under -19 world cup
-
అండర్-19 మహిళల జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి : టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల అండర్-19 జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. Congratulations to Team India U-19 Women on winning the World Cup for the 2nd time in a row!It fills me with immense pride to witness the participation of two exceptionally talented Telugu girls, Gongadi Trisha Reddy and Md. Shabnam, in this World Cup.— YS Jagan Mohan Reddy (@ysjagan) February 2, 2025 కాగా, మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్-2025 విజేతగా భారత్ నిలిచింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత అమ్మాయిలు.. వరుసగా రెండో సారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడారు.ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వాన్ వూరస్ట్ (23) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జెమా బోథా(16), ఫే కోవిలింగ్(15) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
సంచలనం సృష్టించిన రాజ్ బావా.. ధావన్ రికార్డు బ్రేక్
Raj Bawa breaks Shikhar Dhawan's record: అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కోనసాగుతోంది. ఉగాండాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యువ భారత్ 326 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీస్కోరు చేసింది. కాగా 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగండా కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంలో మిడిలార్డర్ బ్యాటర్ రాజ్ బావా (162 నాటౌట్), ఓపెనర్ అంగ్కృష్ రఘువంశీ (144) కీలక పాత్ర పోషించారు. కాగా అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ చేసిన తొలి భారత ఆటగాడిగా రాజ్ బావా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు శిఖర్ ధావన్ (155) పేరిట ఉన్న రికార్డును రాజ్ బావా అధిగమించాడు. అదే విధంగా ఈ ప్రపంచకప్‌లో బ్యాట్‌తోను బాల్‌తోను రాజ్ బావా అద్భుతంగా రాణిస్తున్నాడు. అంతేకాకుండా ఈ ఆల్‌రౌండర్ అండర్-19 ఆసియా కప్‌ను భారత్ గెలవడంలోను కీలకపాత్ర పోషించాడు. చదవండి: SA vs IND: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. విరాట్ కోహ్లి దూరం! -
అయినా... గెలుస్తామనుకున్నాం!
ప్రపంచకప్‌లో భారత యువ జట్టు తొలి మ్యాచ్ నుంచి చక్కటి ప్రదర్శన కనబర్చినా... చివరి మెట్టుపై అనూహ్యంగా తలవంచింది. బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. అయితే ఈ మెగా టోర్నీలో పాల్గొనడం ద్వారా ప్రతీ యువ క్రికెటర్ తన కలను నెరవేర్చుకున్నాడు. వారిలో హైదరాబాద్‌కు చెందిన నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ కూడా ఒకడు. గత రెండేళ్లుగా భారత అండర్–19 టీమ్‌లో కీలక ఆటగాడిగా ఎదిగిన అతను తాజా వరల్డ్ కప్ జట్టు సభ్యుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తుది పోరు అనంతరం బుధవారం స్వస్థలం చేరుకున్న అతను తన అనుభవాన్ని ‘సాక్షి’తో పంచుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: ప్రపంచ కప్‌ను గెలిచేందుకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్న తమ జట్టు త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకోవడం నిరాశ కలిగించిందని భారత అండర్–19 జట్టు బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ అన్నాడు. ఈ టోర్నీలో టీమిండియా యువ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌లలోనూ తిలక్ వర్మ భాగంగా ఉన్నాడు. బంగ్లాదేశ్‌పై చివరి వరకూ గెలవగలమని నమ్మామని... అయితే చివరకు అది సాధ్యం కాలేదంటూ తిలక్ చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే... ఫైనల్లో పరాజయంపై... మ్యాచ్‌కు