State Investment Promotion Board
-
ఎంఎస్ఎంఈల రంగానికి పునరుజ్జీవం ఇచ్చాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై(ఎస్ఐపీబీ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పరిశ్రమల ప్రతిపాదనలకు, ప్రోత్సాహకాలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో మొత్తంగా రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 69,565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికరంగంలో అనూహ్య మార్పులు వస్తున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. పరిశ్రమల ఉత్పాదకతలో విప్లవాత్మక మార్పు పరిశ్రమల ఉత్పాదకతలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, వీటన్నింటినీ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహణ చేసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అవగతం చేసుకోవాలని, ఆ మేరకు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. అత్యంత పారదర్శకత విధానాల ద్వారా అత్యంత సానుకూల వాతావరణాన్ని తీసుకురాగలిగామని అన్నారు. ఈ క్రమంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచామని, ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు,. ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ‘పరిశ్రమల పట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయాలి. పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం నుంచి వేగంగా స్పందిస్తున్నాం. ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నాం. అనుమతులు, క్లియరెన్స్ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతంగా పెంచాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక వర్గాలనుంచి వచ్చే ప్రతిపాదనల పట్ల చురుగ్గా వ్యవహరించడంతో పాటు, వాటికి త్వరగా అనుమతులు మంజూరుచేసే ప్రక్రియ వేగాన్ని ఇంకా పెంచాలి. ఎంఎస్ఎంఈల పట్ల చాలా సానుకూలతతో ముందుకు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలి. గత ప్రభుత్వంలో కన్నా పరిశ్రమలకు పోత్సాహకాల విషయంలో ఈ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున మేలు చేకూర్చాం. ఎంఎస్ఎంఈల రంగానికి పునరుజ్జీవం ఇచ్చాం. ఇన్సెంటివ్‌లు ఇస్తూ వారికి చేదోడుగా నిలిచాం. ఎంఎస్ఎంఈల పట్ల చాలా సానుకూలతతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎక్కువమంది వీటిపై ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి.. వీటిని కాపాడుకోవడం ప్రభుత్వంమీదున్న బాధ్యత’ అని సీఎం తెలిపారు. ఎస్ఐపీబీ ఆమోదం పొందిన కంపెనీల వివరాలు.. 1. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్న పెప్పర్ మోషన్ కంపెనీ. రూ.4,640 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 8080 మందికి ఉద్యోగాలు. 2. విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్ డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం. రూ.531 కోట్లు పెట్టుబడి, 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు. 3. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు. రూ.1750 కోట్ల పెట్టుబడి, 2000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 500 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు. 4. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో స్మైల్ (సబ్‌స్ట్రేట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్)కంపెనీ ఆధ్వర్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్. రూ.166 కోట్ల పెట్టుబడి, దాదాపు 5 వేలమందికి ఉద్యోగాలు. 5. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ (రిలయెన్స్ పవర్) తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్ఐపీబీ ఆమోదం. థర్మల్ పవర్ స్ధానంలో కొత్త తరహా, సాంప్రదాయేతర పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటుకు ఎస్ఐపీబీ ఆమోదం. రూ.6,174 కోట్ల పెట్టుబడి, 600 మందికి ప్రత్యక్షంగానూ, 2000 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు. 6. ఇవికాక మరో మూడు కంపెనీల విస్తరణకూ ఎస్ఐపీబీ ఆమోదం, ఆమేరకు వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఎస్ఐపీబీ ఆమోదం. తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద ఆంధ్రాపేపర్ లిమిటెడ్ విస్తరణ. రూ.4వేల కోట్ల పెట్టుబడి, 3 వేలమందికి ఉద్యోగాలు. 7. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ విస్తరణ. రూ.679 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు. 8. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ విస్తరణ. రూ.933 కోట్ల పెట్టుబడి, 2,100 మందికి ఉద్యోగాలు. 9. ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద రూ.114 కోట్ల పెట్టుబడి పెట్టనున్న శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్. 310 మందికి ఉద్యోగాలు. ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. 10. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓరిల్ పుడ్స్ లిమిటెడ్. దాదాపుగా 550 మందికి ఉద్యోగాలు. -
సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ భేటీ.. పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఆమోదం
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ.. పరిశ్రమలు పెట్టేవారికి చేదోడుగా నిలవాలని ఆదేశించారు. అనుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించుకున్న సమయంలోగా వాటి కార్యకలాపాలు ప్రారంభం కావాలని తెలిపారు. రానున్న ప్రతి పరిశ్రమలో కూడా ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రావాలని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక… విద్యుత్ ప్రాజెక్ట్‌ల విధానంలో కీలక మార్పులు తీసుకు వచ్చామని పేర్కొన్నారు. పవర్ ప్రాజెక్టుల ద్వారా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే ఆదాయం వచ్చే పరిస్థితులు తీసుకువచ్చామన్నారు. తీసుకుంటున్న భూమికి ఎకరాకు ఏడాదికి రూ.31వేలు లీజు కింద చెల్లింపులు వచ్చాయన్నారు సీఎం జగన్. దీనివల్ల కరవు ప్రాంతాల్లోని రైతులకు చక్కటి మేలు జరుగుతుందని తెలిపారు. అంతేగాక ప్రతి మెగావాట్‌కు లక్ష రూపాయల చొప్పున రాష్ట్రానికి కంపెనీలు చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. ఎస్జీఎస్టీ రూపంలో కూడా రాష్ట్రానికి రెవెన్యూ వస్తుందన్నారు. గ్రిడ్ బాధ్యతలు కూడా రాష్ట్రానికి లేవని.. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు. చదవండి: సబ్‌ప్లాన్ అంటే లోకేష్‌కు తెలుసా?.. మంత్రి నాగార్జున సెటైర్లు మరిన్ని ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం 1. కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్ఇంధన తయారీకి ముందుకు వచ్చిన అవిశా ఫుడ్స్ మరియు ఫ్యూయెల్స్ కంపెనీ ప్రతిపాదన. ►మొత్తంగా రూ.498.84 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి. రోజుకు 500 కిలో లీటర్ల సామర్ధ్యం ► ఈ ఏడాది జూన్ లో పనులు ప్రారంభించి, వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యం. 2. కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ విస్తరణ ప్రాజెక్టు. ► మొత్తంగా రూ. 3,400 కోట్ల పెట్టుబడులు ►ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు. ► 2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం. ౩. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ►మొదటి విడతలో రూ.55వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి. ►మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి. ►ఫేజ్ వన్‌లో 30 వేలమందికి, ఫేజ్ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు. ► ఈ పార్క్ లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, హైడ్రోజన్ సంబంధిత ఉత్పత్తులు. ►మొదటి విడతను 2027 నాటికి, రెండో విడతను 20౩౩ నాటికి పూర్తిచేయాలని లక్ష్యం. ► ఇంధన రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు మార్చుకుని కొత్త తరహా ఇంధనాల ఉత్పత్తి లక్ష్యంగా ముందడుగు వేస్తున్న ఎన్టీపీసీ. 4. శ్రీకాళహస్తి, పుంగనూరుల్లో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్… ఫ్యాక్టరీలు. ►డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్ తయారీ ►శ్రీకాళహస్తిలో రూ.915.43 కోట్ల పెట్టుబడి, పుంగనూరులో రూ.171.96కోట్లు పెట్టుబడి. ► మొత్తంగా రూ. 1087 కోట్ల పెట్టుబడి. ►ప్రత్యక్షంగా 2,350 మందికి ఉద్యోగాలు. ► డిసెంబర్2023 నాటికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యం. 