సాక్షి, తాడేపల్లి : టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల అండర్-19 జట్టుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
కాగా, మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్-2025 విజేతగా భారత్ నిలిచింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత అమ్మాయిలు.. వరుసగా రెండో సారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడారు.
ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వాన్ వూరస్ట్ (23) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జెమా బోథా(16), ఫే కోవిలింగ్(15) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment