AP State Investment Promotion Board Meeting Held Under CM Jagan - Sakshi
Sakshi News home page

గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా భారీగా ఉద్యోగాల కల్పన: సీఎం జగన్‌

Published Mon, Sep 5 2022 2:24 PM | Last Updated on Mon, Sep 5 2022 6:46 PM

AP State Investment Promotion Board Meeting Held Under CM Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎస్‌ఐపీబీ)  సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.

కొత్తగా ఏర్పాటు చేయనున్న కంపెనీలు ఇవే..
– వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో కాసిస్‌ ఇ–మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు.
– రూ. 386.23 కోట్లను కంపెనీ పెట్టుబడిగా పెట్టనున్నది.
– ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీకోసం రూ. 286.23 కోట్లు, ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలకోసం రూ.100 కోట్ల పెట్టుబడి. 
– తొలివిడతలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వేయి ఎలక్ట్రిక్‌ బస్సులు తయారుచేయాలని లక్ష్యం.
– 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. 

– కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో  లైఫిజ్‌ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
–  లైఫిజ్‌ ఫార్మా మొత్తంగా రూ.1900 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
– దీంతో 2వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించునున్నారు. 
– ఏప్రిల్‌ 2024 నాటికి కంపెనీ ఏర్పాటు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
– ఏపీఐ డ్రగ్‌ తయారీలో చైనా దిగుమతులపై ఆధారపడకుండా.. స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. 
– పరిశ్రమ కోసం ఇప్పటికే 236.37 ఎకరాలను కంపెనీ సేకరించింది.

– మెటలార్జికల్‌ గ్రేడ్‌ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్‌, రోల్డ్‌ గ్లాసెస్‌ తదితర వాటి తయారీ కోసం పరిశ్రమతోపాటు సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టును ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనుంది.
– ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మూడు విడతల్లో మొత్తంగా రూ.43,143 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 
– ఈ కంపెనీ ద్వారా 11,500 మందికి ప్రత్యక్షంగా, 11 వేలమందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. 
– నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ, దీంతోపాటు 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను నెలకొల్పనున్నారు.

– కృష్ణా జిల్లా మల్లవల్లిలో అవిశా ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయనుంది.
– అవిశా ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 150 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో, 2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. 
– దీని కోసం 11.64 ఎకరాల భూమి కేటాయింపు. 2023 మార్చి నాటికి పూర్తిచేసేందుకు ప్రణాళికలు.

వైఎస్సార్‌ జిల్లా పైడిపాలెం వద్ద పంప్డ్‌ హైడ్రో, సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనుంది. 
– 7,200 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం రూ.33,033కోట్లు ఖర్చు చేయనుంది.
– పైడిపాలెం ఈస్ట్‌ 1200 మెగావాట్లు, నార్త్‌ 1000 మెగావాట్లు, 3500 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు, 1500 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు.
– దీంతో 7,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. 
– డిసెంబర్‌ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం. 

– కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏఎం గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. 
– రూ. 5వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వేయి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. 
– 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను కంపెనీ ఏర్పాటు చేయనుంది.
– మార్చి 2025 నాటికి ప్రాజెక్టుల పూర్తిచేయాలని లక్ష్యం.  

– ఆరు గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకూ ఎస్‌ఐపీబీ ఆమోదం. 
– ఈ ఆరు ప్రాజెక్టుల కోసం రూ.81,043 కోట్ల పెట్టుబడి.
– 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. క్లీన్‌ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తాము. రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు రూ.30వేల వరకూ లీజు కింద డబ్బు వస్తుంది. దీనివల్ల వారికి ఆదాయాలు కూడా పెరుగుతాయి. పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటి కోసం పెద్ద ఎత్తున సంస్థలు ప్రవేశిస్తాయి. వాటిద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికవసతులశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కార్మిక, ఉపాధి, శిక్షణశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, సీఎస్‌ సమీర్‌ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement