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్ ఎస్ఎస్. శ్రీధర్, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్‌పాండే, ఎపీఎస్‌ఎస్‌డీసీఎస్ వీసీ అండ్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు, ఏపీ ఆగ్రోస్ వీసీ అండ్ ఎండీ ఎస్.కృష్ణమూర్తి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు -
ర్యాగింగ్ విషయంలో కఠినంగా ఉండండి: మంత్రి విడదల రజిని
సాక్షి, అమరావతి: ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. తాజాగా హైదరాబాద్‌లో మెడికో ఆత్మహ్యత ఘటన నేపథ్యంలో మంత్రి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్స్ అందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్ లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఎఎస్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీ బాబ్జి, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ర్యాగింగ్ భూతం విషయంలో అన్ని మెడికల్ కళాశాలలు కఠినంగా ఉండాలని స్పష్టంచేశారు. మెడికోలపై ఎక్కడా, ఎలాంటి వేధింపులు ఉండటానికి వీల్లేదని చెప్పారు. కళాశాలల్లోని యాంటీ ర్యాగింగ్ కమిటీలు పూర్తిస్థాయిలో చురుకుగా పనిచేయాలని చెప్పారు. ర్యాగింగ్, ఇతర వేధింపులకు సంబంధించి ఆయా కళాశాలలపై నేరుగా డీఎంఈ, హెల్త్ యూనివర్సిటీ వీసీ పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆయా కళాశాలల నుంచి ఎప్పటికప్పుడు యాంటి ర్యాగింగ్ కమిటీల ద్వారా నివేదికలు తెప్పించుకుంటూ ఉండాలన్నారు. విద్యార్థులతో బోధనా సిబ్బంది సహృద్భావంతో ఉండాలని చెప్పారు. కొంతమంది సీనియర్ అధ్యాపకులు వారి సొంత క్లినిక్‌ల నేపథ్యంలో పీజీ విద్యార్థులపై పనిభారం మోపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని, ఈ పద్ధతి మారాలని తెలిపారు. పటిష్టమైన చర్యల ద్వారానే ఫలితాలు చదువుల్లో నాణ్యతే కాదని, భద్రత కూడా ఉండాలని మంత్రి విడదల రజిని తెలిపారు. పటిష్టమైన చర్యల ద్వారా మనం సురక్షితంగా మెడికోలను సమాజంలోకి తీసుకురాగలమని చెప్పారు. అన్ని మెడికల్ కళాశాలల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ సెషన్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఒత్తిడి నుంచి బయటపడేలా విద్యార్థులకు యోగా, ధ్యానం లాంటి అంశాలపై అవగాహన పెంచాలన్నారు. కళాశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు అందుబాటులో ఉంచాలన్నారు. ఏదైనా సమాచారాన్ని వెనువెంటనే చేరవేసేలా క్యాంపస్‌లో పలు చోట్ల మైక్‌లు ఏర్పాటుచేసుకోవాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థిని దిశ యాప్ ను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీనియర్, జూనియర్ విద్యార్థులకు ప్రత్యేక వసతి ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వారి భోజన సమయాలు కూడా ఒకేలా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మన రాష్ట్రంలోని ఏ ఒక్క మెడికల్ కళాశాలలో కూడా ఎక్కడా ఒక్క ర్యాగింగ్ కేసు కూడా నమోదు కావడానికి వీల్లేదని స్పష్టంచేశారు. డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాంతో ప్రజలకు మేలు ఎన్ ఎం సీ నిబంధనలకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి మెడికల్ కళాశాల డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ను అమలు చేయాల్సి ఉందని మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ డీఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పీజీ విద్యార్థి మూడు నెలల పాటు కచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో పనిచేయాల్సి ఉందని చెప్పారు. ప్రతి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌కు వారి పరిధిలో మ్యాప్ చేసిన డీహెచ్, ఏహెచ్, సీహెచ్‌సీ, పీహెచ్‌సీల జాబితాను ఇప్పటికే పంపామని తెలిపారు. ఆ జాబితాలో ఉన్న ఆస్పత్రుల్లో పీజీ లు కచ్చితంగా మూడు నెలలు పనిచేసేలా షెడ్యూల్ తయారుచేసుకుని పంపాలని పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి మూడు నెలలకు 250 మంది చొప్పున స్పెషలిస్టు వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. పల్లెల్లో ఉండే పేద ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం దక్కుతుందన్నారు. చదవండి: టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు -
గడప గడపకు మన ప్రభుత్వంపై సజ్జల సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఆదివారం తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. గృహసారధుల నియామకాలపై ప్రధానంగా చర్చించారాయన. వాస్తవానికి నిన్నటితో(శనివారం) గృహసారధుల నియామక సమయం ముగిసింది. అయితే.. అన్ని నియోజకవర్గాల్లో నియామకాలు పూర్తి కాలేదు. ఈ క్రమంలో.. ఈనెలాఖరు వరకు ఆ సమయం పెంచుతూ సజ్జల ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఫిబ్రవరి 1వ తేదీ నుండి గృహసారధులతో మండలాల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారాయన. -
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర భూ సర్వే కోసం ఉపయోగిస్తున్న డ్రోన్లు, సర్వే రాళ్లను సీఎం పరిశీలించారు. డ్రోన్ల పనితీరును అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయడు, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మైనింగ్ శాఖ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: (వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిలు ఆ ఇద్దరే: కొడాలి నాని) -
కరోనాపై మంత్రి హరీశ్ రావు సమీక్ష.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: పలు దేశాల్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ కట్టడికి సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనాపై వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీరును గమనిస్తున్నాము. వైద్య, ఆరోగ్య శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ప్రతీ ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకోవాలన్నారు. కరోనా పట్ల ఆందోళన చెందవద్దు. కానీ, అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. మందులు, ఆక్సిజన్, ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆస్పత్రికి పంపాలని, ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. -
కోవిడ్ పై మధ్యాహ్నం ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం
-
ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ సమీక్ష
ముంబై: ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, భౌగోళికరాజకీయ పరిణామాలతో తలెత్తుతున్న సవాళ్లను రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు శుక్రవారం సమీక్షించింది. అలాగే, నిర్దిష్ట సెంట్రల్ ఆఫీస్ డిపార్ట్మెంట్ల కార్యకలాపాలు, 2021–22లో భారత్‌లో బ్యాంకింగ్ పురోగతి నివేదికపై కూడా చర్చించింది. 599వ సెంట్రల్ బోర్డు సమావేశంలో సతీష్ కె మరాఠే, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది, వేణు శ్రీనివాసన్ తదితర డైరెక్టర్లు పాల్గొన్నట్లు ఆర్బీఐ తెలిపింది. చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్! -
చంద్రబాబు ముందస్తు ఆశలు నెరవేరే అవకాశం లేదు : సజ్జల
-
కొత్త ఒరవడితో.. సమస్యల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ‘‘మూస ధోరణులు, సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా వినూత్నంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలి. రొటీన్‌గా కాకుండా మరింత గొప్పగా పనిచేయాలి. నిన్నటి కన్నా రేపు ఎంత మెరుగ్గా పనిచేయగలమని రోజూ ఆలోచించాలి. ఒక పనిని ఎంత శాస్త్రీయంగా ఆలోచించి చేస్తున్నామనేదే ముఖ్యం. అప్పుడే ఉన్నతంగా ఎదగగలం’’ అని అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆదివారం సీఎం పురపాలక శాఖ అంశాలు, నిజామాబాద్ నగర అభివృద్ధిపై ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే సామాజిక అభివృద్ధి వేగవంతం అవుతుందని.. అప్పుడే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమని చెప్పారు. ఒక్కో రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టడంలో ఉద్యోగుల సమష్టి కృషి కీలకమని స్పష్టం చేశారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించిననాడే గుణాత్మక ప్రగతిని ప్రజలకు చేరవేయగలుగుతామన్నారు. నాణ్యమైన సేవలు అందాలి పెరుగుతున్న ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా పెరుగుతున్న ప్రజావసరాలను తీర్చడానికి అందరం కలిసి పనిచేయాలని కేసీఆర్ సూచించారు. అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. ఉమ్మడి పాలనలో శిథిలమైన అన్ని రంగాలను తీర్చిదిద్ది గాడిలో పెట్టగలిగామని, అన్ని రంగాలు వాటంతట అవి పనిచేసుకుంటూ పోయే స్థితికి తెచ్చుకున్నామని చెప్పారు. ‘‘నాడు తెలంగాణలో కనీస వసతులు లేవు. నేడు అన్ని రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధించింది. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు సమకూరాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతి సాధించింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. తెలంగాణ సమాజంలో అన్నివర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. ప్రభుత్వాల నుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు. ఉత్తమ సేవలను అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది సౌకర్యాల పెంపునకు డిమాండ్ పెరుగుతోందంటే ప్రభుత్వంపై ప్రజలకు పెరిగిన విశ్వాసమే అందుకు కారణమని కేసీఆర్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఒకనాడు ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానాలు, ఇతర ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా ఉంటున్నాయి. ఒకనాటి వలసలు నేడు రివర్స్ అయ్యాయి. 30లక్షల మంది పక్క రాష్ట్రాల నుంచి వలసవచ్చి బతుకుతున్నారు. స్వరాష్ట్రంలో రాబడులు, ఆర్థిక వనరులు పెరిగాయి. సంస్కరణలతో గడపగడపకూ పాలనను తీసుకుపోతున్నాం. పెరిగిన అభివృద్ధిని ప్రజా ఆకాంక్షలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం తమ కర్తవ్య నిర్వహణను తీర్చిదిద్దుకోవాలి. పెరిగిన అభివృద్ధికి సమానంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల ప్రాథమిక, నిత్యావసరాలను ఎంత గొప్పగా తీర్చగలమనేదే ప్రభుత్వోద్యోగికి ప్రధాన కర్తవ్యం కావాలి’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షాలు లేని సమయంలోనే పూర్తి చేయాలి గతంలో వానాకాలం రెండు మూడు నెలలే వర్షాలు పడేవని, ఇప్పుడు వానలు పడే రోజులు పెరిగి నిర్మాణ పనులకు సమయం తగ్గిందని సీఎం కేసీఆర్ చెప్పారు. అందువల్ల వర్షాలు లేని ఆరేడు నెలల్లోనే పనులు వేగంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. రెండున్నర నెలల్లో ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తిచేయాలని, నిధులకు కొరత లేదని.. రెండు నెలల్లో తాను స్వయంగా పర్యటించి పనులను పరిశీలిస్తానని చెప్పారు. ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీసుకుని నిజామాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమీక్ష సందర్భంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను సీఎంకు మంత్రి కేటీఆర్ వివరించారు. సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కె.కవిత తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమా? -
ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తి కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్షా సమావేశం చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో జగనన్న కాలనీలు, టిడ్కో హౌసింగ్ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇళ్లులేని వారందరికీ ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 5,655 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లే అవుట్లలో పర్యటన వల్ల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. లే అవుట్లను సందర్శించినట్టుగా ఫొటోలను కూడా అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రతి శనివారం హౌసింగ్‌డేగా నిర్వహిస్తున్నామని.. ఆ రోజు తప్పనిసరిగా అధికారులు లే అవుట్లను సందర్శిస్తున్నారని అధికారులు సీఎంకు వెల్లడించారు. సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ.. ► ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తి కావాలి. ► ఆప్షన్–3 ని ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. ► లే అవుట్ల వారీగా ప్రాధాన్యత పరంగా పనులను గుర్తించి.. అనుకున్న సమయానికి ఆ పని పూర్తయ్యేలా చూడాలి. ► దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో చెప్పుకోదగ్గ ప్రగతి కనిపిస్తుంది. ► ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దు. ► ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధారణ పరీక్షలు జరగాలి. ► ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీని నిరంతరం పాటించడానికి ఎస్ఓపీలను అందుబాటులో ఉంచాలి. ► గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలను విస్తృతంగా వాడుకోవాలి. ► ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ ప్రమాణాలు పాటించే విషయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ భాగస్వామ్యం తీసుకోవాలి. ► ఇళ్లు పూర్తయ్యే సరికి మూడు రకాల మౌలిక సదుపాయాలు ఉండాలి. ► విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. ► మిగిలిన మౌలిక సదుపాయాలనూ వృద్ధిచేసుకుంటూ ముందుకు సాగాలి. ► ఈ పనులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని అధికారులు తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: (వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..) -
అంగన్వాడీలలో నాడు - నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష..
-
స్పందనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో గృహనిర్మాణంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గృహనిర్మాణంలో పురోగతిని వివరించిన అధికారులు.. వర్షాలు తగ్గినందున వేగంగా పనులు ముందుకు సాగుతాయని ఆయనకు తెలియజేశారు. ఈ ఒక్క 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహనిర్మాణం కోసం రూ.5,005 కోట్లు ఖర్చు చేశామన్న అధికారులు.. విశాఖలో మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాలపైనా ప్రత్యేక దృష్టిపెడుతున్నట్లు వివరించారు. ఇక టిడ్కో ఇళ్లు నిర్వహణ బాగుండాలన్న సీఎం వైఎస్ జగన్.. వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికి వాడలుగా మారే ప్రమాదం ఉంటుందని అధికారులకు హెచ్చరించారు. ఏ రకంగా ఆ ఇళ్లను నిర్వహించుకోవాలన్న దానిపై అసోసియేషన్లకు బాసటగా నిలవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే వేల ఇళ్లు అప్పగింత కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుద్దీకరణ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. టిడ్కో ఇళ్లలో.. ఇప్పటికే 40,576 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ కల్లా 1,10,672 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తామని, వచ్చే ఏడాది మార్చికల్లా మరో 1,10,968 ఇళ్లు అప్పగిస్తామని, ఫేజ్–1కు సంబంధించి దాదాపుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసిందని సీఎం జగన్ వద్ద అధికారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్న అధికారులు.. వేయి ఇళ్లకు పైగా ఉన్న చోట్ల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్వహణపై వారికి అవగాహన, మార్గదర్శకాలు సూచిస్తున్నామని, శుభ్రతతో పాటు శానిటేషన్, విద్యుత్ దీపాల నిర్వహణ, వీధి లైట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణ తదితర అంశాలపై అసోసియేషన్లకు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ఏపీ టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఏ.ఎండీ. ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ లక్ష్మీషా, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన మాల మహానాడు -
జలవనరుల శాఖ, పోలవరం పనులపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ఏపీలో జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టులోని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్)లో కోతకు గురైన ప్రాంతంలో చేపట్టే పనుల ప్రణాళికపై అధికారులతో సీఎం చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని, ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదనీరు ఉందని అధికారులు తెలిపారు. ఈసీఆర్ఎఫ్ డ్యాంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా ముందు కోతకు గురైన ప్రాంతంలో పరీక్షలు చేయాలని.. ఆ పరీక్షల్లో వెల్లడైన అంశాలు, దాని తర్వాత డిజైన్ల ఖరారు పూర్తయితే కానీ చేయలేమని పేర్కొన్నారు. కోతకు గురైన ప్రాంతంలో పరిస్థితులు, డయాఫ్రం వాల్ పటిష్టతపై నిర్ధారణల కోసం పరీక్షలు నవంబర్ మధ్యంతరం నుంచి మొదలవుతాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. వీటి తుది నిర్ణయం రావడానికి డిసెంబరు నెలాఖరు వరకూ పట్టే అవకాశం ఉందని, ఆ తర్వాత సీడబ్ల్యూసీ డిజైన్లు, మెథడాలజీ ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ పరీక్షలు నడుస్తున్న సమయంలోనే మరోవైపు దిగువ కాఫర్‌డ్యాం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. దిగువ కాఫర్ డ్యాం పూర్తికాగానే ఆ ప్రాంతంలో డీ వాటరింగ్ పూర్తిచేసి, డిజైన్ల మేరకు ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈలోగా ఆర్అండ్ఆర్ పనుల్లో ప్రాధాన్యతగా క్రమంలో నిర్దేశించుకున్న విధంగా 41.15 మీటర్ల వరకూ సహాయ పునరావాస పనులు పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని అధికారునలు సీఎం జగన్ ఆదేశించారు. చదవండి: ‘ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సిగ్గుందా..ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు’ గోదావరిలో నిరంతరం ప్రవాహం ►1990 తర్వాత అత్యధికంగా వరద ► జులై 18న అత్యధికంగా 25.92 లక్షల క్యూసెక్కుల వరద. ►ఆగస్టు 14న కూడా 15.04 లక్షల క్యూసెక్కుల వరద. ► ఆగస్టు 19న 15.92లక్షల క్యూసెక్కుల వరద. ►సెప్టెంబరు 16న 13.78 లక్షల క్యూసెక్కుల వరద. ► ఇప్పటికీ రెండున్నరల లక్షల క్యూసెక్కులకు పైగా వరద. ►1990లో 355 రోజుల ప్రవాహం. 7,092 టీఎంసీల నీరు సముద్రంలో కలయిక. ►1994లో 188 రోజుల వరద, 5,959 టీఎంసీల నీరు సముద్రంలో కలయిక. ► 2013లో 213రోజుల వరద, 5,921 టీఎంసీల నీరు సముద్రంలోకి. ► 2022లో 136 రోజుల వరద, 6,010 టీఎంసీల నీరు సముంద్రంలోకి. ►కృష్ణానదిలో కూడా 1164.10 టీఎంసీల నీరు సముద్రంలోకి. ►వంశధారలోకూడా వరద జలాలు, 119.2 టీఎంసీలు సముద్రంలోకి ► నాగావళి ద్వారా 34.8 టీఎంసీలు సముద్రంలోకి ►పెన్నా నుంచి 92.41 టీఎంసీలు సముద్రంలోకి. ► ఇంకా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్లగ్ కుషన్ పెట్టుకోగా రిజర్వాయర్లు అన్నింటిలో దాదాపు 90శాతం నీటి నిల్వ. ►గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు టెండర్లు ప్రక్రియ ప్రారంభం. డిసెంబరులో శంకుస్థాపనకు ఏర్పాట్లు. ►విజయనగరం జిల్లా తారక రామ తీర్థసాగర్ పనులు నవంబర్‌లో ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. సీఎం ఆదేశాలమేరకు మహేంద్ర తనయ పనులు పునరుద్ధరణకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. రూ.852 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేసి త్వరలో టెండర్ ప్రక్రియను ఖరారు చేస్తామని, అవుకు టన్నెల్ పనులు కూడా పూర్తికావొస్తున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి వెలిగొండ టన్నెల్ –2లో మిగిలి ఉన్న 3.4 కిలోమీటర్ల సొరంగం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ దిగువన బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. వీటన్నింటితోపాటు రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకోవడంతోపాటు, నిర్వహణపై ఒక కార్యాచరణ రూపొందించాలని, క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా జూన్ కల్లా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. లిఫ్ట్ స్కీంల నిర్వహణ కోసం ఎస్ఓపీ ఏళ్లకొద్దీ నిర్వహణ సరిగ్గా లేక చాలా ఎత్తిపోతల పథకాలు మూలన పడుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే వీటి నిర్వహణపై ఒక ఎస్ఓపీ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులను కమిటీలుగా ఏర్పాటుచేసి వారి పర్యవేక్షణలో ఈ ఎత్తిపోతల పథకాలు నడిచేలా తగిన ఆలోచనలు చేయాలని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలను గుర్తించి వాటిపై కసరత్తు చేయాలని, ప్రభుత్వం నుంచి ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున, నిర్వహణ రైతుల పర్యవేక్షణలో సమర్థవంతంగా నడిచేలా తగిన అవగాహన, వారికి శిక్షణ ఇప్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, నీటిపారుదలశాఖ ఈఎన్సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
అంగన్వాడీలపై సమీక్ష.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో అంగన్వాడీలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిర్దేశించుకున్న ప్రమాణాలతో అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక యాప్‌లు రూపకల్పన చేయాలని, తద్వారా సుస్థిర ప్రగతి లక్ష్యాలను సాధించవచ్చని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అంగన్వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారంలో క్వాలిటీ, కచ్చితమైన క్వాంటిటీ ఉండాలన్నారు. ప్రతిరోజూ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. దీనికోసమే దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సూపర్వైజర్ల నియామకాలను ప్రారంభించామని, దురదృష్టవశాత్తూ కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారని ప్రస్తావించారు. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. అక్టోబరులో నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం నూటికి నూరుపాళ్లు క్వాలిటీ, క్వాంటిటీ ఆహారం పిల్లలకు అందాలని పేర్కొన్నారు. చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ నోటిఫికేషన్ విడుదల అంగన్వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సొంత భవనాల్లోనే కాకుండా అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీల్లో కూడా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈమేరకు కార్యాచరణ సిద్ధంచేసుకోవాలన్న సీఎం..అంగన్వాడీల్లో నాడు – నేడు ద్వారా సమగ్రాభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖతో కలిసి ఈమేరకు కార్యాచరణ చేసుకోవాలన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►అంగన్వాడీల రూపురేఖలను సంపూర్ణంగా మార్చాలి ►అంగన్వాడీల్లో ప్రస్తుత పరిస్థితులు ఏంటి? ఎలాంటి సదుపాయాలు కల్పించుకోవాలి? ఏ రకంగా వాటిని తీర్చిదిద్దాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళిక తయారు చేసుకోవాలి. ►విడతల వారీగా ఆ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ►పిల్లలకు ఇచ్చే ఆహారం పాడవకుండా చూసేందుకు ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై కూడా దృష్టిపెట్టాలి. ►పిల్లలు రోజూ తీసుకునే పాలు, గుడ్లులాంటివి పాడవకుండా నిల్వచేసే విధానాలపైనా కూడా దృష్టిపెట్టాలి. ►అంగన్వాడీల్లో ప్రతిచోటా ఫ్రిడ్జ్ ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలి. ►స్కూళ్లకు, అంగన్వాడీలకు సరఫరాచేసే ఆహారంపై నాణ్యత, పర్యవేక్షణకు మరిన్ని చర్యలు. ►డిసెంబర్1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను చేపట్టనున్న మార్క్‌ఫెడ్.ప్రత్యేక యాప్ ద్వారా దీని పర్యవేక్షణ. ►నవంబరు నుంచి నుంచి గుడ్ల పంపిణీపై కూడా యాప్ ద్వారా పర్యవేక్షణ. ►ఈ ఆహార నాణ్యత బాగుందా? లేదా? అన్నదానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ పర్యవేక్షణ. ►ఈలోగా పంపిణీ అవుతున్న ఆహారం క్వాలిటీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం. ►క్వాలిటీ, క్వాంటిటీపై యాప్‌ల ద్వారా సమగ్ర పర్యవేక్షణ ఉండాలి. ►అంగన్వాడీల పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజి క్లినిక్స్ ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలి: ►సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి: ►శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సహాయమే కాకుండా, ఆ పిల్లలకు పౌష్టికాహారం మరింత పెంచేలా తగిన ఆలోచనలు చేయాలి. ►దీనివల్ల రక్తహీనత, శారీరక బలహీనతలను మొదటి దశలోనే నివారించే అవకాశం ఉంటుంది. ►అంగన్వాడీలపై సూపర్వైజర్ల పర్యవేక్షణ జియోట్యాగింగ్ చేయాలలి. ►అంగన్వాడీలకు, సూపర్వైజర్లకు మొత్తంగా దాదాపు 57వేలమందికి సెల్ఫోన్ల్ పంపిణీ కార్యక్రమాన్నిసీఎం ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పౌష్టిహారం, ఇతర సేవలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు, సమగ్రపర్యవేక్షణ కోసం అంగన్వాడీ సెంటర్లకు, వర్కింగ్ సూపర్ వైజర్లకు ఈ సెల్‌ఫోన్స్ ప్రభుత్వం అందిస్తుంది. సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవాలి. ►గతంలో పిల్లల భోజనానికి నెలకు సుమారురూ.500 కోట్లు ఉండేది, ఈరోజు నెలకు సుమారుగా రూ.1900 కోట్లు ఖర్చుచేస్తున్నాం. ►విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమాలకోసం చాలా పెద్ద ఎఫర్ట్ పెడుతున్నాం. ►ఇంగ్లిషు మీడియంను చిన్ననాటినుంచే అలవాటు చేయడానికి ఫౌండేషన్ స్కూల్స్, శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్ తీసుకువచ్చాం. ►నాడు – నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలు మారుస్తున్నాం. ►ఇన్నివేల కోట్లు ఖర్చుచేసి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాం. ►ఇన్ని కార్యక్రమాలు చేసినా..సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదు. ►అందుకే కచ్చితమైన పర్యవేక్షణ అవసరం. ►అధికారులు కూడా సరైన సమయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ►దేశంలో నంబర్‌వన్ కావడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం ఈ సమీక్షా సమావేశంలో మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఎ బాబు, మార్క్‌ఫెడ్ ఎండీ పి ఎస్ ప్రద్యుమ్న, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ప్రతి స్కూల్లో ఇంటర్నెట్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశం
-
అనంత వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. 2వేల తక్షణ సాయం
సాక్షి, తాడేపల్లి: అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వర్షాలు, వరద తగ్గముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష
-
స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెంచాలి : సీఎం జగన్
-
ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ►నాడు – నేడు ఎంత ముఖ్యమో స్కూళ్ల నిర్వహణ కూడా అంతే ముఖ్యం ►ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీచేయాలి ►దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుందన్న సీఎం. ►మధ్యాహ్న భోజనం నాణ్యతపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష ►నాణ్యతా లోపం లేకుండా పిల్లలకు భోజనం అందించడంపై సమావేశంలో చర్చ ►క్రమం తప్పకుండా మధ్యాహ్నం భోజనంపై పర్యవేక్షణ చేయాలి ►దీనికోసం సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి ►స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణలో హెచ్ఎం, గ్రామ సచివాలయ సిబ్బందిది కీలకపాత్ర అన్న సీఎం ►స్కూళ్లకు, అంగన్వాడీలకు బియ్యాన్ని సరఫరాచేసేముందు బియ్యం నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలని సీఎం ఆదేశం ►సరఫరా చేసే బియ్యం బ్యాగులపై కచ్చితంగా మధ్యాహ్నం భోజనం లేదా ఐసీడీఎస్ బియ్యంగా లేబుల్స్ వేయాలి ►కచ్చితంగా ప్రతినెలా ఈ నాణ్యతా పరీక్షలు జరగాలి ►ఆహారాన్ని రుచిగా వండడంపై కుక్స్‌కు తగిన తర్ఫీదు ఇవ్వాలి ►క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు జరగాలి ►చిక్కీల నాణ్యతపై కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి ►తయారీ దారుల వద్దా, సరఫరా సమయంలోనూ, పిల్లలకు పంపిణీ చేసేటప్పుడు... ఈ మూడు దశల్లోనూ నాణ్యతపై ర్యాండమ్ పరీక్షలు చేయాలని సీఎం ఆదేశం ►అలాగే గుడ్లు పంపిణీలో సమయంలో వాటికి తప్పనిసరిగా స్టాంపింగ్ చేస్తున్నామన్న అధికారులు ►స్టాంపింగ్ లేకుండా పంపిణీచేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►నాడు – నేడు తొలిదశ కింద పనులు జరిగిన స్కూళ్లపై ఆడిట్ చేయించాలన్న సీఎం ►నిర్దేశించుకున్న అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా? లేవా? ►సమకూర్చిన వాటిలో ఏమైనా సమస్యలు వచ్చాయా? ►తదితర అంశాలపై ఆడిట్ చేయించాలన్న సీఎం ►ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ నిధులను వాడుకుని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలి ►క్రమం తప్పకుండా ఇలా ఆడిట్ చేయాలి ►ప్రతి ఏటా నాలుగు సార్లు ఆడిట్ చేయాలి ►నాడు– నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో సదుపాయాల భద్రతకోసం వాచ్మెన్ నియమించాలి ►నాడు – నేడు కింద కల్పించిన సదుపాయాలకు సంబంధించి వ్యారంటీ ఉన్నందున సమస్య రాగానే వెంటనే మరమ్మత్తులు చేయిస్తున్నామన్న అధికారులు ►గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలనూ వినియోగించుకోవాలి ►అంతిమంగా కలెక్టర్లు, జేసీలు.. స్కూళ్ల నిర్వహణపై బాధ్యత వహించాలి ►స్కూళ్ల నిర్వహణపై ఒక కాల్‌సెంటర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలి ►స్కూళ్ల నిర్వహణపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి ►స్కూళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయడంలేదన్న మాట రాకూడదు ►వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణపోషణ ప్లస్ కార్యక్రమంపైనా కూడా గట్టి పర్యవేక్షణ ఉండాలన్న సీఎం ►దీనికి కూడా పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి ►ఖాళీగా ఉన్న అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను కూడా భర్తీచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవి ఉషా శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఏ సిరి, సెర్ఫ్ సీఈఓ ఏ.ఎండి ఇంతియాజ్, మెప్మా ఎండీ వి విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ అధ్యక్షతన ఎఫ్ఐపీబీ సమావేశం.. పలు ప్రతిపాదనలకు ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో ఎఫ్ఐపీబీ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. 1. అదానీ గ్రీన్ ఎనర్జీ చేపట్టనున్న 3700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం మొత్తంగా రూ.15,376 కోట్ల పెట్టుబడి.. నాలుగు దశల్లో ఈ ప్రాజెక్టు 2022–23లో రూ. 1349 కోట్లు, 2023–24లో రూ. 6,984 కోట్లు 2024–25లో రూ. 5,188 కోట్లు 2025–26లో రూ. రూ.1855 కోట్ల పెట్టుబడి ►మొత్తంగా సుమారు 4వేల మందికి ఉపాధి ►దావోస్ వేదికగా చేసుకున్న అవగాహన ఒప్పందాల్లో ఇదొక ప్రాజెక్టు ►వైఎస్సార్ జిల్లాలో 1000 మెగావాట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుకుట్టి వద్ద 1200 మెగావాట్లు, కర్రివలస వద్ద 1000 మెగావాట్లు, సత్యసాయి జిల్లాలోని పెదకోట్ల చిత్రావతి వద్ద 500 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి. 2. వైఎస్సార్ జిల్లా పులివెందులలో పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ (టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ లిమిటెండ్ అనుబంధ సంస్థ) రూ.50 కోట్లతో పెట్టనున్న గార్మెంట్స్ తయారీ పరిశ్రమకు ఎస్ఐపీబీ ఆమోదం. ►ఇదే కంపెనీ వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తిలో రూ.50 కోట్లతో పెట్టనున్న మరో యూనిట్‌కూ ఎస్ఐపీబీ ఆమోదం. ఈ రెండు యూనిట్ల ద్వారా మొత్తంగా 4,200 మందికి ఉద్యోగాలు. 3. కృష్ణాజిల్లా మల్లవెల్లి ఫుడ్‌పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెడ్ పెట్టనున్న రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమకు ఎస్ఐపీబీ ఆమోదం. ఈ కంపెనీ ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు. 4. తిరుపతిలో నొవాటెల్ బ్రాండ్ కింద హోటల్ ఏర్పాటు చేయనున్న వీవీపీఎల్. ►రూ.126.48 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 300 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 2700 మందికి ఉపాధి కల్పన. ఈ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం. 5. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి చిరునామాగా మారిన కొప్పర్తిని టెక్స్టైల్ రీజియన్ అపారెల్ పార్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయం ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ ►దాదాపు 1200 ఎకరాల్లో మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ మరియు అపారెల్ పార్క్స్ ►నాణ్యమైన ఉత్పత్తులు, తక్కువ ఖర్చుతో తయారీ, మెరుగైన ఉపాధి ప్రధాన లక్ష్యం ►నాణ్యమైన విద్యుత్తు, నీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్న ప్రభుత్వం ►ఈ ప్రాంతాన్ని రైల్వేలైన్లతో అనుసంధానించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశం ఎస్ఐపీబీలో ముఖ్యమంత్రి ఏమన్నారంటే.. ►రాష్ట్రంలో సుమారు 30వేల మెగావాట్లకు పైగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అపార అవకాశాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి ►దీనికోసం సుమారు 90వేల ఎకరాలు అవసరం అవుతుంది ►గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వల్ల రైతులకు, రాష్ట్రానికి పెద్ద మేలు జరగబోతోంది ►ప్రతి ఎకరాకు రైతుకు కనీసంగా రూ.30వేల లీజు వస్తుంది ►ప్రతి ఏటా రైతుకు ఆదాయం నేరుగా వస్తుంది ►వర్షాభావ ప్రాంతాల్లో స్థిరంగా రైతుకు ఆదాయం రావడంవల్ల ఆయా కుటుంబాలకు మేలు జరుగుతుంది ►రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకున్న మిగతా ప్రాజెక్టులు కూడా వీలైనంత త్వరగా సాకారమయ్యేలా చూడాలన్న సీఎం ►వీటితోపాటు సుబాబుల్, జామాయిల్ లాంటి సాగు చేస్తున్న రైతులు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నుంచి మేలు పొందవచ్చన్న సీఎం ►ఆ భూములను సోలార్ ప్రాజెక్టుల్లాంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజుకు ఇవ్వడంద్వారా... ఏడాదికి కనీసంగా ఎకరాకు రూ.30వేల వరకూ స్థిరంగా ఆదాయం పొందేందుకు చక్కటి అవకాశం ఉందన్న సీఎం ►ఈ ప్రత్యామ్నాయంపైనా అధికారులు దృష్టిసారించి రైతులకు మేలు చేసే చర్యలను చేపట్టాలన్న సీఎం ►అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీల తయారీ కేంద్రంగా రాష్ట్రం మారాలి ►గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి ►ఎలక్ట్రానిక్స్ మరియు పర్యాటక– ఆతిథ్య రంగాల్లో మంచి పెట్టుబడులకు రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి ►కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు విరివిగా వస్తున్నాయి ►మరిన్ని గ్లోబల్ కంపెనీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి ►ఈ పరిశ్రమలకు అవసరమైన సామగ్రిని, అలాగే ఉత్పత్తులను సులభంగా తరలించేందుకు వీలుగా కొప్పర్తిలో రైల్వే లైన్ ఏర్పాటుచేయాలని, ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. ►కొప్పర్తికి రైల్వే కనెక్షన్ తీసుకురావడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం ►దీనివల్ల కొప్పర్తి ప్రాంతంలో ఉన్న దాదాపు 6వేల ఎకరాల్లో శీఘ్రగతిన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్న సీఎం ►దీంతోపాటు ఇండస్ట్రియల్ నోడ్స్ను రైల్వేలతో అనుసంధానం చేయడం అత్యంత కీలకమన్న సీఎం ►ప్రతినోడ్ను కూడా రైల్వేలైన్లతో అనుసంధానం చేయాలన్న సీఎం ►పరిశ్రమలకు మంచి జరుగుతుందని, రవాణా సులభతరం అవుతుందన్న సీఎం ►ఈ ప్రాజెక్టులన్నీకూడా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఈ భేటీకి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటకశాఖ మంత్రి ఆర్ కే రోజా, సీఎస్ సమీర్ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జి సృజన, ఏపీఐఐసీ ఎండీ జె సుబ్రమణ్యం, ఏపీ టూరిజం ఎండీ అండ్ సీఈఓ కన్నబాబు, ఏపీటీఎస్ ఎండీ నంద కిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
పట్టణాభివృద్ధిశాఖపై సీఎం జగన్ సమీక్ష
-
