Tadepally
-
నేడు తాడేపల్లికి వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు(మంగళవారం) సాయంత్రం తాడేపల్లికి రానున్నారు. కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం వైఎస్ జగన్ తాడేపల్లికి చేరుకున్నారు.కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్ తన సొంత జిల్లా అయిన వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కలుసుకున్నారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం, అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో సహా బెంగళూరుకు వెళ్లారు. కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు. -
Tadepalli: ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
-
పవన్ ఏం చెబుతాడోనని అందరూ ఎదురుచూశారు
-
ప్రభుత్వ చర్యలు భేష్.. సీఎం జగన్‌కు యూనిసెఫ్ టీమ్ అభినందన
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ జెలలీమ్ బి.టఫ్పెస్సే క్యాంపు కార్యాయంలో కలిశారు. ఈ సందర్బంగా గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా పనిచేసేందుకు యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ సంసిద్థంగా ఉన్నట్టు తెలిపారు. అయితే.. వైద్య, ఆరోగ్యం రంగంలోని వివిధ స్థాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్, ఏఎన్ఎంలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ వంటి వివిధ స్థాయిల్లో ప్రభుత్వానికి అవసరమైన విధంగా తోడ్పాటు ఇచ్చేందుకు యూసిసెఫ్ ముందుకొచ్చినట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై యూనిసెఫ్ బృందంతో సీఎం జగన్ చర్చించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరును ముఖ్యమంత్రి జగన్ వారికి వివరించారు. దీంతో, ప్రభుత్వ నిర్ణయాలను వారు అభినందించారు. ఇక, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వారికి అందజేస్తున్న పౌష్టికాహారం, యాక్షన్ ప్లాన్, మహిళా రక్షణ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పర్యవేక్షణ, మహిళా పోలీసుల ద్వారా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని యూనిసెఫ్ అందిస్తామని తెలిపారు. కాగా, ఆరోగ్య సురక్ష పేరుతో త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు యూనిసెఫ్ ప్రతినిధులకు సీఎం జగన్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఏపీలో వ్యవసాయ రంగ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష.. ఆదేశాలు ఇవే.. -
మహానేత జయంతి సందర్భంగా కేక్ కట్ చేసిన పార్టీశ్రేణులు
-
న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది
-
ఖాళీగా ఉన్న అంగన్వాడి వర్కర్లు, హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యలయంలో జరిగిన ఈ సమావేశానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ వీరపాండ్యన్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహమ్మద్ బాబు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం విజయ సునీత ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంగన్వాడీలలో నాడు – నేడు పనులపై సీఎం జగన్ సమీక్ష ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా మారిన సుమారు 10వేలకుపైగా అంగన్వాడీల్లో పనులు జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు మిగిలిన సుమారు 45వేల అంగన్వాడీలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలన్న సీఎం అంగన్వాడీ సెంటర్లలో ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటి? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలన్న సీఎం ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, టాయిలెట్లు ఇలాంటి సౌకర్యాలపై సమాచారం తెప్పించుకోవాలన్న సీఎం. ప్రతి అంగన్వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి.. తనకు నివేదిక ఇవ్వాలన్న సీఎం పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్వాడీల్లో ఉంచుకోవాలన్న సీఎం గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ను వెంటనే ఏర్పాటు చేయాలన్న సీఎం ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీచేయాలని సీఎం ఆదేశం. మహిళా శిశుసంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీచేయాలన్న సీఎం. సంపూర్ణపోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించాలన్న సీఎం. పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా చేయాలన్న సీఎం. క్రమం తప్పకుండా అంగన్వాడీలపై పర్యవేక్షణ జరగాలన్న సీఎం. ఎప్పటికప్పుడు అంగన్వాడీ సెంటర్లను పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. అంగన్వాడీల్లో సూపర్ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలన్న సీఎం. -