5. రామాయపట్నంలో అకార్డ్ గ్రూప్ ఫ్యాక్టరీ. ►రూ. 10వేల కోట్ల పెట్టుబడి. ►కాపర్ కాథోడ్, కాపర్ రాడ్, సల్ఫూరిక్ యాసిడ్, సెలీనియం మరియు ప్రత్యేక ఖనిజాల తయారీ. ►ప్రత్యక్షంగా 2500 మందికి ఉద్యోగాలు. ► మే 2023లో ప్రారంభమై, జూన్2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం. ► ప్రభుత్వం రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలను నిషేదించిన నేపథ్యంలో తమ కంపెనీ ప్రణాళికలను మార్చుకున్న జేఎస్‌డబ్యూ అల్యూమినియం లిమిటెడ్ ఫ్యాక్టరీ కోసం ప్రెవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన 985 ఎకరాల భూమిలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన ఆమోదించిన ఎస్ఐపీబీ 6. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లు ►1000 మెగావాట్ల విండ్, మరియు 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లు ►ఏర్పాటు చేయనున్న ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ►నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్లపెట్టుబడి. ► 2వేలమందికి ఉద్యోగాలు. ► దశల వారీగా పూర్తిస్ధాయిలో మార్చి 2027 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం. 7. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్. ►100 మెగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ . ►మొదటి విడతలో 10 మెగావాట్లతో డేటా సెంటర్, మూడేళ్ళలో పూర్తికి కంపెనీ సన్నాహాలు. ► మొత్తంగా రూ.7,210 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 14,825 మందికి, పరోక్షంగా 5,625 మందికి, మొత్తంగా 20,450 మందికి ఉద్యోగాలు. ►ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న 200 మెగావాట్ల డేటా పార్క్ కి ఇది అదనం. 8. రాష్ట్రంలో పెట్టబుడులకు ముందుకు వచ్చిన వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ►రూ. 1489.23కోట్ల పెట్టుబడి. తిరుపతిలో పరిశ్రమ. ►15 వేలమందికి ఉద్యోగాలు. ►టెలీ కమ్యూనికేషన్ఇంటిగ్రేషన్, సెమికండక్టర్, ఆప్టికల్ మాడ్యూల్స్ ను తయారుచేస్తున్న కంపెనీ. 9. భోగాపురంలో 90 ఎకరాల స్థలంలో ఐటీ పార్కు ఏర్పాటు. ►దీనికి ఎస్ఐపీబీ ఆమోదం. ►అత్యంత ఆధునిక సదుపాయాలతో ఐటీ పార్కు ఏర్పాటు కావాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి ఆమేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం ఆదేశం. -
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం
-
వైఎస్ఆర్ జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్‌కు గ్రీన్ సిగ్నల్
-
ఉక్కు సంకల్పంతో.. సీమకు స్టీల్ ప్లాంట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా రూ.23,985 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రత్యక్షంగా పది వేల మందికి, పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వైఎస్సార్ జిల్లాకు ఇచ్చిన హామీ మేరకు గట్టి ప్రయత్నంతో దేశంలో రెండో అతి పెద్ద స్టీల్ దిగ్గజ కంపెనీ జేఎస్డబ్ల్యూని సీఎం జగన్ ఒప్పించి ఉక్కు కర్మాగారం నెలకొల్పేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పోర్టులు లాంటి కీలక సదుపాయాలు లేనందున స్టీల్ ప్లాంట్‌పై కొన్ని పెద్ద గ్రూప్‌లు తటపటాయించినప్పటికీ దిగ్గజ సంస్థను ఒప్పించి మరీ కడపలో ఉక్కు కర్మాగారం కలను సాకారం చేస్తుండటం గమనార్హం. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. వైఎస్సార్ జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ నెలకొల్పే పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. వెనకబడ్డ రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే ప్రక్రియలో భాగంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గొప్ప ప్రయత్నమని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ద్వారా పలు అనుబంధ పరిశ్రమల రాకతో రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించే స్టీల్‌ప్లాంట్ పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులు ఇవీ దేశంలో రెండో అతిపెద్ద స్టీల్ గ్రూప్ జేఎస్‌డబ్ల్యూ వైఎస్సార్ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ రెండు విడతల్లో