ముందు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఎప్పుడు కూడా బంగ్లా చేతిలో ఓడిపోతామనే ఆలోచనే రాలేదు. అయితే అనూహ్య ఫలితం వచ్చింది. నిరాశపడటం సహజమే. అయితే మా కోచ్ అభయ్ శర్మ తన మాటలతో మాలో మళ్లీ స్ఫూర్తి నింపారు. ఓడిపోవడంలో తప్పు లేదని, అద్దంలో మనల్ని మనం చూసుకొని ఎలాంటి ప్రదర్శన ఇచ్చామో నిజాయితీగా తెలుసుకుంటే చాలని చెప్పారు. ఆ రకంగా చూస్తే మా ఆట ఎంతో సంతృప్తినిచ్చింది. ద్రవిడ్ సర్ కూడా ప్రతీ మ్యాచ్‌కు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాతో సంభాషించేవారు. ఫైనల్ సాగిన తీరుపై... మ్యాచ్ ముందు రోజు కురిసిన వర్షం కారణంగా పిచ్‌పై తేమ ఉండిపోయింది. మేం ముందుగా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో. అయితే పిచ్‌తో మేం ఇబ్బంది పడలేదు. నేను, యశస్వి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాం. నేను అవుటైన తర్వాత జట్టు బ్యాటింగ్ తడబడింది. అయినా సరే 220–230 పరుగులు చేయగలమని భావించాం. కానీ అంతకంటే చాలా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాం. మా బౌలింగ్‌పై నమ్మకముంది కాబట్టి కాపాడుకోగలమనిపించింది. 150 పరుగులు చేసినా గెలవగలమని భావించాం. ఆసియా కప్‌లో 105 పరుగులు చేసి కూడా ఇదే బంగ్లాపై గెలిచాం కాబట్టి నమ్మకముంది. నిజంగానే మా బౌలర్లు బాగా కట్టడి చేశారు. అయితే ఒక్క కెప్టెన్ ఇన్నింగ్ ఫలితాన్ని మార్చింది. టాస్ కీలకంగా మారిందా... అలా ఏమీ లేదు. రాహుల్ ద్రవిడ్ సర్ శిక్షణలో మేం అన్ని రకాల కాలమాన పరిస్థితుల్లో ఆడేందుకు సన్నద్ధమయ్యాం. పిచ్ ఏదైనా, వాతావరణం ఎలా ఉన్నా, ప్రత్యర్థి ఎలా ఉన్నా సమస్య లేదు. గత రెండేళ్లుగా ఇంతకంటే కఠినమైన, విభిన్నమైన పరిస్థితుల్లో మ్యాచ్‌లు గెలిచాం. కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేయడం సమస్య కాదు. ఆ రోజు మాకు కలిసి రాలేదు. ఫైనల్ తర్వాత జరిగిన ఘటనలపై... నిజానికి ఇందులో భారత ఆటగాళ్ల తప్పేమీ లేదు. బంగ్లా కుర్రాళ్లే తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో నిలవలేకపోయారు. వారే దూషణలకు దిగారు. దాంతో మా ఆటగాళ్లు ఒకరిద్దరు వారిని నిరోధించేందుకు ప్రయత్నించాల్సి వచ్చింది. దాదాపు పది నిమిషాల పాటు కాస్త ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. అయితే ఆ తర్వాత అంతా మామూలుగా మారిపోయింది. సారీలు చెప్పుకొని షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఆటగాళ్లకంటే బంగ్లా అభిమానుల వల్లే సమస్య వచ్చింది. ఫైనల్‌కు వారు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారితో పోలిస్తే భారత అభిమానులు కొద్ది మందే. దాంతో రెచ్చగొట్టి సమస్యగా మార్చారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై... ఆ జట్టుతో పోలిస్తే మా జట్టు బాగా బలంగా ఉందని తెలుసు కాబట్టి దానిని మరో మ్యాచ్‌గానే చూశాం తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇక ఆటగాళ్లతో దూరం పాటించడం, గంభీరంగా ఉండటం కూడా బయట రాసినంత ఎక్కువగా ఏమీ లేదు. అదేమీ తెచ్చి పెట్టుకున్నది కూడా లేదు. అసలు ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది. వరల్డ్ కప్‌లో వ్యక్తిగత ప్రదర్శనపై... ఆరు మ్యాచ్‌లలో మూడు ఇన్నింగ్స్‌లలోనే బ్యాటింగ్ అవకాశం వచ్చింది. మిగతా మూడు మ్యాచ్‌లు ఓపెనర్లే కొట్టేశారు. బ్యాటింగ్ ఎక్కువగా రాకపోవడం కొంత నిరాశ కలిగించినా... జట్టు విజయమే అన్నింటికంటే ముఖ్యం కాబట్టి దాని గురించి ఆలోచన అనవసరం. ఆస్ట్రేలియాతో విఫలమైనా శ్రీలంక, ఫైనల్లో బంగ్లాపై బాగా ఆడాను. ఫైనల్ ఇన్నింగ్స్ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఆడాను. సెంచరీ చేస్తానని అనిపించింది. కానీ అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగాను. వరల్డ్ కప్‌కు ముందు నాలుగు జట్ల టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలవడంతో పాటు 9 ఇన్నింగ్స్‌లలో 6 అర్ధ సెంచరీలు చేయడం ద్వారా మంచి ఫామ్‌తో నేను టోర్నీకి వచ్చాను. దక్షిణాఫ్రికా బయల్దేరే ముందు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ సర్, నా వ్యక్తిగత కోచ్ సాలమ్ బయాష్ ఇచ్చిన అమూల్య సూచనలు ఎంతో పనికొచ్చాయి. టోర్నీలో మరచిపోలేని క్షణం... ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆరు వికెట్లు కోల్పోయిన సమయంలో ఇక ఓడిపోతామేమో అనిపించింది. తీవ్ర ఉత్కంఠను అనుభవించిన క్షణం అది. అయితే చివరకు గెలుపు అందుకోవడం అందరికీ ఎంతో సంతృప్తినిచ్చింది. మైదానం బయట మేం క్రూగర్స్ పార్క్ సహా చాలా చోట్ల విహరించాం. అన్నింటికంటే బంగారం తయారీని చూడటం ఒక చక్కటి జ్ఞాపకం. రాబోయే టోర్నీలపై... మున్ముందు ఇప్పట్లో అండర్–19 ఈవెంట్లు ఏవీ లేవు కాబట్టి ఇక దృష్టి అంతా సీనియర్ క్రికెటర్‌గా ఎదగడంపైనే పెడతాను. ప్రాక్టీస్‌తో పాటు ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తా. రంజీ సీజన్ కూడా ఇప్పుడు ముగిసిపోయింది. ఐపీఎల్‌కు ఎంపిక కాకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఒకటి రెండు జట్ల ట్రయల్స్‌కు వెళ్లాను కూడా. కానీ అవకాశం దక్కలేదు. అయితే ఇకపై మరింత కష్టపడి సీనియర్ స్థాయిలోనూ రాణించడమే నా లక్ష్యం. బుధవారం దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ చేరుకున్నాక కోచ్ సాలమ్ బయాష్‌తో తిలక్ వర్మ -
సెమీస్‌లో ఆసీస్
దుబాయ్: అండర్ -19 ప్రపంచకప్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 26.3 ఓవర్లలో 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలోనే ఎవరైనా.. ఆ జట్టు వంద పరుగులు చేస్తే చాలా గొప్ప అనే అనుకుంటారు. కానీ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ (160 బంతుల్లో 143; 14 ఫోర్లు; 6 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరుస ఆటగాళ్లను అండగా చేసుకుని సెంచరీ చేయడమే కాకుండా జట్టు స్కోరును ఏకంగా 49.5 ఓవర్లలో 208 పరుగులకు చేర్చాడు. మిగతా వారిలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగా మొత్తం జట్టు పరుగుల్లో 69 శాతం తనే సాధించడం విశేషం. అయితే ఆ తర్వాత ఆసీస్ 46.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో నెగ్గి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఓపెనర్లు షార్ట్ (62 బంతుల్లో 52; 4 ఫోర్లు), జెరోన్ మోర్గాన్ (66 బంతుల్లో 55; 8 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ వెస్టిండీస్ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో పూరన్ క్రీజులోకి వచ్చాడు. సహచరుల నుంచి ఎలాంటి తోడ్పాటు అందలేదు. ఫలితంగా మరో 38 పరుగులకు మరో నాలుగు వికెట్లు పడ్డాయి. కావాల్సినని ఓవర్లున్నా చేతిలో ఉన్నవి రెండే వికెట్లు. ఈ క్లిష్ట పరిస్థితిలో జోన్స్ (36 బంతుల్లో 20; 2 ఫోర్లు) పూరన్‌కు చక్కగా సహకరించాడు. పూరన్ చాలా తెలివిగా ఆడుతూ ప్రతీ ఓవర్లో స్ట్రయికింగ్ తనకే వచ్చేటట్లు చూసుకుంటూ పరుగులు సాధించుకుంటూ వెళ్లాడు. 49వ ఓవర్లో మూడు సిక్స్‌లు బాదాడు. చివరి ఓవర్లో జోన్స్ రనౌట్ కాగా మరో బంతి మిగిలుండగా పూరన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే తొమ్మిదో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఇది అండర్-19 ప్రపంచకప్‌లోనే రికార్డు భాగస్వామ్యం. దక్షిణాఫ్రికా కూడా సెమీస్‌కు మరో క్వార్టర్ ఫైనల్లో అఫ్ఘానిస్థాన్‌పై దక్షిణాఫ్రికా జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 49.5 ఓవర్లలో 197 పరుగులు చేసింది. ఆ తర్వాత సఫారీలు 39.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 198 పరుగులు చేసి నెగ్గారు. మర్క్రమ్ (105) సెంచరీ చేశాడు. -
అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్లో భారత్ ఓటమి
-
భారత్ ఆశలు గల్లంతు
అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి దుబాయ్: అండర్-19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు చుక్కెదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో కంగుతింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. దీపక్ హుడా (68), సర్ఫరాజ్ ఖాన్ (46 బంతుల్లో 52 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని (222/7) చేరుకుని సెమీఫైనల్లోకి ప్రవేశించింది. డకెట్ (61), క్లార్క్ (42) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ముంచిన బ్యాట్స్‌మెన్ లీగ్ దశలో రాణించిన భారత బ్యాట్స్‌మెన్.. క్వార్టర్ ఫైనల్లో మాత్రం చేతులెత్తేశారు. ముఖ్యంగా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. ఇంగ్లండ్ బౌలర్ విన్స్లేడ్ ఓపెనర్ అంకుశ్ బైన్స్(3)ను అవుట్ చేసి తొలి దెబ్బ తీయగా.. ఫిషర్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. హర్వాద్కర్(2), శామ్సన్(0), రికీ భుయ్(7)లను పెవిలియన్ పంపాడు. దీంతో భారత్ 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ విజయ్ జోల్ (48), దీపక్ హుడా, సర్ఫరాజ్ ఖాన్ రాణించినా.. మిగిలిన వాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఇంగ్లండ్ కూడా కష్టపడి లక్ష్యాన్ని ఛేదించింది. కుల్దీప్ యాదవ్ (3/46) రాణించడంతో ఒక దశలో భారత్ విజయం దిశగా సాగింది. చివరి రెండు ఓవర్లలో ఇంగ్లండ్ విజయం కోసం 15 పరుగులు అవసరం కాగా... దీపక్ హుడా వేసిన 49వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు వెళ్లిపోయింది. మరో క్వార్టర్ ఫైనల్లో పాకిస్థాన్ 121 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచి సెమీస్‌కు చేరింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో అఫ్ఘానిస్థాన్తోదక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడనున్నాయి. -
భారత్ బోణీ
పాక్‌పై విజయం అండర్-19 ప్రపంచకప్ దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత కుర్రాళ్లు అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్లో శుభారంభం చేశారు. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. సర్ఫరాజ్ ఖాన్ (78 బంతుల్లో 74; 5 ఫోర్లు; 1 సిక్స్), సంజూ సామ్సన్ (101 బంతుల్లో 68; 2 ఫోర్లు; 1 సిక్స్) మెరుపులకు తోడు స్పిన్నర్ దీపక్ హుడా (5/41) కట్టుదిట్టమైన బౌలింగ్ తోడవడంతో పాక్ 40 పరుగుల తేడాతో ఓడింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 262 పరుగులు చేసింది. 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందిలో పడిన జట్టును సామ్సన్, సర్ఫరాజ్ అద్భుత రీతిలో ఆదుకున్నారు. అవతలి ఎండ్ నుంచి సహకారం అందడంతో రెచ్చిపోయిన సర్ఫరాజ్ బౌండరీలతో చెలరేగాడు. స్పిన్నర్లపై ఆధిపత్యం చూపిస్తూ పరుగులు పిండుకున్నాడు. తొలి పరుగు తీసేందుకు 15 బంతులు ఎదుర్కొన్న తను ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. మంచి సమన్వయంతో ఆడిన ఈ జోడి ఐదో వికెట్‌కు 119 పరుగులను జోడించింది. రెండు ఓవర్ల వ్యవధిలో వీరిద్దరు అవుటయ్యారు. చివర్లో హుడా (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) మెరుపు ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. హుడా మేజిక్ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పాకిస్థాన్ 48.4 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు సమీ అస్లాం (85 బంతుల్లో 64; 6 ఫోర్లు), ఇమామ్ (62 బంతుల్లో 39; 2 ఫోర్లు) భారత బౌలర్లను సులువుగానే ఎదుర్కొన్నారు. వీరి ఆటతో తొలి వికెట్‌కు 109 పరుగులు లభించాయి. అయితే ఇప్పటిదాకా పటిష్టంగానే కనిపించిన పాక్ ఆటగాళ్లను స్పిన్నర్ హుడా వణికించాడు. పోరాడుతున్న సౌద్ షకీల్ (40 బంతుల్లో 32; 3 ఫోర్లు)తో పాటు మిడిలార్డర్‌ను పూర్తిగా హుడా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేని పాక్ తమ చివరి తొమ్మిది వికెట్లను కేవలం 113 పరుగులకే కోల్పోయి ఓడిపోయింది. హైదరాబాదీ సీవీ మిలింద్కు ఓ వికెట్ దక్కింది.