
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం స్పందన. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా స్పందనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించడం అధికారుల బాధ్యత, అర్జీదారులకు సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా దీనిని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించిన సీఎం జగన్.. ప్రతి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.