రూ.8,800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొదటి విడతలో రూ.3,300 కోట్లతో ఏటా ఒక మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు కానుంది. రెండో విడతలో మరో రెండు మిలియన్ టన్నులతో కలిపి మొత్తం 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో యూనిట్ అందుబాటులోకి రానుంది. స్టీల్, ఎనర్జీ, తయారీ, సిమెంటు, పెయింటింగ్ లాంటి పలు రంగాల్లో విస్తరించిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ విలువ సుమారు రూ.1,76,000 కోట్లు (22 బిలియన్ డాలర్లు) ఉంటుంది. ఏటా 27 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి ద్వారా దేశంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా జేఎస్‌డబ్ల్యూ నిలిచింది. కంపెనీకి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో స్టీల్ ప్లాంట్లున్నాయి. తాజాగా మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏపీలో అడుగు పెడుతోంది. ఉత్తరాంధ్రలో అదానీ గ్రీన్ ఎనర్జీ ఉత్తరాంధ్రలో అదానీ గ్రీన్ఎనర్జీ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. సుమారు రూ.6,330 కోట్ల పెట్టుబడితో 1,600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వెయ్యి మెగావాట్లు, అనకాపల్లి – విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల సామర్థ్యంతో వీటిని నెలకొల్పనుంది. ప్రత్యక్షంగా 4 వేల మందికి ఉపాధి కల్పించే ఈ యూనిట్ పనులను 2024 డిసెంబర్లో ప్రారంభించిం నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 4,196 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఎర్రవరం, సోమశిల వద్ద రూ.8,855 కోట్లతో హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు ఎర్రవరం, సోమశిల వద్ద షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రూ.8,855 కోట్లతో హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఎర్రవరం వద్ద 1,200 మెగావాట్లు, సోమశిల వద్ద 900 మెగావాట్లతో మొత్తం రెండు ప్రాజెక్టుల ద్వారా 2,100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది జూలైలో ప్రారంభమై విడతల వారీగా డిసెంబర్ 2028 నాటికి పూర్తిస్థాయిలో యూనిట్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 2,100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, రెవెన్యూశాఖ (వాణిజ్య పన్నులు) స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ(ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) స్పెషల్ సీఎస్ జి.సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, జీఏడీ స్పెషల్ సీఎస్ కె.ప్రవీణ్ కుమార్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, ఏపీపీసీబీ మెంబర్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ ఎండీ షన్మోహన్ పాల్గొన్నారు. చదవండి: బీఆర్ఎస్కు మద్దతుపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు -
ఏపీలో మరిన్ని పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం.. కొత్త కంపెనీలు ఇవే
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న కంపెనీలు ఇవే.. – వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కాసిస్ ఇ–మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. – రూ. 386.23 కోట్లను కంపెనీ పెట్టుబడిగా పెట్టనున్నది. – ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల తయారీకోసం రూ. 286.23 కోట్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకోసం రూ.100 కోట్ల పెట్టుబడి. – తొలివిడతలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వేయి ఎలక్ట్రిక్ బస్సులు తయారుచేయాలని లక్ష్యం. – 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. – కాకినాడ ఎస్ఈజెడ్లో లైఫిజ్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. – లైఫిజ్ ఫార్మా మొత్తంగా రూ.1900 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. – దీంతో 2వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించునున్నారు. – ఏప్రిల్ 2024 నాటికి కంపెనీ ఏర్పాటు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. – ఏపీఐ డ్రగ్ తయారీలో చైనా దిగుమతులపై ఆధారపడకుండా.. స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. – పరిశ్రమ కోసం ఇప్పటికే 236.37 ఎకరాలను కంపెనీ సేకరించింది. – మెటలార్జికల్ గ్రేడ్ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్, రోల్డ్ గ్లాసెస్ తదితర వాటి తయారీ కోసం పరిశ్రమతోపాటు సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. – ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు విడతల్లో మొత్తంగా రూ.43,143 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. – ఈ కంపెనీ ద్వారా 11,500 మందికి ప్రత్యక్షంగా, 11 వేలమందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. – నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ, దీంతోపాటు 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పనున్నారు. – కృష్ణా జిల్లా మల్లవల్లిలో అవిశా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. – అవిశా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 150 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో, 2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. – దీని కోసం 11.64 ఎకరాల భూమి కేటాయింపు. 2023 మార్చి నాటికి పూర్తిచేసేందుకు ప్రణాళికలు. వైఎస్సార్ జిల్లా పైడిపాలెం వద్ద పంప్డ్ హైడ్రో, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. – 7,200 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం రూ.33,033కోట్లు ఖర్చు చేయనుంది. – పైడిపాలెం ఈస్ట్ 1200 మెగావాట్లు, నార్త్ 1000 మెగావాట్లు, 3500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, 1500 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. – దీంతో 7,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. – డిసెంబర్ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం. – కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. – రూ. 5వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వేయి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. – 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులను కంపెనీ ఏర్పాటు చేయనుంది. – మార్చి 2025 నాటికి ప్రాజెక్టుల పూర్తిచేయాలని లక్ష్యం. – ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకూ ఎస్ఐపీబీ ఆమోదం. – ఈ ఆరు ప్రాజెక్టుల కోసం రూ.81,043 కోట్ల పెట్టుబడి. – 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. క్లీన్ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తాము. రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు రూ.30వేల వరకూ లీజు కింద డబ్బు వస్తుంది. దీనివల్ల వారికి ఆదాయాలు కూడా పెరుగుతాయి. పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటి కోసం పెద్ద ఎత్తున సంస్థలు ప్రవేశిస్తాయి. వాటిద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికవసతులశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కార్మిక, ఉపాధి, శిక్షణశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, సీఎస్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ అధ్యక్షతన ఎఫ్ఐపీబీ సమావేశం.. పలు ప్రతిపాదనలకు ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో ఎఫ్ఐపీబీ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. 1. అదానీ గ్రీన్ ఎనర్జీ చేపట్టనున్న 3700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం మొత్తంగా రూ.15,376 కోట్ల పెట్టుబడి.. నాలుగు దశల్లో ఈ ప్రాజెక్టు 2022–23లో రూ. 1349 కోట్లు, 2023–24లో రూ. 6,984 కోట్లు 2024–25లో రూ. 5,188 కోట్లు 2025–26లో రూ. రూ.1855 కోట్ల పెట్టుబడి ►మొత్తంగా సుమారు 4వేల మందికి ఉపాధి ►దావోస్ వేదికగా చేసుకున్న అవగాహన ఒప్పందాల్లో ఇదొక ప్రాజెక్టు ►వైఎస్సార్ జిల్లాలో 1000 మెగావాట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుకుట్టి వద్ద 1200 మెగావాట్లు, కర్రివలస వద్ద 1000 మెగావాట్లు, సత్యసాయి జిల్లాలోని పెదకోట్ల చిత్రావతి వద్ద 500 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి. 