సమగ్ర భూ సర్వే ప్రధాన లక్ష్యం అదే.. సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే)పై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. సమగ్ర సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని సీఎం సమీక్షించారు. సమగ్ర సర్వే కారణంగా అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయని సీఎం అన్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. చదవండి: 3 దశల్లో భూముల రీసర్వే పూర్తికి ప్రణాళిక ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..: ♦భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ♦సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోండి ♦అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని, సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా తెప్పించుకోవాలని ఆదేశించిన సీఎం ♦డ్రోన్లు, ఓఆర్ఐ పరికరాలు, రోవర్లు, అలాగే సర్వే రాళ్లు సమకూర్చుకోవడం... ఇలా ప్రతి అంశంలోనూ వేగం ఉండాలన్న సీఎం ♦సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ♦100 ఏళ్ల తర్వాత సర్వే జరుగుతోందని, ఈ సర్వేను పూర్తిచేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న సీఎం సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయడు, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విద్యాశాఖ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
రాష్ట్రంలో గుంతలులేని రోడ్లు కనిపించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ శాఖ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఎం.. అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్లు: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం వైఎస్ జగన్.. ఆ లే అవుట్స్ ఆదర్శనీయంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇంకా.. ► లే అవుట్స్ నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. ► లే అవుట్స్ చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలి. ► న్యాయవివాదాలు, ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా క్లియర్ టైటిల్స్ వినియోగదారులకు ఉండాలి. ► జగనన్న స్మార్ట్ టౌన్షిప్ (ఎంఐజీ లేఅవుట్స్) కోసం ఇప్పటివరకూ 82 అర్బన్ నియోజకవర్గాల్లో సుమారు 6791 ఎకరాల గుర్తింపు. ► శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో.. 864.29 ఎకరాల్లో లే అవుట్ పనులు.. మే చివరినాటికి సిద్ధం చేస్తామని వెల్లడించిన అధికారులు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ : ► తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏంటి? అనే విషమయంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ► ఏ కలర్ డబ్బాలో ఏ చెత్త వేయాలి అనే విషయంపై కరపత్రాలను ప్రతి ఇంటికీ పంచాలి. ► ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీచేశామని అధికారులు వివరించారు. ► మరో 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికల్లా పంపిణీ చేస్తామన్నారు. ► 2,426 ఆటోలు ఇప్పటికే క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. మిగిలినవి ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయన్న అధికారులు. ► 1,123 ఈ–ఆటోలు కూడా జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయి. ► గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ. ప్రతి ఇంటికీ ప్రతిరోజూ తాగునీరు: ► ప్రతిరోజూ ప్రతి ఇంటికీ తాగునీరు అందాలి. ► దీనిపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ► ఇది జరుగుతోందా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం రావాలి. తద్వారా దీనివల్ల వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. టిడ్కో ఇళ్లపై సమీక్ష: ► గత ప్రభుత్వం రోడ్లు, తాగునీరు, మురుగునీటి శుద్ధిలాంటి లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా టిడ్కో ఇళ్లు ప్లాన్ చేశారు. కానీ, ఈ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టింది. ► పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, తాగునీటికోసం వాటర్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ► మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు. ► టిడ్కో ఇళ్ల మీద సుమారుగా.. రూ.5, 500 కోట్లు ఈ మూడేళ్లలో ఖర్చుచేసింది ప్రభుత్వం. రోడ్లపై దృష్టి: ► కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్లపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు. ► ఎక్కడ చూసినా గుంతలులేని రోడ్లు కనిపించాలి. ► నాడు – నేడు కింద బాగు చేసిన రోడ్లను హైలెట్ చేయాలి. ► జూన్‌నాటికి రోడ్ల పనులు పూర్తిచేస్తామని అధికారులు.. సీఎం జగన్‌కు వివరణ ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో పనులపై సీఎం సమీక్ష: ► కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయని అధికారులు సమీక్షలో పేర్కొన్నారు. ► ఇప్పటికే విద్యుత్ స్తంభాలను తొలగించడంతో పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. ► సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ–3)పైన కూడా దృష్టిపెట్టామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష: ► విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం వనరుల సమీకరణపై చర్చ. ► సమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రతిపాదనలు. ► మెట్రోరైల్ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. ► ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్‌ల డిజైన్, దీంతోపాటు స్టేషన్లలో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు సమగ్రంగా సమర్పించాలని సీఎం జగన్ ఆదేశం. ► పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచన. జగనన్న మహిళా మార్ట్‌లపై సీఎం సమీక్ష: ► మహిళా స్వయం సహాయక సంఘాలతో నడుస్తున్న మహిళా మార్ట్లు. ► ప్రస్తుతం నడుస్తున్న మహిళా మార్ట్లను వివరించిన అధికారులు. ► విజయవంతంగా నడుస్తున్నాయన్న అధికారులు.. వీలైనన్ని మహిళా మార్ట్లను నెలకొల్పాలని సూచించిన సీఎం జగన్. చదవండి: వెటర్నరీ ల్యాబ్‌ల ఏర్పాటు ఘనత సీఎం జగన్‌దే -
రోడ్లు, తాగునీటిపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన సమీక్షలో సీఎం కీలకంగా రోడ్లు, తాగునీటి సరఫరాపై చర్చించారు. అవసరమైన రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు. చేపట్టే పనులన్నింటిలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం సూచించారు. ఇప్పటికే చాలా రోడ్లను నిర్మించామని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. చదవండి👉: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన రోడ్లకు వెంటనే శాఖాపరమైన అనుమతులకు సీఎం ఆదేశించారు. టెండర్లు పూర్తి చేసి జూన్ నెలాఖరు లోపు పనులు పూర్తి చేయాలన్నారు. మరో వైపు వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సీఎం అధికారులను ప్రశ్నించారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలుపగా నిధులకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తాగునీటి సరఫరా పనులకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వీటితో పాటు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాల సహకారం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు. సీఎం జగన్ ఏమన్నారంటే... : ♦చెరువులను కాలువల ద్వారా అనుసంధానం చేసే దిశగా పనిచేయాలన్న సీఎం ♦తద్వారా రానున్న ఐదేళ్లలో ప్రతిచెరువును కెనాల్స్, ఫీడర్ ఛానెల్స్‌కి లింక్ చేయగలిగితే... నీటిఎద్దడిని నివారించగలుగుతామన్న సీఎం ♦కడప, అనంతపురము లాంటి ప్రాంతాల్లో కాలువలు ద్వారా ట్యాంకులను కనెక్ట్ చేయాలి ♦దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించిన సీఎం త్వరితగతిన భవన నిర్మాణాల పూర్తి ♦ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు, గ్రామ సచివాలయాలు, విలేజీ క్లినిక్స్‌కు సంబంధించిన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం ♦వీటీపై ప్రత్యేక ధ్యాస పెట్టాలన్న ముఖ్యమంత్రి ♦ప్రతిచోటా నవరత్నాలు ఫోటో ఉండేలా చూడాలని ఆదేశం ♦గత ప్రభుత్వ హయాంలోని బిల్లులు మనం చెల్లించాల్సి రావడంతో ఇబ్బందులు వచ్చాయి ♦అయినా ఇబ్బందులు అధిగమించి ఆ బకాయిలు చెల్లించాం ♦భవనాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి ♦భవన నిర్మాణ పనులు ఆగకూడదు.. అలాగని పనులు చేస్తున్నవారు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ♦ఉపాధి హామీ పనులుకు సంబంధించి.. బిల్లులు అప్లోడ్ తో పాటు చెల్లింపుల్లో కూడా ఆలస్యం కాకూడదు. ♦ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే చేసుకోవాలి ♦అవసరమైతే ఢిల్లీ స్ధాయిలో దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలి. ♦గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల సహా మొత్తం నాలుగు రకాల భవనాల నిర్మాణాలు పూర్తి కావాలన్న సీఎం వైఎస్సార్ జలకళ.. ♦వైఎస్సార్ జలకళ కింద అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తుంది ♦ఈ పథకం కింద నాణ్యమైన మోటార్లు ఎంపిక చేయాలి ♦175 నియోజవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో రిగ్గు ఉండాలి. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించాలన్న సీఎం ♦నియోజకవర్గానికి ఒక రిగ్గు అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ♦ఇప్పటివరకు 13,245 బోర్లు వేశామన్న అధికారులు ♦ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షల ఖర్చు చేస్తున్నామన్న సీఎం ♦బోరు డ్రిల్లింగ్ డబ్బులు రైతు అకౌంట్‌కు నేరుగా (డీబీటీ విధానంలో) జమ చేసి.. అతని నుంచి పేమెంట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలన్న సీఎం ♦దీనివల్ల లంచాలు లేని వ్యవస్ధను తీసుకురాగలుగుతామన్న సీఎం ♦దానికి తగిన విధంగా ఎస్ఓపీలు రూపొందించాలన్న సీఎం ♦ఫలితంగా మరింత పారదర్శకత పెరుగుతుందన్న సీఎం ♦ఐదు ఎకరాలలోపు అర్హత ఉన్న రైతులకుఅన్ని రకాల సౌకర్యాలతో ఉచిత బోరు ♦5-10 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు కేవలం డ్రిల్లింగ్ మాత్రమే ఉచితం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు.. ♦గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్న సీఎం ♦రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు ♦ఆర్ అండ్ బీలో ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్నాయి ♦గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులకు తక్షణమే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశం ♦వెంటనే టెండర్లకు వెళ్లాలన్న సీఎం ♦అనంతరం తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశం ♦ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ రెండింటిలోనూ రోడ్లకు సంబంధించి నాడు-నేడు ఫోటోలు డిస్ప్లే చేయాలి ♦మే 15-20 తేదీల నాటికల్లా పనులు ప్రారంభం కావాలన్న సీఎం ♦పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులు, నిర్మాణానికి సంబంధించిన పనులు అత్యధిక ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్న సీఎం ♦పాట్ హోల్ ఫ్రీ బీటీ రోడ్ల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం ♦గ్రామ, వార్డు సచివాలయంలో నాడు-నేడు పనులకు సంబంధించి విద్య, వైద్య ఆరోగ్యం, రహదారులుపై చేపట్టిన పనులకు సంబంధించి ఫోటోలను డిస్ప్లే చేయాలన్న సీఎం ♦రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన ఫోటోలను కూడా డిస్ప్లే చేయాలి ♦జలజీవన్ మిషన్ కింద జగనన్న కాలనీల్లో నీటిసరఫరా అత్యధిక ప్రాధాన్యతతో చేపట్టాలన్న సీఎం ♦జలజీవన్ మిషన్‌కు సంబంధించి నాబార్డు, కేంద్రం సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలి అధికారులకు సీఎం ఆదేశం సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్... ♦గ్రామాల్లో మురుగునీటి కాలువలు నిర్వహణ, చెత్త సేకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం ♦గ్రామాలలో రోడ్లమీద మురుగునీరు, చెత్త లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం ♦సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ నిర్వహణ కింద చేపడుతున్న పనులన్నీ అక్టోబరు నాటికి 100శాతం పూర్తి కావాలి ♦అక్టోబరు 2 నాటికి ఏ గ్రామం వెళ్లినా సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ పక్కాగా ఉండాలి, ఊర్లన్నీ క్లీన్‌గా కనిపించాలి ♦2 కోట్ల డస్ట్బిన్లను అక్టోబరు నాటికి సిద్ధంగా ఉంచుతామన్న అధికారులు. ♦తడి, పొడి చెత్తలపై విడివిడిగా అవగాహన కలిగించాలన్న సీఎం. ♦ప్రతి పంచాయతీకి చెత్త తరలింపునకు ట్రాక్టర్ ఉండేలా లక్ష్యంగా పెట్టుకోవాలన్న సీఎం ♦దశలవారీగా దాన్ని చేరుకోవాలన్న సీఎం ♦రోడ్డుమీద ఎక్కడా చెత్త, మురుగునీటి ప్రవాహం కనిపించకూడదని ఆదేశం. ♦హై ప్రెజర్ టాయ్‌లెట్ క్లీనర్స్ నెంబర్లు ప్రతిగ్రామంలోనూ డిస్ప్లే చేయాలన్న సీఎం. ♦సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్‌కు సంబంధించిన క్లాప్ మిత్ర జీతాలు చెల్లింపునకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం. లిక్విడ్ వేస్ట్ మేనేజిమెంట్... ♦మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో దశలవారీగా లిక్విడ్ వేస్ట్ మేనేజిమెంట్ చేపట్టాలన్న సీఎం ♦46 లిక్విడ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం చేపట్టిన తర్వాత 632 డీస్లడ్జింగ్ మిషన్స్ అందుబాటులోకి తీసుకొస్తామన్న అధికారులు ♦దీనికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తీసుకురావాలన్న సీఎం. ♦13వేల గ్రామ పంచాయతీల్లో కూడా మురుగునీటిపారుదల వ్యవస్ధ ఉండేలా... రోడ్లమీద చెత్త, కాలువల్లో మురుగునీరు ఓవర్‌ప్లో కాకుండా సక్రమంగా నిర్వహణ చేపట్టాలి ♦ఇందుకు అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడంతో పాటు... దాన్ని సాధ్యమైనంత వేగంగా అమలు చేయాలన్న సీఎం ♦గ్రామసచివాలయంలో ఈ మొత్తం మురుగునీటి వ్యవస్ధ నిర్వహణతో పాటు ఆ సచివాలయ పరిధిలో ఉన్న స్కూళ్లలో బాత్రూమ్ల పర్యవేక్షణ కూడా పంచాయతీ సెక్రటరీకి బాధ్యతలు అప్పగించాలన్న సీఎం ♦స్కూల్స్‌లో హెడ్‌మాష్టారుతో పాటు పంచాయతీ సెక్రటరీ కూడా ఈ బాధ్యతలు తీసుకోవాలి ♦పాఠశాల విద్యాశాఖతో కూడా సమన్వయం చేసుకోవాలన్న సీఎం వేసవిలో తాగునీటి సరఫరాపైనా సీఎం సమీక్ష ♦నీటి ఎద్దడి ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న అధికారులు ♦జూలై వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్న అధికారులు ♦తాగునీటి కోసం తీసుకున్న శాశ్వత చర్యల వల్ల గతంలో పోల్చుకుంటే వేసవి నీటి ఎద్దడిని గణనీయంగా తగ్గించగలిగామన్న అధికారులు ♦తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సెలైనిటీ ప్రభావం, ఉద్దానంలో ప్లోరైడ్ ప్రభావం, వైయస్సార్ జిల్లాలో యురేనియం ప్రభావిత ప్రాంతాలతోపాటు ప్రకాశం, పల్నాడు, చిత్తూరు పశ్చిమ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న సీఎం ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, స్పెషల్ కమిషనర్ శాంతి ప్రియా పాండే, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అవినీతి నిర్మూలన కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం
-
సమగ్ర భూసర్వేతో ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: లంచాలకు, అవినీతికి తావులేకుండా సమగ్ర భూ సర్వే జరగాలని, ఈ విషయంలో దేశానికే రాష్ట్రం దిక్సూచిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు & భూ రక్ష పథకంపై గురువారం క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా.. సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలను సీఎం జగన్‌కు అధికారులు అందించారు. అంతేకాదు సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్లను సీఎం జగన్ పరిశీలించారు. ఏప్రిల్ 5వ తేదీకల్లా భూ సర్వేకోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమవుతాయని, వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఆపై సీఎం జగన్ అధికారులతో.. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అవినీతి.. లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శక పద్ధతుల్లో ఇది జరగాలని సీఎం వైఎస్ జగన్.. అధికారులకు సూచించారు. అనుసరించాల్సిన విధానాలు, ఎస్ఓపీలను తయారు చేయాలని, రికార్డులను ఎవ్వరూ మార్చలేని విధంగా, ట్యాంపర్ చేయలేని విధంగా రూపొందించాలని ఆదేశించారు. కేవలం ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్ రికార్డులు కూడా తయారుచేయాలని, ఆ ఫిజికల్ డాక్యుమెంట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులతో చెప్పారు. సబ్ డివిజన్‌కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలన్న సీఎం జగన్.. అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలని స్పష్టం చేశారు. ► ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ► భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. తద్వారా స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయి. ► భూ యజమానులకు క్లియర్ టైటిల్స్ ఇచ్చేనాటికి.. దాదాపుగా వివాదాలు లేకుండా చూడాలి. ► న్యాయశాఖను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేయాలి. ► సమగ్రంగా ఓ రోడ్‌మ్యాప్‌ను కూడా తయారు చేయాలి. ► భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో దేశానికి ఒక దిక్సూచిగా ఏపీ నిలవాలని సీఎం జగన్ ఆకాంక్ష. ► అందుకే సీనియర్ అధికారులను, సీనియర్ మంత్రులను ఇందులో భాగస్వాములుగా చేసినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక మొత్తంగా భూ సర్వే కోసం 154 డ్రోన్లను వినియోగిస్తామన్న అధికారులు.. ఇప్పటివరకూ 1,441 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసినట్లు సీఎం జగన్‌కు వివరించారు. వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత మేర డ్రోన్ సర్వే నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్నామన్న అధికారులు.. రెవెన్యూ విలేజ్ చొప్పున సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ► సర్వే ఫలితాలు పూర్తిగా అందేలా అదేసమయంలో రికార్డుల స్వఛ్చీకరణ. ► వెబ్ ల్యాండ్ అప్డేషన్, గ్రామ ల్యాండ్ రిజిస్టర్ అప్డేషన్, గ్రామ ఖాతా రిజిస్టర్, దీంతోపాటు జగనన్న భూ హక్కు పత్రం అందజేత. ► గ్రామ సచివాలయాల వారీగా.. భూ వివరాలను అప్డేషన్ చేయనున్న అధికారులు. ► తద్వారా.. గతంలో వెబ్‌ల్యాండ్ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం. ► 5,200 గ్రామాల్లో 2023 జులై నెలాఖరుకు, 5,700 గ్రామాల్లో 2023 ఆగస్టు నెలాఖరు కల్లా, సెప్టెంబరు నెలాఖరు నాటికి 6,460 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి క్లియర్ టైటిల్స్ ఇచ్చేలా కార్యాచరణ పూర్తి. ► ఓఆర్ఐ (ఆర్థోరెక్టిఫైడ్ రాడార్ ఇమేజెస్) చిత్రాల ప్రక్రియ మొదటి విడత గ్రామాల్లో ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి, రెండో విడత గ్రామాల్లో డిసెంబర్ నెలాఖరు నాటికి, మూడోవిడత గ్రామాల్లో జనవరి నెలాఖరు నాటికి పూర్తవుతాయని చెప్పిన అధికారులు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి(రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, సీసీఎల్ఏ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రెవెన్యూశాఖ కమిషనర్ సిద్దార్ధ జైన్.. ఇతర అధికారులు హాజరయ్యారు. -
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగం మద్దతుగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు సహాయపడుతున్నాయన్నారు. కోవిడ్ సమయంలో చాలా మంచి సహాయాన్ని అందించాయన్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నామని సీఎం అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ►ఆర్బీకేల ద్వారా ఇ– క్రాప్‌చేసి, పారదర్శకంగా చేస్తున్నాం ► సాగుచేస్తున్న రైతులు నష్టపోతే ఆదుకుంటున్నాం ► రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ కూడా ఆర్బీకేలు చేదోడుగా నిలుస్తున్నాయి ► గ్రామ స్థాయిలో ఇ– క్రాపింగ్ చేస్తున్నాం ► వ్యవసాయ రంగంలో ఇది విప్లవాత్మక చర్య: ►గ్రామీణనియోజకవర్గాల స్థాయిలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేశాం ► ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం ►గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు.. ల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం ►పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం ► దీనికి నాబార్డు సహాయ సహకారాలు కావాలి ► రైతులు చేస్తున్న ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికే ఈ కార్యక్రమాలన్నీ ►సహకార బ్యాంకులను, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం ►పారదర్శక విధానాలను తీసుకు వస్తున్నాం ►ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు బ్యాంకులు, సొసైటీలకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు ►దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయమని అధికారులకు ఇప్పటికే ఆదేశించాను ►ఫుడ్ ప్రాససింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టిపెట్టాం ► ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు వస్తాం ►వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామస్థాయిలోనే అభివృద్ధిచేస్తాం ►వ్యవసాయరంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టిపెడతాం ►16 కొత్త మెడికల్‌కాలేజీలను నిర్మిస్తున్నాం ►ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌కాలేజీలను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం ►స్కూళ్లను మెరుగుపరుస్తున్నాం ►నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం ►ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టాం.. ► పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా.. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించాం ►భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి నైపుణ్యం ఉన్న మానవ నరులుగా అభివృద్ధి చెందుతారు ►గ్రామస్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని... దాన్ని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో ఈ పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారు ►అందుకనే నాణ్యమైన విద్యను అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం ►ఫ్లోరోసిస్ లాంటి నీటి సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి ►వీరికి రక్షిత తాగునీటి అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం ►మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ►ఇలాంటి పరిస్థితులు లేకుండా రాష్ట్రంలో హార్బర్లు, పోర్టులు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లను నెలకొల్పే పనులు ప్రారంభం అయ్యాయి ►రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ కోసం ప్రభుత్వం దృష్టిపెట్టింది ►ఎంపిక చేసిన ఈప్రాజెక్టులకు సకాలంలో పూర్తి చేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం చదవండి: గోదావరి గట్టెక్కింది -
అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట
-
కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు
సాక్షి, హైదరాబాద్: విస్తరిస్తున్న కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, స్వీయ నియంత్రణా చర్యలను పాటించాలని పేర్కొన్నారు. అయితే ప్రజలెవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు రోడ్లు భవనాలు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని తెలిపారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని, తల్లిదండ్రులు అశ్రద్ద చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలన్నారు. సోమవారం నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని తెలిపారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. చదవండి: కరోనా ప్రమాద ఘంటికలు.. ప్రధాని నరేంద్రమోదీ కీలక భేటీ రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరిండ్లల్లో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని సీఎం పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను, రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితులు సహా కరోనా పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆక్సీజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు షాక్.. భారీగా బాదుడు! సెక్రటేరియట్ పనులన్నీ సమాంతరంగా వేగంగా సాగాలి నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దమవుతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతి పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన పనులతో పాటు, లాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా పెంచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం సూచించారు. సచివాలయానికి పటిష్టమైన భధ్రతా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పోలీసు వారికి కావాల్సిన వసతులు తదితర అంశాల గురించి డీజీపీ మహేందర్ రెడ్డితో సంప్రదించి చర్యలు చేపట్టాలన్నారు. 24 గంటల నిఘా కోసం అధునాతన సాంకేతికతతో పోలీసు కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని సిఎం అన్నారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణా రావు, రజత్ కుమార్ , వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీతో పాటు సీఎంవో అధికారులు స్మితాసబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారులు శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ , ఇరిగేషన్ శాఖ అధికారులు ఈఎన్సీ మురళీధర్ రావు, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు మురళీధర్, హరి రామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్‌పాండే, ఎస్ ఇ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
కోవిడ్‌పై ఈసీ సమీక్ష
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలకు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రమాదకరంగా పరిణమించిన కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సమీక్ష నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ స్థితిగతులను ఈసీకి కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఆ 5 రాష్ట్రాల్లో కోవిడ్ టీకాకు అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాల్సి ఉందని వారు ఈసీకి తెలిపారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవలతో ఈసీ చర్చలు జరిపింది. దేశంలో ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలు ఆమోదయోగ్యం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ ఈసీకి వివరించారు. ఇలాంటి ఎన్నికల కార్యక్రమాలకు అనుమతిని ఇవ్వకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల షెడ్యూళ్లను ఈసీ త్వరలో ప్రకటించనుంది. కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో యూపీలో పార్టీ ఎన్నికల ర్యాలీలను రద్దుచేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం ప్రకటించింది. డిజిటల్ వేదికగా వర్చువల్ ర్యాలీలు మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. -
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కోవిడ్ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులను కూడా కరోనా చికిత్సకు సిద్ధంగా ఉంచాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఫీవర్ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారందరికీ టీకాలు వేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం, ఏపీలో 6 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. వారందరిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని.. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. టెస్ట్ ఎర్లీ, ట్రేస్‌ఎర్లీ, ట్రీట్ ఎర్లీ పద్ధతులలో పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి అదే విధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలన్నారు. సచివాలయం స్థాయి నుంచి అధికారులు డేటాను తెప్పించుకోవాలని తెలిపారు. దీనిపై వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిద్దామని అధికారులతో సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో 98.96 శాతం మొదటి డోస్ టీకాలు, 71.76 శాతం రెండో డోస్ టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, ప.గో, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నూటికి నూరుశాతం మొదటి డోస్‌ను పూర్తి చేశారు. కడపలో 98.93, విశాఖపట్నం 98.04, గుంటూరు 97.58, తూ.గో 97.43, కృష్ణా 97.12, శ్రీకాకుళంలో 96.70 శాతం మేర మొదటి డోస్ వేశారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ ప్రకటన నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. బూస్టర్‌డోస్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టండి ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిపైన, వృద్ధులపైన బూస్టర్‌డోస్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం సూచించారు. 15 నుంచి 18 ఏళ్లవారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి బూస్టర్ డోస్ అవసరమున్నట్లు ప్రాథమికంగా అంచనావేశామని అధికారులు తెలిపారు. ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే కోవిడ్ గుర్తించే పరీక్షలు చేయాలని, విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలతో పాటు వారిని ట్రేస్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పర్యాటకులను రెగ్యులర్‌గా పరీక్షలు జరపాలన్న సీఎం జగన్.. పాజిటివ్ అని తేలితే ప్రైమరీ కాంటాక్ట్స్‌ను కూడా వెంటనే ట్రెసింగ్ చేయాలన్నారు. అదే విధంగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు – నేడు పనుల ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి పూర్తికాగానే అత్యాధునిక వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో.. మెడికల్ సీట్లు పెరగడమే కాదు.. మంచి వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఒకవైపు నాడు–నేడు ద్వారా ఇప్పుడున్న ఆస్పత్రులను ఆధునీకరించడం, ఇప్పటికే ఉన్న 11 బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు, ఈ కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణాలనూ ముందుకు తీసుకెళ్లాలని సీఎం అధికారులను సూచించారు. మెడికల్ హబ్స్ ఏర్పాటు ప్రగతిపైనా అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరగా ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు రావాలన్నదే ఈ హబ్స్ ముఖ్య ఉద్దేశమని సీఎం జగన్ పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఆస్పత్రిలో అవసరమైన సిబ్బందిని కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. -
దేశంలో కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష
-
ఆర్థిక శాఖ అధికారులతో ఇన్ఫోసిస్ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ పనితీరు ఎలా ఉందన్న అంశంపై రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇతర సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్‌తో గురువారం ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోర్టల్ ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 3.5 కోట్ల మందికిపైగా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇన్ఫోసిస్ అభివృద్ధి చెందిన పోర్టల్’ www.incometax.gov.in పనితీరులో తొలినాళ్లలో తీవ్ర అవాంతరాలు నెలకొనడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. పోర్టల్ అభివృద్ధికి 2019లో ఇన్ఫోసిస్‌కు కేంద్ర రూ.4,242 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. 2019 జనవరి నుంచి 2021 జూన్ మధ్య రూ.164.5 కోట్లు చెల్లించింది. కాగా, 2020– 21 ఐటీఆర్ ఫైలింగ్‌కు తుది గడువు డిసెంబర్ 31. -
వర్షాల కారణంగా మృతి చెందిన వారికి రూ.5 లక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు అతాలకుతలం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్షాలపై ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. (చదవండి: ఎక్కడా రాజీపడొద్దు.. నిరంతరం అందుబాటులో ఉంటా: సీఎం జగన్) వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు సీఎం జగన్. నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. వీరు జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం జగన్‌కు నివేదిస్తారు. (చదవండి: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో భారీగా వరద.. విమానాల ల్యాండింగ్ నిలిపివేత) వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికిగాను నెల్లూరు జిల్లాకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజేశేఖర్.. చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న.. వైఎస్ఆర్ జిల్లాకు సీనియర్ అధికారి శశిభూషణ్ కుమార్‌ను నియమించారు. వారు ఇప్పటికే చేరుకున్నారని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. ‘‘ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలించాం. వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టాం. సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఆయా జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చాం’’ అని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. తర్వాత జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు సీఎం జగన్. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్న జిల్లాలోని పరిస్థితులను వివరించారు. ఈ సదర్భంగా సీఎం జగన్.. తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని అధికారులు తెలపడంతో.. దీనిపై తగిన కార్యచరణసిద్ధం చేయాలని.. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని.. మంచి భోజనం, తాగునీరు అందించాలని.. వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని సీఎం జగన్ తెలిపారు. రైళ్లు, విమానాలు రద్దైన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో భక్తులు కిందకు రాకుండా పైనే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలని తెలిపారు. టీటీడీ అధికారులను సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలన్నారు. తిరుపతినగరంలో మున్సిపాల్టీ సహా, ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పారిశుధ్యం పనులు చేపట్టాలని.. అవసరమైతే ఇతర మున్సిపాల్టీలనుంచి సిబ్బందిని తీసుకు వచ్చి ఆపరేషన్ చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. వైఎస్సార్ జిల్లాలో.. వైఎస్సార్ జిల్లాలో పరిస్థితులను వివరించారు కలెక్టర్ విజయరామరాజు. ఈ క్రమంలో గండ్లుపడ్డ చెరువుల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు సీఎం జగన్. రోడ్లకు గండ్లు కారణంగా ఎక్కడ రవాణా స్తంభించినా... నీరు తగ్గగానే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ పునరుద్ధరణపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వరదనీరు తగ్గగానే పంట నష్టంపై అధికారులు ఎన్యుమరేషన్ ప్రారంభించాలని సీఎం జగన్ సూచించారు. నెల్లూరు జిల్లాలో.. నెల్లూరు జిల్లాలో పరిస్థితులను వివరించారు కలెక్టర్ చక్రధర్. సోమశిలకు భారీగా వరద నీరు వస్తోందని తెలిపారు. ఈ క్రమంలో సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. పైనుంచి వరదను, డ్యాంలో ప్రస్తుతం ఉన్ననీటిని అంచనా వేసుకుని ఆమేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసుకుని వరదనీటి విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎక్కడెక్కడ ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయో.. ఆయా ప్రాంతాల్లో సహాయక కేంద్రాలను తెరవాలని సీఎం జగన్ ఆదేశించారు. అనంతపురంలో.. అనంతపురంలో భారీ వర్షాల పరిస్థితిని వివరించారు కలెక్టర్ నాగలక్ష్మి. అలానే బాధిత జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లపై వివరాలను ప్రిన్సిపల్ సెక్రటరీలు కృష్ణబాబు, ద్వివేది అందించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతాల్లో రోడ్ల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి... తాగునీటి నాణ్యతను తెలుసుకోవాలని, వ్యాధులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్యంపైనకూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ‘‘ఎక్కడెక్కడ పంట నష్టపోయిందీ వివరాలు తయారు చేయాలి. వీలైనంత త్వరగా వారికి పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నష్టాన్ని నమోదు చేసినప్పుడు కాస్త ఉదారతతో ఉండాలి. మళ్లీ పంటవేసుకునేందుకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలి. వర్షాల కారణంగా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం వీలైనంత త్వరగా అందించాలి. జిల్లాల్లో కాల్సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే వినతులపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎలాంటి సహాయం కావాలన్న యుద్ధప్రాతిపదికన సమకూరుస్తాం’’ అని సీఎం జగన్ తెలిపారు. నెల్లూరులో సహాయక చర్యల పర్యవేక్షణకు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ను పంపిస్తున్నామని.. కడపజిల్లాల్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇప్పటికే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎం జగన్ తెలిపారు. చదవండి: తిరుపతి విల విల -
రోడ్ల మరమ్మత్తులు, పునరుద్ధరణపై సీఎం జగన్ సమీక్ష
-
హుజురాబాద్ ఓటమిపై ఏఐసీసీ సమీక్ష
-
వైద్యారోగ్య శాఖపై మంత్రి హరీష్ సమీక్ష.. కీలక నిర్ణయాలు
-
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: సీఎం జగన్
-
ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో మంగళవారం చర్చల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా రేపు (09-11-2021) సీఎం జగన్ భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఉభయరాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై మంగళవారం సాయంత్రం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం జగన్ చర్చించనున్నారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై చర్చించనున్నారు. చదవండి: AP: విద్యార్థులకు ‘పద సంపద’ వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం ► నేరడి బ్యారేజీ కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను సీఎం జగన్ వివరించనున్నారు. ► బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా వైపునుంచి 103 ఎకరాలు అవసరమని ఇందులో 67 ఎకరాలు రివర్బెడ్ ప్రాంతమేనని అధికారులు తెలిపారు. ► బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. చదవండి: బీజేపీ నేతలు నీతులు చెప్పడం విడ్డూరం: పేర్ని నాని జంఝావతి ప్రాజెక్టు అంశం ► ప్రస్తుతం రబ్బర్ డ్యాం ఆధారంగా సాగునీరు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ► 24,640 ఎకరాల్లో కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని, ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు ► ప్రాజెక్టును పూర్తిచేస్తే ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు పేర్కొన్నారు. ► ఒడిశాలో దాదాపు 1174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని తెలిపిన అధికారులు.ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్‌అండ్‌ఆర్‌కు సహకరించాలని ఏపీ ఒడిశాను కోరనుంది. ► కొఠియా గ్రామాల వివాదానికి సంబంధించిన మొత్తం వివరాలను అధికారులు సీఎం ముందు ఉంచారు. ► కొఠియా గ్రామాల్లో ఇటీవల పరిణామాలను వివరించారు. ► 21 గ్రామాల్లో 16 గ్రామాలు ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి సీఎంకు వివరించారు. ► ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించామని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. ►కొఠియా గ్రామాల్లో దాదాపు 87శాతానికి పైగా గిరిజనులు ఉన్నారని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సమావేశంలో అధికారులు ప్రస్తావించారు. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్సి సి నారాయణరెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ సూర్య కుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అధికారులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలి: మంత్రి అవంతి
విశాఖ: పాడేరు ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి పనులపై మంత్రి అవంతి శ్రీనివాస్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణాలకు త్వరలో బిల్లులు మంజురు చేస్తామని మంత్రి అవంతి పేర్కొన్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామానికి రోడ్డు,విద్యుత్,తాగునీటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదే విధంగా.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తెలిపారు. -
పోలీసు వ్యవస్థపై రాజకీయ విమర్శలు చేయడం తగదు: డీజీపీ గౌతమ్ సవాంగ్
-
విద్యపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
-
ప్రమాణాలు లేని కాలేజీలకు అనుమతులు ఇవ్వొద్దు: సీఎం జగన్
-
గంజాయి అక్రమసాగు వినియోగంపై ఉక్కుపాదం: సీఎం కేసీఆర్
-
కరెంట్ కోతల్లేకుండా చర్యలు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆయన చర్చించారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా దానిని తెప్పించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఇందుకు ఎలాంటి నిధుల కొరతలేదని సీఎం స్పష్టంచేశారు. ఇప్పుడున్న థర్మల్ ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తిని పెంచాలని ఆదేశించారు. కృష్ణపట్నం, ఎన్‌టీటీపీఎస్‌ల్లోని కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అలాగే.. సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గును తెప్పించుకోవాలని ఆయన సూచించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రమాదంలో 112 థర్మల్ కేంద్రాలు ఇక బొగ్గు కొరతతో దేశంలోని 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 112 కేంద్రాలు ప్రమాదంలో పడ్డాయి. ఇందులో 17 ప్లాంట్లు ఇప్పటికే ఉత్పత్తి నిలిపివేయగా, 27 ప్లాంట్లలో ఒకరోజు, 20 ప్లాంట్లలో రెండు రోజులు, 14 ప్లాంట్లలో మూడు, మరో 14 ప్లాంట్లలో నాలుగు, 12 ప్లాంట్లలో ఐదు, ఏడు ప్లాంట్లలో ఆరు, ఒక ప్లాంటులో ఏడు రోజులకు మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీంతో థర్మల్ ప్లాంట్లను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు.. బొగ్గు కొరత కారణంగా కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) విద్యుత్ సంస్థలకు మినహా మిగిలిన అందరికీ బొగ్గు సరఫరాను పూర్తిగా నిలిపేసింది. అయితే, ఇది తాత్కాలికమేనని, నిల్వలు మామూలు స్థాయికి వచ్చేవరకూ ప్రాధాన్యాన్ని బట్టి సరఫరా చేయాలన్నది కంపెనీ నిర్ణయమని అధికార వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే.. విద్యుత్ ప్లాంట్లు మినహా మిగిలిన ఏ ఇతర సంస్థల్నీ బొగ్గు ఈ–ఆక్షన్‌లోకి కూడా అనుమతించవద్దని కోల్ ఇండియా తన అనుబంధ సంస్థలకు గురువారం ఆదేశాలిచ్చింది. మరోవైపు.. దసరా తర్వాత కార్మికులు సెలవుల నుండి తిరిగి రాగానే ఉత్పత్తిని పెంచాలని సీఐఎల్ భావిస్తోంది. ఏపీలో బొగ్గు నిల్వలు మెరుగు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ బుధవారం నాటి రోజువారీ బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో 65,400 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇది ఐదు రోజుల వరకూ సరిపోతుంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో 20,900 మెట్రిక్ టన్నులు ఉంది. ఇది ఒక రోజుకు వస్తుంది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌కి 75,700 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉండటంతో ఇది కూడా ఐదు రోజులు విద్యుత్ ఉత్పత్తికి సరిపోతుంది. సింహాద్రిలో ఉన్న 21,300 మెట్రిక్ టన్నుల బొగ్గు ఒక రోజుకు ఉపయోగపడుతుంది. అయితే, మంగళవారంతో పోలిస్తే బుధవారానికి రాష్ట్రంలో బొగ్గు నిల్వలు కొంతమేర పెరిగాయి. ఇక రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు పనిచేయాలంటే రోజుకి 42 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. బుధవారం 14 ర్యాకులలో 53,245 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా అయ్యిందని ఇంధన శాఖ అధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయిలో జలవిద్యుత్ వినియోగం మరోవైపు.. జల విద్యుత్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. దీంతో జెన్కోకు జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి రోజూ 25 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తోంది. శ్రీశైలం కుడిగట్టు కాలువపై 770 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు యూనిట్ల ద్వారా 15 మిలియన్ యూనిట్లు, సీలేరు నుంచి 8 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నారు. మిగతా కేంద్రాల నుంచి మరో రెండు మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరుగుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో ప్రస్తుతం 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. కేవలం 3.34 మిలియన్ యూనిట్ల మేర మాత్రమే లోటు ఏర్పడింది. -
భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గులాబ్ తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన, ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్....! రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సీఎస్‌తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ, పోలీస్, పంచాయితీ రాజ్, నీటిపారుదల, ఫైర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టం కలుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అవసరమైతే, హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్‌లో ఉన్న ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాలు , చెరువులు, కుంటలు, బ్రిడ్జి ల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు. డీజీపీ ఎమ్. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమీషనర్లు, ఎస్.పిలని ఆదేశించామని తెలిపారు. ఈ మేరకు పోలీస్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందని అన్నారు. చదవండి: Gulab Cyclone: తెలంగాణలో భారీ వర్షాలు -
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి: మంత్రి కేటీఆర్
-
అక్రమ మద్యం తయారీపై ఉక్కుపాదం: సీఎం జగన్
-
గట్టెక్కించండి.. మరో మార్గం లేదు..
రూ.3 వేల కోట్లు కోల్పోయాం.. గత ఏడాదిన్నరగా డీజిల్ ధర లీటర్‌పై రూ.22 మేర పెరిగింది. దీంతో రూ.550 కోట్ల అదనపు భారం పడింది. విడిభాగాల ధరలూ బాగా పెరిగాయి. దీంతో సాలీనా రూ.600 కోట్ల భారం పెరిగింది. కరోనా లాక్డౌన్లతో మొత్తంగా రూ. 3 వేల కోట్ల ఆదాయాన్ని సంస్థ కోల్పోయింది. –ఆర్టీసీ అధికారులు తీవ్ర నష్టాలు వచ్చాయి విద్యుత్ సంస్థలు కూడా కోవిడ్ ప్రభావానికి గురై తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. రాష్ట్రంలో ఆరేళ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదు. విద్యుత్ శాఖను గట్టెక్కించేందుకు చార్జీలు పెంచాలి. – విద్యుత్ అధికారులు ఆదాయంపై దృష్టి పెట్టండి.. ఎంతసేపూ సిటీ బస్సుల నష్టాలు, పల్లె వెలుగు కష్టాల గురించి మాట్లాడకుండా.. ఆదాయాన్ని తెచ్చిపెట్టే దూరప్రాంత సర్వీసులపై దృష్టి సారించాలి. సంస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కొత్త ఎండీ సజ్జనార్‌పై ఉంది. ఆయనకు అధికారులు పూర్తి సహాయసహకారాలు అందించాలి. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పెంచనుంది. కోవిడ్‌తో ఈ రెండు విభాగాలు బాగా దెబ్బతిని తీవ్ర నష్టాలు వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఆ సేవలు ప్రజలకు సాఫీగా అందాలంటే చార్జీలు తక్షణం పెంచాల్సిన అవసరం ఉందని విద్యుత్, ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దృష్టికి తెచ్చారు. కోవిడ్ తర్వాత పరిస్థితులు, వాటితో సంస్థలకు వాటిల్లిన నష్టాలను ఆయనకు వివరించారు. దీంతో చార్జీల పెంపు ఎంతవరకు ఉండొచ్చో.. రెండుమూడు ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి అందిస్తే, ఆ భేటీలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మంగళవారం ప్రగతి భవన్లో ఆర్టీసీ, విద్యుత్ విభాగాల అధికారులతో కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు ఆయన చర్చించారు. సాలీనా రూ.600 కోట్ల భారం... తొలుత ఆర్టీసీపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలోని 97 డిపోలు నష్టాల్లో కూరుకుపోయాయని సమావేశంలో అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇలాంటి తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో సంస్థ మనుగడ సాగాలంటే ఇప్పటికిప్పుడు బస్సు చార్జీలు పెంచుకోవాల్సిన పరిస్థితి తప్ప గత్యంతరం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. డీజిల్ ధర లీటర్‌కు రూ.65 ఉన్నప్పుడు 2019, డిసెంబర్లో చార్జీలు పెంచామని, ఆ తర్వాత పెంచలేదని, ప్రస్తుతం లీటరు డీజిల్ ధరల రూ.100కు చేరువైందని లెక్కలు ముందుంచి వివరించారు. గతేడాది మార్చిలోనే ఆర్టీసీ చార్జీలు పెంచనున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించిందని, అయితే కోవిడ్ కారణంగా ప్రజల సమస్యలను గుర్తించి వారిపై భారం మోపొద్దన్న ఉద్దేశంతో పెంచలేదని మంత్రి అజయ్‌కుమార్, అధికారులు వెల్లడించారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల సంక్షేమానికి ఇబ్బంది రాకుండా చూసుకుంటూనే ఆర్టీసీని పటిష్ట పరిచే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తే కోవిడ్ నష్టం, డీజిల్ భారం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీని పరిరక్షించడం, దాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్ అన్నారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి అందించాలని సూచించారు. విద్యుత్తు చార్జీలు కూడా.. సమావేశం ముగిసే సమయంలో విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి, జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌రావు.. విద్యుత్ అంశాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ తరహాలో విద్యుత్ సంస్థలు కూడా కోవిడ్ ప్రభావానికి గురై తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరేళ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించేందుకు చార్జీలు పెంచాలని వారు సీఎంను కోరారు. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి విద్యుత్ బిల్లుల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు అందించాలని సీఎం వారికి సూచించారు. ఈ సమీక్షలో ఇందులో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి రాజశేఖరరెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జెన్కో అండ్ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
వన్‌టైం సెటిల్మెంట్ పథకం అమలుకు సీఎం జగన్ ఆదేశం
-
వన్‌టైం సెటిల్మెంట్ పథకం అమలుకు సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వన్‌టైం సెటిల్మెంట్ స్కీంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి వన్‌టైం సెటిల్మెంట్ పథకం వర్తిస్తుంది. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు ఖరారు చేసిన అధికారులు.. పథకం అమలు కోసం రూపొందించిన విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. (చదవండి: ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్) సెప్టెంబరు 25 నుంచి డేటాను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్లోడ్ చేయనుంది. వివిధ సచివాలయాలకు ఈ డేటాను పంపనున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్మెంట్ పథకం సొమ్మను చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒన్‌టైం సెటిల్మెంట్కు అర్హులైన వారి జాబితాలు ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లింపుతో వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. వన్‌టైం సెటిల్మెంట్ స్కీంకు మంచి స్పందన వస్తోందని సీఎంకు అధికారులు తెలిపారు. ఓటీఎస్ పథకం అమలుకు గ్రామ, వార్డు సచివాలయాలు పాయింట్‌గా ఉండాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్ష ►ఇప్పటివరకూ గ్రౌండ్ అయిన ఇళ్లు 10.31 లక్షలు ►ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం ►ఈమేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్న సీఎం ►లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం ►ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18వేలకుపైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడి ►ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్లనిర్మాణం జరుగుతున్న లే అవుట్ల వద్దే ఇటుక తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు ►దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయన్న అధికారులు ►మిగిలిన నిర్మాణ సామగ్రి ధరలను, ఖర్చులను అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగనన్న కాలనీల్లో మౌలికసదుపాయాల కల్పనపైనా సీఎం సమీక్ష ►కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై డీపీఆర్‌లు సిద్ధంచేశామన్న అధికారులు ►కాలనీ ఒక యూనిట్‌గా పనులు అప్పగించాలన్న సీఎం ►టిడ్కో ఇళ్లపైనా సమీక్ష నిర్వహించిన సీఎం ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ (భూములు) ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ రాహుల్ పాండే, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ ఎన్ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్రయాత్ర -
ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష
-
ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష
విజయవాడ: ఆన్లైన్ పద్దతిలో సినిమా టికెక్టు అమ్మాలనే ప్రక్రియ 2002 నుంచి ఉందని సమాచారశాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల్ని ప్రభుత్వం నేడు చర్చకు పిలిచిందన్నారు. ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎగ్జిబిటర్ల సమస్యలు, నిర్మాతల సమస్యలు అన్నింటిని ప్రభుత్వం తరపున తాము నమోదు చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే సినీ పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించిన తర్వాత పరిష్కారం తీసుకుంటామన్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ కు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు సానుకూలంగా ఉన్నారని, మళ్ళీ ఇంకోసారి సినిమా ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు సమావేశం అవుదామని తెలిపినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ ఎప్పుడు కూడా సాధారణ ప్రేక్షకులకు వినోదం అందుబాటులో ఉంచేలా చేస్తారని వెల్లడించారు. చదవండి: Youngest MPTC: చిన్న వయసులోనే.. ‘ఎంపీటీసీ’! -
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనంపై నెలకొన్న గందరగోళం....
హైదరాబాద్: భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనంపై సమాలోచనలు చేస్తోంది. కాగా, గణేష్ నిమజ్జనంపై పోలీసుశాఖలో అయోమయం నెలకొంది. గణేష్ నిమజ్జనంపై నిన్న(సోమవారం) సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. నిమజ్జనంపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు తీర్పుపై అధికారులతో చర్చించారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రతి ఏడాది మాదిరిగానే.. ట్యాంక్బండ్లోనే గణేష్ నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇది వరకే ప్రకటించారు. ఇప్పటికే ట్యాంక్ బండ్లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు. పోలీసులు నిమజ్జనంకు వచ్చే విగ్రహాలను అడ్డుకుంటే రోడ్డు మీదనే నిరసన వ్యక్తం చేస్తామని ఉత్సవ సమితి హెచ్చరించింది. చదవండి: హుస్సేన్‌సాగర్‌లో ‘నిమజ్జనం’పై సుప్రీంకు.. చదవండి: TS High Court:హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలని పురాణాల్లో చెప్పారా?