దివ్యాంగ బాలిక దారుణ హత్య.. కత్తితో దాడి చేసి పరారైన సైకో
సాక్షి, తాడేపల్లి రూరల్: బాలిక తల్లి మీద కక్ష పెంచుకున్న యువకుడు చివరికి దివ్యాంగురాలైన ఆమె కుమార్తెను వేధింపులకు గురిచేసి చివరికి హత్యచేశాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తాడేపల్లి పట్టణం ఎన్టీఆర్ కరకట్టకు చెందిన వంగ మనోరమ కుమార్తె ఎస్తేరురాణి (17) పుట్టుకతోనే దివ్యాంగురాలు(అంధురాలు). తండ్రి యేబుతో తల్లి విడిపోవడంతో ఎస్తేరురాణి తల్లి వద్ద ఉంటోంది. మనోరమ ఇంటికి వచ్చి వెళ్లే దేవదాసు అనే యువకుడికి ఇదే ప్రాంతానికి చెందిన నాగపోగు ధనుంజయరాజు అలియాస్ కుక్కల రాజు పరిచయమయ్యాడు. మనోరమ, కుక్కల రాజుల ఇళ్లు ఎదురెదురు కావడంతో దేవదాసు రెండు ఇళ్లకూ వస్తూ పోతూ ఉంటాడు. మూడు రోజుల కిందట దేవదాసు మద్యం తాగి మనోరమ ఇంట్లో వాంతి చేసుకోవడంతో ఆయన చేతే మనోరమ ఇల్లు కడిగించింది. దీనిని కుక్కల రాజు వీడియో తీసి అందరికీ చూపడంతో కక్ష పెంచుకున్న దేవదాసు.. కుక్కల రాజును చంపుతానని బెదిరించాడు. దీంతో మొదలైన వివాదం.. కుక్కల రాజు మనోరమ చేయి పట్టుకుని లాగి ఇష్టమొచ్చినట్లు మాట్లాడేంత వరకూ వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె రాజు బంధువులకు విషయం చెప్పడంతో వారు కుక్కల రాజును మందలించారు. దీంతో కోపం పెంచుకున్న కుక్కల రాజు ఆదివారం రాత్రి ఎవరూ లేని సమయంలో మనోరమ ఇంటికి వెళ్లి అంధురాలైన ఎస్తేరురాణి చేయిపట్టుకుని లాగాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో ఆమె మెడపై, తలపై విచక్షణ రహితంగా నరికాడు. ఎస్తేరురాణి పెద్దగా కేకలు వేయడంతో తల్లితో పాటు అక్కడే ఉన్న బంధువులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే కుక్కల రాజు పరారయ్యాడు. గాయపడిన ఎస్తేరురాణిని బంధువులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ ఘటన వెలుగులోకొచి్చంది. దీంతో పోలీసులు కుక్కల రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీడీపీ నేతల సంరక్షణలో కుక్కల రాజు కుక్కల రాజు వివాహానంతరం విజయవాడ రాణిగారితోట నుంచి కరకట్టకు వచ్చి భార్య, తల్లితో కలసి నివాసముంటున్నాడు. 2019లో తల్లితో, భార్యతో వివాదం రావడంతో వారిని తీవ్రంగా కొట్టి గొడ్డలితో నరికేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తల్లి, భార్య పారిపోయి తాడేపల్లి పోలీసులను ఆశ్రయించగా, కుక్కల రాజు గొడ్డలితో పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో తల్లీ, భార్య అతనికి దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచి కరకట్ట మీద పట్టాభిరామయ్య కాలనీకి చెందిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు అతనికి ఆశ్రయం కల్పించారు. కుక్కల రాజు కుక్కలను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలకు, కుక్కల రాజుకు గొడవ జరగ్గా.. కుక్కల రాజును చేరదీసిన వారే చితకబాది, పెంపుడు కుక్కలతో కరిపించారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మొదటి నుంచి సైకోలా వ్యవహరిస్తున్న కుక్కల రాజును పోలీసుల నుంచి కాపాడింది టీడీపీ నేతలే. ఇదిలా ఉండగా, బాధితురాలి కుటుంబ సభ్యులను సోమవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తుందని చెప్పారు. పోలీసుల అదుపులో నిందితుడు.. ఎస్తేరు రాణిని హత్యచేసిన కుక్కలరాజును పోలీసులు గంట వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే నార్త్‌జోన్ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, పెదకాకాని పోలీసులను అప్రమత్తంచేసి క్రైం సిబ్బందితో జల్లెడ పట్టారు. సీతానగరం రైల్వేబ్రిడ్జి మీద నుంచి విజయవాడ వెళ్తుండగా నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం మరోవైపు.. ఎస్తేరురాణి మృతిచెందడంతో ఆమె కుటుంబానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తాడేపల్లి ఇన్చార్జి తహసీల్దార్ రాంప్రసాద్ మాట్లాడుతూ ఈ విషయాన్ని మనోరమకు తెలియజేసినట్లు చెప్పారు. చదవండి: ఇన్విజిలేటర్ మందలించాడని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య -
కాలువలతో చెరువుల అనుసంధానం
సాక్షి, అమరావతి: రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరువు ప్రాంతాల్లో కాల్వల ద్వారా చెరువులను అనుసంధానం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా? లేవా? ఉన్న చెరువుల పరిస్థితి ఏంటి? వాటికి నీరు చేరడంలో ఉన్న ఇబ్బందులు, తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో ఈ ప్రాజెక్టు కింద పనులను పరుగులు పెట్టించాలని సూచించారు. విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో (ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్) రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరువు ప్రాంతాల్లో చెరువులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. అవసరమైన చోట చెరువులు లేకపోతే.. అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలని ఆదేశించారు. ఈ చెరువులన్నింటికీ గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. దీనివల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని, పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుందన్నారు. చెరువు కింద చక్కగా భూముల సాగు జరుగుతుందని, వ్యవసాయం బాగుండడంతో ఉపాధి, ఆదాయాలు కూడా స్థిరంగా ఉంటాయని తెలిపారు. ఆ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెరగాలి విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో వివిధ రంగాలలో చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్ధేశిత సమయంలోగా ఆయా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. న్యూ డెవలప్మెంట్ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ.. తదితర బ్యాంకుల రుణ సహాయంతో మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25,497.28 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గత చంద్రబాబు ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన వంతెనల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లును వెంటనే పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. పోర్టుల పరిధిలో సత్వర అభివృద్ధి రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నామని, వీటి చుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు బాగా ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాటి పరిధిలో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం అన్నది చాలా అవసరం అని స్పష్టం చేశారు. దీనివల్ల పోర్టు ఆధారితంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి సృజన, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ పి రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మించడమేంటి.. వినేవాడుంటే బాబు ఏదైనా చెప్తారు: కొడాలి నాని ఫైర్ -
ఏపీలో మరిన్ని పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం.. కొత్త కంపెనీలు ఇవే
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న కంపెనీలు ఇవే.. – వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కాసిస్ ఇ–మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. – రూ. 386.23 కోట్లను కంపెనీ పెట్టుబడిగా పెట్టనున్నది. – ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల తయారీకోసం రూ. 286.23 కోట్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకోసం రూ.100 కోట్ల పెట్టుబడి. – తొలివిడతలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వేయి ఎలక్ట్రిక్ బస్సులు తయారుచేయాలని లక్ష్యం. – 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. – కాకినాడ ఎస్ఈజెడ్లో లైఫిజ్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. – లైఫిజ్ ఫార్మా మొత్తంగా రూ.1900 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. – దీంతో 2వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించునున్నారు. – ఏప్రిల్ 2024 నాటికి కంపెనీ ఏర్పాటు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. – ఏపీఐ డ్రగ్ తయారీలో చైనా దిగుమతులపై ఆధారపడకుండా.. స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. – పరిశ్రమ కోసం ఇప్పటికే 236.37 ఎకరాలను కంపెనీ సేకరించింది. – మెటలార్జికల్ గ్రేడ్ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్, రోల్డ్ గ్లాసెస్ తదితర వాటి తయారీ కోసం పరిశ్రమతోపాటు సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. – ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు విడతల్లో మొత్తంగా రూ.43,143 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. – ఈ కంపెనీ ద్వారా 11,500 మందికి ప్రత్యక్షంగా, 11 వేలమందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. – నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ, దీంతోపాటు 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పనున్నారు. – కృష్ణా జిల్లా మల్లవల్లిలో అవిశా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. – అవిశా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 150 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో, 2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. – దీని కోసం 11.64 ఎకరాల భూమి కేటాయింపు. 2023 మార్చి నాటికి పూర్తిచేసేందుకు ప్రణాళికలు. వైఎస్సార్ జిల్లా పైడిపాలెం వద్ద పంప్డ్ హైడ్రో, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. – 7,200 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం రూ.33,033కోట్లు ఖర్చు చేయనుంది. – పైడిపాలెం ఈస్ట్ 1200 మెగావాట్లు, నార్త్ 1000 మెగావాట్లు, 3500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, 1500 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. – దీంతో 7,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. – డిసెంబర్ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం. – కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. – రూ. 5వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వేయి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. – 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులను కంపెనీ ఏర్పాటు చేయనుంది. – మార్చి 2025 నాటికి ప్రాజెక్టుల పూర్తిచేయాలని లక్ష్యం. – ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకూ ఎస్ఐపీబీ ఆమోదం. – ఈ ఆరు ప్రాజెక్టుల కోసం రూ.81,043 కోట్ల పెట్టుబడి. – 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. క్లీన్ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తాము. రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు రూ.30వేల వరకూ లీజు కింద డబ్బు వస్తుంది. దీనివల్ల వారికి ఆదాయాలు కూడా పెరుగుతాయి. పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటి కోసం పెద్ద ఎత్తున సంస్థలు ప్రవేశిస్తాయి. వాటిద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికవసతులశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కార్మిక, ఉపాధి, శిక్షణశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, సీఎస్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘నేడు బాబా సాహెబ్ వర్ధంతి. ఆయన భావాలకు ఏనాటికీ మరణం లేదు. గత 100 సంవత్సరాలుగా భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ అంశాల మీద ఆయన ముద్ర చెక్కుచెదరలేదు. సామాజిక న్యాయంతో కూడిన స్వాతంత్య్రం, సమానత్వాలకు ఆయన చెప్పిన అర్థం ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో మనసా వాచా కర్మణా సాకారమవుతోంది’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. నేడు బాబా సాహెబ్ వర్ధంతి. ఆయన భావాలకు ఏనాటికీ మరణం లేదు. గత 100 సంవత్సరాలుగా భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ అంశాలమీద ఆయన ముద్ర చెక్కుచెదరలేదు. సామాజిక న్యాయంతో కూడిన స్వాతంత్య్రం, సమానత్వాలకు ఆయన చెప్పిన అర్థం ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో మనసా వాచా కర్మణా సాకారమవుతోంది. pic.twitter.com/OApa1WIQUB — YS Jagan Mohan Reddy (@ysjagan) December 6, 2021 ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కె కనకారావు పాల్గొని నివాళులర్పించారు. చదవండి: సాధికారత సాధించని ఒడంబడిక అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీకి -
జగనన్న భరోసా
-
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం చేయూత
-
ఎంఎస్ఎంఈలకు సీఎం జగన్ భారీ సాయం
సాక్షి, తాడేపల్లి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)ల బలోపేతం కోసం ‘రీస్టార్ట్’ పేరిట ఓ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా రెండు విడతలుగా రూ.1110 కోట్ల మేర సాయాన్ని ప్రకటించి ఎమ్ఎస్ఎమ్ఈలకు ప్రభుత్వం నుంచి చేయూతను అందించనున్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో చిన్న,మధ్య తరగతి పరిశ్రమల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని సుక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ పూర్తి భరోసా ఇచ్చారు. పరిశ్రమల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా గత ప్రభుత్వహయాంలోని బకాయిలను కూడా చెల్లిస్తున్నామని, లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమలు మూతపడి నష్టాల్లో ఉండటంతో విద్యుత్ ఛార్జీలు మూడు నెలల పాటు మాఫీ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోనే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యం గల కార్మికులు అవసరమో గుర్తించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.827 కోట్లతో పాటు మొత్తం రూ.905 కోట్ల ప్రోత్సాహకం అందించనుంది. అంతేకాకుండా రూ.187 కోట్ల స్థిర విద్యుత్ చార్జీల మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిర్వహణ మూల ధనం రుణాలకు రూ.200 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు కేవలం 6 నుంచి 8 శాతం వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లలో 25 శాతం ఎమ్ఎస్ఎమ్ఈల నుంచే చేయాలని నిర్ణయించారు. అలా చేసిన కొనుగోళ్లకు 45 రోజుల్లో చెల్లింపులు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమలకి విద్యుత్ డిమాండ్ ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహక బకాయిలను విడుదల చేయడంపై ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రతినిధి డివి రాజు ఆనందం వ్యక్తం చేశారు. ప్రోత్సాహక బకాయిలు విడుదల చేయడంతో పాటు విద్యుత్ డిమాండ్ ఛార్జీలు రద్దు చేయడంపై సీఎం వైఎస్ జగన్‌కు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణబాలాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
కోవిడ్-19 హెల్ప్‌డెస్క్ ప్రారంభించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి : సామాజిక మాధ్యమాల్లో కోవిడ్-19పై పూర్తి సమాచారం కోసం హెల్ప్ డెస్క్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఫేస్ బుక్, వాట్స్ ఆప్ ద్వారా కోవిడ్-19 సమాచారాన్ని పొందేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వదంతులకు తావు లేకుండా కచ్చితమైన సమాచారం కోసం సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేసింది. వాట్స్ఆప్లో 8297104104 నెంబర్ ద్వారా, ఫేస్బుక్లో ఆరోగ్య ఆంధ్ర మెసెంజర్ ద్వారా కోవిడ్-19 సమాచారం పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, హోమ్ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
సామాజిక దూరం పాటించాలి
-
‘చంద్రబాబు నక్క.. యనమల గుంట నక్క’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ టెర్రరిస్టు అని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. మంగళవారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు ఒక నక్క అయితే.. ఆయన పక్కన ఉండే యనమల రామకృష్ణుడు గుంటనక్క అని రాజా మండిపడ్దారు. తాను అనారోగ్యంతో ఆస్పత్రికి వెళితే దాన్ని కూడా టీడీపీ వక్రీకరిస్తోందని అయన దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు తండ్రిని ఎలా ఆదర్శంగా తీసుకోవాలో.. సీఎం వైఎస్ జగన్‌ను చూసి నెర్చుకోవాలని అయన అన్నారు. చంద్రబాబు సీఎం జగన్‌పై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజా ధ్వజమెత్తారు. శాసన మండలిలోకి టీడీపీ ఎలాంటి వారిని తీసుకువచ్చిందో అందరికీ తెలుసని తెలిపారు. (పన్నులు కట్టేది.. చంద్రబాబు బినామీల కోసం కాదు) వెన్నుపోటు పొడిచి పార్టీని, పదవుల్నిపొందిన చరిత్ర చంద్రబాబుదనాయుడిదని రాజా ఎద్దేవా చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు అంటే చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష అని రాజా ప్రశ్నించారు. మరో ఆరు నెలల్లో చంద్రబాబు పక్కన 21 ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఉంటారో తెలుసుకోవాలన్నారు. యనమల రామకృష్ణుడు గతంలో మంత్రిగా పని చేసినప్పుడు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని రాజా ఆరోపించారు. అదేవిధంగా యనమల రామకృష్ణుడు స్పిన్నింగ్ పనులు చేయిస్తానని చెప్పి రూ. 25 కోట్లు వసూళ్లు చేశాడని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ‘ఎదుటవారికి నీతులు చెప్పడానికే.. కానీ వాటిని ఆచరించడానికి కాదు’ అన్న చందంగా యనమల రామకృష్ణుడి తీరు ఉందని రాజా ఫైర్ అయ్యారు. ముందు చంద్రబాబు రాజీనామా చేయాలని రాజా డిమాండ్ చేశారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం తమ ప్రభుత్వం హయాంలో పూర్తి చేయబోతున్నామని రాజా స్పష్టం చేశారు. -
బాలికతో షేర్‌చాట్.. విజయవాడకు వచ్చి..!
తాడేపల్లిరూరల్: పదిహేను రోజుల క్రితం ఒక బాలిక (14) అనంతపురంలో నివసించే ఓ యువకుడికి షేర్‌చాట్‌లో మెసేజ్ పంపించింది. అప్పటినుంచి బాలికతో ఆ యువకుడు షేర్‌చాట్‌లో మెసేజ్ చేస్తున్నాడు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రమణపల్లికి చెందిన ఎం.విజయకుమార్ ఉండవల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక గత 15 రోజులుగా ప్రతిరోజూ షేర్‌చాట్‌లో మెసేజ్‌లు చేసుకుంటున్నారు. తనను ఇంట్లోంచి తీసుకువెళ్లిపోమని, లేదంటే చనిపోతానని మెసేజ్ పెట్టడంతో విజయకుమార్, అతని సోదరుడు నవీన్ ఆదివారం అనంతపురం నుంచి బయల్దేరి సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌కు వచ్చారు. విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు హోటల్‌కు వెళ్లి యువకులను పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. మెసేజ్ చేసింది బాలిక అనుకోలేదని, తాను డిగ్రీ పూర్తి చేశానని ఆమె తనతో చెప్పిందని విజయకుమార్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఏమీ చేయలేదు...
సాక్షి, తాడేపల్లి: ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు లక్ష్మిపార్వతి తెలిపారు. శనివారం ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి బాటలోనే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అవినీతి రహిత పాలన చేస్తున్నారని తెలిపారు. నాలుగు నెలల పాలనలో సుమారు నాలుగున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత సీఎం జగన్‌ది అని ప్రశంసించారు. సీఎం జగన్ నిజాయతీ పాలన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. ఐదేళ్లలో కమిషన్ల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ‘పీపీఏ, రాజధాని, పొలవరం అన్నింటిలో బాబు పాలన ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగి కుంభకోణాల మయంగా మారింది. ట్విటర్లో మాత్రమే మాట్లాడే కొడుకు కన్న ఘనత చంద్రబాబుదే. అవినీతి, దోపిడికి పాల్పడిన బాబుకు జగన్ పాలనను విమర్శించే హక్కు లేదు. పీపీఏలో భారీగా చంద్రబాబు కమిషన్లు తీసుకున్నారు. చివరికి కోడెల మృతదేహాన్ని పట్టుకొని శవ రాజకీయం చేశారు. చంద్రబాబు, కోడెల కుటుంబ సభ్యలు వల్లనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ఎల్లో మీడియా ఇష్టానుసారంగా వార్తలు రాస్తోంది. మహిళ అని చూడకుండా నాపై తప్పుడు వార్తలు రాశారు. టీడీపీ పాలనలో ప్రజా ధనాన్ని జన్మభూమి కమిటీలు దోచుకుతిన్నాయని’ ఆమె మండిపడ్డారు. తల్లుల కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్ నాలుగు నెలల పాలనపై ఎటువంటి రీమార్క్ లేదని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం వైపు ఆయన అడుగులు వేస్తున్నారని తెలిపారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి భేటీ
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. తాడేపల్లి ఆశ్రమం రోడ్డులోని ఓ ప్రైవేట్ గార్డెన్స్‌లో ఉదయం 10గంటలకు ఈ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ, మండల స్థాయి బూత్ కమిటీల ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు. సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అవినీతిరహిత పాలన అందించి తిరిగి 2024లో అధికారంలోకి రావాలని కాంక్షించారు. గ్రామ సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతుందని.. గ్రామ వాలెంటీర్లుగా చేయాలనుకునేవారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించండి అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 13 జిల్లాలో వీటి సంఖ్య 25 కాబోతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం పాల్గొన్నారు. చదవండి : కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు -
నేను విన్నాను.. నేనున్నాను
సాక్షి, గుంటూరు : రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో అన్నివర్గాల వారికి వరాల జల్లు కురిపించారు. అన్నదాతలకు పెట్టుబడి సాయం, ఉచిత బోర్లు, 9 గంటల విద్యుత్‌తో అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అందరికీ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు చదువులకు ప్రాధాన్యమిచ్చారు. అవ్వాతాతలకు పింఛన్లు పెంచి బతుకుపై భరోసా ఇచ్చారు. నవయుగ సాకారానికి నాంది పలుకుతూ.. సమున్నత ఆశయంతో ప్రతి ఒక్కరికీ మేలు కలిగించే విధంగా.. మనసా, వాచా, కర్మేణా మేనిఫెస్టోను అమలు చేస్తానని జననేత వైఎస్ జగన్ స్పష్టం చేయడంపై జిల్లాలో అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. సమసమాజ స్థాపనే లక్ష్యం.. అన్నదాతకు అండగా.. అక్కచెల్లెమ్మలకు చేయూతగా, విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తూ అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి సంక్షేమ పాలన అందించే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన ఉగాది వేడుకల్లో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మేనిఫెస్టోపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అన్నదాతకు భరోసా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం సంవత్సరానికి రూ.12,500 చొప్పున కింద రూ.50 వేలు, అందిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ పథకం వల్ల జిల్లాలో 7.20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు ఉచితంగా బోర్లు, పగలే 9 గంటల నిరంతర విద్యుత్, ధరల స్థిరీకరణకు రూ.3 వేల కోట్లతో నిధి, ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబానికి రూ.7 లక్షల బీమా, పాడి రైతులకు చేయూత, ఇలా అనేక విధాలుగా అన్నదాతను ఆదుకుంటామని వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టో ద్వారా హామీ ఇచ్చారు. అక్కాచెల్లెమ్మలకు అండగా.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు, 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు దశల వారీగా కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేలు అందిస్తామని, పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఈ పథకాల ద్వారా జిల్లాలోని 20 లక్షల మంది మహిళలకు ఏదో రకంగా లబ్ధిచేకూరనుంది. విద్య, వైద్యానికి పెద్ద పీట తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లలకు చదువులన్నీ ఉచితమని, బిడ్డలను బడికి పంపితే తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు, ఫీజు రీయింబ ర్స్మెంట్తోపాటు విద్యార్థికి ఏటా వసతి కోసం రూ.20 వేలు అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేసి ఫీజులను నియంత్రిస్తామని ప్రకటించారు. వైద్య ఖర్చులు రూ.1000 దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో చికిత్స చేయిం చుకున్నా ఉచితమేనని, నెలకు రూ.40 వేల వేతనం పొందే ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తామని జగన్ తెలిపారు. ఈ పథకాల వల్ల జిల్లాలోని లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. బడుగు, బలహీన వర్గాలకు చేయూత జిల్లాలో 30 లక్షల మందికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు ఉన్నారు. బీసీల అభ్యున్నతికి రూ.15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లల్లో రూ.70 వేల కోట్లు ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తామని జగన్ చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.బీసీ చెల్లెమ్మలకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న పెళ్లికానుకను రూ.35 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతామని జగన్ చెప్పారు. ఉద్యోగులకు భరోసా జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కలుపుకొని లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వారందరినీ వైఎస్సార్ సీపీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని వైఎస్ జగన్ మ్యానిఫెస్టో ద్వారా భరోసా ఇచ్చారు. సీపీఎస్ రద్దు చేస్తామని, ఉద్యోగులు కోరుకున్న విధంగా 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) అంది స్తామని, పోలీసు శాఖలో ఉద్యోగులకు వారానికి ఒక రోజు సెలవు ఉండేలా చూస్తానని, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. -
తాడేపల్లిలో దారుణ హత్య
తాడేపల్లి(గుంటూరు): కుటుంబకలహాల నేపథ్యంలో భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మర్రేడి ఏసుబాబు, జయలక్ష్మి(33) దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. కాగా, ఏసుబాబుకు భార్య ప్రవర్తనపై అనుమానం ఉంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యను కత్తితో నరికి చంపాడు. ఒక కుమార్తె బంధువుల ఇంటికి వెళ్లగా పక్కనే మంచంపై నిద్రిస్తున్న మరో కూతురును అరవకుండా నోరు మూశాడు. తీవ్ర రక్తస్రావం కావటంతో జయలక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది. గురువారం ఉదయం విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన సీఐ సురేష్‌బాబు సంఘటన స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. భార్యపై అనుమానంతోనే ఏసుబాబు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. -
ట్రాక్టర్ లోయలోపడి ఐదుగురు మృతి; 30 మందికి గాయాలు
* మృతుల సంఖ్య పెరిగే అవకాశం * బాధితులు పుంగనూరు మండలం బోడేవారిపల్లెకు చెందినవారు * బోయకొండ గంగమ్మను దర్శించుకుని వెళుతుండగా ప్రమాదం చౌడేపల్లి (చిత్తూరు జిల్లా): ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిత్తూరు జిల్లాలో చౌడేపల్లి మండలం బోయకొండ వద్ద ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతిచెందగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. బోయకొండ ఆలయానికి ప్రతి ఆదివారం వేలాది మంది భక్తులు వస్తుంటారు. పుంగనూరు మండలం బోడేవారిపల్లికి చెందిన 50 మంది భక్తులు ట్రాక్టర్లో వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళుతుండగా ట్రాక్టర్ లోయలోపడింది. ట్రాక్టర్ 20 అడుగుల లోతులో పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులతో పాటు స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి ట్రాక్టర్ కింద పడిన మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. లోయ లోతుగా ఉండడంతో ప్రత్యేకంగా క్రేన్ తెప్పిస్తున్నారు. ఇప్పటి వరకూ ఐదు మృత దేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. దాదాపు 30 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్షాలు పడితే ఇంటికొకరు చొప్పున వచ్చి బోయకొండ గంగమ్మను దర్శించుకుంటామని గతంలో మొక్కుకున్నారని, అందులో భాగంగానే బోడేవారిపల్లి గ్రామస్తుల ట్రాక్టర్లో వచ్చారని పోలీసులు తెలిపారు. ఇప్పటిదాకా వెలికితీసిన ఐదు మృతదేహాల్లో ఇద్దరిని గుర్తించారు. వెంకటేశు(23), బాలాజీ(24) మృతదే హాలను గుర్తించారు.