2. వైఎస్సార్ జిల్లా పులివెందులలో పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ (టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ లిమిటెండ్ అనుబంధ సంస్థ) రూ.50 కోట్లతో పెట్టనున్న గార్మెంట్స్ తయారీ పరిశ్రమకు ఎస్ఐపీబీ ఆమోదం. ►ఇదే కంపెనీ వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తిలో రూ.50 కోట్లతో పెట్టనున్న మరో యూనిట్‌కూ ఎస్ఐపీబీ ఆమోదం. ఈ రెండు యూనిట్ల ద్వారా మొత్తంగా 4,200 మందికి ఉద్యోగాలు. 3. కృష్ణాజిల్లా మల్లవెల్లి ఫుడ్‌పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెడ్ పెట్టనున్న రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమకు ఎస్ఐపీబీ ఆమోదం. ఈ కంపెనీ ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు. 4. తిరుపతిలో నొవాటెల్ బ్రాండ్ కింద హోటల్ ఏర్పాటు చేయనున్న వీవీపీఎల్. ►రూ.126.48 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 300 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 2700 మందికి ఉపాధి కల్పన. ఈ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం. 5. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి చిరునామాగా మారిన కొప్పర్తిని టెక్స్టైల్ రీజియన్ అపారెల్ పార్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయం ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ ►దాదాపు 1200 ఎకరాల్లో మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ మరియు అపారెల్ పార్క్స్ ►నాణ్యమైన ఉత్పత్తులు, తక్కువ ఖర్చుతో తయారీ, మెరుగైన ఉపాధి ప్రధాన లక్ష్యం ►నాణ్యమైన విద్యుత్తు, నీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్న ప్రభుత్వం ►ఈ ప్రాంతాన్ని రైల్వేలైన్లతో అనుసంధానించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశం ఎస్ఐపీబీలో ముఖ్యమంత్రి ఏమన్నారంటే.. ►రాష్ట్రంలో సుమారు 30వేల మెగావాట్లకు పైగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అపార అవకాశాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి ►దీనికోసం సుమారు 90వేల ఎకరాలు అవసరం అవుతుంది ►గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వల్ల రైతులకు, రాష్ట్రానికి పెద్ద మేలు జరగబోతోంది ►ప్రతి ఎకరాకు రైతుకు కనీసంగా రూ.30వేల లీజు వస్తుంది ►ప్రతి ఏటా రైతుకు ఆదాయం నేరుగా వస్తుంది ►వర్షాభావ ప్రాంతాల్లో స్థిరంగా రైతుకు ఆదాయం రావడంవల్ల ఆయా కుటుంబాలకు మేలు జరుగుతుంది ►రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకున్న మిగతా ప్రాజెక్టులు కూడా వీలైనంత త్వరగా సాకారమయ్యేలా చూడాలన్న సీఎం ►వీటితోపాటు సుబాబుల్, జామాయిల్ లాంటి సాగు చేస్తున్న రైతులు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నుంచి మేలు పొందవచ్చన్న సీఎం ►ఆ భూములను సోలార్ ప్రాజెక్టుల్లాంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజుకు ఇవ్వడంద్వారా... ఏడాదికి కనీసంగా ఎకరాకు రూ.30వేల వరకూ స్థిరంగా ఆదాయం పొందేందుకు చక్కటి అవకాశం ఉందన్న సీఎం ►ఈ ప్రత్యామ్నాయంపైనా అధికారులు దృష్టిసారించి రైతులకు మేలు చేసే చర్యలను చేపట్టాలన్న సీఎం ►అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీల తయారీ కేంద్రంగా రాష్ట్రం మారాలి ►గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి ►ఎలక్ట్రానిక్స్ మరియు పర్యాటక– ఆతిథ్య రంగాల్లో మంచి పెట్టుబడులకు రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి ►కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు విరివిగా వస్తున్నాయి ►మరిన్ని గ్లోబల్ కంపెనీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి ►ఈ పరిశ్రమలకు అవసరమైన సామగ్రిని, అలాగే ఉత్పత్తులను సులభంగా తరలించేందుకు వీలుగా కొప్పర్తిలో రైల్వే లైన్ ఏర్పాటుచేయాలని, ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. ►కొప్పర్తికి రైల్వే కనెక్షన్ తీసుకురావడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం ►దీనివల్ల కొప్పర్తి ప్రాంతంలో ఉన్న దాదాపు 6వేల ఎకరాల్లో శీఘ్రగతిన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్న సీఎం ►దీంతోపాటు ఇండస్ట్రియల్ నోడ్స్ను రైల్వేలతో అనుసంధానం చేయడం అత్యంత కీలకమన్న సీఎం ►ప్రతినోడ్ను కూడా రైల్వేలైన్లతో అనుసంధానం చేయాలన్న సీఎం ►పరిశ్రమలకు మంచి