సీఎం జగన్‌ అధ్యక్షతన ఎఫ్‌ఐపీబీ సమావేశం.. పలు ప్రతిపాదనలకు ఆమోదం | CM YS Jagan Review Meet on State Investment Promotion Board 2022 | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ అధ్యక్షతన ఎఫ్‌ఐపీబీ సమావేశం.. పలు ప్రతిపాదనలకు ఆమోదం

Published Wed, Jun 22 2022 11:36 AM | Last Updated on Wed, Jun 22 2022 9:05 PM

CM YS Jagan Review Meet on State Investment Promotion Board 2022 - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ బోర్డ్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో ఎఫ్‌ఐపీబీ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

1. అదానీ గ్రీన్‌ ఎనర్జీ చేపట్టనున్న 3700 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు ఎస్‌ఐపీబీ ఆమోదం
మొత్తంగా రూ.15,376 కోట్ల పెట్టుబడి.. నాలుగు దశల్లో ఈ ప్రాజెక్టు
2022–23లో రూ. 1349 కోట్లు, 
2023–24లో రూ. 6,984 కోట్లు
2024–25లో రూ. 5,188 కోట్లు
2025–26లో రూ. రూ.1855 కోట్ల పెట్టుబడి
మొత్తంగా సుమారు 4వేల మందికి ఉపాధి
దావోస్‌ వేదికగా చేసుకున్న అవగాహన ఒప్పందాల్లో ఇదొక ప్రాజెక్టు
వైఎస్సార్‌ జిల్లాలో 1000 మెగావాట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుకుట్టి వద్ద 1200 మెగావాట్లు, కర్రివలస వద్ద 1000 మెగావాట్లు, సత్యసాయి జిల్లాలోని పెదకోట్ల చిత్రావతి వద్ద 500 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి.

2. వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో పంక్చుయేట్‌ వరల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టెక్స్‌పోర్ట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెండ్‌ అనుబంధ సంస్థ) రూ.50 కోట్లతో పెట్టనున్న గార్మెంట్స్‌ తయారీ పరిశ్రమకు ఎస్‌ఐపీబీ ఆమోదం.
ఇదే కంపెనీ వైఎస్సార్‌ జిల్లాలోని కొప్పర్తిలో రూ.50 కోట్లతో పెట్టనున్న మరో యూనిట్‌కూ ఎస్‌ఐపీబీ ఆమోదం. ఈ రెండు యూనిట్ల ద్వారా మొత్తంగా 4,200 మందికి  ఉద్యోగాలు. 

3. కృష్ణాజిల్లా మల్లవెల్లి ఫుడ్‌పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పెట్టనున్న రొయ్యల ప్రాసెసింగ్‌ పరిశ్రమకు ఎస్‌ఐపీబీ ఆమోదం. ఈ కంపెనీ ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు.

4. తిరుపతిలో నొవాటెల్‌ బ్రాండ్‌ కింద హోటల్‌ ఏర్పాటు చేయనున్న వీవీపీఎల్‌.
రూ.126.48 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 300 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 2700 మందికి ఉపాధి కల్పన. ఈ ప్రాజెక్టుకు ఎస్‌ఐపీబీ ఆమోదం. 

5. ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగానికి చిరునామాగా మారిన  కొప్పర్తిని టెక్స్‌టైల్‌ రీజియన్‌ అపారెల్‌ పార్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయం ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ
దాదాపు 1200 ఎకరాల్లో మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ మరియు అపారెల్‌ పార్క్స్‌
నాణ్యమైన ఉత్పత్తులు, తక్కువ ఖర్చుతో తయారీ, మెరుగైన ఉపాధి ప్రధాన లక్ష్యం
నాణ్యమైన విద్యుత్తు, నీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్న ప్రభుత్వం
ఈ ప్రాంతాన్ని రైల్వేలైన్లతో అనుసంధానించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశం

ఎస్‌ఐపీబీలో ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
రాష్ట్రంలో సుమారు 30వేల మెగావాట్లకు పైగా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి అపార అవకాశాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి
దీనికోసం సుమారు 90వేల ఎకరాలు అవసరం అవుతుంది
గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల వల్ల రైతులకు, రాష్ట్రానికి పెద్ద మేలు జరగబోతోంది
ప్రతి ఎకరాకు రైతుకు కనీసంగా రూ.30వేల లీజు వస్తుంది
ప్రతి ఏటా రైతుకు ఆదాయం నేరుగా వస్తుంది
వర్షాభావ ప్రాంతాల్లో స్థిరంగా రైతుకు ఆదాయం రావడంవల్ల ఆయా కుటుంబాలకు మేలు జరుగుతుంది
రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకున్న మిగతా ప్రాజెక్టులు కూడా వీలైనంత త్వరగా సాకారమయ్యేలా చూడాలన్న సీఎం
వీటితోపాటు సుబాబుల్, జామాయిల్‌ లాంటి సాగు చేస్తున్న రైతులు కూడా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల నుంచి మేలు పొందవచ్చన్న సీఎం
ఆ భూములను సోలార్‌ ప్రాజెక్టుల్లాంటి గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజుకు ఇవ్వడంద్వారా... ఏడాదికి కనీసంగా ఎకరాకు రూ.30వేల వరకూ స్థిరంగా ఆదాయం పొందేందుకు చక్కటి అవకాశం ఉందన్న సీఎం
ఈ ప్రత్యామ్నాయంపైనా అధికారులు దృష్టిసారించి రైతులకు మేలు చేసే చర్యలను చేపట్టాలన్న సీఎం
అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీల తయారీ కేంద్రంగా రాష్ట్రం మారాలి
గ్లోబల్‌ కంపెనీల పెట్టుబడులు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి
ఎలక్ట్రానిక్స్‌ మరియు పర్యాటక– ఆతిథ్య రంగాల్లో మంచి పెట్టుబడులకు రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి
కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమలు విరివిగా వస్తున్నాయి
మరిన్ని గ్లోబల్‌ కంపెనీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి
ఈ పరిశ్రమలకు అవసరమైన సామగ్రిని, అలాగే ఉత్పత్తులను సులభంగా తరలించేందుకు వీలుగా కొప్పర్తిలో రైల్వే లైన్‌ ఏర్పాటుచేయాలని, ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.
కొప్పర్తికి రైల్వే కనెక్షన్‌ తీసుకురావడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం
దీనివల్ల కొప్పర్తి ప్రాంతంలో ఉన్న దాదాపు 6వేల ఎకరాల్లో శీఘ్రగతిన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్న సీఎం
దీంతోపాటు ఇండస్ట్రియల్‌ నోడ్స్‌ను రైల్వేలతో అనుసంధానం చేయడం అత్యంత కీలకమన్న సీఎం
ప్రతినోడ్‌ను కూడా రైల్వేలైన్లతో అనుసంధానం చేయాలన్న సీఎం
పరిశ్రమలకు మంచి జరుగుతుందని, రవాణా సులభతరం అవుతుందన్న సీఎం
ఈ ప్రాజెక్టులన్నీకూడా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

ఈ భేటీకి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటకశాఖ మంత్రి ఆర్‌ కే రోజా, సీఎస్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్, ప్లానింగ్‌ శాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జి సృజన, ఏపీఐఐసీ ఎండీ జె సుబ్రమణ్యం, ఏపీ టూరిజం ఎండీ అండ్‌ సీఈఓ కన్నబాబు, ఏపీటీఎస్‌ ఎండీ నంద కిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement