సాక్షి, అమరావతి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు.
‘‘నేడు బాబా సాహెబ్ వర్ధంతి. ఆయన భావాలకు ఏనాటికీ మరణం లేదు. గత 100 సంవత్సరాలుగా భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ అంశాల మీద ఆయన ముద్ర చెక్కుచెదరలేదు. సామాజిక న్యాయంతో కూడిన స్వాతంత్య్రం, సమానత్వాలకు ఆయన చెప్పిన అర్థం ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో మనసా వాచా కర్మణా సాకారమవుతోంది’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
నేడు బాబా సాహెబ్ వర్ధంతి. ఆయన భావాలకు ఏనాటికీ మరణం లేదు. గత 100 సంవత్సరాలుగా భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ అంశాలమీద ఆయన ముద్ర చెక్కుచెదరలేదు. సామాజిక న్యాయంతో కూడిన స్వాతంత్య్రం, సమానత్వాలకు ఆయన చెప్పిన అర్థం ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో మనసా వాచా కర్మణా సాకారమవుతోంది. pic.twitter.com/OApa1WIQUB
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 6, 2021
ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కె కనకారావు పాల్గొని నివాళులర్పించారు.
చదవండి:
సాధికారత సాధించని ఒడంబడిక
అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీకి
Comments
Please login to add a commentAdd a comment