జరుగుతుందని, రవాణా సులభతరం అవుతుందన్న సీఎం ►ఈ ప్రాజెక్టులన్నీకూడా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఈ భేటీకి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటకశాఖ మంత్రి ఆర్ కే రోజా, సీఎస్ సమీర్ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జి సృజన, ఏపీఐఐసీ ఎండీ జె సుబ్రమణ్యం, ఏపీ టూరిజం ఎండీ అండ్ సీఈఓ కన్నబాబు, ఏపీటీఎస్ ఎండీ నంద కిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ)తో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐపీబీ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 1. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్ భారతి కో–ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) ఆధ్వర్యంలో రెండు విడతల్లో బయో ఇథనాల్ ప్లాంట్. ►రూ.560 కోట్లతో 250 కె.ఎల్.డి. సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు. ►100 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న క్రిబ్కో, 400 మందికి ఉద్యోగాలు. ►ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. ►ఇదికాకుండా మరిన్ని విత్తన శుద్ధి సహా వివిధ ప్రాససింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన కంపెనీ. 2. ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2022–27లో మరిన్ని చర్యలు ►ఇప్పుడున్న ఎగుమతులను 5 ఏళ్లలో రెట్టింపు చేసే దిశగా అడుగులు ►ఐదేళ్ల కాలంలో రూ.3.5 లక్షల కోట్లు ఎగుమతులు సాధించాలని లక్ష్యం ►దీంట్లో భాగంగా పలు నిర్ణయాలకు ఎస్ఐపీబీ ఆమోదం 3. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ పాలసీ 2022–2027లో భాగంగా మరిన్ని ప్రోత్సాహకాలకు ఎస్ఐపీబీ ఆమోదం ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...: ►రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా రంగం నుంచి ఎగుమతులు ఉన్నాయి ►ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలి ►ఆర్బీకేల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలి ►దేశంలో మెరైన్ ఎగుమతుల్లో 46శాతం రాష్ట్రం నుంచే ►అందుకనే ఈ రంగాన్ని తగిన విధంగా ప్రోత్సహించండి ►సింగిల్‌డెస్క్ పద్ధతిలో పరిశ్రమలకు అనుమతుల విధానంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి ►అత్యంత పారదర్శక విధానాల్లో భాగంగా ఈ మార్పులను తీసుకు వచ్చాం ►విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు ►త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఎస్ఐపీబీ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి మత్యాలనాయుడు, ఆర్ధిక, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ పర్యావరణం, గనులు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కార్మిక, ఉపాధిశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా, సీఎస్ సమీర్ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: (నేను కూడా చేనేత కుటుంబ కోడలినే: మంత్రి ఆర్కే రోజా) -
AP: కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్టంలో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.2,134 కోట్లతో ఐదు పరిశ్రమలను ఏర్పాటు చేయనుండగా.. 7,683 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ►పరిశ్రమలకు భూముల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ►కంపెనీల విస్తరణకు అవకాశాలున్నచోట వారికి భూములు కేటాయించాలి. ►భవిష్యత్తులో వారు పరిశ్రమలను విస్తరించాలనుకుంటే అందుకు అందుబాటులో తగిన వనరులు ఉండేలా చూడాలి. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు.. ►వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్, రిటైల్ లిమిటెడ్ ఏర్పాటు ►ఇక్కడ జాకెట్స్, ట్రౌజర్ల తయారీని చేపట్టనున్న ఆదిత్యా బిర్లా ►రూ.110 కోట్ల పెట్టుబడి, 2112 మందికి ఉద్యోగాలు ►వైఎస్సార్ జిల్లా బద్వేలులో ప్లైవుడ్ తయారీ పరిశ్రమను నెలకొల్పనున్న సెంచురీ ►రూ.956 కోట్ల పెట్టుబడి, 2,266 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ►ఈ పరిశ్రమ ఏర్పాటు కారణంగా రైతులకు భారీగా మేలు జరుగుతుందన్న అధికారులు ►దాదాపు 22,500 ఎకరాల్లో యూకలిఫ్టస్ చెట్లను కొనుగోలు చేస్తారన్న అధికారులు ►దాదాపు రూ.315 కోట్ల