Raj Bawa breaks Shikhar Dhawan's record: అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కోనసాగుతోంది. ఉగాండాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యువ భారత్ 326 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీస్కోరు చేసింది. కాగా 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగండా కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంలో మిడిలార్డర్ బ్యాటర్ రాజ్ బావా (162 నాటౌట్), ఓపెనర్ అంగ్‌కృష్ రఘువంశీ (144) కీలక పాత్ర పోషించారు.
కాగా అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ చేసిన తొలి భారత ఆటగాడిగా రాజ్ బావా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు శిఖర్ ధావన్ (155) పేరిట ఉన్న రికార్డును రాజ్ బావా అధిగమించాడు. అదే విధంగా ఈ ప్రపంచకప్‌లో బ్యాట్‌తోను బాల్‌తోను రాజ్ బావా అద్భుతంగా రాణిస్తున్నాడు. అంతేకాకుండా ఈ ఆల్‌రౌండర్ అండర్-19 ఆసియా కప్‌ను భారత్ గెలవడంలోను కీలకపాత్ర పోషించాడు.
చదవండి: SA vs IND: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. విరాట్ కోహ్లి దూరం!
Comments
Please login to add a commentAdd a comment