ఉత్పత్తులను రైతులనుంచి కొనుగోలు చేస్తారన్న అధికారులు చదవండి: (సీఎం జగన్‌కు కలిసిన కియా ఇండియా మేనేజ్మెంట్) ►తూర్పుగోదావరి జిల్లాలో ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీ పరిశ్రమకు ఎస్ఐపీబీ గ్రీన్‌సిగ్నల్ ►చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రాసిం ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ ►ఈ కంపెనీ ద్వారా రూ.861 కోట్ల పెట్టుబడి, 405 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ►స్థానిక ప్రజల ఆందోళన నేపథ్యంలో థర్మల్‌పవర్ ప్లాంట్‌ను పెట్టబోమని స్పష్టంచేసిన గ్రాసిమ్ కంపెనీ ►స్థానిక ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని విరమించుకున్నామంటూ స్పష్టంచేసిన కంపెనీ.. కంపెనీ స్పష్టత నేపథ్యంలో ఎస్ఐపీబీ ఆమోదం కొప్పర్తి ఈఎంసీ ►వైఎస్సార్ జిల్లా కొప్పర్తి ఈఎంసీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల (హెచ్ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్) తయారీ పరిశ్రమను నెలకొల్పనున్న ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ►రూ.127 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 1800 మందికి ఉద్యోగాలు ►వైఎస్సార్ జిల్లా కొప్పర్తి ఈఎంసీలోనే మరొక పరిశ్రమ పెట్టనున్న ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ►ల్యాప్టాపులు, ట్యాబ్లెట్స్, కెమెరా, డీవీఆర్ తయారీ ►రూ.80 కోట్ల పెట్టుబడి, 1100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇవ్వనున్న డిక్సన్ ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి అనంతరాము, జీఏడీ ముఖ్య కార్యదర్శి కె ప్రవీణ్ కుమార్, ఐటీ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పర్యాటక రంగానికి 'ఏపీ' చిరునామాగా మారాలి: సీఎం జగన్
-
పర్యాటక రంగానికి 'ఏపీ' చిరునామాగా మారాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్లు వెచ్చించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగాల అవకాశాలు దక్కనున్నాయి. దాదాపు 1,564 గదులు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. వీటిని కంపెనీలు ఐదేళ్ల కాలంలో పూర్తి చేయనున్నాయి. చదవండి: (ఇప్పుడిది రైతాంధ్ర) కీలక ప్రాజెక్టుల వివరాలు.. ►విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్, పిచ్చుకలంకలో ప్రఖ్యాత కంపెనీ ఓబెరాయ్ అధ్వర్యంలో రిసార్టులు ►ఓబెరాయ్ విలాస్ బ్రాండ్‌తో రిసార్టులు ►విశాఖపట్నం శిల్పారామంలో హయత్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ ►తాజ్ వరుణ్ బీచ్ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీస్ అపార్ట్మెంట్ ►విశాఖపట్నంలో టన్నెల్ ఆక్వేరియం, స్కైటవర్ నిర్మాణం ►విజయవాడలో హయత్ ప్యాలెస్ హెటల్ ►అనంతపురం జిల్లా పెనుగొండలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్ ఛారిటీస్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించగా ఎస్ఐపీబీ వీటికి ఆమోదం తెలిపింది. చదవండి: (ఇళ్ల నిర్మాణం నిలిపివేతపై రంగంలోకి కేంద్రం) ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ►పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలి అని అధికారులకు సీఎం నిర్దేశం. ►టూరిజం అంటే ఏపీ వైపే చూడాలి ►ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలి ►అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలి ►నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకొండి ►ఆధునిక వసతలు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్రం స్థాయి పెరుగుతుంది ►పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెరుగుతారు ►ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయి ►తద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి పెరుగుతాయి ►విశాఖపట్నంలో లండన్ ఐ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలి అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవెన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, జీఏడీ స్పెషల్ సీఎస్ కె ప్రవీణ్ కుమార్, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి విజయ్‌కుమార్, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.